తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడు: హరీష్‌ రావు | harish rao Aggressive Comments On Revanth Reddy At sangaReddy | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడు: హరీష్‌ రావు

May 2 2024 9:13 PM | Updated on May 3 2024 9:19 AM

harish rao Aggressive Comments On Revanth Reddy At sangaReddy

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్‌ రావు. రేవంత్‌ అధికారంలోకి వచ్చాక, మంచినీళ్ల కష్టం వచ్చిందని విమర్శించారు. ఎక్కడ పోతే ఎక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం లేదని దుయ్యట్టారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా అని ప్రశ్నించారు.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా  నిర్వహించిన రోడ్ షోలోఎమ్మెల్యే హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒకరేమో దేవుని చూపించి ఓట్లు అడుగుతున్నారు..ఇంకొకరమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహాంకారంతో ఉన్నారని, వారిని భూమి మీదకు దించాలని పేర్కొన్నారు. కేవ‌లం ప‌ద‌వుల కోసం, పార్టీల కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాదు.. తెలంగాణ భవిష్యత్‌కు జరుగుతున్న ఎన్నికలు ఇవని అననారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement