outreach
-
కార్మికులతో ముచ్చటించిన సింథియా.. రాజకీయాల్లో రాహుల్‌తో పోలిక..?
ఢిల్లీ: భారత్ జోడో యాత్ర మొదలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ల నుంచి కార్మికుల వరకు అందర్ని పలకరిస్తూ తన రాజకీయ పంథాను కొనసాగించారు. గతంలో రాహుల్ గాంధీకి అనుచరుడైన ప్రస్తుత బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా తాజాగా గ్వాలియర్‌లోని ఓ రెస్టారెంట్ కార్మికులను పలకరించారు. దీంతో నెటిజన్లు రాహుల్‌నే ఫాలో అవుతున్నారా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి సింథియా ఏం చెప్పారంటే..? ఇటీవల జ్యోతిరాదిత్య సింథియా గ్వాలియర్ వెళ్లే క్రమంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల అందించిన ఆహారాన్ని తీసుకున్నారు. కార్మికుల్లో ఓ వృద్ధురాలు నుంచి ఆశీస్సులను పొందారు. स्वादिष्ट भोजन खाने के साथ साथ जरूरी है रसोइया से मिलना! 😁 आज ग्वालियर प्रवास के दौरान एक रेस्टोरेंट के युवा कर्मचारियों से मिला एवं खाने और स्थानीय मुद्दों पर चर्चा की । pic.twitter.com/eosNtXonBS — Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 6, 2023 ఈ వీడియోను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ఇలా కార్మికులను కలవడం రాహుల్ గాంధీ నుంచి నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సింథియా కూడా సింపుల్‌గా బదులు చెప్పారు. నిజంగా నేర్చుకోవడం లేదని చెప్పారు. 2020లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు సింథియా. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శివరాజ్ సింగ్‌తో చేతులు కలిపారు. అదే ఏడాది ఆయన రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం 2021లో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు -
మా ప్రభుత్వం ఆ విషయం స్పష్టం చేసింది : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఏ శంకుస్థాపన రాయి కూడా పరిశ్రమగా మెరవకుండా వదిలిపెట్టే ప్రసక్తేలేదని తమ ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికోసం చేస్తున్న కృషికి సహకరిస్తున్న విదేశీ వ్యవహారాలశాఖకు, డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సులో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరిట ఓ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో యూఎస్ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. (చదవండి: పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి) -
వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం జగన్
-
వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్ జనరల్స్‌తో ఈ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సౌత్ కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, టర్క్ మెనిస్థాన్, మాయన్మార్, కిర్గిస్థాన్, పోలాండ్, బల్గేరియా రాయబారులు.. బోట్స్వాన, శ్రీలంక హై కమిషనర్లతో పాటు డెన్మార్క్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్స్, యూకే డిప్యూటీ హై కమిషనర్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరిట వాణిజ్య దౌత్య సదస్సు నిర్వహించారు. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు అంతర్జాతీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్న విషయాన్ని చాటి చెప్పారు. 35కు పైగా దేశాల రాయబారులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సు
-
పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు వెళుతోందని, అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేశారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమే. మా బలహీనతలు మాకు మీకు తెలుసు. కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి. సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం. సుస్థిర ప్రభుత్వం మాది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తున్నాం. ఇటీవల చట్ట సభలోను చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలను కూడా తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలు మీకు చెప్పదల్చుకున్నా. మాకు 970 కిలోమీటర్ల కోస్టల్ లైన్, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మా బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 86శాతం సీట్లు గెలుచుకున్నాం. పార్లమెంట్ సీట్ల పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా మాకున్నాయి. పారదర్శకమైన విధానాలు, అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉన్నాం. అన్ని స్థాయిల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. పెట్టుబడులు పెట్టేవారికి ధైర్యం కల్పించే బాధ్యత మాది. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యుత్ డిస్కంల పరిస్థితి దారుణంగా ఉంది. 20వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిస్కంలు సంక్షోభంలో ఉన్నాయి. రెవెన్యూ తక్కువ ఉండి, వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవు. అందుకే విద్యుత్ ఒప్పందాలపై (పీపీఏ) పునఃసమీక్షిస్తున్నాం. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చు. కానీ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలి అంటే ఇది తప్పదు. వినియోగదారుల, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరు నష్ట పోకూడదు అన్నదే మా విధానం. ఇవన్నీ మీకు తెలియాలి. అంతిమంగా పరిశ్రమలే ధరలు చెల్లించాలి. అందుకే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తప్పదు. మీకు వాస్తవాలు తెలియాలి అలానే మాపై విశ్వసనీయత పెరగాలి. ఆ బాధ్యత మాదే... పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనే మరో నిర్ణయం తీసుకున్నాం. ఇదీ వివాదాస్పద మే. కాలుష్యం ఇచ్చే పరిశ్రమలు అక్కడి స్ధానిక యువత కు ఉపాధి కల్పించకపోతే ఎలా. అమెరికాలో కూడా స్థానిక ఉద్యోగాలపై చర్చ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు లేకపోతే పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎలా ఇస్తారు. ప్రజలకు నమ్మకం కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం స్థానికంగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో నైపుణ్యం శిక్షణ ఇప్పిస్తాం. పరిశ్రమకు కావాల్సిన అర్హతలు తెలుసుకుని శిక్షణ ఇస్తాం. ఎలాంటి నైపుణ్యం ఉన్నవారు కోరుకుంటుందో...అలాంటి యువతను మేం అందిస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు లేకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక వనరుల విషయానికి వస్తే బ్లూ ఎకానమీలో మేము పటిష్టంగా ఉన్నాం. 13 జిల్లాలకుగానూ 6 జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. అయిదేళ్లలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. ఇక ఆక్వా ఉత్తత్తుల్లో మేమెంతో ముందున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేలా మీ సహకారం కావాలి. ఆక్వా రంగం, వ్యవసాయ రంగాల్లో ఇది అవసరం. ఉత్పత్తిని పెంచే వినూత్న పద్ధతులను అవిష్కరించాలని కోరుకుంటున్నా. కానీ మేము ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి ప్రపంచ స్థాయిలో ఉండటం లేదు. వీటిని ఆ స్థాయికి తీసుకు వచ్చేందుకు మీ సహకారం కావాలి. అవినీతి రహిత పరిపాలన అందిస్తాం కాఫీ, ఆక్వా ఉత్పత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఎగుమతులు పెరగాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రవాణా రంగాలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. పాఠశాలలు, కళాశాలల్లో ఏపీలో చేరిక శాతం 25 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీ సహకారాన్ని కోరుతున్నాం. నిజాయితీ గల ప్రభుత్వం అలాగే , పారదర్శక విధానాలు, మంచి బృందం అందుబాటులో ఉంది. ఇక్కడ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అందుకే విద్య, వైద్య, వ్యవసాయం కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నాం. మేం పారదర్శక, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఖచ్చితంగా చెప్తున్నా. మీ సహకారం కోరుతున్నాం పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. నదుల అనుసంధానానికి కట్టుబడి ఉన్నాం. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి సహకారం కావాలి. డీజిల్ బస్సులను తీసేసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాం. విశాఖపట్నంకు మెట్రో రాబోతుంది. విజయవాడ, గుంటూరుకు కూడా మెట్రో వస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని తీర్పును ప్రజలు మాకు ఇచ్చారు. మాపై ప్రజల్లో భారీ నమ్మకాలు ఉన్నాయి. భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. పెట్టుబడులకు మీ సహకారం కావాలి. ఢిల్లీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది దౌత్యవేత్తలు సమావేశం కావటం ఇదే తొలిసారి అనుకుంటున్నా. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సును ప్రారంభించారు. విజయవాడ నగరంలోని హోటల్ తాజ్ గేట్‌వేలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ఆరంభించారు. పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేస్తున్నారు. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్ సెక్టార్ వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సీఎం వైఎస్ జగన్ పలువురు రాయబారులు, కాన్సులేట్ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాగా ఈ సదస్సులో యూఎస్ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం. -
రేపు డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం విజయవాడ నగరంలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరుతో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నగరంలోని హోటల్ తాజ్ గేట్‌వేలో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పథకాలు, విధానాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సదస్సు షెడ్యూల్... హోటల్ తాజ్ గేట్‌వేలో ఉదయం 10 గంటలకి సదస్సు ప్రారంభం సదస్సు ప్రారంభంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం 11 గంటలకు రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రెజెంటేషన్ నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌సెక్టార్ వంటి కీలక అంశాలపై బ్రీఫింగ్ మధ్యాహ్నభోజన విరామం అనంతరం రాయబారులు, కాన్సులేట్ జనరల్‌లతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న దేశాలు యూఎస్ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు -
‘ఉపాధి హామీ’వేతనాలు పెంపు!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరల నుంచి పేదలను కాపాడేందుకు కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీ ఏ) వేతనాలను పెంచే అవకాశం ఉంది. వేతనాలు నిర్ణయించే ప్రాతిపదిక(బేస్‌లైన్)ను మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధి హామీ పథకం వేతనాల వార్షిక సమీక్ష బేస్‌లైన్‌ను వినియోగదారుల ధరల సూచీ–వ్యవసాయ కూలీ(సీపీఐ–ఏఎల్) నుంచి వినియోగదారుల ధరల సూచీ –గ్రామీణం(సీపీఐ– రూరల్)కు మార్చనున్నట్లు గ్రామీణ శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా తెలిపారు. ఇందుకోసం ఎస్ మహేంద్ర దేవ్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని, తుది నిర్ణయం మాత్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాక ఉంటుందని వెల్లడించారు. -
ఎల్ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పెంపు
ముంబై: ఏజంట్ల వలసలను నివారించే దిశగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచింది. ప్రస్తుతం పదిహేనేళ్ల సర్వీస్ తర్వాత వైదొలిగే ఏజం ట్లకు గ్రాట్యుటీ రూ. 2 లక్షలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో తొలగించిన వారు పోగా.. నికరంగా 2.45 లక్షల మంది ఎల్ఐసీ ఏజంట్లుగా చేరారు. 3.40 లక్షల మంది స్వచ్ఛందంగా వైదొలగడమో లేదా కంపెనీ తొలగించడమో జరిగింది. గతేడాది మార్చిలో ఏజంట్ల సంఖ్య 10.6 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి 11.05 లక్షలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 2.7 లక్షల మందిని రిక్రూట్ చేసుకోగా 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడమో లేదా వివిధ కారణాలతో సంస్థ తొలగించడమో జరిగింది. దీంతో నికరంగా 45,000 మందే చేరినట్లయిందని ఎల్ఐసీ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లోనూ, బ్యాంకెష్యూరెన్స్ మార్గాల్లోనూ పాలసీలు విక్రయిస్తున్నప్పటికీ.. ఎల్ఐసీ ఆదాయాల్లో దాదాపు 94% వాటా ఏజెన్సీ ద్వారానే వస్తోంది. -
అదనపు ‘ఉపాధి’కి సాఫ్ట్వేర్
అనంతపురం టౌన్ : ఉపాధి పనులను వంద రోజుల నుంచి 150 రోజులకు పెంచిన ప్రభుత్వం దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు కల్పించనున్నారు. జిల్లాలోని 63 మండలాలూ కరువు మండలాల జాబితాలో చేరినందున వలసల నివారణకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పనిదినాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోయారు. ప్రస్తుతం జిల్లాలో 7,87,727 జాబ్‌కార్డులు జారీ చేయగా 7,79,510 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 22 వేలకు పైగా కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. ఆదివారం సాఫ్ట్వేర్ సిద్ధం కావడంతో వీరితోపాటు పనులు కావాలనే వారందరికీ 150 రోజులు పని కల్పించనున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. -
వాత..మోత
పెరిగిన ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు {పయాణికులపై రూ.93 కోట్ల భారం సిటీ బస్సులపై 10 శాతం పెంపు 27 నుంచి బస్ చార్జీలు.. జూలై ఒకటి నుంచి విద్యుత్ చార్జీల అమలు గ్రేటర్ వాసులపై ప్రభుత్వం పెనుభారం మోపింది. ఒకేసారి ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారుడి నడ్డి విరిచింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్ ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడి జీవనంపై పెరిగిన చార్జీలు పెను ప్రభావం చూపనున్నాయి. సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిపై ఆర్టీసీ భారం మోపింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆర్డినరీ బస్సులను సైతం వదిలి పెట్టకుండా చార్జీల మోత మోగించింది. ఇప్పటికే వివిధ ధరల భారంతో విలవిల్లాడుతున్న నగరవాసులపై చార్జీల పెంపు పిడుగుపాటుగా మారింది. గ్రేటర్‌లోని అన్ని కేటగిరీల బస్సుల పైన, బస్పాసుల పైన 10 శాతం మేర చార్జీలు పెంచేశారు. ఈనెల 27 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన చార్జీల వల్ల ప్రయాణికులపై ఏటా సుమారు రూ.93.60 కోట్ల భారం పడనుంది. ప్రతి రోజు నగరంలోని 3,550 బస్సుల్లో రాకపోకలు సాగించే సుమారు 33 లక్షల మంది ఈ భారం భరించాల్సిందే. అప్పట్లో భారీగా పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా 2013 నవంబర్‌లో బస్సు చార్జీలు పెంచారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక చార్జీలు పంచడం ఇదే మొదటిసారి. మరోవైపు రూ.335 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి ‘పెంపు’ ఊరటనిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ నుంచి అందిన రూ.198 కోట్లతో పాటు చార్జీల పెంపు ద్వారా వచ్చే ఆదాయంతో రానున్న రోజుల్లో నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని బస్సులపైనా 10 శాతం వడ్డన ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల చార్జీలు, బస్పాసుల ధరలు ప్రస్తుతం కంటే 10 శాతం చొప్పున పెరగనున్నాయి. ఆర్డినరీ కనీస చార్జీ రూ.6 నుంచి రూ.7కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.7 నుంచి రూ.8కి, మెట్రో డీలక్స్ చార్జీ రూ.8 నుంచి రూ.9కి పెరగనుంది. ఏసీ బస్సుల కనీస చార్జీ రూ.15 నుంచి రూ.16కు పెరుగుతుంది. నగరంలోని వివిధ రూట్లలో తిరిగే కిలోమీటర్లు, పెరగనున్న చార్జీలపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చార్జీల పెంపు వల్ల ప్రతిరోజు ప్రయాణికులపై రూ.26 లక్షలు, నెలకు రూ.7.8 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందులో ఒక్క బస్‌పాస్‌ల పైనే ప్రతినెలా రూ.కోటి 50 లక్షలకు పైగా భారం పడుతుంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ ప్రతి రోజు రూ.2.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండగా పెంపు వల్ల ఇది రూ.2.86 కోట్లకు పెరగనుంది. డీజిల్ ధరల పెంపు, విడిభాగాల ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ భారం వంటి కారణాలతో ఆర్టీసీ 2010 నుంచి ఏటా ప్రయాణికులపై భారం వేస్తునే ఉంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలు, ఉద్యోగుల వేతనాల పెంపు, భారీగా నమోదైన నష్టాల భారాన్ని ప్రయాణికులపై మోపారు. నష్టాలను అధిగమిస్తాం.. గత రెండు, మూడేళ్లుగా వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు అవకాశం లభించింది. ఇటీవల జీహెచ్ఎంసీ నుంచి అందిన ఆర్థిక సాయంతో గ్రేటర్ ఆర్టీసీకి ఊరట లభించింది. తాజాగా చార్జీలతో రానున్న రోజుల్లో నష్టాలను పూర్తిగా అధిగమించి లాభాల బాట పట్టగలమనే నమ్మకం ఏర్పడింది. చార్జీల పెంపు ప్రజలపై అదనపు భారమే అయినా ఆర్టీసీని కాపాడుకోవడం కోసం భరించక తప్పదు. - పురుషోత్తమ్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పేదోళ్లు బతికేదెట్టా.. ఒక్కటా,రెండా అన్ని వస్తువుల ధరలు పెరుగుతూనే ఉండె. కూరగాయలు, పప్పులు,నూనెలు కొనుక్కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నారు. ఇట్టా అన్ని ధరలు పెంచుకుంటా పోతే పేదోళ్లు బతికేదెట్టా! బస్సెక్కితే చాలు రూ.వందలకు వందలు చార్జీలు తీసుకుంటున్నారు. ఇట్లయితే ఇక జనం బాగుపడ్డట్టే. - మాధవి, నిజామాబాద్ సౌకర్యాలు నిల్ చార్జీలు పెంచడంపై ఉండే శ్రద్ధ బస్సులు నడపడంపై మాత్రం కనిపించడం లేదు. రాత్రి 8 దాటితే సిటీలో చాలా రూట్లలో బస్సులు కనిపించవు. ఉదయం పూట కూడా అదే పరిస్థితి. బస్సుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రయాణికులకు సిటీ బస్సు సదుపాయాలు బాగా మెరుగుపడాలి. - నర్సింహ, సికింద్రాబాద్ -
పన్ను పోటు
ఆస్తిపన్ను పెంపునకు రంగంసిద్ధం రూ.40 కోట్ల మేర భారం వారంలో అఖిలపక్ష సమావేశం మంత్రి డెరైక్షన్.. మేయర్ యూక్షన్.. విజయవాడ సెంట్రల్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధమైంది. ఇంటి అద్దెల ఆధారంగా 50శాతం మేర పన్ను పెంచాలనే యోచనకు పాలకులు వచ్చేశారు. ఈ మేరకు నగరంలో సర్వే పూర్తిచేసినట్లు సమాచారం. దీనిద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.40కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఏటా ఐదు శాతం చొప్పున పన్ను పెంచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జీవో జారీ చేయనున్న నేపథ్యంలో.. అంతకుముందే పన్ను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థలోని రాజకీయ పక్షాల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం నిర్వహించిన మేయర్ కోనేరు శ్రీధర్.. నెలాఖరులోపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మేధావులతోనూ చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు. మునిసిపల్ మంత్రి పి.నారాయణ డెరైక్షన్లోనే ఇదంతా జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాదుడే బాదుడు పేద, మధ్యతరగతి వర్గాలపై ఆస్తిపన్ను పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది. నగరాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. కార్పొరేషన్ పన్ను పెంచితే మరోమారు అద్దెల దరువు తప్పదనడంలో సందేహం లేదు. 2007లో గృహ సముదాయాల్ని మినహాయించి వ్యాపార, వాణిజ్య సంస్థలకు 50శాతం మేర పన్ను పెంచారు. ఏడేళ్లలో చెత్త, మంచినీరు, డ్రెరుునేజీ, పార్కింగ్, డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్స్‌లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్ల నుంచి రూ.250 కోట్ల మేర పన్నుల మోత మోగించారు. కార్పొరేషన్లో టీడీపీ అధికారం చేపట్టాక డ్రెయినేజీ, నీటి చార్జీలను ఏడుశాతం పెంచారు. అదేమంటే.. స్పెషల్ అధికారుల పాలనలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని ప్రజల్ని మాయ చేశారు. ప్రస్తుతం ఆస్తిపన్ను రూపంలో రూ.74 కోట్లు వసూలవుతుండగా, తాజా పెంపు ద్వారా రూ.114 కోట్ల్ల ఆదాయం వస్తుందని పాలకపక్షం అంచనా వేస్తోంది. అవినీతికి పెట్టి.. జనాన్ని కొట్టి.. నగరంలోని రెండు డివిజన్లలో సర్వే చేస్రూ.74 లక్షల మేర అవకతవకలు బయటపడ్డాయి. మిగిలిన డివిజన్లలో సర్వే పూర్తిచేస్తే కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుందని గత మునిసిపల్ కమిషనర్ సి.హరికిరణ్ చెప్పారు. ఆయన బదిలీ నేపథ్యంలో సర్వే అటకెక్కింది. టౌన్‌ప్లానింగ్‌లో బిల్డింగ్ పీనలైజేషన్ అమలు చేస్తే దండిగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రజారోగ్యశాఖతో పాటు కార్పొరేషన్ ప్రధాన విభాగాలపై దృష్టిపెడితే లెక్కలేనన్ని దుబారాను అరికట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం పేరుతో ఇంజినీరింగ్ విభాగం కార్పొరేషన్‌ను గుల్ల చేసింది. పనులు పూర్తి చేయకుండానే నిధులు ఖర్చు చేసేశారు. దీనికి సంబంధించి ఆడిట్ పూర్తికాలేదు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకుంటే కోట్ల రూపాయలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లో భారీగా అవినీతి జరిగిందని నగర టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో ఫిర్యాదుచేశారు. విచారణ కమిటీ వేస్తానని ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్రమాల లెక్క తేల్చలేని పాలకులు ప్రజలపై భారాల బండి మోపేందుకు మాత్రం సిద్ధమవ్వడం విమర్శలకు తావిస్తోంది. -
పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు పెంపు
సాక్షి, హైదరాబాద్: వివిధ రూట్లలో నడిచే డెమూ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వారానికి 5 రోజులు నడుస్తున్న రైళ్లు శుక్రవారం నుంచి వారానికి 6 రోజులు నడుస్తాయి. నంద్యాల-కర్నూలు, బీదర్-హుమ్నాబాద్, బీదర్-హుమ్నాబాద్, హుమ్నాబాద్-బీదర్ ప్యాసింజర్ రైళ్లు ఇకపై వారానికి 6 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఫలక్‌నుమా-మనోహరాబాద్ , మనోహరాబాద్-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-మనోహరాబాద్, మనోహరాబాద్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా 6 రోజుల పాటు రాకపోకలు సాగించనున్నాయి. రద్దయిన రైళ్లు వివిధ మార్గాల్లో డెమూ ప్యాసింజర్ సర్వీసులు పెంచడం వల్ల రాయ్‌చూర్-కాచిగూడ, గద్వాల్-రాయ్‌చూర్, సికింద్రాబాద్-ఉందానగర్,ఉందానగర్-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-బొల్లారం, ఫలక్‌నుమా-ఉందానగర్, సికిం ద్రాబాద్-మనోహరాబాద్, ఉందానగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.