Ranga Reddy District
-
అక్షరాల గుడి... 150 ఏళ్ల బడి
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్: అక్షర సుమమై వికసించింది.. ఎంతోమంది మేధావులకు అక్షరాలను నేర్పించింది. ఈ చారిత్రక సరస్వతీ నిలయం ప్రత్యేకతను చాటుతూ 150 వసంతాలను పూర్తి చేసుకుంది. అదే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది స్వాతం్రత్యానికి పూర్వమే ఏర్పాటైంది. శుక్రవారం 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అనేకమంది ప్రముఖుల అక్షరాభ్యాసం ఈ బడిలో అనేక మంది ప్రముఖులు అక్షరాభ్యాసం చేశారు. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో స్థిర పడ్డారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ సహా అనేక మంది ఇక్కడ అక్షరాలు దిద్దినవారే. గ్రామస్తుల్లో చైతన్యం రగిలించేందుకు.. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్‌ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకుని షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో ఆశ్రయం పొందినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్ఖాన్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో నాటి నిజాం సర్కార్ 1873లో మొగిలిగిద్దలో పాఠశాలను ఏర్పాటు చేసింది. మొదట్లో ఉర్దూ మీడియంలో విద్యాబోధన చేయగా, 1948లో తెలుగు మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. నిజానికి పాఠశాల ప్రారంభమై 152 ఏళ్లుపూర్తి కావొస్తున్నా.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు 150వ వార్షికోత్సవాన్ని (కోవిడ్ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు వాయిదా వేశారు) జరుపుకొనేందుకు సంసిద్ధులయ్యారు. ఇక్కడ 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్వాతం్రత్యానికి ముందే ఇక్కడ పోలీస్‌స్టేషన్‌తోపాటు గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ఠాణా కింద 140 గ్రామాలు ఉండేవి. ఈ పోలీస్‌స్టేషన్‌ను 1983లో కొందుర్గ్‌కు తరలించారు. ఈ చారిత్రక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది. పాఠశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. పాఠశాలలో పలు మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
అదుపుతప్పిన స్కూల్ బస్సు
-
దూసుకొచ్చిన మృత్యువు
చేవెళ్ల: రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నచిరువ్యాపారులను దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. లారీ రూపంలో వచ్చి వారిని చిదిమేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆగి ఉన్న బస్సును దాటి వెళ్తూ..: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్ స్టేజీ వద్ద, రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపుతప్పి టీస్టాల్ స్టాండ్‌ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (48), దామరగిద్ద కృష్ణ (19), నాంచేరికి చెందిన శ్యామల సుజాత (42) అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే కూరగాయలు కొనేందుకు అక్కడకు వచ్చిన జమీల్ (25), బాలమణి, చల్ల మాల్యాద్రి, కూరగాయల విక్రేతలు ఆకుల పద్మమ్మ, నక్కలపల్లి రేణకతోపాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జమీల్ మృతిచెందాడు.అతను ఆలూరులోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. మిగతా క్షతగాత్రులను వారివారి బంధువులు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.షాక్‌లో డ్రైవర్..: ఈ ఘటనలో లారీ చివరకు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ కాలు విరిగి క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీల సాయంతో అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో షాక్‌లో ఉన్న డ్రైవర్ తన వివరాలు చెప్పలేకపోయాడు.ప్రమాద తీవ్రతకు చెట్టు విరిగిపడటంతో చెట్టు కింద, లారీ ముందు భాగంలో ఎవరైనా ఇరుక్కుపోయారా? అనే విషయం వెంటనే తెలియరాక మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. చివరకు చెట్టును తొలగించాక దాని కింద ఎవరూ లేరని నిర్ధారణ అయింది. ఆ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న మరో 30 మంది ప్రమాదం బారిన పడేవారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి..: ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కల్తీ కల్లు.. ఆరోగ్యానికి చిల్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ‘కల్తీ’ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన శంషాబాద్, సరూర్‌నగర్ అబ్కారీ అధికారులు వారిచ్చే ముడుపులు పుచ్చుకుని కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇటీవల మీర్‌పేటలోని నందనవనం బస్తీకి చెందిన ఓ మహిళ కల్తీకల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి, కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎౖజ్శాఖ వారికి అండగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తీలే కల్లు కాంపౌండ్లకు అడ్డాలు ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును సేవించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం తొలగుతా యి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చో ట్ల కల్తీ తక్కువ. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కారి్మ కులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. గుడుంబా దొరక్క పోవడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లు కు అలవాటుపడుతున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు సొమ్ము చేసు కుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్ వంటి ప్రమాదకరమైన రసాయణాల ను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు.తయారీలో మోతాదుకు మించి రసాయణాలను వినియోగిస్తుండడంతో దీన్ని సేవించిన వారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. శంషాబాద్, రాజీవ్శెట్టినగర్, మీర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, బొంగుళూరుగేటు, ఆదిబట్ల, యాచారం, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్, కడ్తాల్ శివారు ప్రాంతాల్లో ఈ కల్తీ కల్లు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుత సీజన్లో తాటి చెట్లకు ఆశించిన స్థాయిలో కల్లు ఉత్పత్తి కాదు. ఒకటి రెండు తాటి చెట్ల నుంచి కల్లును సేకరించినా, ఇది వారి సొంత అవసరాలకు కూడా సరిపోదు. కానీ జిల్లాలోని ఏ ప్రధాన రోడ్డు వెంట చూసినా కృత్రిమ కల్లు దుకాణాలే దర్శనమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీ లు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనేక విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక లైసెన్సు.. రెండు దుకాణాలు శంషాబాద్ పట్టణంలోని ఓ ప్రధాన కల్లు దుకాణంలో సభ్యుల మధ్య జరిగిన గొడవతో కల్లు విక్రయాలు రోడ్డుపైకి వచ్చాయి. గొడవల కారణంగా దాదాపు నెల రోజులుగా దుకాణం తెరవని విక్రయదారులు తమ దందాను మాత్రం యథేచ్చగా రోడ్డెక్కించారు. దాదాపు మూడు వందల సభ్యులతో ఉన్న ఈ దుకాణంలో కొంత కాలంగా వ్యాపారుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఓకే దుకాణంలో రెండు వేర్వేరు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఎక్సైజ్ నిబంధనల మేరకు ఒక లైసెన్స్‌పై రెండు విక్రయ కేంద్రాలు నడిపిస్తున్న విషయం తెలుసుకున్న ఆబ్కారీ అధికారులు ఒక లైసెన్స్‌పై ఒకటే దుకాణం నడిపిచాలని హెచ్చరించారు. వ్యాపారులు మాత్రం ఇదేమి పట్టనట్టుగా దందా కొనసాగిస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వీకర్ సెక్షన్ కాలనీ మీదుగా ఉన్న రోడ్డుపైనే కల్లు విక్రయాలు జరుపుతుండటంతో కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదు. నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక విక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు సైతం పని చేయవు. మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం. – డాక్టర్ రాజేశ్, న్యూరో సర్జన్క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్లతో కల్లు తయారీ మోతాదుకు మించి రసాయనాలుకలపడంతో ప్రమాదం పట్టించుకోని జిల్లా ఎక్సైజ్ అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్న వైనం -
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
రంగారెడ్డి కోర్టులు: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యం.వాణి తీర్పు చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు ఏపీపీ మంజులా దేవి తెలిపిన మేరకు...మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథ్ (29) అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండేళ్ల అనంతరం పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషిట్ దాఖలు చేశారు. సాక్షులను విచారించిన కోర్టు గురువారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. -
కూకట్‌పల్లిలో మట్టుబెట్టి.. అందోల్‌కు తరలించి..
జోగిపేట(అందోల్): భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది. కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్‌కాల్స్ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్‌ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్పల్లి నుంచి అందోల్‌కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా..
హైదరాబాద్: అది 2020 అక్టోబర్ నెల.. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఓ సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది. పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సర్వీస్ సెంటర్‌ను ఆదేశిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని కమిషన్ తేల్చింది. ఈ పరిహారాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్‌కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పును ఇచ్చింది. కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. హైదరాబాద్‌లోని బ్లూ ఓషన్ మల్టీ క్టయింట్ ఆఫీస్ వారు 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో కారు అకస్మాత్తుగా ఎయిర్ కండీషన్ పనిచేయకుండా ఆగిపోయింది. అంతేగాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే పిటిషనర్ తల్వార్ కార్స్ ప్రైవేట్ సర్వీస్ సెంటర్ దగ్గర రూ.83 వేలు వెచ్చించి రిపేరు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్లీ సమస్యలు వచ్చాయి. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కారు యజమాని 2020లో కృష్ణ ఎక్స్‌క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించగా కారు రిపేరు కోసం రూ.2.73 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కారు రిపేరు కోసం సర్వీస్ సెంటర్లోనే పెట్టుకున్నారు. 2020లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో సర్వీస్ సెంటర్లోకి నీరు వచి్చ, కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కారు రిపేరు కోసం రూ.50.45 లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది అంచనా వేసి చెప్పారు. సరైన సమయానికి కారు రిపేరు చేయకుండా పెట్టి వరదల్లో మునిగిపోవడానికి కారణం అయిన సర్వీస్ సెంటర్ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్ సూచించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో పిటిషనర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కారు పూర్తిగా దెబ్బతినడానికి కృష్ణ ఎక్స్‌క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ కారణమని తేల్చింది. అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచి్చంది. -
తెలంగాణ అంతటా భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
రంగారెడ్డి/హైదరాబాద్, సాక్షి: భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల భవనాల పరిస్థితి, అక్కడ వాతావరణాన్ని బట్టి మండల విద్యా శాఖ అధికారులు సెలవు ఇవ్వాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. జీహెచ్ఎంసీలో పరిధిలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చాలా చోట్ల స్కూళ్ల నిర్వాహకులు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రుల మెబైల్స్కు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇంకోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికార ప్రకటన ఇవ్వకున్నా.. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంతటా మరో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. -
రంగారెడ్డి జిల్లా.. విభిన్నతల ఖిల్లా!
సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు. దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్ సహా జిల్లాలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణలో చేవెళ్ల రెండోది.. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్‌సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు. ⇒ షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్‌నగర్ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
లోపం ఎక్కడుంది?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి’పోర్టల్ కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తోంది. భూమి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి దరఖాస్తులకు ధరలు నిర్ణయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, అలాగే రైతుల ఇబ్బందులను అవకాశంగా తీసుకుని కొందరు ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పితే చాలు.. క్షేత్రస్థాయి నివేదికలు, సంబంధిత ఉన్నతాధికారుల సంతకాలతో సంబంధం లేకుండానే వివాదాస్పద భూములను సైతం మార్పిడి చేసేస్తున్నారు. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా క్లియర్ అవు తుండటాన్ని పరిశీలిస్తే.. ఖరీదైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, అర్బన్ సీలింగ్ భూములు ఏ విధంగా అన్యాక్రాంతమ వుతున్నాయో అర్థం చేసు కోవచ్చు. ఇటీవల రంగా రెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలే ఇందుకు నిదర్శనమని చెపుతున్నారు. జిల్లా కలెక్టర్ లాగిన్ చేస్తే కానీ ఓపెన్ కానీ ధరణి ఫోర్టల్ ఏవిధంగా తెరుచుకుంది? 98 వివాదా స్పద దరఖాస్తులు ఏ విధంగా క్లియర్ అయ్యా యనేది? అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. అనుమానం మొదలైంది అక్కడే.. రంగారెడ్డి జిల్లాలో ధరణి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ అక్టోబర్ 20 నుంచి 23 మధ్యలో 20 దరఖాస్తులను క్లియర్ చేసేందుకు పోర్టల్ లాగిన్‌ను ఓపెన్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ధరణి ఆపరేటర్లు వారికి ముడు పులిచ్చినవారికి సంబంధించిన వివాదాస్పద దరఖాస్తులను (అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో) క్లియర్ చేసుకున్నట్లు తేలింది. అయితే తాను కేవలం 20 దరఖాస్తులనే ఆమోదిస్తే.. వివిధ కేటగిరీలకు సంబంధించిన మరో 98 దరఖాస్తులు ఎలా క్లియర్ అయ్యాయనే అంశంపై ఇటీవల కలెక్టర్‌కు అనుమానం వచ్చినట్లు తెలిసింది. అన్నీ వివాదాస్పద భూములవే.. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏ అధికారులను సంప్రదించారని సమాచారం. అయితే అటు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. తన ప్రమేయం లే కుండానే వివాదాస్పదంగా ఉన్న 98 దరఖాస్తులు ఆమోదం పొందిన అంశాన్ని కలెక్టర్ భారతిహోళికేరి సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ పరిపాలనాధికారి ఈనెల 5న పోస్ట్ ద్వారా ఆదిభట్ల పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు పంపారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంలో ప్రమే యం ఉందని భావిస్తున్న ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాకు ఏ పాపం తెలియదు.. కలెక్టర్ ప్రమేయం లేకుండా దరఖాస్తులు ఎలా క్లియర్ అయ్యాయనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నా.. వాటిని నివృత్తి చేయాల్సిన అధికారులంతా గప్చిప్ అయ్యారని తెలుస్తోంది. ఎవరికి వారు తమకు సంబంధం లేదు అన్నట్లుగా మిన్నకుండిపోయారని చెపుతున్నా రు. ఇదిలా ఉంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు నరేశ్, మహేశ్‌లు సైతం తమకే పా పం తెలియదని చెపుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపితే కానీ అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం బయటకు రాదని స్థానికులు అంటున్నారు. -
రంగారెడ్డిలో ఢీ అంటే ఢీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఎనిమిది సెగ్మెంట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం జీహెచ్ఎంసీ పరిధి చుట్టూ విస్తరించి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరూ బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు ఆ ఎనిమిదికి ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఢీకొంటోంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లల్లో బీజేపీ పటిష్టంగా ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. మిగతా చోట్ల బీఆర్ఎస్– కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోటీ కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత మెండుగానే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అనుచరుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతమేర తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే విషయంపై ఫలితాల సరళి ఆధారపడ్డట్టు స్పష్టమవుతోంది. చేవెళ్ల త్రిముఖ పోటీలో గట్టెక్కేదెవరు? గత ఎన్నికలకు భిన్నంగా చేవెళ్లలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేస్తూ హ్యాట్రిక్ విజయం కోసం యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన కేఎస్ రత్నం ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి షాబాద్ మండలానికి చెందిన యువ నేత భీమ్ భరత్‌ను బరిలోకి దింపింది. కాలె యాదయ్య తీరు, ఆయన అనుచరులపై ఆరోపణలు, కుటుంబ సభ్యులకు ఎక్కువ పదవులు ఇప్పించుకోవటం వంటి అంశాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధినే యాదయ్య నమ్ముకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఎమ్మెల్యేపై అసంతప్తిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కొంత బలంగా ఉండటం, గతంలో జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన రత్నంకు స్వతహాగా ఉన్న కేడర్ ఇప్పుడు క్రియాశీలంగానే పనిచేస్తోంది. దీంతో ఆయన కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. పరిగి వారిమధ్యే పోరు బీఆర్ఎస్ – కాంగ్రెస్‌ల నుంచి గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులే మళ్లీ ఈసారి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డిని బీఆర్ఎస్ మరోసారి బరిలో దింపింది. సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి తనయుడుగా ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే హరీశ్వర్‌రెడ్డి చనిపోవటంతో కొంత సానుభూతి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టి.రామ్మోహన్‌రెడ్డిపై పార్టీ మరోసారి నమ్మకాన్ని ఉంచింది. బీజేపీ నుంచి మారుతీకిరణ్ పోటీలో ఉన్నారు. కానీ ఇక్కడ పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యనే ఉంది. ఈసారి రామ్మోహన్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండటం, నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటం (ప్రస్తుత తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి), మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లోకి రావటంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ పరిగి నియోజకవర్గానికి పక్కనే ఉండటం కూడా ఆ పార్టీలో కొంత సానుకూలత కనిపించటానికి కారణమైంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వికారాబాద్ ద్విముఖ పోరు గత ఎన్నికల్లో విజయం సాధించిన మెతుకు ఆనంద్‌ను మరోసారి బీఆర్ఎస్ బరిలో దింపగా, కాంగ్రెస్ పార్టీ కూడా గత అభ్యర్థి గడ్డం ప్రసాద్కుమార్నే పోటీకి నిలిపింది. ఆ ఎన్నికల్లో దాదాపు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీనిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి, స్థానికుడైన సీనియర్ నేత చంద్రశేఖర్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి జహీరాబాద్ నుంచి పోటీలో నిలిచారు. ఆయన కాంగ్రెస్‌లోకి రావటంతో ఆయన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన వికారాబాద్ కేడర్ బలం ఇప్పుడు గడ్డంప్రసాద్కుమార్కు కలిసి రానుంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యలోనే కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆనంద్ పనితీరుపై కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ హయాంలో మంత్రి హోదాలో వికారాబాద్‌ను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉండటాన్ని ఆనంద్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం ముక్కోణపు పోటీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న సబితారెడ్డి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రి సబిత, మిగతా ఇద్దరు అభ్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఏడు నెలల క్రితంహస్తం గూటికి చేరిన బడంగ్‌పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా కేఎల్ఆర్ దక్కించుకున్నారు. దీంతో స్థానికంగా పట్టున్న పారిజాత తీవ్ర అసంతృప్తికి గురైనా, అనంతరం కొంత సయోధ్యతో ప్రచారంలో పాల్గొంటుండటం కేఎల్ఆర్కు కలిసివచ్చే అంశం. సబితారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరటం జనంలో కొంత అసంతృప్తికి కారణమైంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి నుంచి సబితకు పూర్తిస్థాయి సహకారం అందటం లేదంటున్నారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి శ్రీరాములుయాదవ్ ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్న తన సామాజిక వర్గం ఓట్లపై గురిపెట్టారు. ఈ విషయంలో ఆయనకు సానుకూలత కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. ఇబ్రహీంపట్నం టఫ్ ఫైట్ గత ఎన్నికల్లో కేవలం 376 ఓట్లతో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి నుంచి టఫ్ ఫైట్ ఎదురైంది. ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తున్నా.. ఆయన మాత్రం ప్రభుత్వ పథకాలు, స్థానికంగా జరిగిన పురోగతిని వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా కాంగ్రెస్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకు ఉండటం మల్రెడ్డి రంగారెడ్డికి కలిసిరానున్నాయి. అసైన్మెంట్ భూములను వెనక్కు తీసుకుంటున్న అంశం కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అంతర్గత రోడ్లు సరిగా లేకపోవటం, నిరుద్యోగ అంశంపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలను కాంగ్రెస్ అభ్యర్థి అందిపుచ్చుకుని ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దయానంద్ గౌడ్ పోటీలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. రాజేంద్రనగర్ త్రిముఖ పోరులో గెలుపెవరిదో? బీఆర్ఎస్ అభ్యర్థి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో నిలిచి గెలుపు అంచుల వరకు వచ్చిన మజ్లిస్ పార్టీ ఈసారి ముస్లిమేతర అభ్యర్థి స్వామియాదవ్‌ను పోటీలో నిలిపింది. మజ్లిస్ అగ్రనేతలు స్థానికంగా ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇక ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ డివిజన్ మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోక శ్రీనివాసరెడ్డిని బీజేపీ బరిలో నిలిపింది. నియోజవర్గ పరిధిలో మూడు జీహెచ్ఎంసీ డివిజన్లకు బీజేపీ కార్పొరేటర్లున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గట్టిపోటీదారుగా మారిపోయారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకుని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలాన్ని, బీసీ సామాజిక వర్గాల అండనే నమ్ముకున్నారు. మజ్లిస్ నుంచి నాన్ మైనారిటీ నేత బరిలో ఉండటంతో ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మేడ్చల్మెరిసేది ఎవరో..? మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓ పక్షం రోజుల క్రితం వరకు మల్లారెడ్డికి కొంత అనుకూల వాతావరణం ఉన్నా, పది రోజుల్లో బీఆర్ఎస్ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లోకి మారటం ఆయనపై ప్రభావాన్ని చూపుతోంది. బోడుప్పల్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు, ఘట్కేసర్ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మేడ్చల్, శామీర్‌పేటల్లోని కొందరు సర్పంచులు, ఓ వైస్ ఎంపీపీ కూడా పార్టీ కండువా మార్చుకోవటం కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల కొంత సానుకూల ధోరణికి ఈ నేతల మార్పులు తోడు కావటంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. కానీ ప్రచారంలో ఇంకా జోరుపెంచాలి. ఇక మంత్రిగా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మల్లారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మల్లారెడ్డి మాట తీరు, ఆయన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి అనుచరులపై ఉన్న ఆరోపణలు కూడా ఆయనకు కొంత ప్రతికూలంగా మారేలా ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి దయానంద్ గౌడ్ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోంది. తాండూరు ఇద్దరి మధ్యనే తీవ్రపోటీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి ఆతర్వాత బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు కారు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్నే అంటిపెట్టుకుని ఉన్నా పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీ మారకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడింది. ఆయన తన సోదరుడు నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొడంగల్‌లో ప్రచారానికే పరిమితమయ్యారు. కుల్కచర్లకు చెందిన డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తాండూరు అభ్యర్థిగా నిలబెట్టింది. గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ స్థానం కావటం, ప్రభుత్వంపై స్వతహాగా ఉండే వ్యతిరేకత, ఎమ్మెల్యే అనుయాయులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ నేతలు సిద్ధపడ్డా, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి నేమూరి శంకర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. దీంతో బీజేపీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్ పోటీ పడుతున్నారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.. -ఉమ్మడి రంగారెడ్డి గ్రామీణ నియోజకవర్గాల నుంచి గౌరీభట్ల నరసింహమూర్తి -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ.. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా
-
మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు
హస్తినాపురం/మర్రిగూడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. హస్తినాపురం షిరిడీ సాయినగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లు, మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇంట్లోని ఒక ఇనుప పెట్టెలో రెండు కోట్ల ఏడు లక్షల నగదు, కిలో బంగారు నగలు, విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. మొత్తం వీటి విలువ రూ.నాలుగున్నర కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప్నం మండలం వెలిమినేడుకు చెందిన మంచిరెడ్డి అంజిరెడ్డి కుమారుడు. అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్‌రెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీటీవోగా పనిచేశాడు. తర్వాత ప్రమోషన్‌పై మహేశ్వరం తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. కందుకూరు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మహేందర్‌రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 45 రోజుల క్రితం మర్రిగూడ తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బీజేవైఎం ధర్నా
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్‌బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్‌బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్‌బుక్‌ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్‌బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్‌లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్‌్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్‌ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్‌లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్‌బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్‌బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్‌కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
మూడుసార్లు మొమో జారీ.. అయినా మారని బుద్ధి.. మహిళా కానిస్టేబుల్‌తో.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. న్యాయం చేయండయ్యా మహాప్రభో అని పోలీసు స్టేషన్ మెట్లెక్కిన పాపానికి అందినకాడికి దోచుకుంటున్నారు. దొంగల నుంచి సొత్తు రికవరీ చేసి చట్ట ప్రకారం బాధితులకు అందించాల్సిన వారే కొంత వాటా నొక్కేస్తున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వాళ్లపై చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఉల్టా(అక్రమ)కేసులు బనాయిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు సైతం రక్షణ లేకుండా పోయింది. సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి డివిజన్లోని ఓ పోలీసు స్టేషన్ అధికారి తీరుకు ఇదీ నిదర్శనం. అక్రమ కేసులు బనాయిస్తూ.. సదరు స్టేషన్ అధికారి సివిల్ తగాదాల్లో తల దూర్చుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో కొన్నేళ్ల క్రితం కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఈ స్థలం వెనకాల ఉన్న వారికి రహదారి లేకపోవటంతో..స్థానిక పోలీసు అధికారిని సంప్రదించి విషయాన్ని వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు పోలీసు..భూ యజమానిని పిలిపించి రోడ్డు ఇవ్వాలని ఆదేశించాడు. ససేమిరా అని చెప్పిన ఓనర్.. తన వద్ద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు అందించిన సర్వే రిపోర్టును సైతం చూపించాడు. తన స్థలాన్ని ఆక్రమించకుండా రేకుల షెడ్డును నిర్మించుకున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న సదరు పోలీసు.. భూ యజమాని, అతని ముగ్గురు అనుచరులపై అక్ర మంగా కేసు నమోదు చేశాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గ్రామంలో చోటు చేసుకున్న ఓ చిన్నపాటి తగాదాలో పెద్ద మనిషిగా వెళ్లిన పాపానికి ఓ సర్పంచ్‌పై ఏకంగా మూడు కేసులు బనాయించడం గమనార్హం. రాజీకొస్తే కేసులు నమోదు ఇటీవల పక్క జిల్లాకు చెందిన కొందరు స్నేహితులు కలిసి మండలంలోని ఓ గ్రామంలో పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు దోబిపేట వద్ద ప్రమాదానికి గురైంది. కేసు ఎందుకులే అని భావించిన ఇరు కార్ల యజమానులు రాజీ కుదుర్చుకొని వెళ్లిపోయారు. తన ప్రమేయం లేకుండా రాజీ కుదు ర్చుకుంటారా అని ఆగ్రహించిన సదరు పోలీసు..ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఇరువురి యజమానులను స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేయడం గమనార్హం. మరో ఘటనలో స్థానికంగా ఇద్దరు యువకుల మధ్య తగాదా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకొని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి సమక్షం లో రాజీ కుదిర్చారు. ఘటనతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మాటలు విని ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. దొరికింది ఎంతో.. ఇచ్చింది అంతంతే.. ఇటీవల ఓ కుటుంబం తిరుపతికి వెళ్లింది. తిరిగొచ్చేసరికి దొంగలుపడ్డారు. 20 తులాల బంగారం, నగదు చోరీ జరిగింది. పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని పూర్తిగా బాధితులకు అందించలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే విషయమై బాధితుడిని వాకబు చేయగా.. సదరు స్టేషన్ అధికారి రికవరీ చేసిన సొత్తులో కొంత నొక్కేశారని, మిగిలిన అరకొర బంగారం తనకెందుకంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే రెండు గ్రామాల్లో గొర్రెలు, మేకలు దొంగతనానికి గురికాగా.. కొన్నాళ్లకు దొంగలు దొరికారు. ఈ కేసులోనూ పోలీసు అధికారి చేతివాటం ప్రదర్శించాడని తెలిసింది. పోలీస్ స్టేషన్లో కరెంట్ సమస్య ఉందని, జనరేటర్ ఏర్పాటు చేయాలని భావించిన పోలీసు.. స్థానిక స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేసినట్టు సమాచారం. నేటికీ స్టేషన్లో జనరేటర్ మాత్రం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. మహిళా కానిస్టేబుల్‌తో అసభ్య ప్రవర్తన స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుళ్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం క్రితం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు వచ్చిన సదరు పోలీసు.. అప్పుడే డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చిన ఓ లేడీ కానిస్టేబుల్‌ను తన వాహనంలో ఎక్కాలంటూ ఆదేశించాడు. తాను వెళ్లిపోతానని, వద్దని వారించినా వినకుండా బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నాడు. ఈ తతంగాన్ని గమనిస్తున్న మరో కానిస్టేబుల్ వీడియో చిత్రీకరించాడు. దీంతో ‘నీకిక్కడేం పనంటూ వెళ్లిపో, మెమో జారీ చేస్తానని’ బెదిరించాడు. మరుసటి రోజు సదరు బాధితురాలు తోటి కానిస్టేబుళ్లతో జరిగిన విషయాన్ని వివరించింది. ప్రస్తుతం ఠాణాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మూడు మెమోలు జారీ.. సదరు పోలీసు అధికారిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమేనని, ఇప్పటికే మూడు మెమోలు జారీ చేశామని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అంతర్గత విచారణ జరుగుతోందని, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. -
మహేశ్వరం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
-
Ranga Reddy District: భూదాన్ భూముల్లో వాలిన గద్దలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు అన్యాక్రాంతమవగా తాజాగా మరికొంత భూమిని మాయం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో భూదాన్ బోర్డు సభ్యులుగా చెలామణి అయిన కొందరు పెద్ద మనుషులు ఈ భూములను కొల్లగొట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో సొంత గూడు సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్న పేదల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. వీకర్ సెక్షన్ కింద పేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములకు రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాల బారి నుంచి కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఖాళీ భూములపై ‘పెద్ద’ల కన్ను.. భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మిగులు భూములు ఉన్న రైతుల నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించి భూదాన్ బోర్డుకు అప్పగించారు. దీనిలో కొంత భూమి పేదలకు పంచారు. మరికొంత భూమిని రైతులు, రియల్టర్లు పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోర్డు పరిధిలో 7000 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నట్లు అంచనా. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 215 నుంచి 227 వరకు ఉన్న సర్వే నంబర్లతోపాటు జాఫర్‌గూడ సర్వే నంబర్ 317, 319లలో 20 ఎకరాలకుపైగా, బాటసింగారం రెవెన్యూ పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో 75 ఎకరాలకుపైగా, కుంట్లూరులో 216 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాలకుపైగా భూదాన్ భూమి ఉంది. అదేవిధంగా తారామతిపేట్ సర్వే నంబర్ 235, 236లలో 48 ఎకరాలు ఉండగా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189లలో పెద్ద సంఖ్యలోనే భూదాన్ భూములున్నాయి. బాలాపూర్‌లోని సర్వే నంబర్ 88లో 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇక యాచారం, ఇబ్రహీపట్నం, మంఖాల్, మహేశ్వరంలోనూ ఈ బోర్డుకు భూములు ఉన్నాయి. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమైనప్పటికీ జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు, అమ్మకాలు కొనసాగు తున్నాయి. లీజు పేరుతో గలీజు వ్యవహారాలు... ఇప్పటికే మెజారిటీ భూములను రియల్టర్లు కొల్లగొట్టగా మరికొంత భూమిని గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు మాయం చేస్తున్నారు. వీకర్ సెక్షన్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద మొత్తంలో భూములు కొల్లగొట్టారు. ఒకే ప్లాటుకు 2, 3 నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఒక్కో ప్లాటును రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది విద్యాసంస్థలు, గోశాలలు, అనాథాశ్రమాలు, ఇతర సామాజిక సేవల పేరుతో ఈ భూములను వందేళ్లకు లీజుకు తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. (క్లిక్ చేయండి: డీజీపీ రేసులో పోటాపోటీ!) బోర్డును పునరుద్ధరించాలి... నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా సుమారు రూ. 19 కోట్లు అక్రమంగా వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. భూదాన్ భూములను కాపాడాలంటే బోర్డును పునరుద్ధరించడం ఒక్కటే పరిష్కారం. – వెదిర అరవింద్‌రెడ్డి, అధ్యక్షుడు, సర్వసేవాసంఘ్ (అఖిల భారత సర్వోదయ మండల్) మేమే పంచుతాం.. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భూములు మాయమయ్యాయి. కబ్జాదారుల చెరలోని భూములను విడిపించాలి. కనీసం మిగిలిన భూములైనా ప్రభుత్వం పేదలకు పంచాలి. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలోనే భూపంపిణీ చేపడతాం. – రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
పెళ్లినాటికి నాకు సైకిల్, రెండు గేదెలే... కానీ, ఇప్పుడు
హుడాకాంప్లెక్స్(రంగారెడ్డి జిల్లా): ‘నా పెళ్లి(1976) నాటికి సైకిల్, రెండు పశువులు మాత్రమే ఉండె. కానీ, ఇప్పుడు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అతిపెద్ద విద్యాసంస్థలు స్థాపించా. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యా’ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివా రం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడ్డానని, అనేక వ్యాపారాలు చేసి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచ నగరాలకు దీటుగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగరం నలమూలలా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ రంగం కుదేలైనా హైదరాబాద్‌లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందని, ప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు అందజేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరు కాదు, హైదరాబాదే.. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గుర్తుకొ చ్చేదని, కానీ ఇప్పుడు కేటీఆర్ చొరవతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని, ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటి ముఖ్య కార్యాలయాలు ఇక్కడే కొలువుదీరాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్బీ నగర్లో చేపట్టిన అభివృద్ధి వల్ల ఈస్ట్‌జోన్ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. నాగోలు నుంచి గండిపేట వరకు మూసీకి ఇరువైపులా రూ.1,370 కోట్ల వ్య యంతో 120 అడుగుల రోడ్డు నిర్మించేందు కు ప్రణాళికలు రూపొందించామని చెప్పా రు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
నందిగామ: లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యా డు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు శనివారం రైలు పట్టాల పక్కన శవమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో వెలు గు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామకు చెందిన సాయి చరణ్ లోన్‌యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఇటీవల వారి వేధింపులు ఎక్కువయ్యా యి. తీసుకున్న రుణం చెల్లించినా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులతో చెప్పి వాపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్.. గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ శివారులో ఓ మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఇన్స్పెక్టర్ రామయ్య.. మృతదేహాన్ని చరణ్‌గా గుర్తించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ‘చరణ్ ఏ యాప్ నుంచి రుణం తీసుకున్నాడు.. ఎంత మేర చెల్లించాడు’ అనేది తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
బాలికపై సామూహిక అత్యాచారం
మీర్‌పేట: జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన ఓ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట లెనిన్‌నగర్ ప్రశాంత్‌నగర్ ఫేజ్–2కు చెందిన ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 5న రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఉండే జిరాక్స్ షాప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రతన్ (22) కలిశాడు. నేనూ మీ ఇంటి వైపే వెళ్తున్నాను.. డ్రాప్ చేస్తానంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక మరో బాలుడు (17) కూడా బైక్‌పై ఎక్కాడు. బాలికను ఇంటి వద్ద దించకుండా రైతుబజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను ఎక్కించుకున్న చోటే వదిలేశారు. కాగా, జిరాక్స్ కోసమని బయటకు వెళ్లిన కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. బాలిక ఇంటికి వచ్చిందని చెప్పడంతో వెనక్కి వచ్చారు. మరుసటి రోజు బాలికను ఈ విషయమై అడగగా.. రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బైకుపై తిప్పి తిరిగి వదిలేశారని మొదట చెప్పింది. అనుమానం కలిగిన తల్లిదండ్రులు మరోసారి గట్టిగా నిలదీయడంతో వారిద్దరూ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు రతన్, బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రతన్ పాత నేరస్తుడని అతనిపై నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. వారిపై పోక్సో, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని చెప్పారు. -
Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో కలకలం!
-
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
-
రంగారెడ్డి: కోకాపేటలో పేలిన సిలిండర్
-
కు.ని ఆపరేషన్ తర్వాత అనారోగ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత అనారోగ్యం పాలైన నలుగురు మహిళల్లో ఒకరు మరణించగా మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 25న వివిధ మండలాలకు చెందిన 37 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇద్దరు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ల అనంతరం ఇంటికి వెళ్లిన వారిలో మాడ్గులకు చెందిన మమత (30) రెండు రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆమె మరణించింది. మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఆపరేషన్ చేయించుకున్న రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ ఈ నెల 27 ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లింది. సుష్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో ఇద్దరు మహిళలు కూడా వాంతులు, విరోచనాలతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసినప్పుడు బాగానే ఉన్నారు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సమయంలో అందరూ బాగానే ఉన్నట్లు తెలిసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్లు చేసిన ఇద్దరు వైద్యులు అనుభవం ఉన్నవారే. ఆపరేషన్ చేసిన చోట ఎలాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు అనారోగ్యానికి గురైన మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. వైద్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. – నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఇబ్రహీంపట్నం -
కాన్హా ధ్యాన కేంద్రం తెలంగాణకు గర్వకారణం
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్దదైన కాన్హా శాంతివనం ధ్యాన కేంద్రానిట్న తెలంగాణలో ఏర్పాటు చేయడం చాలా గొప్పవిషయమని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన రైజింగ్ విత్ ౖMðండ్‌నెస్ (యువజన సదస్సు) కార్యక్రమాన్ని కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఈ ప్రదేశాన్ని మార్చి వేసి.. పచ్చని చెట్లు పెంచి, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3ఐలకు.. అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి అభివృద్ధికి బాటలు వేసిందని, దీంతో యువత ఆలోచన, భావజాలంలో ఎంతో మార్పువచ్చిందని వివరించారు. ఈ ఆలోచనా విధానంతోనే రాష్ట్ర ప్రభుత్వం 240 కోట్లకు పైగా మొక్కలు నాటిందని చెప్పారు. కాగా, కేవలం ఐదు సంవత్సరాలలో లక్షలాది మొక్కలు నాటి బంజరు భూమిని పచ్చగా మార్చడంతో కాన్హా శాంతివనం ఎంతో గొప్పగా రూపుదిద్దుకుందని కొనియాడారు. యువతకు కరుణ, దయా, విలువల గురించి అవగాహనను కల్పించడానికి విద్యాసంస్థల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం గురూజీ దాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో స్వాభావికమైన దయ గుణం ఉంటుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో యూఏఈ, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 12 వేల మంది పాలుపంచుకుంటున్నారు. గురూజీ కమ్లేష్ పటేల్, యునెస్కో డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఖతీజా రెహ్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యువకుడితో చాటింగ్.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి
రంగారెడ్డి: యువతి అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పల్లె మహేశ్వరి(20) శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉంది. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చే వరకు యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వాకబు చేసిన అచూకీ లభించలేదు. దీంతో చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి ఇటీవల సందీప్ అనే యువకుడితో చాటింగ్ చేస్తుండడంతో కుటుంబసభ్యులు మందలించినట్లు తెలిపారు. దీంతో యువతి సోదరుడు సందీప్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్ భర్త జితేందర్ యాదవ్ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్‌కే చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. రెండు నెలల క్రితం వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
రియల్ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు
-
సార్.. వాడ్ని బండరాయితో బాదిన...
మొయినాబాద్: ‘సార్.. వాడి తలపై బండరాయితో బాదిన.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నడు’అని ఓ బాలుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. స్పందించిన పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలొదిలాడు. మద్యం మత్తులో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ గ్రామానికి చెందిన దుబ్బ సతీశ్ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి తూలుకుంటూ మండల కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ బాలుడు అతని స్నేహితులు నలుగురు ఫొటోలు దిగేందుకు అటువైపు వచ్చారు. గుడి దగ్గర బాలుడి స్నేహితుడికి చెందిన బైక్ ఆపారు. దానిపై బాలుడు కూర్చొని ఉండగా మత్తులో ఉన్న సతీశ్ తన బైక్‌పై ఎందుకు కూర్చున్నావని బాలుడిని ప్రశ్నించాడు. ‘బైక్ నీదికాదు మా స్నేహితుడిది’అంటూ బాలుడు అతన్ని తోసేశాడు. కిందపడిన సతీశ్ లేచి కొట్టే ప్రయత్నం చేయడంతో, సదరు బాలుడు పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని అతని తలపై మోదాడు. దీంతో సతీశ్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే బాలుడు తన స్నేహితులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, సాయంత్రం ఆరు గంటల సమయంలో ఘటన జరగడం, అప్పటికే చీకటి పడటంతో అటువైపు ఎవరూ వెళ్లి చూడలేదు. రాత్రి 10 గంటల సమయంలో బాలుడు మళ్లీ ఘటనా స్థలానికి వచ్చాడు. అప్పటికీ సతీశ్ కొన ఊపిరితో ఉండటంతో 100కు డయల్ చేశాడు. తాను బండరాయితో ఒకరిని కొట్టానని, అతనింకా కొనఊపిరితో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సతీశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
పట్టభద్రుల పోటీ... రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’తో పాటు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్ జోష్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్’స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ టీఆర్ఎస్ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వంటి వారు టికెట్‌ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’స్థానం నుంచి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్ శ్రీనివాస్, వికారాబాద్‌కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్ పటేల్ కూడా టీఆర్ఎస్ టికెటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..! ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్ నగర్’ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోమారు బరిలోకి రాంచందర్‌రావు? ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌రావు తదతరులు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వరంగల్ బరిలో కోదండరాం ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
తెలంగాణలో పచ్చదనం పెరిగింది
షాద్‌నగర్ టౌన్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్కలు నాటారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రకాశ్‌రాజ్ తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు పెంచే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారని, గత ఆరేళ్ళ కాలంలో తెలంగాణలో పచ్చదనం పెరిగిపోయిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌లు మట్టిమనుషులని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినీ నటులు మోహన్‌లాల్, సూర్య, రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. -
మరో బాలికపైనా అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ అనాథాశ్రమంలో అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడి మారుతి అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన దళిత క్రైస్తవ బాలిక బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. తనలాగే మరో బాలిక కూడా వేధింపులకు గురైందని కొన్నిరోజుల క్రితం ఆమె చెప్పినట్టు మృతురాలి పిన్ని ప్రీతి వెల్లడించారు. ఆ బాలిక సైతం అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని చెప్పారు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వారు తమ కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్టు వివరించారు. ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే ప్రధాన నిందితుడు నరెడ్ల వేణుగోపాల్‌రెడ్డి.. 14 ఏళ్ల బాలికపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడగా, అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతడికి సహకరించిన విషయం తెలిసిందే. రెండో బాలికపై సైతం వేణుగోపాల్‌రెడ్డి అత్యాచారం చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనాథాశ్రమానికి తరచుగా ఇతర వ్యక్తులు, దాతలు వచ్చి విజయకు డబ్బులు, స్వీట్లు ఇచ్చి వెళ్లేవారని.. ఈ వ్యవహారంలో వేరే వ్యక్తుల పాత్రా ఉండవచ్చనే అనుమానాలున్నాయి. దర్యాప్తులో నిర్లక్ష్యం..?: గతనెల 31న ఈ ఘటన వెలుగులోకి రాగా, ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపే విషయంలో స్థానిక పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనాథాశ్రమంలో 70 మందికి పైగా అనాథ, పేద బాలికలు ఉండగా, లాక్డౌన్ ప్రకటించడంతో కొంతమంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో లాక్డౌన్లో 49 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. వీరిలో 29 మంది బాలికలు 18 ఏళ్ల వయస్సు లోపు గలవారు ఉన్నారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడ ఆశ్రయం పొందిన బాలికలందరినీ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కూడా ఏమైనా అఘాయిత్యాలు జరిగాయా అనే అంశాన్ని కూపీ లాగడంలో పోలీసులతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి ‘చేయూత ఫౌండేషన్’పేరుతో చాలాకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడని.. తనకున్న పలుకుబడి, పరిచయాలతో కేసును ప్రభావితం చేశాడని ఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఓ ముఖ్యురాలితో వేణుగోపాల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, కమిటీ సమావేశాల్లో సైతం అతడు కూర్చునేవాడని ఓ ఎన్జీవో ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. రెస్క్యూ చేసిన బాలికలను మారుతి అనాథాశ్రమానికి పంపించాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని, లాక్డౌన్ సమయంలోనే 29 మంది బాలికలను అక్కడకు పంపించిందని ఆరోపించారు. దాతల నుంచి విరాళాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను రాబట్టడంలో వేణుగోపాల్‌రెడ్డి నేర్పరి అని ఎన్జీఓలు పేర్కొంటున్నాయి. సెప్టిసియాతో బాలిక మరణం.. అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఏర్పడిన ఇన్ఫెక్షన్ రక్తంతో పాటు మొత్తం శరీరానికి వ్యాప్తి చెందిందని, దీంతో ఆమె సెప్టిసియాతో మరణించిందని నిలోఫర్ వైద్యులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఆమె మరణానికి అసలు కారణాలు తెలియనున్నాయి. కాగా, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన అనాథాశ్రమాలు రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా ఉండగా.. వాటిలో దాదాపు 13వేల మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్ ప్రకటించడంతో దాదాపు 9వేల మంది తమ సమీప బంధువుల దగ్గరికి వెళ్లిపోయారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. మారుతి అనాథాశ్రమం ఘటన నేపథ్యంలో ఇక ఎక్కడైనా ఎవరైనా లైంగిక హింసకు గురయ్యారా లేక వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధ్యయనం జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంధువుల ఇళ్లకు వెళ్లిన బాలికల వద్దకు అంగన్వాడీ వర్కర్లను పం పి వారితో మాట్లాడించనుంది. బాలికల నుంచి ఫిర్యాదులు వస్తే అనాథాశ్రమం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారవర్గాలు తెలిపాయి. -
వాగ్దానాన్ని నిలబెట్టుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా:/సంగారెడ్డి/పటాన్చెరు: వరంగల్‌లోని కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అతీగతీ లేదన్నారు. రాజకీయం చేయడం కోసం కాదని.. బాధతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి గురువారం ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేధా సంస్థ ద్వారానే తెలంగాణకు రైల్‌కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ప్రైవేటు సెక్టార్లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఆదిబట్ల కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడి భాగాలు, జహీరాబాద్‌లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని తెలిపారు. తాజాగా రైల్‌కోచ్ తయారీ లోటూ తీరిందన్నారు.హ్యుందాయ్ రోటెమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్న ఈ రంగంలో తెలంగాణకు చెందిన మేధా సంస్థ ఉండటం ఈ ప్రాంత బిడ్డగా ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో మోనో రైళ్ల ఏర్పాటుకు అవసరమైన కోచ్ లను మేధా సంస్థ అందించాలని కోరారు. 18 నెలల్లో ఈ సంస్థ మొదటి యూనిట్ ద్వారా కోచ్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు. హై స్పీడ్ రైళ్ల రాక అవసరం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావనే అపోహలు, అనుమానాల నుంచి.. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని కేటీ ఆర్ చెప్పారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రంగా అవతరించాలని ఆయన ఆకాక్షించారు. హై స్పీడ్ రైళ్లను తీసుకురావాల్సి ఉందని, వాటితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. గంట కు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లతో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు గంటలో, ఆదిలాబాద్‌కు గంటంబావులో చేరుకోవచ్చని అన్నారు. తద్వారా హైదరాబాద్‌లో పనిచేసే వ్యక్తి.. ఇక్కడే జీవించాల్సిన పనిలేకుండా ఇతర జిల్లాల నుంచి ట్రైన్ల ద్వారా రాకపోకలు సాగించవచ్చన్నారు. హై స్పీడు రైల్వే నెట్వర్క్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. స్థానికులకే 70 శాతం ఉపాధి కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీల్లో 70 శాతం వరకు స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ స్థాయిలో ఉపాధి కల్పిస్తే.. పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ద్విచక్ర పాలసీని అధ్యయనం చేసి ఆ దిశగా కూడా ప్రయత్నించాలని మేధా సంస్థను కోరారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిల్లో కొండకల్, వెలిమలలో ఏర్పాటవుతున్న రైల్‌కోచ్ ఫ్యాక్టరీ.. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. అలాగే ఆయా పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం ఎంపీ నిధులతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని కేటీఆర్ కోరారు. మేధా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేధా సంస్థ ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఎస్ఐఐసీ అధ్యక్షుడు బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఇంట్లో ముగ్గురు కోవిడ్‌తో మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకవైపు అయినవారంతా కళ్లముందే కన్నుమూస్తుంటే...మరోవైపు ఆస్పత్రుల ధనదాహానికి కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురికావాల్సి వచ్చింది. వైరస్ ఎలా సోకిందంటే... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామానికి చెందిన ఆన్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి (60), భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేటలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. ఆయన సోదరుడి కుమారుడు అడ్వకేట్ అన్రెడ్డి హరీష్ రెడ్డి (37) తన భార్యాపిల్లలతో కలిసి ఇదే డివిజన్లోని రెడ్డికాలనీలో ఉంటున్నారు. భూ వివాదానికి సంబంధించిన అంశంపై వీరంతా ఇటీవల ఒకే కారులో స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లివచ్చారు. ఆ తర్వాతి మూడురోజులకే అడ్వకేట్ హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన కోవిడ్ పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్య, ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్ వచ్చింది. బాబాయ్ సత్యనారాయణ రెడ్డి, పిన్ని సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. జూలై మొదటి వారంలో హరీష్‌రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇన్సూరెన్స్‌పై చికిత్సలు అందించేందుకు వారు నిరాకరించడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 23న మృతి చెందారు. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు వెచ్చించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు. ఆ తర్వాత పిన్ని, బాబాయ్... హరీష్‌రెడ్డికి కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన బాబాయ్ సత్యనారాయణరెడ్డి, పిన్ని సుకుమారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. జూలై 10న వారిద్దరు చికిత్స కోసం తొలుత సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయి హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన రెండ్రోజులకే సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆయాసం, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను చికిత్స కోసం జూలై 15న మళ్లీ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన భార్యకు కూడా శ్వాస సమస్యలు తలెత్తాయి. శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా తక్కువగా ఉంది. ఆమెను కూడా డెక్కన్ ఆస్పత్రిలోనే చేర్పించేందుకు కుమారుడు యత్నించాడు. అయితే పడకలు లేవని చెప్పి ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. తెలిసిన వైద్యుడి సహాయంతో ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శనివారం బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుంది. పరిస్థితి విషమించి మంగళవారం (28న) ఉదయం మృతి చెందగా, డెక్కన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూడా ఇదేరోజు రాత్రి మృతి చెందారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూనే ఉన్నాం ‘సత్యనారాయణరెడ్డికి కోవిడ్‌తో పాటు హార్ట్ , కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించాం. ఆయనకు వాడుతున్న మందులు, చేస్తున్న వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు వివరించాం. మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయన్ను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు’అని డెక్కన్ ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. బిల్లు కోసం ఆస్పత్రి మెలిక ‘మా అమ్మనాన్నలను చికిత్స కోసం ముందు డెక్కన్ ఆస్పత్రికి తీసుకెళ్లాను. కోవిడ్ పాజిటివ్ అని తెలిసి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. రెండు రోజుల తర్వాత నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లాను. 15వ తేదీన అడ్మిట్ చేశాను. పది రోజులకు రూ.17.50 లక్షల బిల్లు వేశారు. ఇప్పటికే రూ.8 లక్షలు చెల్లించాను. ఇదే సమయంలో నాకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటు అమ్మ దగ్గరకు, అటు నాన్న దగ్గరకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. బిల్లు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి వాళ్లు పదేపదే ఫోన్లు చేశారు. కోవిడ్ పేషంట్ని అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అమ్మ చనిపోయిన రోజే..నాన్న కూడా చనిపోయారు. మిగిలిన బిల్లు చెల్లిస్తేనే.. మృతదేహాం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం మెలికపెట్టింది. మీడియాను ఆశ్రయించడంతో చివరకు నాన్న మృతదేహాన్ని అప్పగించారు. నాలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు’అని కుమారుడు రాజేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఇబ్రహీంపట్నం: రంగారెడి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ(52) అనారోగ్యంతో మృతి చెందారు. ఘగర్, బీపీ లెవల్స్ పెరగడంతో పది రోజుల క్రితం ఆయన నిమ్స్‌లో చేరారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో నర్సింహ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన నర్సింహకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నిమ్స్ వద్ద నర్సింహ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. నర్సింహ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దళిత నేత చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్ సీఎం పూజలు
శంషాబాద్ రూరల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు శుక్రవారం ముచ్చింతల్‌లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు దంపతులు పాల్గొన్నారు. -
చురుగ్గా నైరుతి..
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కోమోరిన్లకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశ మున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో మే 31న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాగల 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా రుతుపవనాలు ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రప్రాంతాల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది 24 గంటల్లో వాయు గుండంగా మారి, మరింత బలపడే అవకాశముంది. దీని వల్ల శని, ఆదివారాల్లో వడగండ్లు, ఉరుములు, ఈదురుగాలులతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. -
ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కోర్సులో సీటు దక్కింది. హైదరాబాద్ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. ఇంకా ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఫారెస్ట్రీ కోర్సులో దీపిక కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ యూనివర్సిటీ ఎమ్మెస్‌లో సీటును పూర్తి ఉచితంగా ఇచ్చింది. రెండేళ్ల ఈ ఎమ్మెస్ కోర్సు ఫీజు 15,000 డాలర్లు కాగా దీనిని మాఫీ చేయటంతో పాటు నెలకు 1,500 డాలర్ల స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసింది (ఈ రెండింటి విలువ దాదాపు రూ. 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా). అబర్న్ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్ జన్నా విల్లోగ్ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించడంలో భాగంగా ఎఫ్సీఆర్ఐ గతంలో అబర్న్ తోపాటు కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరో ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కే అవకాశం ఉందని కాలేజీ డీన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక తన అకడమిక్ కోర్సులో భాగంగా ఉన్నతవిద్యను అభ్యసిస్తానని, అందులోనూ అమెరికాలో ఎమ్మెస్ చదువుతానని తాను ఊహించలేదని సూర్య దీపిక తెలిపింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అటవీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది తనకు అన్నివిధాలా అండగా నిలిచారని పేర్కొంది. నగర శివార్లలోని ములుగులో నెలకొల్పిన ఎఫ్సీఆర్ఐలో ప్రస్తుతం బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు నడుస్తోంది. 2016కు చెందిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది ఉన్నత చదువులతో పాటు, సివిల్ సర్వీసులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు వచ్చినట్లు డీన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. -
గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్
కోహెడ/హయత్‌నగర్: గాలివాన బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్ షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ మామిడి ప్యాక్ చేస్తున్న సుమారు 30 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చిన గాలివానకు అవి తట్టుకోలేకపోయాయి. ఒక్క షెడ్డు పూర్తిగా కూలిపోగా, మిగిలిన 3 షెడ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 1000 టన్నుల మామిడి మార్కెట్లో ఉంది. దీని విలువ రూ.1.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలి పాయి. కాయలన్నీ దెబ్బతిన్నాయని రైతులు, వ్యాపారులు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి వచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరికి తీవ్ర గాయాలు : షెడ్డు కూలిన ఘటనలో తొర్రూర్‌కు చెందిన తిమ్మమ్మ, నాగోల్ జైపురి కాలనీకి చెందిన అన్వేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మల్లేష్, శ్రీహరి, రేణుక, లక్ష్మి, తిరుపతమ్మ, అనిల్‌కుమార్, సలీం షేక్, హజీ పాషా, గౌస్ పాషా, నర్సింహ్మా, మల్లమ్మ, హనుమంతు, శివ, ఆంజనేయులు, యాదగిరి, యాద య్య, మమత, లక్ష్మి, సునీత, హైమవతి, షేక్ దస్తగిరి, అంజమ్మ, నీలా, సత్తయ్య, యాద య్య, నర్సమ్మ, బుజ్జ మ్మ, జుబేర్ ఖాన్ ఉన్నారు. వీరిలో కొందరు కోహెడకు మరికొందరు సింగరేణి కాలనీకి చెందినవారు. ప్రస్తుతం వీరు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. కమీషన్లకు ఆశపడి నాణ్యత లేని షెడ్లను నిర్మించారని ఆరోపించారు. చికిత్స పొందుతున్న బాలిక నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు మూడు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
12 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు తెలంగాణ సర్కారు అన్ని రకాలుగా సిద్ధమైంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో 12 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌లో 9, వరంగల్‌లో 2, రంగారెడ్డిలో ఒక ఆసుపత్రి కరోనా కోసం ప్రత్యేకంగా పనిచేస్తాయి. వీటిలో ఇతర రోగులకు చికిత్స చేయరు. ఆయా ఆసుపత్రుల్లో 4,177 ఐసోలేషన్, 600 ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. ఇవికాక, మిగతా జిల్లాల్లోని జిల్లా ఆసుపత్రులతో కలిపి మొత్తం 12 వేల పడకలను అందుబాటులోకి తెస్తారు. అలాగే కరోనాకు చికిత్స అందించే డాక్టర్లకు అవసరమైన సలహా సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిప్‌మార్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఏయే జిల్లాల నిర్ధారణ పరీక్షలంటే.. ► గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్.. ఈ నాలుగుచోట్లా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏయే జిల్లాల నమూనాలు పరీక్ష కేంద్రానికి పంపాలనేది కూడా సర్క్యులర్‌లో స్పష్టంచేశారు. ► ఉస్మానియా మెడికల్ కాలేజీ: కింగ్‌కోఠి, ఛాతీ ఆసుపత్రి, సరోజిని కంటి ఆసుపత్రి, వరంగల్ ఎంజీఎం నుంచి శాంపిళ్లు ఇక్కడకు వెళ్తాయి. ఇంకా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లనన్నింటినీ ఈ కాలేజీకి పంపిస్తారు. ► ఫీవర్ ఆసుపత్రి: ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్‌క్యూర్, నిజామియా జనరల్ ఆసుపత్రి, రామంతాపూర్ హోమియో ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను ఇక్కడకు పంపించాలి. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల శాంపిళ్లను కూడా ఇదే ఆసుపత్రిలో పరీక్షిస్తారు. ► గాంధీ ఆసుపత్రి: ఇక్కడికి నేరుగా వచ్చే కేసులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల శాంపిళ్లను ఇక్కడ పరీక్షిస్తారు. ► నిమ్స్: గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా ఆసుపత్రి నుంచి వచ్చే శాంపిళ్లను పరీక్షిస్తారు. 12 ఆసుపత్రులు.. పడకల వివరాలు ఆసుపత్రి పేరు పడకల సంఖ్య ► హైదరాబాద్ కింగ్‌కోఠి ఆసుపత్రి 350 ► గాంధీ ఆసుపత్రి 1,500 ► ఛాతీ ఆసుపత్రి 130 ► సరోజినీదేవి కంటి ఆసుపత్రి 200 ► ఫీవర్ ఆసుపత్రి 82 ► బేగంపేటలోని నేచర్ క్యూర్ 250 ► చార్మినార్ నిజామియా జనరల్ ఆసుపత్రి 200 ► ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి 200 ► రామంతాపూర్ హోమియో ఆసుపత్రి 90 ► గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1,500 ► వరంగల్ ఎంజీఎం 175 ► వరంగల్ ఆయుర్వేద బోధనాసుపత్రి 100 అన్ని జిల్లాలకు 74 అంబులెన్సులు కరోనా రోగులను తరలించేందుకు, అవసరమైన వారు కరోనా ఆసుపత్రులకు చేరేందుకు 74 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయో కూడా లొకేషన్ సహా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర కలిగినవారు, వారితో కాంటాక్ట్ అయినవారు, ఒకవేళ పాజిటివ్ కేసున్నా ఈ అంబులెన్సులకు ఫోన్‌చేసి రప్పించుకోవచ్చు. -
చిన్నారులను చిదిమేసిన స్కూల్ వ్యాన్
యాచారం: మరికాసేపట్లో బంధువులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు అంతలోనే మృత్యుఒడికి చేరారు. శుభకార్యానికి వెళ్తూ వ్యాన్ కింద చితికిపోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం అనుబంధ గాండ్లగూడెంకు చెందిన బెల్లి రమేశ్, రజిత దంపతులకు వివేక్ (14), గౌతమ్ (9), విశాల్ సంతానం. వీరిలో వివేక్ 9, గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. యాచారంలో జరిగే ఓ శుభాకార్యానికి గురువారం రమేశ్ తన కుమారులతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మొండిగౌరెల్లి చౌరస్తాకు రాగానే ఓ వృద్ధుడు స్కూటీతో వీరిని ఢీకొట్టాడు. అప్పటికే వేగంగా వెళ్తున్న రమేశ్ అదుపుతప్పి పిల్లలతో పాటు కిందపడిపోయాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన పాఠశాల వ్యాన్.. చిన్నారుల మీదుగా వెళ్లింది. వివేక్, గౌతమ్ వ్యాన్ చక్రాల కింద చితికి అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన తండ్రి రమేశ్.. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాడు. మరో కుమారుడు విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వివేక్, గౌతమ్ మృతదేహాలను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. రమేశ్, విశాల్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. చిన్నారులు రక్తపుమడుగులో పడి ఉండడం చూసి బోరున విలపించారు. ఈ ప్రమాదంతో నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్ తెలిపారు. -
అడవుల సంరక్షణకు కృషి
మహేశ్వరం: అడవుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోం దని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మజీద్‌గడ్డ రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన ‘జంగల్ క్యాంపు’ను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. నగరానికి సమీపంలో నిరుపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్టు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో అర్బన్ ఫారెస్టు పార్కును ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో 60 పార్కులు, ఇతర పట్టణాల్లో 34 పార్కులను రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ అడ్వెంచర్ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. -
నిందితులను మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, షాద్‌నగర్ టౌన్: ‘దిశ’ను అత్యాచారం, హత్య చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం కోర్టుకు వచ్చిన పోలీసులు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేకపోవడంతో కొద్ది సేపటికే వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం కోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉందని, పది రోజుల కస్టడీ కావాలని పిటిషన్లో కోరినట్లు సమాచారం. కస్టడీపై కోర్టు తమ నిర్ణయాన్ని నేడు వెల్లడించనుంది. కాగా, నిందితులను చర్లపల్లి జైలు నుంచి షాద్‌నగర్ కోర్టుకు తీసుకొస్తున్నారన్న పుకార్లతో జనం పెద్ద ఎత్తున కోర్టు వద్దకు వచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు నేడు తుది నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదన్నారు. కాగా షాద్‌నగర్‌లో నిరసనలు అట్టుడుకుతున్నందున అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశముంది. -
డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(6) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఆమనగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు డెంగీ అని చెప్పారు. దీంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మందలించారని విద్యార్థుల బలవన్మరణం
ఆమనగల్లు, చేవెళ్ల : తల్లిదండ్రులు మందలించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు, ఆమనగల్లులో బుధవారం ఈ ఘటనలు జరిగాయి. ఆమనగల్లులోని గాంధీనగర్ కాలనీకి చెందిన పార్థసారథి కుమారుడు శ్రీశాంత్ స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శ్రీశాంత్ హోంవర్క్ చేయలేదని తల్లిదండ్రుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకువెళ్లారు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల భోజన విరామ సమయంలో శ్రీశాంత్ ఇంటికి భోజనం కోసం వెళ్లాడు. ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో పాఠశాల వద్ద దుకాణం నిర్వహిస్తున్న తల్లి వెంటనే ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిచూడగా కుమారుడు ఉరివేసుకుని కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కడ్మురి మల్లయ్య కుమారుడు వెంకటేశ్ (16) చేవెళ్లలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వెంకటేశ్ కళాశాలకు సక్రమంగా వెళ్లడం లేదని తెలియడంతో బుధవారం ఉదయం తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి గ్రామ సమీపంలోకి వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రోడ్డుపై చెత్త వేసిన టీచర్‌కు రూ. 5వేల జరిమానా
శంషాబాద్ రూరల్ : రోడ్డుపై చెత్త వేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పంచాయతీ అధికారులు రూ. 5వేల జరిమానా వేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా నర్కూడలో జరిగింది. నర్కూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డుపై ఉదయం చెత్తను గమనించిన ఆ గ్రామ సర్పంచ్ సిద్దులు, పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ ఈ విషయమై ఆరా తీశారు. అక్కడి చెత్త కాగితాల్లో ఒక ప్రభుత్వ టీచర్‌కు పోస్ట ల్ బ్యాలెట్ పేపరు, పాత చెక్కులు, ఐడీ కార్డులు వారికి లభించాయి. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని నాగోల్‌కు చెందిన మల్లారెడ్డిగా గుర్తించి ఆయనను పిలిపించి జరిమానా విధించారు. -
నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు
సాక్షి, రంగారెడ్డి : ఈ నెలాఖరు నాటికి ఆయా మండలాలకు కొత్త ఎంపీడీఓలు రానున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత మండలాలు 21 ఉండగా.. ఇందులో 8 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఈఓఆర్డీలు, సూపరింటెండెంట్లు ఇన్చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న పదోన్నతుల్లో భాగంగా ఈ మండలాలకు రెగ్యులర్ ఎంపీడీఓలు బాధ్యత తీసుకోనున్నారు. జిల్లా పరిషత్‌లో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఎంపీడీఓగా పదోన్నతి పొందేందుకు పది మంది సూపరింటెండెంట్లు, ఈఓఆర్డీ పోస్టుల కోసం 11 మంది సీనియర్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. సీనియారిటీ, పనితీరు ఆధారంగా వీరికి పదోన్నతులు లభించనున్నాయి. రిమార్కులు, మెమోలు ఉంటే.. పదోన్నతులు పొందేందుకు అనర్హులే. అందిన దరఖాస్తులను నిర్దేశిత ప్రమాణాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు పరిశీస్తున్నారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ పదోన్నతుల ద్వారా ఎంపీడీఓలు, ఈఓఆర్డీ పోస్టు లు భర్తీ కానున్నాయి. అంతేగాక డివిజన్ లెవల్ పంచాయతీ అధికారులు కూడా రానున్నారు. జిల్లాలో ఐదు డీఎల్పీఓ పోస్టులకుగాను.. ఒక్కరే పనిచేస్తున్నారు. నాలుగు పోసు ్టలు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా జరగబోయే పదోన్నతుల ద్వారా ఇవి భర్తీ కానున్నాయి. ఖాళీలు ఇక్కడే.. మహేశ్వరం, కడ్తాల్, చౌదరిగూడం, నంది గామ, కొందుర్గు, షాబాద్, కేశంపేట, తలకొండపల్లి మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కావడంతో.. జూన్ 4 నుంచి కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ మండల పరిషత్‌లు మనుగడలోకి వచ్చాయి. తలకొండపల్లి ఎంపీడీఓ పోస్టు ఏడాదిగా, మిగిలిన నాలుగు మండలాల్లో దాదాపు ఆరునెలలుగా ఖాళీగా ఉన్నాయి. అప్పటి ఇక్కడ ఇన్చార్జి ఎంపీడీఓలే ఉన్నారు. -
పరిష్కారమే ధ్యేయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూసంబంధిత సమస్యల పరిష్కారానికి పల్లెల్లో మరోసారి గ్రామసభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. తొలివిడతలో నిర్వహిస్తున్న సభల్లో బాధితుల నుంచి అధిక సంఖ్యలలో దరఖాస్తులు అందుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిర్దిష్ట గడువులోపు ఎన్ని పరిష్కరించారో తెలుసుకునేందుకు రెండోసారి సభలు తలపెట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. గ్రామసభల్లో అప్పటికప్పుడు కొన్ని సరళమైన సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ.. మరికొన్నింటికి కొన్ని రోజుల సమయం పడుతోంది. ఈ నిర్దిష్ట గడువులోపు అధికారులు పరిష్కరించారా? లేదా? లేకుంటే ఎందువల్ల జాప్యం జరిగింది.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారా? ఇంకేమైనా జఠిల సమస్యలు ఉన్నాయా.. తదితర వివరాలు రాబట్టేందుకు తొలిసారి గ్రామసభలు నిర్వహించిన పల్లెల్లో... రెండోసారి సభలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీలైతే వచ్చే సోమవారమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదీ పరిస్థితి.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వారంలో మూడు రోజలుపాటు గ్రామసభలు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రాజేంద్రనగర్ మినహా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని పదుల సంఖ్యల గ్రామాల్లో ఈ సభలు ముగిశాయి. ఒక్కో డివిజన్లో సగటున 250 నుంచి 350 వరకు బాధితుల నుంచి అధికారులకు దరఖాస్తులు అందాయి. కొన్ని గ్రామాల్లో సభలు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులకు మోక్షం కలిగిందో రెండోసారి గ్రామసభ నిర్వహించి ఆరా తీయనున్నారు. తప్పులు పునరావృతం కాకుండా.. సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయడానికి కూడా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గ్రామ సభల నిర్వహణ, అధికారులు తీసుకుంటున్న దరఖాస్తులు, పరిష్కారం తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న లేదా ఇతర జిల్లాల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే వీలుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా రికార్డుల ప్రక్షాళన సమయంలో చాలావరకు కిందిస్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సాకుగా చూపి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. మళ్లీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్డీఓ స్థాయి వ్యక్తులను ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిజిటల్ సంతకం 88 శాతం పూర్తి జిల్లా వ్యాప్తంగా 10.98 లక్షల సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ఇప్పటికే 9.60 లక్షల సర్వేనంబర్లపై ఎటువంటి కిరికిరి లేదు. దీంతో వీటికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు డిజిటల్ సంతకం పూర్తయింది. ఇవిపోను మరో 1.38 లక్షల సర్వే నంబర్లు మిగిలాయి. ఇందులో ప్రభుత్వ భూములకు సంబంధించి 45 వేల సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ఉండదు. దీంతో డిజిటల్ సంతకం చేయాల్సిన పనిలేదు. ఇక 36 వేలకు సర్వే నంబర్లు.. భూ వినియోగ మార్పిడి కింద ఉన్నాయి. వీటికీ డిజిటల్ సంతకంతో పనిలేదు. ఇవన్నీ మినహాయించగా మరో 7,514 సర్వే నంబర్లకు సంబంధించి సంతకం పెండింగ్‌లో ఉంది. 2,200 సర్వే నంబర్లల్లో భూమి కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆధార్ నంబర్ అందజేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సంతకం చేయడం కుదరదు. మరో 5,300 సర్వే నంబర్లకు సంబంధించి ఆధార్ నంబర్లు అందజేసినా.. భూ విస్తీర్ణంలో తేడాలు కనిపించడంతో అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా వీటిని పరిష్కరించనున్నారు. (1)బి సర్వే నంబర్ల ప్రదర్శన వివాదాస్పదంగా ఉన్న ఆయా సర్వే నంబర్లను (1)బి జాబితాలో అధికారులు చేర్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా సర్వే నంబర్లు ఉన్నాయి. అయితే, ఏయే సర్వే నంబర్లను ఈ జాబితాలోకి ఎక్కించారు.. ఎందుకు నమోదు చేశారు.. అనే విషయాలు సంబంధిత రైతులకు తెలియడం లేదు. ఫలితంగా పట్టాదారు పాసు పుస్తకాల కోసం నెలల తరబడి కర్షకులు ఎదురుచూస్తున్నారు. (1)బి జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. రెండు గ్రామసభల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని దాదాపుగా నిర్ణయించింది. -
అత్తాకోడళ్ళను చంపిన దుండగులు
-
ఎలక్షన్ రివ్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
-
ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే
-
మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే..
కొంగరకలాన్: మరో 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభలో కేశవరావు ప్రసంగిస్తూ..మనం ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పాలనుకున్నామని, అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని వ్యాక్యానించారు. నిజానికి టీఆర్ఎస్ పాలించింది రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని, మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజస సమస్యలతో గడిచిపోయాయని తెలిపారు. తెలంగాణలో 80 శాతం బడుగుబలహీన వర్గాలే ఉన్నాయని, ప్రతీ బీసీ కులాల్ని గుర్తించి వారి అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని కొనియాడారు. -
నాకే ఎందుకిలా జరిగింది?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాకే ఎందుకిలా జరిగింది..? జిల్లా నుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్ రఘునందన్‌రావు ఆవేదన ఇది. ఇదేదో ఆయన బదిలీ గురించిన ఆవేదనో.. తన కుటుంబానికి సంబంధించిన బాధనో కాదు. ఓ చిన్నారి బోరుబావిలో పడి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆయన పడిన మనోవేదన ఇది. ఆ కీలక క్షణాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఓవైపు.. పాప నిండు ప్రాణం ఓ వైపు.. అలా చేయండి.. ఇలా చేయండంటూ సలహాలు మరోవైపు. అసలేం చేయాలి.. పాప ప్రాణం ఎలా కాపాడాలి? స్వల్ప వ్యవధిలో పాపకు ఏమైనా జరిగితే జిల్లా ఉన్నతాధికారిగా అప్రతిష్ట పాలవుతానా..? ఓ మనసున్న వ్యక్తిగా ఎంత క్షోభ పడతారో.. ఈ ఉత్కంఠను ఆ రోజంతా అనుభవించాను. నిజంగా నా జీవితంలో ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను ఉన్నప్పుడే ఆ పాపకు అలా జరగాలా? ఎన్నో హృదయాలు స్పందించి.. చిత్తశుద్ధితో శ్రమించినా ఫలితం దక్కలేదాయె. అసలు నేను కలెక్టర్‌గా ఉన్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది. నాకే ఎందుకు జరిగింది? చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి మృతి చెందిన ఘటనను తలుచుకుని జిల్లా నుంచి వెళ్లిపోతున్న కలెక్టర్ రఘునందన్‌రావు విలేకర్లతో పంచుకున్న ఈ ఆవేదన నిజంగా భారమైందే. ఆ ఘటన మనసున్న ప్రతి మనిషినీ కలచివేసిందే. ‘మనసాక్షికి అనుగుణంగా చేశా..’ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసే అదృష్టం నాకే దక్కింది. ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. భూ వివాదాల్లో న్యాయపరమైన అవరోధాలు వచ్చినా.. నా మనసాక్షిగా అనుగుణంగానే న్యాయమనుకున్నదే చేశా. విలువైన భూముల పరిరక్షణలో ఆనేక ఒత్తిళ్లు వచ్చినా.. వృత్తిలో సర్వసాధారణంగా భావించా. ప్రజలకు సేవ చేసే అవకాశం కొందరికే దక్కుతుంది. మన దగ్గరకు వచ్చేవారి మనసులో ఏముందో కనుక్కోవడంతో సగం న్యాయం చేసినట్లే. అందుకు తగ్గట్టుగా స్పందిస్తే సామాన్యుల మన్ననలు పొందగలం. భూ రికార్డుల ప్రక్షాళన, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీసీ) తదితర పథకాలను సంతృప్తినిచ్చాయి. -
110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ (ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పొజిషన్ ) –2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాప్మా (తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్)తో కలసి రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడులు రాబట్టేందుకు 14 ప్రాధాన్యతా రంగాలను రాష్ట్రం గుర్తించిందని.. అందులో పాలిమర్స్, ప్లాస్టిక్స్ కీలకంగా ఉన్నాయన్నారు. 1957లోనే భారత్‌లో ప్లాస్టిక్ పరిశ్రమకు పునాదులు పడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఆరు వేల ప్లాస్టిక్స్ పరిశ్రమల ద్వారా ఏటా ఆరు వేల కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ లు ప్రతి సంవత్సరం 9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌ను చాలా రాష్ట్రాల్లో నిషేధించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వాటిపై మార్గదర్శకాలు రూపొందిస్తోందని తెలిపారు. పర్యావరణానికి హాని చేయని పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. రీయూజబుల్ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు దోహదం చేసే రీసైక్లింగ్ పరిశ్రమలకు అదనపు రాయితీలు కల్పిస్తామని అన్నారు. 350 స్టాళ్లు.. 50 వేల మంది వీక్షకులు.. ఐప్లెక్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అనిల్‌రెడ్డి వెన్నం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ ఎగ్జిబిషన్లో 350 స్టాల్స్ ఏర్పాటు చేశారని, 50 వేల మంది సందర్శకులు వీక్షించనున్నారని చెప్పారు. వంద మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యాపా రం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐపీఈటీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఎస్.కె.నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీఐపీఈటీ ద్వారా ప్లాస్టిక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. 3, 4 శాతం ఉత్పత్తులే ప్లాస్టిక్‌కు చెడ్డపేరు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్స్ భవన్ కోసం రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు టాప్మా అధ్యక్షుడు వేణుగోపాల్ జాస్తి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్రో కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ వర్మ, ఆలిండియా ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హిటెన్ బెడా, వివిధ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్
రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని దావోడ్లో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
-
కవితల మహ్మద్ రఫీ!
బొంరాస్‌పేట: అమ్మ ప్రేమ నిరంతరంఆకాశంలో మెరుపు అమ్మ కోసం..ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేక‘పిచ్చి’తనంతో బలవంతపు మరణాలు..అభంశుభం తెలియని బాలికలపైపైశాచిక దాడులు కసాయి సాక్షాలు..చంకన పిల్ల వయస్సులో ఉన్న చిన్నారులుకీచక, నీచ బుద్ధిహీనులు అమానవీయ మరకలు..కన్నవారికి శోకాలు.. సమాజానికి కలంకాలు భావితరాలకు ఇవేనా గుణపాఠాలుబంగారు భవితకు ఎవరువేయాలి బాటలు? ఈ కవితలు బడికి దూరమై చికెన్‌సెంటర్ నిర్వహిస్తున్న ఓ ముస్లిం యువకుడి కలం నుంచి జాలువారుతున్న తెలుగు కవితా కుసుమాల మాల. పరిగి మండలం గుముడాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్‌రఫీ పదో తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పదో తరగతివరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణకు మండల పరిధిలోని తుంకిమెట్లలో ఐదేళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నారు. సందేశాత్మక కవితలతో.. చికెన్ సెంటర్లో గిరాకీ లేనప్పుడు కాలక్షేపం కోసం కవితలు రాయడం రఫీకి హాబీగా మారింది. మనసుకు తోచినట్లు అంశాలను ఎంచుకొని అలవోకగా ప్రేమ, సందేశాత్మక కవితలు రాయడం కొనసాగిస్తున్నారు. ‘నీవు నవ్వితే చాలునెలవంక సిగ్గుపడుతది. నీనడక చూసిహంస అసూయ పడుతది. నడుము నాట్యంతోనెమలి పురి పూరుగుడిసైతది. అంటూ అలవోకగా కవితలు అల్లడంలో రఫీ అందెవేసిన చెయ్యి. హిందీ ప్రముఖ గాయకుడు మహ్మద్‌రఫీ, బాలుపాడిన పాటలంటే ఈ కవితల రఫీ చెవికోసుకుంటాడు. చిన్ననాటి నుంచి కవితల పట్ల ఉన్న ఆసక్తితో సునాయసంగా, సహజంగా రాయాలేగాని కృత్రిమ కవితలు రాయలేనని చెబుతున్నాడు రఫీ. షార్ట్ ఫిలిం తీయాలనుకున్నా నా కవితలు చదివినవారు విన్నవారు చాలా బాగున్నాయని అంటున్నారు. పుస్తక రూపంలో, ఫొటో ఆల్బం చేయించాను. నాకవితలతో ఏఒక్కరు మారినా నాకు సంతృప్తి మిగిలిస్తుంది. సోషల్ మీడియాలో సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ చేయాలి ఉంది. త్వరలో షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నాలు చేస్తున్నా. నేనే కథ రాశాను. షూటింగ్‌కు సిద్ధంగా ఉంది.– మహ్మద్‌రఫీ -
కొత్తగూడం వద్ద ప్రమాదం..ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోచంపల్లి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు(AP 09 AK 0060)ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌లోని రామాంతపురానికి చెందిన పద్మ, స్వప్న, మణికాంత్‌లుగా గుర్తించారు. మృతులు, బాధితులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎంత ఘోరం
దీపావళి పండుగకు ముందే ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. మరో కుటుంబానికి చెందిన ఇద్దరి మరణంతో తీరని విషాదం నెలకొంది. విహారయాత్రకని వెళ్లిన ఆ ఐదుగురు విగతజీవులుగా మారడం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. షేర్‌మార్కెట్ వ్యాపారం.. ఆ ఐదుగురి ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన మంగళవారం నార్సింగి మండలం కొల్లూరు వద్ద ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగింది. చేవెళ్ల/శంకర్పల్లి: శంకర్పల్లి మండలం మీర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్ కాలనీ శివారులో మృతిచెందిన పటోళ్ల ప్రభాకర్‌రెడ్డి(31), మాధవి(27) వర్షిత్‌రెడ్డి(2.5), మృతుడి చిన్నమ్మ లక్ష్మి(42), ఆమె కూతురు సింధు(16)ల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చనిపోయిన వారిలో ప్రభాకర్‌రెడ్డి, అతని భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌రెడ్డిలు శంకర్పల్లి మండలం కొత్తపలి గ్రామానికి చెందిన వారు. ఉద్యోగం.. వ్యాపారంలో భాగంగా చిన్నమ్మ లక్ష్మి వద్దకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు చిన్నమ్మ, ఆమె కూతురు కూడా మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. కుటుంబ నేపథ్యం శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి, సువర్ణలకు ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు. గ్రామంలో వీరికున్న 12 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ మహిపాల్‌రెడ్డి కొడుకులను చదివించాడు. వీరికి రెండు పౌల్ట్రీఫాంలు కూడా ఉన్నాయి. వీటిని మహిపాల్‌రెడ్డి, అతని చిన్న కొడుకు దయాకర్‌రెడ్డిలు చూసుకుంటున్నారు. పెద్దకొడుకు ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ పూర్తయిన తర్వాత తన చిన్నమ్మ, చిన్నాన్న అయిన రవీందర్‌రెడ్డి, లక్ష్మీలు ఉండే లింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఉంటే విద్యాభ్యాసం పూర్తిచేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2012లో మేడ్చల్ జిల్లా డి.పోచంపల్లి గ్రామానికి చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు (హర్షిత్) ఉన్నాడు. కుమారుడికి ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మధ్యలోనే వదిలేసి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లోకి దిగాడు. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసినట్లు బంధువులు తెలిపారు. బంధువులు, సన్నిహితుల వద్ద డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఈ పెట్టుబడులు పెట్టిన డబ్బులు అప్పులుగా పెరిగిపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఒత్తిడి పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతుంది. పామెనలోనూ విషాదం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటంతో పామెన గ్రామం కూడా షాక్‌కు గురైంది. మృతుడు ప్రభాకర్‌రెడ్డి తల్లి సువర్ణ, చిన్నమ్మ లక్ష్మిల తల్లిదండ్రులది పామెన గ్రామం కావడంతో ఇక్కడి వారితో ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి మంచి పరిచయాలున్నాయి. మంచి పేరున్న వ్యక్తి కుటుంబం మృత్యువాత పడడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో మంచిగా ఉండే వ్యక్తికి ఇలా జరిగిందంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. వివరాలు సేకరించిన క్లూస్ టీం మణికొండ: ఒకేసారి ఐదుగురు మరణించడంతో సైబరాబాద్ క్లూస్ టీం ప్రతినిధులు సంఘటన స్థలాల్లో దొరికిన ఆనవాళ్లను సేకరించారు. మహిళల మృతదేహాలను ఉన్నచోట ఎలాంటి వస్తువులు లభించకపోయినా కారులో మాత్రం వారు తాగిన కూల్‌డ్రింక్, నీటి బాటిళ్లు కనిపించాయి. వాటితో పాటు కారు ముందర రోడ్డుపై ఓ కేక్ బాక్సును వారు సేకరించారు. వాటితో పాటు కారుపై ఎవరివైనా వేలిముద్రలు ఉన్నాయా అనే కోణంలోనూ ఆనవాళ్లను సేకరించారు. పోలీసు జాగిలాలను రప్పించారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ సందీప్శాండిల్లా, మాదాపూర్ ఏసీపీ విశ్వనాథ్, ఏసీపీ రమణకుమార్, నార్సింగి సీఐ రమణగౌడ్లు సందర్శించి ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. వివరాల సేకరణ అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం బంధువులకు అప్పగించారు. తరలివచ్చిన జనం.. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ శివారులో ఐదు మృతదేహాలు లభించాయనే విషయం తెలుసుకొని అటు సంగారెడ్డి, ఇటు గండిపేట మండలాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఔటర్ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్డు ప్రజలతో పాటు మీడియా, పోలీసు వాహనాలతో ప్రజలతో కిక్కిరిసింది. రెండేళ్ల వర్షిత్ మృతితో తల్లడిల్లిన బంధువులు.. పటాన్చెరు : కొల్లూరు శివారులో (నార్సింగి పీఎస్ పరిధిలో) ఓఆర్ఆర్ కింద కారులో తండ్రి ప్రభాకర్‌రెడ్డి పక్కన కారులో మృతి చెందిన రెండేళ్ల వర్షిత్‌ను చూసిన ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి బంధువులు ఆ సన్నివేశాన్ని చూసి రోదించారు. ముఖ్యంగా మహిళా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చిన్నారిని చూస్తూ వారు పడుతున్న ఆవేదనతో అక్కడున్న వారి హృదయం ద్రవించిపోయింది. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణం ఎవరనే ప్రశ్న మానవతావాదులందరినీ వేధించింది. ఒకవేళ తండ్రి ప్రభాకర్‌రెడ్డే తన కుమారుడికి విషం ఇచ్చి ఉంటే అంత దారుణానికి ఆయన ఎందుకు ఒడిగడతారని అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది. చంపడం.. తెచ్చిపడేయడం.. అమీన్పూర్ మాత్రమే కాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్ఆర్పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్పూర్ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు. భూమి కొనుగోలుతోనే సమస్యంతా... మణికొండ: ఐదుగురు మృతుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనికోసం కోటిరూపాయలకు పైగా అప్పులు తెచ్చినట్లు సమాచారం. అయితే ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేలటంతో తీవ్ర ఇబ్బందులకు గురయినట్లు అతడి మిత్రులు తెలిపారు. షేర్మార్కెట్లో పెట్టుబడులు, ఇతర అప్పులు పెరిగిపోవడం, బాకీలు తీర్చాలని బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు మిత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శోకసంద్రంలో పూడూరు పూడూరు(పరిగి): పూడూరు మండల కేంద్రానికి చెందిన కొండాపురం రవీందర్‌రెడ్డి, లక్ష్మి(40) దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం తమ కుమారుడు దినేష్‌రెడ్డి, కూతురు సింధూజ(16)తో కలిసి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు మండలం బీరంగూడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రవీందర్‌రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తూ స్థానికంగా ఇళ్లు నిర్మిస్తూ విక్రయిస్తూ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు సింధూజ ఇంటర్ చదువుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(32) లక్ష్మికి స్వయాన అక్కకొడుకు. ఇతను తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు)తో కలిసి దంపతులు బీరంగూడ సమీపంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వీరి కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తుంటారు. ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం లక్ష్మి ఇంటికి వచ్చింది. సెలవు కావడంతో డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రభాకర్‌రెడ్డి తన పిన్ని లక్ష్మి, సోదరి సింధూజను తీసుకెళ్లి బాబాయి రవీందర్‌రెడ్డి కారులో వెళ్లాడు. సాయంత్రం రవీందర్‌రెడ్డి తన భార్యకు ఫోన్ చేయగా డిండి ప్రాజెక్టు నుంచి బయలుదేరినట్లు చెప్పింది. అనంతరం రాత్రి 8గంటలకు ఆయన మరోసారి ఫోన్‌చేయగా నాట్‌రీచబుల్ వచ్చింది. ఆందోళనకు గురైన రవీందర్‌రెడ్డి కారులో వెళ్లిన మిగతా వారికి ఫోన్ చేయగా స్విఛాఫ్ సమాధానం వచ్చింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఆయన అనుమానం వచ్చి వెంటనే 100కు కాల్ చేసి విషయం చెప్పాడు. మంగళవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పడంతో మొదట రవీందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గాలించసాగాడు. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని కొల్లూరు శివారులో గుర్తు తెలియని ఐదుగురి మృతదేహాలు పడి ఉండడంతో పోలీసులు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వారిని గుర్తించి బోరుమన్నారు. -
జోరుగా ‘బెల్ట్’ దందా
షాబాద్(చేవెళ్ల): షాబాద్ మండలంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల దందా జోరుగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి అసలు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కోరడా ఝులిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా బెల్ట్‌షాపు నిర్వాహకులకు మాటలు చెవికెక్కడం లేదు. దీనికి తోడు ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వేలాపాలా లేకుండా 24 గంటల పాటు లభించే మద్యం దుకాణాలు గ్రామాల్లో ఉన్నాయి. దీంతో పాటు తండాల్లో సారాబట్టిలు కూడా పెట్టి మద్యం విక్రమాలు, బెల్టుషాపుల ద్వారా బహటంగా నడుస్తున్నాయి. ఒక చిన్న పాటి గ్రామంలో 5నుంచి 10వరకు బెల్టు దుకాణాలున్నాయి. వీటిని మూసి వేయాల్సిందేనని ప్రభుత్వం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా అధికారులు ఖాతరు చేయడం లేదు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి నీరు దొరకపోయినా, మద్యం మాత్రం తప్పకుండా దొరుకుతుంది. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.. షాబాద్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొదలుకుని అనుబంధ గ్రామాల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిదిలోని అన్ని గ్రామాలతో పాటు తండాల్లోను సారాబట్టీలు, బెల్ట్‌షాపులు జోరుగా వెలుస్తున్నాయి. వీటిని పట్టించుకోనే పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇతర ప్రాంతాల ‡నుంచి ఆటోల్లో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ బెల్ట్ దుకా>ణాల్లో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ మందు బాబులను దోచేస్తున్నారు. ఏదో నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చూసిచూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గ్రామాల్లో బెల్టుషాపులు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎల్సీ తీసుకున్నా.. విద్యుత్ సరఫరా
రంగారెడ్డి, మంచాల(ఇబ్రహీంపట్నం): విద్యుత్ షాక్‌కు గురై న విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాపాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం..జపాల గ్రామానికి చెందిన మంతని కృష ్ణ(46) విద్యుత్ శాఖ కార్మికుడిగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే కృష్ణ ఉద్యోగం రెగ్యూల ర్ అయ్యింది. కాగా జాపాల గ్రామంలో వ్యవసా య పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫీజ్ పడి పోయింది. తిరిగి ఫీజ్ వేయడానికి కృష్ణ అక్కడకు చేరుకొని స్థానిక సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ తీగలను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో విద్యుత్ షాక్ గురైన కృష్ణ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుడికి భార్య యాద మ్మ, ఇద్దరు కుతూళ్లు, కుమారుడు ఉన్నారు. రాజును శిక్షించాలి.. సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ రాజు కావాలనే ఎల్సీ ఇచ్చి విద్యుత్ సరఫరా చేసి కృష్ణ మృతికి కారణమయ్యాడని బంధువులు, కుటుంబ సభ్యులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్దేశ్యపూర్వకంగానే మృతికి కారణమయ్యాడని ఆరోపించారు. కృష్ణ మృతికి కారకుడైన రాజుపై చట ్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ రాజుపై దాడి చేయడమే కాకుండా ఏడీ శ్యాంప్రసాద్‌పై గ్రామస్తులు కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, మంచాల, యాచారం, ఆదిబట్ల పోలీసులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యుత్ శాఖ డీఈఈ శ్యాంప్రసాద్ మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరి హారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇసా ్తమని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆ శునకాలకు ఎంత విశ్వాసమో..!
తిండిమాని యజమానులను దహనం చేసిన చోటే ఉన్న వైనం కుక్కను విశ్వాసానికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఇది నిజమే అని అనిపించే సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఓ దంపతులు పెంచుకున్న కుక్కలు వారు మరణించిన నాటి నుంచి తిండి తిప్పలు మాని వారిని దహనం చేసిన వద్దే తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో అప్పుల బాధతో రైతు దంపతులు మోహనాచారి, సరిత ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరు పొలం పనులు చేసుకుంటూ వారి వ్యవసాయక్షేత్రం వద్దే నివాసం ఉండేవారు. వీరికి పిల్లలు లేకపోవడంతో కుక్కలను పెంచుకున్నారు. ఆ కుక్కలు తమ యజమానులు మరణించిన రోజునుంచి తిండి తిప్పలు మానేసి దహనం చేసిన చోటు నుంచి కదలడం లేదు. ఎవరైనా వెళ్లగొట్టినా అరుస్తూ, మృతదేహాలు కాలిన బూడిద చుట్టూ తిరుగుతున్నాయి. –మంచాల -
శంషాబాద్‌లో సైకో వీరంగం
♦ ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి యత్నం ♦ అందులో ఓ మహిళను బ్లేడ్‌తో గాయపర్చిన రసూల్ ♦ చితకబాది.. పోలీసులకు అప్పగించిన స్థానికులు శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం సైకో వీరంగం సృష్టించాడు. నడిచి వెళ్తున్న ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి యత్నించడమే కాకుండా అందులో ఓ మహిళను బ్లేడ్‌తో గాయపరిచాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ అహ్మద్ పాషా వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ రాష్ట్రం కర్నూల్లోని అశోక్‌నగర్‌కు చెందిన సయ్యద్ రసూల్(25) తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క షాహినీబీ వద్ద ఉంటున్నాడు. 2 రోజుల క్రితం ఉపాధి కోసం కర్నూలు నుంచి శంషాబాద్ వచ్చాడు. మంగళవారం పెద్దషాపూర్‌కు వచ్చిన రసూల్.. మహ్మదాబేగం అనే మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె సైకోపై రాళ్లు రువ్వి తప్పించుకొని స్థానికులకు విషయం చెప్పింది. కొద్దిసేపటి తర్వాత కె.పద్మ అనే మరో మహిళను అడ్డగించి, బలవంతంగా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆమెపై లైం గిక దాడికి యత్నించడమే కాకుండా.. బ్లేడ్‌తో ఆమె కాలి బొటన వేలు కోశాడు. అంతేకాకుండా బ్లేడ్‌తో తన కాలునూ గాయపర్చుకున్నాడు. మహ్మదా బేగం ఇచ్చిన సమాచారంతో పెద్దషాపూర్వాసులు గాలించి రసూల్‌ను పట్టుకున్నారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
-
తాగునీటికి రూ.14 కోట్లు
సిద్ధమైన ప్రతిపాదనలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరాలోని 13 తాగునీటి పథకాల నిర్వహణ కోసం రూ.14.20 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్‌లో జెడ్పీ పర్సన్ అధ్యక్షతన జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీపీఓ పద్మావతి, ఈఈ వెంకటరమణ, ఏఈ రత్నప్రసాద్‌తో తాగునీటి సరఫరాపై సమీక్ష జరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నీటి నిర్వహణకు గ్రామ పంచాయతీలోని 14వ ఆర్థిక నిధుల నుంచి 40 శాతం, ప్రభుత్వ వాటాగా 60 శాతం నిధులను ఖర్చు చేస్తామని సునీతా రెడ్డి తెలిపారు. ఈ నిధులతో నీటి సరఫరా చేసే సిబ్బంది వేతనాలు, పంపుల నిర్వహణ, మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు. -
గంజాయితో పట్టుబడిన విద్యార్థులు
ఒకరు విదేశీయుడు, ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ 30 ప్యాకెట్లు స్వాధీనం ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో గల ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి ప్యాకెట్లతో బుధవారం మధ్యాహ్నం పట్టుపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 30 ప్యాకెట్ల గంజాయిని (1100 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు విదేశీ విద్యార్థి కాగా ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ, మిగతావారు తెలంగాణకు చెందిన వారున్నారు. గురువారం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి కేసు వివరాలను వెల్లడించారు. ఇంజనీరింగ్ కళా శాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువు తున్న విద్యార్థులు కళాశాల ఎదుట ఉన్న గ్రీన్ సిటీ వెంచర్ వద్ద ఒక కారులో గంజాయిని సేవిస్తున్నారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు నిలిపివున్న కారు వద్దకు వచ్చి అనుమానంతో ప్రశ్నించారు. తడబడుతూ సమాధానం ఇవ్వడంతో పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ఐదు ప్యాకెట్ల గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి గుట్టురట్టయింది. వీరికి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏపీలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి అంద జేస్తున్నట్టు తేలింది. కళాశాల విద్యార్థులకు 50 గ్రాముల గంజాయి ప్యాకెట్టు రూ.500లకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇబ్రహీంపట్నంలోని విద్యార్థుల గది నుంచి మరో 25 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
87.58శాతం
► మందకొడిగా సాగిన పోలింగ్ ► ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతం ► ఫొటోల తారుమారుపై తీవ్ర నిరసన ► హయత్‌నగర్‌లో ఒకరికి బదులు మరొకరు ఓటేసిన వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 87.58శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో పదుల సంఖ్యలోనే ఓటర్లు ఉండడంతో సందడి కనిపించలేదు. అయినా ఓటర్లు ఒక్కొక్కరుగా సాయంత్రం 6 గంటల వరకు వెళ్లి తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మరోపక్క హయత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఒకరికి బదులుగా మరొకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయడానికి వచ్చిన అసలు ఓటరు దానిని గుర్తించి అసహనానికి గురయ్యారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు కూడా గుర్తించలేకపోయారు. ఆందోళనలు... బ్యాలెట్ పేపర్‌పై టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి, మరో అభ్యర్థి ఆది లక్ష్మయ్మ ఫొటోలు తారుమారు కావడం పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమైంది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ కుట్రపూరిత చర్యలతోనే ఘోర తప్పిదం జరిగిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. ఈ తప్పదాన్ని ఉదయమే గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు నేతలు. అయితే పోలింగ్ రద్దు ప్రకటన సాయంత్రం వరకూ వెలువడకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు రద్దు ప్రకటన రావడం, రీపోలింగ్‌ని ఈ నెల 19న నిర్వహిస్తామనడం పట్ల కాస్త ఉపశమనం లభించింది. ఫొటోల తారుమారుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు, ఓటర్లు డిమాండ్ చేశారు. పోలింగ్ సరళి ఇలా.. సమయం(గంటలు) పోలింగ్ శాతం ఉదయం 10 23.3 ఉదయం 12 50.35 మధ్యాహ్నం 2 68.70 సాయంత్రం 4 80.85 సాయంత్రం 6 87.58 -
మండల్ పాలన!
బాలారిష్టాల్లో కొత్త మండలాలు ► గాడిన పడని పాలనా వ్యవస్థ ► సిబ్బంది సరిపడా లేక అవస్థ ► ప్రతి పనికీ మాతృ మండలమే దిక్కు ► చుక్కలు చూపిస్తున్న ‘రెవెన్యూ పనులు’ ► తహసీల్దార్ మినహా మిగతా పోస్టులు ఖాళీ ► కూర్చోవడానికి కుర్చీలూ కరువే.. మండలస్థాయిలో పాలన ఇంకా గాడిన పడలేదు. కొత్త మండలాలు పురుడు పోసుకున్నా.. పరిపాలన మాత్రం పక్క మండలాల నుంచే సాగుతోంది. దసరా రోజున ఘనంగా ప్రారంభమైన నూతన మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో రెవెన్యూ రికార్డులన్నీ మాతృ మండలాల్లోనే భద్రపరచడంతో ప్రతి ఫైలుకు పాత మండలంపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. నందిగామ, చౌదరిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, బాలాపూర్, కడ్తాలలు కొత్త మండలాలు. ఇవి అక్టోబర్ 11న విజయదశమి నాడు కొత్త జిల్లాలు ఆవిర్భవించిన రోజునే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే, బాలారిష్టాలు మాత్రం ఇప్పటికీ అధిగవిుంచలేదు. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ కడ్తాల్: డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ శాఖకు కార్యాలయం లేదు. తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగుతోంది. ♦ చౌదరిగూడెం: సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన పోస్టులు భర్తీ అయ్యాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మండలాల్లో పూర్తిస్థాయిలో తహసీల్దార్లు కొలువుదీరినా.. మిగతా పోస్టులు మాత్రం దాదాపు అన్నిచోట్ల ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందే ప్రతి ఫైలును జిల్లా యంత్రాంగం స్కానింగ్ చేసింది. ఈ రికార్డులని్నంటినీ మాతృ జిల్లా, మండలాల్లో భద్రపరిచింది. స్కాన్ చేసిన పహాణీ తదితర రికార్డులను చూసుకునే వెసులుబాటును రెవెన్యూ అధికారులకు కల్పించింది. ఇది ఒకింత మంచిదే అయినా.. అర్జీదారులకు మాత్రం చుక్కలు చూపుతోంది. ఏదైనా పనికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ ఉద్యోగులు పాత మండలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్కాన్ కాపీలను చూసి ఫైలును ప్రతిపాదించలేమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల కోసం పాత ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. దీంతో సమయమంతా వృథా కావడంతో అర్జీదారులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు పరిపాలనాపరంగా సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అరకొర సిబ్బంది.. ఇబ్బడిముబ్బడిగా నయా మండలాలు ఏర్పడడం.. తగినంత సిబ్బంది లేకపోవడంతో పరిపాలనపై తీవ్రప్రభావం చూపుతోంది. చాలావరకు కొత్త మండలాల్లో సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా.. పలు మండలాల్లో పూర్తిస్థాయి యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో నూతన మండలాల పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు అందుబాటులో లేక భూముల సర్వే నిలిచిపోతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో అరకొర సిబ్బంది ఉండగా.. ఇక ఎంఈఓ ఆఫీసులు మొదటి రోజుతోనే మూతపడ్డాయి. కొత్త మండలాల పరిధికి అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఇవి మాత్రం బాగానే పనిచేస్తున్నా.. కేసు నమోదు అధికారం మాత్రం పాత ఎస్హెచ్ఓల వద్దే ఉంది. వ్యవసాయ అధికారులు మాత్రం తహసీల్దార్ భవనంలోనే ఒక మూలకు విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తెసరు ఫర్నిచర్.. కార్యాలయ నిర్వహణకు కొంతమేర నిధులు సర్దుబాటు చేసినా.. చాలా దఫ్తార్లలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నీచర్ ఉండాలి. కానీ, ఆ పరిస్థితి ఆఫీసుల్లో కనిపించడంలేదు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి కొన్ని కార్యాలయాల్లో కుర్చీలు సైతం లేవు. కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ నందిగామ: తహసీల్దార్, డిటీ, సీనియర్ అసిస్టెంట్ తప్ప రెండు ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, టైపిస్ట్, మూడు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ♦ బాలాపూర్ : మండలంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తహసీల్దార్, డీటీ, సర్వేయర్లు విధుల్లో కొనసాగుతున్నారు ♦ అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ. ♦ గండిపేట: మండలంలో సర్వేయర్, ఒక ఆర్ఐ పోస్టు ళాళీగా ఉంది. తహసీల్దార్ ఉన్నప్పటికీ రాజేంద్రనగర్‌కు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ పనిచేస్తున్నాడు. గండిపేట మండలానికి సంబంధించిన రికార్డులన్నీ రాజేంద్రనగర్ కార్యాలయంలోనే ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
రెండు స్వర్ణాలు నెగ్గిన ఇష్వి
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్ ఇష్వి మిథాయ్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో చివరి రోజు ఇష్వి గ్రూప్-3 బాలికల 50 మీటర్ల బ్యాక్టక్,ర 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాలు గెలిచింది. తొలి రోజు ఇష్వి 100 మీటర్ల బ్యాక్టక్ విభాగంలోనూ పసిడి పతకం సాధించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇష్వి మూడు స్వర్ణాలతో తన సత్తాను చాటుకుంది. -
14 నుంచి మైసిగండి జాతర
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో మైసిగండి జాతర 14 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నాయి. ఏటా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎనిమిది రోజుల పాటు జరిగే మైసమ్మ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయ సమీపంలో అక్కన మాదన్న కాలంలో నిర్మించిన శివరామాలయాలు, కోనేరులున్నాయి. ఆలయాల చుట్టూ కొండలు, పచ్చని చెట్లు ఉండటంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి. -
రంగారెడ్డిజిల్లాలో ఇద్దరు టీచర్లు అదృశ్యం
రంగారెడ్డి జిల్లా : ఒకే పాఠశాలలో పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారు. నాలుగు రోజులుగా వారు పాఠశాలకు రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శంకర్పల్లి మండలం చిన్నశంకర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు మల్లికార్జున్, సునీత గత నెల 31 నుంచి పాఠశాలకు రావడం లేదు. గ్రామస్తులు ఈ విషయాన్ని వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన మండల విద్యాధికారి అక్బర్‌కు సమాచారమందించారు. ఎంఈఓ వెంటనే ఆ పాఠశాలను సందర్శించి తాత్కాలికంగా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. నాలుగు రోజుల నుంచి సమాచారం లేకుండా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డికి నివేదిక సమర్పించారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతి రోజూ వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి శంకర్‌పల్లికి వచ్చి విధులు నిర్వర్తించేవారు. గత నెల 31న పాఠశాలకు వెళుతున్నానని తాండూరు నుంచి బయలుదేరిన సునీత తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు, భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు టీచర్ల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే
తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: కొత్త రాష్ట్రంలోనూ పాత పాలనే సాగుతోందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ కాకుండా బతుకు తెలంగాణ కోసం కృషి చేయాలని సూచించా రు. మహాజన పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలు చెబుతుంటే కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కావడంలేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ సామాజిక న్యాయం అందడం లేదన్నారు. వెనుకంజలో ఉన్న అన్ని కులాలవారికి విద్య, వైద్యం, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించి, అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపించారు. వాస్తు పేరుతో కొత్తగా ఉన్న భవనాలు కూల్చి ప్రజాధనాన్ని వృథా చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. తమ్మినేనికి రేవంత్ ఫోన్ పాదయాత్రలో ఉన్న తమ్మినేనికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శుక్రవారం ఫోన్ చేశారు. పాదయాత్ర జరుగుతున్న తీరును, ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 1న టీటీడీపీ అగ్రనేతలతో కలసి మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద నుంచి పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. వేధింపులు ఆపండి: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న హోంగార్డులపై వేధింపులు ఆపాలని, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే లాఠీలతో చితకబాదడం గర్హనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 2004కు ముందు విధుల్లో చేరిన వారికి అప్పటి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. -
ఎన్నికల వాగ్దానాల అమలేది?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రత్యామ్నాయం లేక ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారన్నారు. ఈ నెల 17న తలపెట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌కు చేరింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజా స్పందన బాగుందన్నారు. ప్రజలు తనకు తెలియ చెబుతున్న సమస్యలపై ప్రతిరోజు సీఎంకు లేఖ రాస్తున్నానన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యమైన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం.. ఇవన్నీ ఎక్కడా అమలైన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం భూములు పంచకుంటే తామే ఆక్రమించి ప్రజలకు పంచుతామన్నారు. సీఎంకు తమ్మినేని లేఖ: కొత్త జిల్లాల ఏర్పాటుకు రాని అడ్డంకి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఏమొచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని, గిరిజనులకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని సీఎంకు రాసిన లేఖలో తమ్మినేని పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తే.. టీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం
మహాజన పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హెచ్చరిక హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాలు దారుణంగా మారాయని, సీఎం కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసే లేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల పేరిట రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నార ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సాగింది. మంతన్ గౌరెల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఊళ్లో 90 శాతం మంది పేదలు ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారనీ, వీరిని వికలాంగులుగా గుర్తించి నెలకు రూ.1,500 పింఛన్ ఇవ్వాలన్నారు. మూడు రోజులపాటు 20 గ్రామాల్లో సాగిన మహాజన పాదయాత్ర బుధవారం సాయంత్రం ముగియగా, నల్లగొండ జిల్లా సరిహద్దులో నాయకులు తమ్మినేని బృందానికి వీడ్కోలు పలికారు. రైతుల భూములను లాక్కోవద్దు మర్రిగూడ: రిజర్వాయర్ల నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. 123 జీవో ప్రకారం ఎకరం భూమికి రూ. 4.15 లక్షలు చెల్లించడం సరికాదన్నారు. సీపీఎం చేపట్టిన మహాజన యాత్ర గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకపల్లితండాకు చేరుకుంది. తండాలో తమ్మినేని మాట్లాడుతూ.. ఒకవేళ రైతుల భూములను తీసుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.32 లక్షల పరిహారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్న ఒక్కో ఇంటికి రూ.7.5 లక్షలు చెల్లించి, ఇల్లు కట్టి ఇవ్వాలన్నారు. ఉపాధి పనులను చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే ఉపాధి పనులు చేపట్టాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. అలాగే, కొన్ని మండలాల్లో ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వలేదని పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిందనీ, వెంటనే చెల్లించాలన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య
-
హైదరాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం
అధికారులు కలెక్టర్: రాహుల్ బొజ్జా (9652513344) పోలీసు కమిషనర్: మహేందర్ రెడ్డి (9490616000) జీహెచ్ఎంసీ కమిషనర్: జనార్దన్‌రెడ్డి (98499 08576) మండలాలు: బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్,సైదాబాద్, బండ్లగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట్, చార్మినార్, తిరుమలగిరి, గోల్కొండ, నాంపల్లి, మారేడుపల్లి, అంబర్పేట్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి పర్యాటక ప్రాంతాలు: చార్మినార్, గోల్కొండ, నెక్లెస్ రోడ్డు, నెహ్రూ జూలాజికల్ పార్కు, హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం తదితర ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలు :కాటేదాన్, ఆజామాబాద్ ఎమ్మెల్యేలు: సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(చార్మినార్), ముంతాజ్ అహ్మద్‌ఖాన్(యాకుత్‌పురా), అక్బరుద్దీన్ ఒవైసీ(చాంద్రాయణగుట్ట), మొజంఖాన్(బహుదూర్‌పుర), పద్మారావు(సికింద్రాబాద్), కె.లక్ష్మణ్(ముషీరాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్), మాగంటి గోపీనాథ్(జూబ్లీహిల్స్), చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్), కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), రాజాసింగ్(గోషామహల్) ఎంపీలు: బండారు దత్తాత్రేయ, అసదుద్దీన్ ఒవైసీ -
రంగారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం
అధికారులు కలెక్టర్ ఎన్.రఘునందన్‌రావు పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ (రాచకొండ కమిషనరేట్) రెవెన్యూ డివిజన్లు: 5 (చేవెళ్ల, రాజేంద్రనగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్) మండలాలు: 27 చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్‌నగర్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, మాడ్గుల, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, గండిపేట్, షాద్‌నగర్, ఫరూక్నగర్, కొత్తూరు, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడెం, నందిగామ మున్సిపాలిటీలు: 5 (షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్దఅంబర్‌పేట్, జిల్లెలగూడ) గ్రామపంచాయతీలు: 436 ప్రధాన పరిశ్రమలు: ఐటీ, పౌల్ట్రీ, హార్టికల్చర్. మహేశ్వరంలో హార్డ్‌వేర్ పార్కు, ఫార్మా సిటీ, కాటేదాన్, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పారిశ్రామికవాడలు ఉన్నాయి. నీటి పారుదల: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎమ్మెల్యేలు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), టి.ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అంజయ్య యాదవ్ (షాద్‌నగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), కాలె యాదయ్య (చేవెళ్ల), ఆర్.కృష్ణయ్య (ఎల్బీ నగర్), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి) ఎమ్మెల్సీలు: పట్నం మహేందర్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రావు, శంభీర్‌పూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, యాదవరెడ్డి ఎంపీలు: మల్లారెడ్డి (మల్కాజ్గిరి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), నంది ఎల్లయ్య (నాగర్‌కర్నూల్), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), దేవేందర్ గౌడ్ (రాజ్యసభ) పర్యాటకం: గండిపేట, మృగవని పార్కు, హరిణ వనస్థలి, సంఘీ దేవాలయం, చిలుకూరు బాలాజీ, నంది వనపర్తి, అమ్మపల్లి దేవాలయం, మదనపల్లి శనీశ్వరాలయం, జహంగీర్ పీర్ దర్గా ప్రత్యేకతలు: శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం -
డబ్బులు తిరిగి అడిగినందుకు...
షాబాద్ : చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన షాబాద్ మండలంలోని మన్మర్రి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. షాబాద్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని గ్రామానికి చెందిన చాకు బందయ్య(32)అతడి చిన్నాన్న కుమారుడైన శ్రీశైలంకు గత కొద్ది రోజుల క్రితం చేబదులుగా రూ. 50 వేలు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు మళ్లీ ఇవ్వాలని పలుమార్లు బందయ్య శ్రీశైలంను అడగగా దసరా పండగకు ఇస్తానని సమాధానం చెప్పారు. దసరా పండుగ రోజున నాడబ్బులు ఇవ్వమని అడగగా పండుగపూట ఏందీరా.. నీలోల్లి అంటూ.. శ్రీశైలం గొడవకు దిగాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో బందయ్య కిందపడడంతో శ్రీశైలం అతనిపై బండరాయితో తలపై బాదాడు. దీంతో బందయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని 57 గొర్రెలు మృతి
రైలు ఢీకొని 57 గొర్రెలు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా వికారబాద్ పట్టణ శివారులోని కొత్తగడి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోర్రెల కాపరి రైలు పట్టాల సమీపంలో గోర్రెలను మేపుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లే పూర్ణ ప్యాసింజర్ గోర్రెల మందను ఢీకొంది. ఈ ఘటనలో 57 గొర్రెలు మృతిచెందగా.. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తంచేశాడు. -
డంపింగ్ యార్డుపై గ్రామస్థుల నిరసన
డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. -
సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం..ఇద్దరి మృతి
తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులను గమనించని జేసీబీ డ్రైవర్ వారిపై నుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీపక్, సంజయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా. తిలక్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కారు బోల్తా..ఒకరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం బొంగులూరు గేటు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. అతడిని వెంటనే తోటి వాహనదారులు ఆస్పత్రికి తరలించారు. -
శంషాబాద్ పేరునే కొనసాగించాలి
కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాకు అదే పేరును కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు రిలే దీక్షలు చేపడుతున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం శంషాబాద్ జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. -
చెరువులో వ్యక్తి మృతదేహం
రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం ఎల్లన్‌పేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలి ఆడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జారిపడ్డాడా లేక ఎవరైన హత్యచేసి చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘రూ.అర కోటి ఇవ్వకుంటే ఆస్పత్రిని పేల్చేస్తా’
నక్సల్స్ పేరుతో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడలోని ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి గురువారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను మావోయిస్టు నేత శ్రీను అని పరిచయం చేసుకున్న ఆవ్యక్తి... వెంటనే రూ.50 లక్షలు ఇవ్వకుంటే ఆస్పత్రి భవనాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీనిపై యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శామీర్‌పేట పెద్దచెరువులో శవం
శామీర్‌పేట్ పెద్దచెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షల చోరీ
గుర్తుతెలియని వ్యక్తులు కారు(టీఎస్07ఈడీ2000) అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. బాబాగూడ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి వ్యాపారం కోసం తనతో తీసుకువచ్చిన రూ.3 లక్షల్ని కారులో ఉంచి పోలీసుస్టేషన్ ఎదుట ఉన్న ఆఫీసులోకి వెళ్లాడు. వెళ్లి వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉంచిన రూ.3 లక్షల నగదు కూడా తస్కరించారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నాడు. -
వాగులో కొట్టుకుపోయిన బైకర్
- కాపాడిన స్థానికులు మెడ్చల్(రంగారెడ్డి) వాగులో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడిని స్థానికులు కాపాడిన సంఘటన రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం కిష్టాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు ఈరోజు ఉదయం బైక్ పై మెడ్చల్ వెళ్తుండగా.. కిష్టాపూర్ శివారులోని వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. ఆ సమయంలో వాగు వద్ద ఉన్న యువకులు వాగులో కొట్టుకుపోతున్న వేణును తాళ్ల సాయంతో యువకుడిని రక్షించారు. -
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. 8 మందికి గాయాలు
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న హ్యూండై ఎక్సెంట్ కారు(టీఎస్ 07 యూసీ 3905) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వచ్చే వాహనాల మధ్యలో ఎగిరి పడింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
-
తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
తాండూరు డివిజన్ పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెనకు 3ఫీట్లపై నుంచి ప్రవహిస్తోంది. తాండూరు- హైదరాబాద్‌కు మధ్య రాకపోకలు స్తంభించాయి. తాండూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
వాగులో కొట్టుకువచ్చిన శవం
కీసర మండలం యాద్గార్పల్లి చౌరస్తా వద్ద వాగులో ఓ గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. కీసర మండలం యాద్గార్పల్లి చౌరస్తా వద్ద వాగులో ఓ గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా గల్లంతైన వ్యక్తి మృతదేహమా.. లేక వాగులో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
థారూరులో ప్రభుత్వ కార్యాలయాలు బంద్
రంగారెడ్డి జిల్లా థారూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం అఖిలపక్షం నేతలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. -
రంగారెడ్డి జిల్లాను మార్చరాదని రాస్తారోకో
రంగారెడ్డి జిల్లాను 19 మండలాలలతో యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కెరివి గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. తాండూరు- హైదరాబాద్ మార్గంలో రాస్తారోకో నిరివహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
టూరిస్టు వీసాలు తీసుకున్న 56 మంది ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. వివారాల్లోకి వెళితే.. కొంత మంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ లైన్స్ అధికారులు ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. వీరంతా కలర్‌ఫుల్ ట్రావెల్స్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు టూరిస్టు వీసాలు తీసుకున్నారు. అయితే.. అధికారులు ప్రయాణికులను ఎందుకు అడ్డుకున్నారో తెలియ రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణీకులు విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు. విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో చర్చలు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బుద్వేల్‌లో మహిళ హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ గ్రామంలోని కల్లు కాంపౌండ్ వద్ద మంగళవారం వేకువజామున కమలమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. బీరు సీసాతో పొడిచి ఆపై బండరాయితో తలపై మోది హతమార్చారు. కల్లు కాంపౌండ్ వద్ద కమలమ్మ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కమలమ్మ భర్త బుచ్చిరాములుపై అనుమానంతో అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కమలమ్మ తన ఇద్దరు పిల్లలతో గత కొంతకాలంగా భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. భర్తే హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాండూరులో కొనసాగుతున్న బంద్
రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం తాడూరు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి, ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. -
దేవుళ్లను దూషిస్తూ..
ఒక వర్గం దేవుళ్లను దూషిస్తూ..తమ మతం చాలా గొప్పదని ప్రచారం చేస్తున్న పదిమింది మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రంగారె డ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక బీజేఆర్ నగర్లో కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ.. ఒక వర్గం దేవుళ్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. తమ మతాన్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పదిమంది మత ప్రచారకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
వికారాబాద్‌లో మేస్త్రీ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అత్వేల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ యాదయ్య(35)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న అనంతరామ్ బ్రాందీ షాపులో ఆదివారం రాత్రి మద్యం సేవించినపుడు గొడవ జరిగి దుండగులు రాళ్లతో కొట్టి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడో రోజూ చేవేళ్ల బంద్
- భారీగా పోలీసు బలగాల మోహరింపు - పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చేవెళ్ల(రంగారెడ్డి జిల్లా) చేవెళ్లను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన బంద్ ఆదివారం మూడోరోజూ కూడా కొనసాగింది. వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రెండురోజులుగా చేవెళ్ల పట్టణంలోని హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి, ముంబై-బెంగళూరు జాతీయ లింకు రహదారిలో ఆందోళనకారులు వాహనాల రాకపోకలను నియంత్రించడం, అడ్డుకోవడంతో ఆదివారం పోలీసు బందోబస్తును భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలవరకే జిల్లాలోని పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల నుంచి అదనపు బలగాలు, సిబ్బందిని రప్పించారు. అఖిలపక్షం నాయకులు, జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో పలు గ్రామాలనుంచి ఉదయం 9 గంటలకే మండల కేంద్రానికి చేరుకొని ఆందోళనను ప్రారంభించారు. మొదటగా బస్‌స్టేషన్ , మార్కెట్‌యార్డు, పోలీస్‌స్టేషన్ , శంకర్పల్లి చౌరస్తాలకు ర్యాలీగా వెళ్లి అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను మూసి వేయించారు. అనంతరం హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకు రాస్తారోకో చేశారు. ఆందోళనకారులు టైర్లను రోడ్లపైకి తెచ్చి అంటించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా కిరోసిన్ పోసిన టైర్లను ట్రాక్టర్లో తెచ్చి అంటించడంతో సాయంత్రం వరకు రోడ్డుపై కాలుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు రోడ్డుమీదే వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మొత్తం మీద చెవెళ్ల బంద్ మూడోరోజు కూడా విజయవంతం అయింది. -
బండ్లగూడలో చెరువుకు గండి
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మండలం లక్ష్మీగూడ గ్రామ పల్లెచెరువుకు శుక్రవారం మధ్యాహ్నం గండిపడింది. దీంతో చెరువు నీరు బండ్లగూడ ప్రధా రహదారిపై పొంగిపొర్లుతోంది. ఈ కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను మరోమార్గంలోకి దారి మళ్లించారు. -
వాగులో కొట్టుకుపోయి..ఒకరు గల్లంతు
వాగు వరదలో ఆటో కొట్టుకుపోవటంతో అందులోని ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోహిర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి ఆటోలో వెళ్తుండగా ఉద్దండాపూర్ గ్రామం గుండ్లమడుగుతండా సమీపంలో వాగు వరదలో చిక్కుకున్నారు. వరద నీటి ఉధృతికి ఆటో కొట్టుకుపోగా అందులోని వారు కేకలు వేశారు. గ్రామస్తులు వెంటనే స్పందించి ఇద్దరిని కాపాడగలిగారు. గల్లంతైన సాజిద్ అలీ కోసం గురువారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేక పోయింది. -
జల దిగ్బంధంలో బీర్సెట్టిపల్లి గ్రామం
రంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న వానకు పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. తాండూరు మండలం గోనూర్ పంచాయతీ బీర్సెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధానికి గురయింది. గ్రామానికి రెండు వైపులా ఉన్న వాగులు పొంగిపొర్లడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం మేకలను మేపేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నర్సప్ప, సుశీలమ్మ అనే కాపరులను గురువారం ఉదయం గ్రామస్తులు రక్షించారు. -
రంగారెడ్డి జిల్లాను ముంచెత్తిన వాన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలు రంగారె డ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పలుచోట్ల ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. అల్ప పీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలే న మోదయ్యాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు దఫాలుగా వాన కురిసింది. జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వ ర్షాలతో తాండూరులోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని మన్సన్పల్లి, కందనెల్లి, బుద్దారం, వెల్గటూరు వాగులు పరుగులు తీస్తున్నాయి. వాగులు ప్రవహిస్తున్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కీసరలో 18 సెంటీమీటర్ల వాన... జిల్లాలో అత్యధికంగా కీసరలో 18 సెంటీమీటర్ల వాన నమోదయింది. అదేవిధంగా, చేవెళ్లలో 13.7సెంటీమీటర్లు, బంట్వారంలో 12.6 సెంటీమీటర్లు, ధారూర్‌లో 10.89 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్, సరూర్‌నగర్, ఉప్పల్, ఘట్కేసర్ మండలాల్లో 8 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భారీగా పంటనష్టం..! భారీ వర్షాలతో జిల్లాలో పంటనష్టం జరిగింది. గత వారం వరకు వర్షాభావ పరిస్థితులతో మొక్కలు పూర్తిగా ఎండిపోగా... ప్రస్తుతం భారీ వర్షాలతో ఈ నష్టం మరింత తీవ్రమైంది. కష్టపడి కాపాడిన పంటు చేతికొచ్చే సమయంలో వర్షాలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నష్టం అంచనాల గుర్తింపు మరో రెండ్రోజుల తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే కొంతమేర పంటలు గాడిన పడే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి
హైదరాబాద్ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
శిథిల భవనం కూలి ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పట్టణంలో వర్షాల ధాటికి ఒక భవనం కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ పాత భవనం వర్షాలకు నాని మంగళవారం మధ్యాహ్నం కూలింది. ఆ భవనంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది.అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న రాకేష్, మంజుల దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. -
కొత్త కార్డులు హుళక్కే!
♦ ఇప్పటికే పూర్తయిన రేషన్‌కార్డుల ముద్రణ ♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో గందరగోళం ♦ జిల్లాల పేర్లు మారడంతో నిలిచిన పంపిణీ ♦ తలపట్టుకుంటున్న పౌరసరఫరాల శాఖ ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. వాస్తవానికి ఈ నెలలోనే కొత్తకార్డులు వస్తాయని భావించారు. కానీ, వీటిపై కొత్త జిల్లాల ప్రభావం పడింది. జిల్లా, మండలాల పేరు మార్చాల్సి ఉండడంతో వాటి పంపిణీని నిలిపివేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రేషన్ కార్డుల భాగ్యం లబ్ధిదారులకు ఇప్పట్లో కలిగే అవకాశం లేదు. వాస్తవానికి ఈ నెల మొదటివారంలో లబ్ధిదారులకు తెలంగాణ లోగోతో ఉన్న కొత్త ఆహార భద్రత కార్డులు అందించాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ సైతం ఈ మేరకు టెండర్లు పిలిచి ముద్రణ ప్రక్రియలో వేగం పెంచింది. దీంతో చర్యలకు దిగిన కాంట్రాక్టర్లు కొత్తగా కేటాయించే కార్డులను ముద్రించి పౌరసరఫరాలశాఖకు అప్పగించారు. సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాలని యంత్రాంగం భావించింది. తాజాగా కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి రావడం.. ప్రభుత్వం కూడా జిల్లాల ఏర్పాటును యుద్దప్రాతిపదకన భావిస్తూ చర్యలు వేగిరం చేయడంతో కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. వృథా ప్రయాసేనా...? జిల్లాలో 11.65 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ సర్వేలు నిర్వహిస్తూ అర్హతలేని కార్డుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనాలు, రూ.వేలల్లో ఆస్తిపన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తొలివిడత సర్వే పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ 1.10లక్షల కార్డులు అర్హత లేనివిగా తేల్చింది. వీటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా... అర్హత ఉన్న కార్డుదారులకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉన్న కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సర్కారు వాటిని ముద్రణకు పంపింది. ఈ క్రమంలో గత నెలాఖర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కొత్త కార్డులు చేరాయి. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2.5 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడంతో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకంగా జిల్లా పేరు, మండలాల పేర్లు మారే అవకాశం ఉండడంతో వాటి పంపిణీని యంత్రాంగం తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత వాటికి కాస్త మెరుగులు దిద్దాలా..? లేక తిరిగి కొత్త వాటిని ముద్రించి ఇవ్వాలా అనే అంశాన్ని పౌరసరఫరాల శాఖ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు కొత్తకార్డులు ఇప్పట్లో లేవనే చెప్పొచ్చు. -
శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు..
- పట్టుబడ్ల స్మగ్లర్లు శంషాబాద్(రంగారెడ్డి జిల్లా) శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 792 గ్రాముల బంగారాన్ని, సుమారు రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు దోహ నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్‌కు బ్యాగ్‌లో పెట్టుకుని వస్తుండగా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న కాగ్నా నది
రంగారెడ్డి : ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాగ్నానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే తాండూరు సమీపంలో నది పై ఉన్న ఓ వంతెన నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో తాండూరు-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దెముల్ మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. నగరానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. -
కాగ్నా నదికి వరద - కొట్టుకుపోయిన వంతెన
రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం దోర్నాల స్టేషన్ సమీపంలో ఉన్న కాగ్నా నదికి వరద పోటు పెరగడంతో నీటి ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. బుధవారం ఉదయం నుంచి భారీవరం పడడంతో కాగ్నా నదికి వరదపోటు ఎక్కువైంది. దాంతో ఈ మార్గాంలో రాకపోకలు ఆగిపోయాయి. -
చెల్లని చెక్కు కేసులో నిందితునికి జరిమానా
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ కాకతీయకాలనీకి చెందిన గోవర్ధన్, నల్లగొండ జిల్లా పానగల్‌కు చెందిన యాదయ్యలు పరిచయస్తులు. తన కుటుంబ అవసరాల నిమిత్తం 2013లో యాదయ్య లక్ష రూపాయలను అప్పుగా గోవర్ధన్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని యాదయ్యను కోరగా ఇందుకు గాను ఎస్బీఐ రవీంద్రనగర్బ్రాంచికి చెందిన లక్ష రూపాయల చెక్కును గోవర్ధన్ పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును ఎస్బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ యాదయ్య స్పందించకపోవడంతో గోవర్ధన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. మరో కేసులో... రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి సంవత్సరం జైలుశిక్ష, రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు, షాద్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణలు పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2014లో లక్ష్మీనారాయణ రూ.15 లక్షలను అప్పుగా శ్రీనివాసరావు నుంచి తీసుకుని మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని లక్ష్మీనారాయణను కోరగా అందులకు గాను తన ఖాతాకు చెందిన 15 లక్షల రూపాయల చెక్కును శ్రీనివాసరావు పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును బ్యాంకులో జమచేయగా లక్ష్మీనారాయణ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ లక్ష్మీనారాయణ డబ్బులు చెల్లించకపోవడంతో శ్రీనివాసరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
రంగారెడ్డికి కృష్ణా, మంజీరా జలాలు అవసరం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాకు కృష్ణ, మంజీరా జలాలు అవసరమని.. అయితే, ఇప్పటి వరకు ఆ జలాలు జిల్లాకు వస్తాయనే స్పష్టత రాలేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం ఎన్ని నీళ్లు రావాలో నిపుణులతో మాట్లాడి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షం పడక 10 రోజులు అవుతుందని.. ఇలాగే ఉంటే పంట ఉంటుందో పోతుందో తెలియక రైతులు బాధ పడుతున్నారన్నారు. జిల్లాలో వ్యవసాయమే ఆధారంగా ప్రజలు జీవిస్తున్నారన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నీళ్లు తేవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నీళ్ల విషయమై జేఏసీ ఎన్నోసార్లు సమావేశమై చర్చించిందన్నారు. జిల్లాకు రావాల్సిన నీటి విషయంపై జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేస్తామన్నారు. జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.రవీందర్ మాట్లాడుతూ. జేఏసీ ఒక లక్ష్యం కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ çబాగు పడుతుందనుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏ లక్ష్యం కోసం ప్రతి ఒక్కరం కృషి చేశామో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. విద్యార్థి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజీత్‌మఠంలా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వికారాబాద్‌లో ఉద్యమాన్ని ఉత్వెత్తున నడిపామన్నారు. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబం ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రౌడీలతో దాడులు చేయించి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందులో చేరి మొత్తం కుటుంబం ఇప్పుడు పదవులు అనుభవిస్తుందన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఉద్యమ నాయకులపై హేళన చేస్తూ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యోగాన్ని, తండ్రిని కోల్పోయి చంద్రకాంత్‌రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడో ఇక్కడి విద్యార్థులకు తెలుసునన్నారు. మంత్రి వైఖరి మార్చుకోక పోతే మరో ఉద్యమానికి ఈ ప్రాంత విద్యార్థులు సిద్ధమని హెచ్చరించారు. అనంతరం ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్, సబ్‌కలెక్టర్ శృతిఓజాకు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కల్కోడ నర్సిములు, తాండూరు జేఏసీ చైర్మన్ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘాల నాయకుడు రాంరెడ్డి, పాండురంగం, వెంకటయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నార్సింగి మంచిరేవులలో ఓ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. సిట్ అదుపులో ఉన్న నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంతో అస్థిపంజరాన్ని రంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరం మూడేళ్ల క్రితం నయీం చంపిన 17 ఏళ్ల పని అమ్మాయిదిగా తెలుస్తోంది. ఈ అస్థిపంజరం ఎవరదనేదిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేయగా, రూ.143 కోట్ల విలువైన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు
-
చేపల వేటకు వెళ్లి..
చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నేతాజినగర్‌కు చెందిన సయ్యద్ ఖాదర్(31) రాంపల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. -
హుందాసాగర్‌లో బాలుడి గల్లంతు
మైలార్‌దేవ్‌పల్లిలోని హుందాసాగర్‌లో గురువారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. కాటేదాన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేందర్(12) అనే బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి హుందాసాగర్కు ఈతకొట్టడానికి వెళ్లారు. చెరువులోకి దిగిన రాజేందర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో ఇద్దరు స్నేహితులు భయపడి స్థానికుల దగ్గరికి వెళ్లి ప్రమాదవిషయం గురించి తెలిపారు. బాలుడి కోసం గాలింపు జరుగుతోంది. -
చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలుశిక్ష
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన మహిళకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... నాగోలు చెందిన కృష్ణాగౌడ్ బోడుప్పల్ ప్రాతానికి చెందిన అనితారెడ్డిలు పరిచయస్తులు. తన వ్వాపార అవసరాల నిమిత్తం 2014జూన్ 9న రూ.15 లక్షలను అప్పుగా కృష్ణాగౌడ్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ ఒప్పంద పత్రం రాయించి ఇచ్చింది. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని అనితారెడ్డిని కోరగా అందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకు ఉప్పల్‌కలాన్ బ్రాంచికి చెందిన రూ.15 లక్షల చెక్కును కృష్ణాగౌడ్ పేరిట జారీ చేసింది. సదరు చెక్కును ఎస్బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ అనితారెడ్డి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణాగౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 9వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
విగ్రహాలు తొలగించాలని ఆందోళన
రంగారెడ్డి జిల్లా కందుకూరు పట్టణ చౌరస్తాలో శ్రీశైలం రహదారిపై ఉన్న విగ్రహాలను తొలగించి ప్రమాదాలను నివారించాలని వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆందోళన నిర్వహించారు. కందుకూరు మండల సర్వసభ్య సమావేశం జరుగున్నందున సమావేశ మందిరం వరకూ ర్యాలీగా వెళ్లి విగ్రహాలు తొలగించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తిచేశారు. విగ్రహాలను సాధ్యమైనంత త్వలో తొలగిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
విద్యార్ధులను కాపాడి ప్రాణాలు వదిలిన హెచ్ఎం
-
పాఠశాలలో విషాదం: కరెంట్ షాక్ తగిలి హెచ్ఎం మృతి
పూడూరు: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల కోసం జెండాను ఏర్పాటుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులను కాపాడే ప్రయత్నంలో ఓ ప్రధానోపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలోప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కలువ ప్రభావతి (40) మరణించారు. పెద్ద ఉమ్మాంతాల్ గ్రామానికి చెందిన ప్రభావతి.. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకుగానూ ఆదివారం పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలోనే విద్యార్థులు కీర్తన, గణేష్, శివతేజ, మధుప్రియలు జెండా కర్రను జరుపుతుండగా, విద్యుధాఘాతానికి గురయ్యారు. వెంటనే స్పంఇంచిన ప్రభావతి.. విద్యార్థులను పక్కకునెట్టేసి.. ప్రమాదంలో చిచ్కుకుపోయారు. స్పృహకోల్పోయిన ఆమెను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రభావతి మరణించినట్లు వైద్యులు చెప్పారు. -
భూసర్వే అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు
రాష్ట్ర సర్వే, ల్యాండ్ రికార్డ్స్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు(రంగారెడ్డి జిల్లా) నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సర్వే భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.దేవుజీ, రాము, కార్యదర్శులుగా కె.శ్రీనివాసులు, ఐనేశ్, , కోశాధికారిగా పి.దేవరాజ్, కార్యవర్గ సభ్యుడిగా కృష్ణారావును ఎంపిక చేశారు. భూ సర్వే, రికార్డు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుందని, సంఘం పటిష్టతకు కృషి చేస్తానని కొత్త అధ్యక్షుడు నరహరిరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఘట్కేసర్లో కారు ఢీకొని వ్యక్తి మృతి
ఘట్కేసర్ మండలం ఎన్‌ఎఫ్‌సీనగర్ వద్ద కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌కు చెందిన సురేందర్(35)గా గుర్తించారు. రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజేంద్రనగర్‌లో కొండచిలువ సంచారం
రాజేంద్రనగర్‌లో జనవాసాల మధ్య కనిపించిన భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక హనుమాన్‌నగర్‌లోని చెట్ల పొదల మధ్య నుంచి సోమవారం ఉదయం ఒక కొండ చిలువ ఇళ్ల మధ్యకు చేరింది. తొమ్మిదడుగుల పొడవైన ఈ కొండచిలువను చూసిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే అటవీ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
కీసర మండలం నగరం గ్రామంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న నారాయణ(55) అనే వ్యక్తిని వేరొక బైక్‌పై వస్తోన్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన అల్లుడు యాదయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరివేసుకుని యువకుడి మృతి
శంషాబాద్ మండలం రామంజాపూర్ గ్రామానికి చెందిన రాజు(28) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపునొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుకు ఓ భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఘట్కేసర్లోని ఓ హోస్టల్లో తేజశ్విని(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన తేజశ్విని ఘట్కేసర్లోని కృష్ణమూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన తేజశ్విని హాస్టల్ రూంలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పనీపాటా లేకుండా తిరుగుతున్నావన్నందుకు..
ఉద్యోగం చేయమని తల్లి మందలించడంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరినగర్‌కు చెందిన విమలమ్మ కుమారుడు శివకుమార్ (22) చదువు మానేసి సినిమా కథలు రాయడం ప్రారంభించాడు. దీంతో తల్లి విమలమ్మ ఏదైనా పని చేసి, డబ్బు సంపాదించాలంటూ మందలించింది. మనస్తాపానికి గురైన శివకుమార్ ఈ నెల 21న ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుమారుడు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి విమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంజయ్‌పురి కాలనీకి చెందిన మెరుగు నర్సింహులు కుమార్తె నిఖిత (19) కూకట్‌పల్లిలోని సిద్దార్ధ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 25న ఉదయం 9 గంటల సమయంలో కాలేజీకి వెళ్లిన యువతి నేటి వరకు తిరిగి రాలేదు. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వికారాబాద్‌లో ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్ వద్ద ఓ ఆటో బోల్తాపడింది. వివరాలు..మారుతీ నగర్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆపమన్నా ఆపకుండా వెళ్లిపోతుండటంతో కానిస్టేబుల్ వెంబడించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆటో డ్రైవర్‌ను బయటకు లాగడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ బాలుడికి కాళ్లూ చేతులూ విరిగాయి. దీంతో బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన మరో నలుగురికి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. -
ఉగ్రనీడలో అంతారం
-ఐసిస్ తీవ్రవాదులకు స్థానికంగా ఆశ్రయం -ఎన్ఐఏ రాకతో కలవరం -పోలీసులు అదుపులో నలుగురు వ్యక్తులు ధారూరు (రంగారెడ్డి) ఉగ్రమూకల సంచారం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. పవిత్ర రంజాన్ సమయంలో హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించాలని ఐసిస్ తీవ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్ర ముఠాకు నాయకత్వం వహించిన ఇబ్రహీం యజ్దానీ ఉపయోగించిన సిమ్‌కార్డులు వికారాబాద్ ప్రాంతంలో కొనుగోలు చేయడం, ఈ కార్డుల జారీకి సమర్పించిన పాస్‌పోర్టు జిరాక్సులు కూడా స్థానికులవే కావడం.. రాజధానిలో బాంబు పేలుళ్లు, దాడుల అనంతరం ఆనంతగిరిలో తలదాచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ కోణంలో దర్యాప్తును సాగిస్తున్న పోలీసులు ధారూరు మండలం అంతారంలో ఈ ఉగ్రవాదుల కదలికలున్నట్లు గుర్తించారు. గ్రామంలోని ఓ ప్రార్థనామందిరంలో జరిగిన విందులో అనుమానిత టెర్రరిస్టులు పాల్గొన్నట్లు పసిగట్టారు. నెలన్నర ఇక్కడే మకాం! అంతారం గ్రామానికి వచ్చిన ఐదు మంది అనుమానితులు 45 రోజులు ఇక్కడే మకాం వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రార్థనా మందిరాలు, సమీప ప్రాంతాలను సందర్శించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతం కావడం, తమ కదలికలపై అనుమానాలు రావనే ధీమాతో అంతారం గ్రామాన్ని సురక్షిత ప్రాంతంగా భావించినట్లు తెలుస్తోంది. కాగా, స్థానికంగా ఒకరు సహకరించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి సోదరుడి కుమారుడు ఏడాది క్రితం గిరాలేదని, అతని ఆచూకీ లేదనే ప్రచారం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై... కనిపించకుండా పోయారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమమవుతున్నాయి. సహకరించెందెవరూ? అనుమానిత ఉగ్రవాదులకు స్థానికంగా ఎవరు సహకరించారనేది ఎన్ఐఏ కూపీ లాగుతోంది. ఇందులోభాగంగా ఆదివారం కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కీలకపాత్ర వహించిన ఒకరిని విచారించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదిలావుండగా, భూములు కొంటామని నమ్మబలికి ప్రార్థనామందిరంలో మూడు రోజులపాటు తలదాచుకున్నారని కొందరు చెబుతుండగా, కేవలం పగటిపూట మాత్రమే వచ్చివెళ్లారని అంటున్నారు. ఇదిలావుండగా, ఎన్ఐఏ సూచన మేరకు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన నలుగురిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా కలవరం! అంతారం, కేరెళ్లి గ్రామాల్లో ఉగ్రవాదులు సంచరించినట్లు తేలడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఉదయమే గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన గ్రామస్తులు.. ఊరిలో గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని, జరిగిన సంఘటన గ్రామానికి చెడ్డపేరు తెచ్చిపెట్టిందని అభిప్రాయపడ్డారు. ప్రార్థనా మందిరాల్లోకి తెలిసిన వ్యక్తులనే అనుమతించాలని సమావేశంలో నిర్ణయించారు. అసాంఘిక శక్తులను దరి చేరనివ్వకూడదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తీర్మానించారు. -
సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు సూట్‌కేస్‌ను సూపర్ మార్కెట్ ముందు వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కలకలానికి కారణం అయిన సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
ఘట్కేసర్లోని కల్కి ప్రేవేటు ఆసుపత్రిలో రవి చంద్రన్(30) అనే యువ ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందాడు. ఘట్కేసర్ మండలం పోచారం వద్ద నున్న ఇన్ఫోసిస్ కంపెనీలో రవికొంతకాలంగా పనిచేస్తున్నాడు. బుధవారం పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. రవి చంద్రన్ స్వస్థలం తమిళనాడులోని వేలూరు. -
భార్యపై భర్త దాష్టీకం
రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీర నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. నాగేశ్ భార్యను అనుమానించటంతోపాటు అదనంగా కట్నం తేవాలంటూ గొడవకు దిగేవాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నాగేశ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
రెండు కార్లు ఢీకొని ఒకరు మృత్యువాత
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డి పల్లి గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడలో ఉంటున్న హర్యానాకు చెందిన సోన్విర(38) మృతి చెందగా, మరోకారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పూడూరు: అప్పుల బాధతాళలేక ఒంటికి నిప్పంటించుకున్న ఓ రైతు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం కెరవెళ్లి గ్రామానికి చెందిన కావలి యాదయ్య(31) తనకున్న మూడు ఎకరాల్లో గతేడాది పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో అప్పులే మిగిలాయి. పంట పెట్టుబడి కోసం పరిగి ఏడీబీలో రూ. 1.20 లక్షలు, ప్రైవేటుగా మరో రూ. 1.80 లక్షలు అప్పు చేశాడు. ఇక అప్పులు తీరేమార్గం లేక మనోవేదనకు గురైన ఆయన ఈ నెల 13న సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున యాదయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య ఉమారాణి, రెండేళ్లలోపూ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న యాదయ్య మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఉమారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అంతరిస్తున్న మొక్కలు నాటుతున్నాం
శంషాబాద్ రూరల్: జీవ వైవిద్య పరిరక్షణలో భాగంగా అంతరిస్తున్న, అరుదైన మొక్కల పెంపకం కోసం కృషి చేస్తున్నట్లు మైహోం గ్రూపు ఎండీ జూపల్లి జగపతిరావు అన్నారు. మండలంలోని ముచ్చింతల్‌లో శనివారం మైంహోం గ్రూపు ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. జిల్లా కలెక్టరు రఘునందన్‌రావు, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగపతిరావు మాట్లాడుతూ.. ముచ్చింతల్ సమీపంలోనే జీవ వైవిద్య పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశ నలమూలల నుంచి అన్ని రకాల ఔషధ, పండ్లు, పూల మొక్కలను తెప్పిస్తున్నామని చెప్పారు. అంతరించిపోయిన సుమారు 140 రకాల మొక్కల సేకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పార్కు ఏడాదిన్నరలోపు పూర్తిస్థాయిలో ఏర్పాటు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. తమ వంతుగా లక్ష మొక్కల పెంపకం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం సొంతంగా నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. మైహోం సంస్థ జీవ వైవిద్య పార్కు ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంటికి రెండు మొక్కల చొప్పున నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఆర్డీఓ సురేష్ పొద్దార్, సర్పంచులు రాజశేఖర్‌రెడ్డి, లాలీచందర్, ఎంపీటీసీ సభ్యులు మోహన్‌నాయక్, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన
-రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం శంషాబాద్ రూరల్ భార్య మృతదేహాన్ని కాల్చి వేసి కారులో పరారవుతుండగా సమయస్పూర్తితో వ్యహరించి నిందితుడుని పోలీసులకు పట్టించిన మదన్‌పల్లి యువకులను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ ఎన్.నవీన్‌చంద్ ఆదివారం అభినందించారు. ముగ్గురు యువకులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ ఈ నెల 4న తన భార్య సింథియాను హత్య చేయడమే కాకుండా ముక్కలుగా నరికి బ్యాగులో పెట్టి కారులో మండలంలోని మదన్‌పల్లి వచ్చాడు. రాత్రి పూట ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని పెట్రోలుతో కాల్చి వేసి కారులో పరారు అవుతుండగా బురదలో ఇరుక్కుపోయాడు. స్థానిక యువకులు కుమ్మరి వెంకటేష్, ఎన్.లాల్‌సింగ్‌నాయక్, కట్ట రాంచందర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని గమనించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్తి ఆధారాలతో నిందితుడు పట్టుబడడానికి కారణమైన ముగ్గురు యువకులకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన కమిషనర్ వారిని అభినందించారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే సకాలంలో స్పందించిన ఎస్ఐ భాస్కర్‌నాయక్‌ను కూడా కమిషనర్ అభినందించారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు. -
కమీషన్ల కోసమే మిషన్ పథకాలు
- జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి యాలాల(రంగారెడ్డి జిల్లా) తెలంగాణలో కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను సర్కారు చే పడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి విమర్శించారు. ఆదివారం కోకట్ మార్గంలో ఉన్న వెంకోబాగార్డెన్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..11 కోట్ల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. కుటుంబ పాలన పాటించే కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే..సిద్దాంతాలు, కార్యకర్తల మనోభావాల మేరకు నడుచుకునే పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ఆకర్ష్ పేరిట విలీనం చేసుకున్నప్పటికి..బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం పార్టీ సిద్దాంతాలు, కార్యకర్తల కోసం పార్టీని వీడకుండా ఉన్నారన్నారు. దేశంలో మోడీ సర్కారు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికి క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో వాటి విలువ జనాలకు తెలియడం లేదన్నారు. దేశానికి వెన్నుముకగా భావించే రైతన్నల కోసం మోడీ సర్కారు రూ.88లక్షల కోట్లు ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. వీటిలో ఫసల్ బీమా(పంట బీమా)తో పాటు సూక్ష్మరుణాలు ఇచ్చేందుకు ముద్ర, స్వచ్చభారత్, తదితర కార్యక్రమాలతో ముందుకెళుతుందన్నారు. పంట బీమాతో రైతన్నలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ముద్ర రుణాలతో చిన్నపాటి రుణాలు తీసుకుంటూ సామాన్య, మద్యతరగతి వారికి ఎంతో వెసలుబాటు కలుగుతుందన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారు మాటల ప్రభుత్వంగా తయారైందన్నారు. అధికారంలోకి రాకముందు దళితుడ్ని సీఎం చేస్తానన్నా కేసీఆర్, దళితులకు మూడెకరాలు పొలం విషయం మరిచిపోయాడన్నారు. వీటితో పాటు నేటికి అమలు కానీ డబుల్‌బెడ్ రూం, సమయానికి పంపిణీ కానీ ఆసరా పింఛన్లతో సామాన్యులు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు ముందుండి మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రానున్న సార్వాత్రిక ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడు బాలేశ్వర్‌గుప్తా, జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్యాట బాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామ్యనాయక్, బీజేపీ సర్పంచ్‌లు హన్మంతు(సంగెంకుర్దు)నర్సమ్మ(యాలాల), నాయకులు రవీందర్, గాజుల శాంత్‌కుమార్, వీరణ్ణ, నారాయణరెడ్డి, చికిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ -
వణికిస్తున్న అంటువ్యాధులు...
-ఏ ఇంట్లో చూసినా బాధితుల మూలుగులు! -మలేరియా,టైఫాయిడ్,అతిసారతో అస్వస్థత -వర్షాకాలంలో ముందస్తు చర్యలపై అధికారుల నిర్లక్ష్యం -అస్తవ్యవస్తంగా పారిశుధ్యం..పలు చోట్ల పైప్లైన్ల లీకేజీలు -జూన్ నుంచి జూలై 9వ తేదీ వరకు 164 మంది బాధితుల చేరిక తాండూరు (రంగారెడ్డి జిల్లా) అంటు వ్యాధులు వణికిస్తున్నాయి. తాండూరులో ఏ ఇంట్లో చూసినా ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, అతిసార బాధితుల మూలుగులే వినిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు వాంతులు,వీరేచనాలు, జ్వరాలతో బాధపడుతుండటం గమనార్హం. వద్ధుల నుంచి చిన్నారుల వరకు రోగాలతో మంచాన పడుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున రోగుల సంఖ్య పెరుగుతున్నదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, మురుగునీరు పారుదల వ్యవస్థతో అంటువ్యాధులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఏటు చూసినా ఇళ్ల మధ్య మడుగు కట్టిన మురుగు నీరు...చెత్పకుప్పలతో పరిసరాలు దుర్వాసనతో కంపు కొడుతున్నాయి. దాంతో అంటురోగాలు విజంభిస్తున్నాయి. వర్షాకాలంలో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు కినుకువహిస్తున్నారు. ఇప్పటికే జ్వరాలతో బషీరాబాద్ మండలంలో ఇద్దరు విద్యార్థులు మత్యువాత పడ్డారు. తాండూరు పట్టణంతోచుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను రోగాలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో వందమందికిపైగా రోగాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. సుమారు 65వేలకుపైగా జనాభా ఉంది. వార్డులోన్లి కాలనీలతోపాటు అంతర్గత రోడ్ల పక్కన చెత్తను తరలింపు సవ్యంగా సాగటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నది. దోమల సమస్య ఉత్పనమవుతున్నది. అతిసార, మలేరియా, టైఫాయిడ్‌లు సోకి తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,ప్రై వేట్ ఆసుపత్రి పాలవుతున్నారు. కాల్వలు లేకపోవడంతో ఆదర్శనగర్‌లో ఇళ్ల మధ్యనే మురుగునీరు నిలిచింది. మురుగునీరు కాల్వ నుంచి వెళ్లే తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు కలుషితమవుతున్నదని స్థానికులు వాపోతున్నారు. మరోచోట మురుగునీటి కాల్వలోనే తాగునీటి పైప్‌లైన్ ఉండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం వల్ల అంటువ్యాధులు సోకుతున్నాయని పట్టణ వాసులు వాపోతున్నారు. ఇదే ప్రాంతంలో ఇంకో చోట తాగునీటి పైప్‌లైన్ లీకేజీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ వర్షపునీరు నిలిచి తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సంఖ్య ఇలా.. గత నెల జూన్‌లో 73మంది మహిళలు,పురుషులు, 54మంది చిన్నారులు, ఈనెల ఇప్పటి వరకు 37మంది మలేరియా,టైఫాయిడ్, అతిసార బారిన పడి జిల్లా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఒక్కొక్క మంచంపై ఇద్దరు రోగులకు చికిత్సల అందిస్తున్నారు. ప్రై వేట్ ఆసుపత్రిలో చేరుతున్న రోగులు ఉన్నారు. కలుషితనీరు,ఆహారమే కారణం కలుషితనీరు,ఆహార పదార్థాలతోపాటు దోమలు, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాల వల్లనే అతిసార,టైఫాయిడ్, మలేరియా వ్యాధులు సోకుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి వడబోసిన నీళ్లను సేవించాలి. వేడి పదార్థాలు తీసుకోవాలి. ప్రస్తుతం మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అతిసార కేసులు కొన్ని నమోదు అయ్యాయి. రోగులకు చికిత్సలు అందిస్తున్నాం. కొందరు డిశ్చార్జి అయ్యారు. -భాగ్యశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
"ఆ ఎస్పీని సస్పెండ్ చేయాలి"
హోమ్‌గార్డుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని హోమ్‌గార్డుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్న సంవత్సరాలైనా పోలీస్ వ్యవస్థలో ఇంకా వెట్టిచాకిరీ కొనసాగడం దారుణమన్నారు. ఎస్పీ నిర్వాకంపై రాష్ట్ర హోమ్ మంత్రికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
ప్రశాంతంగా ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
-225మంది 198 హాజర్, 27 మంది గైర్హాజర్ పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) పెద్దేముల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలల్లో అదివారం జరిగిన ఆదర్శపాఠశాల(మెడల్ స్కూల్) ప్రవేశ పరీక్ష ప్రశాతంగా ముగిసింది. మొత్తం 225 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 198మంది పరీక్షకు హాజరైనట్ల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిఫాల్ రాఘవేందర్ తెలిపారు. 6వ తరగతిలో 99మందికి 88మంది,7వ తరగతిలో 66మందికి 58మంది,8వ తరగతిలో 62కు 52మంది విద్యార్థులు ప్రవేశ పరిక్ష రాసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ శాంతప్ప చెప్పారు. ఉదయం 9గంటల నుండే విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద బారులు తీరారు. -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
యాచారం మండలం కిషన్‌పల్లిలో పురుగులమందు తాగి బుచ్చయ్య(55) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు టైరు పంక్చర్..ముగ్గురికి గాయాలు
మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఅంబర్ నుంచి కేరళ వెళ్తున్న ఓ స్విఫ్ట్ కారు టైరు అకస్మాత్తుగా పంక్చరైంది. అదే సమయంలో ఇంకో టైరు కూడా ఊడిపోవడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుక్కుగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. -
ఘట్కేసర్లో బాలిక అదృశ్యం
ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐశ్వర్య(15) అనే బాలిక అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాచారంలో ఫార్మాసిటీ భూములపై అఖిలపక్ష భేటీ
యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల విషయంపై అఖిలపక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేష్, జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు జంగారెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫార్మా సిటీ నిర్మాణంలో భూమి కోల్పోయే బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని, అస్సైన్డ్ భూముల్లో బోర్లు వేసిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు.