
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao) ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.
బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్ చేశారు.
ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు. మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్‌ఎస్ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్ మాత్రమే అని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment