Scindia
-
ఓటీటీ యాప్‌ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది. -
కార్మికులతో ముచ్చటించిన సింథియా.. రాజకీయాల్లో రాహుల్‌తో పోలిక..?
ఢిల్లీ: భారత్ జోడో యాత్ర మొదలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ల నుంచి కార్మికుల వరకు అందర్ని పలకరిస్తూ తన రాజకీయ పంథాను కొనసాగించారు. గతంలో రాహుల్ గాంధీకి అనుచరుడైన ప్రస్తుత బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా తాజాగా గ్వాలియర్‌లోని ఓ రెస్టారెంట్ కార్మికులను పలకరించారు. దీంతో నెటిజన్లు రాహుల్‌నే ఫాలో అవుతున్నారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి సింథియా ఏం చెప్పారంటే..? ఇటీవల జ్యోతిరాదిత్య సింథియా గ్వాలియర్ వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అందించిన ఆహారాన్ని తీసుకున్నారు. కార్మికుల్లో ఓ వృద్ధురాలు నుంచి ఆశీస్సులను పొందారు. स्वादिष्ट भोजन खाने के साथ साथ जरूरी है रसोइया से मिलना! 😁 आज ग्वालियर प्रवास के दौरान एक रेस्टोरेंट के युवा कर्मचारियों से मिला एवं खाने और स्थानीय मुद्दों पर चर्चा की । pic.twitter.com/eosNtXonBS — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 6, 2023 ఈ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ఇలా కార్మికులను కలవడం రాహుల్ గాంధీ నుంచి నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సింథియా కూడా సింపుల్‌గా బదులు చెప్పారు. నిజంగా నేర్చుకోవడం లేదని చెప్పారు. 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు సింథియా. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శివరాజ్ సింగ్‌తో చేతులు కలిపారు. అదే ఏడాది ఆయన రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం 2021లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు -
వింగ్స్ ఇండియా 2024కు శ్రీకారం
వింగ్స్ ఇండియా 2024 కర్టెన్ రైజింగ్ వేడుక సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నుంచి జ్ఞాపికను స్వీకరిస్తున్న ఫిక్కీ సివిల్ ఏవియేషన్ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ ఎయిర్‌బస్ ఎండీ (భారత్ అలాగే దక్షిణాసియా) రెమి మెయిలార్డ్. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ హైదరాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో వింగ్స్ ఇండియా 2024 ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా నిలవనుంది. ‘‘వరల్డ్ కనెక్ట్ ఇండియా’’ ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. సమస్యలను విమానయాన సంస్థలు సొంతంగా పరిష్కరించుకోవాలి కార్యక్రమం సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మాట్లాడుతూ, గోఫస్ట్ దివాలా అంశం పరిశ్రమకు విచారకరమైన అంశమేనని అన్నారు. అయితే అయితే విమానయాన సంస్థలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా సంస్థ తమ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలనే ప్రభుత్వ కోరుకుంటోందన్నారు. అయితే తొలుత గోఫస్ట్ తన కార్యాచరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తప్పనిసరిగా తమ వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించారు. -
గాయపడిన కానిస్టేబుల్ కు సింధియా ప్రధమ చికిత్స
-
బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ
తొలి నుంచి బీజేపీలో సింధియాలున్నారు. ఇటు సింధియాల్లోనూ బీజేపీ రక్తముందన్నది సత్యం. అంతేకాదు ఇటు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌లోనూ, భారత రాజకీయాల్లో ప్రత్యర్థుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తోన్న బీజేపీలోనూ సింధియా కుటుంబం జాడలున్నాయి. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం నానమ్మ కలనిజం చేసేందుకేనా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఎవరీ విజయ రాజే? గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధి చెందిన విజయరాజే సింధియా, మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి 1957లో గెలుపొందడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత 1962, 1989, 1991, 1996, 1998లో విజయరాజే తన విజయపరంపర కొనసాగించారు. 1967 నుంచి 1971 వరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన విజయరాజే ఏనాడూ ఓటమిని ఎరుగరు. 1967 వరకు ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, జనసంఘ్‌లో చేరారు. ఎమర్జెన్సీ కాలంలో కొన్ని రోజులు జైలుజీవితం గడిపారు. 1980లో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బీజేపీ పాదుకొల్పుకోవడానికి విజయ కృషి చేశారు. 1971లో ఇందిరాగాంధీ సుడిగాలిని తట్టుకొని బింద్ నుంచి విజయరాజే, గ్వాలియర్ నుంచి వాజ్‌పేయి, విజయరాజే కొడుకు మాధవరావు సింధియా గుణ స్థానం నుంచి గెలిచారు. మాధవరావు 26 ఏళ్ళకేæఎంపీ అయ్యారు. మాధవరావు సింధియాకి కాషాయ జెండాపై ఉన్న కాంక్ష ఎంతో కాలం నిలవలేదు. ఎమర్జెన్సీ అనంతరం 1980లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని గుణ స్థానం నుంచి ముచ్చట గా మూడోసారి గెలుపుగుర్రం ఎక్కారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం జ్యోతిరాదిత్య తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. బీజేపీలో విజయరాజే వారసులు అదే సమయంలో విజయరాజే కుమార్తెలు వసుంధర రాజే, యశోధర రాజేలు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వసుంధర రాజే 1984లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ధోల్‌పుర నుంచి ఎన్నికయ్యారు. వసుంధర కుమారుడు దుశ్యంత్ రాజస్తాన్‌లోని ఝల్వార్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. యశోధరాగమనం యశోధర మాత్రం 1977లో డాక్టర్ సిద్ధార్థ బన్సాలీని పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు. ఆమె ముగ్గురు పిల్లల్లో ఒక్కరు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1994లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన యశోధర 1998 ఎన్నికల్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు. శివరాజ్ సింఘ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లోనే కొనసాగిన జ్యోతిరాదిత్య జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో గుణ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసిన జ్యోతిరాదిత్య 4.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆ తరువాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర వహించిన జ్యోతిరాదిత్యకి సీఎం పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అనుభవజ్ఞుడైన కారణంగా కమల్‌నాథ్‌కి దక్కింది. ఎంపీగా 2019లో ఓటమి చవిచూడడంతో పార్టీ జ్యోతిరాదిత్యని పక్కన పెట్టేసింది. -
కశ్మీర్‌పై వాడివేడి చర్చ
ప్లెబిసైట్ కావాలన్న సింధియా - పాక్ ఉగ్రక్రీడలు మానుకోవాలి: ఎంజే అక్బర్ న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో.. అక్కడ ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా బుధవారం లోక్‌సభలో కోరారు. భారత కిరీటమైన కశ్మీర్‌ను పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అవమనిస్తోందన్నారు. కశ్మీర్‌పై చర్చ ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో శాంతి నెలకొనటంతోపాటు అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలని, ఇది కేవలం మానవత్వం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప తుపాకీ గొట్టంతో కాదన్నారు. విదేశాంగ విధానంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందన్నారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్‌పై జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్‌కు లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. విపక్షాల విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. కశ్మీర్ పరిస్థితులు సర్దుకునేందుకు అన్నిపార్టీలూ సహకరించాలన్నారు. కశ్మీర్లో ఆందోళనలకు సరైన నాయకత్వం లేదని.. అలాంటప్పుడు ఎవరితో చర్చలు జరపాలని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆడుతున్న ఉగ్రవాద క్రీడ కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, పాక్ ఆ పని మానుకోవాలని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి: చిదంబరం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితికి కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి పి.చిదంబరం ఓ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. కశ్మీర్ భారత్‌లో చేరినపుడు జరిపిన చర్చలను పునరుద్ధరించి,రాష్ట్రానికి విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలన్నారు. లేదంటే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘కశ్మీర్ భారత్‌లో ఏ చర్చల ప్రాతిపదికన చేరిందోవిస్మరిస్తున్నాం. నమ్మకాన్ని దెబ్బతీశాం. దాని ఫలితంగాభారీ మూల్యం చెల్లించాం’ అని ఓ టీవీ చానల్‌తో అన్నారు. భారత రాజ్యాంగంతో విభేదించని మేరకు కశ్మీర్ సొంత చట్టాలను చేసుకోనివ్వాలన్నారు. -
సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన
-రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం శంషాబాద్ రూరల్ భార్య మృతదేహాన్ని కాల్చి వేసి కారులో పరారవుతుండగా సమయస్పూర్తితో వ్యహరించి నిందితుడుని పోలీసులకు పట్టించిన మదన్‌పల్లి యువకులను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ ఎన్.నవీన్‌చంద్ ఆదివారం అభినందించారు. ముగ్గురు యువకులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ ఈ నెల 4న తన భార్య సింథియాను హత్య చేయడమే కాకుండా ముక్కలుగా నరికి బ్యాగులో పెట్టి కారులో మండలంలోని మదన్‌పల్లి వచ్చాడు. రాత్రి పూట ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని పెట్రోలుతో కాల్చి వేసి కారులో పరారు అవుతుండగా బురదలో ఇరుక్కుపోయాడు. స్థానిక యువకులు కుమ్మరి వెంకటేష్, ఎన్.లాల్‌సింగ్‌నాయక్, కట్ట రాంచందర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని గమనించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్తి ఆధారాలతో నిందితుడు పట్టుబడడానికి కారణమైన ముగ్గురు యువకులకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన కమిషనర్ వారిని అభినందించారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే సకాలంలో స్పందించిన ఎస్ఐ భాస్కర్‌నాయక్‌ను కూడా కమిషనర్ అభినందించారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు.