Keshava Rao
-
EC: తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు..
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.షెడ్యూల్ ఇలా..సెప్టెంబర్ మూడో తేదీన ఉప ఎన్నికలకు పోలింగ్. అదే సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్.ఇక, నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీఅయితే, 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను ఎన్డీయే కూటమి దక్కించుకునే అవకాశమే ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వచ్చే అవకాశముంది. కాగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా కేశవరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల జరుగుతోంది. అనంతరం, కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. Election Commission of India releases notification for the 12 vacant seats of Rajya Sabha. Elections will be held on 3rd September. The last date for withdrawal of nominations is the 26th and 27th of August. pic.twitter.com/1d3SgWivOT— ANI (@ANI) August 7, 2024 -
రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా ఉపఎన్నిక జరిగితే..!
-
రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌కు గురువారం అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేశవరావు ఆ పార్టీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.రాజీనామా సమర్పించిన అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారని.. బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని.. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా సమర్పించానని కేశవరావు చెప్పారు. -
నేడు కాంగ్రెస్ లోకి కె.కేశవరావు..
-
నేడు కాంగ్రెస్ లోకి చేరనున్న కే కేశవరావు
-
నేడు కాంగ్రెస్‌లోకి కేశవరావు.. కేబినెట్ విస్తరణ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, సీనియర్ నేత కే. కేశవరావు నేడు హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవి(రాజ్యసభ సభ్యత్వం)కి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. రేపు(గురువారం) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్ హస్తిన పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశంలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. దీంతో, కేబినెట్ విస్తరణ వాయిదాపడే ఛాన్స్ ఉంది. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
బెంగళూరుకు వెళ్లలేదంటే బీజేపీతో ఉన్నట్టు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: బెంగళూరులో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ హాజరుకాలే దంటే తాము బీజేపీతో ఉన్నట్టు కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు స్పష్టం చేశారు. 26 పార్టీలు ఒకవైపు, 38 పార్టీలు ఒకవైపు అన్న లెక్కలు రాజకీయాల్లో పనికిరావని, సిద్ధాంతపరంగా ఎవరు ఎటు ఉన్నారు అన్నది చూడాల న్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావే శంలో బీఆర్ఎస్ తరపున ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కేకే మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో అర్థ గణాంకాలు పనిచేయవని, రెండు రెండు నీటి బిందువులు కలిస్తే నాలుగు బిందువులు కావని కేవలం ఒక నీటి బిందువే అవుతుందన్నారు. కూట ములు విఫల ప్రయోగాలు అని ఇప్పటికే రుజువైందని వ్యాఖ్యానించారు. ఇండియా కూట మిలో ఉంటే బీజేపీకి వ్యతిరేకం అని, లేకపోతే బీజే పీకి మిత్రులని అనుకోవద్దన్నారు. ఐదుగురు జడ్జీల విషయంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ తేవడం అహంకారపూరితమని కేకే మండిపడ్డారు. న్యాయమూ ర్తుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలపై చర్చ జరగాలి: నామా విభజన చట్టంలోని హామీలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పెండింగ్ నిధుల అంశంపై చర్చ జరగాలని ప్రతీ పార్లమెంట్ సమావేశ సమయంలో పట్టుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమావేశాల్లో గవర్నర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని నామా డిమాండ్ చేశారు. -
గాంధీ స్ఫూర్తితో మా తాత నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే.. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి అని చెప్పుకుంటారు. అయితే, కేటీఆర్ తాజాగా తమ ఫ్యామిలీకి సంబంధించిన ఓ స్పెషల్ ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీలో కూడా గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తన తాత గురించి చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలో ఉన్నది తన తాతయ్య (తల్లి తరఫు) జె.కేశవరావు అని వెల్లడించారు. ఆ ఫొటోలపై వివరణ ఇస్తూ.. తమ కుటుంబంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని అన్నారు. గాంధీజీ బోధనలతో ఉత్తేజం పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో 1940ల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం సైతం ఆయనకు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఎంత మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్ విమర్శించారు. ఇక, ఒక ఫొటోలో కేటీఆర్, కవిత, ఎంపీ సంతోష్ రావు ఎలా ఉన్నారో కూడా చూడవచ్చు. Let me introduce you all to an inspirational figure from my family: My maternal Grandfather Sri J. Keshava Rao Garu Inspired by Gandhi ji, he fought against the Nizam as part of Telangana Rebellion in late 1940s He received recognition from Govt of India as a freedom fighter pic.twitter.com/s1YCR6c2vo — KTR (@KTRTRS) September 3, 2022 -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు అల్వాకు ఓటు వేస్తారని తెలిపారు. కాగా, మార్గరెట్ అల్వా.. సాయంత్రం కేకే నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావులు పార్టీ ఎంపీలను అల్వాకు పరిచయం చేశారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా కేకే నివాసంలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆమె ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు దామోదర్ రావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, రాములు, పసునూరి దయాకర్‌లు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారని భేటీ అనంతరం కేకే మీడియాతో అన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు తాము అల్వాకు మద్దతిస్తున్నామని తెలిపారు. -
కుల గణన అంశం పై టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్
-
కేకేకు కోవిడ్ పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణయింది. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా తిరిగిన వారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. దాన్యం కొనుగోలు అంశంపై ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ బృందంతో పాటు ఢిల్లీకి వెళ్లిన కేశవరావు తిరిగి వచ్చాక తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ బృందం సభ్యునిగా ఢిల్లీకి వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కరోనా బారిన పడటం తెలిసిందే. -
ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం హక్కుల ఉల్లంఘనే!
హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్‌పూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ.. సాయిబాబా సర్వీసులను టెర్మినేట్ చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని స్పష్టంచేశారు. ఆయన అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశానని తెలిపారు. -
మేయర్ ఖరారు.. అందరి కళ్లు ఆమెపైనే
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కాసేపట్లో జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అనంతరం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందరి దృష్టి బంజారాహిల్స్ కార్పొరేటర్‌పైనే నిలిచింది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుందనే వార్తలు గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దాదాపు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఎన్బీటీనగర్లో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. కార్యకర్తలు, నేతల రాకపోకలతో కొత్త వాతావరణం కనిపిస్తోంది. కార్పొరేటర్ తండ్రి టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. దీంతో మేయర్ పదవి దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మినే వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఉత్కంఠకు తెర వేయాలంటే ఇంకొద్ది సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు బంజారాహిల్స్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. దాదాపుగా గద్వాల్ విజయలక్ష్మి పేరు సీల్డ్ కవర్లోకి ఎక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆమె మేయర్‌గా ఎన్నికైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం. -
వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, సాగు అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అయితే ఈ చట్టాలను మొత్తానికే రద్దు చేయాలని రైతులు తీసుకున్న దృఢ వైఖరిని తాను అంగీకరించడం లేదన్నారు. రైతులు కోరుతున్న సవరణలు సమ్మతించదగినవని పార్లమెంటు భావించినప్పుడు ఆ మేరకు సవరణలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మన దేశంలో మొదటి విడత ప్రారంభమైంది. వ్యాక్సిన్ తెచ్చిన రెండు సంస్థలకు, సైంటిస్టులకు అభినందనలు. మనం చక్కటి బడ్జెట్ చూశాం. ఆరోగ్య రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. అయితే మందుల సరఫరా, వైద్య సిబ్బంది తగినంతగా లేరు. దీనిపై దృష్టిపెట్టాలి. ఈరోజు దేశంలో రగులుతున్న సమస్యపై నాకు కూడా ఆందోళన ఉంది. రైతుల ఉద్యమం గురించి నేను మాట్లాడుతున్నాను. మనం మరికొంత ప్రజాస్వామికంగా, ఇంకాస్త సర్దుబాటు, ఔదార్యంతో వ్యవహరించే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. బిల్లులు గందరగోళం మధ్య ఆమోదం పొందాయి. సభ్యుల ఆందోళనల నడుమ సవరణలు ప్రతిపాదించే అవకాశం కూడా లేకుండాపోయింది. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) సిద్ధంగా ఉన్నామని చెబితే.. దానిని చట్టంలో పెట్టడంలో ఉన్న అభ్యంతరమేంటి? పలు అంశాల పట్ల తాము సానుకూలమని ప్రభుత్వం సమాధానం ఇస్తోంది. అయితే అనేక అంశాలకు ఇంకా పరిష్కారం దొరకలేదని రైతు నాయకులు చెబుతున్నారు. అపరిష్కృత అంశాలేమిటో మనకు తెలియడం లేదు. అందువల్ల వీటిని పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉంది. చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు తీసుకున్న దృఢమైన వైఖరిని నేను అంగీకరించడం లేదు. ఒకవేళ రైతులు కోరుకున్న మార్పులు హేతుబద్ధంగా ఉంటే, అవి వాస్తవమేనని సభ అంగీకరిస్తే, ఆ మేరకు సవరణలు చేయాలి. ఆనాడు సెలెక్ట్ కమిటీకి పంపి ఉంటే సమస్య పరిష్కారమై ఉండేదని భావిస్తున్నా. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడం కంటే... మనమే ఒక పరిష్కారం చూపడం మంచిదని భావిస్తున్నా’అని కేశవరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో... మార్కెట్ కమిటీలు కొనసాగుతాయని, కనీస మద్ధతు ధర కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఒకవేళ అవసరమైతే మేం దానికి చట్టం తెస్తాం’అని కేకే పేర్కొన్నారు. -
ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పథకమంటూ, కేటీఆర్ సిఫారసు చేశాడని చెబుతూ ఏకంగా టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎంపీ కేకేకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి తన పేరు మహేష్ అని, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. కేంద్రం నుంచి ఎంపీలకు ప్రైమ్ మినిష్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 20 మంది వ్యాపారులకు రూ.25 లక్షల మేర రుణాలు ఇప్పించుకునే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో కేకే తన కుమార్తె కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మితో మాట్లాడాల్సిందిగా సూచించాడు. ఆమె తన డివిజన్ పరిధిలో ఉన్న కొందరు కార్యకర్తలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మహేష్‌తో మాట్లాడేందుకు అంగీకరించింది. మహేష్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గారు మీ పేరు సూచించారని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఈ రుణాల కోసం పోటీ పడుతున్నారని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తే ఆశాభంగమని చెప్పాడు. ఈ రుణం తీసుకున్న వారికి 50 శాతం సబ్సిడీ కూడా ఉంటుందని ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజే చివరి అవకాశమని దీని కోసం ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతి ఒక్కరు రూ. 1.25 లక్షలు కట్టాల్సి ఉంటుందని చెప్పాడు. మంత్రి కేటీఆర్ సూచించడంతోనే తాను ఫోన్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. సదరు రుణాలతో సూపర్ మార్కెట్, పౌల్టీ ఫామ్, జనరల్ స్టోర్, ఫోర్ వీల్ ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రం 4 గంటల్లోపు డబ్బులను తన పేరున ఉన్న అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు. దీంతో అప్పటికప్పు డు కొందరు లబ్ధిదారులను పిలిపించి విషయాన్ని వివరించింది. మంచి అవకాశం ఉందంటూ కార్పొరేటర్ చెప్పడంతో ఆగమేఘాల మీద డబ్బులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఆఖరి నిమిషంలో అనుమానం... అయితే ఆఖరి నిమిషంలో ఈ పథకంపై కేకేకు అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావించిన ఆయన మరోసారి మహేష్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నారని ఆరా తీయగా తాను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌తో ఉన్నానని డీడీల మీద సంతకాలు చేయించేందుకు వచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని నేరుగా కేటీఆర్‌తో కనుక్కుందామని మంత్రికి ఫోన్ చేశాడు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంతో ఆయన పీఏకు ఫోన్ చేయగా కేటీఆర్ అసలు హైదరాబాద్‌లోనే లేరని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు చెప్పడంతో కేకే అవాక్కయ్యారు. దీంతో తన కుమార్తెకు విషయం చెప్పడంతో ఇదేదో అనుమానంగా ఉందని చెప్పడంతో వారంతా ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం ఆధార్ కార్డు మాత్రమే పంపాలని మహేష్ సూచించడంతో దానిపై లోన్ ఎలా ఇస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు. అత్యుత్సాహంతో 50 వేలు హాంఫట్... ఓ వైపు స్కీం విషయమై విజయలక్ష్మి చర్చిస్తుండగానే సదరు వ్యక్తి విజయలక్ష్మి దగ్గర ఉండే యువకుడు మేక అఖిల్‌కు ఫోన్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తనుకు ఆర్టీజీఎస్ ద్వారా ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వారికే రుణం వస్తుందని తొందరపెట్టాడు. దీంతో అఖిల్ తన అకౌంట్ ద్వారా రూ. 50 వేలు మహేష్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. మరో రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేసేలోగా మోసాన్ని పసిగట్టిన విజయలక్ష్మి ఈ విషయాన్ని అఖిల్‌కు చెప్పగా మిగతా డబ్బులు వేయలేదు. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు అఖిల్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ లోగా అతడు వేసిన రూ. 50 వేలలో రూ.40 వేలు నిందితులు అప్పటికే డ్రా చేశారు. మిగతా రూ.10 వేలు డ్రా చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంకు అధికారులు మహేష్ బ్యాంకు అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. నిజామాబాద్‌లో విత్ డ్రా అఖిల్ డిపాజిట్ చేసిన నగదులో రూ. 40 వేలను సంజీవ్ అనే వ్యక్తి నిజామాబాద్‌లో డ్రా చేసినట్లు తెలిసింది. మరో 10 వేలు డ్రా చేసేలోగానే బ్యాంకు అధికారులు అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడంతో సంజీవ్ అనే వ్యక్తి బ్యాంకు అధికారులతో అక్కడ గొడవకు దిగినట్లు సమాచారం. కార్పొరేటర్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దేశం గర్వించే నేత పీవీ నర్సింహారావు..
సాక్షి, హైదరాబాద్ : సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత దివంవత పీవీ నరసింహరావు అని పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పీవీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని కొనియాడారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశనాయకుడని అన్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ) జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని కేశవరావు తెలిపారు. ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి అన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్) కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని టీఆర్ఎస్ నేత వినోద్ తెలిపారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్ గుర్తు చేశారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన బాటలేనని ప్రభాకర్ పేర్కన్నారు. -
చర్చల దిశగా ఆర్టీసీ సమ్మె
-
చర్చల దారిలో..సర్కారు సంకేతాలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజున టీఆర్ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి. కార్మికులు సమ్మె విషయంలో మొండివైఖరి విడనాడాలని, విలీనం మినహా ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేకే ప్రకటన చేశారు. ఈ ప్రకటన విడుదల చేసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేకే... రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన దరిమిలా మంగళవారం చర్చలకు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ నేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మరోవైపు సమ్మె పదో రోజున కార్మికులు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలియజేశారు. జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం సమర్పించారు. -
చర్చలు మాకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నా మని, ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే చర్చలకు హాజరవుతామని పేర్కొంది. సోమవారం గవర్నర్ తమిళిసైను కలసిన ఆర్టీసీ ప్రతినిధి బృందం.. అనంతరం మీడియాతో మాట్లాడింది. టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి, ఈయూ నేత రాజిరెడ్డి తదిత రులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ వైఖరిని తప్పుబట్టారు. కార్మికులంతా సమ్మెకు వెళ్లే ముందే తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. టీజేఏసీ నేతలను ఫోన్లో సంప్రదించగా తామంతా ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారని, సమ్మెను మొదలు పెట్టాల్సిందిగా సూచించారన్నారు. దసరా తర్వాత మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మద్దతు కోసం ఆదివారం చర్చలు జరపాలని కోరా మని, కానీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిరావడంతో టీజేఏసీతో చర్చలకు వెళ్లలేకపోయినట్లు వివరించారు. ఇప్పటికైనా తమకు మద్దతు ఇవ్వాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కేకే మధ్యవర్తిత్వం అంగీకారమే... కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలన్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సూచనను వారు స్వాగతించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు కేకే మధ్యవర్తిత్వం వహిస్తే ఆర్టీసీ జేఏసీకి అంగీకార మేనన్నారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. సమ్మెపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరాలోచించుకోవాలని, తమను చర్చలకు ఆహ్వానించాలన్నారు.ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, కార్మికులెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు కృషి చేయాలని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలెవరూ స్వతహాగా సమ్మెకు మద్దతు ఇవ్వలేదని, ఆర్టీసీ జేఏసీ కోరిన తర్వాతే మద్దతుగా సమ్మెలోపాల్గొన్నట్లు వివరించారు. సమ్మెలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
సమ్మె విరమించండి
సాక్షి, హైదరాబాద్: పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు పిలుపునిచ్చారు. సమ్మెలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని, ఏ సమస్యకూ ఆత్మాహుతి లేదా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఈ మేరకు కేకే సోమవారం లేఖ విడుదల చేశారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం మధ్యంతర భృతి ప్రభుత్వ సానుకూల ధోరణికి నిదర్శనం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ మినహా సంస్థ ఉద్యోగులు లేవనెత్తిన ఇతర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని కేకే లేఖలో పేర్కొన్నారు. ‘ఆర్టీసీని ప్రైవేటీకరించరాదనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అలాంటి నిర్ణయాలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనే విషయాన్ని అందరూ గమనించాలి. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనతోపాటు దేశంలో బస్సు రవాణాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజారవాణాలో మూడంచెల ఏర్పాట్లు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేవలం ఓ ప్రయోగంలా మాత్రమే చూడాల్సి ఉంది. 50 శాతం బస్సులను ఆర్టీసీ, 30 శాతం బస్సులను స్టేజి క్యారియర్లుగా, మరో 20 శాతం బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనేది ఓ ప్రయోగంలా మాత్రమే భావించాలి’ అని కేశవరావు వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ నియంత్రణలో నడిచే రాష్ట్ర, ప్రభుత్వరంగ సంస్థల నడుమ ఎంతో తేడా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఎంత మాత్రం వాణిజ్య సంస్థ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రూపొందించే విధానాలను ఏ వ్యవస్థ కూడా నిర్దేశించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశం పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఎన్నడూ నా పరిశీలనలోకి రాలేదు. కాబట్టి ఆర్టీసీ లేదా ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై ఎలాంటి స్థితిలోనూ పునరాలోచన ఉండబోదని కేశవరావు స్పష్టం చేశారు. -
పరిశ్రమలశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా కేకే
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులుం టారు. ప్రతిష్టాత్మక కమిటీకి తనను చైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల కేశవరావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎం చాంబర్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలే
-
మరో పది సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉంటే..
కొంగరకలాన్: మరో 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు వ్యాఖ్యానించారు. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభలో కేశవరావు ప్రసంగిస్తూ..మనం ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెప్పాలనుకున్నామని, అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో నిజమైన రాజులు ప్రజలేనని వ్యాక్యానించారు. నిజానికి టీఆర్ఎస్ పాలించింది రెండున్నర సంవత్సరాలు మాత్రమేనని, మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజస సమస్యలతో గడిచిపోయాయని తెలిపారు. తెలంగాణలో 80 శాతం బడుగుబలహీన వర్గాలే ఉన్నాయని, ప్రతీ బీసీ కులాల్ని గుర్తించి వారి అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని కొనియాడారు. -
‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’