
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్దముర హరిపురంలోని గొరకల రామారావు తోటలో పనస చెట్టు విరగకాసింది. పనస కాయలు గుత్తులుగుత్తులుగా నేలను తాకి అబ్బుర పరుస్తున్నాయి. చెట్టు మొదట్లోనే దాదాపు 70 కాయలు ఉన్నాయి.
– వజ్రపుకొత్తూరు

ఈదురుగాలులు, అకాల వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో అకాల వర్షంతో నేల రాలిన మామిడి కాయలు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ కోవిడ్ ఆస్పత్రి వద్ద రోగుల కుటుంబీకులు, బంధువుల బాధలు వర్ణనాతీతం. అటెండెంట్లకు సౌకర్యాలు కల్పించకపోవడంతో చెట్ల కిందే పడిగాపులు కాస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో సండే సేమ్ సీన్ రిపీటయింది. నాజ్‌వెజ్ కోసం జనం మార్కెట్లకు పోటెత్తారు. భౌతిక దూరం మర్చిపోయి గుంపులు గుంపులుగా గుమిగూడారు. కొత్తపేట మార్కెట్‌లో రద్దీని ఫొటోలో చూడొచ్చు.

లాక్‌డౌన్ సమయం ముగిశాక రోడ్లపైకి వచ్చిన వాహనదారులను హైదరాబాద్ పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉంచి జరిమానాలు విధించారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న కల్వరి టెంపుల్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ కరోనా బాధితులకు ఉత్తమ వైద్యం, వసతి అందజేస్తోంది.

‘యాస్’పెను తుపానుగా మారి విధ్వంసం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో బెంగాల్ తీరంలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న తీరరక్షణ దళం సభ్యులు.

బ్రూనై, సింగపూర్ నుంచి వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లతో విశాఖపట్నం చేరిన ఐఎన్‌ఎస్ జలాశ్వ నౌక

అస్సాం రాష్ట్రం మోరిగాన్ జిల్లాలో చిన్నారికి కోవిడ్ పరీక్ష చేస్తున్న ఆరోగ్య కార్యకర్త

ఉత్తర ఇటలీలో ఆదివారం పైడిమాంట్ ప్రాంతలో మాగియోర్ సరస్సుపై విహరిస్తున్నకేబుల్ కార్ తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యం.
Comments
Please login to add a commentAdd a comment