Rupesh kumar
-
కథ విని ఎగ్జయిట్ అయ్యాను
‘‘నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. కానీ మాది బిజినెస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కన్వి¯Œ ్స చేసి ఈ రంగంలోకి వచ్చాను. నటన నాకు ఇష్టమైన పని కావడంతో సంతృప్తినిస్తోంది’’ అని రూపేష్ కుమార్ చౌదరి అన్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘22’. దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, మారుతిల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన శివకుమార్ బి. తెరకెక్కిస్తున్నారు. మా ఆయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై సుశీలా దేవి నిర్మిస్తున్నారు. రూపేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘శివ చెప్పిన ‘22’ కథ విని ఎగ్జయిట్ అయ్యాను. మొదటి సినిమాలోనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం గర్వంగా ఉంది. ‘టెంపర్’లో ఎన్టీఆర్, ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కల్యాణ్ చేసిన పోలీస్ క్యారెక్టర్లతో పాటు కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని నటించాను. మమ్మల్ని సపోర్ట్ చేసిన వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, సాయితేజ్, వి.వి. వినాయక్, సి. కల్యాణ్, పూరి జగన్నాథ్, మారుతిగార్లకు థ్యాంక్స్. బి.ఎ రాజుగారి వల్లే ఈ సినిమాకు అంత హైప్ వచ్చింది. మా సినిమా ఓటీటీ, హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం కూడా సంప్రదిస్తున్నారు. కానీ థియేటర్లు ప్రారంభం కాగానే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
22 పెద్ద విజయం సాధించాలి
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా నటించిన చిత్రం ‘22’. శివకుమార్ .బి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను ప్రభాస్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్ లిరికల్ వీడియో చూశాను. బాగుంది. బి.ఎ. రాజుగారు, జయగారి అబ్బాయి శివకుమార్‌కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. పోలీస్ డ్రెస్‌లో రూపేష్ బాగున్నాడు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్ మూవీ అనిపిస్తోంది. ‘22’ బిగ్ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ప్రభాస్ వంటì స్టార్ పోలీస్ డ్రెస్‌లో నేను బాగున్నానని చెప్పడాన్ని అవార్డులా భావిస్తున్నా’’ అన్నారు రూపేష్. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చెప్పారు నిర్మాత సుశీలాదేవి. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ను ప్రభాస్‌గారు అడిగి తెలుసుకుని కథలో మంచి డెప్త్ ఉందన్నారు. బిగ్ హిట్ అవుతుందన్నారు. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన రూపేష్‌గారికి థ్యాంక్స్. కాస్లర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ మ్యాడీ బాగా పాడారు’’ అన్నారు శివకుమార్. ‘‘మా అబ్బాయి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద విజయం సాధించాలన్న ప్రభాస్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు బి.ఎ. రాజు. ‘‘చంటిగాడు’తో గీతరచయితగా నన్ను పరిచయం చేశారు జయగారు. వారి అబ్బాయి శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు రాయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కాసర్ల శ్యామ్. ‘‘రూపేష్‌కి, శివకు ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు సాయి కార్తీక్. కెమెరామేన్ రవికిరణ్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు, సింగర్ మ్యాడీ మాట్లాడారు. -
ప్రభాస్ చేతుల మీదుగా‘22’ లిరికల్ వీడియో
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘22’.. విభిన్న కథతో వస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తనయుడు శివ కుమార్.బి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో‘మార్ మార్కే జీనా హై’ అనే పాటను టాలీవుడ్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ శనివారం విడుల చేశారు. పాట విడుదల అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. 22 మూవీ లిరికల్ వీడియో సాంగ్ చాలా బాగుందని, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. ‘ 22’ కచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పారు. పోలీసు డ్రెస్‌లో రూపేష్ చాలా బాగున్నాడని ప్రశంసించారు. సినిమా బిగ్హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. హీరో రూపేష్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ఫస్ట్ సాంగ్‌ను ప్రభాస్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ నన్ను ఎంకరేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావని అనడం ఒక అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్రాసిని కాసర్ల శ్యామ్‌కి, మంచి సంగీతం అందించిన సాయికార్తీక్‌కి థ్యాంక్స్. కార్తీక్ సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మమ్మత్ని ప్రొత్సహించారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శివకి ధన్యవాదాలు’ అన్నారు. చిత్ర దర్శకుడు శివకుమార్. బి మాట్లాడుతూ ‘ 22-02-2020 రోజున మా ‘22’ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియోను ప్రభాస్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రభాస్ ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు అనగానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకుని, ‘కథలో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయండి, తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది’ అని చెప్పి మా టీమ్ అందర్నీ విష్ చేసిన ప్రభాస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అన్నారు. సుశిలాదేవి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సాయికార్తిక్ సంగీతం అందించారు. -
22 సినిమా హిట్ కావాలి
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా బి. శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘22’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున మాట్లాడుతూ–‘‘బి.ఎ రాజు, జయగార్ల అబ్బాయి శివ దర్శకుడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘22’ సినిమా టీజర్ చూశాను. ఆసక్తికరంగా ఉంది.పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగార్జున విడుదల చేసిన టీజర్ వీడియో, ‘22’ క్యాలెండర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ–‘‘కొత్తవారిని ప్రోత్సహించడంలో నాగార్జునగారు ముందుంటారు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ఓ ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను డైరెక్ట్ చేశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ తెలుస్తోంది. హీరోగా రూపేష్ చాలా కష్టపడ్డాడనిపిస్తోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను’’ అన్నారు మారుతి. ‘‘టీజర్‌ను చూసినవారు శివ పెద్ద దర్శకుడు అవుతాడని అంటున్నారు. అది తప్పక జరగాలని కోరుకుంటున్నాను. శివకు జయ ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు బి.ఎ రాజు. ‘‘నాగార్జునగారు టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు’’ అన్నారు శివ. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సలోని మిశ్రా, నిర్మాత కొండా కృష్ణంరాజు, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిథులు మాధవ్, నిరంజన్‌రెడ్డి, కో డైరెక్టర్ పుల్లారెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు, సినిమాటోగ్రాఫర్ రవికిరణ్, నటుడు కృష్ణచైతన్య, ఎడిటర్ శ్యామ్ పాల్గొన్నారు. -
‘ఇట్స్ రియల్లీ షాకింగ్ అండ్ అన్బిలీవబుల్’
రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘22’. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలాదేవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకుమార్ బి దర్శకునిగా పరిచయమవుతున్నారు. విభిన్న టైటిల్‌కు తోడు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఈ చిత్రంపై అందరి దృష్టి పడేలా చేసింది. తాజాగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. సినిమా ఎలా ఉండబోతోందో టీజర్ రూపంలో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. పుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సీరియస్ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో రూపేశ్ చాలా చక్కగా ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ‘ఈ ఏటీఎమ్‌కు వచ్చి ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్లకే ఇలా జరుగుతుంది’అనే బ్యాగ్రౌండ్ డైలాగ్‌తో మొదలైన టీజర్ 87 సెకన్ల పాటు ఉత్కంఠగా సాగింది. ఇక చివర్లో హీరోహీరోయిన్లు కూల్‌గా బైక్‌పై వెళ్లే సీన్‌తో టీజర్ ముగుస్తుంది. పూజా రామచంద్రన్, శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి అతడే!’ -
నాకు డబుల్ హ్యాపీ- బి.ఎ. రాజు
ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘నాతో కలిసి శివ చాలా సినిమాలకు పని చేశాడు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా సినిమా చేశాడు.. నాకు బాగా కావాల్సినవాడు, చాలా ప్రతిభ ఉన్నవాడు.. తనపై నమ్మకం ఉంది. ‘22’ సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ సాధించాలి. శివ పెద్ద డైరెక్టర్ కావాలి. రూపేష్ కుమార్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, మారుతిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శివకుమార్ బి. దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘22’. రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలాదేవి నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘22’ చిత్రం టాకీని శివ 35 రోజుల్లో పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ని పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పాటు తన మీద తనకు ఎంతో నమ్మకం ఉండటంవల్లే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేయలిగాడు’ అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ– ‘‘పూరీగారి దగ్గర పనిచేసే అవకాశం ఇచి్చనందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని ఆయన అభినందించారు. ముఖ్యంగా సాయికార్తీక్ నేపథ్య సంగీతానికి బాగా ఇంప్రెస్ అయ్యారు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి శివకి రూపే‹Ùలాంటి హీరో, ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టం. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి రవికిరణ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్.. ఇద్దరూ ఒకే సినిమాకి చేయడం నాకు డబుల్ హ్యాపీ’’ అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ‘‘సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగా చేశారు. రవికిరణ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. షూటింగ్ అంతా చాలా సజావుగా జరిగింది’’ అన్నారు రూపే‹Ùకుమార్ చౌదరి. కెమెరామేన్ రవికిరణ్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడారు. -
ఒక ట్విస్ట్ ఉంది
‘‘మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు . యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో, హీరోయిన్లపై వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణంరాజులు కెమెరా స్విచాన్ చేశారు. భీమనేని శ్రీనివాసరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు హరీశ్ శంకర్ శివకుమార్‌కు స్క్రిప్ట్ అందిచారు. దర్శకుడు శివకుమార్.బి మాట్లాడుతూ– ‘‘టైటిల్లో ఉన్న 22 నంబర్‌కు కథలో ఓ ట్విస్ట్ ఉంది. మర్డర్ మిస్టరీతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. ఈ 29న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నా బలం మా అమ్మ డైరెక్టర్ జయగారు. ఆవిడ ఎక్కడ ఉన్నా సంతోషిస్తారు. నాన్న బి.ఎ. రాజుగారు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు’’ అన్నారు. రూపేశ్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ– ‘‘నేను వెంకటేశ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలు ఒక్కోటి 15 సార్లు చూసి ఉంటాను. అలాంటిది నా మొదటి సినిమాకు ఆయన వచ్చి క్లాప్ కొట్టడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు.‘‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్‌లతో అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు సలోని. -
సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన
-రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం శంషాబాద్ రూరల్ భార్య మృతదేహాన్ని కాల్చి వేసి కారులో పరారవుతుండగా సమయస్పూర్తితో వ్యహరించి నిందితుడుని పోలీసులకు పట్టించిన మదన్‌పల్లి యువకులను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ ఎన్.నవీన్‌చంద్ ఆదివారం అభినందించారు. ముగ్గురు యువకులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ ఈ నెల 4న తన భార్య సింథియాను హత్య చేయడమే కాకుండా ముక్కలుగా నరికి బ్యాగులో పెట్టి కారులో మండలంలోని మదన్‌పల్లి వచ్చాడు. రాత్రి పూట ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని పెట్రోలుతో కాల్చి వేసి కారులో పరారు అవుతుండగా బురదలో ఇరుక్కుపోయాడు. స్థానిక యువకులు కుమ్మరి వెంకటేష్, ఎన్.లాల్‌సింగ్‌నాయక్, కట్ట రాంచందర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని గమనించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్తి ఆధారాలతో నిందితుడు పట్టుబడడానికి కారణమైన ముగ్గురు యువకులకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన కమిషనర్ వారిని అభినందించారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే సకాలంలో స్పందించిన ఎస్ఐ భాస్కర్‌నాయక్‌ను కూడా కమిషనర్ అభినందించారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు. -
ఉల్లిక్కిపడ్డ ‘జైన్ శిల్ప’ అపార్ట్మెంట్
సింథియా దారుణ హత్య, కాల్చివేతతో విషాదం రూపేష్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు... సింథియా ఇంటికే పరితమయ్యేది: స్థానికులు గచ్చిబౌలి: రూపేష్ కుమార్ తన భార్య సింథియాను హత్య చేసి, శరీర భాగాలను కాల్చిశాడని తెలిసి గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. అయ్యో పాపం... అంటూ కన్నీరుపెట్టుకున్నారు. శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్.. అపార్ట్మెంట్లో ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని అక్కడి వారు తెలిపారు. జైన్ శిల్ప అపార్ట్మెంట్లో రమణరావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి- ఫ్లాట్‌లో రూపేష్ కుమార్ రెండేళ్లుగా అద్దెకుంటున్నాడు. భార్య సింథియా, కూతురు సానియాతో పాటు నగరంలో బీటెక్ చదువుతున్న బావమరిది (సింథియా సోదరుడు) ఫ్లాట్‌లో ఉంటున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు తిరిగి వచ్చేవాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా.. సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు. సోదరి హత్య విషయం తెలియని అతను సోమవారం రాత్రి 12 గంటలకు ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్మెంట్లోనే తచ్చాడాడు. మీడియా హుడావుడి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవపడ్డట్టు తాము ఎప్పుడు గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడ న్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్య భార్యను హత్య చేసి ముక్కలు చేసిన అనంతరం శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్ నుంచి కారులో తీసుకెళ్లి ఉంటాడని అపార్ట్మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కన్నే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సహాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది.