MUSHEERABAD
-
‘త్వరలో ముషీరాబాద్ బీజేపీకి షాక్’
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఒకటి రెండు రోజుల్లో గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నిర్వహించిన చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ్యానర్లలో బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ విజయలక్ష్మి ఫొటో ప్రత్యక్షం కావడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశం బీజేపీ, బీఆర్ఎస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షి ఆరా తీయగా అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాంనగర్ డివిజన్ అధ్యక్షురాలిగా, డెంటల్ డాక్టర్‌గా అందరికీ పరిచయమున్న డాక్టర్ విజయలక్ష్మి త్వరలోనే ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఒకటి రెండు సార్లు సమావేశమై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న కవిత హైదరాబాద్ రాగానే ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి పార్టీని వీడడానికి గల కారణాలపై ఆరా తీయగా.. రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు వీడి మూడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పట్టించుకోవడం లేదనే.. తనకు ఏదైనా బాధ్యత అప్పగించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుమార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోవడమే ఆమె అలకకు కారణంగా తెలిసింది. దీంతో పాటు ఆమె ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద బాదం పాలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. దీనికి బీజేపీ నాయకుల నుంచి సహకారం అడిగినా స్పందన కరువైనట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు సైతం తనను పిలవడం లేదని, బతుకమ్మ సంబరాలు, బీజేపీ సంస్థాగత సమావేశాలకు సైతం ఆహ్వానం అందడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత ముషీరాబాద్ బీజేపీలో ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, కన్వీనర్‌గా రమేష్‌రాం రెండవసారి ఎన్నికైన తరువాత ఈ పరిస్థితి మారదని భావించే తాను బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆమె సాక్షికి వివరించారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్న విషయం బయటకు రావడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు ఫోన్ చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారని, ఇప్పటి వరకు వారంతా ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నిస్తున్నారు. చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి..
ముషీరాబాద్: వద్దని చెప్పినా ఫోన్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతుందనే కోపంతో గొంతునులిమి చంపాడు ఆ కసాయి మారు తండ్రి. ఈ దారుణ ఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ జహంగీర్ యాదవ్ కథనం ప్రకారం....రహిమున్నీసా అలియాస్ సన్నూబేగం.. బెహ్రాన్ దేశంలో హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. బేగంపేటకు చెందిన అక్బర్‌తో మొదటి వివాహం జరగగా పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో అతను మరణించాడు. అప్పటికే వారికి షేక్ ఆయాజ్, నౌసీన్ ఉన్నీసా, యాసీన్ ఉన్నీసా(17) అనే ముగ్గురు సంతానం కలిగారు. మొదటి భర్త అక్బర్ మృతి తర్వాత రహిమున్నీసా ముషీరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. కాగా, ముగ్గురి పిల్లల్లో ఆయాజ్ షేక్ బేగంపేటలోని తన నాయన మ్మ దగ్గర నివసిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు మారు తండ్రితోనే ఉంటున్నారు. రెండవ కూమార్తె యాసీన్ ఉన్నీసా(17) నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పలు మార్లు తౌఫిక్ అలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలోనూ యాసీన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తౌఫిక్ ఆవేశంతో ఫోన్ లాక్కున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని నిలదీశాడు. చెప్పకపోవడంతో చెంపలమీద రెండు దెబ్బలు వేశాడు. దీంతో బెదిరిపోయిన యాసిన్ గట్టిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వింటారు ఏడవొద్దంటూ గట్టిగా గొంతు నులమడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన సోదరి నౌసీన్ ఉన్నీసా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే యాసీన్ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో తౌఫిక్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
ముషీరాబాద్ పీఎస్ పరిధి బాకారం లో దారుణం
-
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ ఇవ్వాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ రేట్లు పెంచాలని, చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని, కోర్సుల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3300 కోట్లు చెల్లించాలని నవంబర్ 10న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్వో కార్యాలయాల వరకు ర్యాలీలు జరపాలని 14 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్షిప్లు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కేవలం రూ.5500 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. 2007లో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని ఈ శాఖకు కమీషనర్, ఎండీ లేరన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థుల స్కాలర్ షిప్ రూ. 20 వేలకు పెంచాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్‌లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. -
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా!
సాక్షి, పటాన్చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్(18)కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు మార్చారు. ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్‌కు ఫోన్ చేయించారు. ముషీరాబాద్ రావడానికి డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో డబ్బులు ఆన్లైన్లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు. వెళ్లే ముందు ముషీరాబాద్ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్‌కు ఫోన్ చేసి తెలిపాడు. శివకుమార్ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి. -
Hyderabad: మహిళ పట్ల ఆర్ఐ అసభ్య ప్రవర్తన..ఒంటరిగా రా ఇస్తాననడంతో
సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ విజయ్‌నాయక్‌ను అడిగింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్‌నాయక్‌ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్‌నాయక్‌పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్‌ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్ఐ విజయ్‌నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్‌రావు తెలిపారు. -
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్‌పూర్.. ఇటీవల మాదాపూర్ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్ ఐరన్ (డీఐ), మైల్డ్‌స్టీల్ (ఎంఎస్) పైప్లైన్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పురాతన పైప్లైన్ల మార్పుతోనే పరిష్కారం.. ► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది. ► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కార్వాన్ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవీ కారణమే.. ► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది. ► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. ► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) జలమండలి మేనేజర్, వర్క్ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్‌లైన్ వర్క్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల) -
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్‌గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్‌లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్‌హుడ్ కమ్యూనిటి హాల్‌ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, కోటేష్‌ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ-టిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
-
Photo Feature: కరోనా కాలం.. జర పైలం
ఇది ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్. ఆదివారం ఇలా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం మాటే మరిచారనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. ఆదివారం బయోడైవర్సిటీ చౌరస్తా ఇలా బోసిపోయి కనిపించింది. -
Photo Feature: అంతటా కరోనా.. ఏది దారిక
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం జనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో టీకా తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వయోవృద్ధులు ఇలా నిరీక్షిస్తూ కనిపించారు. ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సినేషన్ కోసం జనం భారీగా తరలివచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వ్యక్తులు ఇలా పీపీఈ కిట్లు ధరించి మరీ వచ్చారు. ఆస్పత్రి వద్ద కరోనా అంటుకునే ప్రమాదం ఉందనే భావనతో పకడ్బందీ ఏర్పాట్లతో రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. -
60 కాస్త 10 అయ్యింది.. పట్టించుకోండి సారూ
సాక్షి ,హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోయర్ ట్యాంకు బండ్ గోశాల నుంచి ఏసీటీసీ కళాశాల మీదగా బీమామైదానం, ఇందిరా పార్కు రోడ్డు 60 అడుగుల వరకు ఉండేది. విశాలమైన ఈ రోడ్డుకు ఇరువైపులా గోశాల నుంచి ఇందిరా పార్కు రోడ్డు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. డెంటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర వ్యాపారులు ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా మెకానిక్ షెడ్లను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు వచ్చే వాహనాలు, వాహన చోదకులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసి సర్వీసింగ్ చేయడంతో 60 అడుగులు కాస్త 10 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఇదేమని ఎవరైనా వాహనదారులు అడిగితే ఘర్షణలు, వాగ్వాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో మెకానిక్ షాపుల యజమానులు ఒకరిని మించి మరొకరు అక్రమంగా షెడ్లను నిర్మించి రోడ్లను ఆక్రమించారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు దారేదీ.. ► ఇదే మార్గంలో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ► ఇక్కడికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. ► ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ సెంటర్‌ను కరోనా వైద్యం కోసం కేటాయించారు. ► దీంతో కవాడిగూడ డివిజన్‌తో పాటు ఇతర డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షల కోసం, వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. ► వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు.... అనేక సంవత్సరాలుగా రోడ్డును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని విపరీతంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతున్న షెడ్ల యజమానులపై ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా రోజు రోజుకు కొత్త షెడ్లు ఈ మార్గంలో రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించి, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందిపడుతున్న రోడ్డు ఆక్రమణలను తొలగించాలని పలువురు వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. ( చదవండి: సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు.. ) -
టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ విజృంభిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రాణ భయంతో నిర్థారణ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్‌సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. దీంతో పీహెచ్‌సీల వద్ద కనీస భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు, ఒకరిపై ఒకరు పడుతూ రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. వీరిని నివారించేందుకు ఆసుపత్రి సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేక టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ముషీరాబాద్ నియోజకవర్గంలో బైబిల్ హౌస్, డీబీఆర్ మిల్లు, గగన్మహల్లతో పాటు ముషీరాబాద్, భోలక్పూర్లలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సిన్‌ను కూడా అందిస్తున్నారు. ► ముఖ్యంగా భోలక్‌పూర్, ముషీరాబాద్ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పాటు ముషీరాబాద్ ప్రధాన రహదారిలో ఉండడంతో ఇక్కడ రద్దీ అధికంగా ఉంది. ► ముషీరాబాద్, భోలక్‌పూర్ కేంద్రాలకు రోజుకు సగటున సుమారు టెస్టులకు, వ్యాక్సిన్‌కు 300 మందికి పైగా హజరవుతున్నారు. ► టెస్టుల కోసం వచ్చే వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తమ సీరియల్ నెంబర్ వచ్చే వరకు సుమారు గంట పాటు ఆవరణలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ► అలాగే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆరగంట పాటు ఎటువంటి రియాక్షన్ లేదని నిర్థారణ అయ్యే వరకు అక్కడ వేచిచూడాల్సి ఉంటుంది. దీనితో ఆ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి.... ► టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చే బాధితులు, వారికి సహయకులుగా వచ్చే వారు క్యూ లైన్, భౌతిక దూరం పాటించే విధంగా ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులు టీం లను ఏర్పాటు చేసి రోగులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ► దీనికి తోడు మహిళలకు టాయిలెట్ సౌకర్యం, టెస్టులు, వ్యాక్సిన్ అందించే ఆరోగ్య కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ( చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని ) -
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో సేవలు గురువారం నుంచి ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్, ఎంజీబీఎస్ టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ఇక కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్ మెట్రో స్టేషన్లు సైతం గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా ప్రస్తుతం మూడు మెట్రో మార్గాల్లో నిత్యం సుమారు 1.5 లక్షల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్న విషయం విదితమే. (చదవండి: త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు) -
కార్పొరేటర్ మీద కోపం ఉండొచ్చు.. కానీ!
సాక్షి, హైదరాబాద్ : ముషీరాబాద్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. గతంలో గాంధీ నగర్లో భారీ మెజారిటీలతో పార్టీని గెలిపించారని, మరోసారి గెలిపించాలని అభ్యర్థించారు. గాంధీనగర్ డివిజన్ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అనేక అనుమానాల మధ్యలో రాష్ట్రంలో పాలన ప్రారంభించామన్నారు. కరెంట్ సమస్యను కేవలం ఆరు నెలల్లో పరిష్కారం అయ్యేలా చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీలో 67 వేల కోట్ల రూపాయలతో పనులు చేశామని, ఒక ఆలోచనతో పాలన ముందుకు సాగిస్తున్నామన్నారు. ‘ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తోంది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందడం లేదు. 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ ఎలా ఉందో ఆలోచించుకోవాలి. కానీ కొందరు ఇవాళ హిందూ- ముస్లీం అంటున్నారు. కొన్ని పార్టీల నేతలు హైదరాబాద్‌కు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు. వరద సాయం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడిగితే లేఖ రాలేదని సమాధానం వచ్చింది. కానీ హోంశాఖ నుంచి పలు రాష్ట్రాలకు సాయం అందింది. పేద వర్గాలు ఆకలి కోసం ఇబ్బందులు పడొద్దని రేషన్ పెంచి ఇచ్చాం. బీజేపీ మాటలు నమ్మితే మనమే ఇబ్బందులు పడుతున్నాం. కార్పొరేటర్ మీద కోపం ఉండొచ్చు కానీ కేసీఆర్‌ను చూసి గెలిపించాలి. టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తుంది. బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అని ఓటు అడుగుతున్నారు’ అని కవిత పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. హైకోర్టు ఉద్యోగి మృతి
-
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వ్యక్తి మృతి
హైదరాబాద్ : నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షాలతో ముషీరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాల ప్రకారం భారీ వర్షాల కారణంగా ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఎదురుగా సికింద్రాబాద్ కోపరేటివ్ బ్యాంకు బుడగల అపార్ట్మెంట్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అయితే ఆ సమయంలో రాజ్‌కుమార్ (54) అనే వ్యక్తి సెల్లార్లోనే చిక్కుకొని ఉండటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈయన హైదరాబాద్ హైకోర్టులో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలికతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత నెల 20న కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్ (3) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 17న జరిగిన మరో ప్రమాదంలో నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోవడంతో ప్రాణాలు విడిచింది. (నీట మునిగిన హైదరాబాద్) -
'20 ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నారు'
సాక్షి, హైదరాబాద్ : ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. తరువుకు కాయ భారమా.. కని పెంచే తండ్రికి బిడ్డ భారమా.. అని కొత్తగా పాడుకోవాల్సి ఉంటుంది ఓ తండ్రి గురించి.. అమ్మ నవ మాసాలు మోసి కనీ.. పెంచీ.. కనిపించే ప్రత్యక్ష దైవమేతే.. నాన్న పిల్లల భారాన్ని మోసే అనురాగమూర్తి. వారి బురువూ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని అన్ని అవసరాలు తీర్చే ప్రేమైక స్ఫూర్తి. ఇదే కోవకు చెందినవారు రాంనగర్‌కు చెందిన బుజ్జి వెంకటేశ్వరరావు. ప్రత్యేక ప్రతిభావంతురాలైన కూతురును కంటిరెప్పలా చూసుకుంటున్నారు ఆయన. తల్లి సపర్యలు చేసినా తానూ బిడ్డకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోలియో బారినపడి నడవలేని అసహాయ స్థితిలో ఉన్న కుమార్తెకు తానే పాదాలై ముందుకు నడిపిస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులు కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో కదల్లేని పరిస్థితి. ఆమెకు 24 ఏళ్లు. కాలు ఇంటి బయట పెట్టాలంటే మరొకరి సపోర్ట్ ఉండాల్సిందే. స్నానంతో పాటు ఇతర అవసరాలన్నీ తల్లి తీరుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు హయత్‌నగర్‌లోని తేజస్విని ఓ స్కూల్లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు రోజూ వదిలివచ్చేవారు. ప్రత్యేకంగా ఆటో కొనుగోలు అందులో తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేవారు. రాంనగర్లో ఇంటర్ చదువుతుప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఆటోలో గేట్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి కూతురును భుజాలపై ఎత్తుకొని వెళ్లి మళ్లీ తీసుకొచ్చేవారు. రెండేళ్లపాటు ఆయన రోజూ ఇలాగే చేశారు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాలో తేజస్విని మూడేళ్ల పాటు డిగ్రీ చదివినప్పుడు ఇదే విధంగా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అనంతరం అదే కళాశాలలో ఆమె పీజీ (ఎంబీఏ) సీటు సంపాదించింది. ఆ రెండు సంవత్సరాలు కూడా తండ్రి అన్ని పనులూ మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించారు. ఇలా 24 ఏళ్లుగా కూతురు సేవకే అంకితమయ్యారు తండ్రి వెంకటేశ్వరరరావు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అయినా అదేమీ పట్టించుకోలేదు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కూతురును తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కస్తూర్బా మహిళా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యం ఆయనను సత్కరించడం విశేషం. నా పూర్వజన్మ సుకృతం.. ‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు నాన్న. నేను ఏదైనా ఉద్యోగం సంపాదిస్తా. నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటా. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ దూరం కావడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉండడంతో వద్దనుకున్నాను. త్వరలో జరగబోయే కామర్స్ పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం, గ్రూప్– 2కి ప్రిపేర్ అవుతున్నాను. వైకల్యంతో ఉన్నానని నేను ఏనాడూ బాధపడలేదు. ఇటువంటి తండ్రి దొరకడం నా పూర్వ జన్మసుకృతం’ అని చెబుతోంది తేజస్విని. -
లష్కర్‌ను వీడుతున్న కరోనా!
సాక్షి, సికింద్రాబాద్ : నిత్యం సందడిగా ఉండే సికింద్రాబాద్(లష్కర్) నగరం కరోనా పుణ్యమా.. అని 60 రోజులుగా మూగబోయింది. వ్యాపారాలు, కార్యాలయాలు మూతబడటం మాట అటుంచితే.. బయటకు వెళ్తే.. ఏమవుతుందోనన్న భయం మాత్రం ఈ ప్రాంత ప్రజలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంటాడింది. లష్కర్లో 26 మందికి కరోనా పాజిటివ్ రాగా, అందులో ముగ్గురు మృతి చెందారు. దీంతో లష్కర్ ప్రజలు పూర్తిగా భయాందోళనలకు గురయ్యారు. కరోనా దాడికి విలవిల్లాడిన లష్కర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా దెబ్బకు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న 13 కాలనీలలో కరోనా తగ్గుముఖంలో ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తి వేస్తున్నారు. దీంతో నివాసాలకే పరిమితమైన కంటైన్మెంట్ ప్రాంతాల ప్రజలు కొంత మేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్లోకి నటుడు) 13 కంటైన్మెంట్లు... సికింద్రాబాద్ నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, శ్రీనివాస్‌నగర్, షాబాద్‌గూడ, కౌసరి మసీదు, బౌద్ధనగర్ అను ఆరు కంటైన్మెంట్ జోన్లలో ఐదింటిని ఎత్తివేశారు. బేగంపేట్ సర్కిల్ పరిధిలోని జీరా, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, రామస్వామి కాంపౌండ్, నల్లగుట్ట, ఈస్ట్ మారేడుపల్లి, పీజీ రోడ్ అను ఎనమిదికి ఎనమిది కంటైన్మెంట్ జోన్లన్నీంటిని ఎత్తేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 14 మందికి, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 12 మందికి కరోనా వైరస్ సోకడంతో వారితో సన్నిహితంగా ఉన్న రెండు సర్కిళ్ల పరిధిలో సుమారు నాలుగు వందల మందికి అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే చికిత్స పొందుతుండగా మిగతా వారంతా డిశ్ఛార్జ్ అయ్యారు. వైరస్ సోకిన వారిలో ముగ్గురు వ్యక్తులు మాత్రం మృతి చెందారు. (కనరో శ్రీవారి దర్శన భాగ్యము) మిగిలింది ఒక్కటే... సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలోని 9 మున్సిపల్ డివిజన్లలో మొత్తంగా ఒక్క కాలనీ మాత్రమే కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 13 కంటైన్మెంట్లను అధికారులు రెండ్రోజుల క్రితమే ఎత్తివేశారు. తాజాగా బౌద్ధనగర్‌లోని ఒకే ఇంటిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో అట్టి కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశారు. నిరంతరం పరీక్షలు... సికింద్రాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఉత్తర మండలం అధికారులు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయడం, పరిశుభ్రంగా ఉంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేందుకు, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. (స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, యూపీహెచ్సీ సిబ్బంది సమన్వయంతో అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా వైరస్ మాత్రం వ్యాపిస్తూనే ఉంది. శనివారం బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో 34 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. ఆదివారం భోలక్‌పూర్ డివిజన్లో నివాసముండే గర్భిణీ (21)కి కరోనా సోకింది. శనివారం వెన్నుపూస నొప్పి రావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో వైద్యులు నమూనాను సేకరించి కరోనా పరీక్షలకు పంపడంతో ఆమెకు పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె నివాసమున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆమె ఉంటున్న ఇంటిలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10 మంది చికిత్స పొంది విజయవంతంగా కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు. -
షాహెద్.. మనసున్న మారాజు!
అతనిది ముషీరాబాద్ ఏక్‌మినార్ మసీదు ఎదుట ఓ చిన్న కూల్ డ్రింక్స్ దుకాణం. ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి సామాజిక కార్యకర్తగా పరిచయం. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయడం అతని వృత్తి అయితే సేవా కార్యక్రమాలు ప్రవృత్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ఏ సాయం కావాలన్నా తనకు తోచిన రీతిలో సహకరిస్తారు. ముషీరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలోనే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలు ఆకలితో చదువు మీద దష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముషీరాబాద్ ఏక్‌మినార్ మసీదు వద్ద ఉండే సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్ చిన్నారుల ఆకలిని చల్లార్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గడచిన ఐదేళ్లుగా క్రమం తప్పకుండా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు మీడియంలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులకు రోజూ స్నాక్స్‌ను అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. అరటిపండ్లు, మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం స్నాక్స్ అందిస్తున్నారు. రోజూ ఒక విద్యార్థికి రూ. 25 చొప్పున ఒక రోజు వంద మందికి రూ. 2,500 40 రోజుల మీద షుమారు లక్ష రూపాయల పరోక్ష సహాయాన్ని అందిస్తున్నారు. షాహెద్ సేవాభావాన్ని పోలీసు, విద్యా శాఖ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు అభినందిస్తున్నారు. సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా నా సహయం కోరితే వారికి నాకు తోచిన సహాయం చేయడం నా బాద్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకో పోయినా కష్ట పడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం నేను సంతోషంగా భావిస్తాను. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు. నాకున్న దాంట్లో నేను ఎంత సహయం చేస్తున్నానో అదే ముఖ్యం.– షాహెద్, సామాజిక కార్యకర్త -
హైదరాబాద్ ముషీరాబాద్‌లో బాంబు కలకలం
-
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి
ముషీరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి మాజీ నేత కె.చంద్రన్న (75) గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్‌లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. యాదాద్రి జిల్లా టంగుటూర్ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టో), జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎది గారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల న్యూడెమోక్రసీ తీవ్ర సంతాపం ప్రకటించింది.