సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, రివర్స్ గేర్‌లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని, ర్మాణరంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడ్డారని విమర్శించారు. సీఎం బీజేపీలో చేరుతారని ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారని, పార్టీ మార్పు విషయమై బీజేపీ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని నిలదేశారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. మోదీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని,8 సీట్లలో బీజేపీ గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని. కేబినెట్‌లో మైనారిటీని తీసుకోలేదని అన్నారు.
‘హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యం. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి. బీజేపీతో కలిస్తే జోడీ.. లేకుంటే ఈడీ. అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చింద,దిప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారు. కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటర్ కూడా కాలలేదు. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైంది. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి.
ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలయ్యిందా?. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. కాంగ్రెస్ మోసం చేయని మనిషి లేడు.రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పట్ల రేవంత్ భాషను ప్రజలు ఆమోదించడం లేదు. యువతకు, భవిష్యత్ తరానికి రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?. కేసీఆర్ చేసినవాటికి వ్యతిరేకంగా చేయడమే రేవంత్ ఉద్దేశం.
రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. మొదటి రోజు తప్ప మళ్లి కనిపించలేదు. 3.50 లక్షల దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కరించారో చెప్పలేదు. పార్టీలు మారినవారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి?. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ, బీఆర్‌ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే మేనిఫెస్టో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment