మహేశ్వరం(రంగారెడ్డి జిల్లా):
మహేశ్వరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, మారుతీ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన మహేశ్వరం మండలం మొహబ్బత్‌నగర్ గేట్ వద్ద శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది.
ఎంజీబీఎస్ నుంచి ఆకుల మైలారం వైపు వెళ్తున్న ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఎదురుగా కందుకూరు నుంచి వస్తున్న మారుతి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బ్రహ్మచారి(55), చంద్రమౌళి(50), స్నేహ(40) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు, కారు ఢీ..ముగ్గురి మృతి
Published Tue, Jul 11 2017 5:25 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement