ఇది ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్. ఆదివారం ఇలా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం మాటే మరిచారనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. ఆదివారం బయోడైవర్సిటీ చౌరస్తా ఇలా బోసిపోయి కనిపించింది.
1/7
రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అలా అని ఊరికే ఉంటే జీవనం గడవదు. అందుకే కూకట్‌పల్లిలోని ఓ బార్బర్‌షాప్ నిర్వాహకుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దుకాణం నిర్వహిస్తూ ఇలా కనిపించాడు.
2/7
కరోనా పరీక్షల కోసం వచ్చిన జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్‌లో ఉన్న కరోనా నిర్ధారణ పరీక్షాకేంద్రానికి ఆదివారం ఉదయం 7 గంటలకే జనం చేరుకున్నారు. క్యూలో నిలబడే ఓపిక లేక ఇలా చెప్పులను పెట్టి పక్కకు వెళ్లి సేదతీరారు. – సాక్షి ఫోటో జర్నలిస్ట్, ఖమ్మం
3/7
ఎప్పుడూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటుండే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదివారం ఆటవిడుపుగా కాసేపు జాలరిగా మారారు. ఘన్‌పూర్ శివారున ఉన్న తన చేపల కొలనులోకి దిగి ఇలా వలవేసి చేపల్ని పట్టారు.
4/7
ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో కోవిడ్ చికిత్సా కేంద్రంలో తమ డిమాండ్ల కోసం ఆదివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సిబ్బంది
5/7
కరోనా సాయంలో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఢిల్లీకి ఆదివారం ప్రత్యేక విమానంలో పంపించిన అత్యవసర ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు
6/7
ముంబైలోని దాదర్‌లో డ్రైవ్–ఇన్ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆదివారం కారులోనే కరోనా టీకా తీసుకుంటున్న వృద్ధుడు
7/7
పవిత్ర రంజాన్ మాసంలో 27వ రాత్రి లైలతుల్ అల్–ఖద్ర్ సందర్భంగా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో గ్రాండ్ మసీదులో భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు
Comments
Please login to add a commentAdd a comment