
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao) దూరంగా ఉండనున్నారా?. బడ్జెట్ ప్రసంగంతో పాటు సమావేశాలకూ ఆయన దూరంగా ఉంటారా?. దీనిపై బీఆర్‌ఎస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని ఆయన తనయుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్ శ్రేణుల హడావిడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం.
గవర్నర్ ప్రసంగం(Governor Speech) రోజున కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంతో ఈసారి సెషన్ ఆసక్తికరంగా జరగవచ్చనే చర్చ నడిచింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆయన సెషన్ దూరంగానే ఉంటారని తెలుస్తోంది. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు నిన్న కేసీఆర్‌కు బహిరంగ లేఖ ఒకటి రాశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు విన్నవించాలని.. లేకుంటే ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వద్ద నిరసనలు చేపడతామని అందులో హెచ్చరికలు జారీ చేశారు కూడా.
కేసీఆర్ చివరిసారిగా కిందటి ఏడాది బడ్జెట్ సమావేశాలకు హారజయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతా డొల్ల’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment