kotta prabhakar reddy
-
Congress Vs BRS: దుబ్బాకలో ఉద్రిక్తత..
సాక్షి, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది.దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణసిద్దిపేట - దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య… pic.twitter.com/CjFwzzeKsF— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024Video Credit: Telugu Scribeఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
‘సీఎం రేవంత్‌ను వంద సార్లైనా కలుస్తాం’
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ వారు ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌ను కలిశాం. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలపై కలిసి మాట్లాడాం. మేము శ్రమశిక్షణతో పనిచేసే నాయకులం. మా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాకు పార్టీ మారే ప్రసక్తే లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. మేము కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. మా నాయకుడు ఎప్పుడూ కేసీఆరే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. ఆమ నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎం రేవంత్‌ను కోరాం. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని రాజకీయం చేశారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు.. తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉంటే సీఎంను, మంత్రులను కలవకూడదా?. సీఎం రేవంత్.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం లేదా?. ఈ అంశంపై మేము వివరణ ఇవ్వడం లేదు.. మా కార్యకర్తలకు క్లారిటీ ఇస్తున్నాం. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసినా ఇబ్బందులు పడుతున్నాం. కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ నాయకులు పంచుతున్నారు. ప్రజల ఓట్లతో మేము ఎమ్మెల్యేలుగా గెలిచాం. నిన్నటి నుంచి వస్తున్న వార్తలను చూస్తే బాధ వేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకా? రాష్ట్రానికా?. మాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది?. సీఎంను మాత్రమే కాదు, ప్రజా సమస్యల కోసం మంత్రులను సైతం కలిశాము. కలుస్తూనే ఉంటాం. సమస్యల పరిష్కారం కోసం ఇంకా వందసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి 15 రోజులు అవుతున్నా మాకు నీళ్ళు ఇవ్వలేదు. నేడు కొండా సురేఖ మాజిల్లా పర్యటనకు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు లేకుండా ఓడిపోయిన అభ్యర్థికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు కాదు.. 13 గ్యారెంటీ పథకాలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే మేమే సన్మానం చేస్తాం. దుబ్బాకలో మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉంటే ఆయనకు ప్రోటోకాల్ మేము ఇచ్చాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తాం. మేమున్నంత వరకు కేసీఆర్, గులాబీ జెండాను వదులం’ అని కామెంట్స్ చేశారు. -
వెన్నుపోట్లు.. కత్తిపోట్లు! ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసక్తికర రాజకీయం..
సంగారెడ్డి: 'ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనూ తన బలాన్ని పెంచుకుంది. ఈసారి రెండు మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పట్టును నిలుపుకుంది. బీజేపీ ఈసారి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కోల్పోయింది. పలు పార్టీ నేతలు ఒక పార్టీ నుంచి మరోపారీ్టకి మారడంపోటీలో నిల్చున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తిదాడి రాష్ట్రంలో సంచలంగా మారింది.' – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రేసులోకి వచి్చంది. 11 అసెంబ్లీ స్థానాలకు నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అందోల్, నారాయణఖేడ్, మెదక్, హుస్నాబాద్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకు ముందు కేవలం ఒక్క సంగారెడ్డిలోనే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది. బీఆర్ఎస్ కూడా ఏడు చోట్ల విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ‘స్థానిక'ంలో అవిశ్వాసాల జోరు.. స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల రగడ ఈ ఏడాదే షురువైంది. మున్సిపాలిటీలు, సహకార సంఘాల చైర్మన్ పదవులపై సభ్యులు అవిశ్వాస తీర్మాణాల నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి, అందోల్, సదాశివపేట్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెడుతూ కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయా చైర్మన్లు రాష్ట్ర అత్యున్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించడంతో అవిశ్వాసాల రగడం కొన్ని నెలలు సద్దుమనిగింది. ఎన్నికల అయిన వెంటనే మళ్లీ బల్దియాల్లో అవిశ్వాసాల లొల్లి షురువైంది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అవిశ్వాసాల తీర్మాణాలు నెగ్గుతాయా? లేదా? అనే దానిపై కొత్త సంవత్సం 2024లో తేలనుంది. పార్టీలు మారిన నేతలు.. ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీల్లో కొనసాగిన నేతలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల వేళ పార్టీలు మారారు. రాత్రికి రాత్రే కండువాలు మర్చారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలు మారిన ముఖ్యనేతల్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గాలి అనిల్‌కుమార్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌కు చెందిన నరోత్తం, టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ వంటి నాయకులంతా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ను వీడారు. రెండు మంత్రి పదవులు.. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందోల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిలారపు దామోదర రాజనర్సింహకు అమాత్య పదవి వరించింది. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన హరీశ్‌రావు మంత్రిగా కొనసాగిన విషయం విధితమే. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు పోర్టు పోలియో వైద్యారోగ్యశాఖ ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహకు దక్కడం గమనార్హం. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం పదవి చేజారిపోయింది. గజ్వేల్ నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయి. రెండు చోట్ల పోటీ చేయగా గజ్వేల్‌లో గెలిచారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్‌కు క్యాబినేట్లో చోటు దక్కింది. గతంలో సీఎం కేసీఆర్ మంత్రిగా పనిచేసిన రవాణాశాఖ ఈసారి పొన్నంకు దక్కడం గమనార్హం. ఉన్న ఒక్క స్థానాన్ని కోల్పోయిన బీజేపీ గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పారీ్టకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కోల్పోవాల్సి వచ్చింది. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ అభ్యరి్థగా గెలుపొందిన విషయం విదితమే. మరోవైపు ఉమ్మ డి జిల్లాలో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరికి కనీసం డిపాజిట్లు రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల్లో కనీసం పట్టులేని అభ్యర్థులను బరిలోకి దించడంతో కనీసం వార్డు కౌన్సిలర్‌కు వచ్చే ఓట్లన్ని కూడా ఆయా నియోజకవర్గాల్లో సాధించలేకపోయింది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. అక్టోబర్ 30న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మెదక్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నియోజకవర్గంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి నమస్తే సార్ అంటు మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన గటాని రాజు వచ్చి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. వెంటనే అక్కడున్న పోలీసులు, ప్రజలు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అంబులెన్స్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో దుబ్బాకకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా 53 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇవి చదవండి: వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు.. -
ఐటీ దాడులు: పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్!
సాక్షి, హైదరాబాద్/ సూర్యాపేట: బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల 12 గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఇక, ఐటీ దాడులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు కోసమే.. కేంద్రంలో ఉన్నా బీజేపీ తమ ఇంటిపై ఐటీ సోదాలు చేయించింది. ఆ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, తాను పూర్తిగా వైట్ పేపర్ అని స్పష్టం చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్‌కార్డు తీసుకున్నానని, నాటి నుంచి నేటి వరకు మా వ్యాపారం పూర్తిగా వైటే అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్న తన కూతురు ఐటీ అధికారులకు సెర్చ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. ఇలాంటి దాడులకు మేం భయపడే ప్రసక్తే లేదు. రాజకీయ కక్షలో భాగమే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు. శేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారవేత్త. రాజకీయంగా శేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడం పిరికి పందల చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
‘అవసరమైతే ఒక కౌన్సిలర్‌తో రాజీనామా చేయిస్తా.. గెలిచి చూపించు’
మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరన్రావుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావును కౌన్సిలర్‌గా గెలిచి చూపించాలంటూ సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రఘునందన్ సిద్ధిపేటలో రఘునందన్ కౌన్సిలర్‌గా గెలవాలన్నారు. రఘునందన్ కౌన్సిలర్‌గా పోటీకి దిగుతానంటే ఒక కౌన్సిలర్‌తో రాజీనామా చేయిస్తానని, సత్తా ఏంటో చూపించాలన్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ క్రమంలోనే బీజేపీపై కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నీ రాజీనామాను ఆమోదింప జేస్కో.. చూస్కుందాం ముందు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ సత్తా ఏంటో చూపించాలని ప్రతి సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ‘నువ్వు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే అప్పుడు చూద్దాం మెదక్‌లో బీజేపీ గెలుస్తుందో.. బీఆర్ఎస్ గెలుస్తుందో’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రఘునందన్‌రావు. -
'అందుకే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి'
సాక్షి,సిద్దిపేట : గజ్వేల్ మండలం రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ క్తొత ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా పట్ల మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణాలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్కువ ప్రభావం ఉందన్నారు. కరోనాను నివారించాలంటే సోషల్ డిస్టెన్స్తో పాటు జాగ్రత్తలు వహించడమే తప్ప మరోమార్గం లేదన్నారు. గ్రామాల్లో కరోనాపై తీసుకుంటున్న జాగ్రత్తలు పట్టణాల్లో కనబడడం లేదన్నారు. అందుకే పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేయాలన్నారు. ఒకవేళ వారికి జాబ్ కార్డు లేనట్లయితే తక్షణమే ఇస్తామన్నారు. ఉపాధి హామీ పనిచేసే కూలీలకు డబ్బుల కొరత లేదన్నారు. అనంతరం సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదు మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘నేడు తెలంగాణకు పండగ రోజు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిగొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టులున్న అమెరికా, ఈజిప్ట్ సరసన కాళేశ్వరం ప్రాజెక్టుతో భారత్ నిలిచిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ అంకితం చేసిన సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సంబురాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రాజెక్టుగా తాము భావిస్తున్నామని, రీడిజైన్‌తో దీన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత ఆయనదేనని కొనియాడారు. తెలంగాణకు, దేశానికి నేడు పండగ రోజని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరతాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తే బాగుండేదని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకితీసుకెళ్ళడం మామూలు విషయం కాదన్నారు. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి అందనున్నాయని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేకపోయామన్నారు. -
తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన లోక్‌సభ సభ్యులు మంగళవారం పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేం లేదు. వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం’ అని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించలేదని, బీజేపీ నాయకులు కేవలం మాటలకు పరితమయ్యారని ఆపార్టీ డిప్యూటి ఫ్లోర్‌లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమపై నమ్మకం ఉంచి 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని గుర్తుచేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన ఏళ్లలో అనేక సమస్యలపై పోరాటం చేశాం. హైకోర్టు, జాతీయ రహదారులు ఇలా ప్రతిదాన్నీ పోరాడే సాధించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథానే అవలంభిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తాం. గత కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు. బీజేపీ నేతలు భ్రమలో ఉన్నారు’’ అని అన్నారు. -
‘మెదక్’ తీర్పు దేశంలో చర్చకు దారితీయాలి
గజ్వేల్: మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల తీర్పు దేశ ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకునే విధంగా ఉండాలని.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథి నియోజకవర్గాల కంటే అత్యధిక మెజారిటీని టీఆర్ఎస్కు ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్‌లోని లక్ష్మీగార్డెన్స్‌లో నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి హాజరయ్యారు. హరీశ్ మాట్లాడుతూ ప్రధాని, ప్రతిపక్ష నేతల వారణాసి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రజలకు కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని చెప్పారు. సౌకర్యాల పరంగా ముందంజలో ఉన్న సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి 1.50 లక్షల మెజారిటీని ఇవ్వగలిగితే.. మిగతా ఆరు నియోజకవర్గాల నుంచి లక్ష చొప్పున మెజార్టీ వచ్చే అవకాశముంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు 5 లక్షల పైచిలుకు మెజార్టీతో రికార్డు స్థాయి విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, ప్రీతమ్‌ముండే, పీవీ నర్సింహారావు, ప్రధాని నరేంద్రమోదీల సరసన కొత్త ప్రభాకర్‌రెడ్డిని చేర్చే విధంగా కృషి చేయాలని హరీశ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి చేరికతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రెండోసారి ఎంపీగా అవకాశం కల్పించాలని, సీఎం కేసీఆర్, హరీశ్‌ల సహకారంతో మెదక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను మాజీ మంత్రి హరీశ్‌పై చేసినవన్నీ రాజకీయ విమర్శలేనని, వ్యక్తిగతమైన ద్వేషాలు లేవని టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండుసార్లు తనను గజ్వేల్ నియోజకవర్గంలో ఓడించడానికి హరీశ్ కంకణం కట్టుకోవడం వల్లే కసితో ఆరోపణలు, విమర్శలు గుప్పించానని అన్నారు. -
కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు
పాపన్నపేట(మెదక్)/మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ .. గల్లీలో లేదు. ఢిల్లీలో లేదు.. అలాంటి పార్టీకి ఓటేస్తే పనికి రాకుండా పోతుంది’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఉన్న రైతు ఆత్మహత్యలు ఇప్పుడున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీలో లీడర్లు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పథకాలను అటు మోదీ.. ఇటు చంద్రబాబు, మరోవైపు మమతా బెనర్జీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే ఉన్నామని, ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తే సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. బీజేపీ పువ్వు వాసన అసలే లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభాకర్ రెడ్డికి నాకన్నా ఒక ఓటు ఎక్కువే రావాలి’
సాక్షి, సిద్దిపేట : ఏప్రిల్ 11న జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలి.. ప్రభాకర్ రెడ్డికి నాకన్నా ఒక ఓటు ఎక్కువే రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యకర్తలను కోరారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డే అని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటకు ఎన్నికలకు కొత్త కాదని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కృషితో సిద్ధిపేట మీదుగా రెండు జాతీయ రహదారులే కాక జిల్లాకు పాస్‌పోర్టు ఆఫీస్, కేంద్రియ విద్యాలయం మంజూరయ్యాయని పేర్కొన్నారు. బుల్లెట్ రైలు వేగంతో జిల్లాలో రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్ పనులకు, భూసేకరణ కొరకు అవసరమయిన రూ.400 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నర్సాపురంలో ఏప్రిల్ 3న జరిగే సీఎం కేసీఆర్ సభకు సిద్ధిపేట నుంచి 20 వేల మంది తరలిరావాలిని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్‌ను నం.1గా నిలుపుతా : కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎంపీగా రెండవ సారి అవకాశం వచ్చిందని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధిపేట ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను రెండో సారి అధికారంలోకి తెచ్చింది సిద్ధిపేట ప్రజలేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభం చేసిన అది సిద్ధిపేట నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. సిద్ధిపేటను హరీశ రావు నెంబర్ వన్‌గా ఎలా చేశారో.. మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అలానే అభివృద్ధి చేసి నంబర్ వన్‌గా నిలుపుతానని ఆయన హామీ ఇచ్చారు -
టీఆర్ఎస్లోకి సీపీఎం నేతలు
సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎఎస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతుండగా తాజాగా సీపీఎం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేశారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అందరం కలిసి పనిచేయడం ద్వారానే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేదల ఎజెండానే మన ఎజెండాగా కలిసి పనిచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో సీపీఎం పార్టీ కనుమరుగు అయ్యింది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని చెప్పారు. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. రాష్టంలో పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. -
హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
-
హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
సాక్షి, మెదక్ : టీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తుప్రాన్ రోడ్ షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనంపై హరీశ్ రావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపేసి వాహనం దిగిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సందర్భంగా.. హరీశ్ రావుకు ప్రమాదం తప్పిన విషయం విదితమే. -
గౌరవాన్ని కాపాడుకుందాం..
సాక్షి, నంగునూరు(సిద్దిపేట): మెదక్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ఉద్యమాల గడ్డ, రికార్డుల అడ్డగా పేరుగాంచిన సిద్దిపేట గౌరవాన్ని కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జిల్లా ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ప్రభాకర్‌రెడ్డితో కలసి నంగునూరు, గజ్వేల్, దౌల్తాబాద్, మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహించారు. నంగునూరు రోడ్‌షోలో పలు గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బోనాలు, డప్పుచప్పుళ్లు, పీర్లతో ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్వీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై పూలవర్షం కురిపించారు. పలువురు నాయకులు గజమాలతో సన్మానించి గద, మెమొం టోను అందజేశారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీ ఇచ్చి తనను దీవించారని అలాగే ప్రభాకర్‌రెడ్డిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించి మెదక్‌ను నంబర్ వన్ స్థానంలో నిలపాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి నియోజకవర్గంలో లక్ష మెజార్టీ తెస్తామని ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారన్నారు. సిద్దిపేటకు పాస్‌పోర్ట్ కేంద్రం, కేంద్రియ విద్యాలయంతోపాటు రోడ్లను మంజూరి చేసిన ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జోడెడ్లలాగ పని చేసి మెదక్‌తో పాటు సిద్దిపేటను అభివృద్ధి చేస్తామన్నారు. హరీశ్ అడుగుజాడల్లో నడుస్తా.. తనను ఎంపీగా గెలిపిస్తే సిద్దిపేటను అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలిపిన హరీశ్‌రావు అడుగుజాడల్లో నడుస్తానని క్తొత ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీర్, హరీశ్‌రావు దయతోనే రెండోసారి లోక్‌సభకు పోటీచేసే అవకాశం వచ్చిందన్నారు. ఎంపీగా గెలవగానే హరీశ్‌రావులా కష్టపడి పని చేస్తానన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామన్నారు. అనంతరం పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరగా హరీశ్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, రాధకిషన్‌శర్మ, లింగంగౌడ్, వెంకట్‌రెడ్డి, మల్లయ్య, రమేశ్‌గౌడ్, మమత, జయపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, పురేందర్, వెంకట్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘మెదక్‌లో గెలిచి కేసీఆర్‌కు గిఫ్టిద్దాం’
సాక్షి, సంగారెడ్డి : మెదక్‌లో గెలిచి ఆ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామంటూ సంగారెడ్డి ఎంపీ అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభాకర్ రెడ్డి శనివారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి రెండవసారి అవకాశం కల్పిచినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి ఓటమిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులు పూర్తవ్వాలంటే.. టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని స్పష్టం చేశారు. సంగారెడ్డికి ఎంఎంటీఎస్ సౌకర్యాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం పూర్తయితే సంగారెడ్డికి పుష్కలంగా నీళ్లు లభిస్తాయని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
సాక్షి, గజ్వేల్: కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, గుంతలమయమైన రోడ్లు, తెర్లుతెర్లైన చెరువుల తప్ప అభివృద్ధి శూన్యమని... మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో బీజేపీకి చెందిన గజ్వేల్ మండల అధ్యక్షుడు విక్రమచారి, పట్టణశాఖ అధ్యక్షుడు బొల్లిబొత్తుల శ్రీను, మర్కూక్ మండల అధ్యక్షుడు చిలుక రాంచంద్రం, వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీమంతుల లక్ష్మణాచారి, ములుగు మండల అధ్యక్షుడు మధులతో పాటు అనంతరావుపల్లి, రిమ్మనగూడ గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా... వారికి పార్టీ కండువాలను కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములమవుతామని బీజేపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అయితే మనకు పోటీ అంటే ప్రతిపక్ష నాయకుల డిపాజిట్ గల్లంతు చేయడమేనన్నారు. కాంగ్రెస్ నాయకులు చెవులకు పువ్వులు పెట్టుకుంటరేమో కానీ... ప్రజల కళ్లకు గంతలు కట్టలేరన్నారు. గజ్వేల్‌లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పట్టుకునే ఆడపడుచుల కళ్లకు గంతలు కట్టి నీళ్లు రావట్లేదని దాయగలుగుతారా... అంటూ ప్రశ్నించారు. గ్రామగ్రామాన మహిళా భవనం, బీటీ రోడ్లు, ఎక్కడ చూసినా హరితహారం కింద పెరుగుతున్న పచ్చని చెట్లు, ప్రతి గ్రామంలో మిషన్ కాకతీయ కింద చెరువు, కుంటల పునర్జీవం పోసుకున్నాయన్నారు. అంతేగాకుండా మరెన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పాండవుల చెరువుపై పెరిగిన సర్కారు తుమ్మలు, మనిషి నడవరాకుండా చేసిన రోడ్డు... కానీ ఇప్పుడు అదే పాండవుల చెరువుపై నిలబడి చూస్తే అభివృద్ధి అంటే ఎంటో అర్థమైతదన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక పరిశ్రమల మూత, రోడ్లు బాగలేక బస్సులు, ఆటోలు బందు, మంచినీళ్ల కోసం ట్యాంకర్ల ముందు మహిళల కొట్లాటలు తప్ప ఇంకేం లేదన్నారు. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నాయకులు కాదా... అన్నారు. ప్రజల్లోకి వెళ్లి... మీ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మీరు చెప్పండి... 2014 నుంచి 2018 దాకా మా నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మేం చేబుతామని పేర్కొన్నారు. ఇక గాంధీభవన్ దగ్గర పరిస్థితి చూస్తే కుర్చీలు విరుగుతున్నయ్.. తలుపులు పగులుతున్నయ్... దిష్టిబొమ్మలు కాలుతున్నయ్... గాంధీభవన్‌ను తగలబెడ్తరో.. పగలగొడ్తరో అని... రక్షణగా పహిల్వాన్లను... బౌన్సర్లను పెట్టుకున్నరు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఇక్కడి బీజేపీ నాయకులు కూడా గజ్వేల్ అభివృద్ధిలో భాగస్వాములమవతామని టీఆర్ఎస్లోకి రావడం అభినందనీయమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఓట్ల కోసం తోడుదొంగల్లా వస్తున్న ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, నాయకులు ఆకుల దేవేందర్, ఊడెం కృష్ణారెడ్డి, ఎన్సీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మాండంగా గెలవబోతున్నాం: హరీశ్‌రావు
జగదేవ్‌పూర్(గజ్వేల్): ‘గజ్వేల్ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్ మాత్రం గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తం గజ్వేల్ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకుపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. గజ్వేల్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. 25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలో అంతా అవినీతే
హత్నూర(సంగారెడ్డి) : కాంగ్రెస్‌లో హయాంలో అంతా అవినీతేనని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్కామ్‌లు చేసి జైలుకు వెళ్ళారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ఆయన రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో దేశానికే ఆదర్శంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన కేసీఆర్‌కి రావడంతోనే రైతుబంధు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్లో ప్రచారం చేస్తామని చెప్పడం కాదు దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతుల సంక్షేమం కోసం పాస్‌పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని తేల్చి చెప్పారు. గత పాలనలో లంచం లేనిదే ప్రజలకు పనులు జరగలేదన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ పాలనలో నిజాయితితో పనిచేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతులకు పెట్టుబడి చెక్కులు ఇస్తుంటే విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 24గంటలు ఉచితకరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ది అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాయకులు హైదరాబాద్‌లోని క్లబుల్లో ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి చేశారని ఎద్దేవా చేశారు. ఆరునెలల క్రితం జైలులో ఉండివచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు సీఎం సీటు కోసం తహతహలాడుతున్నారని వారి కలలు కలలాగే మిగిలిపోతాయన్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చినా టీఆర్ఎస్ను కదిలించలేరని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంపై చెక్‌డ్యాంలు కట్టి ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పన్యాల గ్రామానికి రూ. 20 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శం : కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం చెక్కులను వ్యవసాయ సాగు కోసమె వినియోగిస్తామని రైతులచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులను రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, మండల రైతుసమన్వసమితి కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు అక్బర్, ఎల్లదాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రావు, నీరుడి అశోక్, నరేందర్‌తోపాటు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికా>రులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన మెదక్ ఎంపీ
సిద్దిపేట అర్బన్: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాణీని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని కోరినట్లు ఎంపీ ‘సాక్షి’కి తెలిపారు. సిద్దిపేట పట్టణ శివారులో కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని కూడా సేకరించిన విషయాన్ని కూడా మంత్రికి వివరించినట్లు ఎంపీ చెప్పారు. విద్యారంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చెప్పారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేసినట్లు వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. -
మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం
న్యూఢిల్లీ : మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. లోక్ సభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం నల్లధనంపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు మాత్రం తమ పట్టు వీడలేదు. టీఎంసీ, జేడీయూ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవటంతో గందరగోళం నెలకొంది. -
బాబు కోసమే నిరాహారదీక్షలు
సాక్షి, సంగారెడ్డి: టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు తదితరులు పిచ్చికూతలు కూయడం మానుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే టీడీపీ నేతలు నిరాహారదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వారికి ధైర్యం ఉంటే తెలంగాణను ఇబ్బందులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ, గుంటూరులో దీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దీటుగా ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వలేకనే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ సమస్యలను లేవనెత్తుతామని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ తదితర అంశాలను లేవనెత్తుతామన్నారు. టీడీపీని పాతరవేయటం ఖాయం పక్క రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆ పార్టీకి ప్రజలు పాతర వేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. చంద్రబాబు మెప్పుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రయోజ నాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్షపెట్టిన ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ పేరు ఎయిర్‌పోర్టుకు పెడితే తప్పేమిటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుపెట్టడం సరికాదన్నారు. ఆంధ్ర పాలకులు తమ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులకు తెలంగాణ త్యాగధనుల పేర్లు పెట్టగలరా అని ప్రశ్నించారు. -
ముందు మీ నేతను నిలదీయండి
తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏపీ సీఎం చంద్రబాబే కారణం తెలంగాణ టీడీపీ నేతలపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజం గజ్వేల్: తెలంగాణ టీడీపీ నేతలకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి దక్కాల్సిన విద్యుత్తును దక్కకుండా కుట్రలు పన్నుతున్న ఆంధ్ర సీఎం చంద్రబాబును నిలదీయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో పత్తిపంట ఎండిపోయిన కారణంగా గుండె ఆగి మృతి చెందిన మామిడాల కిష్టయ్య కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం గజ్వేల్ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ లోయర్ సీలేరు ప్రాజెక్టు నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో వాటాను చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ. 8లకు యూనిట్ చొప్పున విద్యుత్తును కొనుగోలు చేసి, వ్యవసాయానికి ఏడు గంటల సరఫరా చేస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన విద్యుత్తు వాటాను సాధించడంలో విఫలమైందన్నారు. ఈ రెండు పార్టీలు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. విద్యుత్ సరఫరా, రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరంలేదన్నారు. రుణమాఫీని వందశాతం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సమావేశంలో గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ ఏలేశ్వరం చిన్నమల్లయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10లోగా రుణమాఫీ పూర్తిచేయాలి వచ్చే నెల 10లోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బ్యాంకర్లను సూచించారు. శనివారం గజ్వేల్‌లోని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయంలో ఓఎస్డీ హన్మంతరావు, నాబార్డు ఏజీఎం రమేశ్‌కుమార్, గజ్వేల్ నియోజకవర్గంలోని బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టనున్న డెయిరీ, కూరగాయల పెంకపం తదితర పథకాలపై ఆయన చర్చించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది జగదేవ్‌పూర్: మండలంలోని నర్సన్నపేట గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కొండయ్య కుటుంబాన్ని శనివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొండయ్య అత్మహత్యకు గల కారణాలను ఆయన భార్యను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ అప్పుల బాధతో అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపొవడంతో రైతు లు ఆధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రుణమాఫీ చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపతి అన్నారు. ప్రతి పక్షాలు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని ప్రతి పక్షాలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుండా రంగారెడ్డి, భూంరెడ్డి, గజ్వేల్ మున్సిపాల్ చైర్మన్ భాస్కర్, జెడ్పీటీసీ రాంచంద్రం, మండలాధ్యక్షుడు యాదవరెడ్డి, సర్పంచ్ జమునాబాయి, సుధాకర్‌రెడ్డి, కరుణకర్, నాయకులు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య, అంజనేయులు, నర్పింలుగౌడ్, తదితరులు ఉన్నారు. -
మెదక్ రైలు మార్గం.. సాధించి తీరుతాం
మెదక్: మెదక్‌కు రైలు మార్గం సాధించి తీరుతామని, ఇది తమకు ప్రతిష్టాత్మకమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మెదక్ పట్టణానికి వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కు, మంత్రికి, ఇద్దరు ఎంపీలకు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. మెదక్ ప్రజల చిరకాల స్వప్నమైన రైలు మార్గాన్ని సాధించితీరుమన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తపల్లి మార్గాలు పూర్తయ్యేందుకు కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ తెస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధి చేసేందుకు సైనికునిలా పనిచేస్తాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ఎంపీకి వారధిగా పనిచేసి మెదక్‌ను కడిగిన ముత్యంలా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యారెడ్డితో పాటు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, దేవేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. -
మెదక్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
-
భారీ మెజార్టీతో గెలుస్తా
హత్నూర: టీఆర్ఎస్ కార్యకర్తల కృషి, నాయకుల పట్టుదలతో పనిచేశారని, అందువల్ల తాను భారీ మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని దౌల్తాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి అధికారంలో ఉన్న పదిహేను సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోడ్లు కూడ ఆధ్వానంగా ఉన్నాయన్నారు. ఇక తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పనున్నట్లు ఆయన తెలిపారు.విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరీ కొత్త ప్రభాకర్ రెడ్డి?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా నిలిచింది. బీజేపీ, టీడీపీల కూటమి, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి కోసం అన్వేషించి చివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు మెదక్ లోకసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఖారారు చేసింది. అయితే అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ను ఓవర్ టేక్ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోని ట్రావెల్స్ అధినేత అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ధనిక రాజకీయవేత్తల్లో ఒకరని చెప్పుకుంటారు. సుమారు వెయి కోట్ల ఆస్తి ఉన్నట్టు పలు పత్రికల్లో, వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. అనూహ్యంగా మెదక్ లోకసభ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు కారణంగా ఆ సీటును తీగల కృష్ణారెడ్డికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డికి 1471 ఓట్లు వచ్చాయి. తాజాగా మెదక్ సీటును దక్కించుకుని ప్రభాకర్ రెడ్డి రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. -
దేవీప్రసాద్‌కు కేసీఆర్ హామీ!
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ సీటుపై ఆశలు పెంచుకున్న ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ కు చుక్కెదురైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత కొద్ది రోజులుగా మెదక్ సీటు టికెట్ రేసులో దేవీ ప్రసాద్ దూసుకుపోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దేవీ ప్రసాద్ కు పోటీగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు తెరమీదకు రావడంతో టికెట్ కేటాయింపు అంశం ఆసక్తిగా మారింది. కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనలో నేపథ్యంలో మెదక్ లోకసభ సీటు అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది. పార్టీ కమిటీ పలు దఫాలుగా నిర్వహించిన చర్చల అనంతరం మెదక్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఖారారు చేశారు. దాంతో ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ నిరాశలో మునిగినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్యే కోటాలో దేవీ ప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ బుజ్జగించినట్టు సమాచారం. -
గులాబీ దళం ఖరారు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఖరారులో టీఆర్ఎస్ తొలి అడుగు వేసింది. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. ఒంటరిగానే బరిలో నిలబడతామని హెచ్చరిస్తూనే కలిసి వచ్చే మిత్రుల కోసం ఖాళీలు ఉంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా 69 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వ్యూహాత్మకంగా మీడియాకు లీక్ చేసింది. జాబితా ప్రకటన తర్వాత ఉత్పన్నమయ్యే రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకే ‘లీకు’ అస్త్రాన్ని వాడినట్లు సమాచారం. దుబ్బాక స్థానంలో సోలిపేట రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి మధ్య నడుస్తున్న వివాదానికి తెరవేస్తూ రామలింగారెడ్డికే గులాబీ దళపతి మరో చాన్స్ ఇచ్చినట్టు సమాచారం. గజ్వేల్ నుంచి కేసీఆర్, సిట్టింగు స్థానమైన సిద్ధిపేట నుంచి తన్నీరు హరీశ్వర్‌రావు, ఆందోల్‌లో బాబూమోహన్, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లను ఖరారు అయినట్లు మీడియాకు లీక్ అయింది. జహీరాబాద్, నర్సాపూర్ , నారాయణఖేడ్ స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే నేడు లేదా రేపు అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సోలిపేటకు మరో చాన్స్... అసెంబ్లీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై అనేక ఊహాగానాలున్నాయి. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డితోపాటు కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్లు వినిపించాయి. సోలిపేట ఉద్యమంలో ముందు నడిస్తే.. కొత్త ప్రభాకర్ వెనుకుండి పార్టీని నడిపించారనే ప్రచారం ఉంది. పార్టీకి ఆయన ఆర్థికంగా సహకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్‌కే టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే రామలింగారెడ్డి మాత్రం టికెట్ ఆలోచన లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఎట్టకేలకు సోలిపేటకు గులాబీ బాస్ మరో చాన్స్ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంపై కూడా తొలుత వివాదం నడిచింది. హరీష్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి చింతా ప్రభాకర్ పేరు ప్రకటించడంతో ఈ వివాదం ముగిసిపోయింది. ఆయన చెప్పినట్లుగానే తొలి జాబితాలోనే చింతా ప్రభాకర్ పేరు ఖరారు చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డికి పటాన్చెరు, బాబూమోహన్‌కు అందోల్ టికెట్లను కేటాయించారు. ఖాళీలు పొత్తుల కోసమేనా...! ఇక నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలను వ్యూహాత్మకంగానే ఖాళీ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీకి బలమైన అభ్యర్థి దొరక్క ఖాళీలు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నా... చివరి నిమిషంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే సమస్య తలెత్తకుండా సీట్లు సర్దుబాబు చేసేందుకు ఖాళీలు పెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ పైమూడు సీట్లతో పాటు పటాన్చెరు, ఆందోల్, సంగారెడ్డి స్థానాలను కోరే అవకాశం ఉంది.