fish market
-
లండన్‌లో వెయ్యేళ్ల మార్కెట్ల మూసివేత!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న రెండు మాంసం దుకాణ వాణిజ్య సముదాయాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. లండన్‌లో 11వ శతాబ్దంలో ఏర్పాటైన బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్ఫీల్డ్ మాంసం మార్కెట్ అతి త్వరలో మూతపడనున్నాయి. ఇన్నాళ్లూ హోల్‌సేల్ మార్కెట్లుగా శాసించిన ఈ రెండు వాణిజ్య సముదాయాలు ఇకపై పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఇక్కడి దుకాణాలను సమీపంలోని డాగెన్హామ్కు తరలించాలని మొదట్లో భావించారు. అయితే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ రెండు మార్కెట్లు ఇకపై ఎక్కడా తమ కార్యకలాపాలను కొనసాగించబోవు. ఇక్కడి దుకాణాల యజమానులకు తగు నష్టపరిహారం, వ్యాపార ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీంతో హోల్‌సేల్ దుకాణదారులు ఇకపై ఎవరికి వారు వేర్వేరుగా వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును త్వరలో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు లండన్ సిటీ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. బిల్లింగ్స్‌గేట్, స్మిత్ఫీల్డ్లోని వ్యాపారులు ఇప్పటికిప్పుడు ఆయా వాణిజ్య సముదాయాలను ఖాళీచేయాల్సిన పనిలేదు. 2028 సంవత్సరందాకా వారికి గడువు ఇచ్చారు. ఆలోపు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకోవాల్సి ఉంటుంది. పాత రోమన్ గోడకు అవతల నిర్మించిన స్మిత్‌ఫీల్డ్‌లో ఆ కాలంలో గుర్రాలు, గొర్రెలు, పశువుల అమ్మకానికి వినియోగించేవారు. తరువాత పూలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీతోపాటు చేపలు, మాంసం అమ్మకాలు మొదలయ్యాయి. వందల ఏళ్లుగా లండన్ నగర చరిత్రకు ఈ మార్కెట్లు సాక్షిగా నిలిచాయి. స్మిత్ఫీల్డ్ భవనాలు విక్టోరియన్ కాలం నాటివి. తర్వాత కొన్ని మార్పులు జరిగినా దాదాపు ఆకాలంనాటిలాగానే ఉన్నాయి. 1958లో ఒక పెద్ద అగ్నిప్రమాదానికి గురైనా చెక్కు చెదరలేదు. స్మిత్‌ఫీల్డ్‌లో వ్యాపారం రాత్రి పదింటికి మొదలై ఉదయం ఆరింటికల్లా ముగుస్తుంది. బిల్లింగ్స్‌గేట్ 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పసిద్ధి చెందింది. శిథిలావస్థకు చేరడంతో మార్కెట్‌ను 1982లో డాక్లాండ్స్కు మార్చారు. ఇప్పుడు బిల్లింగ్స్‌గేట్ స్థలంలో 4,000 కొత్త గృహాలను నిర్మించే ప్రతిపాదన ఉంది. స్మిత్ఫీల్డ్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఇక్కడే కొత్త లండన్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పూర్వం స్మిత్ఫీల్డ్ ప్రాంతం మద్యపానం, రౌడీలతో హింసకు చిరునామాగా ఉండేది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్ స్మిత్ఫీల్డ్ను అప్పట్లో ‘మురికి, బురద’కు కేంద్రస్థానంగా అభివర్ణించారు. ఆయన రాసిన ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ రచనల్లోనూ ఈ మార్కెట్ల ప్రస్తావన ఉంది. -
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
-
‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: పోషక విలువలతో కూడిన తాజా మత్స్య ఉత్పత్తుల విక్రయాలకు ‘ఫిష్ ఆంధ్ర’ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెస్తోంది. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఆక్వా హబ్‌లు, రిటైల్ అవుట్లెట్ల ద్వారా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. లైవ్ ఫిష్‌లే కాకుండా ఐస్‌లో భద్రపర్చిన వ్యాక్యూమ్ ప్యాక్డ్ ఫిష్‌లను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నారు. వంద ఆక్వాహబ్‌లు లక్ష్యం దాదాపు 48.13 లక్షల టన్నుల మత్స్య దిగుబడులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వీటి తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వంద ఆక్వా హబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తొలి విడతగా డిసెంబర్ నెలాఖరులోగా రూ.325.15 కోట్ల అంచనాతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పులివెందుల, పెనమలూరు ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాగా తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరులలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, తాడేపల్లిగూడెం, మంగళగిరి, గుంటూరులో ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మిగిలిన జిల్లాల్లో ప్రాథమిక దశలో ఉన్నాయి. వారానికి 50 వేల కిలోల విక్రయాలు హబ్‌ల పరిధిలో రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 10,427 మంది దరఖాస్తు చేయగా, 2724 మంది అర్హులను గుర్తించారు. ఇప్పటి వరకు 398 రిటైల్ అవుట్‌లెట్స్ గ్రౌండింగ్ చేయగా 355 అవుట్‌లెట్స్ ట్రయిల్‌రన్ ప్రారంభించాయి. మరోవైపు అందుబాటులో ఉన్న 81 ఫిష్‌మార్ట్ తరహా దుకాణాలను రిటైల్ అవుట్‌లెట్స్‌గా ఆధునికీకరిస్తున్నారు. పులివెందుల, విశాఖపట్నం, వినుకొండల్లో సూపర్ ఫార్మట్స్టోర్స్ (రూ.20 లక్షల యూనిట్) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రిటైల్ అవుట్లెట్ పరిధిలో 138 కిలోల చొప్పున వారానికి 50 వేల కిలోల మత్స్య విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి అవుట్‌లెట్‌లో పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పేటీఎం సంస్థతో ఆప్కాఫ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 2 వేల రిటైల్ షాపులకు పేటీఎం డివైజ్‌లు సరఫరా చేయనున్నారు. పీఓఎస్‌తో పాటు రూ.22 వేల విలువైన ఇతర సపోర్టింగ్ పరికరాలను రిటైల్ అవుట్‌లెట్స్‌కు సమకూర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2వేల రిటైల్ అవుట్‌లెట్స్‌లో పేటీఎం, ఇతర డిజిటల్ పరికరాలను ఆగస్టు నాలుగో వారం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కంటైనర్ తరహా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో 150, అర్బన్ ప్రాంతాల్లో 191 చోట్ల స్థలాలను గుర్తించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్ హబ్‌ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న రిటైల్ అవుట్‌లెట్స్, కియోస్క్‌లు, సూపర్ఫార్మెట్, వాల్యూ యాడెడ్ యూనిట్ల ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలను ఫిష్ ఆంధ్ర పేరిట బ్రాండింగ్ చేస్తున్నారు. హోర్డింగ్‌లు, పేపర్లలో ప్రకటనల కంటే ప్రజలు ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. వారికి మరింత చేరువయ్యేలా ఫిష్ ఆంధ్ర పేరిట యూట్యూబ్ చానల్‌తో పాటు గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రచారం చేయనున్నారు. ఆక్వా, మత్స్య ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ముందుకెళ్లనున్నారు. ఇందుకోసం కాల్ సెంటర్ ఏరా>్పటు యోచన కూడా ఉంది. వినియోగదారుల నుంచి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని వారు కోరుకునే తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. ఏపీ డిజిటల్ కంటెంట్ కార్పొరేషన్ సహకారం తీసుకుంటూ ఇతర మార్గాలను అందిపుచ్చుకొని ఫిష్ ఆంధ్రను ప్రమోట్ చేస్తారు. ప్రత్యేకంగా రూపొందించే యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఏర్పాటు కూడా చేస్తున్నారు. -
నిజామాబాద్‌లో హోల్‌సేల్ చేపల మార్కెట్!
సాక్షి,హైదరాబాద్: నిజామాబాద్‌లో అత్యాధునిక వసతులతో కూడిన హోల్‌సేల్ చేపల మార్కెట్‌ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు తమ సమస్యలపై మంత్రిని కలిశారు. వారి సమస్యలపై తలసాని సానుకూలంగా స్పందించారు. మత్స్యశాఖకు చెందిన స్థలంలో హోల్‌సేల్ చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, తర్వాత కమిటీ నివేదిక ప్రకారం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి తలసాని.. మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతోందని, అక్కడ చేపల మార్కెట్ నిర్మాణం జరిగితే పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాలలో ఆధునిక వసతులతో చేపల మార్కెట్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. -
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్‌పూర్.. ఇటీవల మాదాపూర్ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్ ఐరన్ (డీఐ), మైల్డ్‌స్టీల్ (ఎంఎస్) పైప్లైన్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పురాతన పైప్లైన్ల మార్పుతోనే పరిష్కారం.. ► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది. ► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కార్వాన్ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవీ కారణమే.. ► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది. ► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. ► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) జలమండలి మేనేజర్, వర్క్ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్‌లైన్ వర్క్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల) -
రామ్‌నగర్ చెపల మార్కెట్.. కరోనా అంటే లెక్కచేయని జనం
-
లైవ్ ఫిష్.. మత్స్య ప్రియులకు పండగే పండగ
సాక్షి, కల్లూరు(ఖమ్మం): చేపల కూరంటే ఇష్టపడని మనిషే ఉండరు. అలాంటిది తాజాగా, స్వచ్ఛమైన లైవ్ ఫిష్ సంవత్సరంలో 365 రోజులపాటు లభ్యమవ్వడంలో కల్లరు చేపల వర్కెట్ ప్రసిద్ధి. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ వద్ద ఒకటే సందడి. కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వర్కెట్‌కు రకరకాల చేపలు లైవ్ ఫిష్ రూపంలో దర్శనమిస్తుండడంతో మత్స్య ప్రియులకు పండగే పండగ. ఇక్కడ తాజా చేపల కోసం ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగడెం, పాల్వంచ, మధిర, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కల్లరు మండలంలో కల్లరు, లోకవరం, చండ్రుపట్ల, ముగ్గు వెంకటాపురం, చెన్నూరు, పాయపూర్, ఎర్రబోయినపల్లి, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, తాళ్లరు వెంకటాపురం తదితర గ్రావలలోని మత్స్య సహకారం సంఫలలో సువరు 1200 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కల్లరు మత్స్య సహకార సంఘంలోనే 230 మంది సభ్యులు ఉన్నారు. 1200 కుటుంబాలకు చేపల విక్రయాలే ఉపాధి. చేపల పెంపకం పై ప్రత్యేక దృష్టి నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఐబీ, పంచాయితీరాజ్ చెరువులలో సైతం సాగర్ నీటి సరఫరా జరుగుతుంది. దీంతో ఈ చెరువులలో చేపల పెంపకం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం కల్లూరు మండలంలో 17 ఇరిగేషన్ బ్రాంచ్ చెరువులు, 108 కుంటలు ఉన్నాయి. వీటిలో చేప పిల్లలు పోసి సాధారణ పద్దతిలో చేపలు పెంచుతున్నారు. అందువల్ల ఇక్కడ చేపలు తాజాగా ఉంటాయి. చేప పిల్లలు పోసిన 6 నెలల నుంచి ఏడాదిన్నర వరకు పెంచిన తర్వాత చేపలు పడతారు మత్స్యకారులు. కేవలం తౌడు, దాణా, సహజ ఎరువులు మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఆదివారం టన్నుకు పైగానే... కల్లరులో చేపల విక్రయానికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ రహదారి పక్కనే చెట్ల కింద సుమారు 10 షాపులలో విక్రయాలు కొనసాగిస్తారు. ఆదివారం రోజు కల్లరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన టన్నుకు పైగా చేపలను విక్రయిస్తారు. సాధారణ రోజులలో మాత్రం మూడు నుంచి ఐదు క్వింటాళ్ల లోపు విక్రయాలు జరుపుతారు. చెరువుల వద్ద ఐతే కేజీ చేప రూపాయలు 100 వరకు ఉంటుంది. మార్కెట్లో రూపాయలు 140 నుంచి రూ 150 వరకు విక్రయిస్తారు. 10 కేజీల చేపల వరకు ఇక్కడ దొరుకుతాయి. చేపలు శుభ్రపరిచే వారు ఇక్కడ 30 మంది వరకు ఉంటారు. వారు కేజీకి రూపాయలు. 20 చొప్పున తీసుకుంటారు. ఇలా చేపల విక్రయాల వల్ల సువరు 1200 కుటుంబాలు జీవనోపాధి పొందడం విశేషం. చేపలకు ఎక్కువ గిరాకీ మార్కెట్లో చేపల విక్రయాలు ఎక్కువగా జనవరి నెల నుంచి మే నెల వరకు గిరాకి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజుకు 30 నుంచి 50 కేజీల వరకు విక్రయిస్తాను. ఆదివారం వత్రం క్వింటాకు పైగానే చేపలు అమ్ముతాను. ఇక్కడ ఎక్కువగా శీలావతి, బొచ్చలు, గ్యాస్కట్, బంగారు తీగ, కొర్రమీను తదితర రకం చేపలు లభ్యమవుతాయి. – చింతకాయల నరసింహరావు, విక్రయదారుడు గిరాకీ ఉంటే రకం.1,000 కలిచేపలు శుభ్రపరిచే పని చేస్తాను. మార్కెట్లో ఆదివారం గిరాకి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ర. 1,000 కి పైగానే కలి గిట్టుబాటు అవుతుంది. సాధారణ రోజులలో మాత్రం రూ 300 నుంచి రూపాయలు. 400 వరకు మాత్రమే పడుతుంది. ఈ వృతి ద్వారానే మా జీవనోపాధి. సంవత్సర కాలం మాకు ఉపాధి దొరుకుతుంది. – కవ్వత్తుల సుజాత, కల్లూరు -
గోల్డెన్ ఫిష్ @ రూ.2.60 లక్షలు
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా పల్లిపాలెం చేపల మార్కెట్‌కు శనివారం 21 కేజీల బరువుగల కచిడి మగ చేప వచ్చింది. దీన్ని బంగారు చేపగా కూడా పిలుస్తారు. స్థానిక పాటదారుడు దీన్ని రూ.2.60 లక్షలకు చేజిక్కించుకున్నాడు. కచిడి రకం చేపల్లో ఆడ చేప కంటే మగ చేపకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తుంటారు. సర్జికల్ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్‌బ్లాడర్‌ను వాడుతుంటారు. -
Fish Prices: కొండెక్కిన చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుత సీజన్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం మృగశిర కార్తె సందర్భంగా ధర ఎంతైనా సరే కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఈ రోజు తప్పకుండా చేపలు తినాలనే నానుడితో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు పోటెత్తారు. దీంతో రాంనగర్, బేగంబజార్ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రాంనగర్ చేపల మార్కెట్లో జనం బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా తక్కువ సమయం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు అన్ని మార్కెట్లలో దాదాపు చేపలు అమ్ముడు పోయాయి. కొరమీను కిలో రూ.700 నుంచి రూ.800 ఆల్‌టైమ్ రికార్డు ధర పలికింది. మామూలు రోజుల్లో ఇదే చేప ధర రూ.400 నుంచి 550 వరకు ఉంటుంది. అలాగే.. రవ్వ, బొచ్చ చేపలు కిలోకు ఏకంగా రూ.150 నుంచి రూ. 250 ధర పలికాయి. కరోనా నిబంధనలు గాలికి.. ఎలాగైనా చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరిచారేగానీ.. కరోనా నిబంధనలు అసలు పట్టించుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో సమయం తక్కువగా ఉండటంతో జనం గుంపులు గుంపులుగా తరలివచ్చారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచనలను ప్రజలు బేఖాతరు చేశారు. -
Photo Feature: విరగకాసిన పనస చెట్టు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్దముర హరిపురంలోని గొరకల రామారావు తోటలో పనస చెట్టు విరగకాసింది. పనస కాయలు గుత్తులుగుత్తులుగా నేలను తాకి అబ్బుర పరుస్తున్నాయి. చెట్టు మొదట్లోనే దాదాపు 70 కాయలు ఉన్నాయి. – వజ్రపుకొత్తూరు -
జనం తో కిక్కిరిసిన హైదరాబాద్ చేపలు మార్కెట్లు
-
కరోనా కట్టడికి చర్యలు చేపట్టిన విజయవాడ నగర పాలక సంస్థ
-
Photo Feature: కరోనా కాలం.. జర పైలం
ఇది ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్. ఆదివారం ఇలా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం మాటే మరిచారనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. ఆదివారం బయోడైవర్సిటీ చౌరస్తా ఇలా బోసిపోయి కనిపించింది. -
బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ కరోనా గుబులు మొదలైంది. మూడు రోజుల్లో 46 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా కేసులు ప్రబలుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నగరంలోని ఆరు మార్కెట్లను శనివారం మూసివేశారు. ఓ మార్కెట్లో సాల్మన్ చేపలను కోసే చెక్కమీద కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో నగరంలో పలుచోట్ల చేపల విక్రయాలను నిలిపివేశారు. బీజింగ్‌లో తాజాగా 46 మందికి కరోనా సోకిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 46 మంది స్థానిక మార్కెట్‌కి వెళ్లారని, వీరిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. రెండు నెలలుగా సురక్షితంగా ఉన్న బీజింగ్‌లో కొత్తగా కోవిడ్ కేసులు బయటపడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్‌కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాలను లాక్డౌన్ చేశారు. మూడు పాఠశాలలు, కిండర్గార్టెన్లలో తరగతులను రద్దు చేశారు. మే 30 వ తేదీ నుంచి ఈ మార్కెట్‌ని సందర్శించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం బీజింగ్‌లోని 98 న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ కేంద్రాల్లో రోజుకి 90,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి గువా షియాజన్ చెప్పారు. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిని క్వారంటైన్లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 74 మందితో సహా చైనాలో ఇప్పటి వరకు 83,075 మందికి కరోనా సోకింది. -
చేపల మార్కెట్లో రివాల్వర్‌తో బెదిరింపు..
-
అక్రమంగా పన్ను వసూలు చేస్తే.. కఠిన చర్యలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరం చేపల మార్కెట్, పాత బస్టాండ్లను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇరిగేషన్ సైట్లో ఉన్న గంగాలమ్మ చేపల మార్కెట్ వ్యాపారుల వద్ద టీడీపీ నాయకులు అన్యాయంగా పన్నులు వసూలు చేస్తున్నారనే విషయంపై భీమవరం ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్రమంగా పన్ను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ప్రైవేటు బస్సులకు అడ్డాగా మారిన పాత బస్టాండ్‌లోని బస్సులను తొలగించి, మళ్లీ ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను సూచించారు. -
వేసవి శాపం
ఆక్వా హబ్‌గా పేరుగాంచిన భీమవరం పరిసరాల్లో చేపలసాగు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండవేడిమికి చేపలు మృత్యువాతపడుతున్నాయి. దీంతో చెరువులలో చేపను రక్షించేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. ఇంజిన్ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతున్నారు. కొన్నిచోట్ల ఆక్సిజన్ టాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను బతికించుకునేందుకు రాత్రింబవళ్లు చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పశ్చిమగోదావరి, భీమవరం అర్బన్: జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు 80 వేల హెక్టార్లలో చేపల చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా శీలావతి, కట్ల, ఫంగస్, రూప్‌చంద్, తిలాఫీ, గడ్డిచేప, చప్పనీటి చేపలను రైతులు పెంచుతున్నారు. ఈ ప్రాంతంనుంచి రోజుకు సుమారు వెయ్యి టన్నులకుపైగా చేపలు బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రూ.కోట్లు విదేశీ మారకద్రవ్యం వస్తోంది. దీనికితోడు నష్టాలు తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు చేపలసాగుపై దృష్టిసారిస్తున్నారు. ఎండవేడికి పెరుగుతున్న ఉప్పుశాతం గతేడాది కంటే ఈ ఏడాది ముందే ఎండలు అదరగొడుతున్నాయి. మార్చి నుంచే వేసవి ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. దీంతో చెరువులలో నీరు ఇంకిపోతోంది. ఉప్పుశాతం పెరుగుతోంది. ఆక్సిజన్‌శాతంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దీంతో చేపలు చెరువు ఉపరితలంపైనే కొట్టుకుంటూ ఈదుతున్నాయి. ఫలితంగా తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం తాటాకు, మొప్ప, పేను తెగుళ్లు విజృంభిస్తున్నాయి. వీటివల్ల చేపలు అధికసంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పుశాతం 4పైగా ఉంటే చేపల్లో ఎదుగుదల మందగిస్తుంది. ఒక్కోసారి హఠాత్తుగా చేపలు మృత్యువాత పడతాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేజీ రూ.10! వేసవి ఎండవేడిమి వల్ల చేపలు మృత్యువాత పడడంతో పట్టుబడికి రాకముందే చెరువులను ఖాళీ చేసి అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేజీ రూ.పదికి అమ్మిన ఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు. చేపల చెరువు రైతులు వారానికొకసారి నీటిని నింపడం వల్ల పీహెచ్, అమ్మోనియా, నైట్రేట్ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. ఇటీవల చప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న క్షారగుణాలలో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకుని నష్టాలు పాలవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. మందగించిన చేప ఎదుగుదల ఇటీవల పగలు ఎండ ఎక్కువగా కాస్తోంది. రాత్రుళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ఆక్సిజన్ శాతాలు పడిపోతున్నాయి. దీంతో ఉదయాన్నే చేపలు నీటి ఉపరితలంపై ఈదుతున్నాయని ఆక్వా రైతులు చెబుతున్నారు. చేపకు మేతగా పెట్టే డీఓపీ తవుడు కూడా తినడం లేదని ఆందోళన చెందతున్నారు. దీనివల్ల చేప ఎదుగుదల మందగిస్తోందని, దీనికితోడు తెగుళ్లు కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. సన్న, చిన్నకారు రైతులు కుదేలు చేపల పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు కుదేలవుతున్నారు. ఎండల వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పెట్టుబడులతో సాగు ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ. 2 లక్షల వరకు ఖర్చువుతోంది. చేపల సాగు చేయాలంటే 10 ఎకరాలుపైగా చెరువు ఉండాలని, చేపలకు మేతగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లెట్స్ వేస్తుంటామని రైతులు చెబుతున్నారు. పెట్టే మేతను బట్టి 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని, చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి రాష్ట్రానికి ఏటా విదేశీ మారకద్రవ్యం సుమారు రూ.15 వేల కోట్లు తీసుకొస్తున్న చేపల సాగును సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. సాగుకు రుణాలు, మేత ధరలో సబ్సిడీ ఇవ్వడం లేదు. నష్టపోయినా పట్టించుకునే నాథుడు ఉండడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు రుణాలు అందించి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి నేను రెండెకరాల్లో చేపలు వేశా. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పట్టుబడికి రాక ముందే పట్టేశా. నష్టాలు వచ్చాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం -
శాకాహారి ఎంపీకి చేపల మార్కెట్లో ఆదరణ
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. మత్స్యకారులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌పై కేరళ బీజేపీ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. మత్స్యకారులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. థరూర్ ట్వీట్‌కు వ్యతిరేకంగా కొచ్చి, కొల్లాం, కోజికోడ్‌లలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తాను రాసిన పదాల్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని థరూర్ వివరణ ఇచ్చారు. తిరువనంతపురం నుంచి లోక్‌సభ బరిలో నిలిచిన థరూర్ ప్రచారంలో భాగంగా ఇటీవల స్థానిక చేపల మార్కెట్లో పర్యటించారు. ‘ఎంతో నిష్టతో శాకాహారాన్ని మాత్రమే భుజించే ఎంపీకి చేపల మార్కెట్లో మంచి ఆదరణ లభించింది’ అని ట్వీట్ చేశారు. అనంతరం వివాదం రేగడంతో.. ప్రేమ కురిపించారని చెప్పడమే తన ఉద్దేశమని, ఎవరినీ అవమానించడం కాదని వివరణ ఇచ్చారు. తన కుటుంబంలో తాను మినహా అందరూ చేపలు తింటారన్నారు. మత్స్యకారులకు ఏమీ చేయని వారు కూడా ఒక్క పదాన్ని సాకుగా చూపి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేరళ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మత్స్యకారులను థరూర్ ఫిబ్రవరిలో నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం తెల్సిందే. -
ప్రాజెక్టు ప్రాంతాల్లో చేపల మార్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీరాంసాగర్, కోయిల్‌సాగర్, మిడ్‌మానేర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో చేపల పెంపక కేంద్రాలు, ల్యాండింగ్ సెంటర్లు, ఫీడ్‌మిల్లులు, చేపల మార్కెట్ల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి(ఎన్ఎఫ్డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి రాణికుముదినిదేవి తెలిపారు. బుధవారం ఆమె సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలసి మాట్లాడారు. జంట నగరాల్లోని 150 డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నాణ్యమైన చేపల ఆహారం, అమ్మకానికి సంబంధించిన మొబైల్ ఔట్లెట్లకు ఎన్ఎఫ్డీబీ సహకారం అందిస్తుందన్నారు. పాత జిల్లాల్లో 40 చేపల మార్కెట్లు పాత 10 జిల్లాల్లో 40 చేపల మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి చేపడుతున్న పథకాల నిర్వహణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. 2018–19 ఏడాదిలో 24,192 నీటి వనరుల్లో 77 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తామని, టెండర్ల ప్రక్రియ సాగుతుందని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది కోటి రొయ్య పిల్లలను పంపిణీ చేశామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతోప్రణాళికలను రూపొందించామన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. -
కిలోకు 600 గ్రాములే!
సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వరుస దాడులతో అక్రమ తూకాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ‘సాక్షి’ ప్రధాన సంచికలో మూడు రోజుల క్రితం ‘తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా..?’ అనే పతాక శీర్షికతో ప్రచురితమైన కథనానికి తూనికలు, కొలతల శాఖ తీవ్రంగా స్పందించింది. ఆ శాఖ రాష్ట్ర కంట్రోలర్ సీవీ ఆనంద్ తూకాల మోసాలపై తనిఖీల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. మొదటిరోజు కూరగాయల మార్కెట్లపై దాడులు నిర్వహించగా, రెండో రోజు చేపలు, మాంసం మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమ తూకాల వ్యాపారులపై సుమారు 62 కేసులు నమోదు చేశారు. చేపల మార్కెట్లో కిలోకు 600 గ్రాములు నగరంలోని రామ్‌నగర్ చేపల మార్కెట్లో హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ విమల్ బాబు నేతృత్వంలో అధికారుల బృందం ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి తూకాలు తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక చేపల షాపులో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌ను పరిశీలించగా అందులో సెట్టింగ్ (చేతివాటం) బయటపడింది. కిలోకు 400 గ్రాములు తక్కువగా తూకం వస్తున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు ఆ షాపు యాజమానిపై కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసులకు అప్పగించారు. మరో ఐదు షాపుల తూకాలను తనిఖీ చేయగా కిలోకు 200 గ్రాములు తక్కువ వస్తున్నట్లు వెల్లడవడంతో కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. స్టాంపింగ్ లేకుండా తూకాలు జియాగూడ హోల్‌సేల్ మాంసం మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్ లేని ఎలక్ట్రానిక్ కాంటాలు బయటపడ్డాయి. హైదరాబాద్ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్జీ భాస్కర్ రెడ్డి నేతృత్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సుమారు 23 మంది వ్యాపారులు తమ ఎలక్ట్రానిక్ కాంటాలకు శాఖాపరమైన ఆమోదముద్ర వేయకుండానే వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీంతో వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక బృందాలు నగరంలోని గుడిమల్కాపూర్, బోయినపల్లి, కొత్తపేట, ఎన్టీఆర్ నగర్ మార్కెట్లలో తనిఖీలు చేసి ఎలక్ట్రానిక్ కాంటాలు, తూకాల్లో మోసాలున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 33 కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు నగరంలోని మార్కెట్లపై తనిఖీల కోసం ముగ్గురు అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ విమల్ బాబు నేతృత్వంలో ఒక బృందం, హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్ వి. శ్రీనివాస్ నేతృత్వంలో మరో బృందం, హైదరాబాద్ సిటీ తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్జీ భాస్కర్ రెడ్డి నేతృత్యంలో మూడో బృందం ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. -
మార్కెట్లోకి చేప
పుల్కల్(అందోల్): మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాలు కురిపించింది. మత్స్యకారులు ఇక మీద చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లలో దళారుల బెడద లేకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో పలు చోట్ల ఫిష్ కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయనుంది. వాటితోపాటు ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నిధులు సైతం మంజూరు చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు దళారీల బారిన పడకుండా ఉండనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో సంగారెడ్డి మినహా ఎక్కడా ఇప్పటి వరకు చేపల మార్కెట్లు లేవు. దీంతో మత్స్యకారులు పట్టిన చేపలను సంగారెడ్డికి తరలించేందుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో వారు మత్స్యకారుల వద్ద తక్కువ ధరలకు కొనుగోలు చేసి మార్కెట్లో మాత్రం అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం ప్రతీ పట్టణంలోనూ ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు ఏడు ఫిష్ మార్కెట్లను మంజూరు చేస్తూ, వాటికి కావాల్సిన నిధులను సైతం విడుదల చేసింది. వీటిలో పటాన్చెరులో మాత్రం మోడల్ ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ. 2 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అక్కడ స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. సంగారెడ్డి పట్టణంలో రెండవ ఫిష్ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించారు. సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారంతోపాటు సింగూర్‌లో ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అందుకు ఆయా పట్టణాలలో స్థలాన్ని కేటాయించి మత్స్య శాఖ అధికారులకు ఇచ్చినట్లయితే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజీలతో మేలు.. ప్రధానంగా చేపలు పట్టిన వెంటనే మార్కెట్‌కు తరలించే అవకాశం లేనందున ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో కూరగాయలు తీసుకున్నట్లుగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల మార్కెట్‌కు వెళ్లి కొనుక్కునే సదుపాయం కలుగుతుంది. దీని వల్ల మత్స్యకారులకు నష్టం జరగకుండా ఉంటుంది. పట్టిన చేపలను కోల్డ్ స్టోరేజీలో భద్రపర్చి తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజీలు లేనందున మత్స్యకారులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ ఇలా..: కోల్డ్ సోరేజీలో ఐస్, ఏసీ సౌకర్యం కలిగిన కూలింగ్ గదులు, నీటి సౌకర్యం, చేపలను నిల్వ చేసేందుకు అనువైన గదులు, విద్యుత్‌తోపాటు 230 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అంగీకారం.. ఏ రకంగానూ మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనికి తాజాగా తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. రాష్ట్రంలో పాలను ఎలా అయితే కొనుగోలు చేస్తోందో అదే తరహాలో తెలంగాణ కో ఆపరేటీవ్ సొసైటీల ఆధ్వర్యంలో చేపలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను వారం, లేదా నెల చొప్పున నేరుగా మత్స్యకారుల ఖాతాలో డబ్బులు జమ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మార్కెట్‌తోపాటు ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లయితే వారికి అన్ని రకాల సహకారం అందించినట్లు అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా సౌకర్యం కల్పిస్తాం మత్స్యకారులు నేరుగా చేపలను పట్టణాలకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకుగాను గడిచిన రెండు సంవత్సరాల్లో రూ.27 కోట్ల వ్యయంతో ఆటోలు, జీప్, మోపెడ్ వాహనాలను మత్స్యకారులకు అందించాం. వాటితోపాటు అడిగిన వారికి మోటార్ సైకిళ్లను సైతం ఇచ్చాం. ఇది కేవలం మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమే. – సుజాత, మత్స్యశాఖ ఏడీ -
నోట్ల రద్దుతో కళ తప్పిన చేపల మార్కెట్
-
చేపల మార్కెట్ పరిసరాల్లో శుభ్రత అవసరం
నెల్లూరు రూరల్: చేపల మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ – 2 రాజ్‌కుమార్ సూచించారు. డైకస్‌రోడ్డు సెంటర్లోని చేపల మార్కెట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మార్కెట్ నిర్వహణపై వ్యాపారులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. చేపలు త్వరగా చెడిపోకుండా తగు జాగ్రత్తలతో భద్రపర్చుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు, ఎఫ్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై ఓటర్ కార్డులు
విజయవాడలో కలకలం స్వాధీనం చేసుకున్న అధికారులు విజయవాడ (వన్‌టౌన్): ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధం.. ఓటు హక్కు. ఈ హక్కును వినియోగించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంతో విలువైన ఈ గుర్తింపు కార్డులు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది కార్డులు రోడ్డుపై పని ఉన్నాయి. విజయవాడలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తపేట దూది ఫ్యాక్టరీ రోడ్డులోని చేపల మార్కెట్‌కు సమీపంలో ఓటర్ గుర్తింపు కార్డులు రెండు గోనె సంచుల్లో ఉండటాన్ని ఆదివారం స్థానికులకు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు సామినేని ఉదయభాను, పి.గౌతంరెడ్డి వచ్చి పరిశీలించారు. అక్కడ వేలాది ఓటర్ గుర్తింపు కార్డులు పడేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి అధికార టీడీపీ నేతలు గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగించిన కార్డులేనని వారు ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే: ఈ ఓటర్ గుర్తింపు కార్డుల్లో 90 శాతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్‌సింగ్‌నగర్, అయోధ్యనగర్, సూర్యారావుపేట ప్రాంతాలకు చెందిన కార్డులు ఉన్నాయి. ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్సైట్లో పరిశీలించగా వీటిలోని పలు గుర్తింపు కార్డులు వాడుకలోనే ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్డులను పరిశీలించారు. ఇక్కడ ఐదు వేలకు పైగా కార్డులు ఉన్నాయని చెప్పారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. కార్పొరేషన్లో ఎన్నికల విభాగం అధికారులకు అప్పగించారు. ఓటర్ గుర్తింపు కార్డులను దొంగ ఓట్ల కోసం సేకరించి, పని ముగిశాక రోడ్డుపై పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను సృష్టించి, గత ఎన్నికల్లో అసలు ఓటర్లను బూత్‌కు రాకుండా చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల విభాగం అధికారుల సహకారంతోనే ఈ గుర్తింపు కార్డులను సేకరించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బెజవాడ సెంటర్లో బస్తాల్లో ఓటరు కార్డులు
-
చేపల మార్కెట్ కూల్చివేత
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆకస్మికంగా చేపల మార్కెట్‌ను కూల్చి వేయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ రమేష్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గంజిమైదాన్లో 50 సంవత్సరాలుగా చేపలు వ్యాపారం చేసుకుంటూ గంగ పుత్రులు జీవనం కొనసాగిస్తున్నారు. కాగా గత ఏడాది మత్స్య కార్మిక సహకార సంఘం సంగారెడ్డి వారికి రూ.10 లక్షల వ్యయంతో ప్రభుత్వం చేపల మార్కెట్‌ను నిర్మించింది. దీంతో సంగారెడ్డి మత్స్యకార్మికులకు అందులో చేపలు విక్రయించేందుకు గాను షాపులను కేటాయించారు. ఇదిలా ఉండగా.. కల ్పగూర్ గ్రామస్తులకు చేపల మార్కెట్లో గల షాపింగ్ కాంప్లెక్స్‌లోకి చేపల వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో వారు చాలా కాలంగా గంజి రోడ్డు ఇరువైపుల చేపలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా కల ్పగూర్ గ్రామ వ్యాపారులు కాంప్లెక్స్‌కు ముందుగా బహిరంగంగా విక్రయించడంతో తమకు గిరాకీ రావడం లేదని సంగారెడ్డికి చెందిన పలువురు మత్స్యకార్మికులు మున్సిపల్ కమిషనర్‌ను ఆశ్రయించారు. కల్పగూర్ గ్రామ చేపల వ్యాపారులు రోడ్డుపై విక్రయాలు జరపకుండా అడ్డుకోవాలని కోరారు. అయితే కమిషనర్ వాస్తవ పరిస్థితిని గమనించకుండానే కల్పగూర్ గ్రామ చేపల వ్యాపారులకు రోడ్డుపైన చేపలు విక్రయించద్దని సిబ్బందితో నోటీసులు అందజేశారు. దీంతో వారు తమకు షాపింగ్ కాంప్లెక్స్‌లో అనుమతి లేనందున ఎక్కడ విక్రయించుకోవాలో స్థలాన్ని చూపిస్తే అక్కడే విక్రయించుకుంటామని కమిషనర్ ఇచ్చిన నోటీసులకు బదులిచ్చారు. కానీ శనివారం స్థానిక మత్స్య కార్మికులు మున్సిపల్ సిబ్బందిని వెంట వేసుకుని కల ్పగూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న షెడ్లను కూల్చివేశారు. దీంతో ఇరువురి మధ్య వాదనలను జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని శాంతింపచేశారు. కాగా సంగారెడ్డికి చెందిన మత్స్య కార్మికులు తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని కల ్పగూర్ గ్రామ మత్సకార్మికులు ఆరోపించారు. తాము చేపలు విక్రయిస్త్తుండగానే తమ షెడ్లను కూల్చివేయడంతో కోనుగోలు చేయడానికి వచ్చిన ఓ మహిళ తలకు గాయమైంది. తమ షెడ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
మా రాంబాబుగాడి మత్స్యపురాణం!
నవ్వింత: మా రాంబాబుగాడు ఫిష్ల్యాండ్లో డిన్నర్ ఇస్తానన్న దగ్గర్నుంచి చేప వెరైటీ ఐటమ్స్ కోసం ఉవ్విళ్లూరుతూ ఉన్నాం. డిన్నర్ టైమ్‌లో వాడేం స్పీచులిస్తాడులే అనుకున్నాం గానీ... వెళ్లాకగానీ తెలియలేదు వాడి గేలానికి చిక్కిపోయామని. ‘‘నువెన్నైనా చెప్పురా... ఫిష్షు ఫిష్షే. దాని టేస్టు టేస్టే’’ అన్నాను తన్మయంగా. అంతే రెచ్చిపోయాడు మావాడు. ‘‘అందుకేగా రాజుగారు తన ఏడుగురు కొడుకుల్నీ వేటకు పంపితే... వాళ్లు పులుల్నీ, జింకల్నీ కొట్టడం మానేసి, చేపలు పట్టడం మొదలుపెట్టారు. పైగా చేప రుచిని మరవలేక, వాటినంత తేలిగ్గా విడవలేక... నిలవ ఉంచుకుని తినాలని ఎండబెట్టడం కూడా చేశారు. చేప గురించి తర్వాతి తరాలకు తెలియాలన్న కోరిక కొద్దీ... ‘చేపా చేపా ఎందుకు ఎండలేదంటూ’... మనకు తెలియకుండానే మనమంతా మన పిల్లలందరికీ తొలికథగా దాన్నే చెబుతుంటాం. అలా కథాసాహిత్యంలో కూడా చేపదే అగ్రస్థానం రా’’ అన్నాడు రాంబాబు. ‘‘నువ్వు గ్రేటురా. రుచి తాలూకు టేస్టునూ, సంప్రదాయంగా వస్తున్న పిల్లల కథల టేస్టునూ... రెంటినీ ఆస్వాదిస్తుంటావు’’ అన్నాను మెచ్చుకోలుగా. వాడు చెలరేగిపోయాడు. ‘‘విజ్ఞానమంతా వేదాల్లోనే ఉందన్న విషయం నీకు తెలియంది కాదు. పురాణాల్లో జరిగిన మొట్టమొదటి థెఫ్ట్ కేసును డీల్ చేయడానికి దేవుడంతటి వాడు చేపనే ఎందుకెంచుకున్నాడంటావ్? చేప నాలెడ్జీ సముపార్జనకు చిహ్నం అని లోకానికి తెలియ చెప్పడానికే. అందులో ఒమెగా ఫ్యాటీ ఆసిడ్సూ... అవీ, ఇవీ ఉన్నాయంటారుగానీ... సమస్తవిజ్ఞానభాండాగారమైన వేదాలను చేప రూపంలో సంరక్షించినందుకే రా... దాన్ని తిన్నవాడికీ జ్ఞానం, జ్ఞాపకశక్తీ, వ్యాధినిరోధకశక్తీ పెరుగుతాయి. పురాణాల్లోనే కాదు... సైన్సుకూ చేప చేసిన సేవ అంతా ఇంతా కాదు’’ అంటూ మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు మా రాంబాబు. ‘‘సైన్సుకు చేప సేవలా?’’ ఆశ్చర్యపోయాన్నేను. ‘‘కాదా మరి. జీవపరిణామ క్రమాన్ని చెప్పిన డార్విన్ వెన్నెముకగల జీవుల్లో చేప నుంచి మొదలుపెట్టి మనిషి దగ్గర ముగించాడు. సైన్సులోనే కాదురా... మనలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేయడానికి ఇచ్చే శిక్షణలోనూ చేపలు ఇతోధికంగా ఉపయోగపడతాయి తెల్సా?’’. ‘‘అవినీతి అంతానికీ, చేపలకూ సంబంధం ఏమిట్రా?’’ ‘‘మొన్ననే పేపర్లో చదివాన్రా. ‘అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన పెద్ద చేప. పెద్ద చేప కోసం వలపన్నిన అధికార్లు’ అంటూ హెడ్డింగులు చూశా. అంటే... అవినీతిపరుల్ని గట్టిగా పట్టుకోవాలంటే కొంతకాలం చేపలు పట్టడం ప్రాక్టీస్ చేయాలని’’ అన్నాడు రాంబాబు. ‘‘నీకు మతిగానీ పోయిందా...?’’ అంటూ కేకలేయాలని చూశా. అయినా వదల్లేదు వాడు. ‘‘సినిమాల హిట్ ఫార్మూలాకు చేపల పులుసు ఒక సాధనం. మాస్ హీరోను వశపరచుకోవాలంటే హీరోయిన్ ఏ బిర్యానీయో, ఫ్రైడ్రైసో వండదు. చేపలపులుసు చేస్తుంది. అతగాడు దాన్ని లొట్టలేసుకుని తింటూ ‘ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లూ... ఎక్కడో గుచ్చావూ చేప ములూ’్ల... అంటూ పాట కవిత్వంతో కిర్రెక్కించేసరికి...మాస్ ప్రేక్షకులంతా ఫిదా. ఇది కనిపెట్టే హాలీవుడ్ డెరైక్టరు స్పీల్బర్గు కూడా ‘జాస్’ సినిమా తీసి ‘మాస్’ను ఆకట్టుకున్నాడు తెల్సా’’ అన్నాడు రాంబాబుగాడు. ‘‘అంటే చేపలంతా మాస్ యవ్వారమంటావ్! వాసనకొడుతుంటాయి కాబట్టి క్లాస్ పీపుల్‌కు చేపల్తో సంబంధం ఉండదంటావా?’’ అడిగాన్నేను. ‘‘ఎందుకు లేదూ... కాళిదాసుకు కవిత్వం అంతగా వచ్చిందెందుకనుకుంటున్నావ్. పుష్కలంగా చేపలు తిన్నందుకే!’’ ‘‘ఒరే... ఒరే... కనిపెట్టు నీ కోతలు’’ ‘‘కోతలు కాదురా. ఈ పద్యం విను. కక్షే కిం తవ? పుస్తకం, కిముదకం? కావ్యార్థ సారోదకం. గంధః కిం? ఘన రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః పుచ్ఛః కిం? ఘన తాళపత్ర లిఖితం, కిం పుస్తకం హే కవే? రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణ పుస్తకం!! ఒకరోజున కాళిదాసు చేపల మార్కెట్లో ఒక పెద్దసైజు కొర్రమీను కొని తీసుకుపోతుంటే ఆ దృశ్యం చూసి, ఆయనను ఆటపట్టించాలనుకున్న భోజరాజు ‘ఆ చేతిలోదేమిట’ని అడిగాట్ట. ‘పుస్తకం’ అని జవాబిచ్చాట్ట కాళిదాసు. ‘నీళ్లు కారుతున్నాయేం’టి అని అడిగితే ‘కావ్య సారం నీళ్లలా స్రవిస్తోంద’న్నాట్ట కాళిదాసు. ‘వాసనొస్తోందేమిటి?’ అంటే ‘రామరావణ యుద్ధంలో చనిపోయిన సైనికుల శవాల కంపు’ అన్నాట్ట కవీంద్రుడు. ‘అది సరే గానీ కవిగారూ... ఇంతకీ అదేం పుస్తకం... కాస్త చూపిద్దువూ’ అని భోజరాజు బలవంత పెడితే... కాళిదాసు పొట్లం విప్పేసరికి అది రామాయణకావ్యంగా దర్శనమిచ్చిందంట. అటు కాళీమాత, ఇటు మత్స్యదేవత కూడబలుక్కొని తమ ఉమ్మడి భక్తుడైన కాళిదాసు పరువు కాపాడటానికే ఇలా తమ మహత్యం చూపించారని లోక ప్రతీతి. కవిత్వం కమ్మగా చెప్పాలంటే క్లాస్ కవులూ తినాల్సిందేరా చేపలకూర. వినాల్సిందేరా చేపపురాణం. ఇన్ని గొప్పలున్నాయని చెప్పడానికే క్యాట్ ఫిష్ మీసాలు పెంచుతుంది. ఆ సంగతి తెలియక దాని మీసాలు పిల్లిమీసాల్లా ఉన్నాయని అమాయకంగా దాన్ని క్యాట్‌ఫిష్ అంటాం. ‘నాకూ పిల్లికీ సంబంధమేమిట్రా, నా గొప్ప నాదే అంటూ ఆ మీనం కాస్తా మీసం మెలేసి తన గొప్పదనం చాటుతుంటుంది!’’ అన్నాడు మా రాంబాబు. - యాసీన్ -
ఆడుకుంటూనే అనంతలోకాలకు..
పెడనలో పేలుడు ఐదేళ్ల బాలుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలు బాంబు పేలిందంటూ ప్రచారం మంత్రి, ఎస్పీ, ధికారుల పరిశీలన అన్ని కోణాల్లో దర్యాప్తు : ఎస్పీ మచిలీపట్నం/పెడన : పెడనలో రైల్వేస్టేషన్, చేపల మార్కెట్‌కు సమీపంలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. పేలుడు జరిగిన ప్రదేశంలో ఆడుకుంటున్న ముక్కుపచ్చలారని చిన్నారుల్లో మహ్మద్ రఫీ అక్కడికక్కడే మృతిచెందగా, మరో చిన్నారి మహ్మద్ ఇద్రీస్ తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. పెద్దశబ్దంతో పేలుడు సంభవించటంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. పేలుడుకు కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పెడన పట్టణంలోని 15వ వార్డులో గల ఉర్దూ మిక్స్డ్ పాఠశాలలో శనివారం పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రఫీ తండ్రి హనీఫ్, ఇద్రీస్ తండ్రి ఇలియాస్ హాజరయ్యారు. తమ కుమారులతో కలిసి అక్కడే భోజనం చేశారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు 70 మీటర్ల దూరంలోని వేపచెట్టు కింద రఫీ, ఇద్రీస్ ఆడుకుంటుండగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు రఫీ గాలిలోకి ఎగిరి చెట్టుకొమ్మకు బలంగా గుద్దుకుని మృతిచెందాడు. రఫీ శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. కుడి చేయి ముంజేతి వరకు తెగిపడింది. కుడి వైపు కన్ను బయటకు వచ్చేసింది. ఘటనా స్థలంలో మాంసపు ముద్దలు కనిపించాయి. రఫీకి కొద్ది దూరంలో ఉన్న ఇద్రీస్ తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. పెద్దపెట్టున పేలుడు శబ్దం వినపడటంతో స్థానికులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే రఫీ మృతి చెందగా, ఇద్రీస్ తీవ్రగాయాలపాలై ఇంటికి పరుగుపెట్టాడు. పేలుడు శబ్దం కిలోమీటరు దూరానికి పైగా వినిపించిందని, గ్యాస్‌సిలిండర్ పేలి ఉంటుందని భావించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో చిన్నపాటి గొయ్యి ఏర్పడింది. ఆడుకుంటానని వెళ్లాడు.. హనీఫ్‌కు సంతానం లేకపోవటంతో తన సోదరుడు కుమారుడు రఫీని పుట్టిన నెలన్నర రోజులకే పెంపు తెచ్చుకున్నాడు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. శనివారం రఫీతోపాటు పాఠశాలకు వెళ్లి కుమారుడితో పాటు భోజనం కూడా చేశాడు. అనంతరం తన సైకిల్‌షాపు వద్దకు వచ్చి పని చేసుకుంటుండగా పేలుడు శబ్దం వినిపించింది. అప్పటికే ఇద్రీస్ తండ్రి ఇలియాస్ కూడా హనీఫ్ సైకిల్ షాపు వద్దే ఉన్నాడు. వీరిద్దరూ ఏం జరిగిందో తెలుసుకునేందుకు సైకిల్‌పై సంఘటనా స్థలానికి వెళ్లారు. ఊహించని ఘటన చూసి తల్లడిల్లిపోయారు. హనీఫ్ కుమారుడు రఫీ మృతి చెందగా, ఇలియాస్ కుమారుడు ఇద్రీస్ తీవ్ర గాయాలపాలై కనిపించాడు. పేరెంట్స్ డే సందర్భంగా పాఠశాలలో రఫీ శ్లోకాలు చెప్పడం చూసి అందరూ మెచ్చుకున్నారని ఇంతలోనే తన కుమారుడు విగతజీవిగా మారాడంటూ హనీఫ్ ఆస్పత్రిలో కన్నీరు మున్నీరవడం చూపరులను కలచివేసింది. రఫీ తల్లికి అనారోగ్యం ఉండటంతో రఫీ చనిపోయాడనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి, ఎస్పీ పెడన రైల్వేస్టేషన్, మార్కెట్ సమీపంలో పెద్దఎత్తున పేలుడు సంభవించిందని సమాచారం అందడంతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్పీ జి.విజయకుమార్, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఆర్డీవో పి సాయిబాబు, బందరు డీఎస్పీ కె. శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఏం జరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ నేతృత్వంలో బాంబ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ బృందాల ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలం నుంచి బాంబ్‌స్క్వాడ్ బృందం పెన్సిల్ బ్యాటరీలు, వైర్ముక్కలు, పేలుడు పదార్ధానికి సంబందించిన ఆధారాలను సేకరించారు. మృతి చెందిన రఫీ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్రీస్‌ను మంత్రి, ఎస్పీ, ఇతర అధికారులు పరామర్శించారు. ఇద్రీస్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను వివరాలు తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంఘటనను వివరించి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని కోరారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పేలుడు ఘటనపై భిన్న కథనాలు.. పేలుడు ఘటనకు కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చూసిన వారు మందుగుండు సామాగ్రి పేలితే ఇంత తీవ్రత ఉండదని అంటున్నారు. మంత్రి, ఎస్పీ, బాంబు స్క్వాడ్, ఏజేసీ, ఆర్డీవో సందర్శించటంతో స్థానికుల్లో అనుమానాలు నెలకొన్నాయి. పేలింది మందుగుండు సామాగ్రి కాదని బాంబు పేలటం వల్ల ఇంత హడావుడి జరుగుతోందని చెప్పుకుంటున్నారు. పేలుడు సంభవించిన వెంటనే ఎస్పీ అక్కడకు చేరుకోగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహాల్లో సోదాలు నిర్వహించటం చర్చనీయాంశమైంది. ఘటనలో మృతి చెందిన రఫీ, ఇద్రీస్ తమకు దొరికిన పేలుడు సామాగ్రిపై కాగితాలు వేసి నిప్పు అంటించారనే వాదన వినబడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్రీస్ పోలీసులకు ఈ సంగతి వెల్లడించాడని తెలిసింది. శుక్రవారం పెడన పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగిన నేపథ్యంలో ప్రత్యర్థులను బెదిరించేందుకు ఏదైనా పార్టీ వారు నాటుబాంబులను తీసుకువచ్చారా? అని కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్నికల సమయంలో పేలుడు సంభవించిన ప్రాంతంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతున్నారు. పోలీసుల అదుపులో మహిళ కాగా ఓ మహిళను స్థానిక పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెడన పట్టణం 15వ వార్డుకు చెందిన ఓ విశ్రాంత కానిస్టేబుల్ భార్య పాస్పరస్, పొటాష్ తీసుకుని టపాసులు, మతాబులు తయారు చేస్తుంటారు. శుభకార్యాలకు టపాసులను అమ్ముతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె మందు గుండు సామాగ్రిని బయట పడవేసి ఉంటే..దానిని పిల్లలు తీసుకుని వచ్చి కాల్చి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కమిషనర్ చాంబర్లో చేపల విక్రయం
-
మూణ్ణాళ్ల ముచ్చట
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: మన పాలకులు, అధికారులు ఆరంభశూరులనే విషయం మరోసారి రుజువైంది. నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జలపుష్పభవన్ (చేపల మార్కెట్) నిర్వహణ తీరే అందుకు నిదర్శనం. ప్రారంభంలో జలపుష్పభవన్ పలు రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారుల సందర్శనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మార్కెట్ నిర్మాణం, నిర్వహణ తీరు దేశానికే ఆదర్శమంటూ ప్రశంసల జల్లులు కురిశాయి. ఇదంతా గతం. ఆదర్శ చేపల మార్కెట్ కాస్తా అధ్వానంగా తయారైంది. పర్యవేక్షించే వారు కరువవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతుండగా కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ మంజూరు చేసిన రూ.1.20 కోట్ల నిధులతో 2011లో డైకస్‌రోడ్డులో జలపుష్పభవన్ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. చేపలు అమ్ముకునే వారికి 66, శుభ్రం చేసే వారికి 62 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్ కాటా తప్పనిసరనే నిబంధన విధించారు. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నారు. అందుకు అవసరమైన నీటివసతి కల్పించారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వడంతో వినియోగదారులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు మార్కెట్‌ను సందర్శించి స్థానిక అధికారులను ప్రశంసలతో ముంచెత్తారు. క్రమేణా దీనిపై కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సమస్యలకు నిలయంగా మారింది. దళారులు రంగప్రవేశం చేయడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడటంతో పాటు కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతోంది. చేపల వ్యర్థాలను తరలింపునకు ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా, నిబంధనలను పక్కన పెట్టి ఒక్కరికే ఆ బాధ్యతలు కట్టెబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ కాటాలు మూలనపడ్డాయి. కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే వాటిని పక్కనపెట్టి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చేపలు శుభ్రం చేసే కౌంటర్ల దగ్గర పైపులు దెబ్బతినడంతో మురుగునీరు బయటకు వెళ్లక దుర్ఘందం వెదజల్లుతోంది. పురుగులు చేరడంతో చేపలను శుభ్రం చేసేవారు ఆ కౌంటర్లను ఉపయోగించుకోలేక కింద కూర్చునే తమ పనిచేస్తున్నారు. మార్కెట్ పరిసరాల్లో పూర్తిగా లోపించడంతో వినియోగదారులు వచ్చేందుకు జంకుతున్నారు. -
చేపా..చేపా..ఎందుకు రావడం లేదు!
‘చేపా..చేపా..ఎందుకు ఎండలేదు’ .. ఇది చిన్నప్పుడు కథలో చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం ‘చేపా..చేపా.. ఎందుకు రావట్లేదు' అని అడగాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఎవరిని అడిగినా టక్కున చెపుతారు. సీమాంధ్ర ఉద్యమ ప్రభావమేనని. సీమాంధ్ర ఉద్యమానికి, చేపకు సంబంధం ఏంటని మరి కొందరికి అనుమానం కలగక మానదు. దేశంలోని ప్రధాన నగరాలకు గోదావరి జిల్లాలనుంచే చేపల ఎగుమతి జరుగుతుందన్న విషయం అర్ధమైతే చాలు..పూర్తి పాఠం మనకు తెలిసిపోతుంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని భీమవరం, ఆకివీడు, కైకలూరు, అవనిగడ్డ, నాగాయలంక, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం తదితర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల సాగు విస్తృతంగా సాగుతుంటుంది. ఈ ప్రాంతాల నుంచే దేశ విదేశాలతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి కూడా ఇవి ఎగుమతి అవుతుంటాయి. కానీ, గత కొంత కాలంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సమ్మె జరుగుతుండటం, తాజాగా రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో ఆ ప్రభావం రాజధాని హైదరాబాద్ సహా పలు తెలంగాణ జిల్లాల్లోని చేపల మార్కెట్లకు చేపలు, రొయ్యల రాక పూర్తిగా ఆగిపోయింది. ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో సీమాంధ్రలో చేపట్టిన ఉద్యమం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. సీమాంధ్రకు వెళ్లాల్సిన బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో జనం ఇక్కట్లు పడుతుండగా, ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల కూరగాయలు, చేపల రవాణాకు పూర్తిగా బ్రేక్ పడింది. దీంతో హైదరాబాద్ లోని చేపల మార్కెట్లన్నీ పూర్తిగా బోసిపోయాయి. కూరగాయల సంగతి పెట్టినా.. మాంసాహారం లేకుండా ముద్ద దిగని భోజన ప్రియులకు మాత్రం నిరాశ తప్పట్లేదు. ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాంతాలతో పనిలేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తిండి విషయంలో రాజీ పడని వారికి మాత్రం ఉద్యమ సెగ బాగానే బోధ పడుతుంది. చివరకు.. చేపకు రెక్కలు, మొప్పలు ఉన్నా తిందామనుకునే వాళ్లకు తిప్పలు మాత్రం తప్పడం లేదు.