
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగబోయే గణతంత్ర వేడుకల నిర్వహణపై హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలు కచ్చితంగా జరపాల్సిందేనని స్పష్టం చేసింది.
కాగా, రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక, విచారణ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరపాలని ఆదేశించింది. ఎక్కడ పరేడ్ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించింది. అలాగే, వేడుకలపై కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. రేపు(గురువారం) జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాటు త్వరగా చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment