సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రజలకు ఎంతో అభిమానం. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఇక, ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటూ మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష చేపట్టారు.
వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్ మూడోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేరేంత వరకు చెప్పులు వేసుకోనని మంత్రి సత్యవతి రాథోడ్ దీక్ష చేపట్టారు. కాగా, ఇటీవల ములుగు జెడ్పీ ఛైర్మన్ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆమె మూడు కిలోమీటర్లు మండుటెండలోనే చెప్పులు లేకుండా నడిచారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం కూడా కేసముద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలోనూ అలాగే పాల్గొన్నారు.
దీంతో మంత్రి సత్యవతి రాథోడ్‌కు నిన్న అరికాళ్లకు బొబ్బలు ఏర్పడ్డాయి. అనంతరం, ఆమెకు కాళ్లకు అయింట్‌మెంట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ పేరును కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నారు. కాగా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చెప్పులు వేసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్ లక్ష్యమేంటి?: సీఎం కేసీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment