సాక్షి, హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కింది కోర్టులతో పాటు ట్రిబ్యునల్స్, న్యాయసేవా సాధికార సంస్థ, మీడియేషన్ సెంటర్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 5వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కేసులను ఆన్‌లైన్ ద్వారా విచారించాలని, కోవిడ్ నిబంధనలు అనుసరించి కేసులను ఆన్‌లైన్ ఫైలింగ్‌తో పాటు నేరుగా ఫైల్ చేసుకునే విధానాన్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్టులను తెరవాలనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, బార్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. అలాగే కోర్టు ఆవరణను తరచుగా శానిటైజ్ చేయడంతో పాటు ఫాగింగ్ చేయాలని పేర్కొంది. భౌతిక దూరం పాటించడం, కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, ఇతర శానిటరీ సిబ్బందికి మాస్కులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించింది. శిక్షణలో ఉన్న న్యాయాధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment