కన్వినర్‌ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు | Completed MBBS Counselling | Sakshi
Sakshi News home page

కన్వినర్‌ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు

Published Mon, Nov 4 2024 4:23 AM | Last Updated on Mon, Nov 4 2024 4:23 AM

Completed MBBS Counselling

కన్వినర్, బీ, సీ మెడికల్‌ సీట్లు భర్తీ 

మేనేజ్‌మెంట్‌ కోటాలో 13.90 లక్షల ర్యాంకర్‌కూ చాన్స్‌ 

మేనేజ్‌మెంట్‌ కోటాలో మిగిలిన 8 సీట్లు 

8 కాలేజీలు పెరగటంతో ఎక్కువమందికి అవకాశం  

ముగిసిన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని కన్వినర్, బీ కేట గిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను భర్తీ చేశారు. ఎని మిది మేనేజ్‌మెంట్‌ సీట్లు మినహా అన్నింటి లోనూ విద్యార్థులు చేరిపోయారు. 

ఎనిమిది మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో ఆరు బీ కేటగిరీ, రెండు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల భర్తీ లిస్టును విడుదల చేసింది. మిగిలిన 8 సీట్ల కు అన్ని దశల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. 

అందుకు అనుమతి కోరి నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాకుంటే అవి మిగిలిపోతాయని అధికారులు వెల్లడించారు. కాగా, కన్వినర్‌ కోటాలో గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఈసారి సీట్లు దక్కాయి. బీసీ ఏ కేటగిరీలో గరిష్టంగా 3.36 లక్షల నీట్‌ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటా కింద సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 

తుది జాబితా అనంతరం వర్సిటీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి ప్రైవేట్‌ కాలేజీలో కన్వినర్‌ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.93 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ బీలో 2.29 లక్షలు, బీసీ సీలో 3.15 లక్షలు, బీసీ డీలో 2.14 లక్షలు, బీసీఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఓపెన్‌ కేటగిరీలో 1.98 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో గరిష్టంగా 1.80 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం.  

మేనేజ్‌మెంట్‌ కోటాలో 13.90 లక్షల ర్యాంకుకు సీటు 
రాష్ట్రంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎన్‌ఆర్‌ఐ (సీ కేటగిరీ) కోటాలో గరిష్టంగా 13.90 లక్షల నీట్‌ ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే బీ కేటగిరీలో గరిష్టంగా 5.36 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చిందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీ, సీ కేటగిరీలో తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి జాబితాను వర్సిటీ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కన్వినర్‌ కోటాలో అధిక ర్యాంకర్లకు సీట్లు రాగా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో మాత్రం గత ఏడాదికి అటుఇటుగా ర్యాంకర్లకు సీట్లు లభించాయి. 

ఈసారి రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ వర్సిటీలుగా మారాయి. బీఆర్‌ఎస్‌ నేత చామకూర మల్లారెడ్డికి చెందిన రెండు కాలేజీల సీట్లు ఈసారి డీమ్డ్‌ సీట్లుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లోని సీట్లు రాష్ట్రానికి తగ్గాయి. కాగా, ఈసారి ఒక కొత్త కాలేజీ వచ్చింది. ప్రభుత్వ రంగంలో 8 మెడికల్‌ కాలేజీలు పెరగడంతో 400 కన్వినర్‌ కోటా సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు. 

ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కిందకు వెళ్తాయి. అయితే వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు భర్తీ కాకపోతే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement