ఎవరీ కొత్త ప్రభాకర్ రెడ్డి?
ఎవరీ కొత్త ప్రభాకర్ రెడ్డి?
Published Tue, Aug 26 2014 7:09 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా నిలిచింది. బీజేపీ, టీడీపీల కూటమి, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి కోసం అన్వేషించి చివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు మెదక్ లోకసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఖారారు చేసింది. అయితే అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ను ఓవర్ టేక్ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోని ట్రావెల్స్ అధినేత అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ధనిక రాజకీయవేత్తల్లో ఒకరని చెప్పుకుంటారు. సుమారు వెయి కోట్ల ఆస్తి ఉన్నట్టు పలు పత్రికల్లో, వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. అనూహ్యంగా మెదక్ లోకసభ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు కారణంగా ఆ సీటును తీగల కృష్ణారెడ్డికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డికి 1471 ఓట్లు వచ్చాయి. తాజాగా మెదక్ సీటును దక్కించుకుని ప్రభాకర్ రెడ్డి రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
Advertisement
Advertisement