ఢిల్లీ: భారత్ జోడో యాత్ర మొదలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ల నుంచి కార‍్మికుల వరకు అందర్ని పలకరిస్తూ తన రాజకీయ పంథాను కొనసాగించారు. గతంలో రాహుల్ గాంధీకి అనుచరుడైన ప్రస్తుత బీజేపీ నాయకుడు జ‍్యోతిరాదిత్య సింథియా తాజాగా గ్వాలియర్‌లోని ఓ రెస్టారెంట్ కార్మికులను పలకరించారు. దీంతో నెటిజన్లు రాహుల్‌నే ఫాలో అవుతున్నారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ‍్నించారు. దీనికి సింథియా ఏం చెప్పారంటే..?
ఇటీవల జ్యోతిరాదిత్య సింథియా గ్వాలియర్ వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అందించిన ఆహారాన్ని తీసుకున్నారు. కార్మికుల్లో ఓ వృద్ధురాలు నుంచి ఆశీస్సులను పొందారు.
स्वादिष्ट भोजन खाने के साथ साथ जरूरी है रसोइया से मिलना! 😁
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 6, 2023
आज ग्वालियर प्रवास के दौरान एक रेस्टोरेंट के युवा कर्मचारियों से मिला एवं खाने और स्थानीय मुद्दों पर चर्चा की । pic.twitter.com/eosNtXonBS
ఈ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ఇలా కార్మికులను కలవడం రాహుల్ గాంధీ నుంచి నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సింథియా కూడా సింపుల్‌గా బదులు చెప్పారు. నిజంగా నేర్చుకోవడం లేదని చెప్పారు.
2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు సింథియా. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శివరాజ్ సింగ్‌తో చేతులు కలిపారు. అదే ఏడాది ఆయన రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం 2021లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
Comments
Please login to add a commentAdd a comment