High Court of Hyderabad
-
బతుకమ్మ కుంట.. బతికెనంట!
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా, ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు.. తాజాగా చెరువులో పూడికతీత మొదలెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా.. లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఇది బతుకమ్మ కుంట కాదు ప్రైవేట్ స్థలం అంటూ వాదించిన వాళ్లు ఇప్పుడేమంటారంటూ ప్రశి్నస్తున్నారు. కబ్జాల చెరలో చిక్కిపోయి, ఆనవాళ్లను కోల్పోయిన బతుకమ్మ కుంటకు ప్రాణం పోయాలని కోరుతూ గతంలో అంబర్‌పేటకు చెందిన స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు నిర్ధారించారు. బతుకమ్మకుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయ ని న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లాలని సూ చించింది. దీంతో హైడ్రా తన అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. బతుకమ్మ కుంటలో ఉన్న పైపులైన్ పగిలి నీళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి పైపులైన్లు లేవని జలమండలి అధికారులు స్పష్టం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పదహారు నుంచి ఐదెకరాలకు తగ్గిన కుంట.. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ⇒ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలా ల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.మరో ఐదు చెరువుల్లోనూ.. హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, ఉప్పల్ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్ దౌలా చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి, చెరువుకు పునరుజ్జీవం కలి్పస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్ఏండీఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని వచ్చే జూన్ మాసం కల్లా పూర్తి చేయనున్నారు. -
ఆ ఫోన్ ఎక్కడ.. విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు?
శంకర్పల్లి: విజయ్ మద్దూరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. కొకైన్ ఎక్కడ తీసుకున్నావ్? ఫోన్ ఎక్కడ దాచావ్? విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు? పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ప్రశ్నించనట్టు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కేసులో డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మోకిల పోలీస్‌స్టేషన్‌లో తన న్యాయవాది అవినాష్‌తో కలిసి విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ సమక్షంలో మోకిల సీఐ వీరబాబు విచారణ చేపట్టారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత విజయ్ పోలీస్‌స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆయన్ను పలుకోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. తాను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నెదర్లాండ్స్‌లో రోజూ కొకైన్ తీసుకున్నానని..రాజ్ పాకాల ఇంట్లో పార్టీలో తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. పార్టీ సమయంలో తన ఫోన్లో చార్జింగ్ లేక అక్కడే చార్జింగ్ పెట్టానన్నాడు. ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే అప్పగిస్తానని పోలీసులకు చెప్పాడు. సుమారు మూడు గంటల పాటు విచారించిన పోలీసులు, మళ్లీ అవసరమైతే పిలుస్తామని పంపించారు. ఇంటికి వెళ్లే సమయంలో విజయ్ మద్దూరితో మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన నిరాకరించారు. -
హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలన్నా కొందరు అధికారులు లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారు. తాము ఆదేశాలిచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతర్ చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాదు ఏకంగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరి 29న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2018లో ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫామ్–1.. ఇంటర్నేషనల్ గేమ్స్, ఫామ్–2.. నేషనల్ గేమ్స్(అసోసియేషన్), ఫామ్–3.. నేషనల్ గేమ్స్(యూనివర్సిటీ లెవెల్), ఫామ్–4.. నేషనల్ గేమ్స్(సూ్కల్/స్టేట్ లెవెల్)గా పరిగణిస్తారు. ఆయా ఆటల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నియామకాల్లో సంబంధిత ఫామ్‌లను సమరి్పంచాల్సి ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పరిశీలించి డైరెక్టరేట్‌కు పంపిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్ కోటాలో వీరిని భర్తీ చేశారు. అయితే తాజా డీఎస్సీలో ఫామ్–1, ఫామ్–2 ఉన్న అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఫామ్–3, ఫామ్–4 వారికి కూడా ఇచ్చారని, ఫామ్–3, ఫామ్–4 ఉన్నా తమకు ఇవ్వలేదనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఇంకొందరు రాష్ట్రస్థాయి క్రీడాకారులే అయినా జాతీయ స్థాయి ఫామ్ అందజేశారని.. శాట్ పరిశీలించకుండానే డైరెక్టరేట్‌కు అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి శాట్‌కు దాదాపు 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచారా? లేదా? అనేది చూడాలి. కానీ శాట్ వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు. నవంబర్ 21 వరకు..జీవో సరిగా లేదంటూ నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన ఆర్.రమేశ్‌తోపాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం వీరి పిటిషన్‌పై సెపె్టంబర్ 25న విచారణ చేపట్టింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి పిటిషనర్ల నుంచి సరి్టఫికెట్లన్నీ తీసుకుని పరిశీలించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. అయినా ఈలోపే ఫలితాలు వెల్లడించారు. పిటిషనర్లలో ఒక్కరు మాత్రమే ఎంపికైనట్లు ప్రకటించి ఉద్యోగం ఇచ్చారు.ఎలాంటి జీవో లేకుండా..ప్రభుత్వంగానీ, శాట్గానీ, నియామక డైరెక్టరేట్గానీ ఫామ్–1, ఫామ్–2 ఉన్న వాళ్లకే స్పోర్ట్స్ కోటా కింద పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆధారంగా మొదట ఫామ్–1 వారికి.. లేకుంటే ఫామ్–2 వారికి.. లేకుంటే ఫామ్–3 వారికి.. లేకుంటే ఫామ్–4 వారికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు హైకోర్టు ఉత్తర్వులిచి్చనా వాటిని డైరెక్టరేట్ పాటించలేదు. నల్లగొండ జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో లేరంటూ ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు. – ఆర్.రమేశ్, బాధితుడుఇదెక్కడి న్యాయం... ఎంసెట్ లాంటి వాటికే స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేస్తున్నప్పుడు.. పోస్టింగ్‌లకు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆన్లైన్లో ఎవరు ఏది పెడితే అది పంపిస్తారా? స్కూల్ అసిస్టెంట్‌ను గ్రూప్–1 స్థాయిగా, ఎస్జీటీని గ్రూప్–2 స్థాయి పోస్టులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఇంత ప్రాధాన్యమున్న ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఏదీ? ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పరిష్కారం చూపాలి. – కృష్ణమూర్తి, బాధితుడు శాట్ పరిశీలన ప్రకారమే.. స్పోర్ట్స్ అథారిటీ ఫైనల్ చేసిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం. 393 దరఖాస్తులను పంపిస్తే శాట్ పరిశీలన చేసి 35 మంది అర్హులను మాకు పంపారు. ఫామ్–1, ఫామ్–2 వారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు నాన్ లోకల్, 33 మంది లోకల్ వారికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఇతరులు కూడా తమకు అర్హత ఉందని చెబుతున్నారు. అనుమానం ఉంటే మరోసారి అప్లికేషన్లు ఇస్తే శాట్‌కు పంపించి పరిష్కరిస్తాం. హైకోర్టు నుంచి మాకు ఎలాంటి ఆదేశాల్లేవు. పోస్టింగ్‌లు ఇచ్చాక ఇప్పుడు చేసేదేం లేదు. – డైరెక్టర్, పాఠశాల విద్య -
కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఓ సివిల్ కేసులో అప్పీల్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఆలస్యానికి కారణం ఎన్నికలని చెప్పడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారులు ఏమన్నా రాజకీయ నాయకులా..కలెక్టర్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు..గెలిచారా? లేదా? అని ప్రశ్నించింది. ఎన్నికలు వచ్చినా అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదు కదా.. అప్పీల్ దాఖలుకు ఎన్నికలు ఎందుకు అడ్డంకి అవుతాయంటూ తప్పబట్టింది. కలెక్టర్ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిలదీసింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని ఓ స్థలం ఏపీ ప్రభుత్వానిదని 2014లో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఫజలుల్లాల్ హక్‌తో పాటు మరో 9 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి..ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. 1968 నుంచి ప్రభుత్వం ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తున్నందున ఖాళీ చేయాలని చెప్పలేమన్నారు. భూ సేకరణ చట్టం కింద ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని, ఒకవేళ ప్రక్రియ చేపట్టకుంటే స్థాలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు స్వా«దీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2016లో తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పుపై హైదరాబాద్ కలెక్టర్ 2024, జూలైలో అప్పీల్ దాఖలు చేశారు. ఎన్నికల కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందంటూ మధ్యంతర అప్లికేషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫునన స్పెషల్ జీపీ ఎ.దివ్య వాదనలు వినిపిస్తూ..ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందని, విచారణకు స్వీకరించాలని కోరారు. అప్పీల్ దాఖలుకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలా కారణంగా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఇతర పలు కార్యక్రమాల్లో బిజీ ఉన్నారని జీపీ సమాధానమిచ్చారు. దీనికి ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ.. మీ స్పందన ఇలానే ఉంటే ఇంకా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుందని, అప్పీల్‌ను తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది. సరైన కారణాలతో అప్పీల్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం వాయిదా వేసింది. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
57 ఏళ్ల తర్వాత రికార్డులు కోరలేరు
సాక్షి, హైదరాబాద్: దాదాపు 57 ఏళ్ల తర్వాత భూరికార్డులు కోరలేరని మ్యుటేషన్ వివాదం అప్పీల్లో హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో కాలవ్యవధి పేర్కొననప్పటికీ కక్షిదారులు సహేతుకమైన వ్యవధిలోనే అధికారులను సంప్రదించాలని తేల్చిచెప్పింది. 57 ఏళ్ల తర్వాత రికార్డుల్లో నమోదుకు దరఖాస్తు సమరి్పంచినందున అప్పీలుదారు సవరణకు అర్హుడు కాదని చెప్పింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయ్‌పల్లిలోని 64.30 ఎకరాల భూమి తమదేనంటూ బూరుగుపల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన తల్లి 1963లో ఆ భూమిని కొనుగోలు చేసిందని, మ్యుటేషన్ కోసం తహసీల్దార్‌ను సంప్రదించిందన్నారు. అయితే మొత్తం భూమిలోని 4.23 ఎకరాలు ఆమె పేరు మీద లేదంటూ మ్యుటేషన్‌కు నిరాకరించారని.. ఈ క్రమంలోనే భూమి, పట్టాదార్ పాస్‌బుక్‌లో తెలంగాణ హక్కుల చట్టం–2020 అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ (ప్రత్యేక ట్రిబ్యునల్)కు అప్పీల్ చేసుకోగా.. దీన్ని కొట్టివేశారన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. 1963లో భూమి కొనుగోలు చేసి 2019లో మ్యుటేషన్‌కు అధికారులను సంప్రదించడాన్ని తప్పుబట్టి పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై హనుమంతరావు అప్పీల్ దాఖలు చేయగా.. ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విని అప్పీల్‌ను కొట్టివేసింది. అయితే, అప్పీలుదారు, అతని తల్లి చట్టప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంటూ స్వేచ్ఛనిచి్చంది. -
TG: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు.. స్థానికతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గ నిర్దేశకాల ప్రకారం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక, జీవోలో భాగంగా నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీర్పును వెల్లడించింది. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అర్హనత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు జంధ్యాల రవిశంకర్. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించాము. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TG: కుక్కల దాడులను ఆపలేరా?.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుక్కల దాడి ఘటనల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.కాగా, నిన్న జవహర్ నగర్లో కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనపై వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. కుక్కల దాడి ఘటనలను నివారించడానికి స్టేట్ లెవల్ కమిటీ చేశాము. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు సుమారు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు.. స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడులను ఆపుతారని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నాగపూర్‌లో దాదాపు 90వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు చెప్పారు. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. అనంతరం, పిటిషన్లపై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో జరిగిన రైలు రోకో కేసు వ్యవహారంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది.కాగా, 2011లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనపై రైలు రోకో కేసులో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్లో కోరారు. తాను రైలు రోకోలో పాల్గొనలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, కేసీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది. -
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఓటర్ పిటిషన్ వేయవచ్చా? దీనిపై స్పీకర్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఆయన ముందు వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల ని చెప్పవచ్చా? అలా గతంలో ఏవైనా తీర్పులుంటే తమ ముందు ఉంచాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ‘2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో నేను ఆయనకు ఓటు వేశాను. ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి.. మరో పార్టీలో చేరిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని మార్చి 23న స్పీకర్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించాం. ఇంకా దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని దానంను అనుర్హుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వండి’అని కోరుతూ ఖైరతాబాద్‌కు చెందిన బొల్లబోయిన రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో పిటిషనర్‌కు ఎలాంటి అర్హత ఉందని అతని తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి మూడు నెలలు తిరగకుండానే కాంగ్రెస్‌కు విధేయుడిగా మారిన ఎమ్మెల్యేకు పిటిషనర్ ఓటేశారని న్యాయవాది చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గత తీర్పుల కాపీలుంటే తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
‘అఫిడవిట్’పై మళ్లీ చర్చ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడివిట్లో సరైన వివరాలు అందించలేదనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేసి సాంబశివరావుకు రాష్ట్ర హై కోర్టు నోటీసులు పంపింది. దీంతో మరోసారి అఫిడవిట్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జలగం వర్సెస్ వనమా.. తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున జలగం వెంకటరావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకటరావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2023 జూన్‌లో వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసన సభ కార్యదర్శిని జలగం వెంకటరావు కోరారు. ఇంతలో హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచే రగడ.. జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అంశంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అయితే రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాలు నింపేందుకు, సరి చూసుకునేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే నామినేషన్ దరఖాస్తుల పరిశీలన గరం గరంగా జరిగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్థి వై. కామేశ్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు అఫిడవిట్లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్థి జలగం వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో మరోసారి అఫిడవిట్ అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
‘కాళేశ్వరం’ బాధ్యులపై చర్యలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్‌పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్‌లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఎస్ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్డీఎస్ఏ సమర్పించింది. ‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది. -
డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్
రీసెంట్గా టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు బయటకు రాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. తొలుత సరేనని ఒప్పుకొన్న క్రిష్.. ముంబయిలో ఉన్నానని రెండు రోజులు టైమ్ కావాలని కోరాడు. (ఇదీ చదవండి: 'అజ్ఞాతవాసి' పవన్ కల్యాణ్ పొలిటికల్ సినిమా) కానీ అంతలోనే తనన పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అది అలా ఉండగానే తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు క్రిష్ విచారణకు హాజరయ్యాడు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. దీంతో క్రిష్.. తన పిటిషన్‌ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అతడి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ) -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. 5 రోజులకే 850 ఎకరాలు... ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అయితే, మూడు రోజుల క్రితం.. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
చార్మినార్ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌పై.. ఎలాంటి కఠిన చర్యలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మేఘా రాణి అగర్వాల్‌తో పాటు పవన్ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లో సీఆర్పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. హైదరాబాద్ హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో తమపై దాఖలైన కేసులో అరెస్టు సహా ఇతర చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మేఘా రాణి అగర్వాల్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది అంజలి అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన మేఘా రాణి అగర్వాల్ చార్మినార్ నుంచి పోటీ చేస్తున్నారని, ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కొంత గందరగోళం చోటుచేసుకుందన్నారు. ర్యాలీలో గందరగోళంపై ఎండీ.జాఫర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిటిషనర్లపై కేసు నమోదైంది. 22న పిటిషనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ, పిటిషన్లో వాదనలను ముగించారు. -
30న హైకోర్టుకు సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ శనివారం రిజిస్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ సర్విసెస్ కమిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. ఈ సెలవు నేపథ్యంలో డిసెంబర్ 16 (శనివారం)ను పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు 3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) చెల్లించాలంటూ 2022, ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నోటీసులను కొట్టివేసింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు.. అలాగే ఏపీ ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని ఆశ్రయించే స్వే చ్ఛను ఇరు పక్షాలకు ఇస్తున్నామంది. తెలంగాణ వాదన కూడా వినకుండా కేంద్రం నోటీసులు జారీచేయడాన్ని తప్పుబట్టింది. వివాదం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జెన్కో/ట్రాన్స్‌కో/డిస్కమ్‌లు 2000 నుంచి 2013 వరకు పలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు కొనసాగాయి. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేశాయి. దీనికైన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి. ఈ వివాదం కేంద్రం వద్దకు చేరడంతో రూ.6,756.92 కోట్ల బకాయిలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు విభజన చట్టం సెక్షన్ 92 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు, తెలంగాణ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే ఆర్బీఐలోనే తమ రాష్ట్ర ఖాతా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం రెండు వారాల క్రితం తీర్పును రిజర్వు చేసి.. గురువారం తుది ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం వైఖరి సమంజసం కాదు: తెలంగాణ తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై ముందుగా చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 92 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో డిస్కంలు: ఏపీ తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్నారు. విభజన తర్వాత విద్యుదుత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికీ.. పునర్వ్యవస్థీకరణ చట్టానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేంద్రం ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు ఏపీ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తూనే ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించపోవడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, దీంతో తెలంగాణకు విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కేంద్రం నోటీసులు జారీ చేసిందన్నారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని పేర్కొన్నారు. కేంద్రానికి అధికారం ఉంది: ఏఎస్జీ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సుందరేశన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు హాజరై ఒప్పుకున్న తర్వాతే బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీచేసే అధికారం కేంద్రానికి ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఉత్తర్వులను కొట్టివేసింది. -
కోర్టు తీర్పుపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వారి వల్లే అంటూ..
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల ప్రకారం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది కూడా చదవండి: ఎన్నికల తేదీలు వచ్చాయో లేదో.. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి -
సింగరేణి ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గత నెల 27న మీటింగ్‌కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని కేంద్రం పిటిషన్లో పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్రం వెల్లడించింది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్లో కోరింది. ఇక, సింగరేణి అప్పీల్‌తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్‌పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్ బెంచ్‌ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే? -
విద్యుత్ బకాయిల చెల్లింపుపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ ఏపీ.. దీనిపై ఇప్పటికే ఇచ్చిన స్టేను పొడించాలంటూ తెలంగాణ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. హైకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తమకు తెలంగాణ నుంచి రూ.6,756.92 కోట్లు (అసలు రూ.3,441.78 కోట్లు, వడ్డీ, సర్‌చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) రావాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఏపీకి 30 రోజుల్లోగా రూ.6,756.92 కోట్లు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బకాయిల విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తేవొద్దని స్టే ఇచ్చింది. ఈ వ్యవహారం ఇలా కోర్టులో ఉండగానే.. విద్యుత్ బకాయిలు తప్పకుండా చెల్లించాలని ఆదేశించినా తెలంగాణ ఇవ్వడం లేదని.. అందువల్ల రిజర్వు బ్యాంకులోని తెలంగాణ ఖాతా నుంచి సొమ్మును మినహాయించుకుని ఏపీకి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. దీనితో కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, చెల్లింపులపై స్టేను పొడిగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులోని ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. బకాయిల వల్ల ఇబ్బందుల్లో ఏపీ డిస్కమ్‌లు తెలంగాణ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ విద్యుత్ డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చిందని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పునర్విభజన తర్వాత విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఈ బకాయిలకు, పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు కూడా ఏపీ డిస్కమ్‌లు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాయన్నారు. బకాయిలు చెల్లించక బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని గుర్తు చేశారు. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని, బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు రిజర్వు చేసింది. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్ రియాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? -
పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్: కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కిషన్‌రెడ్డి ఫైరయ్యారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారు. మొదటి సారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయ్యి, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నిన్న హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ రద్దు చేసింది. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారింది. కేసీఆర్ సర్కార్ తీరు వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరీక్షలు నిర్వహించలేదని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని ఘాటు విమర్శలు చేశారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు! -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది. -
గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ దంపతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై బుధవారం కోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ఈ క్రమంలోనే టీచర్ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను కోర్టు తప్పుపట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్ అభినందన -
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మరోసారి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
గద్వాల ఎమ్మెల్యే DK అరుణ.! హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో శాసనసభ్యుడి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబర్ 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. మరో రూ.50,000ను పిటిషనర్‌కు పరిహారంగా చెల్లించాలని సూచించింది. డీకే అరుణ పిటిషన్‌తో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యరి్థగా డీకే అరుణ పోటీ చేశారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని.. ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తరఫున న్యాయవాది యోగితా ప్రకాశ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. భూములు, ఖాతాల వివరాలు చెప్పలేదని.. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య పేరుతో ఉన్న వాహనాలకు ట్రాఫిక్ చలానాలు ఉన్నా చెల్లించలేదని, ఈ వివరాలను అఫిడవిట్లో పేర్కొన లేదని కోర్టుకు వివరించారు. గద్వాల ఎస్బీఐ, ఏడీబీ బ్యాంకుల్లో కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన భార్య జ్యోతికి ఉన్న ఖాతాల వివరాలను చెప్పలేదన్నారు. సిబిల్ వివరాల ప్రకారం ఎమ్మెల్యే బ్యాంకులకు రూ.1,09,67,737 రుణాలు బకాయిలు ఉన్నా వెల్లడించలేదని, అలాగే జాతీయ బ్యాంకుల్లో మరో రూ.1.22 కోట్ల రుణాలున్నా పేర్కొనలేదని వివరించారు. అదే విధంగా పుద్దూరులో వారికి ఉన్న 24 ఎకరాల భూమిని అఫిడవిట్లో చూపలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా స్పందించలేదు. దీంతో న్యాయమూర్తి తీర్పును జూన్ 22న తీర్పును రిజర్వు చేసి గురువారం వెల్లడించారు. అయితే ఈ కేసులో కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్ వచ్చారని, ఈ మేరకు అప్లికేషన్ దాఖలు చేశారని రిజిస్ట్రీ హైకోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జూన్ 22నే తీర్పు రిజర్వు చేశామని, ఈ నేపథ్యంలో మధ్యంతర అప్లికేషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు వెలువరించిందన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాలుగు అభియోగాలతో కోర్టుకు వెళ్లారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, కొందరికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేక దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను గత ఎన్నికల్లో 37వేల మెజారీ్టతో గెలిచానని, ఈసారి 50వేల మెజారీ్టతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరిగింది: డీకే అరుణ తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులకు ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు వంటిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఈ తీర్పు మూడేళ్ల ముందే రావాల్సిందని.. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పును గద్వాల ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే దానికి ఇది సంకేతమని పేర్కొన్నారు. -
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
మెడికల్ సీట్ల కేటాయింపుపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 54 మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు, ఫలితాల ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మెడికల్ కాలేజీల్లోని కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. ఈ మేరకు జూలై 3న జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకు ముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్‌గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. పాత కాలేజీల్లో సీట్లు వస్తే సమస్యే లేదు.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను 10 ఏళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.’అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లను 15 శాతం కోటా కింద చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సర్దుబాటు చేయాలని వర్సిటీని ఆదేశించింది. సవరణ తర్వాత సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు పాత 20 మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలిగితే సమస్య ఉండదని.. లేని పక్షంలో వర్సిటీ సమరి్పంచే నివేదికను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ, విచారణ వాయిదా వేసింది. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకో వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గత నెల వరదలపై అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 22వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని స్పష్టం చేసింది. అయితే, ఇటీవలి వరద కారణంగా మోరంచపల్లెలో మృతి చెందిన మహాలక్ష్మి, సంజీవయ్య పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చలేదని పిటిషనర్ పేర్కొనగా, ఈ ఇద్దరు కూడా వరద కారణంగానే మృతి చెందితే, వారి వివరాలనూ అఫిడవిట్లో వెల్లడించాలని చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)లో న్యాయ వాది చిక్కుడు ప్రభాకర్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గరువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నెల 18 నుంచి 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని చిక్కుడు ప్రభాకర్ కోరారు. ఇది కూడా చదవండి: రైతు బంధు పక్కదారి! -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
ఆ కోర్సుల్లో క్రీడా కోటా ఎందుకు తొలగించారు: హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్..లాంటి వైద్య విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్ ఎందుకు తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, వైద్య, విద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తూ ప్రభుత్వం.. జూలై 4న జీవో 75ను జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన జి.హరికృష్ణతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ -
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వీఆర్ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చింది. ఇక, వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు జీవోను సస్పెండ్ చేసింది. జీవోలకు ముందు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే వీఆర్ఏల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: బుద్వేల్ భూముల వేలం.. తొలి సెషన్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్లాట్స్ -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అధికారిక వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను జూన్ 11న 2,33,248గా, తర్వాత 2,33,506గా పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అభ్యర్థుల సంఖ్య అలా ఎలా పెరిగిందని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంతకాల్లో భారీగా మార్పు ఉన్నా ఇన్విజిలేటర్ ఎందుకు అభ్యంతరం తెలుపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి ప్రశ్నపత్నం లీకై మరలా పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి తీర్పు రిజర్వు చేశారు. తప్పిదాలు పట్టించుకోలేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన టీఎస్పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్లు అయ్యింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్‌ను మ్యానిప్యులేట్ చేసేందుకు ఇది అవకాశం ఇస్తుందని పిటిషనర్లు వినతిపత్రం ఇచ్చినా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్నారు. పైగా అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్–1 విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కీలకమైన గ్రూప్–1 పరీక్షలో వేలిముద్రలు తీసుకోని టీఎస్పీఎస్సీ..గ్రూప్–4 పరీక్షకు మాత్రం వేలిముద్రలు తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి..’అని కోరారు. పకడ్బందీగా ప్రిలిమ్స్: ఏజీ టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాల్ టికెట్లను సరిపోల్చి చూశారు. ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ప్రిలిమ్స్‌ను కమిషన్ సమర్థవంతంగా నిర్వహించింది. ఓ అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లి అయిన తర్వాత పెళ్లికి ముందు ఉన్న ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది. ఈ ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు..’అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని, టీఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు, మెయిన్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
వనమాకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వనమా వెంకటేశ్వరావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై వనమా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా.. కోర్టును కోరారు. దీంతో, వనమా పిటిషన్‌కు హైకోర్టు కొట్టివేసింది. వనమా పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
‘కొత్తగూడెం’ తీర్పుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది. వివరాల ప్రకారం.. తమ కుమారుడికి నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ‘పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇదే చెబుతోంది. నో క్యాస్ట్.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్ -
సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: భూమి కేటాయింపు విషయంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండానే కేటాయించారా అని ప్రశ్నించింది. కేటాయింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. అయితే, బీఆర్ఎస్కు 11 ఎకరాల భూమి కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎకరం దాదాపు రూ.50 కోట్ల మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం రూ.3,41,25,000కే ప్రభుత్వం ముట్టజెప్పిందని.. అలా 11 ఎకరాలకు గానూ దాదాపు రూ.500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోకాపేట్‌లోని 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై కేబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ కాపీని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత విలువైన ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూమి కేటాయించి.. నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఆ వివరాలను ఉంచలేదని సత్యంరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి గుడ్‌న్యూస్ -
గ్రూప్–1 పరీక్షపై ఎందుకు నిర్లక్ష్యం?: హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసింది. ఈ నెల 11న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడెందుకు చర్యలు చేపట్టలేదు.. టీఎస్పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు. పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది. ఇది కూడా చదవండి: అన్ని కోర్టుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తారేమో! -
TSPSC : గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: TSPSC నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 11వ తేదీన గ్రూప్-1 పరీక్ష జరుగనుంది. అయితే, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్‌కు కారణమైన సిబ్బందితోనే పరీక్ష నిర్వహిస్తున్నారని వాదనలు వినిపించారు. అలాగే, పేపర్ లీకేజీపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఏ కమిషన్‌లో అయితే పేపర్ లీక్ అయిందో అదే కమిషన్ ఇప్పుడు గ్రూప్-1 నిర్వహిస్తోందని వాదించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ లేదా యూపీఎస్సీతో పరీక్షలు నిర్వహించాలని, 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రూప్-1 పరీక్ష ఇదని, పారదర్శకత లేకపోతే అభ్యర్థులు నష్టపోతారని తెలిపారు. TSPSC తలపెట్టిన మిగతా పేపర్లు కూడా లీక్ అయ్యాయని, ఆ పరీక్షలను ఇంకా నిర్వహించలేదు. కానీ, వెంటనే గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నారని హైకోర్టుకు వివరించారు. విచారణ పూర్తి కాకుండా పరీక్షను నిర్వహించకూడదని, దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు.. కొన్ని ప్రశ్నలు అడిగింది. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు కదా?, ఇదే సమయంలో పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా అని హైకోర్ట్ ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. "కమిషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. దర్యాప్తుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ముగ్గురిని నియమించి కేసు మానిటర్ చేస్తోంది. కమిషన్‌లో కొత్త సిబ్బందిని నియమించారు. 3.8 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. 995 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న 6 నెలలో కమిషన్ నుండి 26 పరీక్షలు నిర్వహించబోతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం బయటకు రాగానే కమిషన్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదు" అంటూ వాదించారు. ఇక, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 11న జరగనున్న పరీక్షకు 3 లక్షల 80 వేల 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షకు పగడ్బందిగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోకి అనుమతిస్తారు. అభ్యర్థి గుర్తింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన -
అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ..
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్పీఎల్)లో వందల కోట్ల రూపాయల చందాదారుల సొమ్మును ఇతర మార్గాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజా కిరణ్ ఎలాంటి అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఆమె తిరిగి రావడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదని తెలిపింది. తనపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రాన్ని, ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ శైలజా కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీపీ లలితా గాయత్రి వాదనలు వినిపిస్తూ.. వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి అక్రమ మార్గాలకు మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారన్నారు. విచారణకు హాజరు కావాలని అంతకు ముందు మూడుసార్లు ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసినా.. హాజరుకాలేదని వెల్లడించారు. ఏపీలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని, ఈ పిటిషన్‌పై విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని చెప్పారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని, ఆదేశాలు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. శైలజపై ఎల్ఓసీ జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అనురాగ్ చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పు వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, లుక్ అవుట్ సర్క్యులరే జారీ చేయనప్పుడు పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశం అయ్యింది. ఇది కూడా చదవండి: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు.. -
చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. బిగ్ జోక్ అంటూ..
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫుల్ ఫైరయ్యారు. చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదని గుర్తు చేశారు. కాగా, మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు. వాలంటీర్ వ్యవస్థతో లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడిపై ఇష్టానుసారం మాట్లాడి.. ఇప్పుడు అమ్మకు వందనం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పథకాలు ఎందుకు అమలు చేయలేదు?. రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్. బాబు వస్తే జాబ్ అంటూ గతంలో మోసం చేశావు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మరిచిపోలేదు. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు సీఎం జగన్ అండగా నిలిచారు. రైతులను చంద్రబాబు ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు. 3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేయగలిగినవే చెప్పారు.. చేసి చూపించారు. చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారు. వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జీ చెప్పారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారు. హైకోర్టు జడ్డీ చేసిన వ్యాఖ్యలు అందరూ గమనించాలి. తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని జడ్జి చెప్పారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ‘ఏబీఎన్, మహా టీవీ వీడియోలను కోర్డుకు ఇవ్వండి’ -
ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముడుపులు అందాయంటూ ఓ వర్గం టీవీ ఛానెల్స్‌లో జరిగిన డిబేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీఎన్(తెలుగు), మహా టీవీ ఛానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి ఆ ఆర్డర్‌కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. కాగా, ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఒకరు.. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మీడియాలో కొందరు వ్యక్తులతో చర్చలు పెట్టారు. ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. మొత్తం న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ఒకస్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని అనకున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలు, ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని కాపాడుతానని చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుని విచారణ కొనసాగించా. సస్పెండై, అరెస్టయిన ఒక మెజిస్ట్రేట్ ఏకంగా.. న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయని వ్యాఖ్యానించారు. గౌరవమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి చెయ్యండ్రా అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్, మహాటీవీ చర్చల్లో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది’’ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీలో.. తొలి రెండు పేజీల్లో జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్న వ్యాఖ్యల సారాంశం. ‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయ’’ని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు -
అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. అవినాష్ తరపున సీనియర్ కౌన్సిల్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదనలను రేపు విననుంది. వైఎస్ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: అవినాష్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! -
విచారణలో థర్డ్ డిగ్రీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీ కేసు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న నిందితుడి అనుమానాస్పద మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. సెల్‌ఫోన్ చోరీ కేసు విచారణ నిమిత్తం తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ చిరంజీవి అనుమానాస్పద మృతి ఘటన గురించి పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘పోలీసు డిపార్ట్మెంట్లోని కింది స్థాయి అధికారులకు సున్నితత్వంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. విచారణలో థర్డ్ డిగ్రీ అవసరం లేదు. థర్డ్ డిగ్రీ కారణంగానే వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని రికార్డులోకి తీసుకురావాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆటోడ్రైవర్‌పై దాదాపు 6 కేసులు ఉన్నాయని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ క్రమంలో సీజే కల్పించుకుని.. ‘ఇది అసంబద్ధం. సదరు వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరణించాడు. ఎలా అయినా ఇది ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పారు. వాదనలు విని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. చిరంజీవి భార్యతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ పిల్‌కు అటాచ్ చేసి కలిపి విచారణ చేస్తామన్నారు. -
ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్ పగలగొట్టాలని జిల్లా కలెక్టర్‌కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశ పూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్స్మిత్ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది. అంతకు ముందు, ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేపోయారు. -
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌లోని కీలక అంశాలు ఇవే.. ‘నాకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 161 సీఆర్సీసీ కింద సీబీఐ అధికారులు నా స్టేట్మెంట్ రికార్డు చేశారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్‌తో కుమ్మకయ్యారు. ఈ కేసులో కుట్ర పన్ని నన్ను ఇరికిస్తున్నారు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుంది. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఈ కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు నేను నిందితుడిగా లేను. 2021 సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా తన రెండో భార్యతో ఆర్థికంగా పాలుపంచుకుంటున్నాడని సునీత కక్ష గట్టింది. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని నన్ను, నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారు. సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయి. వివేకా రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్చేశారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారు. వివేకా హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’ అని పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు.. హైకోర్టులో కేంద్రం పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది. అయితే, కేంద్ర ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
ధర్మపురి: స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదంపై తెలంగాణలో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించింది. ఈ సందర్బంగా తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. 2018లో లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. కాగా, కొప్పుల విజయంపై లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్టు ఆరోపించారు. దీంతో, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. -
బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదన్న ఏజీ.. హైకోర్టు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీక్ కేసు బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ సంజయ్ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్(ఏజీ) కోరారు. ఇక, విచారణకు బండి సంజయ్ సహకరించట్లేదని ఏజీ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ తన ఫోన్‌ను అప్పగించలేదని ఏజీ తెలిపారు. దీంతో, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ సంచలన నిర్ణయం -
స్వప్నలోక్ ప్రమాదం: నేడు హైకోర్టులో విచారణ.. సీఎస్ ఏం చెబుతారు?
సాక్షి, సికింద్రాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి ఊపిరాడక ఆరుగురు మృతిచెందారు. కాగా, ఈ ఘటనపై నేడు(సోమవారం) తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీలతో పాటుగా 12 మందిని చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని వారిని కొరింది. అయితే, మార్చి 16వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్ లెక్చరర్(జేఎల్) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. -
మార్గదర్శికి తెలంగాణ హైకోర్టు ఝలక్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఉంది కదా..? మరి ఇక్కడెందుకీ పిటిషన్ దాఖలు చేశారు..?’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కేసులు ఏపీలో నమోదయ్యాయి.. విచారణ అధికారులూ ఏపీ వారే.. బ్రాంచ్‌లు ఉన్నది కూడా అక్కడే.. అలాంటప్పుడు ఈ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు ఉందా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై తేలకుండా దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఏదేమైనా విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా పరిధిపై నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మార్గదర్శిపై ఏపీలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా అరెస్టు సహా బలవంతపు చర్యలు చేపట్టకుండా, హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, చెరుకూరి రామోజీరావు, శైలజ తరపున లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి, మార్గదర్శి తరఫున న్యాయవాది దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. అక్కడి కేసులపై.. ఇక్కడ విచారణా? ‘409, 477(ఏ), 420 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ 10 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసులే. కాగ్నిజబుల్ నేరాల కిందికే వస్తాయి. ఏపీలో నమోదైన కేసులపై ఇక్కడ ఉపశమనం కోరలేరు. ఈ కోర్టుకు అక్కడి కేసులపై విచారణ జరిపే పరిధి లేదు. గతంలో పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణలోని మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే అప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను, రిజిస్టర్లను పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కేసులు నమోదు చేశారు. అక్రమాలు నిగ్గు తేలినప్పటికీ కేసులు నమోదు చేయవద్దని, ఎఫ్ఐఆర్ దాఖలు చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో ఆదేశించలేదు. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. మొత్తం బ్రాంచ్‌లకు వారే బాధ్యులు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి అక్రమంగా మళ్లిస్తున్నారు. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారు. ఒకటి రెండు అంశాల్లో మినహా ఏపీ హైకోర్టు పరిధిలోని విషయాలపై తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఏపీకి హైకోర్టు ఏర్పాటైన తర్వాత తెలంగాణ హైకోర్టుకు అక్కడి అంశాలపై పరిధి ఉండదని చట్టం చెబుతోంది. ఒక్క డెట్ రిలీఫ్ ట్రిబ్యునల్(డీఆర్టీ)కి సంబంధించి డీఆర్టీ–2 రాయలసీమ పరిధి వరకు జోక్యం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. కేసులు నమోదు చేసిన నేరాలన్నీ ఏపీలోనే జరిగాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులూ అక్కడి వారే. అలాంటప్పుడు అరెస్టులు చేయవద్దని ఇక్కడ కోరడం చట్ట విరుద్ధం. అసలు అలా పిటిషనే వేయలేరు. హైకోర్టుల పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొంది. ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని ఇదే హైకోర్టు పలు తీర్పులను ఇచ్చింది. నిందితులు ఏ రాష్ట్రంలో ఉన్నా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అది వారికున్న చట్టబద్ధమైన అధికారం. ఏపీలో హత్య చేసి వచ్చి తెలంగాణలో దాక్కుని అరెస్టు చేయవద్దని ఇక్కడి కోర్టును కోరడం ఎలా చట్టవిరుద్ధమో.. ఇదీ అంతే’ అని గోవిందరెడ్డి నివేదించారు. ‘‘పోలీసులు హైదరాబాద్ వస్తున్నారా?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమికంగా నేరం జరిగింది.. అక్రమాలు జరిగాయని నిరూపణ అయితే అరెస్టు చేయవచ్చని గోవిందరెడ్డి నివేదించారు. ఇదో భారీ వైట్ కాలర్ నేరమన్నారు. ముందుగా ‘పరిధి’ తేలుద్దాం.. ‘ఖాతాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినా తనిఖీలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ పేర్లు చేర్చారు. మార్గదర్శి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణలో నివసించడం, తెలంగాణలోని బ్రాంచ్‌ల్లోనూ తనిఖీలు చేసే అవకాశం ఉన్నందున ఈ హైకోర్టులో పిటిషన్ వేశాం. ఏపీలో పలు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తనిఖీలపై స్టే విధిస్తూ ఇదే కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు తనిఖీలు చేపడితే అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది’ అని మార్గదర్శి తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మిగతా అంశాల జోలికి ఇప్పుడు వెళ్లకుండా అసలు ఈ కోర్టుకు పరిధి ఉందా? లేదా? అన్న విషయాన్ని ముందుగా తేలుద్దామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపించారు. తెలంగాణ డీజీపీని ప్రతివాదిగా చేర్చారని, అసలు ఈ పిటిషన్ విచారణార్హం కాదన్నారు. వచ్చే సోమవారం వరకు పిటిషనర్లపై అరెస్టులు లాంటి చర్యలు తీసుకోబోమని గోవిందరెడ్డి తెలియచేయడంతో న్యాయ మూర్తి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. -
రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ఆయన కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. వివేకా, సునీత మధ్య మనస్పర్థలు ‘2010లో షేక్ షమీమ్‌ను వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. షమీమ్‌ను సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, బావ ఎన్.శివప్రకాశ్‌రెడ్డి శత్రువుగా చూసేవారు. సునీత, రాజశేఖరరెడ్డితో పాటు వివేకా పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. వారు వివేకానందరెడ్డి చెక్ పవర్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకా మొదటి భార్య, కూతురు హైదరాబాద్‌లో ఉండగా, ఆయన మాత్రం పులివెందులలోనే ఎక్కువ రోజులు గడిపేవారు. ఒక దశలో ఆయన వారసుడిగా షమీమ్ కుమారుడినే ప్రకటిస్తారని, ఆ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు వచ్చాయి. హత్య అనంతరం నిందితుల (ఏ1 నుంచి ఏ4) ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే.. సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వదలించుకునే పథకం వేసినట్లు అర్థమవుతుంది. వివేకా మరణానంతరం సునీత, ఆమె కుటుంబీకులు బెదిరించినట్లు షమీమ్ దర్యాప్తు అధికారులకు కూడా చెప్పారు. తన కుమారుడి పేరుమీద రూ.2 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని వివేకా చెప్పినట్లు వెల్లడించారు’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. బీటెక్ రవి, చంద్రబాబు ప్రభావంతోనే.. ‘వివేకా హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని కలిశారు. రవి ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు జరిపారు. హత్య జరిగిన సంవత్సరం వరకు సునీత నాపై ఆరోపణలు చేయలేదు. పైగా, ప్రెస్‌మీట్ పెట్టి నా విజయం కోసం వివేకా చాలా శ్రమించారని, జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభావానికి లోనైన తర్వాతే నాపై ఆరోపణలు చేశారు’ అని తెలిపారు. వారికి నచ్చినట్లు దర్యాప్తు ‘దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ లొకేషన్ అనే పేరుతో సీబీఐ నన్ను వేధిస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖపై దర్యాప్తు చేయటంలేదు. దర్యాప్తు అధికారి తప్పుడు ప్రచారానికి ప్రభావితమై ఆ కోణంలోనే, పక్షపాతంతో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చి వారికి అవసరమైనట్లుగా మీడియాకు లీకులిస్తున్నారు. నోటీసుల దశలో దర్యాప్తు సాగుతుండగా చార్జిషీట్లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. అందువల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా దర్యాప్తు అధికారులను ఆదేశించాలి’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో కోరారు. -
ఎమ్మెల్యేల కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ జరుగనుంది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఇక, ఈ కేసు విషయమై పిటిషన్లో భాగంగా హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు.. సీఎం కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను పెన్ డ్రైవ్‌లో అన్ని రాష్ట్రాలకు, జడ్జీలకు పంపించారు. కాగా, ప్రాథమిక సాక్ష్యాధారాలు లీక్ కావడంతో హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అయితే, ప్రభుత్వం మాత్రం.. బీజేపీ నేతలే నిందితులుగా ఉన్న కేసును కేంద్ర సంస్థ సీబీఐకి అప్పగించడం వల్ల అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతోంది. ఈ కేసుపై మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ.. కెమెరాల సాక్షిగా బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. -
ఎమ్మెల్యేల కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ.. సర్కార్ ప్లాన్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్నాయి. చివరకు ఈ కేసును హైకోర్టు.. సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రభుత్వం తమకు సహకరించకపోతే ఏం చేయాలో ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం కేసు వివరాలు ఇవ్వకపోతే సీబీఐ ఇలా చేసే అవకాశం ఉంది. 91 సీఆర్పీసీ కింద ప్రభుత్వానికి సీబీఐ నోటీసులు ఇవ్వనుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 93 ప్రకారం.. కోర్టు వారెంట్ ద్వారా సీబీఐ డాక్యుమెంట్లను సీజ్ చేయనుంది. లేదంటే హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ మరోసారి లేఖ రాయనుంది. కాగా, ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. అయితే, ఈ లేఖల్లో మొయినాబాద్ ఎఫ్ఐఆర్కు సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు తమకు సమర్పించాలని సీబీఐ కోరింది. కాగా, ఈ లేఖపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదిలా ఉండగా.. ఈ కేసు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. -
ఎమ్మెల్యేల కేసు: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నేడు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, ఈ కేసును సీబీఐకి ఇస్తుందా? లేక తీర్పును వెల్లడిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఇప్పటికే ఈ కేసును సీబీఐతో విచారించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేసు తీర్పుపై సస్పెన్స్ నెలకొంది. ఇక, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. -
ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?: బీజేపీ లక్ష్మణ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వేడుకల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. ఇక, ఈ క్రమంలో బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు. రిపబ్లిక్ డే వేడుకలను అవమానిస్తున్నారు. కరోనా ఉందని సాకులు చెప్పడం హాస్యాస్పదం. పరేడ్‌తో గణతంత్ర దినోత్సవం చేయాలని హైకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నాము. మీ పార్టీ సభలకి లేని కోడ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం పెట్టడం దారుణం. దేశం గర్వించదగ్గ వేడుకకి ఇలాంటి రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడాలంటే కష్టం. వేడుకలు రాజ్ భవన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ఎప్పుడు జరిగింది?. నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు?. ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కడేనా?. కేసీఆర్ ప్రభుత్వం పతనమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. 11,000 గ్రామాల కూడళ్లలో సమావేశాలు పెట్టి కేసీఆర్ మోసాలు ప్రజల వద్ద ఎండగడుతాము. రానున్న రోజుల్లో ప్రతీ నెలకు ఒకసారి తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వస్తూనే ఉంటారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది అని కామెంట్స్ చేశారు.