రేపు గన్‌పార్క్‌ వద్ద తేల్చుకుందాం.. రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్‌ | Harish rao Reaction On Revanth Reddy Challenge | Sakshi
Sakshi News home page

రేపు గన్‌పార్క్‌ వద్ద తేల్చుకుందాం.. రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్‌

Apr 25 2024 4:07 PM | Updated on Apr 25 2024 4:07 PM

Harish rao Reaction On Revanth Reddy Challenge

సాక్షి, మెదక్‌ : ఆగస్టు 15లోగా రుణామాఫీ పక్కా చేస్తామని, రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాల‌ంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి తన రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? అని మరోసారి రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు. మెద‌క్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌర‌స్తాలో నిర్వ‌హించిన ర్యాలీలో హ‌రీష్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

‘ఆగ‌స్టు 15 లోపు రుణ‌మాఫీ చేస్తాన‌న్న‌ది నిజ‌మైతే, బాండ్ పేప‌ర్ మీద రాసిచ్చిన గ్యారెంటీలు అమ‌లు చేసే మాట నిజ‌మైతే.. గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు రా. రాజీనామా లేఖ‌ల‌ను మేధావుల చేతుల్లో పెడుదాం. ఆగ‌స్టు 15 లోగా రుణ‌మాఫీ, ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తే నా రాజీనామా లేఖ‌ను తీసుకెళ్లి స్పీక‌ర్‌కు ఇస్తారు. ఒక వేళ అమ‌లు చేయ‌క‌పోతే నీ రాజీనామా లేఖ గ‌వ‌ర్న‌ర్‌కు ఇస్తారు. నువ్వు దానికి సిద్ధ‌మా అని అడుగుతున్నా. ద‌మ్ముంటే రా. మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తివి అయితేరా.. నువ్వు రాక‌పోతే తోక ముడిచిన‌ట్టే’ అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement