చిక్కడపల్లి (హైదరాబాద్) : చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నగరంలోని ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన అనసూయ(53) మంగళవారం ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆమె రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని ఆరు తులాల పుస్తెల తాడు, గొలుసును తెంపుకుని పార్శీగుట్ట వైపు పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.