తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయింది. మరోవైపు లాక్‌డౌన్ సడలింపు సమయంలో హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాలు పోటెత్తుతున్నాయి. కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రను మరోసారి భారీ వర్షం వణికించింది.
1/10
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో బీఆర్‌కే భవన్ ఇలా మెరిసింది.
2/10
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో చారిత్రక కట్టడం ఎంజే మార్కెట్ ఇలా కాంతులీనింది.
3/10
హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో అసెంబ్లీ భవనం.
4/10
కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలి. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలి. అనవసరంగా రోడ్ల మీదకు రావడం మానుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులు ఎంజే మార్కెట్ వద్ద రహదారిపై కరోనా చిత్రం వేసి అవగాహన కల్పించారు.
5/10
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి ఇళ్లకు వెళ్లేందుకు మరో గంటపాటు వెసులుబాటు కల్పించినా హైదరాబాద్‌లో వాహన రద్దీ తగ్గడం లేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అవగతమవుతోంది. మంగళవారం కూకట్‌పల్లిలో వాహనాలు ఇలా కిక్కిరిశాయి.
6/10
మహారాష్ట్రలోని కరాడ్ నగరంలో మంగళవారం భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో సామగ్రిని బయటకు తరలిస్తున్న యువకులు
7/10
ఢిల్లీలో రకాబ్‌గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఏర్పాటు చేసిన గురు తేగ్ బహదూర్ కోవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మణిపురి–యూదు సంతతి బాలుడితో లుడో ఆట ఆడుతున్న ఆరోగ్య కార్యకర్త.
8/10
సాధారణ రోజుల్లో వ్యాపారులు, కొనుగోలుదారులు, సందర్శకులతో కిటకిటలాడే చార్మినార్ పరిసరాలు లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారాయి. దీంతో చిన్నారులు ఇలా ఫుట్‌బాట్ ఆడుతూ కనిపించారు. ఇక్కడి వీధులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి.
9/10
అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజింగ్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ప్రదర్శనకు ఉంచిన విగ్రహాల మధ్యలో కూర్చున్న ఓ బాలుడు
10/10
జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ జూలో ఉన్న ఈ తాబేలు పేరు హెల్ముట్. 108 కిలోల బరువున్న ఈ తాబేలు ఆర్ఠరైటిస్‌తో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉంది. దీంతో హెల్ముట్ సులువుగా కదిలేందుకు వీలుగా జూ అధికారులు పొట్టభాగంలో ప్రత్యేకంగా ఇలా రోలింగ్ బోర్డును అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment