
సాక్షి, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది.
దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
సిద్దిపేట - దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య… pic.twitter.com/CjFwzzeKsF— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
Video Credit: Telugu Scribe
ఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment