వాగులో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడిని స్థానికులు కాపాడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
- కాపాడిన స్థానికులు
మెడ్చల్(రంగారెడ్డి)
వాగులో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడిని స్థానికులు కాపాడిన సంఘటన రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం కిష్టాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు ఈరోజు ఉదయం బైక్ పై మెడ్చల్ వెళ్తుండగా.. కిష్టాపూర్ శివారులోని వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. ఆ సమయంలో వాగు వద్ద ఉన్న యువకులు వాగులో కొట్టుకుపోతున్న వేణును తాళ్ల సాయంతో యువకుడిని రక్షించారు.