Counseling
-
ఇలాంటి భాగస్వామిని భరించడం కష్టమే!
కవిత హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కుమార్‌తో పెళ్లయి రెండేళ్లవుతోంది. కవిత కలుపుగోలు మనిషి, కుమార్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. దీంతో ‘నీ పని నువ్వు చూసుకోక అందరితో మాట్లాడతావెందుకు?’ అని దెప్పుతుంటాడు. చిన్న చిన్న పనులకు కూడా తప్పు పడుతుండేవాడు. ‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలువు’ అని తరచు అనేవాడు. కొన్నాళ్లకు కవిత కూడా కుమార్ మాటలు నిజమేనేమో అనుకోవడం మొదలుపెట్టింది. ‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే కుమార్ ఎందుకలా అంటాడు’ అని అనుకునేది. తనకేదో సమస్య ఉందనే ఆలోచనలతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. నిరంతరం ఆందోళనగా ఉంటోంది. ఒంటరితనం, భయం, నిస్సహాయత. ఎవరితోనూ మాట్లాడాలనిపించడంలేదు. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్నిరకాల టెస్టులు చేయించుకుంది. శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, ఒకసారి సైకాలజిస్ట్‌ను కలవమని సూచించారు. దాంతో కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన ఇంటి వాతావరణం గురించి, భర్త ప్రవర్తన గురించి వివరంగా చెప్పింది. మెల్లగా మంటపెడతారు... కవిత చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్‌కు గురవుతుందని అర్థమైంది. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి కొందరు చేసే మానిప్యులేషన్‌ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తాము గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్న విషయాన్ని బాధితులు గుర్తించలేరు. అసలా దిశగా ఆలోచించలేరు. అందుకే భర్త మానిప్యులేషన్ గురించి కవితకేం చెప్పలేదు.మూడునెలల్లో పరిష్కారం... మొదట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆందోళన తగ్గించుకునేలా సహాయం అందించాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. తాను గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్నానని అప్పుడు అర్థం చేసుకుంది. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్సైజ్లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను.స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ కవిత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. కుమార్ మాటలను పట్టించుకోవడం మానేసింది. కవిత ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న కుమార్ కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది. గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు» నువ్వు ప్రతిదానికీ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్. » అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. · నీకోసమే అలా చేశాను. » నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?» నేను నీకు చెప్పాను, గుర్తులేదా? » అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. » నీపట్ల నాకెప్పుడూ నెగటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగటివ్ గా చూస్తున్నావ్.మాయ మాటలు నమ్మొద్దు» గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. » గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా, చేసే పనులపై దృష్టి పెట్టాలి. » ‘నీకు పిచ్చి’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. » ‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకు గుర్తుందో అదే నిజమని గుర్తించాలి. »గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్‌కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. » గ్యాస్ లైటర్‌తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. » మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి. -
భయం..అభయం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్షల భయాన్ని, చదువుకు సంబంధించిన ఒత్తిడిని అధిగమించి, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘టెలి మానస్’సత్ఫలితాలనిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో నడుస్తున్న టెలి మానస్‌ను 1382 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. తమలోని ఆందోళన తెలియజేస్తున్నారు. వారి సమస్యలను, ఆందోళనను సావధానంగా వింటున్న టెలి మానస్ సైకాలజిస్టులు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేలా సలహాలు, అనుసరించాల్సిన చిట్కాలు తెలియజేస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు కూడా టెలీ మానస్‌ను ఆశ్రయిస్తుండటం గమనార్హం కాగా.. పిల్లల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కౌన్సెలర్లు వారికి సూచనలిస్తున్నారు. తమ కౌన్సెలింగ్ విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపుతోందని సైకాలజిస్టులు, కౌన్సెలర్లు చెబుతున్నారు. డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఫోన్లు వచ్చినట్లు వివరించారు. అర్ధరాత్రి వేళల్లోనూ కౌన్సెలింగ్మంచి ర్యాంకులురావాలంటూ తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్లతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల తేదీలు సమీపిస్తున్న కొద్దీ వారిని భయం వెంటాడుతోంది. కాలేజీలో చెప్పలేక, ఇంట్లో మాట్లాడలేక దిగులు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే అనేకమంది టెలి మానస్‌ను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిద్రండుల నుంచి ఈ తరహా ఫోన్లు రోజుకు సగటున 20 వరకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌ను 24 గంటలూఅందుబాటులో ఉంచడంతో కొంతమంది అర్ధరాత్రి కూడా ఆందోళన పడుతూ ఫోన్లుచేస్తున్నారని వివరించారు.అన్నీ మర్చిపోయిన ఫీలింగ్ కలుగుతోంది.. టెలి మానస్‌కు వరంగల్ నుంచి ఓ విద్యార్థి ఫోన్ చేశాడు. ‘నేను హైదరాబాద్‌లో ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నా. కాలేజీ పరీక్షల్లో ప్రతిసారీ మంచి మార్కులే వచ్చేవి. కానీ రెండు రోజులుగా భయం వేస్తోంది. నాన్న ఫోన్ చేసి మంచి ర్యాంకు కొడతావ్గా అంటాడు. కాలేజీ వాళ్ళేమో అర్ధరాత్రి కూడా చదవాల్సిందేఅంటున్నారు. పుస్తకం పట్టుకుంటే వణుకు వస్తోంది. అన్నీ మర్చి పోయానేమో అనే ఫీలింగ్ వస్తోంది..’అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అతనికి సైకాలజిస్టు ఒకరు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒత్తిడిని అధిగమించేలా పలు సూచనలిచ్చారు. నిద్ర పట్టడం లేదు..హైదరాబాద్ నుంచి సుమారు 40 రోజుల వ్యవధిలోనే అత్యధిక సంఖ్యలో 68 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో 28 మంది పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్ర పట్టడం లేదని తెలిపారు. 18 మంది పరీక్షలంటే గుబులేస్తోందని చెప్పారు. వీళ్లలో 12 మంది తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మంచి మార్కులు ఎలా వస్తాయో అన్న భయం వెంటాడుతోందని చెప్పారు.ఆరుగురు మానసిక ఒత్తిడితో తలనొప్పి వస్తోందని చెప్పారు. మంచి ఆహారం తీసుకోవాలని, తగినంత సమయం నిద్ర పోవాలని సూచించడంతో పాటు, చదువు విషయంలో వారిని మానసికంగా ధైర్య పరిచేలాకౌన్సెలింగ్ ఇచ్చారు.భయం భయంగా ఉంటున్నారు..ఖమ్మంలోని ఓ గురుకుల ఉపాధ్యాయుడు ఫోన్ చేసి.. ‘బాగా చదివే నలుగురు విద్యార్థులు ఎందుకో మూడు రోజులుగా భయం భయంగా ఉంటున్నారు. గుచ్చి గుచ్చి అడిగితే పరీక్షలంటే కంగారుగా ఉందని చెప్పారు..’అని వివరించారు. దీంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పట్నుంచి వారు కాస్త ధైర్యంగా ఉన్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి పది మంది విద్యార్థులు పరీక్ష రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హాల్ టికెట్ల గురించి అడిగారు. మరో ఆరుగురు ఫెయిల్ అవుతామనే భయం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ తర్వాత వారిలో ధైర్యం కన్పించిందని టెలి మానస్ సిబ్బంది చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ జిల్లాల నుంచి 12 ఫోన్ కాల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. పిల్లలు పరీక్షలంటే భయపడుతున్నారని, వాళ్ళను ఏ విధంగా సన్నద్ధం చేయాలో చెప్పమని అడిగారు. ఆహారం, నిద్ర, తాగునీరు విషయంలో జాగ్రత్తలపై ఆరా తీశారు. చదవడం కన్నా రాయడం మంచిదితల్లిదండ్రులు, కాలేజీలు విద్యార్థులపై మార్కులు,ర్యాంకుల కోసం ఒత్తిడి చేయొద్దు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. రాత్రి నిద్ర సరిగా పోకుండా చదివితే ఉపయోగం లేదు. ఉదయాన్నే లేచి రివిజన్ చేసుకుంటే బెటర్. బాగా చదివిన సబ్జెక్టులు, చాప్టర్స్‌పై దృష్టి పెట్టాలి. టెన్షన్ తెప్పించే వాటిని సమయాన్ని బట్టి చూసుకోవడం మంచిది. పరీక్ష భయం ఉన్న వారు చదవడం కన్నా..సమాధానాలు ఒకటికి రెండుసార్లు రాయడం మంచిది. దీనివల్ల పరీక్ష తేలికగా రాసే వీలుంది. సబ్జెక్టులో ఇబ్బంది ఉంటే ఆందోళన చెందకుండా సంబంధిత లెక్చరర్‌ను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇళ్లలో టీవీలు, సెల్ఫోన్లకు విద్యార్థులే కాదు..తల్లిదండ్రులూ దూరంగా ఉండాలి. దీనివల్ల మానసికంగా చదివే కమాండ్ వస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థి ఆందోళన గుర్తించాలి. బంధువులు, పరిచయస్తులతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పించాలి. పరీక్షల సమయంలో ఆహారం, మంచినీరు చాలా ముఖ్యం. మంచి పౌష్టికాహారంతో పాటు, సమయ పాలన అనుసరించాలి. మెదడుకు 80 శాతం, ఇతర శరీర భాగాలకు 20 శాతం ఆక్సిజన్ అవసరం. ఇదినీళ్ళ ద్వారానే ఎక్కువగా సమకూరుతుంది.ఉదయం వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరంచేసుకోవచ్చు.- పి.జవహర్లాల్ నెహ్రూ సీనియర్ సైకాలజిస్టు, టెలి మానస్ -
అగ్రిసెట్ ద్వారా స్పోర్ట్స్ కోటా, మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రిసెట్ 2024 ర్యాంకు ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలకు మిగిలిన సీట్ల భర్తీకి, స్పోర్ట్స్ కోటాలో సీట్ల భర్తీకి ఫైనల్ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ డాక్టర్ రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లాంఫాంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
మెడికల్ కౌన్సెలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి..
గుంటూరు మెడికల్ : పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, దీని ద్వారా వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పీజీ వైద్య విద్యార్థిని తండ్రి, గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఎదుట ఆయన ఈ విధంగా మొరపెట్టుకున్నారు. మొదటి కౌన్సెలింగ్ సమయంలో ఒక ఆర్డర్, రెండో కౌన్సెలింగ్ సమయంలో మరో ఆర్డర్ ఇచ్చారని, ఇప్పుడు మూడో కౌన్సెలింగ్‌కు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆలిండియా కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, అది ప్రారంభమయ్యాకే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఫ్రీ ఎగ్జిట్‌కు శుక్రవారం నుంచి సోమవారం ఉదయం వరకు అవకాశం ఇచ్చారని, సోమవారం క్లోజ్ చేయడం వల్ల ఆలిండియా కోటాలో ఏపీ వైద్య విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ పీజీ కోటా వారికి మేలు జరిగేలా హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించారు. మొదటి కౌన్సెలింగ్ అయ్యాక, కోర్టు తీర్పు వల్ల జీవో 56ను కొట్టేశారని, దీని ద్వారా వైద్య విద్యార్థుల ఫీజులు పెరిగాయన్నారు. కోర్టు తీర్పు కారణంగా పీజీ వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.కోర్టు తీర్పు వల్ల గందరగోళం అనంతరం పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియపై మీడియా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించగా.. కోర్టు తీర్పు వల్ల ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. అన్ని ఆలోచించి విద్యార్థులకు ఏది లాభమో అదే చేస్తామని తెలిపారు. స్పెషలిస్టులు 75 శాతం, ఇతర వైద్యులు, వైద్య సిబ్బందిలో 80 శాతం కొరత ఉందని, ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. -
అడ్వాన్స్డ్ తర్వాతే కౌన్సెలింగ్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాతే ఈసారి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో స్థానిక కౌన్సెలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. జోసా కౌన్సెలింగ్ సాధారణంగా ఆరు రౌండ్ల వరకూ ఉంటుంది. అయితే 2025లో దీన్ని కుదించే ఆలోచన చేస్తున్నారు. నాలుగు రౌండ్లలోనే పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ దశల కౌన్సెలింగ్ వల్ల కూడా విద్యార్థులు ఆప్షన్ల ఎంపిక, అంతర్గత స్లైడింగ్ విధానంలో ఇబ్బంది పడుతున్నట్టు గత రెండేళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక అడ్వాన్స్డ్ పరీక్ష విధానాన్ని కూడా కొంత సరళీకరించాలనే యోచనలో ఉన్నారు. అత్యంత కఠినం, కఠినం, సాధారణ ప్రశ్నల్లో.. అత్యంత కఠినం స్థాయిని కొంతమేర తగ్గించాలని భావిస్తున్నారు.సర్వర్ సమస్యకు చెక్జేఈఈ మెయిన్స్ తొలి దశ జనవరి 22 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది మెయిన్స్‌కు హాజరవుతారు. అయితే ఏటా ఎక్కడో ఒకచోట అడ్మిట్ కార్డులు సరిగా డౌన్లోడ్ అవ్వడం లేదు. దీనికి సర్వర్ సమస్య కారణమని గుర్తించడంతో, ఈసారి కొత్త సాఫ్‌్టవేర్‌ను అనుసంధానం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మెయిన్స్‌లో మెరిట్ సాధించిన విద్యార్థుల్లో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు.రాష్ట్రంలో 13 కేంద్రాల్లో పరీక్షజేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో జరుగుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి కేంద్రాలను ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఏపీలో కూడా పలు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఆయా కేంద్రాలను జనవరిలో కాన్పూర్ ఐఐటీ అధికారులు పరిశీలిస్తారు. మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాత 22న అభ్యర్ధుల ఓఎంఆర్ పత్రాలు వెబ్‌లో ఉంచుతారు. 26వ తేదీన ప్రాథమిక కీ విడు దల చేస్తారు. 26–27 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో మే 25లోగా జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జోసా కౌన్సెలింగ్ చివరి రౌండ్‌ను బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చివరి రౌండ్ ఉంటుంది. -
పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్‌హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పీజీ మెడికల్ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై విద్యార్థులు కోర్టుకు ఎక్కడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోర్టు కేసు తేలాకే ప్రవేశాలుంటాయని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతుండటంతో వివాదం నెలకొంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికులే అవుతారని వర్సిటీ పేర్కొంది. ఈ విధానం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వారు ఎక్కడా స్థానికులు కాని పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో టాప్ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. అలా జాతీయ విద్యాసంస్థల్లో చదివిన వారు రాష్ట్రంలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. ఇక కౌన్సెలింగ్ తరువాయి అనగా.. ఈ ఏడాది పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలాఖరున 2024–25 సంవత్సరానికి కనీ్వనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. నీట్ పీజీ–2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి గత నెల 31 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ‘స్థానికత’నిబంధనపై అభ్యర్థులు కోర్టుకు ఎక్కడంతో నిలిచిపోయింది. కోర్టు కేసు తేలాకే తదుపరి ప్రక్రియ జరుగుతుందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాప్యం కేవలం ప్రవేశాలు పొందే విద్యార్థులకే కాకుండా... ప్రస్తుతం మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. జూనియర్లు ప్రవేశాలు పొందితే తప్ప వారు అక్కడ్నుంచి రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 50% జాతీయ కోటాతోనూ అన్యాయం! స్థానిక కోటాతోపాటు తెలంగాణ విద్యార్థులకు నేషనల్ పూల్ కింద జాతీయ స్థాయికి వెళ్లే సీట్లలోనూ అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వాసులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో జాతీయ కోటా కిందకు దాదాపు 600 సీట్లు వెళ్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను జాతీయ కోటా నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ ఎక్కువగా అవకాశం పొందుతున్నారని వారంటున్నారు. ఎంబీబీఎస్‌లో నేషనల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో మాత్రం ఏకంగా సగం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ కోటాలో నింపే మన రాష్ట్రంలోని 600 పీజీ మెడికల్ సీట్లలో దాదాపు 300 ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ వర్గాలు సైతం చెబుతున్నాయి. -
కన్వినర్ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వినర్, బీ కేట గిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లను భర్తీ చేశారు. ఎని మిది మేనేజ్మెంట్ సీట్లు మినహా అన్నింటి లోనూ విద్యార్థులు చేరిపోయారు. ఎనిమిది మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఆరు బీ కేటగిరీ, రెండు ఎన్ఆర్ఐ కోటా సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల భర్తీ లిస్టును విడుదల చేసింది. మిగిలిన 8 సీట్ల కు అన్ని దశల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అందుకు అనుమతి కోరి నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాకుంటే అవి మిగిలిపోతాయని అధికారులు వెల్లడించారు. కాగా, కన్వినర్ కోటాలో గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఈసారి సీట్లు దక్కాయి. బీసీ ఏ కేటగిరీలో గరిష్టంగా 3.36 లక్షల నీట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. తుది జాబితా అనంతరం వర్సిటీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి ప్రైవేట్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.93 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ బీలో 2.29 లక్షలు, బీసీ సీలో 3.15 లక్షలు, బీసీ డీలో 2.14 లక్షలు, బీసీఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఓపెన్ కేటగిరీలో 1.98 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గరిష్టంగా 1.80 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. మేనేజ్మెంట్ కోటాలో 13.90 లక్షల ర్యాంకుకు సీటు రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ) కోటాలో గరిష్టంగా 13.90 లక్షల నీట్ ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే బీ కేటగిరీలో గరిష్టంగా 5.36 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చిందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీ, సీ కేటగిరీలో తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి జాబితాను వర్సిటీ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కన్వినర్ కోటాలో అధిక ర్యాంకర్లకు సీట్లు రాగా, మేనేజ్మెంట్ కోటా సీట్లలో మాత్రం గత ఏడాదికి అటుఇటుగా ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈసారి రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డికి చెందిన రెండు కాలేజీల సీట్లు ఈసారి డీమ్డ్ సీట్లుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లోని సీట్లు రాష్ట్రానికి తగ్గాయి. కాగా, ఈసారి ఒక కొత్త కాలేజీ వచ్చింది. ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలు పెరగడంతో 400 కన్వినర్ కోటా సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కిందకు వెళ్తాయి. అయితే వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు భర్తీ కాకపోతే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు -
తెల్లకోటు కలలు ఛిద్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో మన రాష్ట్రంలో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. డాక్టర్ కావాలని కలలుగని రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అనేకమంది తెల్లకోటు కలలు ఛిద్రమయ్యాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఈ ఏడాది అనుమతులను అడ్డుకోవడంతో పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నీట్ యూజీలో మంచి స్కోర్ సాధించినా.. ఓసీలతో పాటు బీసీ, ఎస్సీ విద్యార్థులకూ సీటు దక్కలేదు. మూడోరౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తరువాత పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో జనరల్ విభాగంలో 502 మార్కుల వరకు ప్రభుత్వ కోటా సీటు లభించింది. అదే మన రాష్ట్రంలో ఏయూ రీజియన్‌లో 513 మార్కుల (1,85,817 ర్యాంకు) వద్దే ఎస్సీ విభాగంలో సీట్ల కేటాయింపు నిలిచిపోయింది.ఇదే ఎస్సీ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో 433 మార్కుల వరకు సీట్లు దక్కాయి. అంటే మన దగ్గర కంటే 80 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీట్లతో ఎంబీబీఎస్ పూర్తిచేసే అదృష్టం లభించింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే అత్యధికంగా బీసీ–ఏ విభాగంలో మన విద్యార్థులు 146 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ప్రభుత్వ సీటు లభించలేదు. మంజూరైన సీట్లనూ వద్దన్న బాబు సర్కారు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరుల్లో ఒక్కోచోట 150 సీట్లతో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు రాబట్టలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఒక్క పాడేరు వైద్యకళాశాలకు మాత్రం కేవలం 50 సీట్లు దక్కాయి. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరైనా మాకొద్దని ఎన్ఎంసీకి ప్రభుత్వమే లేఖరాసి రద్దుచేయించింది. ప్రభుత్వ తీరుతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఈ కారణంగా మన విద్యార్థులకు జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్లు పెరగకపోవడంతో 500 నుంచి 560 వరకు స్కోర్ చేసిన బీసీ, ఎస్సీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు లభించలేదు. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ.లక్షలు వెచ్చించి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నర్సింగ్, వెటర్నరీ, బీడీఎస్ వంటి ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాది రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయన్న నమ్మకంలేదని వారు చెబుతున్నారు. ప్రభుత్వమే మా తెల్లకోటు కలను ఛిద్రం చేసిందని బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడో విడత కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించింది. విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఆదేశించారు. గడువులోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయడం కోసం ఆదివారం కూడా పనిదినంగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌కు సూచించారు.ప్రిన్సిపల్స్ బదిలీ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం కోసం కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు, వాటి బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా నిరి్మంచిన ఐదు వైద్య కళాశాలలు ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే కొత్త కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం వీటిలో సీట్ల కేటాయింపులను అడ్డుకుంది. ఇప్పుడు ఆ బోధనాస్పత్రుల స్థాయిని తగ్గిస్తోంది. డీఎంఈ నుంచి సెకండరీ హెల్త్‌కు ఆస్పత్రులను అప్పగించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ పని చేసే వైద్యులను పాత కళాశాలలు, బోధనాస్పత్రులకు సర్దుబాటు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రిన్సిపళ్లను, సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. -
ఇంకెన్ని రోజులు?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నత్తతో పోటీ పడుతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా మూడో దశ సీట్ల కేటాయింపు నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీకన్నా ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో సైతం మూడో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా గత సోమవారం సీట్లను కేటాయించారు. ఆల్ ఇండియా కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయి మాప్ అప్ రౌండ్ ప్రారంభం కానుంది. అయితే.. ఏపీలో మాత్రం ఇంకా సీట్లు కేటాయించలేదు. ఒకవైపు తరగతులు ప్రారంభమయ్యాయి. మరోవైపు మూడో రౌండ్లో సీటు వస్తుందో లేదో నిర్ధారించుకుని లాంగ్‌టర్మ్ కోచింగ్ వెళ్లడం, లేదంటే ప్రత్యామ్నాయంగా వెటర్నరీ, ఆయుష్, బీడీఎస్ కోర్సులకు వెళ్లాలని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు.ఇప్పటికే బీడీఎస్ మొదటి విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఆయుష్ కోర్సులకు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. కౌన్సెలింగ్ కూడా మొదలు కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకాక విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోయారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త కళాశాలలు ప్రారంభమై పోటీకి తగ్గట్టుగా సీట్లు పెరగడంతో కటాఫ్ గణనీయంగా తగ్గాయి. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో 150 మార్కుల మేర కటాఫ్ ఎక్కువగా ఉంటోంది. -
TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు(మంగళవారం) జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతిత తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే.. డాటా రానందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రేపు(బుధవారం) కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ సీట్ సాధించాలన్న లక్ష్యంతో ఏపీలో వేలాది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి 500 నుంచి 600 మార్కులు తెచ్చుకున్నా చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కొత్త కళాశాలలు రాకుండా, సీట్లు పెరగకుండా అడ్డుపడి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.దీంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకంటే మన పిల్లలు 150 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా ఎంబీబీఎస్ సీటు దక్కక మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లను అక్కడి ప్రభుత్వం పెంచడంతో బీసీ–ఏ విభాగంలో రెండో దశ కౌన్సెలింగ్ ముగిసే సమయానికి 420 స్కోర్ చేసిన వారికి కూడా ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా సీట్ దక్కింది. అదే ఏపీలో 568 మార్కుల వద్దే ఆగిపోయింది. అంటే అక్కడితో పోలిస్తే ఏపీలో కటాఫ్ 148 మార్కులు ఎక్కువ. బీసీ–సీ విభాగంలో 142, బీసీ–డీలో 103, ఓసీల్లో 101 చొప్పున తెలంగాణకంటే ఏపీలో కటాఫ్ ఎక్కువగా ఉంది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం కోసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది. పులివెందుల కళాశాలకు అనుమతులు వచ్చి సీట్లు మంజూరైనా.. ఆ సీట్లు వద్దంటూ ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారు. బాబు ప్రభుత్వం చేసిన ఆ పాపం విద్యార్థులకు శాపంగా మారింది.14 వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం ఎంబీబీఎస్ కన్వినర్ కోటా సీట్లలో 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ పొందిన విద్యార్థులకు ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం కల్పించారు. తొలి 2 కౌన్సెలింగ్‌ల్లో సీట్ పొంది, కళాశాలల్లో రిపోర్ట్ చేసిన విద్యార్థులు గడువు లోగా ఎగ్జిట్ అవ్వవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఎగ్జిట్ అయిన వారిని తదుపరి కన్వినర్ కోటా కౌన్సెలింగ్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. కేవలం యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు అనుమతిస్తామని తెలిపారు. -
నేడు ఆర్డబ్ల్యూఎస్ జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్
కర్నూలు (అర్బన్): గ్రామీణ నీటి సరఫరా విభాగం జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలులోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ బి.నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రీదేవి పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏఈఈ/ఏఈ, డీఈఈలు వస్తారని, ఏఈఈ/ఏఈలకు సంబంధించి 84 ఖాళీలు ఉండగా, 114 స్థానాలు ఖాళీ ఏర్పడబోతున్నాయని వివరించారు. డీఈఈలకు 11 స్థానాలు క్లియర్ వేకెన్సీ కాగా, మరో 11 స్థానాలు ఖాళీ కాబోతున్నాయన్నారు. బదిలీలకు అర్హులైన వారితో పాటు పలు కారణాలతో రిక్వెస్ట్ కోరుతూ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని నోటీస్ బోర్డులో ఖాళీలు, భర్తీ అయిన స్థానాల వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. -
31న ఎడ్‌సెట్, పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ ఈనెల 31న విడుదల కానుంది.శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్‌పై అధికారులు చర్చించారు.. వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్లను 31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి షెడ్యూల్, ఇతర సమాచారాన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. -
సీటొచ్చే ఆప్షనేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఏవైనా మార్పులు చేర్పులకు చివరి అవకాశం ఇదే. కనీ్వనర్ కోటాలో 71వేల సీట్లు ఉండగా, ఇప్పటివరకూ కౌన్సెలింగ్‌కు దాదాపు 98,238 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 82 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. గత రెండు రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు సోమవారం ఆప్షన్లు ఇచ్చే వీలుంది.మొత్తం మీద 90వేల మందికిపైగా విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకూ దాదాపు 46 లక్షలకుపైగా ఆప్షన్లు అందినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఒక్కో విద్యార్థి బ్రాంచీలు, కాలేజీలతో వందకుపైగానే ఆప్షన్లు ఇస్తున్నారు. కౌన్సెలింగ్‌కు కొత్తగా సీట్లు వస్తాయని ఆశించినా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కని్పంచడం లేదు. తాజాగా జేఎన్టీయూహెచ్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను తగ్గించడానికి తాము అంగీకరించడం లేదని చెప్పారు. దీన్నిబట్టి ఐవోటీ వంటి బ్రాంచీలను రద్దు చేసుకున్న వారికి మాత్రమే అదనపు సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడే కీలకం విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలని సూచిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో వచ్చే సీట్లలో ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుంది. కేవలం జేఈఈ టాపర్లు మాత్రమే దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్లు కూడా ఆఖరి కౌన్సెలింగ్ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సీటును రద్దు చేసుకోరు. కాబట్టి మొదటి కౌన్సెలింగ్‌లో కాకపోయినా రెండో విడతలో కోరుకున్న సీటు వస్తుందనే ఆశ సరికాదని చెబుతున్నారు.చాలామంది తమ ర్యాంకును బట్టి, ఏయే కాలేజీలో ఏయే బ్రాంచీలో సీటొస్తుందో ఓ అంచనాకు రావాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఐటీలో తమకు దగ్గర్లోని కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ప్రా«ధాన్యతల్లో చేర్చడం లేదు. దీనివల్ల ఆ సీటు వేరే వాళ్లకు వెళ్తుంది. తర్వాత కౌన్సెలింగ్‌ల్లో కోరుకున్నా సీటు వచ్చే అవకాశం ఉండదు. కసరత్తు చేయాలి: ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణుడు) ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు ఆఖరి నిమిషం వరకూ కసరత్తు చేయాలి. అవసరం అనుకుంటే ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ర్యాంకుకు దగ్గరగా ఉండే కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. ఏ ర్యాంకు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనేది పరిశీలించాలి. తొలి విడత ఆప్షన్లు చాలా కీలకమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. అన్ని వివరాలు పరిశీలించాలి... గత ఏడాది ప్రతీ కాలేజీలో కటాఫ్ ఏ విధంగా ఉందనే వివరాలను సాంకేతిక విద్య విభాగం వెబ్సైట్లో ఉంచింది. 2023–24లో 86,671 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 70 శాతం భర్తీ చేయాలి. కానీ 81 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి స్లైడింగ్ సీట్లు పెరిగినా 10 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది కన్నా కొంత అటూ ఇటూగా కటాఫ్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు అంటున్నారు. బ్రాంచీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, కాలేజీ విషయాన్ని రెండో ఐచి్ఛకంగా చూడటం ఉత్తమం. కాలేజీ ప్రాధాన్యత అనుకుంటే ఏ బ్రాంచీలో సీటు వస్తుందనేది అంచనా వేసి ఆప్షన్ పెట్టడం మంచిది. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కాలేజీల ఫీజు, రీయింబర్స్మెంట్ వివరాలు, దగ్గర్లో ఉన్న కాలేజీ ఏంటి? అనే వివరాలను పరిశీలించి ఆప్షన్లు ఇవ్వడం మంచిదని నిపుణులు అంటున్నారు. -
జోసా కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)లలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. 10 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది.17 వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు రౌండల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 23 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో మొత్తం 57,152 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు జోసా సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. గణనీయంగా పెరిగిన సీట్లు.. గత ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో గణనీయంగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, ఉపాధి అవకాశాలతో ఇంజనీరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. అయితే 2019 ముందు వరకు అత్యున్నత ప్రమాణాలతో నడిచే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టు సీట్ల సంఖ్య ఉండేది కాదు. దీంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లిపోయేవారు.దీన్ని నివారించడానికి 2024 నాటికి ఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు వాటిలో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల సంఖ్యను పెంచింది. అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఈ సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. 5 ఏళ్లలో 18 వేలకు పైగా సీట్ల పెంపుఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా కేంద్రం పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477, 2023లో 57,152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఆయా విద్యా సంస్థల్లో మహిళలకు 20 శాతం సూపర్ న్యూమరరీ కోటాతో సీట్లు కేటాయించుకునే వీలును కేంద్రం కల్పించింది.కౌన్సెలింగ్‌కు మొత్తం 121 విద్యా సంస్థలు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరి, ఏప్రిల్ సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అందులో టాపర్లుగా నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఈ నెల 9న అడ్వాన్స్డ్ తుది ఫలితాలను విడుదల చేయనుంది. అనంతరం 10 నుంచి నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభించనుంది. మొత్తం 121 విద్యా సంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐల్లో జోసా ప్రవేశాలు కల్పిస్తుంది. ఆయా విద్యా సంస్థల్లో సీట్లు మిగిలిపోతే జూలై 17 నుంచి వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టనుంది.జోసా కౌన్సెలింగ్ తేదీలు.. ⇒ జూన్ 18న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక⇒ జూన్ 20న మొదటి విడత సీట్ల కేటాయింపు⇒ జూన్ 27న రెండో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 4న మూడో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 10న నాలుగో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 17న ఐదో విడత సీట్ల కేటాయింపు -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్‌గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్‌నగర్, హుమాయన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
12లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకు జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌లో.. ఎన్నారై కోటా (సీ కేటగిరీ)లో గరిష్టంగా 12 లక్షల నీట్ ర్యాంకర్ వరకు సీట్లు లభించాయి. అదే బీ కేటగిరీలో 5.39 లక్షల ర్యాంకర్ వరకు సీట్లు వచ్చాయి. తదుపరి జరగనున్న రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఈ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఎంబీబీఎస్ బీ, సీ కేటగిరీల తొలివిడత కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ గురువారం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించిన సంగతి తెలిసిందే. కన్వీనర్ కోటాకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. అందులో రిజర్వేషన్ కేటగిరీల్లో ఇంకా పెద్ద ర్యాంకుకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నారై సీట్లపై అనాసక్తి.. రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది. ఇలా అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్ పెట్టుకున్నారు. చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాయని వైద్యవిద్య వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి. నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు షురూ 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు శుక్రవారం (సెపె్టంబర్ 1) నుంచి ప్రారంభం అవుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. పీజీ మెడికల్ తరగతులు ఈ నెల ఐదో తేదీ నుంచి మొదలవుతాయని తెలిపింది. ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీలలో కన్వినర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలకు తొలి విడత కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో తరగతులు ప్రారంభించాలని ఎన్ఎంసీ ఆదేశించిన నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్లలోని ఈ కాలేజీల్లోనూ శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. -
AP: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
సాక్షి, నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2023–29 సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు గాను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,,400 సీట్లు ఉండగా, ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించామని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 20, 21వ తేదీల్లో, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 21, 22వ తేదీల్లో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 24, 25వ తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులందరూ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆయా సెంటర్లకు హాజరు కావాలన్నారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సరి్టఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారని, సీటు పొందిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, మిగిలిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇది కూడా చదవండి: కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్లు! కారణమిదే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకపోవడమే కాదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. టాప్–200లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ జోలికి వెళ్లలేదు. 300లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50వేల నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకులు వచ్చినవారే ఎక్కువగా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర ఎంసెట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వారు ఈ నెల 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంది. సాధారణంగా ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తుంటారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. అందుకే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఈ నెల 12లోపు ఆప్షన్లు ఇవ్వకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. 42వేల కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లను చేర్చారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్న సీట్లలో ఏకంగా 42,087 వరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇటీవలే.. సీఎస్సీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచారు. -
14 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈసెట్–2023 కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసెట్‌లో అర్హత సాధించినవారు ఈ నెల 14 నుంచి 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నారు. 22న అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. 25న సీట్లు కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు 25 నుంచి 30లోగా ఆయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 14 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, పాలిటెక్నిక్ డిప్లొమా మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్, ఏడో తరగతి నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2020 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, రిజర్వుడ్ అభ్యర్థులు.. అందుకు తగిన పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా ఈ ఏడాది 38,181 మంది ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 34,503 మంది పరీక్ష రాశారన్నారు. ఇందులో 31,933 (92.55 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. మరిన్ని వివరాలకు 7995681678, 7995865456, 9177927677 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. -
సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాల నోటిఫికేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ముగిసింది. దరఖాస్తు గడు వు పెంచినా ఈ ఏడాది ఆన్లైన్లో ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదు. ఈ ఏడాది 1,404 జనరల్ సీట్లు, 96 ప్రత్యేక సీట్లు, 105 గ్లోబల్ సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 1,605 సీట్లకుగాను కేవలం 13,538 దరఖాస్తులు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ తెలిపారు. జూలై 3న మెరిట్జాబితాను విడుదలచేసి ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగ్గిన దరఖాస్తులు: నాలుగేళ్లుగా 20 వేలకుపైగానే ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తులు రాగా, ఈ ఏడాది సగానికి తగ్గిపోయాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు కోసం వేలాదిమంది పోటీపడేవారు. ప్రారంభం నుంచే ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండేది. ఈ ఏడాది అనుకోని విధంగా దరఖాస్తులు తగ్గిపోయాయి. వరుస ఘటనలే కారణమా.. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ దర ఖాస్తుల నోటిఫికేషన్ వెలు వడిన సమయంలోనే ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు అంతగా ఆసక్తి కనబరచడంలేదు. నిబంధనలపేరిట ట్రిపుల్‌ఐటీని రహస్య క్యాంపస్‌గా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశీలన వేగవంతం బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల చదువు కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. దరఖాస్తుల ప్రక్రియ వేగవంతంచేసేందుకు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తికానుంది. – ప్రొఫెసర్ వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
119 మార్కులకు టాప్ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మిత్తల్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 119తో టాప్ ర్యాంక్ ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అదే జిల్లాకు చెందిన షేక్ సిద్ధిక్ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్ కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్ 120కి 116 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించాడు. ఆకాశ్ తండ్రి చీర్ల రమేశ్ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్ తెలిపాడు. తొలి విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు ♦ సరి్టఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16 నుంచి 19 వరకు ♦ వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 21 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూన్ 21 ♦ సీట్ల కేటాయింపు జూన్ 25 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్: జూలై 1 ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 2 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 3 ♦ సీట్ల కేటాయింపు జూలై 7 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి 10 వరకు. స్పాట్ అడ్మిషన్లు.. ♦ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 ♦ ఫీజు చెల్లింపు జూలై 8, 9 ♦ ర్యాంక్ జనరేషన్ జూలై 10 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 11 ♦ సీట్ల కేటాయింపు జూలై 14 ♦ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 14 నుంచి 15 వరకు ♦ కాలేజీల్లో రిపోర్ట్ చేయడం జూలై 15, స్పాట్ అడ్మిషన్లు పూర్తి జూలై 17 -
విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం
సాక్షి, అమరావతి: విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచిస్తోంది. ఇందులో భాగంగా కళాశాలలు, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థి సేవాకేంద్రాలను (ఎస్ఎస్సీలను) ఏర్పాటు చేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. తాజాగా విద్యార్థుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించనుంది. అనంతరం విద్యార్థులకు మేలు చేసేలా కమిటీ సిఫారసులను ఎస్‌ఎస్‌సీల ద్వారా అమలు చేయాలని యోచిస్తోంది. సంపూర్ణ సహకారం అందించేలా.. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సామాజిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని వారి భావోద్వేగాలను పరస్పరం గౌరవించేలా ఎస్ఎస్సీలు పనిచేస్తాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని అధిగమించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఆరోగ్య సలహాదారులు, శారీరక, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచుతారు. ఈ మేరకు కళాశాలలకు సమీపంలోని అంకితభావం కలిగిన మానసిక వైద్యనిపుణులతో పాటు ప్రఖ్యాత వైద్యసంస్థలు ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్–నిమ్హాన్స్)తో ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఆయా కళాశాలల్లోని సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల నిపుణుల సేవలను ప్రాజెక్టు డ్రివెన్మోడ్లో వినియోగించుకోవాలని పేర్కొంది. సింగిల్‌విండో సేవలు సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైకియాట్రీ, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాల్లో అనుభవం గడించిన ప్రొఫెసర్లు విద్యార్థి సేవాకేంద్రాన్ని డైరెక్టర్/డీన్ హోదాలో నిర్వహించనున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్, వ్యక్తిగతంగా, టెలిఫోన్, గ్రూప్ కాలింగ్ కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యసేవలను అందించనున్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడంతోపాటు డ్రాపౌట్ రేట్లను తగ్గించే లక్ష్యంతో సింగిల్‌విండో పద్ధతిలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విద్యార్థుల్లో ఫిట్నెస్ సామర్థ్యాన్ని పెంచడానికి జిమ్‌లు, యోగా సెంటర్లు నిర్వహించడంతోపాటు ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. -
భారతీయులకు శుభవార్త.. ఈ ఏడాది పది లక్షల అమెరికా వీసాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ శుభవార్త. ఈ ఏడాది దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు 4 కాన్సుల్ జనరల్ ఆఫీసుల ద్వారా పది లక్షల కంటే ఎక్కువ వీసాలు జారీ చేయనున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ కాన్సుల్ జనరల్ కార్యాలయంలోనూ తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఇటీవల ప్రారంభించిన అమెరికన్ కాన్సుల్ జనరల్ కొత్త కార్యాలయంలో జెన్నిఫర్ లార్సన్ ఇతర అధికారులతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ కారణంగా మందగించిన వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. విద్యార్థి వీసాల జారీకి ప్రాధాన్యమిస్తున్నామని, సకాలంలో వారు కోర్సుల్లో చేరేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీసాల జారీకి ఓవర్‌టైమ్: హైదరాబాద్ కార్యాలయంలో వీసా అధికారులను గణనీయంగా పెంచినట్లు కాన్సులర్ వ్యవహారాల చీఫ్ రెబెకా డ్రామే తెలిపారు. తాత్కాలిక కాన్సుల్ జనరల్ కార్యాలయం పైగా ప్యాలెస్‌లో ఉన్నప్పుడు ఒక్క రోజులో గరిష్టంగా 1,100 వీసాలు/ఇతర లావాదేవీలు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండగా, కొత్త కార్యాలయంలో ఈ సామర్థ్యం 3,500 వరకూ ఉంటుందన్నారు. పైగా ప్యాలెస్ కార్యాలయంలో 16 కౌన్సిలర్ విండోస్ ఉండగా, కొత్త కార్యాలయంలో 54 ఉన్నాయని తెలిపారు. వీసాల్లో మార్పులు చేసుకునేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డ్రాప్‌బాక్స్ సౌకర్యాన్ని కూడా మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి వీసాలపై మాట్లాడుతూ.. అమెరికాలో విద్యాభ్యాసానికి తొలిసారి దరఖాస్తు చేసుకున్న వారికి పాఠాలు మొదలయ్యే సమయానికి అక్కడ ఉండేలా చూసేందుకు ప్రయతి్నస్తామని వివరించారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో వీసాల జారీకి అధికారులతో ఓవర్‌టైమ్ చేయించేందుకూ ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు లభించాయన్నారు. అలాగే వచ్చే వారం రెండు రోజులపాటు అదనపు వీసాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ అమెరికాలో విద్యనభ్యసించే విద్యార్థులు తగిన కోర్సు, విద్యాసంస్థలను ఎంచుకునేందుకు అమెరికన్ కాన్సుల్ జనరల్ కార్యాలయం సహాయ సహకారాలు అందిస్తోందని పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ తెలిపారు. యూఎస్–ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని వై–యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో ఎడ్యుకేషన్ యూ ఎస్ఏ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆసక్తి, అర్హతల ఆధారంగా అమెరికాలోని మొత్తం 4,500 విద్యాసంస్థల్లో తగిన దాన్ని ఎంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సమావేశంలో మేనేజ్మెంట్ ఆఫీసర్ ఆడ్రీ మోయర్, పొలిటికల్ ఎకనమిక్ సెక్షన్ చీఫ్ సీన్ రూథ్ పాల్గొన్నారు. -
28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులు/తల్లిదండ్రులకు ఈ నెల 28, 29 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. భారత్‌లో ఉన్న విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్లిన విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రులకు 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ విద్యార్హతలు, ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో తాడేపల్లిలోని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపింది. -
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం ఎంసెట్–22(బైపీసీ) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. రెండుదశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ సమాచారాన్ని టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో ఈ నెల 27న అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. -
పీజీఈసెట్ కౌన్సెలింగ్ 19 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ కౌన్సెలింగ్ ఈనెల19 నుంచి ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అధ్యక్షతన పీజీఈసెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్ల షెడ్యూల్‌పై చర్చించారు. ఈ నెల 30లోగా ఆన్లైన్ వెరిఫికేషన్‌కోసం సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు.. ఆప్షన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలివిడత ఎంసెట్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ గడువు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది. అయితే, తాజాగా మంగళవారమే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు. -
విడాకుల కోసం వచ్చి మళ్లీ ఒకటయ్యారు.. మధ్యలో ఏం జరిగిందంటే!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఉషా –మునిరాజు, దీపా–రమేశ్,ఆశా– వినోద్ కుమార్ అనే దంపతుల మధ్య సయోధ్య కుదుర్చి తిరిగి వారు నిండు జీవితం గడిపేలా జడ్జి తీర్పు ఇచ్చారు. చిక్కబళ్లాపురంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించగా పై జంటల విడాకుల విషయంపై విచారణ జరిగింది. బెంగళూరుకు చెందిన ఉషా ఎంబీఏ చదివింది. మునిరాజు గౌరిబిదనూరు తాలూకా దేవరకొండపల్లికి చెందిన వారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. విభేదాలు వచ్చి ఉషా విడాకులకు దరఖాస్తు చేసింది. శిడ్లగట్ట తాలూకా దేవగానహళ్లి నివాసి రమేశ్‌కు, చిక్కబళ్లాపురం తాలూకా అరసనహళ్లి నివాసి దీపాకు 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య డైవర్స్ కోసం కోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా ఆశా, వినోద్ కుమార్‌లు కూడా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. న్యాయాధీశులు లక్ష్మికాంత్ మిస్కిన్, న్యాయాధీశులు వివేకానంద పండిత్‌లు ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చారు. దీంతో ఆ జంటలు పరస్పరం దండలు మార్చుకొని సంతోషంగా వెళ్లిపోయారు. చదవండి: కోర్టు ఆవరణలోనే భార్యపై కత్తితో దాడి.. -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్‌లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్‌లో 7 బాల్య వివాహాలను షీ టీమ్‌లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్‌కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల పట్ల భయం, ఒత్తిడి సహా ఇతర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారు బోర్డు సూచించిన ఫోన్ నెంబర్ల ద్వారా మానసిక వైద్యులు క్లినికల్ సైకాలజిస్టులను సంప్రదించవచ్చని సూచించింది. వారి వ్యక్తిగత నెంబర్లను బోర్డు విడుదల చేసింది. -
జనవరి 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్
న్యూఢిల్లీ: ఈనెల 12 నుంచి నీట్– పీజీ కౌన్సెలింగ్ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌన్సెలింగ్‌లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీం సమర్ధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా కౌన్సెలింగ్ చేపట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో నీట్ పీజీ పరీక్ష జరిగింది. అదేనెల్లో ఫలితాలు ప్రకటించారు. సుమారు 45వేల మెడికల్ పీజీ సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ను త్వరగా చేపట్టాలని గతనెల్లో దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. -
కౌన్సెలింగ్ మాయం..ఆప్షన్లతో ఖాయం
సాక్షి, హైదరాబాద్: జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు స్కూళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం అనూహ్యంగా వ్యూహం మార్చింది. ఆఖరి క్షణంలో కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేసింది. అన్ని జిల్లా అధికారులకు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ వర్గాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు కేటాయింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ టీచర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణకు దిగడం, సెక్రటేరియట్ ముట్టడి వంటిని రసన కార్యక్రమాలు చేపట్టనుండడంతో విభజన ప్రక్రియ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రభుత్వ వర్గాలు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి విభజనలో జిల్లా మా రిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ ను కేటాయించేలా ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు, ఇతర మినహాయింపు వర్గాలు ఆప్షన్లు ఇచ్చే గడువు సోమవారంతో ముగిసింది. 28 నుం చి కౌన్సెలింగ్ చేపట్టి 30వ తేదీన స్కూలును కేటాయిస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. మంగళవారం వరకు పొడిగింపు?: మారిన వ్యూహం నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల నుంచి ప్రస్తుతం ఆప్షన్లు మాత్రమే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆప్షన్ల గడువు మంగళవారం వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యక్ష కౌన్సెలింగ్ పద్ధతిలో టీచర్లు ఆయా కౌన్సెలింగ్ లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లి సీనియారిటీ ప్రకారం తనను పిలిచినప్పుడు అధికారుల ముందు హాజరై స్కూల్‌ను ఎంపిక చేసుకునే వీలుంది. కానీ ఇప్పుడు కేవలం టీచర్ ఇచ్చిన ఆప్షన్ ఆధారంగా అధికారులే స్కూల్‌ను కేటాయించి, వాట్సాప్‌లో సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఏ టీచర్ కూడా కౌన్సెలింగ్ కేంద్రానికి, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్పాయి. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీనియారిటీ వల్ల స్థానిక జిల్లాలు కోల్పోయిన తమకు మరోసారి ఇష్టమైన ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని, ప్రత్యక్ష కౌన్సెలింగ్ ఉంటే నేరుగా ఒకటి కాకపోతే మరొకటి కోరుకునే వీలుంటుందని చెబుతున్నారు. మరోసారి మోసం ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను తీసివేసి టీచర్లను ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోంది. కౌన్సెలింగ్‌లో నేరుగా ఉంటే ఉపాధ్యాయులు కావాల్సిన స్కూలును ఎంచుకోవచ్చు. ఇప్పుడు 200 ఆప్షన్లు ఇవ్వాలి. పైగా పై స్థాయిలో ఆప్షన్లను తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన ఏ హామీనీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) -
25 నుంచి నీట్ పీజీ–2021 కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పీజీ–2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 29 వరకు జరుగనుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సెలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్ఎంఎస్ (ఎండీ/ఎంఎస్/డిపొ్లమా/పీజీ డీఎన్బీ) సీట్ల భర్తీకి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుంది. కాగా డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్బీ సీట్ల ప్రవేశానికి అదనపు మోప్–అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. -
పోలీసులకు ఫిట్నెస్ ప్రోగ్రాం
సాక్షి, ముంబై: కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని కోల్పోయిన ముంబై పోలీసు శాఖ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఈ మేరకు ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తమ పోలీసులు ఫిట్‌గా ఉండేలా చూసుకునేందుకు ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పోలీసులకు ఫిట్‌నెస్‌పై అవగాహన, కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే వెల్లడించారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు స్వయంగా ఆయనే చొరవ తీసుకుంటున్నారు. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కోసం వీరు ద ఇండియన్ న్యూట్రిషన్ కోచ్ అనే సంస్థతో కలిసి పనిచేయనున్నారు. ఈ సంస్థను ప్రస్తుతం పోలీసు విభాగంలోనే ఎస్సైగా పనిచేస్తున్న ఒకరి కూతురు నడుపుతోంది. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ముంబైలోని పోలీసు స్టేషన్లలో ఎంత మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..? వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి..? 45 ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు..? తదితర వివరాలు సేకరిస్తారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారిని, 45 ఏళ్ల పైబడిన వారిని మొదటి గ్రూపులో చేరుస్తారు. వారికి ఒక్కొక్కరిగా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారు ఎలాంటి ఆహారం తినాలి, ఏది తినవద్దు, ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు చేయాలి, రోజువారీ దినచర్య ఎలా ఉండాలి తదితర అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం ఒక్కో పోలీసుపై రూ. 3 వేల వరకు అదనంగా ఖర్చు చేయనుంది. ఇలా నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం దశలవారీగా సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తారు. ప్రస్తుతానికి ఘట్కోపర్, పంట్ నగర్, ఆర్సీఎఫ్, శివాజీ నగర్, ట్రాంబే పోలీసు స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్ నుంచి 20 మంది చొప్పున 100 మందితో తొలి బ్యాచ్‌ను జూలై 19న ప్రారంభించారు. కరోనాతో 122 మంది పోలీసుల మృతి కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు విశ్రాంతి లేకుండా అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తున్నారు. సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి లేక, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. దీర్ఘకాలిక సెలవులు, వారాంతపు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో విశ్రాంతి అనేది లేకుండా వారు విధులు నిర్వర్తించారు. 24 గంటలు నాకా బందీలు, తనిఖీలు, కాలక్షేపానికి బైక్‌లపై తిరుగుతున్న యువతను అడ్డుకోవడం, అనవసరంగా రోడ్లపై తచ్చాడుతున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకోవడం లాంటి పనులు చేపట్టారు. ఫలితంగా కరోనా సోకి 2020లో ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న 19 మంది పోలీసులు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 122కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 122 మంది పోలీసులు కరోనా కాటుకు బలికావడాన్ని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలీసు సిబ్బందిలో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వెంటనే ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. అంతేగాక, పోలీసు శాఖలో అనేక మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు భారీ పొట్ట ఉంది. వీరేం పరుగెడతారు..? దొంగలను ఎలా పట్టుకుంటారు...? అంటూ ప్రజలు వీరిపై జోకులు వేస్తున్నారు. ఇలాంటి వారివల్ల పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. అంతేగాక బానెడు పొట్ట వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో ఇలాంటి వారిని కూడా ఎంపిక చేసి పొట్ట తగ్గించేందుకు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలో కూడా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నేర్పించనున్నారు. -
ఏపీ: 16 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. లా కోర్సులకు సంబంధించి వివిధ కాలేజీల్లోని కోర్సులకు ప్రభుత్వం బుధవారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఫీజులు ఖరారవ్వడంతో తొలివిడత ప్రవేశాల ప్రక్రియను కన్వీనర్ ప్రకటించారు. షెడ్యూల్ ఇలా.. ప్రక్రియ తేదీ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ 16 నుంచి 18 ధ్రువపత్రాల పరిశీలన 16 నుంచి 18 వెబ్ ఆప్షన్ల నమోదు 16 నుంచి 18 సీట్ల కేటాయింపు 20 కాలేజీల్లో రిపోర్టింగ్ 22, 23 (చదవండి: రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
ఎంసెట్ కౌన్సెలింగ్ ఒకరోజు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ఒకరోజు వాయిదా పడింది. ఈ ప్రక్రియను శనివారం నుంచి తిరిగి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ సవరించిన షెడ్యూల్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా 333 మందికి ఎంసెట్ ర్యాంకులు పొందే అర్హత లభించనున్నట్లు కమిటీ అంచనా వేసింది. వారందరికీ శుక్రవారం సాయంత్రం వరకు ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొంది. అసలేం జరిగిందంటే.. ఎంసెట్ అర్హత సాధించినా ఇంటర్లో కనీస మార్కులు (సంబంధిత సబ్జెక్టుల్లో ఓసీలు 45 శాతం, ఇతర రిజర్వేషన్ కేటగిరీల వారు 40 శాతం) సాధించలేదన్న కారణంతో చాలా మంది విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకుల ను కేటాయించలేదు. అయితే కరోనా కారణంగా ఈసారి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ఆ పరీక్షల కోసం సిద్ధమైన 1.47 లక్షల మందికి ఇంటర్ బోర్డు కనీస పాస్ మార్కులు (35) ఇచ్చి పాస్ చేసింది. అందులో అనేక మందికి ఎంసెట్ ర్యాంక్ పొందేందుకు అవసరమైన నిర్దే శిత మార్కులు లేకపోవడంతో ఎంసెట్ కమిటీ ర్యాంకులు కేటాయించలేదు. దీంతో ఆయా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించనం దునే తమకు కనీస అర్హత మార్కులు లేకుండా పోయాయని, తమకు ర్యాం కులు కేటాయించేలా చూడాలని విన్నవించారు. దీంతో వారికి ర్యాంకులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గురువారం చర్యలు చేపట్టింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉన్నతాధికారులతో సమావేశమై ఎంసెట్‌లో ర్యాంకుల కేటాయింపునకు కావాల్సిన కనీస అర్హత మార్కుల నిబంధనను సడలించి ఆయా విద్యార్థులకు ర్యాంకులను కేటాయించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా జీవో 201ని జారీ చేశారు. సడలింపు నిబంధన ఈ ఒక్క ఏడాదే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంటూ ర్యాంకులను ఎంసెట్ కమిటీ శుక్రవారం కేటాయించనుంది. ఇంజనీరింగ్ చివరి దశ తాజా షెడ్యూల్... 31–10–2020: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్. కొత్త వారికి ఇందులోనే అవకాశం. 1–11–2020: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. 30–10–2020 నుంచి 2–11–2020 వరకు: వెబ్ ఆప్షన్లు. 2–11–2020: ఆప్షన్లు ముగింపు. 4–11–2020: సీట్ల కేటాయింపు. 4–11–2020 నుంచి 7–11–2020 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్. సీట్లు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టింగ్. -
27 నుంచి ఎంబీబీఎస్ ఆలిండియా కౌన్సెలింగ్..
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లను ఆలిం డియా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఎయిమ్స్, జిప్మర్ తదితర జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల సీట్లనూ ఈ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 6,410 ఎంబీబీఎస్ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల నీట్ ఫలి తాలు వెల్లడైన నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 27 నుంచి వచ్చే నెల 2 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. 5న ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రకటిస్తారు. అనంతరం విద్యార్థులు అదే నెల 6 నుంచి 12 వరకు వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ మూడు గంటల వరకు జరుగుతుంది. 25న కాలేజీ సీటు కేటా యింపు ఫలితాన్ని ప్రకటిస్తారు. అదే నెల 26 నుంచి డిసెంబర్ 2 నాటికి కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు చేరాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రాల నుంచి తీసుకున్న 15 శాతం సీట్లలో మిగిలిన వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కు ఇస్తారు. అయితే ఎయిమ్స్, జిప్మర్, కేంద్ర, డీమ్డ్ వర్సిటీ, ఈఎస్ఐసీ వంటి సంస్థల్లో మిగిలిన సీట్లకు మాత్రం మాప్ అప్ రౌండ్లో ఆలిండియా కౌన్సెలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. సీటు కేటాయించిన కాలేజీని అదే నెల 17న ప్రకటిస్తారు. విద్యార్థులు 18 నుంచి 24 నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అప్పటికీ మిగిలిన సీట్లను అదే నెల 28 నుంచి 31 వరకు భర్తీ చేస్తారు. 29న రాష్ట్రంలో మెడికల్ నోటిఫికేషన్ ఆలిండియా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ నెల 29న తెలంగాణలో మెడికల్ ప్రవేశాల నోటిఫికేషన్ ప్రారంభం కానుంది. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. అలాగే జాతీయస్థాయి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, రాష్ట్రంలో రెండో విడత జరుగుతుంది. జాతీయస్థాయి కౌన్సెలింగ్ తర్వాత వెనక్కు వచ్చే సీట్లతో కలిపి రాష్ట్రంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కాళోజీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మాప్‌అప్ రౌండ్ నిర్వహిస్తారు. ఈసారి సర్టిఫికెట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదని, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాయి. గతేడాది తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. ఈ నెల 29 నాటికి రాష్ట్రానికి నీట్ ర్యాంకుల డేటా వివరాలు వస్తాయని చెబుతున్నారు. అదే రోజు నోటిఫికేషన్ జారీచేస్తారు. ఇదిలావుంటే కరోనా నేపథ్యంలో వైద్య విద్య తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న విషయంలో స్పష్టత లేదని అధికారులు తెలిపారు. వాస్తవంగా జాతీయస్థాయి మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే వచ్చే నెల 15న తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తరగతుల ప్రారంభంపై స్పష్టతలేదని అంటున్నారు. -
అసాంఘిక శక్తులపై డేగ కన్ను
సాక్షి, గుంటూరు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నింతరం దృష్టి సారించాల్సిందేనని జిల్లా పోలీస్ బాస్‌లు అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వరుస హత్యలకు పథక ప్రణాళికలు రచించిన రౌడీ ముఠాను, ఇటీవల ఓ రౌడీ షీటర్‌ను హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏడుగురిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ జిల్లాలో సైతం పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత గొడవలకు దిగిన ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లు, వైట్ కాలర్, సస్పెక్టెడ్ నేరస్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఎస్పీలు హెచ్చరించినట్టు సమాచారం. వారం వారం కౌన్సెలింగ్ గుంటూరు అర్బన్ జిల్లాలో రౌడీ షీటర్లకు విధిగా వారం వారం కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అర్బన్‌లో 750 మంది వివిధ కేటగిరీలకు చెందిన రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో 100 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. వీరి వివరాల కోసం వారి ఆధార్, రేషన్, ఓటర్ ఐడీలను ఆధారంగా చేసుకుని అర్బన్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పల్నాడుపై ఫోకస్ రూరల్ జిల్లాలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఇటీవల కాలంలో హత్యలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడుపై రూరల్ పోలీస్ బాస్ ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్ వివాదాలను వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత ఫిర్యాదుదారులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. రూరల్ జిల్లాలో 1500 మందికి పైగా రౌడీ షీటర్లు, వైట్ కాలర్, సస్పెక్టెడ్ షీట్ నేరస్థులున్నారు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వీరి ప్రవర్తనను సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా నుంచి పల్నాడు ప్రాంతంలోని నదీ పరీవాహక గ్రామాలకు కృష్ణా నది గుండా, ఇతర మార్గాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్) వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ వరుసగా పట్టుబడిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సాక్షి, గుంటూరు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నింతరం దృష్టి సారించాల్సిందేనని జిల్లా పోలీస్ బాస్‌లు అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వరుస హత్యలకు పథక ప్రణాళికలు రచించిన రౌడీ ముఠాను, ఇటీవల ఓ రౌడీ షీటర్‌ను హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏడుగురిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ జిల్లాలో సైతం పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత గొడవలకు దిగిన ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లు, వైట్ కాలర్, సస్పెక్టెడ్ నేరస్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఎస్పీలు హెచ్చరించినట్టు సమాచారం. వారం వారం కౌన్సెలింగ్ గుంటూరు అర్బన్ జిల్లాలో రౌడీ షీటర్లకు విధిగా వారం వారం కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అర్బన్‌లో 750 మంది వివిధ కేటగిరీలకు చెందిన రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో 100 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. వీరి వివరాల కోసం వారి ఆధార్, రేషన్, ఓటర్ ఐడీలను ఆధారంగా చేసుకుని అర్బన్ పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పల్నాడుపై ఫోకస్ రూరల్ జిల్లాలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఇటీవల కాలంలో హత్యలు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడుపై రూరల్ పోలీస్ బాస్ ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే సివిల్ వివాదాలను వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంబంధిత ఫిర్యాదుదారులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. రూరల్ జిల్లాలో 1500 మందికి పైగా రౌడీ షీటర్లు, వైట్ కాలర్, సస్పెక్టెడ్ షీట్ నేరస్థులున్నారు. వీరి కార్యకలాపాలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వీరి ప్రవర్తనను సునిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా నుంచి పల్నాడు ప్రాంతంలోని నదీ పరీవాహక గ్రామాలకు కృష్ణా నది గుండా, ఇతర మార్గాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్) వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ వరుసగా పట్టుబడిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పద్ధతి మార్చుకోవాలి రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి. నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలి. లేని పక్షంలో ఉపేక్షించేది లేదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టం.–ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ -
కలకలం రేపిన దంపతుల కౌన్సెలింగ్
తూప్రాన్: నవ దంపతుల మధ్య ఉన్న విభేదాలు ఇరువర్గాల మద్య దూరం పెంచాయి. పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ దాక వెళ్లిన ఈ ఘటన పరస్పర దాడులకు పాల్పడే స్థితికి దారి తీసింది. తూప్రాన్ పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం జెండాపల్లికి చెందిన యువతిని గత నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన యువకుడితో పెళ్లి చేశారు. వీరి కాపురం సజావుగా సాగిన నాలుగు నెలల అనంతరం భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. యువతి కుటుంబ సభ్యులు తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువకుడితో పాటు వారి కుటుంబ సభ్యులు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు ఇరు కుటుంబసభ్యులు, పెద్దల సమక్షంలో నవ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో నెల రోజుల తర్వాత మాట్లాడుకుంటామని పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. కోపోద్రికులైన అమ్మయి తరుపువారు అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలోనే యువకుడి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ వెళ్తుండగా వెనుకాల నుంచి వెంబడించిన యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టణంలోని శివాలయం ఎదురుగా అడ్డగించి కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే యువకుడిని చితకబాదారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. తిరిగి వారిని హైదరాబాద్ పంపించి వేశారు. కాగా ఈ సంఘటన తూప్రాన్ పట్టణంలో కలకలం రేపింది. -
బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..
సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య) -
ఎందుకో అంత తొందర?
సాక్షి, విజయనగరం: కొద్ది రోజుల క్రితం గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం చేయడానికి ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంస్థ సభ్యులు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. తాజాగా బొండపల్లి మండలంలోని ఓ గ్రామాని కి చెందిన 17 ఏళ్ల బాలికకు నెల్లిమర్ల మండలానికి చెందిన వ్యక్తితో ఈ నెల 13వ తేదీన వివాహం చేయాలని ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్‌కు సోమవారం తెలియజేయడంతో చైల్డ్‌లైన్, డీసీపీయూ, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా... లాక్డౌన్ అమల్లో ఉన్నా... బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్‌ను కొందరు అవకాశంగా మలచుకుని గుట్టుగా పెళ్లిళ్లు చేసేయాలని కొందరు తలస్తున్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఓ వైపు తెలియజేస్తున్నా... చాలామంది పట్టించుకోవడం లేదు. అక్కడక్కడ కొందరు సమాచారం అందిస్తే అధికారులు వాటిని అడ్డుకోగలుగుతున్నారు. ఇంకా సమాచారం అందని పెళ్ళిళ్లు ఎన్ని జరిగిపోతున్నాయో తెలియడంలేదు. ఆడపిల్లలు కాస్త ఏపుగా పెరిగితే చాలు వెంటనే పెళ్లి చేసేయాలన్న ఆలోచనకు తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... మంచి సంబంధం మళ్లీ అలాంటిది దొరుకుతుందో లేదోనని కొందరు... ఓ బాధ్యత తీరిపోతుంది కదా అని మరికొందరు... ఇలా తలోరకంగా సమాధానాలు చెబుతున్నారు. కానీ జరగబోయే నష్టా న్ని మాత్రం వారు అంచనా వేయడం లేదు. ఇలాంటివాటిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఛైల్డ్లైన్టోల్ఫ్రీ నంబర్ 1098ని ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారిని చట్టానికి దొరకకుండా చేస్తారు. బాల్య వివాహం చేస్తే శిక్ష బాల్య వివాహానికి ప్రోత్సహించేవారు... చేసేవారు శిక్షార్హులే. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేసిన తర్వాత ఆ మైనర్‌ను ఆక్రమ రవాణా చేయడం, దాచేయడానిక ప్రయత్నించడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలను నిషేధిస్తూన్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఆ ఉత్తర్వులు ఉల్లంఘించి వివాహం హిందూ సంప్రదాయంగా జరిపినా ఆ వివాహం చెల్లదు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను అపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్‌లేని శిక్ష విధిస్తారు. సమాచారం వస్తే అడ్డుకుంటాం బాల్యవివాహాలు జరుగుతున్న సమాచా రం వచ్చిన వెంటనే నిలుపుదల చేయాలని సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. అంగన్వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పాం. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం వచ్చి న వెంటనే సిబ్బంది వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. – ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్ -
బీటెక్ కౌన్సిలింగ్‌కు ఆన్లైన్లో ఆప్లై చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్కూల్ మహీంద్ర ఎకోల్ సెంట్రల్ (ఎమ్ఈసీ), హైదరాబాద్ లో బీటెక్ 2020-2024 విద్యాసంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ జరగనుంది. కరోనా కారణంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో బీటెక్ అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సిలింగ్ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. కౌన్సిలింగ్ అడ్మిషన్ల కోసం విద్యార్ధులు www.mahindraecolecentrale.edu.in లో మే10 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన పర్సన్టైల్ ఆధారంగా ఆడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్ఈసీ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్‌ను సోమవారం యమ్‌ఈసీ విడుదల చేసింది. యమ్ఈసీలో ఇంజనీరింగ్‌కి సంబంధించిన నాలుగు బ్రాంచ్‌లకు(సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)240 సీట్లు( ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్లు )ఉన్నాయి.భవిష్యత్తులో ప్రపంచశ్రేణి ఇంజనీరింగ్ పట్టభద్రులను అందించాలనే ఉద్దేశంతో మహీంద్రా గ్రూప్ సంస్థ ప్రారంభించిన ఇంజనీరింగ్ కాలేజ్.. మహీంద్రా ఎకోల్ సెంట్రల్. అకడెమిక్ సిలబస్, కరిక్యులం రూపకల్పన, బోధన, ఇతర శిక్షణ అంశాలకు సంబంధించి.. ఫ్రాన్స్‌కు చెందిన 185 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఎకోల్ సెంట్రల్-ప్యారిస్, మన రాష్ట్రంలోని జేఎన్టీయూ(హైదరాబాద్)లతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో ఈ కాలేజ్‌ను ఏర్పాటు చేశారు. టెక్ మహీంద్రా సంస్థ ప్రాంగణంలోనే 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికోసం సంస్థ ప్రారంభంలో రూ.300 కోట్లు కేటాయించింది. భవిష్యత్తు అవసరాలకు సరితూగే విధంగా ప్రతి విద్యార్థికి రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్, ప్రాక్టికల్ అప్రోచ్ మెళకువలను అందిస్తారు. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి మంచి నైపుణ్యాలు ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతారు. ప్రతి విద్యార్థి కోర్సు సమయంలో ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎకోల్ సెంట్రల్ ప్యారిస్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీరు కూడా ఈ సంస్థలో చేరాలనుకుంటే మే 10లోపు కౌన్సిలింగ్‌కు ఆప్లై చేసుకోండి. 10+2 లొ 60 శాతం పైగా మార్క్‌లు సాధించి,జేఈఈ మెయిన్స్‌లో అర్హత సంపాదించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. -
వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలిసులు
-
ఏందయ్యా.. చెబితే అర్థంకాదా?
సాక్షి, సిద్దిపేట: ‘ఏందయ్యా.. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోరా’అని రోడ్ల పై తిరుగుతున్న వాహనదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు క్లాస్ పీకారు. సోమ వారం సిద్దిపేటలో ద్విచక్ర వాహనదారులు వెళుతుండటాన్ని గమనించి ఆపారు. ఈ సం దర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్ నివారణకు మందు లేదు.. స్వీయ నిర్బంధం.. భౌతిక దూరం పాటించడమే సమస్యకు పరిష్కారం. ఈ వైరస్ నుం చి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు’అని మండిపడ్డారు. అధికారులు ప్రమాదం పొంచి ఉం దని తెలిసినా లెక్క చేయకుండా మీ కోసం పని చేస్తున్నా.. సహకరించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోకపోతే కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. కాగా, దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించాలని మంత్రి కోరారు. -
సంస్కరించేలా శిక్షలుండాలి
సాక్షి, హైదరాబాద్: పిల్లలు తప్పు చేస్తే వారిని సంస్కరించే దిశగా క్షమాగుణంతో చర్యలు, శిక్షలు ఉండాలని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు హైకోర్టు హితవు చెప్పింది. తప్పు చేసిన విద్యార్థుల్లో మార్పు వచ్చేలా వారికి శిక్షలు ఉండాలని సూచన చేసింది. ఓ విద్యార్థిని సస్పెండ్ చేసిన వ్యవహారంపై హైకోర్టు స్పందిస్తూ.. సెనేట్ నిర్ణయం తీసుకునే వరకూ ఆ విద్యార్థిని తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిచ్చే విషయంలో నిట్ తన వైఖరిని తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం పేర్కొంది. నిట్ తొలి ఏడాది విద్యార్థి గంజాయి వినియోగిస్తూ పట్టుబడటంతో ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించకపోవడటంతోపాటుగా ఆ ఏడాదికి సస్పెండ్ చేస్తూ 2019 నవంబర్ 22న నిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా..ఈ విషయం సెనేట్ ముందు పెండింగ్‌లో ఉన్నందున మూడు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. సెనేట్ నిర్ణయం వెలువడే వరకూ తరగతులకు అనుమతించేలా ఉత్తర్వులివ్వాలని విద్యార్థి చేసిన అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది. వాదనల అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
సూసైడ్ స్పాట్‌గా మారిన గోదావరి బ్రిడ్జి.!
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : ‘భార్యాభర్తలు గొడవ పడ్డారు.. క్షణికావేశంలో భార్య ఆటో ఎక్కి గోదావరి బ్రిడ్జివద్దకు వెళ్లింది.. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో అక్కడే విధినిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదే ఆటోలో బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు గోదావరి బ్రిడ్జి సమీపంలో ఇటీవల కాలంలో పెరిగిపోయాయి’. ఇన్నాళ్లు గోదారి ఎండిపోయి తాగునీటి కోసం గోస పడుతుండగా.. ఇప్పుడు నిండుకుండలా మారిన గోదావరితో మరో లొల్లి మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరిబ్రిడ్జికి ఐదు కిలో మీటర్ల దూరంలో సుందిళ్ల బ్యారేజీ నిర్మించడంతో నీటిమట్టం భారీగా పెరిగింది. రివర్స్ పం పింగ్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి నిల్వలు పెరిగిపోయాయి. ఈక్రమంలో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరిగింది. గడిచిన రెండు నెలల్లో 15 మంది గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తమై తొమ్మిది మందిని రక్షించగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. తలనొప్పిగా మారిన ఆత్మహత్యలు.. గోదావరినదిలో ఆత్మహత్య సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. క్షణికావేశంలో వస్తున్న వ్యక్తులు గోదావరిబ్రిడ్జిపైకి చేరుకుని నదిలో దూకుతున్నారు. ఈవిషయాన్ని పలువురు గమనించి పోలీసులకు చేరవేడడంతో బాధితులను రక్షించేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది. నిండుగోదావరి సందర్శకులకు సంతోషాన్నిస్తుండగా పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారింది. ప్రతీ రెండురోజులకో సంఘటన జరుగుతుండడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. అవుట్ పోస్టు ఏర్పాటు.. గోదావరి బ్రిడ్జిపై ప్రమాదాలు తగ్గించడంతో పాటు ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గత నెల 26 ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడేవారిని గుర్తించి, వెంటనే కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. అయినా కొంతమంది క్షణికావేశంలో వచ్చి ఎవరికీ తెలియకుండా నదిలో దూకి చనిపోయిన సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. గోదావరినదిపై ఉన్న రెండు బ్రిడ్జీలకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీపీసీ యాజమాన్యం సహకారంతో బ్రిడ్జిపై ఉన్న రెయిలింగ్‌కు ఆనుకుని ఆరుఫీట్ల ఎత్తు వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్. గట్టయ్య, సిద్ధిపేట రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ బాబుకుఆస్తమా... చికిత్స ఉందా? మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా... ఎప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా?– డి. రామమనోహర్,విశాఖపట్నం ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది. కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు: ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధి నిర్ధారణ: ఎల్ఎఫ్టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు. చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపా రంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. – ఎమ్. ధర్మారావు, ఏలూరు శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ∙బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ∙పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ∙జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు: ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ∙మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
రోజూ తలస్నానం మంచిదేనా?
నేను ఒక క్రీడాకారుణ్ణి. నాకు మాడుపైన విపరీతంగా చెమట పడుతుంటుంది. దాంతో నేను రోజూ తలస్నానం చేస్తుంటాను. ఇలా రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? అలా చేస్తే జుట్టు ఎక్కువగా రాలుతుందా?– వినయ్, మెదక్ మాడుపై చెమట పట్టినప్పుడు తలస్నానం చేయడం మంచిదే. అలా చేయకపోతేనే సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బాగా చెమట పట్టినా తలస్నానం చేయనందువల్ల మాడుపై దురద, చుండ్రు (డాండ్రఫ్), జుట్టురాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరిలా రోజూ తలస్నానం చేసే సమయంలో వాడే షాంపూలాంటి ఉత్పాదనల్లో కఠినమైన రసాయనాలు (హార్ష్ కెమికల్స్) ఉంటే కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఇక మీరు రోజూ తలస్నానం చేసేందుకు ఉప్పునీరు వాడుతున్నా కూడా జుట్టు రాలే సమస్య ఉత్పన్నం కావచ్చు. కాబట్టి మీరొకసారి డాక్టర్‌ను కలిసి, మీకు అనువైన షాంపూ ఎంపిక లాంటి జాగ్రత్తలను తెలుసుకోండి. పాప పెదవులపై దురద...ఎందుకిలా? మా పాప వయసు ఎనిమిదేళ్లు. ఆమె పెదవుల మీద, ఆ చుట్టూర ఉన్న భాగమంతా బాగా దురదగా ఉంటోందని చెబుతోంది. తన పెదవులు తరచూ పగిలినట్లుగా కనిపిస్తుంటాయి. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి?– అమృత, వరంగల్ మీ పాపకు పెదవుల దగ్గర అలర్జీ రావడం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. ఈ పరిణామానికి అనేక అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా మీ పాపకు తరచూ పెదవులను నాలుకతో తడి చేసుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మాన్పించాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్నిసార్లు పెదవులపై వాడే ఉత్పాదనలు కూడా అలర్జీకి కారణమవుతాయి. ఉదాహరణకు లిప్‌బామ్, పేస్ట్ లాంటివి. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పాపకు అలా జరగడానికి నిర్దిష్టమైన కారణం ఏమిటో తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స ఇవ్వవచ్చు.డాక్టర్ సుభాషిణి జయం,కన్సల్టెంట్ మెడికల్ కాస్మటాలజిస్ట్,ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
ముగిసిన నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సీట్ల కేటాయింపు కోసం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ ఏడాది వెనకబడిన అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు పెంచాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 39 విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని కళాశాలలో ఉన్న 4 వేల సీట్లతో పాటు మరో 400 సీట్లు పెరిగాయి. వాటిని భర్తీ చేసేందుకు కళాశాల యజమాన్యం సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు చివరిదశ కౌన్సెలింగ్ ఏర్పాటు చేసింది. స్పెషల్ కేటగిరి, పీహెచ్సీ, స్పోర్ట్స్ కోటాలతో పాటు అగ్రవర్ణ పేదల కోసం కేటాయించిన 400 సీట్లను పూర్తిగా భర్తీ చేసినట్లు ట్రిపుల్ ఐటీ ఆడిషన్స్ కన్వీనర్ ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. అయితే మొదటిదశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా 219 సీట్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 4 నుండి తరగతులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నూతన విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించామని, కార్యక్రమంలో వారికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జేయూకేటీ) ఛాన్స్లర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి ఐడీ కార్డులను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు ప్రొఫెసర్ డి. సూర్యచంద్రరావు, హర శ్రీరాములు పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్పాట్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మూడేళ్లుగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలంటూ యాజమాన్యాలు చేస్తున్న విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 14 నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టుకోవచ్చని యాజమాన్యాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం లేకపోవడంతో మిగిలిపోయే సీట్లలో యాజమాన్యాలు సొంతంగా ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఏటా మంత్రులను కలసి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా విద్యా శాఖ మంత్రిని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను కలసి కలిసి విజ్ఞప్తులు చేసింది. దీంతో ఎట్టకేలకు స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లలో తాము కోరుకునే కాలేజీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలు ఏర్పడిందని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పరమేశ్ పేర్కొన్నారు ఆర్థిక స్థోమత కలిగిన విద్యార్థులకు దోస్త్ ద్వారా కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావట్లేదని, స్పాట్ అడ్మిషన్ల ద్వారా అలాంటి వారికి కోరుకున్న చోట సీట్లు లభిస్తాయని వివరించారు. కాగా, రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టే ప్రవేశాలు పోగా మరో 1.76 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో యాజమాన్యాల ఆధ్వర్యంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 14 నుంచి 18 వరకు చేపట్టి పూర్తి చేయాలని లింబాద్రి వెల్లడించారు. ప్రవేశాలను పూర్తి చేసి, విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా కాలేజీల్లో చేరే విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వివరించారు. నేడు స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు ఇప్పటి వరకు ఐదు దశల్లో చేపట్టిన డిగ్రీ కౌన్సెలింగ్ ద్వారా 1,74,239 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. అయితే విద్యార్థుల నుంచి వచి్చన విజ్ఞప్తుల మేరకు దోస్త్ మరో విడత కౌన్సెలింగ్‌ను స్పెషల్ రౌండ్ పేరుతో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించింది. ఇందులో 6,997 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం కొత్తగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. వారితో పాటు గతంలో తమ మార్కులకు అనుగుణంగా సరిపడా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు రాని వారు, సీట్లు వచి్చనా కాలేజీల్లో రిపోర్ట్ చేయని వారు కలిపి మొత్తం 16 వేల మంది విద్యార్థులు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని లింబాద్రి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలతో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, దోస్త్ పరిధిలో లేకుండా సొంతంగా ప్రవేశాలు చేపట్టిన కాలేజీలన్నీ విద్యార్థుల సమగ్ర వివరాలను ఈనెల 18 లోగా అందజేయాలని వివరించారు. -
గందరగోళంలో తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్ : మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని తెలంగాణ సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తిరస్కరించడంతో తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో గందరగోళం నెలకొంది. మంగళవారమే కౌన్సిలింగ్ ఉండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 187 కాలేజీల్లో 162 కాలేజీలకు మాత్రమే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కాగా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన 162 కళాశాలలో 100పైగా కాలేజీలకు తెలంగాణ సాంకేతిక విద్యామండలి అనుమతి నిరాకరించింది. చదవండి : ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలపై సర్కార్ కొరడా ప్రతీ కాలేజీలో ఉన్న సీట్ల అన్నింటికి మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని సాంకేతిక విద్యామండలి తేల్చిచెప్పింది. సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి మూడేళ్ల అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించమనడం సరికాదన్నారు. దీంతో తెలంగాణ సాంకేతిక విద్యామండలి మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుము చెల్లించాల్సిందే అంటూ 100కు పైగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును తిరస్కరించింది. విద్యామండలి విధించిన నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం నుంచే కౌన్సిలింగ్ ఉండటం తో గుర్తింపు వస్తుందా లేదా, కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ లో అటు విద్యార్థులకు, ఇటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి నెలకొంది. -
టెన్త్ విద్యార్థులకు గైడెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువుల కు ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్ ఆధారపడి ఉంటుంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కోర్సుల ఎంపికపై గైడెన్స్ ఇచ్చే వారు ఉండరు. దీంతో విద్యార్థులకు కెరీర్‌పై గైడెన్స్ ఇప్పించే బాధ్యతలను స్వయాన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తీసుకుంది. విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పై చదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించనున్నారు. పదో తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ మేరకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ప్రొఫెసర్ గార్డెనర్ హోవర్డ్ ప్రతిపాదించిన మేథస్సు సిద్ధాంతం ప్రకారం ప్రజల్లో ఉండే వివిధ రకాల మేథస్సులు, వాటికి అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సిన కెరీర్‌కు సంబంధించిన చార్టులను అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించింది. ► ఉదాహరణకు వాక్చాతుర్యం, భాష మీద పట్టు గల వారు న్యాయవాది, కమెడియన్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, క్యూరేటర్, సంపాదకుడు, జర్నలిస్టు, చరిత్రకారుడు, లైబ్రేరియన్, మార్కెటింగ్ కన్సల్టెంట్, కవి, రాజకీయ నేత, పాటల రచయిత, టీవీషో హోస్ట్, ఉపాధ్యాయుడు, భాషా అనువాదకుడు, రచయిత కాగలరు. ► తార్కిక, గణిత నైపుణ్యం గలవారు అకౌంటెంట్, ఆడిటర్, కంప్యూటర్ అనలిస్ట్, కంప్యూటర్ టెక్నీషియన్, కంప్యూటర్ ప్రొగ్రామర్, డేటాబేస్ డిజైనర్, డిటెక్టివ్, ఆర్థికవేత్త, ఇంజనీర్, గణితవేత్త, నెట్వర్క్ అనలిస్ట్, ఫార్మాసిస్ట్, ఫిజిషియన్, ఫిజీసిస్ట్, పరిశోధకుడు, స్టాటిస్టిషియన్, బుక్ కీపర్ కాగలరు. ► దృశ్య నైపుణ్యం గల వారు 3డీ మోడలింగ్, సిమ్యూలేషన్, ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్, కంప్యూటర్ ప్రొగ్రామర్, ఇంజనీర్, ఫిల్మ్ యానిమేటర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, ఇంటీరియర్ డెకరేటర్, ఫొటో గ్రాఫర్, మెకానిక్, నావిగేటర్, ఔట్ డోర్ గైడ్, పైలట్, శిల్పుడు, వ్యూహకర్త, సర్వేయర్, అర్బన్ ప్లానర్, వెబ్‌మాస్టర్ కాగలరు. -
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ఖమ్మంక్రైం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం డివిజన్‌కు చెందిన రౌడీషీటర్లకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రెహమాన్ నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించినా.. వేరే వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టడం, ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి కార్యకలాపాలు, కదలికలపై పూర్తి నిఘా ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా జాబితా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పైనల్ కౌన్సెలింగ్
వెన్నునొప్పి తగ్గడం లేదు... ఏం చేయాలి? నా వయసు 29 ఏళ్లు. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆఫీసు చేరడానికి నేను కనీసం రోజూ 40 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. ఆఫీసులో అంతా డెస్క్ పనే. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. దయచేసి నా సమస్య ఏమిటో చెప్పి, తగిన పరిష్కారం సూచించండి. – వరుణ్, హైదరాబాద్ ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిలో ఈ వెన్నునొప్పులు సాధారణమైపోయాయి. చిన్నవయసులోనే ఈ నొప్పి బారిన పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. మీ ఇంటి నుంచి మీరు పనిచేసే ప్రదేశానికి 35 కి.మీ. అన్నారు. అంటే రానూపోనూ సుమారు 70 కి.మీ. దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. అందునా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్డు మీద ఉండే గతుకుల మధ్య ఇంత దూరం టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే ఒకే భంగిమలో అదేపనిగా కొన్ని గంటలపాటు కూర్చొని పనిచేయడం వల్ల కూడా మీ వెన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. ♦ మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి. ♦ కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి ♦ వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. స్పైన్‌కు రెండోసారి సర్జరీ అంటున్నారు... ప్రమాదమా? నేను రెండేళ్ల క్రితం నా వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. అయితే ఇప్పుడు నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఇక నేను ఎంతమాత్రమూ నడవలేకపోతున్నాను కూడా. మా డాక్టర్‌ను సంప్రదిస్తే, మరోమారు వెన్ను ఆపరేషన్ చేయించాలని అంటున్నారు. దాంతో నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా ఇవ్వండి. – సూర్యనారాయణమూర్తి, కాకినాడ సాధారణంగా వెన్ను ఆపరేషన్లలో రెండోసారి చేయించాల్సి రావడం తరచూ జరుగుతుండే విషయమే. లేదా చేసిన ఆపరేషన్‌ను మరోమారు సమీక్షించుకోవాల్సి రావడం కూడా జరిగేదే. ఇలా రెండోసారి ఆపరేషన్‌కు దారితీసేందుకు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు డిస్క్ పక్కకు తొలగడం, ఇన్ఫెక్షన్ రావడం, సూడోఆర్థోసిస్ వంటి ఎన్నో సందర్భాల్లో చేసిన ఆపరేషన్‌ను మరోమారు సరిదిద్ది, పునఃసమీక్షించుకోవడం అవసరమవుతుంది. అయితే ఆపరేషన్ జరిగే ప్రదేశం అత్యంత కీలకమైన ‘వెన్నెముక’కు కాబట్టి, పైగా ఇది రెండోసారి ఆపరేషన్ కాబట్టి మీరు నిపుణులైన సర్జన్లతోనే దీన్ని చేయించుకోవాలి. స్పర్శ తగ్గుతోంది... మూత్రంపై అదుపు తప్పుతోంది! ఇటీవల నా చేతుల్లో క్రమంగా స్పర్శ తగ్గుతోంది. కాళ్లు బిగుసుకుపోయినట్లుగా మారుతున్నాయి. మెడనొప్పి కూడా వస్తోంది. మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఆపుకోవడం చాలా కష్టమవుతోంది. పైగా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కూడా తప్పుతోంది. నా సమస్యలకు పరిష్కారం చెప్పండి. – ఎల్. రామ్మోహన్రావు, విజయవాడ మీరు చెప్పినదాని ప్రకారం మీరు ‘సర్వైకల్ మైలోపతి’ అనే సమస్యతో బాధపడుతున్నారనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నునరాలపై పడే ఒత్తిడి కారణంగా మీరు చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తున్నాయని లక్షణాలను బట్టి ప్రాథమికంగా నా అభిప్రాయం. అయితే వ్యాధినిర్ధారణ కోసం ఒక క్రమపద్ధతిలో క్లినికల్ పరీక్షలు, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చిన కండిషన్ ‘సర్వైకల్ మైలోపతి’ అని నిర్ధారణ అయితే, ఆ వ్యాధి తీవ్రత ఆధారంగా మీకు మెడ ముందు భాగం నుంచి గానీ లేదా మెడ వెనకభాగం నుంచిగానీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ముందుగా మీరు మీకు దగ్గర్లోని వైద్యనిపుణులను సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఆ ఫలితాలను బట్టి మున్ముందు అవసరమైన చికిత్స నిర్ణయించవచ్చు. – డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నొప్పి మెడ నుంచి చేతిలోకి పాకుతోంది... ఎందుకిలా? నా వయసు 29 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. శ్రీనివాస్, హైదరాబాద్ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ అనుసరణీయం కాని భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. ఇంత చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పా...? నా వయసు 27 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలా రకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా కావడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రమేశ్, అనకాపల్లి మీకు మీ రోజువారి కార్యకలాపాల కారణంగా మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. అప్పుడెప్పుడో కాలు బెణికింది... నొప్పి ఇప్పుడెందుకు వస్తోంది? ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – స్వరూప, విజయవాడ మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
వ్యవసాయ వర్సిటీలో పలు కోర్సులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఏర్పడిన ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. వర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 24న ఉదయం 10కి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల్లో బైపీసీ స్ట్రీమ్ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి 25న వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఠీఠీఠీ.p్జ్టట్చu.్చఛి.జీn లో చూడాలని ఆయన సూచించారు. వచ్చేనెల 21 నుంచి ప్రీప్రైమరీ శిక్షణ కోర్సు.. జయశంకర్ వర్సిటీ పరిధిలో హోంసైన్స్ కళాశాల.. మానవ అభివృద్ధి, కుటుంబ అధ్యయన విభాగం 21 రోజుల ప్రీప్రైమరీ శిక్షణ కోర్సును వచ్చే నెల 21 నుంచి నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ అసోసియేట్ డీన్ విజయలక్ష్మి తెలిపారు. సైఫాబాద్‌లోని గృహ విజ్ఞాన కాలేజీ ప్రాంగణంలో ఈ కోర్సు నిర్వహిస్తామని, అభ్యర్థులు 8019115363/ 9059320689 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రద్దన్నరు.. కాదన్నరు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులు 75 మెడిసిన్ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఓ కళాశాల నిబంధనలు ఉల్లంఘించిందంటూ తొలుత రెండేళ్లు అడ్మిషన్లు జరపకుండా ఉత్తర్వులిచ్చిన ఆరోగ్య శాఖ.. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పటికే ఎంబీబీఎస్ సీట్ల తది కౌన్సెలింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. సంతకాలు సరిపోలేదని..: మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 2017–18 విద్యాసంవత్సరంలో 150 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహణకు కేంద్ర ఆరోగ్య శాఖ రెన్యువల్ జారీ చేసింది. అయితే భారత వైద్య మండలి (ఎంసీఐ) గతేడాది డిసెంబర్ 6, 7ల్లో ఆ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేసి ఓ అధ్యాపకుడు, ఇద్దరు రెసిడెంట్ డాక్టర్ల సంతకాలు సరిపోలలేదని తేల్చింది. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించింది. సదరు కమిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించకముందే వైద్య కళాశాల స్థాపన నిబం ధనల్లోని 8(3)(1)(డీ)ని అమలు చేస్తూ 2018–19, 2019–20 ల్లో కళాశాల అడ్మిషన్లు జరపకుండా నిషేధించాలని కేంద్రానికి ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ సిఫారసు చేసింది. కేంద్రం 2018 మే 31న అడ్మిషన్లు తీసుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చింది. నిబంధనలో ఎక్కడా లేదంటూ.. అడ్మిషన్ల రద్దుపై కళాశాల పలు అభ్యర్థనలు చేయగా తిరిగి ఆగస్టు 31న ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నట్లు కేంద్రం మరో ఉత్తర్వు జారీ చేసింది. సంతకాలు సరిపోని విషయం తనిఖీలో తేలగా అది ఫోర్జరీ సంతకమా కాదా అని ఎథిక్స్ కమిటీ పరిష్కరించలేదని, కానీ తదుపరి విచారణ చేయకుండానే 8(3)(1)(డీ) నిబంధనను అమలు చేస్తూ అడ్మిషన్ల నిరాకరణకు ఎంసీఐ సిఫారసు చేసిందని ఉత్తర్వులో పేర్కొంది. అధ్యాపకులకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాల్లో అవకతవకలుంటే ఈ నిబంధన ఉపయోగించవచ్చని, అయితే కోర్సులో ప్రవేశాలు అనుమతించరాదని నిబంధనలో ఎక్కడా లేదంది. అప్పటికే ముగిసిపోయింది..: సంతకాలు సరిపోని వ్యవహారం పరిష్కరించకుండా అడ్మిషన్లను నిరాకరించడం వల్ల విద్యార్థులు నష్టపోయారు. కొత్త ఉత్తర్వులు ఆగస్టు 31న వచ్చినా అదే తేదీన ప్రవేశాల గడువు ముగిసింది. ఉత్తర్వులు అందిన వెంటనే యాజమాన్య కోటాలోని బీ, సీ కేటగిరీలో 75 సీట్లను సంస్థ భర్తీ చేసింది. కానీ కౌన్సెలింగ్‌కు గడువు లేకపోవడంతో విద్యార్థులు 75 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కౌన్సెలింగ్ పొడిగింపునకు కోర్టు నో: అడ్మిషన్ల పునరుద్ధరణ ఉత్తర్వులు ఆగస్టు 31న వచ్చినందున కౌన్సెలింగ్‌కు గడువు పొడిగించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని సంస్థ అభ్యర్థించింది. ఆగస్టు 31ని మించి ప్రవేశాలు జరపరాదని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలిచ్చినందున కౌన్సెలింగ్ పొడిగింపు అనుమతికి సుప్రీంను వర్సిటీ ఆశ్రయించింది. బుధవారం పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. వర్సిటీ అభ్యర్థనను తోసిపుచ్చింది. -
డయాబెటిస్ కౌన్సెలింగ్
ఈ వయసులో సర్జరీని తట్టుకోగలరా? మా నాన్నగారి వయసు 58 ఏళ్లు. ఏడాదిన్నర కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ మాత్రం నడిచినా విపరీతంగా ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే, బైపాస్ చేయాలంటున్నారు. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? పైగా బైపాస్‌లో ఛాతీ ఎముకలను కోస్తారని తెలిశాక ఆయన, ఆయనతో పాటు మేమందరమూ ఆందోళన పడుతున్నాం. దయచేసి సలహా ఇవ్వండి. – సీహెచ్. చంద్రశేఖర్, నిజామాబాద్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు మాత్రమే ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా క్లాట్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, ఆత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50 పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కార్డియోమయోపతి అంటే ఏమిటి...? నా వయసు 39 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస సరిగా అందడం లేదు. ఎప్పుడూ విపరీతమైన అలసట. దాంతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మా ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుంటే కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. ఆయన ‘కార్డియోమయోపతి’ కావచ్చని అంటూ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వ్యాధి ఏమిటి? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – పి. శ్రీరాములు, చిత్తూరు కార్డియోమయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీలో కనిపిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యుటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధిచెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు. - డాక్టర్ సత్య శ్రీధర్ కాలే, సీనియర్ కార్డియో–థొరాసిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
డయాబెటిస్ కౌన్సెలింగ్
నాకు డయాబెటిస్ అంటున్నారు... మంచి డైట్ సూచించండి నా వయసు 34 ఏళ్లు. ఇటీవలే జనరల్ హెల్త్ పరీక్ష చేయించుకుంటే డయాబెటిస్ ఉన్నట్లు వచ్చింది. దయచేసి నాకు ఆరోగ్యకరమైన డైట్ సూచించండి. – ఎల్. సునీత, ఖమ్మం డయాబెటిస్ కనుగొన్న తర్వాత డాక్టర్ సూచించిన మందులతో పాటు వారి వారి వ్యక్తిగత బరువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆహారనిపుణులు వారికి వ్యక్తిగతంగా ఆహారపు నిబంధనలు (డైట్ చార్ట్) సూచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్నవి డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన సాధారణ ఆహార నిబంధనలు మాత్రమే. పిండిపదార్థాల విషయానికి వస్తే అవి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (పంచదార) పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను తీసుకోవాల్సి వస్తే... ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్)లోనూ, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి అవసరం. ప్రోటీన్లు. గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమైనో ఆమ్లాలను అందిచడంలోనూ దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటివి వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి. అంతే మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వేటమాంసం, రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక కొవ్వుల విషయానికి వస్తే మన శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరమైనందున వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటివి తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు. ఇక నూనెల విషయానికి వస్తే పాలీ అన్‌శాచ్యురేటెడ్ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలనూ ఉదయం వేళల్లోనూ... ఇక మోనో అన్‌శ్యాచ్యురేటెడ్ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయానూనె, ఆలివ్ ఆయిల్‌ను సాయంత్రం వేళల్లో ఉపయోగించడం మంచిది. ఇలా వీలు కాకపోతే ఒక నెలంతా ప్యూఫా, మరో నెలంతా మ్యూఫా నూనెలను మార్చి మార్చి ఉపయోగించడం వల్ల మధుమేహం ఉన్నవారికే గాక అందరికీ మంచిది. గుండె, శరీరానికి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒక పరిమితి మించకుండా కొవ్వు పదార్థాలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు 50 గ్రాములకు మించి నూనె ఉపయోగించకూడదు. అంటే నెలకు 450 గ్రాములు అన్నమాట. కొండగుర్తుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నెలకు అర్ధలీటరుకు మించకుండా నూనె వాడటం శ్రేయస్కరం. డయాబెటిస్ రోగులు నేరుగా తీసుకోకూడని పదార్థాలు పంచదార / వాటితో తయారు చేసిన పదార్థాలు ,తేనె , జామ్స్ / జెల్లీస్ , కేకులు / పేస్ట్రీలు ,పళ్లరసాలు , మద్యం (పండ్లను పండ్లరసాల రూపంలో తీసుకోవడం కంటే నారింజ, కమలాపండు, జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను కొరికి తినడం మంచిది). గుర్తుంచుకోవాల్సిన విషయాలు ♦ మొలకెత్తిన గింజలు తీసుకోవడం మధుమేహరోగుల ఆరోగ్యానికి మంచిది. ♦ నేల కింద పండే దుంపలు (ఆలు, చిలగడ, కంద వంటి దుంపలు) డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. నేల కింద పండే వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని డయాబెటిస్ రోగులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ నిబంధన నుంచి ముల్లంగికి మినహాయింపు ఉంది. డయాబెటిస్ రోగులు ముల్లంగిని తీసుకోవచ్చు. ♦ మద్యం, పొగతాగడం అలవాట్లను పూర్తిగా మానేయాలి. ♦ ఈ ఆహారంతో పాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు. డయాబెటిస్ ఉంది... పాదాల జాగ్రత్తలు ఏమిటి? నా వయసు 65. నేను గత పదేహేనేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇది ఉన్నవారు తమ పాదాలను సురక్షితంగా చూసుకోకపోతే కాళ్లను తొలగించే పరిస్థితి వస్తుందని విన్నాను. డయాబెటిస్ రోగులు పాదసంరక్షణలో పాటించాల్సిన సూచనలు ఏమిటి? – కె. రామచంద్రరావు, నిజామాబాద్ షుగర్ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి... తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండటం ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. ♦ నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి. ♦ కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి ♦ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది ♦ పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వేజ్లైన్తో కాళ్లను రుద్దుకొని, ఆ తర్వాత పొడిగా మారేలా శుభ్రం చేసుకోవాలి ♦ కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం ♦ కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం. ♦ ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి ♦ ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి. బార్డర్‌లైన్ అంటున్నారు... డయాబెటిస్ దాదాపుగా వచ్చినట్టేనా? నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. కామేశ్వరి, విజయవాడ మీరు పరగడుపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక చేయించిన రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క. ఇక నిర్దిష్టంగా చెప్పాలంటే... హెచ్‌బీఏ1సి విలువ 5.6 నుంచి 6.5 వరకు ఉన్నా లేదా పరగడుపున చేయించిన రక్తపరీక్షలో చక్కెర 100 నుంచి 125 ఉన్నా, భోజనం చేశాక రక్తంలో చక్కెర 140 నుంచి 200 లోపు ఉన్నా దాన్ని బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. - డాక్టర్ ప్రశాంత్‌చంద్ర ,కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేట్, హైదరాబాద్ -
కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. -
కొడుకులు బువ్వ పెట్టడం లేదని..
వెల్గటూరు (ధర్మపురి): కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడంలేదని, న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో బుధవారం జరిగింది. ఎస్ఐ మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని రాజారాంపల్లికి చెందిన బండ వెంకయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు కుమారులు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. తమకున్న ఆస్తిని సమానంగా పంచి ఇచ్చారు. ఈ క్రమంలో వృద్ధాప్యం దరి చేరడంతో తల్లిదండ్రులను కొడుకులు నెలనెలా ఒకరు సాదాలని నిర్ణయించుకున్నారు. కొన్నిరోజులుగా వీరిని ఏ కొడుకూ పట్టించుకోవడం లేదు. కనీసం బువ్వ కూడా పెట్టడంలేదని పేర్కొంటూ వెంకయ్య (75) బుధవారం ఠాణాకు చేరాడు. తమ చేతిలో చిల్లి గవ్వలేదని, తనకు వచ్చే పింఛన్‌పైనే ఇద్దరం కాలం వెళ్లదీస్తున్నామని వాపోయాడు. వృద్ధుడి బాధ విన్న ఎస్ఐ అతడి నలుగురు కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తండ్రి పేరిట ఉన్న 18గుంటల భూమిని ఎవరూ పంచుకోవద్దని హెచ్చరించారు. చేతనైనన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉంటారని, ఆ తర్వాత కొడుకులందరూ తల్లిదండ్రులను తలా కొన్ని రోజులు సాకాలని సూచించారు. అనంతరం వృద్ధ దంపతులను ఓదార్చి ఇంటికి పంపించారు. -
బీసీ విద్యార్థులకు అన్యాయం
ఢిల్లీ: ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో 550 మంది, తెలంగాణలో 250 మంది నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన విద్యార్థులకు ఎన్నారై మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడులు కౌన్సెలింగ్‌లో అన్యాయం చేశారని మండిపడ్డారు. హడావుడిగా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేశారని చెప్పారు. కౌన్సిలింగ్ హైకోర్టు తీర్పు ప్రకారం జరగడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు భారీగా నష్టపోయారని వెల్లడించారు. జీవో 550 ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు మాట్లాడుతూ..జీవో 550ని సుప్రీంకోర్టు సమర్ధించడం హర్షణీయమన్నారు. అయితే ఈ ఏడాది హైకోర్టు తీర్పు ప్రకారం జరిగిన కౌన్సెలింగ్‌లో తాము జోక్యం చేసుకోమని చెప్పడం వల్ల 500 మందికి పైగా విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేందుకు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఆధిపత్య కులాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు హడావిడిగా కౌన్సిలింగ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. -
ట్రిపుల్ ఐటీల రెండో విడత కౌన్సెలింగ్‌లో ప్రతిష్టంభన!
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణలో ప్రతిష్టంభన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సామాజిక విద్యా వెనుకబాటుతనం కింద అదనంగా కల్పించిన 0.4 డిప్రెవేషన్ స్కోర్ విషయమై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ విధమైన చర్యలు చేపట్టవద్దని ఆదేశించడంతో రెండో విడత కౌన్సెలింగ్ నిలిచిపోయింది. గత నెల 4 నుంచి 7 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించగా నాలుగు ట్రిపుల్‌ఐటీలకు కలిపి 3,743 సీట్లకు 3,258 సీట్లు భర్తీ అయ్యాయి. 485 సీట్లు మిగిలాయి. ట్రిపుల ఐటీలవారీగా నూజివీడులో 90, ఇడుపులపాయలో 123, శ్రీకాకుళంలో 135, ఒంగోలులో 137 సీట్లు మిగిలాయి. అలాగే ప్రత్యేక కేటగిరీ కింద ఉన్న 257 సీట్లు కలిపి మొత్తం 742 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తనకు మెరిట్ ఉన్నా ట్రిపుల్ ఐటీలో సీటు ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డిప్రెవేషన్ స్కోర్ 0.4ను ఈ ఏడాది కూడా కలపడంపై రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించవద్దని ఆదేశించడంతో గత నెల 20 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన రెండో విడత కౌన్సెలింగ్ నిలిచిపోయింది. 0.4 డిప్రెవేషన్ స్కోర్ వద్దంటూ గతంలోనే తీర్పు గతేడాది ఇదే అంశంపై డిప్రెవేషన్ స్కోర్ కలపడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటు సూచీ కిందే రిజర్వేషన్లు అమలవుతున్నందున మళ్లీ అదే పేరుతో ప్రత్యేకంగా 0.4 డిప్రెవేషన్ స్కోర్ అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్జీయూకేటీ అధికారులు ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వారి సూచనల మేరకు 0.4 డిప్రెవేషన్ స్కోర్ కలిపారు. ఈ ఏడాది ఇదే పద్ధతిలో ప్రవేశాలు నిర్వహించడంతో హైకోర్టు రెండో విడత కౌన్సెలింగ్ నిలిపేసింది. రెండో విడత కౌన్సెలింగ్ లేనట్టేనా! ప్రవేశాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నందున రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్పోర్ట్స్, ఎన్సీసీ, పీహెచ్సీ, సైనికోద్యోగుల కోటా కింద సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఏదైనా కాలేజీలో చేరిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తే తాము చెల్లించిన వేలాది రూపాయలు తిరిగి రావనే ఆందోళనతో ఉన్నారు.అయితే రెండో విడత కౌన్సెలింగ్ తిరిగి ఎప్పుడు ఉంటుందో కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ట్రిపుల్ఐటీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు నుంచి స్పష్టత వచ్చాకే.. రెండో విడత కౌన్సెలింగ్ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఇంకా కోర్టు నుంచి స్పష్టత రాలేదు. ఒకటి, రెండు వారాల్లో స్పష్టత వస్తుందనుకుంటున్నాం. అది రాగానే రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తాం. – ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్ -
74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డైరెక్టరేట్ పరిధి లోని బోధనాసుపత్రుల్లో 74 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీగా ఉన్న 225 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇప్పటికే సివిల్ సర్జన్లుగా పనిచేస్తున్న డాక్టర్లను సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. 25 స్పెషాలిటీలకు 350 మందిని కౌన్సెలింగ్‌కి పిలిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో 45, గాంధీలో 9, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 28, నిజామాబాద్ జీఎంసీలో 18, సిద్దిపేట జీఎంసీలో 10, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏడు పోస్టులతోపాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న నల్లగొండ జీఎంసీ కోసం 49, సూర్యాపేట జీఎంసీ కోసం 44 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరముంది. అనస్థీషియా, అనాటమీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీలకు అర్హులైన డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం 74 పోస్టులు భర్తీ కాగా మిగిలిన వాటిని డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. ప్రస్తుతం ఎంపి క చేసిన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
న్యూరో సర్జరీ కౌన్సెలింగ్స్
ట్యూమర్‌కు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయాలన్నారు. అంటే ఏమిటి? మా నాన్నగారి వయసు 65 ఏళ్లు. గత పదేళ్లుగా ఆయనకు డయాబెటిస్ ఉంది. ఈమధ్య ఆయనను డాక్టర్‌కు చూపించాం. వారు పరీక్షలు చేసి మెదడులో గడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత అది హానికరం కాని బినైన్ గడ్డ అని, క్యాన్సర్ గడ్డ కాదని చెప్పారు. అయితే దీనికి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయాలన్నారు. ఈ సర్జరీ అంటే ఏమిటి? దీనివల్ల మెదడుపైన ఏదైనా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – కె. వీరరాఘవులు, నెల్లూరు మెదడులో గడ్డలను తొలగించడానికి ప్రస్తుతం రేడియో సర్జరీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రేడియో సర్జరీలలో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అత్యాధునికమైనది. చాలా కీలకమైనది కూడా. క్యాన్సర్‌తో సంబంధం లేని, నిరపాయకరమైన 3 సెం.మీ. లోపు బినైన్ బ్రెయిన్ ట్యూమర్లను తొలగించడానికే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడ్డ క్యాన్సర్ మెదడుకు విస్తరించడం వల్ల ఏర్పడే మెటాస్టాటిక్ బ్రెయిడ్ డిసీజ్‌కు ఇది అత్యంత ప్రభావవంతమైన శస్త్రచికిత్సగా చెప్పవచ్చు. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో పేషెంట్ల శరీరంపై ఎలాంటి కోతలు ఉండవు. పుర్రెకు కోత పెట్టకుండా మెదడుకు శస్త్రచికిత్స చేయగలగడం వల్ల ఏమాత్రం రక్తస్రావం లేకుండానే సర్జరీ జరుగుతుంది. కంప్యూటర్ సహాయంతో పనిచేసే ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ మెదడులోని గడ్డను కచ్చితమైన లక్ష్యంగా చేసుకొని ఈ శస్త్రచికిత్స చేస్తారు. మెదడులోని గడ్డ పరిమాణాన్ని బట్టి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని ఒకటి నుంచి ఐదుసార్లు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ చికిత్స చేయించుకున్న రోజునే పేషెంటు ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని మెదడు వ్యాధులకు సంప్రదాయ శస్త్రచికిత్సలతో వైద్యం చేయడం సాధ్యం కావడం లేదు. రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలలో అసాధారణ పరిస్థితి, నాడీకణాలకు నష్టం వాటిల్లే పరిస్థితి లేదా ఇతరత్రా కారణాల వల్ల మెదడులో గడ్డ ఏర్పడ్డ స్థానానికి స్కాల్పెల్ (శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి) వంటి శస్త్రచికిత్స పరికరాలను చేర్చడం సాధ్యం కాదు. అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని పేషెంట్లు శస్త్రచికిత్సను తట్టుకోవడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేడియో సర్జరీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తున్నది. మీ డాక్టర్ సూచించిన స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చాలా సురక్షితమైనది. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి వారు సూచించిన చికిత్స చేయించండి. పిట్యూటరీ కార్సినోమా కావచ్చు అంటున్నారు... నా వయసు 38 ఏళ్లు. ఒక నిర్మాణ సంస్థ తాలూకు సైట్లో పనిచేస్తుంటాను. ఏడాదికాలంలో నా కంటి చూపు క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. దాంతో ఇదివరకటిలా రంగులు స్పష్టంగా కనిపించడం లేదు. ఒక్కోసారి పూర్తిగా చీకటిగా కూడా అనిపిస్తోంది. ముఖం మొద్దుబారినట్లయి, మైకం కమ్ముతోంది. దాంతో ఉద్యోగంలో బాగా ఇబ్బందిగా అనిపించి, కళ్ల డాక్టరుకు చూపించాను. సైట్ ఏమీ లేదని చెప్పి, హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రిలో చూపించమన్నారు. అక్కడికి వెళ్లి చూపించాను. వాళ్లు పిట్యూటరీ కార్సినోమా కావచ్చని అంటున్నారు. అంటే నా కళ్లకు క్యాన్సర్ వచ్చినట్లా. పిట్యూటరీ కార్సినోమా అంటే ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – ఆర్. డేవిడ్, జనగామ పిట్యూటరీ కార్సినోమా అన్నది కళ్లకు సంబంధించిన వ్యాధి కాదు. కళ్ల క్యాన్సర్ కాదు. పిట్యూటరీ కార్సినోమా అన్నది పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్ గడ్డ. పిట్యూటరీ గ్రంథి మెదడులో భాగమైన హైపోథాలమస్ దిగువ భాగం నుంచి పొడుచుకువచ్చినట్లుగా బఠాణీగింజ అంత పరిమాణంలో ఉంటుంది. శరీరంలోని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటినీ అదుపు చేయగలది కావడం వల్ల దీనికి మాస్టర్గ్లాండ్ అని పేరు. పిట్యూటరీ గ్రంథి గడ్డలు మనదేశంలో సాధారణంగా కనిపించేవే. ఈ గడ్డల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు కానటువంటి సాధారణ గడ్డ (పిట్యుటరీ ఎడినోమా)లు. ఇక రెండో రకానికి చెందినవి పిట్యూటరీ కార్సినోమా (క్యాన్సర్) గడ్డలు. ఎండోక్రైన్ ట్యూమర్స్ అని పేర్కొనే ఈ క్యాన్సర్ గడ్డలు అరుదుగా కనిపిస్తాయి. వీటి నుంచి క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలదు. దీనివల్ల పిట్యూటరీ గ్రంథి పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల మీలో కనిపిస్తున్న లక్షణాలే కాకుండా తీవ్రమైన తలనొప్పి, స్పృహతప్పడం, హైపోథైరాయిడిజం, సెక్స్ (పురుషుల్లో టెస్టోస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్) హార్మోన్ల ఉత్పత్తి మందగించడం, ఎడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. పిట్యూటరీ గడ్డలు ఏర్పడటానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ ప్రభావంగానీ, జీవనళైలి గానీ వీటికి దారితీస్తున్నట్లుగా కూడా ఆధారాలు లేవు. హఠాత్తుగా ఏర్పడే ఈ గడ్డలు వంశపారంపర్యంగా కూడా రావడం లేదు. అయితే ప్రమాదకర స్థాయిలో రేడియేషన్‌కు గురికావడం, క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం వల్ల వ్యక్తి శరీరకణాల్లోని జన్యువులు ఉత్పరివర్తనానికి (మ్యూటేషన్స్‌కు) గురికావడం వంటి కారణాల వల్ల పిట్యూటరీ గడ్డలు ఏర్పడుతుండవచ్చునని పరిశోధకులు ఊహిస్తున్నారు. శరీరంలో హార్మోన్నల హెచ్చుతగ్గుల ఆధారంగా పిట్యూటరీ గ్రంథి గడ్డలను అనుమానించినప్పుడు, దాన్ని నిర్ధారణ చేసేందుకు ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అవి క్యాన్సర్ గడ్డలు అవునా, కాదా అని నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో పిట్యూటరీ కార్సినోమా వల్ల క్యాన్సర ఇతర భాగాలకు వ్యాపించిన తర్వాతగా గానీ వాటిని గుర్తించడం సాధ్యపడటం లేదు. ఇది మెదడులోని ఇతర ప్రాంతాలకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం కూడా జరుగుతుంది. మీరు మీ దగ్గర ఉన్న పెద్ద మెడికల్ సెంటర్లో సంప్రదించగలరు. బ్రెయిన్ ట్యూమర్లతో వినికిడి దెబ్బతిన్నది... ఏం చేయాలి? నా వయసు 40 ఏళ్లు. దాదాపు పదేళ్ల కిందట మెదడులో గడ్డ ఏర్పడిందని గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ఆ ట్యూమర్ (గడ్డ) తొలగించాక ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ చెవిలో ఇప్పుడు నిరంతరం శబ్దం వస్తోంది. ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లకు మరో గడ్డను గుర్తించి రేడియేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో చెవిలోనూ శబ్దాలు వస్తున్నాయి. సరిగా వినిపించడం లేదు. తలలో ట్యూమర్లు పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని విన్నాను. నిజమేనా? చెవిలో హోరు తగ్గేదెలా? నా వినికిడి శక్తి మెరుగుపడటానికి మార్గం ఉందా? దయచేసి తగిన విధంగా నన్ను గైడ్ చేయండి. – డి. రామభూపాల్‌రెడ్డి, కర్నూలు మెదడులో ట్యూమర్లు... మెదడు, కేంద్రనాడీ మండలంలోని వివిధ రకాల కణాల నుంచి ఏర్పడతాయి. బినైన్, మాలిగ్నెంట్ అని వీటిలో రెండు రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకొని ఉండవు. అందువల్ల అవి ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలైతే, వీటిని సులభంగా తొలగించి వేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకాలు కావు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా... ఇవి మళ్లీ తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ మెదడులో ఏర్పడినవి బినైన్ ప్రైమరీ ట్యూమర్లు కావచ్చు. అందువల్ల ఒకవైపు తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడ్డాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తూ, శరీరంలోని వేర్వేరు అవయవాలను/భాగాలను నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగంలో మెదడు తన విధిలను నిర్వహంచడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, శరీరంలోని వివిధ భాగాల్లో / అవయవాల పనితీరులో దాని ప్రభావం కనిపిస్తుంది. పదకొండేళ్ల కిందట మీరు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీతో పోలిస్తే... మెదడు ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు అసాధారణమైన ఠమెదడులో ఏర్పడిన ట్యూమర్లను ఇప్పుడు సమూలంగా తొలగించడంతో పాటు, వారు సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధం చేయడం కూడా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో భాగంగా రూపొందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం చేయకుండా, మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమరును తొలగించివేయగల వైద్యసాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్యపరిస్థితిని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సరైన విధానాన్ని మీకు సూచించగలుగుతారు. ఇక మీ వినికిడి శక్తిని పునరుద్ధరించే విషయంలో ఈఎన్టీ వైద్యనిపుణుడి సాయం అవసరమా అని నిర్ధారణ చేస్తారు. - డాక్టర్ రవి సుమన్ రెడ్డి, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ఇంజనీరింగ్‌లో 27 వేల మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. కొత్తగా 13,206 మందికి సీట్లు లభించగా, తొలి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేలమందికిపైగా సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్లెటర్లను https://tseamcet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో 52వేలమందికి సీట్లను కేటాయించినా, 38 వేల మందే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,02,615 మంది ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనవారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా వెరిఫికేషన్‌కు హాజరైనవారు 4,594 మంది ఉన్నారు. 17,876 సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు ఉండగా, అందు లో 51,345 మందికి సీట్లను (74.18%) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు ఉన్నాయి. అందులో 51,157 సీట్ల (77.93%)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటా యించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక 1,856 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు లభించలేదు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 19తో ముగియనుంది. ఆ తర్వాత మరో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. 24 కాలేజీల్లో 50 మందిలోపే..: రాష్ట్రంలో 189 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. అందులో 2 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 7 కాలేజీల్లో 9 మందిలోపే చేరగా, 24 కాలేజీల్లో 50 మందిలోపే చేరారు. మరో 43 కాలేజీల్లో 100 మందిలోపు చేరారు. 60 కాలేజీల్లో మాత్రం 100% కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 48 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 12 వర్సిటీ కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 15లోగా ఫీజు చెల్లించండి.. సీట్లు లభించిన విద్యార్థులు అలాట్ మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 15లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి(వర్తించేవారు), సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని, కాలేజీలో రిపోర్టు చేయనివారి సీటు రద్దవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు 16లోగా కాలేజీల్లో ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలని, చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. డిగ్రీలోనూ మరో విడత కౌన్సెలింగ్..: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక విడత సీట్ల కేటాయింపును ప్రకటించనున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్ ) మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలు, ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక దీనిని నిర్వహించాలని భావిస్తోంది. -
నేషనల్ పూల్‌లోకి 173 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మరో 15 బీడీఎస్ సీట్లు కూడా పూల్‌లో చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య విద్య అదనపు జనరల్ కార్యాలయం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మొదటిసారిగా రాష్ట్రం నేషనల్ పూల్‌లోకి వెళ్లడంతో 173 ఎంబీబీఎస్, 15 బీడీఎస్ సీట్లకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడతారు. ఇప్పటికే నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కానీ మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్ పూల్‌లో చేర్చలేదు. తాజాగా చేర్చడంతో వచ్చే నెల 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్ కౌన్సెలింగ్ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 4,890 సీట్లు అందుబాటులోకి.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం ప్రకారం 4,890 సీట్లు నేషనల్ పూల్‌లోకి వచ్చాయి. ఆయా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని, ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 ప్రభుత్వ సీట్లకే పోటీ పడే తెలంగాణ విద్యార్థులకు, ఇక దేశంలోని దాదాపు 5 వేల నేషనల్ పూల్ సీట్లలో కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. 28 వరకు ఈసెట్ వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈ నెల 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయినవారు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు(లెటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ సోమ వారం మొదలైంది. 1 నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను వెరిఫికేషన్‌కు ఆహ్వానించగా 4,811 మంది హాజరయ్యారని కమిటీ తెలిపింది. నేడు 6,001వ ర్యాంకు నుంచి 14 వేల ర్యాంకు వరకు సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ‘పార్ట్‌టైం’ టీచర్ పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్లో పార్ట్‌టైం టీచ ర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.సుజాత తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూప్–4 వంటి పోటీ పరీక్షలకు సంబంధించి పాఠాలను భోధించడానికి అనుభవం కలిగిన లెక్చరర్లు అర్హులన్నారు. పేపర్–1లో జనరల్ నాలెడ్జ్(కరంట్ ఎఫైర్స్), పేపర్– 2లో మెంటల్ ఎబిలిటీ, వెర్బల్–నాన్ వెర్బల్ తదితర సబ్జెకులను బోధించడానికి ఆసక్తి గల వారు తమ బయోడేటాను bcstudycircle&hyd@yahoo. co.in కు మెయిల్ చేయాలని తెలిపారు. ఈ నెల 28 లోగా అర్హతలు, అనుభవంతో కూడిన సర్టిఫికెట్ల కాపీ లను మెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 2018–19 విద్యాసంవత్సరానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో అడ్మిషన్లు స్వీకరించేందుకు సోమవారం వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 29 మధ్యాహ్నం రెండు గంటల నుంచి జూలై 12 సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. అర్హుల జాబితాను జూలై 15న వెబ్సైట్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను జూలై 16 నుంచి 19 వరకు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఫలితాలు 27న విడుదల చేస్తామన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆగస్టు 10న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 16 నుంచి తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.knruhs.in లో సంప్రదించాలన్నారు. నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఎస్సీ విద్యార్థులకు ఇవ్వనున్న నీట్లాంగ్టర్మ్ కోచింగ్ 2018–19 ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం 2 లక్షలలోపు ఉండి, నీట్లో 250 మార్కులకు పైగా, తెలంగాణ ఎంసెట్‌లో 80 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు ఈ కోచింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www. tswreis.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. 28 నుంచి హాస్టల్ వెల్ఫేర్ దరఖాస్తుల్లో సవరణలు సాక్షి, హైదరాబాద్: బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న కొంత మంది అభ్యర్థుల బయోడేటా వివరాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పీడీఎఫ్ రూపంలో ఉండే తమ బయోడేటా వివరాలను సరిచూసుకుని తప్పులు ఉంటే ఈ నెల 28 నుంచి 30 వరకు సవరించుకోవాలని సూచించింది. వెబ్సైట్లో ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని సవరించుకోవాలని పేర్కొంది. రెండు శాఖల్లోని పోస్టులకు వచ్చే నెల 29న ఒకే పరీక్షను(ఉదయం, మధ్యాహ్నం) నిర్వహించనున్నట్లు వివరించింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 28న వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 28న రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10కి వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. 9 నుంచి ఎడ్‌సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వచ్చే నెల 9 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామంది. 9 నుంచి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని, అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. నేడు డీసెట్ ఎడిట్ ఆప్షన్ సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి డీసెట్ అభ్యర్థులకు మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని డీసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు http://deecet.cdse.telangana.gov.in లో చూడాలని, సందేహాలకు 6300767628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఆయనపై మనసు పారేసుకున్నా.. ఎలాగైనా కలుస్తా
ఉజ్జయిని: సినిమా స్టార్లు, క్రికెటర్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. తమకు ఇష్టమైన వారిని కలుసుకునేందుకు అభిమానులు ఎంత దూరమైనా వెళ్తుంటారు. అయితే పంజాబ్‌లోని హోషియార్పూర్ కు చెందిన ఓ యువతి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్‌ను చూసి ఫిదా అయింది. ఇక అంతే.. ఆ ఆఫీసర్‌ను కలుసుకోవాలని సదరు యువతి నానాతంటాలు పడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎస్ సచిన్ అతుల్కర్(34).. మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఐపీఎస్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన 27 ఏళ్ల యువతి ఆయనపై మనసు పారేసుకుంది. అంతే ఆయనను ఎలాగైనా కలవాలనుకుని మూడు రోజుల క్రితం ఉజ్జయిని వచ్చింది. అప్పటి నుంచి సచిన్‌ను చూడాలని ఎస్పీ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జి రేఖా వర్మ యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అయితే తనకు అతుల్కర్ అంటే అభిమానమని, ఆయనను కలవాల్సిందేనని యువతి స్పష్టం చేయడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినా.. యువతి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇక చేసేదిమి లేక పంజాబ్‌కు పంపించేందుకు నగ్డా రైల్వేస్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. తనను రైలు ఎక్కిస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో.. చేసేదేమి లేక పోలీసులు ఆమెను వెనక్కు తీసుకువచ్చారు. ఆమె పిజ్జాలు సహా తనకు నచ్చిన ఆహారాన్ని డిమాండ్ చేస్తోందని, తాము ఓపికగా వాటిని అందిస్తున్నామని రేఖా వర్మ వెల్లడించారు. యువతి సైకాలజీలో పిజీ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ విషయంపై సచిన్ అతుల్కర్ స్పందించారు. ఓ అధికారిగా తాను ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రహ్మచారిగా ఉన్న అతుల్కర్, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. రోజుకు 70 నిమిషాలు జిమ్ లో గడిపే ఆయన గతంలో పలు ఫిట్నెస్ అవార్డులనూ సొంతం చేసుకున్నారు. -
ఇంజనీరింగ్‌లో 52,621 మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ప్రవేశాల కమిటీ విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 186 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 64,946 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశలో 52,621 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది. 12,325 సీట్లు ఖాళీగా ఉన్నాయని, సీట్లు పొందిన విద్యార్థులకు సమాచారాన్ని తెలియజేశామని ప్రవేశాల కమిటీ శుక్రవారం పేర్కొంది. 81 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 14 యూనివర్సిటీ, 67 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. సింగిల్ డిజిట్లో విద్యార్థులు చేరిన కాలేజీలు 2 ఉన్నాయి. 20 కాలేజీల్లో 50 మందిలోపు, 45 కాలేజీల్లో 100 మందిలోపే విద్యార్థులు చేరినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సరైన ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా 5,427 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. ఇంజనీరింగ్ 12,325 సీట్లు, బీఫార్మసీలో 2,109 సీట్లు, ఫార్మ్–డిలో 117 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి... విద్యార్థులు వెబ్సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకుని నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. https://tseamcet.nic.in లో లాగిన్ అయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అనంతరం జాయినింగ్ రిపోర్టును డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఇచ్చామని తెలిపారు. నిర్ణీత తేదీలోగా ఫీజు చెల్లించకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా వారి సీటు రద్దవుతుందని పేర్కొన్నారు. రెండో దశ తర్వాతే కాలేజీల్లో చేరికలు... పీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా రెండో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు తర్వాతే కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన తర్వాత కూడా సీటు రద్దు చేసుకోవాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఆన్లైన్లో రద్దు చేసుకోవాలని, వారు చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు కావాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని, ఆప్షన్లను మార్చుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు డిగ్రీలో సీట్లు వచ్చి ఉంటే వారు డిగ్రీ వద్దనుకొని రీలింక్విష్‌మెంట్‌కు అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించారు. జూలై 16 నుంచే తరగతులు ఇంజనీరింగ్ కాలేజీల్లో జూలై 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ వరకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై చివరి వారంలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కాలేజీ పరిధిలో ఇంటర్నల్ స్లైడింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు. -
పోలీసులపై దాడికి యత్నం
సూర్యాపేటరూరల్ : భార్యాభర్తల పంచాయితీ విషయంలో పోలీసులపై దాడికి యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్‌తో సూర్యాపేట మండలం య ర్కారం ఆవాసం దుబ్బతండాకు చెందిన లీలావతికు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సం తానం. అయితే కొంతకాలంగా అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ భర్త బాలు నాయక్‌పై భార్య లీలావతి మూడు రోజుల క్రితం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విషయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు గాను ఎస్ఐ శ్రీనువాస్ ఇరువర్గాలను గురువారం స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వస్తూనే పోలీసులపై ఆగ్రహం..? మిర్యాలగూడ నుంచి బాలునాయక్, అతని తమ్ముడు రమేష్‌తో పాటు మరి కొందరు బంధువులు స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్‌కు వస్తూనే బాలునాయక్ తమ్ముడు రమేష్ తాను డీజీపీ వద్ద డ్రైవర్‌గా పని చేస్తానని, కేసు విషయంలో నువ్వు ఎంత తీసుకుని మమ్ముల్ని పిలిపించావని ఎస్ఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. స్టేషన్లో ఉన్న పోలీసులు బాలునాయక్, రమేష్‌లను సముదాయించి స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాలునాయక్, రమేష్‌తో పాటు వచ్చిన బంధువులు అందరూ కలిసి పోలీసులపై దాడి చేసే యత్నించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దాడికి యత్నించిన వారు మద్యంతాగి ఉండడంతో పోలీసులు సముదాయించినా వినలేదు. భార్య బంధువుల ప్రతిఘటనతో.. అయితే బాలునాయక్ బంధువులు పోలీసులపై దాడికి యత్నిస్తున్న తీరును చూసి అవాక్కౖన లీలావతి బంధువులు ప్రతిఘటించి వెంబడించా రు. దీంతో బాలునాయక్ బంధువులు పరారీ కావడంతో గొడవ సద్దుమణిగింది. బాలునాయక్, బంధువులను సముదాయించే సమయంలో హోంగార్డు జానకిరాములు కిందపడిపోయాడు. ఆరుగురిపై కేసు నమోదు.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురిపై కేసు న మోదు చేసినట్లు సూర్యాపేట వన్‌టౌన్ ఎస్ఐ క్రాం తికుమార్ తెలిపారు. కేసు నమోదైన వారిలో రాళ్లవాగుతండాకు చెందిన బాలునాయక్, రమేష్, రా జేశ్వరి, రమావత్ శాంతి, వినోద, కవిత ఉన్నారు. స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు స్టేషన్‌కు వచ్చారు. ఘర్షణ జరిగిన సంఘటన గురించి సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ శ్రీని వాస్‌ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్‌లపై దాడి చేసే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు. -
‘క్లాట్’ కౌన్సెలింగ్ నిలుపుదలకు సుప్రీం నో
న్యూఢిల్లీ: క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టనున్న కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము జారీ చేసే తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. మే 13న నిర్వహించిన క్లాట్‌కు 54 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష సందర్భంగా సాంకేతిక సమస్య లు ఎదురయ్యాయని, ఫలితాలను నిలిపి వేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని కొంద రు విద్యార్థులు పలు హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీం.. ఫిర్యాదుల పరిష్కా ర కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల్సిం దిగా కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్‌ను ఆదేశించింది. -
అతివకు అభయం!
వనపర్తి క్రైం : ఇంటి నుంచి వెళ్లిన ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరే వరకు కన్నవారికి భయం తప్పడంలేదు. వారు ఏదో ఒకచోట వేధింపులకు గురవుతున్నారు. వీరికి రక్షణగా నిలుస్తున్నాయి షీ టీమ్‌లు.. ఒక్క ఫోన్‌చేస్తే చాలు వెంటనే వాలిపోయి బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో పెడదోవపడుతున్న యువకులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిపిస్తున్నాయి. షీ బృందాల ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటివరకు 488 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రేమ వేధింపులే ఎక్కువ.. యువతులపై ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టేందుకు షీ టీమ్‌లను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. 2016లో మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, 2017లో 233 మందికి, 2018 నుంచి ఇప్పటివరకు 38 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాల నేపథ్యంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రేమించాలంటూ యువకులు అమ్మాయిలపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో షీ టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో నిఘా ప్రధాన ప్రాంతాల్లోనే షీ బృందం నిఘా పెడుతోంది. జిల్లా కేంద్రంలోని జంగిడిపురం, చాణక్య పాఠశాల, బాలికల డిగ్రీ కళాశాల, బండారుబావి, బాలికల జూనియర్ కళాశాల, చందాపూర్ రోడ్డు, స్కాలర్స్, సీవీ రామన్ కళాశాల రోడ్డు తదితర కూడళ్లలో ఎక్కువమంది యువతి, యువకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి నుంచే షీ టీమ్‌కు ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఫోన్ వచ్చిన వెంటనే బృందాలు అక్కడి వెళ్లి విషయాలను ఆరా తీస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. సిబ్బందిని పెంచితేనే.. జిల్లాలో షీ టీమ్ ఏర్పాటైన మొదట్లో 8 మంది పనిచేశారు. ప్రస్తుతం నలుగురి పోలీసు సిబ్బంది మాత్రమే ఈ బృందంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరులో షీ టీమ్ సభ్యులు పనిచేయాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత కారణంగా జిల్లా కేంద్రంలో మాత్రమే షీ టీమ్ నిఘా ఉంచింది. దీంతో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ దుస్తువుల్లో ఉండి విధులను నిర్వహించే షీ టీమ్‌కు సమాచారం అందించాలంటే 9177930150, 100 నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే సమస్య పరిష్కరానికి బృందం పనిచేస్తుంది. నిఘాతో పాటు బృందంలో మరింత మంది సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. -
ఆస్తమా కౌన్సెలింగ్
తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆస్తమా వస్తుందా? నేను ఒక మల్టీ నేషనల్ సంస్థలో పనిచేస్తున్నాను. నా మీద ఎప్పుడూ చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువైనప్పుడల్లా ఆస్తమా రావడం గమనిస్తున్నాను. ఒత్తిడికీ, ఆస్తమాకూ సంబంధం ఉందా? దీన్ని తగ్గించుకోవడం ఎలా? – వి. సురేశ్, గచ్చిబౌలి మన వాయునాళాలు వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు సన్నబారిపోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమయ్యే లక్షణాంతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే ఆస్తమా వచ్చినప్పుడైతే తక్షణం వాయునాళాలను విస్తరింపజేసే మందులువాడాలి. అదే రాకముందైతే... ఆస్తమాను రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు వాడాలి. ఒత్తిడికీ, ఆస్తమాకూ ఏదైనా సంబంధం ఉందా... అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆస్తమా లేనివారిలో ఒత్తిడి అనేది కొత్తగా ఆస్తమానేమీ కలిగించదు. కానీ ఆస్తమా ఉన్నవారిలో మాత్రం.. వారి పరిస్థితిని ఒత్తిడి మరింత దిగజారుస్తుంది. తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా అటాక్స్ చాలా తరచూ వస్తుంటాయి. మిగతావారితో పోలిస్తే మరింత ఎక్కువగానూ వస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని పరిశోధకులు చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబంలో విభేదాలు, విపత్తులు, హింసకు గురికావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమా ఉన్నవారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. మొదట ఒత్తిడి అనేది యాంగై్జటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలా పరిస్థితులు నెలకొంటాయి. దాంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. మిగతావారితో పోలిస్తే ఒత్తిడితో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు పరిస్థితిని నియంత్రించడం ఒకింత కష్టమవుతుంది. మరి ఒత్తిడినీ, ఆస్తమానూ అరికట్టడం ఎలాగంటే... ♦ మీకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో మొదట తెలుసుకోండి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, జీవితంలో ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అని గుర్తించండి. ఒకసారి సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడం మీతోనే సాధ్యమవుతుందా, లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా అని తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. ♦ అన్ని పనులూ మీరే పూర్తి చేయాలని అనుకోకండి. పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించండి. ఉదాహరణకు డెడ్‌లైన్ అనేది మీ ఒక్కరికే కాదు.. మీ బృందంలో పనిచేస్తున్నవారందరికీ వర్తిస్తుందనీ, అందరికోసం అందరమూ పనిచేయాలంటూ స్పష్టంగా చెప్పి, పనులను పంచండి. ఇలా వర్క్‌ప్లేస్ స్ట్రాటజీలను అమలు చేసుకోండి. ♦ మీకు అలసట కలిగించని వ్యాయామాన్ని నిత్యం చేయండి. ♦ కంటినిండా హాయిగా నిద్రపోండి. ♦ శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సైజెస్), ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి పాటించండి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయండి. ♦ అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి. ♦ ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే 15వ నిమిషం తర్వాత తప్పక వైద్యుల సహాయం తీసుకోండి. గర్భవతికి ఆస్తమా ఉంటే..? మా అమ్మాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఆమెకు ఆస్తమా ఉంది. ఆమె తన ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం ఎలా? ఈ గర్భధారణ సమయంలో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కె. రామలక్ష్మి, ఒంగోలు గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం అన్నది కాబోయే తల్లికీ, కడుపులోని బిడ్డకూ చాలా అవసరం. ఇప్పుడు గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఆస్తమాను నియంత్రణలో ఉంచే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. గర్భంతో ఉన్న సమయంలో అటాక్ రాకుండా ఉండేలా మందులు వాడటం / వచ్చినప్పుడూ వాడటంతో పాటు... ఆ మందుల దుష్ప్రభావాలు గర్భంలోని పిండం మీద పడకుండా చూసుకోవడం... అన్న సమన్వయాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఆస్తమా ఉన్న మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు దాదాపు 20 శాతం మందిలో ఆయాసం వచ్చి, దాన్ని తగ్గించే మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో 6 శాతం మందిలో హాస్పిటల్లో చేర్చి, చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమా సమస్య ఉన్నవారు, దాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ ఆస్తమా అదుపులో లేకపోతే అకస్మాత్తుగా రక్తపోటు చాలా ఎక్కువగా పెరగడం (ప్రీ–అక్లాంప్సియా), నెలల పూర్తిగా నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ బేబీ), పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో ఉండటం లేదా మృతశిశువు జన్మించడం వంటి అనర్థాలు సంభవించవచ్చు. అందువల్ల గర్భిణుల్లో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధానం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు ఎంత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా ఉంటే, పుట్టాక ఆ బిడ్డ మానసిక, శారీరక వికాసాలు అంత బాగుంటాయి. బిడ్డ జీవన నాణ్యతకూడా బాగా ఉంటుంది. సాధారణంగా ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే మందులు... గర్భవతులకైనా, సాధారణ మహిళలకైనా దాదాపుగా ఒకేలా ఉంటాయి. గర్భవతులైన ఆస్తమా సమస్య ఉన్న మహిళలకు కొన్ని సూచనలు... ♦ గర్భవతులైన మహిళల్లో ప్రతి 4 లేదా 6 వారాలకు ఒకసారి వారి శ్వాస తీసుకునే తీరు ఎలా ఉందో పరీక్షించేందుకు పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఆస్తమా అటాక్ రాకుండా ఉండేందుకు వాడే ప్రివెంటార్ ఇన్హేలర్స్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. అవి పిండంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపవనే అంశాన్ని గుర్తెరిగి, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ♦ గర్భతుల్లో అటాక్ వచ్చి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గితే... పిండానికీ ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అది ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఏ చిన్న అటాక్ లక్షణాలు కనిపించినా వెంటనే ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలి. అప్పుడు వెంటనే హాస్పిటల్‌కు రావడం మంచిది. ♦ ఆస్తమాను ప్రేరేపించే అంశాలు (ట్రిగర్ ఫ్యాక్టర్స్)కు దూరంగా ఉండాలి. తమకు సరిపడని వాటిని గుర్తించి, గర్భవతిగా ఉన్న సమయంలో వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఉండాలి. ఇక ప్రసవం విషయానికి వస్తే... చాలా తీవ్రమైన ఆస్తమా ఉన్నవారిని మినహాయించి మిగతా వారందరిలోనూ దాదాపుగా ప్రసవం సాధారణంగానే అవుతుంది. ప్రసవ సమయంలో ఆస్తమా రావడం చాలా చాలా అసాధారణం కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. - డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సీటొచ్చి చేరకపోతే మరొకరికి నష్టమేగా?
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీటు వచ్చాక తుది కౌన్సెలింగ్‌లో నచ్చిన కాలేజీలో సీటు రాలేదనో, మరే కారణంగానో సంబంధిత కాలేజీలో చేరకపోతే మరో విద్యార్థి నష్టపోతారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల సీటు కోల్పోయే ఇతర విద్యార్థుల ప్రాథమిక హక్కు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. గతేడాది పీజీ మెడికల్ సీటు పొందిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి నచ్చిన కాలేజీలో సీటు రాలేదని చేరలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సదరు విద్యార్థిపై మూడేళ్ల నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి దాఖ లు చేసిన రిట్‌ను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం విచారించింది. సీటొచ్చాక చేరాలో లేదో విద్యార్థి ఇష్టమని, చేరకపోతే మూడేళ్లు నిషేధం విధించడం చెల్లదని, ఈ ఏడాది జరిగే పీజీ మెడికల్ కౌన్సెలింగ్, ప్రవేశాలకు పిటిషనర్‌ను అనుమతించాలని విద్యార్థి తరఫు న్యాయవాది వాదించారు. సీటొచ్చినా చేరకపోతే మరో విద్యార్థి ఆ సీటు పొందే హక్కు కోల్పోతారని, చేరని కారణంగా సీటుకు సంబంధించి రెండేళ్ల రుసుము చెల్లించేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.