ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజున టీఆర్‌ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి.