కొంగరకలాన్: మరో 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజ్యసభ టీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభలో కేశవరావు ప్రసంగిస్తూ..మనం ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పాలనుకున్నామని, అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని వ్యాక్యానించారు. నిజానికి టీఆర్‌ఎస్ పాలించింది రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని, మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజస సమస్యలతో గడిచిపోయాయని తెలిపారు. తెలంగాణలో 80 శాతం బడుగుబలహీన వర్గాలే ఉన్నాయని, ప్రతీ బీసీ కులాల్ని గుర్తించి వారి అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని కొనియాడారు.
మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే..
Published Sun, Sep 2 2018 6:47 PM | Last Updated on Sun, Sep 2 2018 7:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment