Satyavati Rathod
-
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్‌కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్‌మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
'రాహుల్, ప్రియాంకల వ్యాఖ్యలు హాస్యాస్పదం!' : మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షిప్రతినిది, వరంగల్: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవితలతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్, ప్రియాంకలు.. ఆ వర్గాలకు మేలు చేసే గొప్ప హామీలు ఇస్తారని ఆశించామని, ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా వారి మాటలు ఉన్నాయన్నారు. సమ్మక్క, సారక్కల దర్శనం కోసం మేడారం సందర్శించకుండా, కుంభమేళా తరహాలో మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తామంటున్నారని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందా? అని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ అనేకసార్లు సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరను జాతీయ హోదాగా గుర్తించాలని కోరినా ఏనాడూ పట్టించుకోలేదన్నారు. 60 ఏళ్లలో ములుగుకు రావడానికి భయపడిన ఈ నాయకులు ఇప్పుడు ఏ భయం లేకుండా వచ్చారని, అందుకు తెలంగాణలో నంబర్ వన్‌గా ఉన్న శాంతి భద్రతలే కారణమన్నారు. ఇవి చదవండి: ఎన్నికల వేళ: ఊరికెళుతూ బంగారం, డబ్బు తీసుకెడితే పరిస్థితి ఏంటి? -
నా తండాకు రోడ్డువేసి రుణం తీర్చుకున్నా..
సాక్షి, మహబూబాబాద్: ‘మా పెద్దతండాకు అప్పట్లో సక్రమంగా రోడ్డు లేదు. బడి కూడా లేదు. ఈ దుస్థితిని చూసి నా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసేవారు. మన తండా బాగుపడదా.. అని ఎప్పుడూ బాధపడేవారు. ఇప్పుడు నేను మంత్రిగా తండాకు కావాల్సిన వసతులు కల్పించా. చక్కటి రోడ్డు వేయించా. నా తల్లిదండ్రులు ఉండి ఉంటే ఈ అభివృద్ధిని చూసి సంతోషపడేవారు’అంటూ వారిని తలచుకుంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కంటతడి పెట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా క్రాస్‌రోడ్డు నుంచి చెక్‌డ్యామ్ వరకు రూ.1.35 కోట్లలో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ గతంలో తన తండా పరిస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. -
మంత్రి సత్యవతి ఇంటి ముట్టడికి అంగన్వాడీల యత్నం
సాక్షి, మహబూబాబాద్: పనికి తగిన వేతనం ఇవ్వాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గురువారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అప్రమత్తమై మహబూబాబాద్ – నర్సంపేట రోడ్డులో వారిని ఆపేందుకు ప్రయత్నించారు. తర్వాత మంత్రి ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని నెట్టుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మంత్రి ఇంటికి తాళం వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో వందలాది మంది అంగన్వాడీలు మంత్రి ఇంటి ఎదుట బైఠాయించారు. మంత్రి వచ్చి తమ డిమాండ్లపై హామీ ఇవ్వాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం నేతలు సరోజన, హిమబిందు, ఎల్లారీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు. జీతాల పెంపు ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇది కూడా చదవండి: అంగన్వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె -
మంత్రి సత్యవతి Vs రెడ్యానాయక్.. డోర్నకల్ బీఆర్ఎస్లో తన్నులాట!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజ కవర్గంలో రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వర్గీయులు దుర్భాలాడుకుంటూ తన్నులాడుకున్నారు. పరస్పరం బాహాబాహీకి దిగారు. రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు రెడ్యానాయక్ బుధవారం ఉదయం కురవి మండలం బంగ్యా తండాకు చేరుకున్నారు. మా ఊరికి ఏం అభివృద్ధి చేశావంటూ తండాకు చెందిన మంత్రి సత్యవతి వర్గీయుడైన మాజీ సర్పంచ్ హచ్చా నాయక్ అనుచరులు ఎమ్మెల్యే ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనం ముందు భాగంలో టైర్ల కింద పడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే తండాలో ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లారు. సభ వద్ద హచ్చానాయక్ తమ్ముడు కిషన్‌నాయక్ రభస చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు సింగ్యానాయక్, ఇతర వర్గీయులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రతిగా మంత్రి సత్యవతి వర్గీయులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అంగీలు చిరిగిపోయినా ఎవ్వరూ తగ్గలేదు. చివరికి పోలీసులు వారించినా వినలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండానుంచి బయటకు వెళ్తుండగా కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. చదవండి: జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు.. -
కేసీఆర్ కోసం ప్రత్యేక దీక్ష.. అభిమానం చాటుకున్న సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రజలకు ఎంతో అభిమానం. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఇక, ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటూ మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష చేపట్టారు. వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్ మూడోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేరేంత వరకు చెప్పులు వేసుకోనని మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష చేపట్టారు. కాగా, ఇటీవల ములుగు జెడ్పీ ఛైర్మన్ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆమె మూడు కిలోమీటర్లు మండుటెండలోనే చెప్పులు లేకుండా నడిచారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం కూడా కేసముద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలోనూ అలాగే పాల్గొన్నారు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్‌కు నిన్న అరికాళ్లకు బొబ్బలు ఏర్పడ్డాయి. అనంతరం, ఆమెకు కాళ్లకు అయింట్మెంట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ పేరును కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నారు. కాగా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చెప్పులు వేసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్ లక్ష్యమేంటి?: సీఎం కేసీఆర్ ఫైర్ -
సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సామాన్య మహిళనైన నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గిరిజన, మహిళలకు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయమని ఆదేశించారని తెలిపారు. మానుకోట ప్రజానీకం అభివృద్ధికి కేసీఆర్ సహకారంతో వైద్య విద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో మీకంటూ ఒక వర్గం ఉన్నది.. పార్టీ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీ వారు ఎవరూ హాజరు కావట్లేదని’ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తూ..ఇది సందర్భం కాదంటూనే..మాకంటూ వర్గమేమీ లేదని, మేమంతా ముఖ్యమంత్రి గొడుగు కింద పనిచేస్తాం..ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. చదవండి: తెలంగాణలో బీజేపీని తుడిచివేస్తామన్న రాహుల్.. దాని వెనక మర్మమేంటో? -
కేంద్రం గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలను కేంద్రం నిలువరిస్తోందని ఆమె మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 % రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన జాతీయ బంజారా మీట్–2023 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం గిరిజనులదేనని అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా గిరిజన, ఆదివాసీభవన్‌లను ఏర్పాటు చేసిందన్నా రు. ఢిల్లీలో సంత్ సేవాలాల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలన్నారు. 15 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలు.. ♦ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చాలి. ♦ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లను వర్తింపచేయాలి. ♦ పార్లమెంటు ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా పేరిట బంజారా భవన్‌ను నిర్మించాలి. ♦ పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలి. ♦ తెలంగాణలో గిరిజన వర్సిటీని ప్రారంభించాలి. ♦ ప్రైవేటు రంగంలోనూ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలి. -
బీఆర్ఎస్లో ఇంటి దొంగలు.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
కురవి: ‘బీఆర్ఎస్లో ఇంటి దొంగలున్నారు.. బీఆర్ఎస్ పేరు చెప్పి లక్షలు లక్షలు సంపాదించుకుంటూ నాయకులనిపించుకుంటున్నారు.. రేపు ఎట్లయినా రెడ్యానాయక్‌ను ఓడించాలని ప్రయత్నం చేస్తరు..’అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఘాటుగా విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అధ్యక్షతన జరిగింది. సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్ వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ తనను ఓడించాలని ఎంతోమంది మహామహులు తిరిగి ప్రచారం చేశారని చెప్పారు. మరి కొందరైతే ఆ గర్భశత్రువులేనని.. తనను చూస్తే వాళ్లకు నిద్రపట్టదని.. ఎప్పుడు చస్తాడా? పోతాడా.. అనుకుంటున్నారని పేర్కొన్నారు. -
TS: జీసీసీలో కారుణ్య నియామకాలపై గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే వరుసగా మూడేళ్లు లాభాలతో కొనసాగినప్పుడే కారుణ్య నియామకాలు చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడేళ్ల నుంచి లాభాలు గడించినప్పటికీ కోవిడ్–19 కారణంగా ఆ తర్వాత నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీ కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. దీంతో కారుణ్య నియామకాల ఆర్జీలకు అతి త్వరలో మోక్షం కలగనుంది. 330 మంది ఉద్యోగులతో.. తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్(టీఎస్జీసీసీ) పరిధిలో 330 మంది ఉద్యోగులు శాశ్వత, తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్నారు. మూడు డివిజినల్ కార్యాలయాలు, 18 సొసైటీలు, 311 రెగ్యులర్ డిపోలు, 158 సబ్ డిపోలున్నాయి. మరో 125 స్వయం సహాయక సంఘాలతోనూ జీసీసీ అనుసంధానమై కార్యకలాపాలు సాగిస్తోంది. జీసీసీ ద్వారా తేనె, ఇప్పపువ్వు, గమ్, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులతోపాటు సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, కందిపప్పు, ఇతర ఆహార మసాలాలు, సుగంధ ద్రవ్య పొడి(పౌడర్)లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు వంట సరుకులన్నీ దాదాపు జీసీసీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీసీసీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ తయారీ యూనిట్లు విశాఖ కేంద్రంగా నడిచేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రతి యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో జీసీసీకి ఏటా కేటాయింపులు జరిపినప్పటికీ రాబడి అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు లాభాల బాటలో కార్పొరేషన్ ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. టీఎస్జీసీసీ పరిధిలో ఎనిమిదేళ్లలో 30 ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఇందుకు సంబంధించి క్లెయిమ్స్ పూర్తి చేసినప్పటికీ కారుణ్య నియామకాలకు అర్హులైన వారసులు 30 మంది దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీరి దరఖాస్తులు పరిశీలించి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. -
భగ్గుమన్న బీఆర్ఎస్.. ‘బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళల కోసం ఎందుకు ధర్నా చేయడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారని.. తెలంగాణలో మహిళలకు ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లకు అవకాశం కల్పించారని తెలిపారు. ‘మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన ప్రభుత్వం మాది. మీరు దేశంలో మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. దేశంలో మోడి ఆడింది ఆట, పాడిందే పాట లాగా అయిపోయింది. దేశంలో కేసీఆర్‌కు వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర పన్నింది. బీజేపీలో మహిళలకు సరైన ఆదరణ, ప్రాధాన్యత లేదు.’ అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బండిపై సత్యవతి రాథోడ్ ఫైర్ ఈడీలు, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 2018లో తెలంగాణ బీజేపీ 100 పైగా నియోజక వర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళలంటే ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు భవిష్యత్తులో జైళుకు వెళ్లే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని అన్నారు. బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గవర్నర్ ఉద్ధేశం ఏంటో చెప్పాలని అన్నారు. మోదీని వ్యతిరేకిస్తేనే నోటీసులు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత ఏ తప్పు చేయలేదని తేలుతందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి జై కొడితే ఏ నోటీసులు ఉండవని.. వ్యతిరేకిస్తే నోటీసులు ఉంటాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం గవర్నర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ వ్యాఖ్యలు కుసంస్కారమని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బండి వ్యాఖ్యల వీడియోను గవర్నర్‌కు ట్యాగ్ చేశారు. హైదరాబాద్‌లో నిరసనలు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బండి సంజయ్ చేసిన వాఖ్యలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ ఆఫీస్‌ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం గేట్లు మూసివేశారు పోలీసులు. అదే విధంగా పంజాగుట్టలో బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి నిరసన చేపట్టారు. -
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: తలసాని
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన జాతిని సన్మార్గంలో నడిపించి భారత్‌లోని దాదాపు 11 కోట్ల బంజారాలకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో బుధవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే నిదర్శనమన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంజారా, లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. అందులో పురుషుల సంఖ్య 1,76,11,633 కాగా మహిళలు 1,73,92,041మంది ఉన్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం చూస్తే...మొత్తం ఎస్సీల జనాభా 54,08,800 కాగా వారిలో మహిళలు 27,15,673, పురుషులు 26,93,127 మంది ఉన్నారు. ఇక ఎస్టీల జనాభా విషయానికొస్తే... మొత్తం 31,77,940 ఉండగా, అందులో పురుషులు 16,07,656, మహిళలు 15,70,284 మంది ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఎస్టీల జనాభా సంఖ్య 3,92,034, మహబూబ్‌బాద్ జిల్లాలో 2,92,778, ఆదిలాబాద్ జిల్లాలో 2,24,622, నల్లగొండ జిల్లాలో 2,09,252, ఖమ్మం జిల్లాలో 1,99,342. ► ఎస్సీల విషయానికొస్తే...రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అంటే 3,34,337, ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 2,92,951, ఖమ్మం జిల్లాలో 2,79,319, సంగారెడ్డి జిల్లాలో 2,77,429. హైదరాబాద్ జిల్లాలో 2,47,927 మంది ఉన్నారు. ►బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయా అంశాలు పొందుపరిచారు. గతంలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలను షెడ్యూల్ ప్రాంతాల జిల్లాలుగా పరిగణించగా, ప్రస్తుతం అవే షెడ్యూల్ ప్రాంతం కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, నాగర్‌కర్నూల్ అనే 9 జిల్లాల్లో ఉన్నట్టు తెలియజేశారు. ►ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకతో సహా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీలు=1,286 ►వందశాతం ఎస్సీ గ్రామపంచాయతీలు (తండాలు/గూడెంలు) =1,177 ప్లెయిన్, ఎస్టీ రిజర్వ్ గ్రామపంచాయతీలు =687 ►2018–19 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్ ప్రాంత జీపీలు, వంద శాతంఎస్టీ జీపీలు, షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీ జీపీలకు విడుదల చేసిన గ్రాంట్లు సంక్షిప్తంగా కలిపి మొత్తం...రూ.2,062.75 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు తెలియజేశారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి: ఈటల -
త్వరలోనే పోడు పట్టాల పంపిణీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేస్లాపూర్ నుంచే అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎక్కువ మందికి న్యాయం చేసేలా చూస్తామని, రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆమె విచ్చేశారు. నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని నాగోబా జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ దుయ్యబట్టారు. మెస్రం పెద్దలు సూచించినట్లుగా అభివృద్ధి పనులు: ఇంద్రకరణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఏమైనా నిధులు ఇచ్చిందా? అంటూ విమర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోని ఆలయాలకు మంజూరు చేశారా అంటూ ధ్వజమెత్తారు. గిరిజన దర్బార్‌లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖాశ్యామ్ నాయక్, రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు
వెంకటాపురం(ఎం): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాటం.. స్థానిక ప్రజల పోరాటంతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి ఆమె సందర్శించారు. రామప్ప ఆలయ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. తర్వాత వారు ఆలయంలో రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయం ఉన్నందున గుడికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని, ఆలయ పరిసరాల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’.. ములుగు జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైందని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా, రూ.1,800 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీని నిర్మించినట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక కోత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం రూ.130 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
బడిలో ‘కంటి వెలుగు’.. పక్కింట్లో పాఠాలు..
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు. -
ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈనెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యవతి మాట్లాడారు. మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ ఏర్పా టు చేయాలని అనుకున్నామని అన్నారు. సభ లో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసేందుకు సమాయ త్తమయ్యామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పట్టాల పంపిణీలో జాప్య మవుతోందన్నారు. ఫిబ్రవరిలో మహబూబా బాద్‌లో భారీ బహిరంగ సభ పెట్టి పట్టాలు పంపిణీ చేసేందుకు వస్తానని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. అప్పటివరకు గిరిజను లు వేచి ఉండాలని, అర్హులైన వారందరికి పట్టాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు -
అన్నంలో పురుగులు, వానపాములు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్‌మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్‌మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్‌మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ప్రిన్సిపాల్, వాచ్‌మన్‌పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్‌మన్‌గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్‌తో పాటు వాచ్‌మన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
Telangana: మానుకోటలో మహిళా నేతల కోల్డ్‌వార్
వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ, గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. కాని ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ నడుస్తోందట. ఈ ఇద్దరి మధ్యా తలెత్తిన ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. చానా క్లోజ్.. అయినా డిఫరెన్సెస్ మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. అందరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోందట. బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గతంగా ఇద్దరి మధ్యా యుద్ధమే జరుగుతోందని టాక్. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ కవిత భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇద్దరు మహిళా నేతలు ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట. నాయక్ వర్సెస్ రాథోడ్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పలుమార్లు రెడ్యానాయక్ పై ఓటమి పాలయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ లో చేరగా ప్రత్యర్థిగా ఉన్న రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్ లో చేరడంతో సత్యవతి రాథోడ్ కు స్థానం లేకుండా పోయింది. 2018లో ఎమ్మెల్యే టిక్కెట్ రెడ్యానాయక్‌కే ఇచ్చి, సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు గులాబీ దళపతి. చిరకాల ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ ఇద్దరికీ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. నిరంతర ఇరు కుటుంబాలు రాజకీయంగా పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న విభేదాలు కవితకు తలనొప్పిగా మారాయి. మానుకోట గులాబీకి రెండు ముళ్లు ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలే అని చెబుతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీ చేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపి కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్ తో కవితకు విభేదాలు ఏర్పడ్డాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్ కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. మానుకోటలో అధికారపార్టీలో నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును నిశితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గులాబీ గూటిలో ముసలం.. ఎంపీకి తలనొప్పిగా మారిన మంత్రి!
ఔను!. వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ పైగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా రాజకీయంగా రగిలిపోతున్నాట. ఇద్దరి మద్య ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. ఎవరా నేతలు... ఎందుకు వారి మధ్య కోల్డ్ వార్.. మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారపార్టీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. మంది ఎక్కువైతే పెరుగు పలుచనైనట్లు అంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నా ఆ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుందట. చదవండి: ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ.. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపిస్తారు. వారిని చూసిన వారెవ్వరైనా...వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గంతంగా యుద్ధమే సాగిస్తున్నారట. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని ఏకంగా మంతి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమకై కవిత ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూనే రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లోలోపల రగిలిపోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ తమ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో తెలుగుదేశం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకముందు తెలుగుదేశం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యానాయక్‌పై ఓటమిపాలయ్యారు. చివరకు టిఆర్ఎస్లో చేరగా చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్లో చేరాడంతో సత్యవతి రాథోడ్‌కు స్థానం లేకుండా పోయింది. 2018లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కే గులాబీ దళపతి టిక్కెట్ ఇచ్చి, సత్యవతి రాథోడ్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు. చిరకాల రాజకీయ ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలు రాజకీయంగా పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. కవిత, రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలు కవితకు తలనొప్పిగా మారాయి. అంతేకాదు కవిత కూడా మంత్రి సత్యవతి రాథోడ్ తో విభేదించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా...మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరూ పోటీపడుతున్నారు. ఎంపీ కవిత పార్టీ అధ్యక్షురాలిగా మహబూబాబాద్ పరిమితం అయినా.. ఎంపీ పరిధి మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండడంతో ఆమె కూడా తరచూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక సత్యవతి రాథోడ్...మహబూబాబాద్‌తో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఇంచార్జీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇద్దరు మహిళా నేతలు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పుడు పరస్పర విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ, బహిరంగంగా ఎక్కడా బయటపడకున్నా, అంతర్గతంగా విభేదాలు పొడచూరినట్టు సమాచారం. పర్యటనలు, కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నా...ఎవరి కేడర్‌ను వారు ప్రోత్సహిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఆధిపత్యం కోసం అనుచరగణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలని ప్రచారం జరుగుతోంది. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ చిరకాల ప్రత్యర్థులు కావడం ఒకటైతే, మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీచేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపీ కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్‌తో కవితకు విభేదాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్‌కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. శంకర్ నాయక్‌తో కవితకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. పైకి అంతా కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న రాజకీయంగా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. కానీ ఎక్కడా విభేదాలు ఉన్నట్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ చాప కింద నీరులా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీ క్యాడర్ తమ వైపు తిప్పుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. మానుకోటలో అధికారం పార్టీలో నాయకుల రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలు ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు చర్చించుకుంటున్నారు. మానుకోట గులాబీ గూటిలో ముసలం ఎటువైపు దారి తీస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మంత్రి Vs సిట్టింగ్ ఎమ్మెల్యే: మూడు దశాబ్దాల రాజకీయ వైరం!
వాళ్లిద్దరూ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులు. ప్రస్తుతం గులాబీ గూటి నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సమయం దొరికినప్పుడల్లా మంత్రిపై ఆ ఎమ్మెల్యే సెటైర్లు వేస్తుండడం కలకలం రేపుతోంది. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన డోర్నకల్‌లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం మూడు దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలో ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. వారిలో ఒకరు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే, మరొకరు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకరి తర్వాత మరొకరు గులాబీ గూటికి చేరి అధికారాన్ని అనుభవిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అక్షరాల నిరూపిస్తున్నారు. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరుగగా ఆరుసార్లు రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు 1989, 2009, 2014లో సత్యవతి రాథోడ్‌తో రెడ్యానాయక్ తలపడ్డారు. ఒక్కసారి మాత్రమే 2009లో సత్యవతి చేతిలో రెడ్యానాయక్ ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో టీఆర్ఎస్లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యానాయక్ జయకేతనం ఎగురవేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్యానాయక్ పోటీ చేసి గెలుపొందగా-- టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్లో బెర్త్ ఇచ్చారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించినా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికివారు తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగనుండడంతో... ఇప్పటినుంచే భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెడ్యానాయక్ పనిచేయగా-- ప్రస్తుతం టీఎస్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ అదే శాఖతో టు స్త్రీ శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యానాయక్ సందర్భోచితంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండడం కలకలం రేపుతోంది. పైగా తనను మంత్రి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో తెలియడం లేదంటూ మరిపెడలో వ్యంగ్యస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరగడంతో రెడ్యానాయక్ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అందుకు ఆమె సుముఖంగా లేనట్లు అనుచరులు చెబుతున్నారు. మూడుసార్లు డోర్నకల్ నుంచి పోటీచేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి రాథోడ్ నాలుగోసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారట. దాంతో డోర్నకల్ రాజకీయం రసకందాయంగా మారింది. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్‌కు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా.. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా రేపుతోంది. -
గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. సీఎం రాజ్‌భవన్‌కు ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం అని మంత్రి తెలిపారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయాలు మాని.. తన పని తాను చేసుకోవాలని హితవు పలికారు. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదా.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు వరంగల్: గవర్నర్ తమిళిసై బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయని అన్నారు. హుందాగా ప్రవర్తించాలని గవర్నర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, ఆ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు. కాగా గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్ భవన్ లో తమిళిసై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఎవరూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె వ్యాఖ్యనించారు. -
దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు
వెంగళరావునగర్: అవిభక్త కవలలైన వీణావాణీలకు దేవుడు కొంత అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వంతుగా తగిన న్యాయం చేస్తున్నారని మం త్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో వీణావాణీలు ఫస్ట్‌క్లాస్ మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ వారం మధురానగర్‌లోని మహిళా శిశుసం క్షేమ శాఖ కార్యాలయం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న వీరిని మంత్రులు కలిశారు. తొలుత వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు ఏం చదవాలని అనుకుంటు న్నారని వీణావాణీలను ప్రశ్నించగా.. దానికి వారు తాము సీఏ చదవాలని అనుకుంటున్నామని సమాధానం చెప్పారు. కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేని కారణంగా సీఏ చదివితే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వారి మాటలకు స్పందించిన మంత్రులు తప్పనిసరిగా మీ చదువులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వీణావాణీల తల్లికి ఇక్కడే ఉద్యోగం ఇచ్చారు. వీణావాణీలు సీఏ చదవడానికి శ్రీమేధ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నామని, వారికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్లో గురుకులాల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన ఇంటర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 950కి పైగా మార్కులు పొంది న విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను 2,755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2,544 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్‌లోని గురుకుల కాలేజీ ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెరుపులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా, రాష్ట్రవ్యాప్త ఉత్తీర్ణత 64.25% మాత్రమే కావడం గమనార్హం. 17 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్‌లో ఏకంగా 93.23 శాతం మంది (రాష్ట్ర ఉత్తీర్ణత 68.68%) ఉత్తీర్ణులయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. సెకండియర్‌లో 82.09 శాతం, ఫస్టియర్‌లో 78.75 శాతం ఫలితాలు వచ్చాయి. తేజావత్ భావనశ్రీ 984 మార్కులతో సెకండియర్ టాపర్‌గా నిలిచారు. ఇక రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 94.18 సగటుతో ఉత్తీర్ణులై తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మైనారిటీ గురుకులాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
ఇంటర్లో ఫస్ట్‌క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ-వాణి
హైదరాబాద్: విధి పరీక్షను చిరునవ్వుతో ఎదుర్కొంటూనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్న అవిభక్త కవలలు వీణావాణీలు చదువులో మరో మెట్టెక్కారు. తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో (బీ–గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. వీరు మెహిదీపట్నం ఆసిఫ్‌నగర్‌లోని ప్రియాంక మహిళా జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ సబ్జెక్టు చదివారు. వార్షిక పరీక్షలు మాత్రం ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా స్టేట్‌హోంలోని ఆశ్రమంలోనే స్పెషల్ అధికారుల మధ్య నిర్వహించింది. మారగాని వీణ 707 మార్కులు సాధించగా, మారగాని వాణి 712 మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసయ్యారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. విడదీయలేనంతగా తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వీరిశెట్టి గ్రామం. వీరు తొలుత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత హైదరాబాద్ నిలోఫర్‌లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చారు. ఆస్పత్రుల్లో ఉంటూనే ఇద్దరూ తమ చదువును కొనసాగించారు. 2017 జనవరి నుంచి హైదరాబాద్ వెంగళరావునగర్ స్టేట్ హోంలోని బాలసదన్‌లో ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల గిరిజన మహిళా, శిశుసంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అభినందించారు. చదవండి: (TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన) -
మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట, ప్లాజా హోటల్లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్‌కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి ఒక స్పేస్‌ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి ఈ సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి ప్రశంసించారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్ అన్నారు. -
వంద సీట్లున్న ప్రభుత్వం ఎలా కూలుతుంది?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరు బీజేపీ కార్యకర్త మాదిరిగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అసెంబ్లీలో 119 స్థానాలకుగాను వంద సీట్లున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కూలుతుందో గవర్నర్ స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే గవర్నర్ ఆంతర్యం, మనస్తత్వం తెలిసిపోతోందన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న ఆదివాసీ భవన్, గిరిజన భవన్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ మాటలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గవర్నర్ అనడాన్ని చూస్తే ఆమె ఫక్తు బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్టు అనిపిస్తోంది. అత్యున్నతమైన గవర్నర్ స్థానంలో ఉండి మాట్లాడినట్లు అనిపించడం లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాటను ఆలోచించుకోవాలి. గవర్నర్‌గా మాట్లాడారా? లేదా బీజేపీ కార్యకర్తగా మాట్లాడారా? అనేది ఆమె తేల్చుకోవాలి’అని అన్నారు. గవర్నర్‌కు అవమానం జరిగితే అనేక వేదికల మీద చెప్పుకునే అవకాశం ఉందని, మేడారంలో గానీ, మన్ననూరులో గానీ చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. కానీ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద విమర్శలు చేయడం చూస్తుంటే, ఆమె బీజేపీ కార్యకర్తగా మాట్లాడినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఆమెను గవర్నర్‌గా చాలా గౌరవించామని, కానీ తాను తలచుకుంటే ఈ ప్రభుత్వం కూలిపోయేదని అనడం సరికాదన్నారు. -
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
-
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. మంత్రి క్వార్టర్స్‌లో నిర్వహించిన హోమం సందర్భంగా పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. చదవండి: విద్యార్ధులకు శుభవార్త.. తెలంగాణలో భారీగా మెడికల్ సీట్లు పెంపు -
మా పథకాలే కాపీ కొడుతున్నారు
సాక్షిప్రతినిధి, వరంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, దేశానికి దిక్సూచిగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం.. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో కలసి ఆయన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగులో హెల్త్‌ప్రొఫైల్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సంపేటలో 250 పడకలు, పరకాలలో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో మాట్లాడారు. ‘తెలంగాణ వస్తే మీ బతుకులు చీకటి అవుతాయి అన్నారు నాడు. కానీ నేడు.. అలా అన్నవాళ్ల జీవితాల్లో చీకటి నిండితే, సీఎం కేసీఆర్ మన బతుకుల్లో వెలుగులు నింపారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద 5 ఏళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఇస్తాం అంటున్నది. కానీ తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ’అని హరీశ్ పేర్కొన్నారు. ‘రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ తెచ్చాం. రైతుబంధు అంటే ఒకటి.. రెండు రూపాయల పథకం కాదు. రూ.50 వేల కోట్లు రైతుల అకౌంట్లో వేశాం’అని భావోద్వేగంతో మాట్లాడారు. మండుటెండల్లో కూడా రాష్ట్రంలోని కాలువలు, చెరువుల్లో వరదలు పారుతున్నాయని అన్నారు. ఇంత చేస్తుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ పనులు ఆపాలని ఓ బీజేపీ నేత కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను చూసిన కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ‘అలాంటి పథకాలు రాష్ట్రంలో అమలు చేయండి.. లేకుంటే తెలంగాణలో రాయచూర్‌ను కలపండి’అని కోరారంటే మన పథకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారన్నారు. హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి హరీశ్‌కు సీఎం కేసీఆర్ నుంచి అత్యవసర భేటీపై ఫోన్ వచ్చింది. ఏడో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించాల్సి ఉందని ఆయనకు పిలుపు వచ్చింది. పరిస్థితిని సీఎంకు వివరించడంతో పరకాల సభ ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు రావాల్సిందిగా హరీశ్‌రావుకు సూచించిన సీఎం కేసీఆర్, వెంటనే పరకాలకు హెలికాప్టర్ పంపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా «ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధనసరి సీతక్క, నన్నపనేని నరేందర్, కలెక్టర్లు జెడ్పీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. -
18న మేడారానికి సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు. సీఎస్, డీజీపీ దిశానిర్దేశం సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
-
సీఎం కేసీఆర్.. ఓ ఇంజనీర్
సాక్షి, యాదగిరిగుట్ట (నల్గొండ): సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్‌గా, ఆర్కిటెక్టుగా యాదాద్రి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కలలో కూడా ఊహించని విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోందని.. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆలయం లక్షలాది భక్తులతో విరాజిల్లుతోందన్నారు. మరో రెండు నెలల్లో భక్తులకు స్వయంభూ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బాలాలయంలో ఆచార్యులు మంత్రి సత్యవతి రాథోడ్, కుటుంబసభ్యులకు స్వాగతం పలికారు. -
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పోడుభూముల అంశాలపై సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ శనివారం తొలిసారి భేటీ అయింది. గిరిజన, సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల కింద వచ్చిన దరఖాస్తులు, పరిష్కారమైనవెన్ని, మిగిలిపోయినవెన్ని? తదితర అంశాలపై పక్కా సమాచారాన్ని రూపొందించి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమం, అటవీశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి సమాచారంతో ఈనెల 24న మరోసారి సమావేశం నిర్వహించి లోతుగా చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు. -
సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం
హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు -
గన్ను పట్టారు.. నాట్లేశారు.. సారె తిప్పారు
మహిళాకూలీలను చూడగానే వారి మనసు వరిపొలం వైపు మళ్లింది... ఎంపీ, ఎమ్మెల్యేలమనే హోదాలను పక్కన పెట్టి సాదాసీదా మనుషులుగా మారిపోయి కూలీలతో కలిసిపోయారు.. బురదపొలంలోకి దిగి వారితోపాటే నాట్లేశారు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట బాల్యాతండాలో తీజ్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతూ ఇలా ‘సాక్షి’కెమెరాకు చిక్కారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గన్నుతో ఇలా కనిపించారు. – బయ్యారం, సాక్షి ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ సారె తిప్పారు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద కుమ్మరి సారెను కర్రతో కొద్దిసేపు తిప్పారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, ఖమ్మం -
స్థలం ఇచ్చాను.. ఉద్యోగం ఇచ్చాకే లోపలికి వెళ్లండి
బయ్యారం: ‘సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇస్తే ఉద్యోగం ఇస్తామన్నారు.. నమ్మి అప్పగిస్తే ఇంత వరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆ బెంగతో మా కుటుంబపెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు ఉద్యోగం ఇచ్చాకే మీరు లోపలికి వెళ్లాలి..’అని సబ్‌స్టేషన్‌కు స్థలం ఇచ్చిన కుటుంబం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో 20 గుంటల భూమిని 2018 సంవత్సరంలో సంతులాల్‌పోడు తండాకు చెందిన గుగులోత్ లాల్‌సింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఇచ్చాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని స్థానిక పెద్దలు, అప్పటి అధికారులు హామీ ఇచ్చారు. అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా ఉద్యోగం ఇవ్వకపోవటంతో మనస్థాపంతో స్థలం ఇచ్చిన లాల్‌సింగ్ 2020లో సబ్‌స్టేషన్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మృతుడి భార్య కౌసల్య, కుమారులు మల్సూర్, వినోద్‌కుమార్ ఉద్యోగం కోసం పలువురు అధికారులను కలసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల స్థలదాత కుటుంబసభ్యులు సబ్‌స్టేషన్ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో ఆదివారం మంత్రి సబ్‌స్టేషన్ వద్దకు రావటంతో స్థలదాత కుటుంబసభ్యులు తాళం వేసిన గేటు ఎదుట నిలబడి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంత్రి కాళ్లపైబడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడంతో.. ఆమె విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవత్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పారు. కాగా, సబ్‌స్టేషన్ లోనికి వెళ్లకుండానే మంత్రి వెనుదిరిగారు. -
మహిళలకు అన్నివిధాలా అండగా..
బన్సీలాల్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణలో మహిళలకు అన్నివిధాలా ధైర్యాన్ని, రక్షణను, భరోసాను కల్పించే దిశగా రాష్ట్ర మహిళా కమిషన్ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహిళలకు అన్ని విధాలా రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అండదండగా ఉంటుందని, మహిళా సాధికారతకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అనేక పథకాలు మహిళల సంక్షేమం కోసం ఇస్తున్నామంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారి పేరిటే ఇస్తున్నామని, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిం చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒంటరి మహిళలను, బీడీ కార్మికులను ఆసరా పథకంలో చేర్చి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. షీటీమ్స్ మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. మహిళా చట్టాలపై అవగాహన రాష్ట్రంలో ప్రభుత్వం అనేక పథకాలను మహిళ పేరిట అమలు చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ అనేక సమస్యల నుంచి మహిళలకు విముక్తి కల్పించడంతోపాటు అన్ని విధాలా న్యాయం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల కోసం రూపొందించిన చట్టాలు పకడ్బందీగా అమలు జరిగేలా కమిషన్ పనిచేస్తోందన్నారు. మహిళా చట్టాలపై మహిళలతోపాటు పురుషులకు కూడా అవగాహన కల్పిస్తామని, జిల్లాల్లో పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కమిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, సత్య వతి రాథోడ్ కమిషన్ లోగోను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యతోపాటు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. -
60 ఎకరాలు పంచింది..బుక్కెడు బువ్వకు దిక్కు లేదు..!
మరిపెడ రూరల్: తన కష్టార్జితంతో నలుగురు కుమారులకు 60 ఎకరాలు సంపాదించి పెట్టినా.. తనకు వృద్ధాప్యంలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య నాజీ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. కలెక్టర్ వీపీ గౌతమ్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేసింది. భూక్యతండాకు చెందిన నాజీ, సోమ్లా దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. భార్యాభర్తలు వంశపారంపర్యంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి కష్టపడి 60 ఎకరాలకు పెంచారు. నలుగురు కుమారులకు 13 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. కుమార్తె వివాహం ఘనంగా జరిపించారు. కొడుకులకు పంచగా మిగిలిన 6 ఎకరాల భూమి నాజీ పేర ఉన్నది. నాజీ భర్త సోమ్లానాయక్ 2009లో మృతి చెందడంతో చిన్నకుమారుడు లక్ష్మాజీ వద్ద కొన్నేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మాజీ కుమారుడు భూక్య చందులాల్ సాదాబైనామాలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన తల్లి పేరున పట్టా చేయించుకున్నాడని, అప్పటి నుంచి కొడుకు కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని నాజీ వాపోయింది. తనను బయటకు గెంటేశారని, మిగతా కొడుకులు కూడా అన్నం పెట్టడం లేదని వాపోయింది. తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని మంత్రిని, కలెక్టర్‌ను వేడుకుంది. -
ఫ్యామిలీ పోలీస్‌గా అంగన్వాడీ టీచర్లు
మహబూబాబాద్: అంగన్వాడీలు అంటే ఫ్యామిలీ పోలీస్‌గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మం త్రి సత్యవతి రాథోడ్ సూచించారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు నిత్యావసరాలు అందించడం, ఇంటింటి సర్వే నిర్వహణ, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో మహిళా, శిశు, సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి మహబూబాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖ కమిషనర్, ప్రత్యేకకార్యదర్శి దివ్య, జిల్లాల సంక్షేమ శాఖ ల అధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం అందజేయాలని మంత్రి సూచించారు. భార్య అంత్యక్రియలు.. కాసేపటికే భర్త మృతి తూప్రాన్: అనారోగ్యంతో మృతిచెందిన భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త గుండె ఆగింది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులు కేవలం 12 గంటల వ్యవధిలో మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయిపల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్‌బీ (60), సయ్యద్ హుస్సేన్ (70) దంపతులు. 10 రోజుల క్రితం చాంద్‌బీ తీవ్ర జ్వరం, డయేరియాతో ఇబ్బందులు పడుతుండడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచి్చంది. ఇంట్లోనే మందులు వాడుతూ ఉన్న చాంద్‌బీ బుధవారం రాత్రి మృతి చెందింది. ఉదయం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాసేపటికే భర్త ఇంట్లో టీ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 12 గంటల వ్యవధిలో భార్య, భర్త మృతి చెందడంతో గ్రామంలో విషాదం ఆలుముకుంది. గ్రామ సర్పంచ్ లంబ వెంకటమ్మ వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసింది. -
నా బదిలీ వెనుక మంత్రి సత్యవతి కుట్ర
సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణకు 16 నెలల సమయమే ఉన్నప్పటికీ తనను అకారణంగా బదిలీ చేశారని, ఇందుకు మంత్రి సత్యవతి రాథోడే కారణమని డాక్టర్ ఎస్.భీంసాగర్ ఆరోపించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను తాజాగా హైదరాబాద్ లోని టీవీవీపీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్ పదవి కట్టబెట్టేందుకే తనను బదిలీ చేయించారని పేర్కొన్నా రు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు సతీష్ రాథోడ్ నెలలో వారం రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను లక్ష్యంగా చేసుకుని బదిలీ చేయించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పదోన్నతి ఇవ్వకపోగా, కేవలం డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పని హైదరాబాద్‌లో చేస్తూ వేతనం మహబూబాబాద్‌లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా వెంకట్రాములు మాట్లాడుతూ, భీంసాగర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సత్యవతి, ఆమె కుమారుడు డాక్టర్ సతీ‹Ùతో పాటు తనపై వ్యతిరేక ప్రచారం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. -
చింతవర్రె బాధితుల కుటుంబాలతో మంత్రి భేటీ
సాక్షి, ఖమ్మం: చింతవర్రె గ్రామంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికల కుటుంబ సభ్యులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బాలల హక్కుల పరిరక్షణ శాఖ చైర్మన్ దివ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. చింత్రవర్రె ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రతి బాధిత కుటుంబాలకు ఆశ్వాసన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని, మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటపై చర్చించి బాధితక కుటుంబాలకు న్యాయం చేయాలని, పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కుటుంబాల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. బాధిత బాలికల గుర్తింపు బయటకు రాకుండ చూడాలని ఆయన కోరారు. బాలికలంతా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో శిశువు కేంద్రంలో ఉంటూ మానసికంగా దృఢంగా తయరు అయ్యేటట్లు చుస్తామన్నారు. దీనికి పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించారని చెప్పారు. పోక్సో చట్టం కింద బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని, మంత్రిగా.. ఎమ్మెల్యేగా కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా ఎస్పీ ఉంటారని, ఐటీడీయే, పీఓఆర్డీఓ, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి, అదనపు కలెక్టర్లతో విచారణ కమిటీ వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా చూస్తామని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు పోక్సో చట్టం కింద 1 లక్ష, ప్రభుత్వం తరపు 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డిలు కలిసి రూ. 50 వేలు, ప్రభుత్వం విప్ రేగ కాంతారావు రూ. 50 వేలు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్‌లు కలిసి 5 కుటుంబాలకు చెరో లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించారు. -
ములుగు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
సాక్షి, ములుగు: అటవీ జిల్లా ములుగులో కొద్ది రోజుల కురుస్తున్న వర్షాల వల్ల మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో ఆస్పత్రిలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవని మంత్రితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో మంత్రి సదరు మహిళకు కొడుకు వెంటనే మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడమే కాకుండా వ్యక్తగతం కూడా 10 వేల రూపాయలను అందించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పర్యటించారు. -
వరంగల్‌లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్
-
వరంగల్‌లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్
సాక్షి, వరంగల్: మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలో వరదలకు గురయిన ప్రాంతాలలో పర్యటించారు. మొదట హన్మకొండకు చేరుకున్న కేటీఆర్ నయిం నగర్ నాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలసి పరిశీలించారు. తదుపరి సమ్మయ్య నగర్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ బాధితులలో ధైర్యాన్ని నింపారు. నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసానిచ్చారు. డ్రైనేజీ నిర్మాణానికి రూ. 10కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంట్లో నీళ్లు నిలిచిపోయిన బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్రమాలకు గురైన నాలను తొలగిస్తామని, ఆ సమయంలో ప్రజలు సహకరించాలని కేటీఆర్ కోరారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. మంత్రి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బస్సు నుంచే ఇదులవాగులోని నీటి ప్రవాహాన్ని కేటీఆర్‌కు వివరించారు. అనంతరం 100 ఫీట్స్ పెద్దమ్మ గడ్డ ఆర్ ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ఉన్న భద్రకాళి వాగు బ్రిడ్జి ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలతో పాటు చెట్లను కూడ తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటివి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాలు తీసుకోవాలని సూచించారు. నగరంలో పర్యటించి మొత్తం ముళ్ళ పొదలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపాలిటీ శాఖ డైరెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్జీఎమ్ కోవిడ్ వార్డులోకి వెళ్లి కేటీఆర్ కరోనా బాధితులను పరామర్మించారు. అదనంగా 150 పడకల ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చదవండి: ఇంకా వరద బురదలోనే వరంగల్లు -
గిరిజన హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజనుల కోసం తీసుకొచ్చిన జీవో–3ను సుప్రీంకోర్టు కొట్టివేసినందున రివ్యూ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలను నూరు శాతం గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీవో–3ను తీసుకొచ్చామని, అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో లాక్డౌన్ సమయంలో జీవో నం.3ను ధర్మాసనం కొట్టివేసిందని చెప్పారు. దీనిపై న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని పెట్టి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన జీవో 3 వల్ల గత రెండు దశాబ్దాలుగా షెడ్యూల్డు ప్రాంతాల్లోని గిరిజనులు విద్య, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి అయ్యారని, ఈ సమయంలో జీవో–3ను కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులున్నారు. -
శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. (చదవండి: మద్యం ఎక్కువ తాగాడని హత్య) -
ఇంటి వద్దకే అంగన్వాడీ సరుకులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను మూసేస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పౌష్టికాహార పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ కమిటీలో అంగన్వాడీ టీచర్, హెల్పర్, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్, స్థానిక పోలీస్‌ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్ధతిలో, సరైన సమయంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దివ్యను ఆదేశించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. కరోనాపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గర్భిణుల జాబితా సిద్ధం చేయాలి..: గ్రామాలు, పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవ సమయానికి సిద్ధమైన గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో గర్భిణులు 3.3 లక్షలు ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నారని కమిషనర్ దివ్య వివరించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు బాలబాలికలు 4.40 లక్షలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారన్నారు. -
'అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఆపొద్దు'
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ పౌష్టికాహార పంపిణీని ఆపవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ తదితరులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు వండి, పంపిణీ చేయాలన్నారు. ఈ పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి ఫలితాలు వస్తాయని, ఈమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసే అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామాల్లో మూడో ఫేజ్ విద్యుత్ కనెన్షన్లు, మరింత మెరుగైన గురుకుల విద్యా సౌకర్యాలు తదితర అంశాలకు వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. సోమవారం డీఎస్ఎస్ భవన్లో జరిగిన ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశంలో గిరిజనుల జనాభా దామాషా ప్రకారం కేటాయించిన నిధులను ఆయా శాఖల్లో ఏ మేరకు ఖర్చు చేస్తున్నాయన్న అంశంపై ఎస్టీ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం సత్యవతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక నిధి కింద గత బడ్జెట్లో ఎస్టీలకు రూ.7,184 కోట్లు కేటాయిస్తే.. సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, మిగతావి ఈ ఏడాది లోపు ఖర్చు చేయాలని ఆదేశించామన్నారు. ఈ నెల 6 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజన సంక్షేమానికి ఎక్కువ నిధులు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. -
ఎమ్మెల్యే రాకుండానే రివ్యూ మీటింగ్
-
మానుకోట గులాబీలో గలాటా!
సాక్షి, మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య అంతర్గత విభేదాలు బుధవారం మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్సారెస్పీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికారుల ఎదుటే మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను పిలవకుండానే సమావేశమా? మధ్యాహ్నం 12.30కి సమీక్ష ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అక్కడకొచ్చి తనకు సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహిం చడం దారుణమని, స్థానిక సమస్యలు తెలియకుండా సమీక్షా సమావేశాలు పెట్టి చాయ్, బిస్కె ట్లు తిని ఫొటోలకు ఫోజులిస్తే ప్రయోజనం ఉండ దని మంత్రిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించా రు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ ‘మనం ముందుగానే అనుకున్నాం కదా? సమీక్ష గురించి తెలుసు కదా’అని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే.. తాను రాకుండానే ఎందుకు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డురోలర్ మీద, ఎర్ర బస్సు ఎక్కి రాలేదని.. ఆర్ఈసీలో చదివి రాజకీయాల్లోకి వచ్చానంటూ శంకర్ నాయక్ మంత్రి విద్యాభ్యాసంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి అసహనంతో ‘ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మీ సమస్యలు ఏంటో చెప్పండి చర్చిద్దాం’అని బదులిచ్చారు. అప్పుడే కలెక్టర్ వీపీ గౌతమ్ జోక్యం చేసుకొని ‘సమన్వయ లోపం జరిగింది.. సారీ సర్’అని ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు. -
వార్ కాకి.. వార్ కాక...!
సాక్షి, కురవి: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (బుధవారం) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్ర లేచిన మంత్రి... వేప పుల్లతో పండ్లు తోముకుంటూ సొంతూరులో జరిగిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. జనం వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వార్ కాకి.. వార్ కాకా... వార్ బాబు.. వార్ బాయి..(ఎలా ఉన్నావు చిన్నమ్మ, చిన్నాయన, బాపు, అక్కా) అని పలకరిస్తూ వాడవాడలా కలియ తిరిగారు. ఊరిలోని నర్సరీని పరిశీలించి మొక్కలు బాగా పెరగడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందని చెప్పారు. 30 ఏళ్లుగా గ్రామస్తులతో తనకు అనుబంధం ఉందన్నారు. పెద్ద తండాలో పల్లెప్రగతిని పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి -
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
-
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహా జాతర ముగింపులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఎప్పటిలాగా జాతర ముగియగానే సమ్మక్క-సారలమ్మను వనప్రవేశం చేస్తారు. అయితే ఈ సారి ఈ తంతు నిర్వహించాల్సిన ఆదివాసీ పూజారులు అలిగి కూర్చున్నారు. దేవతలను తీసుకుపోమంటూ భీష్మించుకుపోయారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. దీంతో అధికారులు బుజ్జగింపు చర్యలకు దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశాయి. (వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు) మరోవైపు మేడారంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడారం జాతరను ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజు 15 లక్షల మందిని దేవాలయానికి పంపించడం ఒక ఘనత. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు. జాతీయ పండుగగా ప్రకటించండి మేడారం మహా జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాకు.. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న జాతరగా మేడారంకు ఈ గుర్తింపును ఇవ్వాలని కోరారు. శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన అర్జున్ ముండాకు మేడారంలో ఇంద్రకరణ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. (మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు) -
మేడారం.. జనసంద్రం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన సమక్క–సారలమ్మ జాతర కన్నుల పండుగగా సాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో ఉప్పొంగుతోంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలకు బారులుతీరారు. చీర, సారె, నిలువెత్తు బంగారం (బెల్లం), ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు... ఇలా తీరొక్క రూపాల్లో వనదేవతలకు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల ప్రసాదం (బెల్లం) దక్కించుకునేందుకు పోటీపడ్డారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం అమ్మవార్లను దర్శించుకోగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం వనదేవతలను దర్శించుకున్నారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా రెండు విడతల్లో సుమారు 2 గంటలకుపైగా దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వనదేవతలకు చీర, సారె సమర్పించిన సీఎం కేసీఆర్... వనదేవతల దర్శనానికి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మేడారానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేడారం పూజారులు, జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆలం రామ్మూర్తి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మను కేసీఆర్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని, ఆ తర్వాత సారలమ్మ అమ్మవారితోపాటు పక్కనే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు తెలంగాణ రాష్ట్రం తరఫున చీర, సారె సమర్పించారు. హుండీలో కానుకలు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క–సారలమ్మ దేవతల ఫొటోను అందజేశారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కూడా వనదేవతలను దర్శించుకొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జనసంద్రమైన మేడారం.... మేడారం జాతరకు ఈసారి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటివరకు భక్తుల సంఖ్య 1 కోటి 10 లక్షలకు చేరినట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం ముందు వరకు ముందస్తుగా 70 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలలో భక్తుల ఇబ్బందులు... మేడారంలో శుక్రవారం ఉదయం గవర్నర్ల దర్శనం సమయంలో సుమారు గంటపాటు ఆ తర్వాత సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మ«ధ్యాహ్నం 12:35 గంటల నుంచి 1:35 గంటల వరకు అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. దీంతో రద్దీ క్యూలలో పలుమార్లు తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. వీవీఐపీల దర్శనం ముగిసినప్పటికీ భారీ క్యూల వల్ల సాధారణ భక్తుల దర్శనానికి 4–5 గంటల వరకు సమయం పట్టింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టిన గవర్నర్లు సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారం వచ్చిన గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ ప్రత్యేక హెలికాప్టర్లో జాతర పరిసరాల్లో రెండుసార్లు చక్కర్లు కొట్టారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ, ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మల దర్శనం సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై గవర్నర్ తమిళిసై తులాభారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను మొక్కుకున్నట్లు తమిళిసై తెలిపారు. నేడు వనంలోకి దేవతలు... అశేష భక్తుల నుంచి తీరొక్క మొక్కులు అందుకున్న వనదేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శనివారం సాయంత్రం జరగనుంది. తొలుత నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలు ఉంటుంది. ఆలయం దాటిన తర్వాత బయటివారినెవరినీ వెంట రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు. బంగారం మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సీఎం కేసీఆర్ పర్యటన సాగింది ఇలా... ►మధ్యాహ్నం 1:06 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. ►1:10 గంటలకు వనదేవతల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి కండువా కప్పారు. ►1:14 గంటలకు సంప్రదాయబద్ధంగా ప్రధాన ప్రవేశమార్గం ద్వారా ఆలయ పూజారులు, మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు సీఎంకు ఆహ్వానం పలికారు. ►1:16 గంటలకు నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు. ►1:19 గంటలకు సమ్మక్క గద్దె వద్ద, 1:22 గంటలకు సారలమ్మ గద్దె వద్ద చీర–సారె, కానుకలు సమర్పించారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. ►1:28 గంటలకు గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వచ్చారు. ►1:35 గంటలకు పోలీస్ ఔట్‌పోస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విడిది ప్రాంతానికి చేరుకొని భోజనం చేశారు. ►2:05 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ రాకపోకల సమయం ►ఉదయం 9:25 గంటలకు మేడారంలోని హెలిప్యాడ్ వద్ద దిగారు ►9:30 గంటలకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. ►9: 40 గంటలకు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. ►10:00 గంటలకు తులాభారం ►10:10 గంటలకు సమ్మక్క, 10:15 గంటలకు సారలమ్మ గద్దె వద్ద మొక్కులు చెల్లించారు. ►10:45 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ►11:07 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. బరువు తగ్గిన కేసీఆర్ నిలువెత్తు బంగారంతో సీఎం కేసీఆర్ తులాభారం. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ సమ్మక్క–సారలమ్మల దర్శనం సందర్భంగా సీఎం కేసీఆర్ నిలువెత్తు బంగారాన్ని మొక్కుగా సమర్పించిన సమయంలో ఆయన 51 కిలోల బరువు తూగారు. 2018 ఫిబ్రవరి 2న మేడారం దర్శనానికి వచ్చిన సందర్భంగా నిలువెత్తు బంగారం సమర్పించినప్పుడు ఆయన 52 కిలోల బరువు ఉండేవారు. ఈసారి కేసీఆర్ 51 కిలోల బరువు తూగడంతో రెండేళ్లలో ఆయన ఒక కిలో బరువు తగ్గినట్లయింది. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 66 కిలోలు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ 55 కిలోల బంగారాన్ని మొక్కులుగా సమర్పించినట్లు పౌర సమాచార సంబంధాల శాఖ వెల్లడించింది. -
గద్దెనెక్కిన వరాల తల్లి
-
కీలక ఘట్టం.. గద్దెనెక్కిన వరాల తల్లి
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతిముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే ఆదివాసీ జాతర ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 6:29 గంటల నుంచి రాత్రి 9:09 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది. వేకువజాము నుంచే..... వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం వేకువజామునే మొదలైంది. సమ్మక్క పూజారులు, వడ్డెలు ఉదయం 5.30 గంటలకు మేడారం సమీపంలోని వనంలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు, ఆలంకరణలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాల (కొత్త కుండలు)ను కూడా గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. సమ్మక్క రాక సందర్భంగా చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్న కిలోమీటరు దారి మొత్తం రంగురంగుల ముగ్గులు వేసి భక్తులు యాటపోతులను బలిచ్చి మొక్కుకున్నారు. సమ్మక్కకు ఆడపడుచులు, ముత్తయిదవులు నీళ్ల బిందెలు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. సమ్మక్క రాక సందర్భంగా గౌరవ సూచకంగా తుపాకీ పేలుస్తున్న ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ సాయంత్రం 6:29 గంటలకు... గురువారం సాయంత్రం 6:29 గంటలకు కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవితల్లి సమ్మక్కతో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. వారు వస్తున్న విషయం తెలియడంతో ఒక్కసారిగా అక్కడున్న శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ ఉద్విఘ్నత కొనసాగుతుండగానే సమ్మక్కతో వడ్డే కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. మిగిలిన పూజారులు, వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచికగా దేవతను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకలగుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్ పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు. చిలకలగుట్ట నుంచి ఫెన్సింగ్ వరకు సమ్మక్క చేరుకునేలోపు ఎస్పీ మొత్తం 3 సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య పూజారులు, ఆదివాసీల మధ్య సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్నం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదజల్లారు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజా రులు అక్కడి నుంచి ఎదురుకోళ్ల పూజా మందిరం చేరుకున్నారు. పూజారులు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సరిగ్గా రాత్రి 9:09 గంటల సమయంలో గద్దెపై సమ్మక్కను ప్రతిష్టించాక విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మొదట మేడారంవాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. ఎదుర్కోళ్లు ఎగుర వేస్తున్న భక్తులు మెగా సిటీగా మేడారం వరంగల్: దట్టమైన అటవీ ప్రాంతంలోని మేడారం.. జాతర సమయంలో మెగా సిటీ గా మారుతుంది. సాధారణ పల్లె ప్రతీ రెండేళ్లకోసారి వారం పాటు తన స్వరూపాన్ని గు ర్తు పట్టలేనంతగా మార్చుకుంటుంది. ఎం తంటే ఐదు లక్షల కుటుంబాలు, కోటి మం దికి పైగా జనాభా జాతరకు చేరుకుంటారు. మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మ హారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వస్తారు. పొరుగు రాష్ట్రాల నుం చి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రధా న అడ్డంకి గోదావరి నది. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు సిరోంచ తర్వాత ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఏటూరునాగారం, కాళేశ్వరం వద్ద నిర్మిం చిన హైలెవల్ వంతెనల మీదుగా మేడారం చేరుకుంటారు. జాతరపై వర్సిటీలో పరిశోధనలు 1975లోనే వరంగల్‌లో కేయూ ప్రారం భం కాగా.. 1980వ దశకంలో వర్సిటీలో చరిత్ర విభాగం తన పరిశోధనలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క–సారలమ్మలతో పాటు కాకతీయులపై చెప్పుకోతగిన పరిశోధనలు జరగలే దు. 2006లో దివిటి అంజనీదేవి సమ్మక్క– సారలమ్మ జాతరపై ఓ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురాగా, అంతకు ముందు రాజ్ మహ్మద్ ఉస్మానియా వర్సిటీ ద్వారా పరిశోధనలు చేశారు. ఇటీవల గిరిజన విజ్ఞానపీఠం ద్వారా కొన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి. జాతరలో జంపన్న పుట్టిండు! మగబిడ్డతో శివాణి భూపాలపల్లి అర్బన్ : మేడారం మహాజాతరకు వచ్చిన భక్తురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన 50 ఆస్పత్రిలో వైద్యులు గురువారం ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో పాటు కేసీఆర్ కిట్ అందజేశారు. పుణేకు చెందిన చావని శివాణి కుటుంబ సభ్యులతో కలసి రెండు రోజుల క్రితం జాతరకు వచ్చింది. గురువారం పురుటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప్రసవం చేయడంతో శివాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జంపన్నే తమకు పుట్టాడని శివాణి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. హుండీలు గలగల! మొక్కుబడులతో నిండిన హుండీలు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల వద్ద 429 హుండీలను ఏర్పాటు చేశారు. జాతరలో రోజుకు సుమారు 40 నుంచి 50 హుండీలు నిండుతున్నాయి. ఇప్పటి వరకు 212 హుండీలు నిండినట్లు దేవాదాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. బస్సుల సందడి భూపాలపల్లి: మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క తల్లి గద్దెను చేరడంతో భక్తులు దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి వరకు మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో వందలాది బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారు. బస్టాండ్‌లో నిలిపి ఉంచిన వివిధ డిపోల బస్సులను పైనుంచి ఇలా అగ్గిపెట్టెల్లా దర్శనమిచ్చాయి. జనసందోహంగా మేడారం.. ప్రముఖుల మొక్కులు సమ్మక్క గద్దెను మొక్కుతున్న మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే సీతక్క నలుగురు వన దేవతలు... సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భారీగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల మంది వరకు మేడారానికి తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారం మేరకు మేడారానికి వచ్చిన భక్తుల సంఖ్య శుక్రవారం కోటికి చేరనుందని భావిస్తున్నట్లు దేవాదాయ, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు పేర్కొన్నారు. అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చిత్రంలో తలసాని కాగా, మేడారంలో గురువారం పలువురు ప్రముఖులు వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు. తల్లులను దర్శించుకున్న వారిలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ప్రత్యేకాధికారులు వి.పి. గౌతమ్, కృష్ణ ఆదిత్య, సీపీ డాక్టర్ రవీందర్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏఎస్పీ సాయిచైతన్య తదితరులు ఉన్నారు. -
ఆరేళ్ల నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచకపోవడంతో రాష్ట్రంలోని గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని గిరిజన సలహా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లు రాష్ట్రంలో మాత్రం పెరగలేదని, దీంతో గిరిజనులకు అన్ని రంగాల్లో కోటా తగ్గిం దని సభ్యులు మండిపడ్డారు. గురువారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎజెండా లోని అంశాలను ప్రస్తావిస్తుండగా.. ములుగు శాసనసభ్యురాలు సీతక్క గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలో 9.8% గిరిజన జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లు కావస్తుందని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచకపోవడంతో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం పోడు భూముల అంశం ప్రస్తావనకు రావడంతో మంత్రి జోక్యం చేసుకుంటూ దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే హామీ ఇచ్చారని, మరోసారి ఈ అంశాన్ని ఆయనకు వివరిస్తానని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. బిల్లులు చెల్లించడం లేదు.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఇప్పటికే పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని సభ్యులు ప్రస్తావించారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షే మ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా పాల్గొన్నారు. -
‘పోడు భూముల సమస్యలు తీరుస్తాం’
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో వ్యవసాయం చేసే వాళ్లకు ‘రైతు బంధు’ ఇచ్చేలా కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో గిరిజన ఆరో సలహా మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడంపై చర్చించామని తెలిపారు. అదే విధంగా పోడు భూముల సమస్యలు తీరుస్తామన్నారు. గిరిజనల కోసం గురుకులాలు, కాలేజీలు పెంచాలని సభ్యులు కోరినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి నిర్మాణం కోసం కృష్టి చేస్తానని ఆమె పేర్కొన్నారు. గిరిజన ఆవాసలకు మూడు ఫేస్‌ల కరెంట్ లేదని తెలిసిందని సత్యవతి అన్నారు. కొన్ని గ్రామాలకు కరంట్ కూడా లేకపోవడం దురదృష్టకరమని ఆమె తెలిపారు. దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఆమె పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించేలా చూస్తామని సత్యవతి చెప్పారు. కొంతమందికి జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లుతానని ఆమె తెలిపారు. గిరిజన రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సత్యవతి వ్యాఖ్యానించారు. గిరిజనులకు సమస్యలపై త్వరలో ప్రధానిని కలుస్తామన్నారు. సింగరేణిలో బాక్లాగ్ పోస్టులు, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల కల్పన విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి తెలిపారు. -
‘సఖి’ ఇక కలెక్టరేట్లో!
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆపద సమయంలో సత్వర సేవలను ఒకే గొడుగు కింద అందించే సఖి (వన్ స్టాప్) సెంటర్లను ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే అంశాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు అన్ని కేంద్రాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలున్న చోట వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ శాఖ ఈ మేరకు యోచిస్తోంది. ప్రస్తుతం అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మిస్తుండగా.. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్ భవనం విశాలమైన ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలో కలెక్టరేట్ క్యాంపస్‌లోనే సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారంతో పాటు సేవల కల్పన సులభతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పాత పది జిల్లాల్లో... రాష్ట్రంలో 33 జిల్లాలుండగా.. 26 జిల్లాల్లో మాత్రమే సఖి కేంద్రాలున్నాయి. ఇందులో పాత పది జిల్లాల్లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు రెండేళ్లవుతోంది. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటైతే అందులో 16 జిల్లాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను మంజూరు చేసింది. మిగతా జిల్లాల్లో ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. పండుగ తర్వాత ఈ అంశంపై మంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
పనులవుతవా..కావా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘మేడారం మహా జాతరకు నెల సమయం కూడా లేదు.. ఎన్ని సార్లు సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదు.. రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, ఆర్డబ్ల్యూఎస్ పనుల తీరు చూస్తే జాతర మొదలయ్యే వరకు పూర్తి అవుతాయన్న నమ్మకం లేదు’ అని సంబంధిత అధికారులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు ఇన్చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మేడారం హరిత హోటల్లో జాతర పనులు, ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జాతర మొదలయ్యే వరకు పను లు పూర్తయ్యేలా లేవని ఫైర్ అయ్యారు. ఆయా పనుల్లో లోపాలను ఎత్తి చూపారు. మహబూబాబాద్, నర్సంపేట మధ్య రోడ్డు పనుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ పీవో శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణలపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గాలిమాటలు చెప్పకు.. పనుల్లో వేగం పెరగకపోతే ఇంటికి పోతరు’ అని మందలించారు. ఈ నెల 26లోగా అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రులు మేడారం అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. -
‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే బాలామృతం పంపిణీలో అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’ అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. చిన్నారులకు పంపిణీ చేసే బాలామృతం కవర్లు పొలాల్లో కుప్పలుగా దొరకడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ ఎలా జరుగుతుందనే అంశంపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్‌ను ఆదేశించారు. దీంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిని విచారణ అధికారులుగా ఆయన నియమించారు. బాలామృతం ప్యాకెట్లు పంపిణీ జరిగిన తీరు, వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. రైతు పొలంలో కుప్పలుగా ఉన్న ప్యాకెట్లు ఎక్కడివో కూడా పరిశీలించాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పంపిణీ, లబ్ధిదారులు, వినియోగం తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు సైతం హుటాహుటిన విచారణ క్రమాన్ని మొదలుపెట్టారు. మరోవైపు బాలామృతం పంపిణీపై నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ‘బాలామృతం పక్కదారి’పై ఆరా కేశంపేట: ‘బ్లాక్ మార్కెట్‌కు బాలామృతం’శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సునంద, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మోతీ తదితరులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను, బాలామృతంను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు బాలామృతంను సక్రమంగా తీసుకెళ్తున్నారా లేదా అని చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆరా తీశారు. పొలంలో పడేసిన బాలామృతం ఖాళీ ప్యాకెట్లను పరిశీలించారు. ఎవరైనా బాలామృతం ప్యాకెట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ కమ్లేకర్ నవీన్‌కుమార్, షాద్‌నగర్ ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు పద్మ, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. -
ఇక బాలామృతం ‘ప్లస్’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో తీవ్ర పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నిరకాల పోషక విలువలున్న ఆహారంగా ‘బాలామృతా’న్ని చిన్నారులకు అందిస్తున్నారు. దీంతో చిన్నారుల పెరుగుదల సంతృప్తికరంగా ఉంటోంది. అయితే పోషకలోపాలున్న చిన్నారులకు బాలామృతం కంటే మరింత అధిక పోషణ గుణాలున్న ఆహారాన్ని ఇవ్వాలని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్’ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్’ను వినియోగంలోకి తెచ్చారు. ముందుగా రెండు జిల్లాల్లో... అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా కొలవడంతో పాటు వారి ఆరోగ్య స్థితిని సైతం రికార్డు చేస్తుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నివేదికను విశ్లేషించగా... కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అలా అయితేనే వారు ఐదేళ్ల వయసొచ్చేసరికి పోషక లోపాలు అధిగమించడంతో పాటు ఆ తర్వాత ఎదుగుదల సాధారణంగా మారుతుంది. ఈ అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పాటు ఎన్ఐఎన్, టీఎస్ ఫుడ్స్, యూనిసెఫ్ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పోషక విలువలు ఎక్కువగా ఉన్న బాలామృతం ప్లస్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్, యూనిసెఫ్ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ మిషల్ రాస్డియా తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆహారంలో... కొత్తగా తీసుకొచ్చిన బాలామృతం ప్లస్‌లో పాలపొడి, పల్లీ నూనె, రైస్, వీట్, బెంగాల్‌గ్రామ్, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలను జత చేస్తారు. దీంతో పోషక విలువలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు. ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది. -
'మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తాం'
సాక్షి, వరంగల్ అర్భన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అతిరుద్ర యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కళ్యాణానికి దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కోటిన్నర మాగానికి సాగునీళ్లు అందనున్నాయన్నారు. కాళేశ్వరంతో పాటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయమై ఇటివలే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలువురం కలిసి కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మేడారం జాతరలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఇంద్రకరణ్ వెల్లడించారు. (చదవండి : ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర) -
‘సంక్షేమం’.. సజావుగా సాగుతోందా..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా? లబ్ధిదారుల్లో అక్రమార్కులున్నా రా? అనేది తేల్చేందుకు సిద్ధమవుతోంది గిరిజన సంక్షేమ శాఖ. పథకాలు దారితప్పకుండా, పక్కా గా అర్హులకు చేర్చాలనే లక్ష్యంతో దీనికి ఉపక్రమిస్తోంది. ఈ శాఖ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అర్హతలు నిర్ధారించిన తర్వాత ఫలాలు పంపిణీ చేస్తున్నప్పటికీ... వారంతా అర్హతలున్నవారేనా? కాదా? అనే కోణంలో పరిశీలించనున్నారు. రెండ్రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పునఃపరిశీలన ఎలా చేపట్టాలనే దానిపై స్పష్టతకు రావాలని ఆమె సూచించడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 76 రకాల సం క్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నారు. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక చే యూత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అమలు చేస్తున్న వాటి ల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమాలున్నా యి. ఇందులో అధిక నిధులు ఖర్చు చేస్తున్న పథకాలపై పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆర్థిక చేయూత కార్యక్రమాల్లో లబ్ధిదారుల స్థితిని తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఆర్థిక చేయూత పథకాల్లో పరిశీలన చేసే అవకాశం ఉండగా... ఇం దులో అనర్హులుగా తేలితే వేటు వేయాలని నిర్ణ యించారు. అలాగే, దుర్వినియోగమైన మొత్తాన్ని రికవరీ చేయాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. -
మహిళల స్వేచ్ఛ కోసం..
గాయని మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. కేపీఎన్ చౌహాన్ దర్శకత్వం వహించారు. సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఆంగోత్ రాజునాయక్ మాట్లాడుతూ– ‘‘తండా స్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ పాత్ర నేటి అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదంతో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలూ అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది’’ అన్నారు కేపీఎన్ చౌహాన్ . ‘‘ఇందులో ఓ పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు భోలో షావలి. -
నేడు మంత్రుల రాక
సాక్షి, ములుగు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. ముందుగా 11గంటల 15 నిమిషాలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కలెక్టరేట్లో అందజేయనున్న ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య కు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంకారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్‌లోని ప్రియాంక నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందింతులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందిచారని మండిపడుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘దుండగులపై కేసులు వద్దు.. ఎన్కౌంటర్ చేయండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం పోలీసులు చర్యను ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నివాసం ఉంటున్న కాలనీలో ఎక్కువ మంది ఉత్తర భారతీయులు అయిన కూడా.. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక దారుణ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. -
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 2019 బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఎస్బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐఎస్బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నొవేషన్ స్కీం’ద్వారా ఐఎస్బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
బాలల చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బాలల రక్షణ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే రాష్ట్రంలో వారికి మంచి భవిష్యత్తు అందించగలమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథో డ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్తగా ఏర్పాటైన సందర్భంగా శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితాన్ని కోల్పోతున్న బాలల కోసం మనసు పెట్టి పనిచేయాలని సూచించారు.ఆలనా పాలనా కోసం ఎదురు చూస్తున్న వారిని చేరదీసి, వారికి చేయూత అందించాలన్నారు.రాష్ట్రంలో బాలలు, మహిళలకు ఎలాంటి లోటులేకుండా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటుతో పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ‘యూనిసెఫ్’తో సమన్వయం చేసుకుని బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు, సభ్యులు అంజన్ కుమార్, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, అపర్ణ, ఎడ్లపల్లి బృందాదర్ రావు, ఏ. దేవయ్య, మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, బాల నేరస్తులు, వీధి బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం గాంధీ చౌక్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మంలోని తెరాస నేత వద్దిరాజు రవిచంద్ర నివాసంలో తేనీటి విందులో మంత్రులు పాల్గొన్నారు. -
నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను
సాక్షి, మహబూబాబాద్ : గిరిజన మహిళైన తనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గొప్ప అవకాశం కల్పించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన డోర్నకల్ గడ్డ అభివృద్ధికి పాటుపడతానన్నారు. పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మూడువేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, తమ తండాలో తమ రాజ్యాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు త్వరలో ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్తానన్నారు. మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. -
బాపురావు గృహ నిర్బంధం అన్యాయం
సాక్షి, ఆసిఫాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును గృహ నిర్భందించడం అన్యాయమని ఆదివాసీలు, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కెరమెరి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ దిష్టిబొమ్మణు దహనం చేశా రు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సమస్యల పరిష్కారం, ఆత్మీయ సభకు వెళ్తున్న ఎంపీ బాపూరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు. ప్రభుత్వం లంబాడాలకు వత్తాసు పలుకుతుందని పేర్కొన్నారు. అనాథి నుంచి ఉంటున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ప్రమా ణం స్వీకరాం చేసిన ఒక్క రోజులోనే సత్యవతి రాథోడ్ తన ప్రతాపాన్ని చూపుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలో నాయకులు కోవ విజయ్, భీంరావు, తుకారాం, ప్రభాకర్, దర్మూ, భీంరావు తదితరులున్నారు. -
ఒక్కరు.. ఇద్దరాయె
సాక్షి, వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం కల్పించారు. సోమవారం నుంచి అసెంబ్లీ శాసనసభ బడ్జెట్– 2019–20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మలి విడత మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సామాజిక కోణాలు, సమీకరణల దృష్ట్యా మలి విడతలో రెండో మంత్రిగా ఉమ్మడి జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఉండకపోవచ్చని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పించారు. ఆమెకు కీలకమైన గిరిజన, స్రీ, శిశుసంక్షేమ శాఖలు కూడా కేటాయించారు. మరోవైపు ఇటు శాసనసభ.. అటు శాసనమండలిలో కీలక పోస్టుల్లో దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లులను ప్రభుత్వ చీఫ్ విప్‌లుగా శనివారం నియమించారు. 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా తాడికొండ రాజయ్య(తర్వాత కడియం శ్రీహరి), మంత్రిగా అజ్మీరా చందూలాల్, శాసనసభ స్పీకర్‌గా మధుసూదనాచారిలకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలు పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లులను శాసనమండలిలో విప్‌లుగా నియమించారు. అయితే ఈసారి బి.వెంకటేశ్వర్లుకు చీఫ్ విప్‌గా పదోన్నతి లభించగా.. పళ్లా రాజేశ్వర్‌రెడ్డికి ‘విప్’ పదవి కూడా చేజారింది. ప్రకటించే కమిటీలపై ఆశలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన సత్యవతిరాథోడ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ‘విప్’కు దూరమైన ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, మాజీ మంత్రి రెడ్యానాయక్ తదితరుల పేర్లు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మంత్రి వర్గంలో ఇదివరకే ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులున్నారు. 18 మంది మంత్రులు తప్పనిసరి కావడంతో మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి గతంలో స్పీకర్, ఇద్దరు మంత్రులు ఉండగా.. ఈ సారి కూడా రెండో మంత్రి స్థానంలో పలువురి పేర్లు ప్రచారంలోకి రావడానికి కారణమైంది. పలువురు ప్రయత్నం చేసినా.. షెడ్యూల్డ్ తెగకు చెందిన ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో ఆశావహ సీనియర్ నేతల ఆశలు అడియాసలయ్యాయి. అయితే సీనియర్ నేతలు, మాజీ మంత్రులను సైతం సభాకమిటీలు, కార్పొరేషన్ చైర్మన్ తదితర కీలక పదవుల్లోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు శనివారం నుంచి ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి ఈ అవకాశం కల్పించనుండగా.. ఉమ్మడి వరంగల్ నుంచి కడియం శ్రీహరి, పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, అరూరి రమేష్, రెడ్యానాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ కమిటీలు ఖరారైనట్లు చెప్తుండగా.. అధికారికంగా స్పీకర్ సభాకమిటీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. నేటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యానే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. చీఫ్ విప్‌లు, విప్‌లను నియమించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం కొత్త, పాత మంత్రులతో ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి సమావేశయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా శాసనసభ సమావేశాలకు హాజరైన దాస్యం వినయభాస్కర్ ఈ సారి ప్రభుత్వ చీఫ్ విప్ హోదాలో పాల్గొననున్నారు. తొలి మహిళా మంత్రిగా సత్యవతిరాథోడ్ సమావేశాలకు హాజరు కానున్నారు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, ఎం.యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరెందర్, రెడ్యానాయక్ తదితరులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. శాసనమండలిలో చీఫ్ విప్‌గా తొలిసారి బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, పళ్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి
సత్యవతి రాథోడ్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన.. లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ వ్యక్తికి లేదా సంస్థలకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి గిరిజన మహిళా మంత్రిగా కేసీఆర్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ చోటు దక్కించుకున్నారు. అనుభవం, పనితీరు కారణంగా ఆమెకు మంత్రి వర్గంలో గిరిజన కోటాలో స్థానం లభించిందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సత్యవతిరాథోడ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆమెకు సీఎం కేసీఆర్ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖను కేటాయిం చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళగా ప్రమాణ స్వీకారం చేయటంతో గిరిజన జిల్లా అయిన మానుకోటలో టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్ద తండాలో 1969లో జన్మించిన సత్యవతి రాథోడ్ 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత మండల పరిషత్ అధ్యక్షురాలిగా పోటీ చేసి ఓడిన ఆమె ఆపై గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా విజయం సాధించారు. 1989లో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యా చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. 1995లో సర్పంచ్‌గా, 2005లో నర్సింహులపేట జెడ్పీటీసీగా గెలు పొందారు. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవతి తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పదవిని అలకంరించారు. విధేయతకు గుర్తింపు సత్యవతిరాథోడ్ టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి జయాపజాయలకు కుంగిపోకుండా వినయ విధేయలతో పార్టీలో అంకితభావంతో కొనసాగారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా పట్టం కట్టారు. 2014లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంతో పార్టీ మారకుండా రెడ్యానాయక్ గెలుపుకోసం పనిచేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నల్గొండ టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తూనే అధిష్టానం వద్ద తన పట్టును మరింత పెంచుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. పార్టీకోసం సత్యవతి రాథోడ్ చేసిన సేవలను గుర్తించిన ఆధిష్టానం మంత్రిపదవితో సత్కరించిందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక సత్యవతి రాథోడ్‌ను మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మానుకోట జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షాలు తెలియజేశారు. నాడు రెడ్యాకు.. నేడు సత్యవతికి డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందిన రెడ్యానాయక్ నాడు వైఎస్సార్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. కాగా 11 సంవత్సరాల తరువాత తిరిగి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి సత్యవతి రాథోడ్ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. బయోడేటా.. పేరు : భూక్య సత్యవతిరాథోడ్ తల్లిదండ్రులు : లింగ్యానాయక్, దస్మి స్వస్థలం : కురవి మండలం పెద్దతండా జీపీ భర్త : భూక్య గోవింద్‌రాథోడ్(లేట్) కుమారులు, కోడల్లు : భూక్య సునీల్కుమార్రాథోడ్–సోనమ్, డాక్టర్ సతీష్‌రాథోడ్–బిందు విద్యార్హత : బీఏ(అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ) స్ఫూర్తినిచ్చిన నేత : సీఎం కేసీఆర్ అభిమానించే వ్యక్తి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నచ్చిన ప్రదేశం : డోర్నకల్ నియోజకవర్గం మరచిపోలేని రోజు: 2009లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గోవింద్‌రాథోడ్ మృత్యువాతకు గురికావడం. రాజకీయచరిత్ర : 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తెలుగు మహిళా జిల్లా కన్వీనర్‌గా, 1985లో టీడీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, అదే సంవత్సరం రాష్ట్ర ఎస్టీసెల్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 1987లో మేన మామ బానోత్ సక్రాంనాయక్పై కురవి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1987లో భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయ ట్రస్టు బోర్టు సభ్యురాలిగా నియమితులయ్యారు. 1989లో టీడీపీ తరఫున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1995లో గుండ్రాతిమడుగు(విలేజి) సర్పంచ్‌గా జనరల్ స్థానం నుంచి గెలుపొం దారు. 2001లో కురవి మండలం చింతపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీచేసి ఓడిపాయారు. 2006లో నర్సింహుంలపేట జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో డోర్నకల్ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా రెడ్యానాయక్‌పై విజయం సాధించారు. 2014 మార్చి 3న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెడ్యానాయక్‌పై పోటీ చేశారు. 2019 మార్చి 12న ఎమ్మెల్యే కోటా కింద టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 8న తొలి గిరిజన మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు ప్రజలతోనే మమేకం చిన్పప్పటి నుంచి ప్రజలతోనే తిరుగుతుండేది. చిన్పప్పుడే సర్పంచ్‌గా గెలిచింది. చెల్లే నేను మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసమే పనిచేసేది. తెలంగాణ కోసం అందరం కష్టపడ్డాం. చెల్లె కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని అందులోకి వెళ్లి బంగారు తెలంగాణ కోసం పనిచేసింది. కష్టపడ్డదానికి ఫలితం దక్కింది. సీఎం కేసీఆర్ చెల్లెకు మంత్రి పదవి ఇచ్చి గౌరవాన్ని పెంచాడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – గుగులోత్ కిషన్‌నాయక్, కనకమ్మ(సత్యవతి రాథోడ్ అన్న, వదిన) నా బిడ్డ గొప్పదైంది.. నాబిడ్డ గొప్పదైంది. చిన్నప్పటి నుంచి పార్టీల్లోనే తిరిగేది. చిన్నతనంలో పెళ్లి చేశాము. అయినా రాజకీయాల్లోనే తిరిగేది. సర్పంచ్‌గా గెలిచింది. ఇప్పుడు మంత్రి అయిందని తెలిసింది. సంతోషంగా ఉంది. ఎప్పుడూ ప్రజలతోనే మాట్లాడుతుంది. వారితోనే ఎక్కువగా ఉంటుంది. మాకు సంతోషమే. నాబిడ్డ గొప్ప పదవిలో ఉంది. ఆమెను చూసేందుకు హైదరాబాద్ వెళ్తున్నాం. – గుగులోత్ దస్మి, లింగ్యానాయక్(సత్యవతిరాథోడ్ తల్లిదండ్రులు) బాధ్యత పెరిగింది సీఎం కేసీఆర్ అప్పగించిన మంత్రిపదవితో నాపై బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు.. వారి ఆకాంక్షలకు తగినట్టుగా పనిచేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో మందుంటా. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నావెంట పయనించిన అనుచరులు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు పనిచేస్తా. – సత్యవతి రాథోడ్ -
మంత్రిగా చాన్స్.. కేసీఆర్, కేటీఆర్‌కు థాంక్స్
-
మంత్రిగా చాన్స్.. కేసీఆర్, కేటీఆర్‌కు థాంక్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్లో తనకు మంత్రిగా అవకాశం కల్పించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మంత్రిగా అవకాశం కల్పించడం, గిరిజన మహిళ అయిన తనకు ఈ ఘనత ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’ టీవీతో ముచ్చటించారు. గతంలో ఉన్న పరిస్థితుల కారణంగానే గత హయాంలో మహిళలకు మంత్రి పదవి దక్కలేదని, కానీ మహిళా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోందని, మిషన్ భగీరథ ద్వారా మహిళలు బిందెలతో రోడెక్కకుండా చేయడం, పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచడం, మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలుచేయడం మహిళల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమాభిమానాలను చాటుతున్నాయని సత్యవతి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు కడియం శ్రీహరిలాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారని, వారందరితో కలిసి పనిచేస్తానని, అందరినీ కలుపుకొనిపోతానని ఆమె తెలిపారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. దానిని సమర్థంగా నిర్వర్తించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని.. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వతహాగా పైకి రావాలని ఆమె ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014లో ఆమె టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్ రూరల్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేధ్య పూజా సమయంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు.