Maheshwaram
-
మహేశ్వరంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
-
బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నాయి. మరోవైపు పలు పార్టీల్లోని అసంతృప్తి వాదులు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కదని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే పార్టీలు జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగులుతున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారు. ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో తీగల కృష్ణారెడ్డి, అనితా రెడ్డిలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. చదవండి: మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి టీడీపీ నుంచి ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్లో (ఇప్పటి బీఆర్ఎస్) చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. అయితే సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని ఎప్పుడో హెచ్చరించినా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడం, సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్నారు. దీంతో అప్పట్లోనే ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో.. అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి: సీఎం కేసీఆర్
-
మహేశ్వరంలో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
-
మహేశ్వరం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
-
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్‌లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
ఫలించిన పరి‘శ్రమ’
మహేశ్వరం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో ఎలక్ట్రానిక్ పార్కులో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిం దని చెప్పారు. ‘ఇక్కడ 90 శాతం మంది స్థానికు లకు ఉపాధి కల్పిస్తాం. అందులో 15 శాతం మహిళలకు కేటాయిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్–ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చాం. 16 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాం. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అభినందనీయం’అని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కేటీఆర్ కొనియాడారు. ప్రేమ్‌జీ కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 కోట్లు, టీకా కోసం రూ.12 కోట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరో రూ.44 కోట్లు ఇచ్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విప్రో సీఈఓ వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు: సబితా మహేశ్వరం, రావిర్యాల, తుమ్మలూరు గేటు ప్రాం తాల్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్, ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాం తం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ వైపు చూసినప్పుడు.. హైదరాబాద్ నగరం వారికి కనిపిస్తోందని చెప్పారు. హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ కంపెనీని సందర్శించి కంపెనీలో తయారైన వస్తువుల తయారీని పరిశీలించి, అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు. జీనోమ్ వ్యాలీలో ‘జాంప్ ఫార్మా’ మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జీనోమ్ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్ ఫార్మాను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీని మరింత విస్తృత పరిచేలా మరో 400ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా మాట్లాడుతూ కెనడా తర్వాత జీనోమ్ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విప్రో కన్జ్యూమర్ కేర్‌ను ప్రారంభిస్తున్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, మంత్రులు కేటీఆర్, సబిత -
ప్రేమించిన యువతితో విభేదాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయితో విభేదాలు రావడంతో తేజావత్ రాజు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగం చెరువు తండాలో కుటుంబ సభ్యులతో కలిసి నివసించేవాడు. రాజుకు బంధువుల అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడిచినట్టు సమాచారం. అయితే, వీరి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన రాజు నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం రాజు తన గదిలో విగతజీవిగా పడిఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజు మృత దేహన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లయిన తొమ్మిది నెలలకే.. కన్నవారింట్లోనే..) -
భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!
సాక్షి, రంగారెడ్డి: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను ఉరేసి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మహేశ్వరం మండల పరి ధిలోని మాణిక్యమ్మగూడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండలం చిప్పలపల్లికి చెందిన అల్వాల నర్సింహకు మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ (30)తో 2005లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే నర్సింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు. దంపతులిద్దరూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నర్సింహ మేస్త్రి, డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం భార్య ఫోన్‌కు గుర్తు తెలియని కాల్ రావడాన్ని గమనించిన నర్సింహ.. అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్‌తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. చదవండి: హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. ఏమీ ఎరగనట్లు చుట్టుపక్కల వారికి తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతురాలి తల్లికి అనుమానం వచ్చి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. తమదైనశైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు నర్సింహ నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. చదవండి: అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య -
ఆరోరోజు వైఎస్ షర్మిల పాదయాత్ర
-
ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..
సాక్షి, మహేశ్వరం: నిశ్చితార్థం రద్దు కావడంతో ఓ యువతి ఉరివేసుకొని తనువు చాలించింది. రెండు కుటుంబాలు పట్టింపులకు వెళ్లడంతో మనస్తాపానికి గురైంది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహేశ్వరం సీఐ మధుసూదన్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కూతురు ప్రగతి(19) డిగ్రీ వరకు చదువుకుంది. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామానికి చెందిన కార్తీక్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబపెద్దలు పట్టింపులకు పోవడంతో ఆదివారం దానిని రద్దు చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ప్రగతి, కార్తీక్‌కు ఇష్టం ఉన్నా నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో చీరతో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6 గంటలకు ప్రగతిని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి ..వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రగతి ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హైదరాబాద్‌లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..) -
నేడు కేసీ తండాకు గవర్నర్.. గిరిజనులతో కలిసి రెండో డోస్
సాక్షి, మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోనున్నారు. వ్యాక్సిన్ పట్ల గిరిజనుల్లో ఉన్న అపోహాలు తొలగించేందుకే గిరిజనులతో కలిసి గవర్నర్ టీకా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆమె తన మొదటి డోస్‌ను పుదుచ్చేరి ప్రభుత్వాస్పత్రిలో తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేసీ తండాకు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొంటారని ఎంపీపీ కొరుపోలు రఘుమారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.. గవర్నర్ పర్యటనకు సంబంధించి కేసీ తండా, శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో ఏర్పాట్లను ఆదివారం అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ దిలీప్‌కుమార్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్షి్మ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ నీరజ, తహసీల్దార్ ఆర్పి. జ్యోతి తదితరులు ఉన్నారు. కేసీ తండాలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ -
డంబెల్స్ మీద పడి యువకుడు మృతి
యాచారం: వ్యాయామం చేస్తుండగా డంబెల్స్ మీదపడి యువకుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫిరోజ్(19) స్థానికంగా ఎస్ఆర్ హేచరీస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతడి నిత్యం ఉదయం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో, రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తూ డంబెల్స్ మీదపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా -
ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ
-
మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత
సాక్షి, రంగారెడ్డి : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిరావడంతో కుమారుడు కార్తిక్‌రెడ్డి ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమెను డిశ్చార్జి చేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న సబిత గురువారం రాత్రి 10.58 గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో తదితర గుండె సంబంధమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అన్ని రిపోర్టులు కూడా నార్మల్ ఉన్నాయని, ఆందోళన అక్కర్లేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో సబితను పలువురు మంత్రులు పరామర్శించారు. -
అడవిలోని అనుభూతి కలిగించే జంగల్ క్యాంపు
మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మజీద్‌గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను ఇంద్రకరణ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగల్ క్యాంపు ప్రత్యేకతలు ఫైర్ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్ జోన్, జంగల్ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్ సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్నిక్ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్ ఏరియా చుట్టూ చైన్‌లింక్డ్ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. నగరవాసులకు వరం హైదరాబాద్ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీష్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డివిజనల్ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్ ఫారెస్టు రేంజ్ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు. -
అడవుల సంరక్షణకు కృషి
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మజీద్‌గడ్డ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. నగరానికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్టు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అర్బన్ ఫారెస్టు పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో 60 పార్కులు, ఇతర పట్టణాల్లో 34 పార్కులను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!
అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు. ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు. ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు. ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సాక్షి, మహేశ్వరం: కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నా యి. తాజాగా ఓ దుర్మార్గుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సోమవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా పొరుగింటికి చెందిన మోడి చందు(21) ఆమె వద్దకు వచ్చాడు. మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశాడు. అనంతరం అతడు ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా బాలిక తల్లి గమనించి యువకుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. కూతురిని పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అదే రోజు రాత్రి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్ననాయక్ తెలిపారు. -
ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్
సాక్షి, మహేశ్వరం: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగామారి దసరా పండుగకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చి గౌరవిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్హాల్లో ఆమె జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ హరీష్‌తో కలిసి ప్రభుత్వం అందజేసిన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. దసరా పండుగను ఆనందంగా జరుపుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కు బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తీరోక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారని తెలియజేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి 3 లక్షల బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుందన్నారు. జిల్లాలో 6,65, 686 చీరలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేనేత కార్మికులకు అన్నివిధాలుగా ప్రోత్సహించి, వారికి ఉపాధి ఆవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహిళా సంక్షేమం కోసం కృషి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చొరవ చూపలేదని విమర్శించారు. మహిళలందరికీ దసరా కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 100 రకాలు, పది రంగుల చీరలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ఇన్ చార్జి కలెక్టర్ హరిష్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణలో మహిళలు వైభవంగా నిర్వహించే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రభుత్వం 100 రకాలు, 10 రంగుల్లో బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు వివరించారు. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తామన్నారు. అంతకు ముందు అతిథలు జ్యోతి ప్రజ్వళన చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రశాంత్‌కుమార్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితానాయక్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కూన యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, మహిళా సమాఖ్య ఏపీఎం సత్యనారాయణ, మహేశ్వరం సర్పంచ్ ప్రియంక ఉన్నారు. బాగా చదువుకుంటున్నారా..? మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగుల్దోని తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకు ముందు ఆమె టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు గణితం బోధించారు. వారితో ఎక్కాలు చెప్పించారు. బాగా చదువుకుంటున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యంశాల్లోని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యాశాఖ మంత్రి అయిన సబితారెడ్డి టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సర్పంచ్‌కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతానాయక్, ఎంపీడీఓ నర్సింహ, ఎంఈఓ కృష్ణ, సర్పంచ్ మెగావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ జగన్ ఉన్నారు. -
త్వరలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం: రేవంత్‌రెడ్డి
సాక్షి, మహేశ్వరం: త్వరలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతోందని, కార్యకర్తలెవ్వరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వన్నాడ మనోహర్‌గౌడ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 2023లో కేంద్రం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికి టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని వాపును చూసి బలుపు అనుకునే అనేవిధంగా హైప్ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తామని, నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చాకలి యాదయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల రఘుపతి, పార్టీ నాయకులు ప్రసాద్, ఈశ్వర్,శ్రీరాములు , అనిల్‌కుమార్, భాస్కర్, రాజు, చంద్రమోహన్, రమేష్, ఆనంద్, ,బాలు పలువురు పాల్గొన్నారు. -
రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు
సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. -
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి..!
టోరంటో/మహేశ్వరం : కెనడాలో ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు విడిచాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖల్‌కు చెందిన బుస్సు జగన్మోహన్ రెడ్డి(29)గా తెలిసింది. కెనడాలోని టోరంటోలో ఓ సరస్సులో పడి అతను మృతిచెందినట్టు సమాచారం అందింది. 2012లో హైదరాబాద్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి అతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. పూరి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైద్యురాలిగా.. ప్రజా ప్రతినిధిగా..
సాక్షి, మహేశ్వరం: ప్రజా ప్రతినిధిగా, వైద్యురాలిగా సేవలు అందిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి. వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆర్ట్’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు (జూలై 1న) ‘డాక్టర్స్ డే’ సందర్భంగా అనితారెడ్డిపై ప్రత్యేక కథనం. కర్ణాటకలో వైద్య విద్య పూర్తిచేసిన తీగల అనితారెడ్డి కొంత కాలం నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దక్కన్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లు మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2010లో ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్ ఐకాన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించారు. వైద్య సేవ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని 2016లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి చెందినా నిరుత్సాహ పడకుండా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనా తన ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్ట్(అనితారెడ్డి తీగల) ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేశారు. ఇవే కాకుండా ఉమెన్ ఇంప్రూవ్మెంట్ శిబిరం, స్వచ్ఛ భారత్, మొక్కల నాటడం తదితర స్వచ్ఛ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్నా వైద్య వృత్తిని వీడనని, ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటానని అనితారెడ్డి చెబుతున్నారు. -
గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే.. అదే జిల్లాకు చెందిన నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కార్తీక్ రాజకీయ భవిష్యత్తుతో పాటు సబితకు మంత్రివర్గంలో స్థానంపై కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. దీంతో సోమవారం అనుచరులతో సమావేశం కానున్న సబిత త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. పలు ప్రతిపాదనలపై చర్చ ఒవైసీ నివాసంలో కేటీఆర్‌తో జరిగిన భేటీలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై టీఆర్ఎస్ నుంచి సంపూర్ణ హామీ లభించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సబిత.. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించే విధంగా సానుకూల చర్చలు వీరి మధ్య జరిగినట్టు సమాచారం. సబితకు మంత్రిపదవి ఇవ్వడం పట్ల కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారని కేటీఆర్ సంకేతాలిచ్చారని సమాచారం. అయితే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్సీనా, ఎంపీనా అన్న విషయంలో మాజీ మంత్రి, సబిత సన్నిహిత బంధువు పట్నం మహేందర్‌రెడ్డితో కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం. అవసరమైతే సబిత చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. అదే అనివార్యమైతే మహేశ్వరం ఎమ్మెల్యేగా కార్తీక్ ఉంటారని, ఈ మేరకు కూడా భేటీలో చర్చలు జరిగాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో అసంతృప్తి టీపీసీసీ నాయకత్వం పట్ల సబిత చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో సంప్రదించకుండానే.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్నారు. తన కుమారుడి కోసం అడిగిన రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని పొత్తు పేరుతో టీడీపీకి ఇచ్చి చేజేతులా అక్కడ ఓటమి పాలయ్యామనే భావనలో ఆమె ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు లేకపోవడంతో సబితలో అసంతృప్తి మరింత పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగం లేదని, రాజకీయంగా తనకు భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని.. ఆమె కొంత కాలంగా సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. అసద్‌తో భేటీ అనంతరం కవిత నివాసానికి వెళ్లిన సబిత దాదాపు గంటపాటు భేటీ అయినట్టు సమాచారం. ఫలించని బుజ్జగింపు యత్నాలు తాజా పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ప్రముఖుల సబితను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు సబిత నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఈ బుజ్జగింపులు ఫలించలేదని తెలిసింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ.. ఆదివారం ఒక్క రోజే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో.. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీరి బాటలోనే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక గిరిజన ఎమ్మెల్యేతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరొకరు ఉన్నారని, వారు బుధవారం లోపు నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో వీరి సంప్రదింపులు పూర్తయ్యాయని, నేడో, రేపో లేఖలు కూడా వస్తాయంటున్నారు. వీరి తర్వాత మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్‌లు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. పార్టీలో సీతక్క ఒక్కరే ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మిగలనున్నారు. -
రాజకీయాలలో చాలావరకు పరిస్థితులు మారాయి
-
సబితా ఇంద్రారెడ్డి - లీడర్‌తో ఒకరోజు
-
ఆమె రాష్ట్రానికి హోం మినిస్టర్
భర్త ఆకస్మిక మరణం ఆమెను ఊహించని దారిలోకి నెట్టింది. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన యువ నాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య సబిత రాజకీయాల్లోకి రావలసి వచ్చింది. నలుగురిని పలకరిస్తూ అప్పటివరకు ఒక గృహిణిగా ఎంతగానో ఆదరణ పొందిన ఆమెకు ఇంద్రారెడ్డి మరణంతో కోలుకోలేని దెబ్బతగిలింది. గృహిణి పాత్ర నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె అసలు రాణిస్తారా? అన్న సందేహం ఆరోజుల్లో చాలా మందికే వచ్చింది. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి మరణించడంతో చేవెళ్ల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గం ప్రజలతో మమేకమయ్యారు. ఆ తర్వాత 2004 లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి హయాంలో తొలిసారి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అవకాశంతో ఆమె ఏకంగా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో భర్త ఇంద్రారెడ్డి హోం శాఖ నిర్వహించగా, వైఎస్ హయాంలో సబిత సైతం హోం శాఖ నిర్వహించడం విశేషం. 2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో 2009 లో ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతమైన తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ఒక చెల్లిగా సబితపైన చూపిన అభిమానంతో వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా చెల్లెమ్మె చేవెళ్ల నుంచి ప్రారంభించడం కూడా సబిత రాజకీయ కీర్తి మరింత పెరిగింది. ఈ కారణంగానే ఆమెకు చేవెళ్ల చెల్లెమ్మగా కూడా పేరొచ్చింది. 2014 ఓటమిని చవిచూసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి మహేశ్వరం నుంచి మళ్లీ బరిలో నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ నేపథ్యం : భర్త : పి. ఇంద్రారెడ్డి (1954 - 2000) పుట్టిన తేదీ : 5 మే 1963 కుటుంబం : ముగ్గురు కుమారులు స్వస్థలం : కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల జిల్లా నేపథ్యం : ఎన్టీ రామారవు కేబినేట్లో మంత్రిగా పని చేసిన ఇంద్రారెడ్డిని సబిత వివాహమాడారు విద్య : బీఎస్సీ రాజకీయ జీవితం : - 2000 చేవెళ్ల ఉపఎన్నిక విజయం సాధించి రాజకీయ రంగ ప్రవేశం - 2004 నుంచి 2009 చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా - 2009 నుంచి 2014 మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా - పి సృజన్ రావు (ఎస్ ఎస్ జె) -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త సప్పిడి దశరథ అక్కడికక్కడే మృతిచెందగా..భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందింది. మృతులు తుక్కుగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మహేశ్వరం: మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని గొల్లూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... హైదరాబాద్ నింబోలిఅడ్డాకు చెందిన విజయ్‌కుమార్, లాల్ దర్వాజాకు చెందిన చలేందర్లు మామిడి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. మండల పరిధిలోని మాణిక్యమ్మగూడలో రైతు వద్ద మామిడి తోటను లీజుకు తీసుకొని పండ్లను ఆటోలో నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మంగళవారం మధ్యాహ్నం గొల్లూరు నుండి మాణిక్యమ్మగూడ గ్రామం వెళ్లే క్రమంలో గొల్లూరు సమీపంలో మూలమలుపు వద్ద ఆటోను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ విజయ్‌కుమార్, పక్కన కూర్చున్న చలేందర్లకు గాయాలయ్యాయి. విజయ్‌కుమార్‌పై ఆటో ఒరగడంతో ఆటో బాడీకి ఉన్న ఇనుప రాడ్ చేతి, వీపులోకి దిగింది. స్థానికులు గమనించి ఆటోకున్న ఇనుపరాడ్‌ను కత్తిరించి గాయాలపాలైన ఇద్దర్నీ శంషాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆటోను అతివేగంగా మూలమలుపు వద్ద నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు ప్రమాదం జరిగిందని ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. కంటెయినర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్ కొత్తూరు: ముందు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్ ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులో వెంకటేశ్వర హ్యాచరీస్ ఎదురుగా జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రింగ్ డబ్బాలతో తిమ్మాపూర్ నుండి కొత్తూరు వైపునకు వెళ్తున్న టాటా ఏస్ ఆటో అదే రూట్లో ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముజీబ్ స్వల్పంగా, క్యాబిన్లో ఉన్న మరో వ్యక్తి (కరీముల్లా)తీవ్రంగా గాయపడగా వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. కాగా కరీముల్లా మృతిచెందాడు. వారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీసీఎం, కారు ఢీ.. ఒకరి మృతి
మహేశ్వరం: ముందు వెళ్తున్న డీసీఎం వాహానాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇం జినీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తుక్కుగూడ ఔ టర్ రింగ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం చో టు చేసుకుంది. పహాడీషరీఫ్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ప్రా ంతానికి చెందిన కిరణ్(35) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మైసిగండిలో ఓ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు తన సాంత్రో కారులో భార్య, బంధువులతో కలిసి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తుక్కుగూడ ఔటర్‌పై ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య అనురాధ, బంధువు జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఔటర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తర లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటకి తీస్తున్న దృశ్యం -
ఓ కొడుకా..
♦ ఆర్టీసీ బస్సు, కారు ఢీ... ముగ్గురు దుర్మరణం ♦ మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు ♦ శ్రీశైలం రహదారిపై మొహబ్బత్‌నగర్ గేటు వద్ద ప్రమాదం కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కుర్మిద్దకు వెళ్లి తల్లిని చూసి వస్తుండగా దారుణం మహేశ్వరం మండలం మొహబ్బత్ గేటు వద్ద ఘటన అయ్యో కొడుకుల్లారా.. ఎంత ఘోరం జరిగింది.. ఈ కన్నతల్లిని చూడాలని వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా.. అంటూ ఆ తల్లి రోదన అందరినీ కలిచివేసింది. కన్నబిడ్డల మృతదేహాలను చూసిన ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి తరమూ కాలేదు. మహేశ్వరం: ఆర్టీసీ– బస్సు మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీశైలం రహదారిపై మెహబ్బత్‌నగర్ గేటు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాలోజు చంద్రమౌళి(52), పాలోజు బ్రహ్మచారి(48) పాలోజు శ్వేతæ(20)లు మారుతీ కారులో హైదరాబాద్ నుండి స్వస్థలమైన యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి తల్లిని చూడటానికి వెళ్లారు. తల్లి రామేశ్వరమ్మని చూసి మధ్యాహ్నం 3 గంటలకు కుర్మిద్ద నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీశైలం రహదారిపైన మొహబ్బత్‌నగర్ గేటు వద్దకు రాగానే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కందుకూరు నుండి హైదరాబాద్ వస్తున్న మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి మృతదేహాలను బయటకు తీశారు. ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ధి.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాది మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకు మహేశ్వరం సీఐ కొరని సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నా రు. వర్షం కురుస్తుండటంతో రోడ్డుపైన వాహనాలు కనబడక రెండు వాహనాలు ఢీకొన్నట్టు భావిస్తున్నారు. అయితే, బస్సు డ్రైవర్ అతివేగంగా నడిపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోరున విలపించిన మృతుల తల్లి.. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు నగరంలో నివాసం ఉంటున్నారు. అన్న పాలోజు చంద్రమౌళి రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివాసం ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. తమ్ముడు బ్రహ్మచారి పాతబస్తీ ఉప్పుగూడలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అన్న యాదయ్య కూతురు శ్వేత నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లి రామేశ్వరమ్మ కొడుకులు, మనుమరాలు మృతదేహాలను చూసి కన్నీటి పర్వంతమయ్యారు. తనను చూడడానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా బిడ్డ్డల్లారా అంటూ బోరున విలపించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వారి స్వస్థలమైన కుర్మిద్దలో విషాదం నెలకొంది. ప్రమాద స్థలాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కుర్మిద్దలో విషాదఛాయలు యాచారం(ఇబ్రహీంపట్నం): ఇంటి నుంచి బయల్దేరిన గంట సేపటికే తన ఇద్దరు తమ్ముళ్లతోపాటు కూతురి మరణవార్త తెలుసుకున్న యాదయ్య చారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్వగ్రామం కుర్మిద్దలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు పొలోజ్ యాదయ్య చారి తమ్ముళ్లయిన చంద్రమౌళి, బ్రహ్మచారిలు మంగళవారం మధ్యాహ్నం నగరం నుంచి స్వగ్రామానికి వచ్చారు. అన్నా, వదిన, తమ తల్లిని పలకరించారు. వారితోపాటు అన్న కుమార్తె శ్వేతను కూడా వెంటబెట్టుకుని కారులో బయల్దేరారు. ఇంతలో ఆర్టీసీ బస్సు రూపంలో ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. అన్నదమ్ములిద్దరూ తమ అన్న యాదయ్యచారి, వదిన సుగుణలను శ్రీశైలం దేవస్థానానికి తమతో పాటు రమ్మని పిలవడానికే వచ్చారని.. బుధవారం అందరం కలిసి దైవ దర్శనానికి వెళ్దామని పిలవగా.. వారు కుదరదని చెప్పడంతో వారి కుమార్తెను తమతో తీసుకెళ్లారని చెబుతున్నారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ..ముగ్గురి మృతి
మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా): మహేశ్వరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, మారుతీ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన మహేశ్వరం మండలం మొహబ్బత్‌నగర్ గేట్ వద్ద శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. ఎంజీబీఎస్ నుంచి ఆకుల మైలారం వైపు వెళ్తున్న ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా కందుకూరు నుంచి వస్తున్న మారుతి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బ్రహ్మచారి(55), చంద్రమౌళి(50), స్నేహ(40) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బీభత్సం
►ఆగిఉన్న వారిపైకి దూసుకొచ్చిన వాహనం ►ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మహేశ్వరం: రోడ్డుపై అగి ఉన్న వారిపైకి కారు దూసుకు రావడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం శ్రీశైలం ప్రధాన రహదారిపైనున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు పంచాయతీ రాచులూర్ గేటు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన కొందరు పార్చునర్ కారులో శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. కారు రాచులూరు గేటు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌కు చెందిన ప్రతాప్‌పైకి దూసుకు వచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి ముందు అదే కారు పక్కనే బైక్‌పై ఆగి ఉన్న యాచారం మండలం కుర్మిద్దకు చెందిన అనెమోని కృష్ణను ఢీకొట్టింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. అనంతరం కారు పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన కృష్ణను బాలపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దుర్మరణం చెందిన ప్రతాప్ మంఖాల్ పారిశ్రామికవాడలో పని చేయడానికి వారం రోజుల క్రితం రాయిచూర్ నుండి వచ్చాడు. గాయాలైన మరో వ్యక్తి తుమ్మలూరు గ్రామంలో ఉన్న అత్తగారింటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గుంటూరుకు చెందిన డ్రైవర్ రతన్‌బాబును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు.. పోరు!
గులాబీలో ఆధిపత్య పంచాయితీ ► సభ్యత్వ నమోదులో రచ్చకెక్కుతున్న విభేదాలు ► పాత, కొత్త నేతల మధ్య అంతరం ► మహేశ్వరంలో భౌతికదాడులకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీలో ఆధిపత్య పోరు మొదలైంది. పాత, కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య, సఖ్యతతో పార్టీ పరువు రచ్చకెక్కుతోంది. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అసమ్మతి రాజకీయాలకు వేదికగా మారింది. మొన్న జిల్లా పరిషత్ మొదలు.. నిన్న ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమన్ గల్లో బయటపడిన విభేదాలు తాజాగా మహేశ్వరంలో వైరివర్గాల భౌతికదాడులతో తారస్థాయికి చేరాయి. సంస్థాగతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘ విరామం అనంతరం అధికారపార్టీ సభ్యత్వ నమోదు పేరిట ప్రజల్లోకి వెళుతోంది. ఇదే అదనుగా ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కాస్తా ఒక్కసారి పెల్లుబికుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత, కొత్త నేతల మధ్య స్పష్టమైన విభజనరేఖ వచ్చింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించింది. దీనికితోడు ఇటీవల నామినేటెడ్ పదవుల పంపకంలోనూ కొత్తవారికే ప్రాధాన్యం ఇస్తుండడం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి కోపం తెప్పిస్తోంది. ఉద్యమకాలంలో వెన్నంటి నిలిచినవారిని కాదని ఎన్నికలఅనంతరం పార్టీ తీర్థం పుచ్చుకున్నవారి మాట చెల్లుబాటు అవుతుండడం.. ఆఖరికి సభ్యత్వ నమోదు పుస్తకాలను ఎమ్మెల్యేలకే ఇస్తుండడం పార్టీని అంటిపెట్టుకున్న పాతతరం నాయకులకు మింగుడు పడడంలేదు. ఈ పరిణామాలు అధికారపార్టీలో ముసలానికి దారితీస్తున్నాయి. మొన్న జిల్లా పరిషత్‌లో జెడ్పీటీసీ సభ్యులు ఏకంగా మంత్రి మహేందర్‌రెడ్డిపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. రాజీనామాస్త్రాలు సంధించడం ద్వారా అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు. నయానో భయానో వారిని బుజ్జగించి దారిలో పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం టీఆర్ఎస్లో అంతర్యుద్ధానికి అద్దంపడుతున్నాయి. లుకలుకలకు కారణం ఇదే! 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచినవారిని పార్టీలో చేర్చుకోవడంతో గులాబీలో అసమ్మతి రాజకీయాలకు బీజం పడింది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు ‘కారె’క్కడంతో పార్టీలో విభేదాలకు కారణమైంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎల్బీనగర్, షాద్‌నగర్‌లోనూ అంతర్గతపోరు ఉన్నప్పటికీ, బహిర్గతం కాకపోవడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు కాస్తా సజావుగానే సాగుతున్నాయని అనుకోవచ్చు. పట్నంలో రెండు శిబిరాలు! ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్లో అంతర్యుద్ధం వీధికెక్కింది. మూడు గ్రూపులు.. ఆరు కీచులాటలతో పార్టీ ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కంచర్ల శేఖర్‌రెడ్డితో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. దీనికితోడు ఈసీ శేఖర్‌గౌడ్, ఎంపీపీ నిరంజన్ రెడ్డి తదితరులు కూడా మంచిరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శేఖర్‌రెడ్డితో జతకట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో హైకమాండ్ జోక్యం చేసుకున్నప్పటికీ గాడిలో పడ్డట్లు కనిపించడంలేదు. కల్వకుర్తిలో వేరుకుంపట్లు అసమ్మతి రాజకీయాల్లో కల్వకుర్తి తనదైన ముద్ర వేస్తోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వర్గీయులు బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న మాడ్గులలో జరిగిన ఓ కార్యక్రమంలోనే రెండు వర్గాలు కలియబడగా.. తాజాగా తలకొండపల్లి, ఆమన్ గల్ మండలాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మందా, జైపాల్‌యాదవ్ సమక్షంలో కసిరెడ్డి వైఖరిని తూర్పారబట్టడం ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ ఓటమికి కారణమైన నేతలను అందలం ఎక్కించడం.. కాంగ్రెస్ సర్పంచ్‌లకు నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తూ కసిరెడ్డిని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మండలి సమావేశాల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతూ మందా, జైపాల్‌యాదవ్ మాట్లాడడం పట్ల ఎమ్మెల్సీ వర్గీయులు మండిపడుతున్నారు. అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతుంటే ఓర్వలేకనే ఈ కార్యకర్తల్లో ఆగాధం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చేవెళ్లలోను సేమ్ సీన్ చేవెళ్ల నియోజకవర్గంలోనూ అధికారపార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యే రత్నం.. ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. తనను ఓడించిన యాదయ్యను పార్టీలో చేర్చుకోవడంతో నిరాశకు గురైన రత్నం.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు పార్టీ ఫిరాయించిన యాదయ్య వర్గీయులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తన అనుచరులకు వెన్నుపోటు పొడుస్తున్నారని రత్నం మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం చేవెళ్లలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి సైతం ఆయన గైర్హాజరవడం.. సీనియర్లు ముఖం చాటేయడం చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత అంతరం పెరుగుతుందని చెప్పవచ్చు. మహేశ్వరంలో డిష్యుం.. డిష్యుం మహేశ్వరంలో గులాబీ రాజకీయం ఠాణాకెక్కింది. పాత, కొత్త నేతల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరి.. అది కూడా భౌతికదాడులకు దారితీసింది. పార్టీకి మొదట్నుంచి సేవలందిస్తున్న కప్పాటి పాండురంగారెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన కొత్త మనోహర్‌రెడ్డిలతో ప్రస్తుత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో అభిప్రాయబేధాలున్నాయి. టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరిన తీగల.. తన అనుచరులకే పెద్దపీట వేశారు. తనను అనుసరించిన నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఇది సోమవారం మహేశ్వరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డిషు్యం.. డిషు్యంకు తెరలేపింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని కప్పాటి ప్రశ్నించిన పాపానికి ఆయన మద్దతుదారులపై భౌతికదాడి జరిగింది. దీంతో సమావేశం కాస్తా రసబాసగా ముగిసింది. తన రాకతోనే పార్టీ బలోపేతమైందని.. కబడ్దార్! అంటూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వైరివర్గానికి సవాల్ విసరడం.. ఆ తర్వాత ఈ వివాదం కాస్తా పోలీస్‌స్టేషన్ కు చేరడం చర్చనీయాంశంగా మారింది. -
ఇస్తారా.. చస్తారా?
తలపై తుపాకులు.. మెడపై కత్తులు పెట్టి బెదిరింపు మహేశ్వరం: ‘ఈ భూమిపై భాయ్‌సాబ్ కన్నుపడింది. మర్యాదగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి. భూమి ఇస్తారా.. చస్తారా? అనేది మీరే తేల్చుకోండి’ అని గ్యాంగ్‌స్టర్ నయూమ్ అనుచరులు కొంతమంది రైతులను హెచ్చరించారు. కిడ్నాప్ చేసి తలపై తుపాకులు, మెడపై కత్తులు పెట్టి బెదిరించారు. ఏకంగా 33 ఎకరాల 04 గుంటల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రైతులు.. నయీమ్ అనుచరులు తమ భూములు స్వాధీనం చేసుకున్న విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని వారు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రామిరెడ్డి, పాపిరెడ్డి, అంజన్ రెడ్డి, అమరావతి, జైపాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు ఆరుగురు అన్నదమ్ములు. వీరి పెద్దమ్మ అనంతమ్మలకు శ్రీనగర్ గ్రామం శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే సర్వే నెంబర్ 242లో నాలుగెకరాల 37 గుంటలు, 243-2లో 2 ఎకరాల 25 గుంటలు, 244-2లో 5 ఎకరాల 23 గుంటలు, ఇమాంగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 54లో 11 ఎకరాల 25 గుంటలు, 218లో 8 ఎకరాల 14 గుంటలతో కలిపి సుమారు 33 ఎకరాల 04 గుంటల భూమి తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చారు. 2005 డిసెంబర్లో నయీమ్ అనుచరుడు శ్రీధర్ అలియాస్ శ్రీకాంత్ సహా మరి కొంతమంది పొలం వద్దకు వచ్చి ‘పొలంపై భాయ్‌సాబ్ కన్ను పడింది. ఈ పొలాన్ని వదిలి వెళ్లి తమకు అప్పగించడని బెదిరించారు. నయీమ్ అనుచరులు శ్రీధర్, సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్‌లు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీనగర్ రైతుల ఇంటి వద్దకు వచ్చి 20 మంది పట్టాదారు రైతులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. గన్లు పిస్టళ్లు, మెడపైన కత్తులు పెట్టి సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్, నర్సింహారావు, ఆరీఫ్‌అలీ, హసీనాబేగం, మహ్మద్ అరీఫ్, సలీమా బేగం, తాహేరాబేగంల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నయీమ్ అనుచరులు కాజేసిన తమ భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
'బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'
వికారాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన 'జాగో బంజారా' ముగింపు సభలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అభివృద్ధి దిశగా నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బంజారాలకు ఆయన హామీ ఇచ్చరు. ఈ సభకు మంత్రులు చందూలాల్, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : పెళ్లై మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధిస్తుండటంతో మనస్తాపం చెంది సావిత్రి(20) అనే వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మహేశ్వరం మండలం తుక్కుగూడలో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులను బలిగొన్న కుటుంబ కలహాలు
మహేశ్వరం: కుటుంబ కలహాలు భార్యాభర్తలను బలిగొన్నాయి. భర్త చేయి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య చేసుకోగా... అది చూసి భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామానికి చెందిన మూడావత్ కృష్ణ(35)కు అదే గ్రామానికి చెందిన మూడావతి దోలి(30)తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. లారీ డ్రైవర్‌గా పని చేసే కృష్ణ తాగుడుకు బానిసై భార్యను వేధించేవాడు. కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దోలిని కృష్ణ తరచూ కొట్టేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో దోలి తల్లిగారింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మంగళవారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దోలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతితో మనస్తాపం చెందిన కృష్ణ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కన్నీరుపెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మహేశ్వరంలో వడగళ్ల వాన
హైదరాబాద్ : మహేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షంతో పాటు వడగళ్లు పడడంతో వరి గింజలు రాలిపోయాయి. మండల పరిధిలోని మహేశ్వరం, కేసీ తండా, ఎన్డీ తండా, కేబీ తండా, తుమ్మలూరు, మోహబ్బత్‌నగర్, మన్సాన్పల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లు కుప్పలు తెప్పలుగా పడ్డాయి. ఎటు చూసిన మల్లేపూలు వలే వడగళ్లు దర్శనమిస్తున్నాయి. అరుగాలం కష్టించి పండించిన రైతుల నోట్లో మట్టికొట్టినట్లుయిందని కేసీ తండాకు చెందిన రవినాయక్, తుమ్మలూరుకు చెందిన రామచంద్రారెడ్డిలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను అదుకోని నష్టపరిహారం అందించాలని కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. రైతులను అదుకోవాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరులో... కందుకూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గురువారం కురిసింది. మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. వర్షానికి చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజోన్న, కూరగాయ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు వర్షానికి దెబ్బతిన్నాయి. అకాల వర్షం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం తగిన పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అర్ధంతరంగా ఆగిపోయాయి..!
మహేశ్వరం: మండలంలో పలు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి గతంలో మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులు నిధులు కొరత, స్థల సేకరణలో జాప్యంతో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా 2012లో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అలాగే మండల కేంద్రంలో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ డిపో, రూ.76 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.55 లక్షలతో ఫైర్‌స్టేషన్, రూ.65 లక్షలతో తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులకు గతంలో కొన్ని నిధులు మంజూరయ్యాయి. అయితే 2014లో ప్రభుత్వం మారినప్పటినుంచి వీటికి నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి పనులన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని భావించిన మండల ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బంక్ లేక ఆగిన డిపో పనులు మండల కేంద్రంలోని కేసీ తండా సమీపంలో సర్వే నెంబరు 306లో మాజీ హోంమంత్రి సబితారెడ్డి అప్పట్లో రూ.6 కోట్ల నిధులతో ఆర్టీసీ బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. అయితే డి పోలో డీజిల్ ట్యాంకు పనులు అసంపూర్తిగా ఉ న్నాయి. దీంతో ఇక్కడినుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర, రోడ్డు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ డిపోను పరిశీలించారు. 2015లో డిపో నుంచి బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అద్దె భవనంలో అగ్నిమాపక కేంద్రం సబితారెడ్డి రూ.55ల క్షలు మంజూరు చేయించి మండలకేంద్రంలో ఫైర్ స్టేషన్‌కు అప్పట్లో శిలాఫలకం వేశారు. స్థలం ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విడుదలైన నిధులు తెలంగాణ ప్రభుత్వంలో నిలిచిపోయాయయి. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దె భవనంలో ఫైర్ స్టేషన్ కొనసాగుతోంది. నిర్మాణానికి నోచుకొని జూనియర్ కళాశాల మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్‌బంకు పక్కన అప్పటి కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి,సబితారెడ్డిలు కలిసి రూ.76 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థలం ఉన్నా కొత్త ప్రభుత్వంలో నిధులు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాల కొనసాగుతోంది. 100 పడకల ఆస్పత్రికి స్థలం కొరత మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి సీఎం ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాటకు వచ్చి 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. ప నులకు టెండర్ పక్రియ పూర్తయింది. స్థలం లేదని అధికారులు పనులను నిలిపివేశారు. ప్రస్తు తం స్థలం చూపిస్తే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు బుజ్జగింపు
హైదరాబాద్: గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. మంగళవారం చంద్రబాడుతో తీగల సమావేశమయ్యారు. పార్టీ మారొద్దని ఈ సందర్భంగా తీగలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని హామీయిచ్చినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ మారేందుకే తీగల మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని తన అనుచరులకు తీగల కృష్ణారెడ్డి ఫోన్ చేశారు. -
రెండు రేషన్ దుకాణాలు సీజ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్‌లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ హరినాథ్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిలు మంఖాల్ గ్రామంలో నరేష్ నిర్వహిస్తున్న ఆరో నంబర్ రేషన్ దుకాణ ంలో తనిఖీలు చేశారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా లేవు, నిర్వాహకులు సమయ పాలన పాటించడం లేదని గుర్తించారు. దీంతో రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా గ్రామంలోని 19వ నంబర్ రేషన్ డీలర్ కప్పల సుగంధ పేరు మీద ఉన్న దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన బాకీ దాసు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమయపాలన, రిజిస్టర్లు సక్రమంగా పాటించడం లేదని తనిఖీలో వెల్లడి కావడంతో ఈ దుకాణాన్నీ సీజ్ చేశారు. రెండు దుకాణాలకు చెందిన స్టాక్ రిజిస్టర్లు, దుకాణాల తాళాలు మహేశ్వరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబురావు, వీఆర్వో రాములకు అప్పగించారు. రేషన్ దుకాణాల్లోని సరుకుల స్టాక్ వివరాలను ఆర్ఐ బాబురావు, వీఆర్వో రాములు నమోదు చేసుకున్నారు. -
ఎవరీ కొత్త ప్రభాకర్ రెడ్డి?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా నిలిచింది. బీజేపీ, టీడీపీల కూటమి, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి కోసం అన్వేషించి చివరకు కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు మెదక్ లోకసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఖారారు చేసింది. అయితే అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ను ఓవర్ టేక్ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సోని ట్రావెల్స్ అధినేత అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ధనిక రాజకీయవేత్తల్లో ఒకరని చెప్పుకుంటారు. సుమారు వెయి కోట్ల ఆస్తి ఉన్నట్టు పలు పత్రికల్లో, వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. అనూహ్యంగా మెదక్ లోకసభ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు కారణంగా ఆ సీటును తీగల కృష్ణారెడ్డికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డికి 1471 ఓట్లు వచ్చాయి. తాజాగా మెదక్ సీటును దక్కించుకుని ప్రభాకర్ రెడ్డి రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. -
మరో సింగపూర్ సిటీగా మహేశ్వరం
మహేశ్వరం: తెలంగాణ ప్రభుత్వంలో మహేశ్వరాన్ని మరో సింగపూర్ సీటిగా తీర్చిదిద్దుతామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్వరం ప్రజలు తొందరపడి భూములు అమ్ముకోవద్దని సూచించారు. మహేశ్వరం, రావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, మన్సాన్పల్లి గ్రామాలకు భారీ ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు రానున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతలో కంపెనీలు, పరిశ్రమలు నెలకొల్పడానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమగ్ర సర్వేతో అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. వర్షాలు సకాలంలో కురిపించి పాడీ పంటలు సమృద్ధిగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. అంతకుముందు గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ ఆనందం, నాయకులు కూన యాదయ్య, డి. అశోక్, రాఘవేందర్‌రెడ్డి, ఎం.ఎ. సమీర్, మల్లేష్, తడకల యాదయ్య, సంజయ్, షఫీ, సలీం, చంద్రశేఖర్‌రెడ్డి ,ఠాగూర్ నాయక్ తదితరులున్నారు. -
‘మన ఊరు - మన ప్రణాళిక’ను అడ్డుకున్న ఆందోళనకారులు
మహేశ్వరం: తెలంగాణ బంద్‌లో భాగంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్, టీజేఏసీ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు అంబేద్కర్- జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ సమా వేశం హాలులో మన ఊరు-మన ప్రణాళి రూపకల్పనపై జరుగుతున్న అవగాహన సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు చేసేదేమి లేక సమావేశాన్ని కొంతసేపు నిలి పివేశారు.కార్యక్రమంలోటీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రా మకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, రాజేష్ నాయక్,సంజయ్, అలీ,బాలయ్య, తడకల యాదయ్య, అంజనేయులు, రవి, సలీంఖాన్, మునాఫ్, సీపీఎం మండల కార్యదర్శి దత్తునాయక్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్, టీజేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు. కందుకూరులో.. కందుకూరు: మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక అనే అంశంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం ప్రారంభించిన కొద్ది సేపటికే నిలిచిపోయింది. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ సమావేశపు హాల్లో మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా సీపీఎం నేతలు సమావేశాన్ని అడ్డుకుని నిలిపివేశారు. దీంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి దుర్గయ్య వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామాల్లో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. -
ఫైనల్ టచ్!
- నేడు జిల్లాకు సోనియా, కేసీఆర్, చంద్రబాబు - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలు - అభ్యర్థుల ఆశలన్నీ అతిరథుల ప్రచారంపైనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ప్రచారం కీలక దశకు చేరుకుంది. రెండ్రోజుల్లో తెరపడనున్న ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ముగ్గురు అగ్రనేతల రాకతో సార్వత్రిక పోరు అంతిమ దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల అతిరధులు జిల్లాకు తరలివస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్ఎస్ సారథి కేసీఆర్, దేశం దళపతి చంద్రబాబు జిల్లాలో జరిగే ప్రచారసభల్లో పాల్గొంటుండడంతో భారీగా జనసమీకరణ జరిపేం దుకు ఆయా పార్టీల నాయకత్వాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. అగ్రనేతల సభలను సక్సెస్ చేయడం ద్వారా కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్నాయి. చేవెళ్లలో సోనియా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జిల్లా గ్రామీణ ప్రాంతానికి తొలిసారిగా సోనియా రానుండడంతో పార్టీ కార్యకర్తలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా సభకు పెద్దఎత్తున జనాలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. సుమారు 700 బస్సుల ద్వారా ప్రజలను చేవెళ్లకు చేరవేసేందుకు సన్నాహాలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు షాబాద్ మార్గంలో జరిగే సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. కేసీఆర్ సుడిగాలి పర్యటన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం పరిగి, వికారాబాద్‌లలో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మేడ్చల్ చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. గ్రామీణ నియోజకవర్గాలపై గంపెడాశ పెట్టుకున్న టీఆర్ఎస్.. ఇక్కడ అధినేత సభలను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసరాలని భావిస్తోంది. మహేశ్వరానికి టీడీపీ అధినేత బాబు.. చంద్రబాబు ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో పర్యటిస్తారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో 3గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారు. -
ఉత్కంఠకు తెర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎడతెగని ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సోమవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్వరం మినహా జిల్లాలోని మిగతా 13 శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించడంతో జాబితాలో నియోజకవర్గం పేరు చేర్చలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఆకుల రాజేందర్‌కు కాంగ్రెస్ అధిష్టానం రిక్తహస్తం చూపింది. కుటుంబానికి ఒకే సీటు అనే నిబంధన కారణంగా సబితకు టికెట్ నిరాకరించగా, టీఆర్ఎస్కు మారి తిరిగి సొంతగూటికి చేరిన ఆకుల రాజేందర్‌కు శృంగభంగ మైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకొని సోదరుడు ల క్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన యాదయ్య, జ్ఞానేశ్వర్‌కు పార్టీ మరోసారి అవకాశం కల్పించగా, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్‌లను హైకమాండ్ కరుణించలేదు. 2009లో పరిగిలో రెబల్‌గా పోటీచేసిన రామ్మోహన్‌రెడ్డికి ఈసారి పార్టీ టికెట్ వరించింది. మోదం.. ఖేదం టికెట్ల కేటాయింపులో హైకమాండ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేసి సగం స్థానాలు బీసీలకే కేటాయించింది. మిగతావాటిలో నలుగురు రెడ్డి, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లాలో ఒక్క మహిళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన సబితకు టికెట్ రాకపోవడంతో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సీట్ల కేటాయింపులో సిఫార్సులకు ప్రాధాన్యతనిచ్చిన అధిష్టానం.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఒత్తిడిలను పట్టించుకోలేదు. మేడ్చల్ సీటును తన అనుచరుడు ఉద్దెమర్రి నర్సింహారెడ్డికి ఇప్పించుకోవాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించినా పట్టించుకోని హైకమాండ్ పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎల్లార్కే సీటు కట్టబెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక్కడి నుంచి తన అనుచరుడు రామ్మోహన్‌గౌడ్‌ను బరిలో దించాలనుకున్న స్థానిక ఎంపీ సర్వే సత్యనారాయణకు చుక్కెదురైంది. అలాగే ఇబ్రహీంపట్నం స్థానం టికెట్‌ను మాజీ శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డికి ఇప్పించుకునేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చేవెళ్ల సీటును తన వర్గానికి చెందిన వెంకటస్వామికి దక్కేలా పావులు కదిపిన సబితకు నిరాశే మిగిలింది. కమతం రాంరెడ్డికి టి కెట్ ఇప్పించుకునేందుకు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెరవెనుక జరిపిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఫలించిన పైరవీలు పార్టీ అగ్రనేతల కోటాలో పలువురు టికెట్లు సొంతం చేసుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి సిఫార్సుతో బోయిన్పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్‌కు కూకట్పల్లి అభ్యర్థిత్వం దక్కింది.ఈ స్థానం సినీ నిర్మాత ఆదిశేషగిరిరావుకు ఖరారైందని ప్రచారం జరిగినప్పటికీ, పీఆర్పీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన నర్సింహాయాదవ్కు టికెట్ ఇప్పించుకోవడంలో చిరంజీవి సక్సెస్ అయ్యారు. స్థానిక ఎంపీ అడ్డుపడినా.. సుధీర్‌రెడ్డి ఢిల్లీస్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించి ఎల్బీనగర్ బీ ఫారం దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గ్రేటర్ కోఅప్షన్ సభ్యుడు శ్రీధర్‌కు మల్కాజిగిరి స్థానం దక్కడంలో కేంద్ర మంత్రి సర్వే కీలక పాత్ర పోషించారు. ఆసక్తి రేకెత్తించిన ఇబ్రహీంపట్నం టికెట్టు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ వశమైంది. కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య అండతోనే మల్లేశ్ బీ ఫారం దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, తనను వరించిన తాండూరు టికెట్టును కాదనుకున్న రమేశ్ తన బాబాయ్ నారాయణరావు పేరును సిఫార్సు చేసి బీ ఫారం ఇప్పించడం విశేషం. సీపీఐ ఖాతాలో మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తన అనుచరులకు ఇప్పించుకోవాలన్న సబిత ప్రయత్నాలకు అధిష్టానం గండికొట్టింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సెగ్మెంట్‌ను సీపీఐకి కేటాయించడంతో చెల్లెమ్మ గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్లయింది. తన కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీచేస్తున్న చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధిలోనే మహేశ్వరం ఉంది. ఇప్పుడు ఈ స్థానాన్ని కామ్రేడ్లకు కేటాయించడం తనయుడి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోననే బెంగ ఆమెను వెంటాడుతోంది. మరోవైపు ఈ సారి రాజేంద్రనగర్ నుంచి బరిలో దిగాలనే ఆమె ఆశలపై అధిష్టానం నీళ్లుచల్లింది. కుటుంబానికి ఒకే సీటు పద్ధతి సబితమ్మ సీటుకు ఎసరు తెచ్చింది. రాజేంద్రనగర్ స్థానాన్ని తన వైరివర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు కేటాయించడం ఆమెకు మింగుడుపడని అంశం. రెంటికి చెడ్డ రాజేందర్ మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పొసగక.. టికెట్ రాదేమోననే అనుమానంతో టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. మరుసటి రోజు రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మళ్లీ సొంతగూటికి చేరుకున్న ‘ఆకుల’ను పార్టీ అక్కున చేర్చుకున్నప్పటికీ టికెట్ మాత్రం నిరాకరించింది. ఇదిలావుండగా, మల్కాజిగిరి స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ఆశించిన ఫలితం దక్కలేదు. -
'చేవెళ్ల ఎంపీ, మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి'
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని తన కుమారుడు కార్తీక్ రెడ్డికి, మహేశ్వరం ఎమ్మెల్యే సీటును తనకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ను మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్క్షప్తి చేశారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వార్ రూమ్ లో కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎంపీలందరికి టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నందున్న చేవెళ్ల ఎంపీ స్థానానికి తన కుమారుడికి టికెట్ కోసం సబితా ఇంద్రారెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. సామాజిక న్యాయం, గెలిచే సత్తా, ప్రత్యర్థుల బలాబలాలను బట్టి అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టారు. అభ్యర్థుల ఎంపికపై వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బాలిక అనుమానాస్పద మృతి
మహేశ్వరం, న్యూస్ లైన్: ఓ బాలిక అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. మృతదేహంపై గాట్లు ఉన్నాయి, దుస్తులు చిరిగిపోయాయి. తెలిసిన వారే ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని మృతురాలి బంధువులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ సంఘటన మండల పరిధిలోని అమీర్‌పేట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ గంగాధర్, స్థానికుల కథనం ప్రకారం.. అమీర్‌పేట గ్రామానికి చెందిన ఏర్పుల కుమార్‌కు భార్యలు శోభ, అరుణ ఉన్నారు. శోభకు కుమారుడు శ్రీకాంత్, కుమార్తె అశ్విని(17) ఉన్నారు. బాలిక గ్రామంలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి అశ్విని కుటుంబీకులతో భోజనం చేసిన అనంతరం 11 గంటల వరకు టీవీలో సినిమా చూసి పడుకుంది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి ఎదుట ఉన్న పొదల్లో మృతదేహంగా పడి ఉంది. అశ్విని తల్లి శోభ, కుటుంబీకులు గమనించి లబోదిబోమన్నారు. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ రామసూర్యన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మెడ, నడుము భాగాల్లో గాట్లు ఉన్నాయి. దుస్తులు కొద్దిగా చినిగిపోయి ఉన్నాయి. అశ్వినితో గతంలో చనువుగా ఉండే పొరుగింటికి చెందిన డప్పు కృష్ణ అలియాస్ చిన్నపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. అతడే అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉండొచ్చని బాలిక బంధువులు అతడిపై దాడికి యత్నించారు. దీంతో పాటు అశ్విని సవతి తల్లి అరుణపై కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక హత్యలో ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా బాలిక తండ్రి కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో అనుమానితులు.. డప్పు కృష్ణ అలియాస్ చిన్న, అరుణల ప్రవర్తన, కదలికలు అనుమానంగా ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓక్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం మృతురాలి బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న కృష్ణ, అరుణలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. పోస్టుమార్టం నివేదికలో అన్ని వివరాలు వెల్లడవుతాయి. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో ఛేదిస్తాం. సీఐ, గంగాధర్ -
మహేశ్వరం నుంచే పోటీ చేస్తా
మహేశ్వరం, న్యూస్‌లైన్: మహేశ్వరం నియోజకవర్గం తనకు పుట్టినిల్లు లాంటిదని, రానున్న ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేస్తానని రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధి మన్సాన్పల్లి గ్రామంలో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని, తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నమ్మరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మహేశ్వరం నియోజకవర్గం వదిలే ప్రసక్తే లేదని సబితాఇంద్రారెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మళ్లీ ఆవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకుడు రఘుమారెడ్డి, ఎన్ఆర్జీఈఎస్ సభ్యుడు ఇజ్రాయేల్, పార్టీ మండల అధ్యక్షుడు శివమూర్తి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డెరైక్టర్ మల్లేష్, పీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి మంత్రి రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య, నాయకులు సమీర్, ఈశ్వర్, ఆంజనేయులు పాల్గొన్నారు.