ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.
ఆర్టీసీ చర్చలపై సర్కారు తర్జనభర్జన
Published Thu, Oct 17 2019 7:49 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement