రేవంత్‌ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల | MPS Etela Rajender DK Aruna Comments After Meets lagcherla farmers At sangareddy Jail | Sakshi
Sakshi News home page

ఓటేసి గెలిపించిన జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా: సీఎం రేవంత్‌పై డీకే అరుణ

Published Mon, Nov 18 2024 12:53 PM | Last Updated on Mon, Nov 18 2024 4:40 PM

MPS Etela Rajender DK Aruna Comments After Meets lagcherla farmers At sangareddy Jail

సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్‌ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్‌ చేసిన బాధిత రైతులను సెంట్రల్‌ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.

ఈ ఘటనకు స్కెచ్ వేసింది  కాంగ్రెస్ వాళ్లే..
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.

రైతులకు సంకెళ్లు వేయడం  కరెక్ట్ కాదు..
‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు.  రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.

కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణ
లగచర్ల గ్రామంలో ఫార్మా  కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.

పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.

లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ

సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?
భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. 

జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?
సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం  వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.

పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement