పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు పెంపు | Many of passenger rail service increment | Sakshi
Sakshi News home page

పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు పెంపు

Published Fri, Nov 7 2014 1:53 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Many of passenger rail service increment

సాక్షి, హైదరాబాద్: వివిధ రూట్లలో నడిచే డెమూ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వారానికి 5 రోజులు నడుస్తున్న రైళ్లు శుక్రవారం నుంచి వారానికి 6 రోజులు నడుస్తాయి.

నంద్యాల-కర్నూలు, బీదర్-హుమ్నాబాద్, బీదర్-హుమ్నాబాద్, హుమ్నాబాద్-బీదర్  ప్యాసింజర్ రైళ్లు ఇకపై వారానికి 6 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

అలాగే ఫలక్‌నుమా-మనోహరాబాద్ , మనోహరాబాద్-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-మనోహరాబాద్, మనోహరాబాద్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా 6 రోజుల పాటు రాకపోకలు సాగించనున్నాయి.

రద్దయిన రైళ్లు

వివిధ మార్గాల్లో డెమూ ప్యాసింజర్ సర్వీసులు పెంచడం వల్ల రాయ్‌చూర్-కాచిగూడ, గద్వాల్-రాయ్‌చూర్, సికింద్రాబాద్-ఉందానగర్,ఉందానగర్-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-బొల్లారం, ఫలక్‌నుమా-ఉందానగర్, సికిం ద్రాబాద్-మనోహరాబాద్, ఉందానగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయనున్నట్లు  సీపీఆర్వో  తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement