
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు, ట్రిబ్యునల్స్‌కు ఆగస్టు 17 తేదీ వరకు హైకోర్టు లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అంతేగాక పిటిషన్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కొంది.