బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్‌హెంసీ సర్కిల్‌లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్‌లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు.
ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment