జంగల్ క్యాంపులో సైక్లింగ్ చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మజీద్‌గడ్డ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. నగరానికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్టు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అర్బన్ ఫారెస్టు పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 60 పార్కులు, ఇతర పట్టణాల్లో 34 పార్కులను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment