వింగ్స్ ఇండియా 2024 కర్టెన్ రైజింగ్ వేడుక సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నుంచి జ్ఞాపికను స్వీకరిస్తున్న ఫిక్కీ సివిల్ ఏవియేషన్ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ ఎయిర్‌బస్ ఎండీ (భారత్ అలాగే దక్షిణాసియా) రెమి మెయిలార్డ్.
వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ హైదరాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో వింగ్స్ ఇండియా 2024 ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా నిలవనుంది. ‘‘వరల్డ్ కనెక్ట్ ఇండియా’’ ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది.
సమస్యలను విమానయాన సంస్థలు సొంతంగా పరిష్కరించుకోవాలి
కార్యక్రమం సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మాట్లాడుతూ, గోఫస్ట్ దివాలా అంశం పరిశ్రమకు విచారకరమైన అంశమేనని అన్నారు. అయితే అయితే విమానయాన సంస్థలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
వీలైనంత త్వరగా సంస్థ తమ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలనే ప్రభుత్వ కోరుకుంటోందన్నారు. అయితే తొలుత గోఫస్ట్ తన కార్యాచరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తప్పనిసరిగా తమ వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment