సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన | Cash prize for Those who took the killer Scindia | Sakshi
Sakshi News home page

సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన

Published Sun, Jul 10 2016 6:23 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Cash prize for Those who took the killer Scindia

-రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం
శంషాబాద్ రూరల్

 భార్య మృతదేహాన్ని కాల్చి వేసి కారులో పరారవుతుండగా సమయస్పూర్తితో వ్యహరించి నిందితుడుని పోలీసులకు పట్టించిన మదన్‌పల్లి యువకులను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ ఎన్.నవీన్‌చంద్ ఆదివారం అభినందించారు. ముగ్గురు యువకులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు.

గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ ఈ నెల 4న తన భార్య సింథియాను హత్య చేయడమే కాకుండా ముక్కలుగా నరికి బ్యాగులో పెట్టి కారులో మండలంలోని మదన్‌పల్లి వచ్చాడు. రాత్రి పూట ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని పెట్రోలుతో కాల్చి వేసి కారులో పరారు అవుతుండగా బురదలో ఇరుక్కుపోయాడు. స్థానిక యువకులు కుమ్మరి వెంకటేష్, ఎన్.లాల్‌సింగ్‌నాయక్, కట్ట రాంచందర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని గమనించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పట్టుబడిన విషయం తెలిసిందే.

 

ఈ కేసులో పూర్తి ఆధారాలతో నిందితుడు పట్టుబడడానికి కారణమైన ముగ్గురు యువకులకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన కమిషనర్ వారిని అభినందించారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే సకాలంలో స్పందించిన ఎస్‌ఐ భాస్కర్‌నాయక్‌ను కూడా కమిషనర్ అభినందించారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement