management quota
-
యాజమాన్య కోటా.. ఇక ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. పారదర్శకత కోసమే.. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్ఆర్ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ.. మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ ప్రతిపాదనలు... » బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం. » ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు. -
కన్వినర్ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్‌కు సీటు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వినర్, బీ కేట గిరీ, ఎన్ఆర్ఐ కోటా సీట్లను భర్తీ చేశారు. ఎని మిది మేనేజ్మెంట్ సీట్లు మినహా అన్నింటి లోనూ విద్యార్థులు చేరిపోయారు. ఎనిమిది మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఆరు బీ కేటగిరీ, రెండు ఎన్ఆర్ఐ కోటా సీట్లు మిగిలినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల భర్తీ లిస్టును విడుదల చేసింది. మిగిలిన 8 సీట్ల కు అన్ని దశల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. అందుకు అనుమతి కోరి నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాకుంటే అవి మిగిలిపోతాయని అధికారులు వెల్లడించారు. కాగా, కన్వినర్ కోటాలో గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఈసారి సీట్లు దక్కాయి. బీసీ ఏ కేటగిరీలో గరిష్టంగా 3.36 లక్షల నీట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. తుది జాబితా అనంతరం వర్సిటీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి ప్రైవేట్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.93 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ బీలో 2.29 లక్షలు, బీసీ సీలో 3.15 లక్షలు, బీసీ డీలో 2.14 లక్షలు, బీసీఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఓపెన్ కేటగిరీలో 1.98 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గరిష్టంగా 1.80 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. మేనేజ్మెంట్ కోటాలో 13.90 లక్షల ర్యాంకుకు సీటు రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎన్ఆర్ఐ (సీ కేటగిరీ) కోటాలో గరిష్టంగా 13.90 లక్షల నీట్ ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే బీ కేటగిరీలో గరిష్టంగా 5.36 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చిందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీ, సీ కేటగిరీలో తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి జాబితాను వర్సిటీ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కన్వినర్ కోటాలో అధిక ర్యాంకర్లకు సీట్లు రాగా, మేనేజ్మెంట్ కోటా సీట్లలో మాత్రం గత ఏడాదికి అటుఇటుగా ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈసారి రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారాయి. బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డికి చెందిన రెండు కాలేజీల సీట్లు ఈసారి డీమ్డ్ సీట్లుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కాలేజీల్లోని సీట్లు రాష్ట్రానికి తగ్గాయి. కాగా, ఈసారి ఒక కొత్త కాలేజీ వచ్చింది. ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలు పెరగడంతో 400 కన్వినర్ కోటా సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కిందకు వెళ్తాయి. అయితే వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు భర్తీ కాకపోతే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు -
అ‘ధన’పు సీట్లు అంటూ..
సాక్షి, హైదరాబాద్: సీట్లు పెరుగుతాయి..మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ అడ్మిషన్ గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్ చేసి జాయినింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచ్‌ల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. యాజమాన్యాల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బు చెల్లించినవారు 1500 మంది వరకూ ఉన్నారు. వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు... ఇప్పుడు సీట్లెలా ఇస్తారు?’ అంటూ యాజమాన్యాలను నిలదీస్తున్నారు. ‘కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం..ఇప్పుడు మేం ఏం చేయగలం?’ అంటూ కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. డబ్బు వాపస్ ఇస్తారా? లేదా? అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇక ఆ సీట్లు రానట్టే!రాష్ట్రవ్యాప్తంగా 28 ఇంజనీరింగ్ కాలేజీలు బ్రాంచ్‌ల మార్పిడి, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో దాదాపు 10 వేల సీట్లు రద్దు చేసుకున్నాయి. వీటిస్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని అడిగాయి. అయితే, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లలో సీట్ల కుదింపునకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. ఇలా కుదిస్తే ఈ బ్రాంచ్‌లు తెరమరుగయ్యే ప్రమాదముందని అడ్డు చెప్పింది. ఇదే క్రమంలో కొత్తగా సీఎస్ఈ, డేటాసైన్స్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లలో సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ వంటి వాటిల్లో సీట్ల తగ్గింపునకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇలా దాదాపు 5 వేల సీట్లకు అనుమతి లభించలేదు. కోర్టు అనుమతిస్తే మూడో విడత కౌన్సెలింగ్‌లో వీటిని చేర్చాలని భావించారు. ముందే ఖరారుకోర్టు అనుమతిస్తే సీఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్‌లలో 5 వేల సీట్లు పెరిగేవి. 30 శాతం యాజమాన్య కోటా కింద దాదాపు 1500 సీట్లు అందుబాటులో ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి. ఒక్కో సీటును రూ. 8 నుంచి రూ. 18 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండటంతో మేనేజ్మెంట్ సీట్లకూ గిరాకీ బాగానే పలికింది. ఇలా సీట్లు కొనుగోలు చేసిన వారిలో రాష్ట్ర ఈఏపీసెట్‌లో అతి తక్కువ స్కోర్ వచ్చినవారు, అసలు సెట్ పాసవ్వని వారూ ఉన్నారు. ఇప్పుడు వీరికి ఆఖరిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టడానికి గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేలోగా.. కౌన్సెలింగ్ ఖతంహైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తయింది. మూడో దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపడతారు.వెనువెంటనే స్పాట్ అడ్మిషన్లు చేపట్టే వీలుందని అధికారులు అంటున్నారు. ప్రైవేట్ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లి, కేసు తేలేలోగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయి. ఇది ప్రైవేట్ కాలేజీలకు ఇబ్బంది కలిగించే పరిణామమని అధికారులు అంటున్నారు. -
ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే. ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ గ్రూపుతో పాటు, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్ ఇంటెలిజెన్స్ సహా పలు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్లో 9618, ఎలక్ట్రికల్‌లో 3602, మెకానికల్‌లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్‌లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్‌లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు. ఫ్యాకల్టీ ఎక్కడ...? సీఎస్ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్‌ను ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. ముగిసిన స్లాట్ బుకింగ్... ఆప్షన్లే తరువాయి తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు గురువారంతో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ , సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లో సగం సీట్లు భర్తీ కావడంలేదు. గత పదేళ్లుగా కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటాలోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీల్లో మినహా చాలా కాలేజీల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోతున్నట్టు ఏఐసీటీఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ ఏటా ప్రకటించే గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 40 నుంచి 48 శాతం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. 2013–14లో 39 శాతం సీట్లు మిగిలిపోగా, 2016–18 నాటికి 48 శాతానికి పెరిగింది. ఆ తరువాత రెండేళ్లూ ఇదే పరిస్థితి. కరోనా తరువాత చేరికలు కొంతమేర పెరగడంతో మిగులు సీట్లు 42 శాతానికి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే గత మూడేళ్లుగా 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 85 శాతం సీట్లు భర్తీ అవడం విశేషం. ఇన్‌టేక్ తగ్గినా చేరికలు మాత్రం అంతే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య గత పదేళ్లలో భారీగా తగ్గింది. పదేళ్లక్రితం 30 లక్షల నుంచి 31 లక్షల వరకు సీట్లు ఉండగా ఇప్పుడది 23 లక్షలకు తగ్గింది. సీట్ల సంఖ్య తగ్గినా చేరికల్లో మాత్రం మార్పు లేదు. గతంలో పలు విద్యా సంస్థలు సదుపాయాలు లేకున్నా కోర్సులకు అనుమతులు తెచ్చుకొనేవి. వీటివల్ల సాంకేతిక విద్య నాసిరకంగా మారుతుండడంతో సదుపాయాలున్న వాటికే ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ప్రమాణాల మేరకు సదుపాయాలు లేకున్నా, చేరికలు వరుసగా మూడేళ్లు 25 శాతానికి లోపు ఉన్నా వాటికి అనుమతులను రద్దు చేస్తోంది. దీంతో పలు కాలేజీలు మూతపడ్డాయి. కంప్యూటర్ సైన్సు సీట్లకే డిమాండ్ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత కోర్సులవైపు దృష్టి సారిస్తున్నారు. దానికోసం కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. ఇతర కోర్సుల్లో చేరికలు అంతంతమాత్రమే. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) కోర్సుకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్), బిగ్ డేటా వంటి అంశాలలో నేరుగా లేదా కాంబినేషన్లో వివిధ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి బోధనకు అవసరమైన సదుపాయాలను కొన్ని ప్రముఖ కాలేజీలు మాత్రమే కల్పిస్తున్నాయి. మిగతా కళాశాలలు సంప్రదాయ కోర్సులతోనే నెట్టుకొస్తున్నాయి. సంప్రదాయ కోర్ గ్రూప్ కోర్సుల వైపు విద్యార్థులను మళ్లించడానికి ఇతర అంశాలను వీటికి మైనర్ కోర్సులుగా జతచేయాలని ఏఐసీటీఈ ఆలోచిస్తోంది. ఈ కోర్సుల్లోని నూతన అంశాలపై అధ్యాపకులకు శిక్షణ కూడా ఇస్తోంది. లెక్చరర్ల కోసం ఇంటర్న్‌షిప్ కోర్సులు కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో చేరికలు 80 శాతం పైనే దేశంలోని పరిస్థితులకు భిన్నంగా రాష్ట్రంలో చేరికలు 80 శాతానికి పైగా ఉండటం విశేషం. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఆర్థిక భారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సిలబస్‌ను సంస్కరించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త అంశాలను జోడించారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.9051.57కోట్లు అందించారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సులకు చెందిన 24,74,544 మంది విద్యార్థులకు మేలు చేకూరింది. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు రూ.3,349.57కోట్లు అందించగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. కాలేజీలకు న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేశారు. ప్రమాణాలు మెరుగుపరుచుకోని కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నారు. గత ఏడాది ప్రవేశాలు సరిగా లేని 28 కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు. ఒక్క విద్యార్థీ చేరని మరో 22 కాలేజీల అనుమతులు రద్దు చేశారు. దీంతో కాలేజీల్లో వసతులు, బోధనలో నాణ్యత మెరుగుపడుతున్నాయి. ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా సీట్లు 1,13,403 కాగా, అందులో 95,968 (85 శాతం) భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా, స్పాట్ అడ్మిషన్లతో పాటు చూస్తే 1,21,836 (76 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఏటా భర్తీ అయ్యే సీట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం. -
15, 16 తేదీల్లో వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ వైద్య, దంత కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16న సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. అట్టి మెరిట్ జాబితాలోని అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. ఆర్మీ డెంటల్ కాలేజీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలకు knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది. -
డిగ్రీలోనూ ‘మేనేజ్మెంట్’ బాదుడేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా అమల్లోకి తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు వేగవంతం చేసింది. గత రెండేళ్లుగా యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాను అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే అంటే 500 ప్రైవేటు డిగ్రీ కాలేజీల పంట పండినట్లే. మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టినా, వివిధ కోర్సులకు యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజులనే మేనేజ్మెంట్ కోటాలోనూ వసూలు చేయాలని ఉన్నత విద్యా మండలి చెబుతున్నా యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులను దండుకునేందుకు మార్గం సుగమం కానుంది. ప్రత్యేక ఫీజు విధానం లేదు.. ప్రస్తుతం రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటాకు ప్రత్యేక ఫీజు విధానం అంటూ ఏమీ లేదు. కన్వీనర్ కోటాలో నిర్ణయించిన ఫీజునే మేనేజ్మెంట్ కోటాలోనూ అమలు చేయాలి. అయినా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లోనూ అదే విధానానికి ఉన్నత విద్యా మండలి తెరతీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండున్న ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే డిగ్రీ కాలేజీలు 500 వరకు ఉంటే అందులో 40కి పైగా కాలేజీలు కోర్టును ఆశ్రయించి మరీ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. తాము కోర్సును నిర్వహించాలంటే తమకు నచ్చి న ఫీజును వసూలు చేస్తామని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుతో తాము కాలేజీలను నడపలే మని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ ప్రవేశాల నుంచి కోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకొని తమ ఇష్టానుసారంగా ఫీజులను తీసుకుంటూ సీట్లను భర్తీ చేస్తున్నాయి. మరోవైపు మైనారిటీ కాలేజీలు సొంతంగానే ప్రవేశాలు చేపట్టుకుంటున్నాయి. అలాంటి కాలేజీలను సాధారణ విద్యార్థులకు అందుబాటులోకి తేవడంలో విఫలమైన ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టి సీట్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలో 30 శాతం.. వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలోనే డిగ్రీలోనూ మేనేజ్మెంట్ కోటా 30 శాతం అమలు చేసేందుకు విద్యా మండలి సిద్ధమైంది. ఈ అంశాన్ని తమ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది. పైగా ఇష్టం ఉన్న కాలేజీలు కోటాను అమలు చేసుకోవచ్చు. ఇష్టం లేని కాలేజీలు మొత్తం కన్వీనర్ కోటా కింద నిర్వహించే ఆన్లైన్ ప్రవేశాల్లో భర్తీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీనివల్ల టాప్ కాలేజీలు, కొంత పేరున్న కాలేజీలు, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యే కాలేజీలు 500కు పైగా మేనేజ్మెంట్ కోటాను అమలు చేస్తాయి. అంటే ఇపుడు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేస్తూ, సొంతంగా ఫీజులను నిర్ణయించుకొని వసూలు చేస్తున్న 40 కాలేజీలకు తోడు మరో 450 పైగా కాలేజీలు తమ ఇష్టానుసారంగా 30 శాతం సీట్లను భర్తీ చేసుకునే వీలును ఉన్నత విద్యా మండలే కల్పిస్తోంది. మేనేజ్మెంట్ కోటాలో లక్షకు పైగా సీట్లు.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,170 డిగ్రీ కాలేజీలుండగా, వాటిల్లో 4,44,169 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రభుత్వ, ఎయిడెట్, అటానమస్, గురుకులాలు పోగా 845 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిల్లో 3,13,485 సీట్లున్నాయి. వాటన్నింటిలో ఇప్పటివరకు డిగ్రీ ఆన్లైస్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ద్వారానే ప్రవేశాలు జరుగుతున్నాయి. వాటికి తోడు మరో 42,460 సీట్లు కలిగిన 118 కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇందులో కోర్టును ఆశ్రయించినవి ఉన్నాయి. అవి కూడా కలుపుకొని (వాటిల్లో మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తే) మొత్తంగా 966 కాలేజీల్లో 3,55,945 సీట్లు అందుబాటులో ఉండనుండగా, అందులో మేనేజ్మెంట్ కోటా కింద 1,06,783 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునే వీలు ఏర్పడనుంది. -
డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా!
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంలో (2020–21) రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. గతేడాదే మేనేజ్మెంట్ కోటా అమలు కోసం యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు వచ్చే విద్యా సం వత్సరం నుంచి అమలుకు ఓకే చెప్పింది. దీంతో డిగ్రీ కాలేజీల్లోని 30 శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వనుంది. మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భా రం ఉండదనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఈ నిర్ణయంతో ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీల్లో చేరే వీలు ఏర్పడనుంది. అలాగే వచ్చే సంవత్సరంలో వంద శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లను ఇవ్వాలని, కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని 9 ప్రైవేటు అటానమస్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సమావేశమై చర్చించారు. ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులు, వాటి నిర్వహణ, సిలబస్, పరీక్షల నిర్వహణ, సబ్జెక్టు కాంబినేషన్, మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్, ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధినిచ్చే కోర్సులను అనుమతించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తారు. అటానమస్ కాలేజీల్లో రెండేళ్లే భాషా సబ్జెక్టులు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్, తెలుగు వంటి భాషలను ఇకపై మూడేళ్లు చదవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సడలించనున్నారు. డిగ్రీలో భాషా సబ్జెక్టులు మూడేళ్లు ఉన్న కారణంగా ప్రధాన సబ్జెక్టులకు సమయం సరిపోవడం లేదని అటానమస్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చాయి. దీంతో ఆయా కాలేజీల్లో భాషా సబ్జెక్టులను రెండేళ్లు మాత్రమే చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది. అయితే భాషా సబ్జెక్టులకు ప్రస్తుతం ఉన్న 20 క్రెడిట్స్ నిబంధనను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. భాషా సబ్జెక్టుకు 20 క్రెడిట్స్ లేకపోతే విద్యార్థి ఆ భాషలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వీలు ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న క్రెడిట్స్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. -
డిగ్రీలో మేనేజ్మెంట్ కోటా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్మెంట్ కోటా తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తున్న ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో యాజమాన్య కోటాను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇటీవల డిగ్రీలోనూ కన్వీనర్ ద్వారా ఆన్లైన్లో ప్రవేశాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీలోనూ మేనేజ్మెంట్ కోటాను అమలు చేయాలని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో 1,100 డిగ్రీ కాలేజీలుంటే అందులో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ నేతృత్వంలో 1,084 కాలేజీల్లో దాదాపు 4 లక్షల సీట్లను ఉన్నత విద్యా మండలి గత రెండేళ్లుగా భర్తీ చేస్తోంది. 30% యాజమాన్య కోటాకు డిమాండ్ ఆన్లైన్లో దోస్త్ కన్వీనర్ ద్వారా ప్రవేశాలను చేపడుతున్నందున తమకు 30 శాతం మేనేజ్మెంట్ కోటా విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కన్వీనర్ నేతృత్వంలో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. అయితే గత రెండేళ్లుగా స్పాట్ అడ్మిషన్లను యాజమాన్యాలు చేపట్టేందుకు ప్రభుత్వం అవకాశమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో 30 శాతం యాజమాన్య కోటా విధానం లేదా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించడం.. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి అంగీకరించాలని యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అనేక సార్లు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం, కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలికి విజ్ఞప్తి చేశాయి. ప్రవేశాల కసరత్తు నేపథ్యంలో.. 2019–20 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం మళ్లీ కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో యాజమాన్యాలు తమ డిమాండ్‌ను మళ్లీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా యాజమాన్యాలు కోరుతున్న విధానాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయాలన్న భావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే త్వరలోనే జరిగే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ఆన్లైన్లో సీటు రాకపోతే అంతే.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్లో చేపడుతున్నందున ప్రస్తుతం విద్యార్థికి ఏ కాలేజీలో సీటొస్తే అదే కాలేజీలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే చివరగా వచ్చిన కాలేజీలోనే చేరాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా అందులో చేరటం లేదంటే మానేయడమే ప్రత్యామ్నాయంగా ఉంది. మరోవైపు చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాల్లో వస్తే వచ్చినట్లు లేదంటే లేదు. దీంతో యాజమాన్యాలు మిగిలిన సీట్లను కూడా తమ వద్దకు వచ్చే విద్యార్థులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, ఎ.పరమేశ్వర్ తెలిపారు. మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తే విద్యార్థులు కోరుకున్న కాలేజీలో ఆన్లైన్ ద్వారా కన్వీనర్ కోటాలో.. సీటు రాకపోతే కోరుకున్న కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. లేదంటే మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసే అధికారం ఇచ్చినా విద్యార్థులు కోరుకున్న కాలేజీలో చేరే అవకాశం ఉంటుందని వారు వివరించారు. -
‘ఇంజనీరింగ్’ వసూళ్లు...!
శ్రీధర్ ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి. తన కుమారుడికి హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్య కోటా సీటు కోసం వెళితే.. ఏకంగా రూ.7 లక్షలు చెప్పారు. ప్రభుత్వోద్యోగి అయిన రవీందర్ కుమార్తెకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదు. దీంతో ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీకి వెళితే.. కంప్యూటర్ సైన్స్ యాజమాన్య కోటా సీటు కోసం రూ.15 లక్షలు అడిగారు. మంచి కాలేజీ కదా అని.. రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించి సీటు కన్ఫర్మ్ చేయించుకున్నారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ఇంజ నీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కొనసాగుతున్న దందా ఇది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కూడా ప్రారంభం కాకముందే కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను అమ్మేసు కుంటున్నాయి. భర్తీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. ప్రముఖ కాలేజీలైతే రేట్లను మరింతగా పెంచేశాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఎలాగైనా మంచి కాలేజీల్లో చదివించాలన్న ఉద్దేశంతో అప్పులు చేసైనా అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. కాలేజీని బట్టి వసూళ్లు.. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం సొంతంగా భర్తీ చేసుకునే సీట్లుపోగా.. 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,055 సీట్లు కాకుండా) సీట్ల (70 శాతం)ను భర్తీ చేయనుండగా... యాజమాన్య కోటా (15 శాతం), ఎన్నారై/ఎన్ఆర్ స్పాన్సర్డ్ (15 శాతం) కోటాల కింద 26,389 సీట్ల (30 శాతం)ను భర్తీ చేస్తారు. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్లలో చేరే విద్యార్థులు ఎక్కువగా పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు. దీంతో పలు కాలేజీలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న చాలా కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా వసూళ్ల దందాకు దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ.10 లక్షల వరకు డొనేషన్ డిమాండ్ చేస్తుండగా.. టాప్ కాలేజీలు రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఐటీ, ఈసీఈ కోర్సులకు కాలేజీని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. ఈఈఈ, సివిల్తోపాటు ఇతర బ్రాంచీలకు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెరిట్‌కు స్థానమేదీ? యాజమాన్య కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల మెరిట్ ఆధారంగా.. మిగతా 15 శాతాన్ని ఎన్నారైలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల మెరిట్ సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇదేదీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్ల కోసం కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్సైట్లో పెట్టాలి. ఉన్నత విద్యా మండలికూడా ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి.. ఆయా కాలేజీలకు పంపాలి. మొత్తంగా మెరిట్ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యా మండలిగానీ, సాంకేతిక విద్యాశాఖగానీ దీనిని పట్టించుకోకపోతుండటంతో.. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. గతేడాది కొన్ని టాప్ కాలేజీల్లో ఏకంగా 80వేలకు పైన ర్యాంకులు వచ్చిన వారికి కూడా సీట్లివ్వడమే దీనికి నిదర్శనం. ఆ ‘ఇద్దరి’తో పెరిగిన రేట్లు! ఏఐసీటీఈ 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన 100కుపైగా కాలేజీలకు తొలుత అనుమతి నిరాకరించింది. వాటి యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో.. ఏఐసీటీఈతో మాట్లాడి అనుమతులు ఇప్పించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి, ఓ మంత్రి పీఏ తాము చెప్పిన వారికి యాజమాన్య కోటా సీట్లు ఇవ్వాలని ఆయా కాలేజీలతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో వారు చెప్పిన మేరకు డొనేషన్ లేకుండా 10 సీట్లు ఇవ్వాల్సి వస్తోందని.. అందువల్లే ఈసారి డొనేషన్లను పెంచాల్సి వచ్చిందని, లేకుంటే కన్వీనర్ కోటా ఫీజుతో కాలేజీలు ఎలా నడపాలంటూ కాలేజీలు ఎదురు ప్రశ్నిస్తున్నాయని అధికారులే చెబుతుండటం గమనార్హం. -
ఈపీఎస్‌లో మూడేళ్ల వాటానుచెల్లించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి తొలి మూడేళ్లపాటు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) యాజమాన్యం వాటాను పూర్తిగా కేంద్రం చెల్లించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరి, రూ.15 వేలలోపు వేతనం అందుకునే ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైనా 2016 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారుంటే.. అలాంటి వారి పెన్షన్ ఖాతాలకు సంబంధించి తొలి మూడేళ్లలో ఇప్పటి నుంచి మిగిలిన కాలానికి కేంద్రం యాజమాన్యం వాటాను చెల్లిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఫాస్ఫరిక్ అండ్ పొటాషియం (పీ అండ్ కే) ఎరువులపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వనున్న రాయితీ రేట్లనూ కేబినెట్ ఆమోదించింది. పొటాష్, సల్ఫర్లకు రాయితీని పెంచిన కేంద్రం నైట్రోజన్, ఫాస్ఫరస్లకు తగ్గించింది. సవరించిన ధరల ప్రకారం కేజీ పొటాషియంపై రూ.15.2, సల్ఫర్పై రూ.2.7, నైట్రోజన్‌పై రూ.18.9, కేజీ ఫాస్ఫరస్పై రూ.11.12 రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. మరికొన్ని నిర్ణయాలు: ఈశాన్య రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను 2020 మార్చి వరకు పొడిగించింది. ఈశాన్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టే అన్ని పనులకూ 100 శాతం నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆయుష్ (ఆయుర్వేద,యోగ, న్యాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) వైద్యులు ఓ బ్రిడ్జి కోర్సు చేసి ఆధునిక వైద్య సేవలు ప్రారంభించేందుకు ఉన్న వెసులుబాటును మంత్రివర్గం తొలగించింది. అలాగే ఇకపై దేశంలోని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ ఉమ్మడిగా నెక్స్ట (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరుతో తుది పరీక్షలను నిర్వహించనుంది. ప్రాక్టీసు లైసెన్సు కోసం మరో పరీక్షతో పనిలేకుండా నెక్స్›్టలో అర్హత సాధించిన వారికి దేశంలో వైద్య సేవలకు అనుమతులు లభిస్తాయి. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారినీ నెక్స్›్టలో అర్హత సాధించాకే దేశంలో ప్రాక్టీసుకు అనుమతిస్తారు. ళీవిద్యా రుణాలకు సంబంధిచిన ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్)’ ‘సెంట్రల్ సెక్టార్ ఇంట్రస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్)’ అనే రెండు పథకాలను కొనసాగించేందుకు ఆమోదం. వీటి కోసం 2017–18 నుంచి 2019–20 మధ్య రూ.6,600 కోట్ల వ్యయం చేయనున్నారు. -
సీటుకో రేటు!
-
సీటుకో రేటు!
అడ్డగోలుగా ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు మేనేజ్మెంట్ కోటా సీటు → టాప్ కాలేజీల్లో రూ. 12 లక్షలు, → ద్వితీయ శ్రేణి కాలేజీల్లో రూ. 38 లక్షలు ► ప్రవేశాల నోటిఫికేషన్ రాకముందే బేరసారాలు ► కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపే రాలేదు ► ఈలోగానే సీట్లను అంగట్లో పెట్టి అమ్ముతున్న యాజమాన్యాలు ► ఆందోళనలో తల్లిదండ్రులు.. పట్టించుకోని ఉన్నత విద్యా మండలి శ్రీనివాస్‌రావు ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కొడుకు శ్రీవాత్సవకు ఎంసెట్‌లో 75 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. కష్టమైనా కొడుకును ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివించాలన్నది ఆయన కోరిక. హిమాయత్‌నగర్‌లో ఓ టాప్ కాలేజీ బ్రాంచి ఆఫీస్‌ను సంప్రదించారు. అక్కడున్న వారు ‘సీట్లు అయిపోవచ్చాయి. రెండే ఉన్నాయి. కావాలంటే రూ.12 లక్షలు అవుతుంది.. ముందుగా రూ.1 లక్ష చెల్లించి రిజిస్టర్ చేయించుకోండి.. లేదంటే అవీ ఉండవు..’ అనడంతో కంగుతిన్నారు. నర్సింహమూర్తి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కూతురు లక్ష్మీప్రసన్న ఎంసెట్, జేఈఈ రాసింది. ఎంసెట్‌లో 28 వేలకు పైగా ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానంటోంది. దీంతో ఆమె తండ్రి ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. సీటుకు రూ.15 లక్షలు అని వారు చెప్పడంతో నోట మాట రాలేదు. సాక్షి, హైదరాబాద్ ...ఇది ఈ ఇద్దరు తల్లిదండ్రులదే కాదు.. టాప్ కాలేజీలు, ద్వితీయశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం యత్నిస్తున్న తల్లిదండ్రులందరిదీ ఇదే పరిస్థితి. సీటు కావాలంటే రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షలు చెల్లించాల్సిందేనంటున్నాయి కాలేజీలు! దళారులు సైతం రంగంలోకి దిగి టాప్ కాలేజీల్లో సీట్లు కావాలంటే బ్రాంచిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అవుతుందంటూ బేరాలు నడుపుతున్నారు. అదీ ముందు కనీసం రూ.1 లక్ష చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సీటు ఉంటుందని చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలను టాప్ కాలేజీల్లో చదివించుకోవాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను యాజమాన్యాలు ఇలా క్యాష్ చేసుకుంటూ సీట్లను అడ్డంగా అమ్ముకుంటున్నా ఉన్నత విద్యా మండలి స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుబంధ గుర్తింపు రాకముందే.. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపే రాలేదు. ఎన్ని సీట్లకు అనుమతి వస్తుందో తెలియదు. ఇప్పటివరకైతే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చిన 242 కాలేజీల్లో 1,24,239 లక్షల సీట్లలో కేవలం 65 వేల సీట్లకే యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపునకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అదికూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు వస్తుందో తెలియదు. అయినా యాజమాన్యాలు మేనేజ్మెంట్ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్మకానికి పెట్టాయి. ప్రతిభ, ర్యాంకులతో సంబంధం లేదు. డబ్బులు చెల్లిస్తే చాలు.. మా సీట్లు... మా ఇష్టం.. అమ్మేసుకుంటాం అన్న రీతిలో ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. 70 శాతం కన్వీనర్ కోటా సీట్లకు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ కాకముందే 30 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకానికి తెర లేపాయి. ‘సీట్లు అయిపోతున్నాయి... త్వరగా అడ్వాన్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి..’అంటూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయం ఉన్నత విద్యా మండలికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వస్తేనే చర్యలు చేపడతామంటూ చేతులు ముడుచుకు కూర్చుంది. కనీసం ర్యాటిఫికేషన్లు ఇచ్చే సమయంలో కాలేజీ వారీగా ప్రతిభావంతులకే సీట్లు ఇచ్చారా? లేదా? అన్న విషయాలను కూడా ఉన్నత విద్యా మండలి అధికారులు సరిగ్గా చూడకుండా, యాజమాన్యాల అమ్మకాలకు ఆమోద ముద్ర వేస్తుండటం వల్లే అడ్డగోలుగా సీట్ల అమ్మకాలు సాగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఇంజనీరింగ్‌లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటా (బీ కేటగిరీ) కింద భర్తీ చేయాలి. యాజమాన్య కోటాలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, మిగిలినవాటిని ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో విద్యార్థులకు కేటాయించాలి. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకుల వారీగా సీట్లు కేటాయించగా మిగిలితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను ఇవ్వాలి. కానీ దరఖాస్తుల ప్రక్రియ లేకుండానే సీట్లను అమ్మకానికి పెట్టాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజునే మేనేజ్మెంట్ కోటా(ఎన్నారై మినహా) సీట్లకు వర్తింపజేయాలి. కానీ అదేమీ లేకుండా యాజమాన్యాలు లక్షలకు అమ్ముకుంటున్నాయి. చివరకు ఎన్ఆర్ఐ కోటా సీట్లకు కూడా అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. కన్సల్టెన్సీల మాయాజాలం.. కన్వీనర్ కోటాలో సీటు రాదేమోనన్న తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఇటు ఉన్నత విద్యా మండలి, అటు ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. ద్వితీయ శ్రేణి కాలేజీలు కూడా ఈసీఈ, సీఎస్ఈ వంటి సీట్లకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నాయి. కొన్ని కాలేజీల సిబ్బంది అయితే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ.. సీట్లు అయిపోతున్నాయంటూ ఆందోళనలో పడేస్తున్నాయి. కొన్నింట్లోనే ఆన్లైన్.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ముందుగా నోటిఫికేషన్ జారీ చేసి, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. అలా వచ్చిన విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించాలి. అలా సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కానీ దీన్ని కొన్ని కాలేజీలే పాటిస్తున్నాయి. మిగితా కాలేజీల్లో ఆన్లైన్ లేకుండా పోయింది. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉన్నత విద్యామండలి కూడా గుడ్డిగా ఆమోదముద్ర (ర్యాటిఫికేషన్) వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మెడికల్ కాలేజీల్లో ప్రతి సీటూ ప్రతిభకే
-
ప్రతి సీటూ ప్రతిభకే
మెడికల్ కాలేజీల్లో ఇక యాజమాన్య కోటా కౌన్సెలింగ్ బంద్! - ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ సీట్లకు ఒకే కౌన్సెలింగ్ - సర్కారుకు ప్రతిపాదించిన వైద్య ఆరోగ్యశాఖ - నిర్ణయం అమల్లోకి వస్తే సీట్ల అమ్మకాలకు, డొనేషన్లకు చెక్ - ఆయుష్ సీట్ల భర్తీకి కూడా ‘నీట్’! సాక్షి, హైదరాబాద్ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఫీజులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారికే సీట్లు లభిస్తాయి. సీట్ల కొనుగోళ్లు, అమ్మకాలకు చెక్ పడుతుంది. అంతేకాదు ప్రభుత్వం నిర్ధారించిన ప్రైవేటు ఫీజు తప్ప ఇష్టారాజ్యంగా డొనేషన్లు వసూలు చేయడానికీ అవకాశం ఉండదు. అయితే వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ‘నీట్’ ర్యాంకుల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు మాత్రం యాజమాన్యాలే మరో కౌన్సెలింగ్ నిర్వహించుకున్నాయి. ఎన్నారై కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకున్నాయి. దీంతో నీట్ ర్యాంకులను ఆధారం చేసుకున్నా అనేకమంది డొనేషన్లు చెల్లించే బీ కేటగిరీ సీట్లల్లో చేరాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ‘నీట్’స్ఫూర్తికి విరుద్ధమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్ అనేది ‘నీట్’ఉద్దేశమని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని కోరుతున్నాయి. బీ కేటగిరీలో 915 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మరో 3 మైనారిటీ మెడికల్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 1,050 ఎంబీబీఎస్ సీట్లుండగా.. మైనారిటీ సహా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం, మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. ప్రైవేటులోని 35 శాతం, మైనారిటీలోని 25 శాతం సీట్లు బీ కేటగిరీ సీట్లు... కాగా మిగిలినవి ఎన్నారై కోటా సీట్లున్నాయి. దాదాపు 915 బీ కేటగిరీ సీట్లకు కూడా ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. ఇవి కూడా ప్రతిభ ఉన్న వారికే లభిస్తాయని అంటున్నారు. ఇక ఎన్నారై కోటా సీట్లు ఎలా భర్తీ చేస్తారనేది తేల్చాల్సి ఉంది. ఆయుష్ సీట్లూ ‘నీట్’తోనే? ఆయుష్ సీట్లను కూడా ‘నీట్’ర్యాంకుల ద్వారానే భర్తీ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సీబీఎస్ఈకి లేఖ రాసినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నీట్ నోటిఫికేషన్లో కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అని మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు ఆయుష్నూ చేర్చాలని కేంద్రం కోరుతోందని ఆయన వివరించారు. దీనిపై సీబీఎస్ఈ నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఆయుష్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయిస్తే ఇక అన్ని మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సులకే ఒకే ప్రవేశ పరీక్ష, ఒకే కౌన్సెలింగ్ ఉంటుంది. -
‘మేనేజ్మెంట్’ సీట్ల భర్తీ అంతంతే!
ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిన 15,744 యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిన సీట్ల సంఖ్య 14,794కే పరిమితం బీఫార్మసీలోనూ అదే పరిస్థితి.. 60 శాతం సీట్లే భర్తీ ప్రభుత్వానికి నివేదించిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ అయిన సీట్ల లెక్క తేలింది. యాజమాన్య కోటాలో కాలేజీల్లో చేరిన విద్యార్థుల ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ర్యాటిఫికేషన్లను పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లెక్కలు అందజేసేందుకు నివేదికలు సిద్ధం చేసింది. గతేడాది మేనేజ్మెంట్ కోటాలో దాదాపు 55 శాతం సీట్లు భర్తీ కాగా ఈసారి మాత్రం కేవలం 48.44 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రవేశాల కోసం యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లు కూడా మొత్తం భర్తీ కాలేదు. 2016-17 విద్యా సంవత్సరంలో 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,598 సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. అందులో 74,060 సీట్లను (ప్రభుత్వ కాలేజీల్లోని 2,805 సీట్లు వంద శాతం కలుపుకొని) 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చర్యలు చేపట్టగా, అందులో 54,172 సీట్లు భర్తీ అయ్యాయి. 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో 30,538 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 14,794 సీట్లే భర్తీ అయ్యాయి. 15,744 సీట్లు మిగిలిపోయాయి. అలాగే 123 బీఫార్మసీ కాలేజీల్లో 9,226 సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టగా మేనేజ్మెంట్ కోటాలోని 2,714 సీట్లలో 1,592 సీట్లే భర్తీ అయ్యాయి. ఇక ఫార్మ్-డీలో 54 కాలేజీల్లోని 1,620 సీట్లలో మేనేజ్మెంట్ కోటా పరిధిలో ఉన్న 486 సీట్లలో 384 సీట్లు భర్తీకాగా 102 సీట్లు మిగిలిపోయాయి. -
నేడే నీట్-2 పరీక్ష
- హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష - యాజమాన్య కోటా - మెడికల్ సీట్లకు ఈ పరీక్షే కీలకం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)-2’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనుండడంతో ఈ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లోని మెడికల్ సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసెట్-2 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కన్వీనర్ కోటాలో అవకాశం లభించని వారంతా ‘నీట్-2’కు పోటీ పడుతున్నారు. నీట్-2 ర్యాంకులతో రాష్ట్రం సహా దేశంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లోని సీట్ల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక నీట్-2 ప్రవేశ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 27 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థుల హాల్టికెట్లలో పొందుపరిచారు. -
నర్సరీలో మేనేజ్మెంట్ కోటా రద్దు
నర్సరీ అడ్మిషన్లలో 'మేనేజ్మెంట్ కోటా'కు ఢిల్లీ మంత్రివర్గం స్వస్తి పలికింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో పిల్లలకు ఇచ్చే 25 శాతం కోటా తప్ప.. నర్సరీ అడ్మిషన్లలో మరే కోటా ఉండకూడదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మిగిలిన సీట్లన్నీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఒకవేళ దీనికి స్కూలు యాజమాన్యాలు అభ్యంతరం చెబితే తాము కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. మేనేజ్మెంట్ కోటా అనేది విద్యావ్యవస్థలో అతిపెద్ద స్కాం అని, వాళ్లు దీన్ని ఆపకపోతే గుర్తింపు రద్దుచేయడం లేదా ప్రభుత్వమే వాటిని టేకోవర్ చేయడం తప్పదని హెచ్చరించారు. చదువును వ్యాపారం చేసేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. పిల్లలకు అడ్మిషన్లు ఎలా ఇస్తున్నారో బహిరంగంగా చెప్పాలని, ఇప్పుడు మాత్రం వాళ్లు అవలంబిస్తున్న విధానాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. వెబ్సైట్లలో వాళ్లు పెట్టిన ప్రమాణాలు చూస్తే తానే షాక్ తిన్నానని చెప్పారు. పొగతాగే తల్లిదండ్రులు, నాన్ వెజ్ తినేవాళ్లు, మద్యం తాగేవాళ్ల పిల్లలకు కొన్ని స్కూళ్లలో ప్రవేశం లేదు. పెయింటింగ్ వేసేవాళ్లు, సంగీతం తెలిసిన వాళ్ల పిల్లలకు అదనపు రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయని ఢిల్లీ సీఎం మండిపడ్డారు. -
ప్రైవేటు స్కూల్స్ లో మేనేజ్ మెంట్ కోటా రద్దు
న్యూఢిల్లీ: ప్రైవేటు పాఠశాలల్లో మేనేజ్ మెంట్ కోటా అడ్మిషన్లను రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకే మేనేజ్ మెంట్ కోటాను రద్దు చేసినట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పేదపిల్లలకు 25 శాతం సీట్లను కేటాయింపు యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలో ప్రైవేటు పాఠశాలలు విపరీతంగా ఫీజులు పెంచేస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కౌన్సెలింగ్‌లో భర్తీ కాని యాజమాన్య కోటాలోని 202 డెంటల్ సీట్లు ఎన్నారై కోటాలోకి మారనున్నాయి. అలాగే అదే కోటాలోని 505 ఎంబీబీఎస్ సీట్లల్లో అన్నీ భర్తీ అయినా ఈ నెలాఖరుకల్లా వాటికి నాలుగేళ్ల ఫీజు బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. గ్యారంటీ చూపని విద్యార్థుల సీట్లు రద్దయి అవి కూడా ఎన్నారై కోటాలోకి చేరతాయి. అప్పుడు ఇష్టానుసారంగా కాలేజీ యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చు. వాటికి బేరం పెట్టే పనిలో యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. సీటు రద్దు చేసుకునే విద్యార్థులకు ప్రత్యేక నజరానా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నారై కోటాలోకి వచ్చే ఎంబీబీఎస్ సీటును రూ. కోటిన్నర వరకు బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లోని బీ కేటగిరీకి చెందిన 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లకు అత్యంత గోప్యంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు మొదటి ఏడాది రూ. 9 లక్షల ఫీజుతో చెల్లింపుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సు ఫీజు రూ. 36 లక్షలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. అలాగే బీడీఎస్‌లో మొదటి ఏడాది ఫీజు రూ. 4 లక్షల చెల్లింపుతోపాటు మిగిలిన మూడేళ్లకు రూ. 12 లక్షలు గ్యారంటీ అడిగారు. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీతో వస్తేనే చేరిన సీటు ఉంటుందని... లేకుంటే రద్దవుతుందని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. కౌన్సెలింగ్‌లో అన్ని ఎంబీబీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరినా బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుంటే అవి నెలాఖరుకు రద్దు అవుతాయి. ప్రభుత్వ జీవో ప్రకారం ఆ సీట్లన్నీ ఎన్నారై కోటాలోకి మారిపోతాయి. ఇక బీడీఎస్‌లో 350 యాజమాన్య సీట్లల్లో 202 సీట్లు భర్తీ కాలేదు. అయితే బీడీఎస్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. వాటిని ఎన్నారై ఫీజుకే అంటగట్టాలని యోచిస్తున్నాయి. -
‘బి’ కేటగిరీ సీట్ల భర్తీకి 24న ఎంసెట్
విజయవాడ: ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లోని మేనేజ్మెంట్ కోటాలో ‘బి’ కేటగిరీ సీట్ల భ ర్తీకి ఈ నెల 24న వెబ్ ప్రాతిపదికన ఉ మ్మడి పరీక్షను(ఎంసెట్) నిర్వహించనున్నట్లు క న్వీనర్ డాక్టర్ కేజే రమేష్ తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ డెంటల్ కా లేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యం లో నిర్వహించే ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ ల్లోని అభ్యర్థులు తమ దరఖాస్తులను అసోసియేషన్ వెబ్సైట్ ఈ నెల 15 లోగా అప్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 19 నుంచి 24 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మార్కుల ప్రాధాన్యత క్రమంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వా రా ‘బి’ కేటగిరీలోని 665 ఎంబీబీఎస్, 350 బీ డీఎస్ సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నీ ఇతర రాష్ట్రాల వారికే!
హైదరాబాద్: ప్రైవేటు బీఈడీ కాలేజీల అక్రమాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 310 కాలేజీల్లో 200 కాలేజీల్లో మేనేజ్మెంటు కోటా సీట్లన్నిటినీ అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులతో నింపేశారు. కొన్ని కాలేజీలు మణిపూర్, ఒడిస్సా, చత్తీస్‌ఘడ్‌కు చెందిన వారితో భర్తీచేశాయి. నిబంధనల పకారం మేనేజ్మెంటు కోటా సీట్లను కన్వీనర్ నిర్దేశించిన ఎడ్‌సెట్ ర్యాంకుల వారికి ఇవ్వాలి. ముందుగా రాష్ట్రానికి చెందిన విద్యార్ధులకు ప్రాధాన్యమివ్వాలి. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇతర రాష్ట్రాల వారితో భర్తీచేయాలి. అన్ని రాష్ట్రాల వారికి తెలిసేలా ప్రముఖ పతికల్లో జాతీయస్థాయిలో ప్రకటనలు విడుదల చేయాలి. కానీ కాలేజీలు పభుత్వంతో సంబంధం లేకుండా, ప్రకటనలు కూడా చేయకుండా బీహార్, మణిపూర్ విద్యార్ధులతో ఈ సీట్లను భర్తీ చేశాయి. ఈ కాలేజీలు అందించిన పత్రాల ఆధారంగా కాలేజీల్లోని ప్రవేశాలపై పూర్తిస్థాయి పరిశీలన చేసేందుకు నిపుణులతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా కాలేజీల్లోని ప్రవేశాల తీరును పరిశీలించిన ఈ కమిటీ తన నివేదికను శనివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డికి అందించింది. -
మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీట్లకు ప్రత్యేక పరీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇక మీదట ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల కానుంది. -
ఎంబీబీఎస్ మెరిట్‌తోనే పీజీ యాజమాన్య సీట్ల భర్తీ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల నిర్ణయం కర్ణాటక తరహాలో భర్తీ చేయాలని తీర్మానం డిమాండ్‌ను బట్టి సీట్ల అమ్మకం అభ్యర్థుల్లో సందేహాలు, ఆందోళన సాక్షి, హైదరాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో యాజమాన్య కోటాలోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఎంబీబీఎస్ మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలు నిర్ణయించాయి. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లోని పీజీ వైద్య సీట్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీపై ప్రైవేటు వైద్య కళాశాలలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ఉంటే, మిగతా 50 శాతం యాజమాన్య కోటాలో భర్తీ చేసుకోవచ్చు. అయితే యాజమాన్య కోటాపై ప్రతి ఏడాది వివాదం చెలరేగుతోంది. చివరి నిమిషంలో ప్రైవేటు కళాశాలలు సీట్లను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ పట్టించుకోకపోతుండటంతో తాము నష్ట పోతున్నామని ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో ప్రతి కళాశాల ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేసుకుని సీట్లను భర్తీ చేసుకోవాలని ప్రైవేటు వైద్య కళాశాలల సంఘాలు తీర్మానించాయి. మార్చిలో నిర్వహించే పీజీసెట్ ఫలితాలు వచ్చాక.. ప్రైవేటు కళాశాలలు విడివిడిగా ప్రకటనలు ఇచ్చి, ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని, ఇదే విధానాన్ని తెలుగురాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అభిప్రాయం యాజమాన్యం అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి సుమారు 1,290 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ఇందులో 670 సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, 620 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. భారతీయ వైద్య మండలి నిర్ణయం మేరకు కొన్ని అదనంగా రావడం గానీ.. కోత విధించడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. రూ. కోటిన్నర దాటితేనే సీటు మెరిట్ ఆధారంగా అని ఒక పక్క చెబుతున్నా.. డిమాండ్ అధికంగా ఉన్న పీజీ వైద్య సీట్లకు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ ధర నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా రేడియాలజీ సీట్లకైతే డిమాండ్ అధికంగా ఉంది. ఒక్కో సీటును రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.70 కోట్లకు అమ్ముతున్నట్టు తెలిసింది. ఆర్థోపెడిక్ విభాగానికి కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు ఎంఎస్ జనరల్ సర్జన్, ఎండీ జనరల్ మెడిసిన్, ఎండీ పీడియాట్రిక్, ఎండీ అనస్థీషియా విభాగాలకు అభ్యర్థుల డిమాండ్‌ను బట్టి యాజమాన్యాలు రేట్లు నిర్ణయిస్తున్నాయి. అయితే ప్రైవేటు కళాశాలలు నోటిఫికేషన్లు ఎలా ఇస్తాయి, సీట్ల భర్తీ ఎలా, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు లాంటి సందేహాలెన్నో అభ్యర్థులను వేధిస్తున్నాయి. గుట్టుచట్టుచప్పుడు కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రాధాన్యమున్న దినపత్రికల్లో ప్రకటనలిచ్చి, దరఖాస్తులు ఆహ్వానించి మెరిట్ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సీట్ల భర్తీపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది. -
అనుమతి లేకున్నా స్పాట్ అడ్మిషన్లు!
కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలోని ఖాళీల భర్తీ ప్రకటనలు ఇచ్చి మరీ సీట్లు నింపుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలు హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. స్పాట్ అడ్మిషన్ల పేరుతో సీట్లను భర్తీ చేస్తున్నాయి. నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇచ్చి మరీ ఈ సీట్లను భర్తీ చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా స్పాట్ అడ్మిషన్ల పేరుతో మిగులు సీట్ల భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగలకపోయినా, మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను చాలా వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మధ్యతరహా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యా మండలి ఆమోదం లేకపోయినా ప్రకటనలు జారీచేసి మరీ సీట్లను భర్తీ చేస్తుండడంతో భవిష్యత్తులో వాటికి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 31తోనే ఆఖరు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31తోనే ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయింది. అప్పటివరకు కన్వీనర్ కోటాలోనే ఆంధ్రప్రదేశ్‌లో 57వేల సీట్లు, తెలంగాణలో 15వేల సీట్లు మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో మేనే జ్మెంట్ కోటాలో మరో 80 సీట్లు ఉండిపోయాయి. అయితే ఆగస్టు 31 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. కౌన్సిల్ ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా మేనే జ్మెంట్ కోటా సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 వేల మందికి యాజమాన్యాలు సీట్లను కేటాయించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిన్నకుండిపోయింది. అయితే యాజమాన్యాలు మాత్రం ప్రకటనలు జారీచేసి మరీ ఆ సీట్ల భర్తీకి గతంలోనే చర్యలు చేపట్టాయి. తాజాగా మేనేజ్మెంట్ కోట్లా, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో ప్రకటనలు జారీ చేసి భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఆగస్టు 31 తర్వాత చేపట్టిన, చేపడుతున్న ఈ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తుందన్నదీ ప్రశ్నార్థంగా మారింది. -
విద్యార్థులను ముంచిన ‘విద్యా మండలి’
* సుప్రీంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను ప్రస్తావించని ఉన్నత విద్యా మండలి * అదే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపం * మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న వినతిని తోసిపుచ్చిన సుప్రీం కోర్టు * తీర్పు ప్రకారం అడ్మిషన్ల గడువు గత నెల 31తో పూర్తి * అగమ్యగోచరంలో తొలి విడతలో సీటు దక్కని 4 వేల మంది * బ్రాంచ్ మార్చుకునే వారికీ అవకాశం లేదు * మేనేజ్మెంట్ సీట్ల భర్తీపైనా స్పష్టత కరువు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉదాసీనత ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యనభ్యసించాలనుకున్న విద్యార్థుల విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా చేసింది. మలి విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీకి గడువు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు అలస్యం కాకుండా సుప్రీంకోర్టు 2012 డిసెంబరు 13నే సాంకేతిక విద్యకు క్యాలండర్‌ను రూపొందించింది. కళాశాలలు ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం నుంచి తరగతుల ప్రారంభం వరకు స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించింది. దానిని ఏఐసీటీఈ నోటిఫై చేసింది. దానిప్రకారం ఏటా జూలై 31లోగా అడ్మిషన్లు పూర్తవ్వాలి. ఆగస్టు 1న తరగతులు ప్రారంభమవ్వాలి. మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 15లోగా భర్తీ చేయాలి. ఆ తర్వాత అడ్మిషన్లు చేపట్టకూడదు. దీని ప్రకారం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు జరగాలి. అయితే విభజన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, అధికారుల కేటాయింపు పూర్తి కాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్తగా విధివిధానాలు రూపొందిం చాల్సి ఉందని, అందువల్ల కౌన్సెలింగ్ పూర్తిచేసేందుకు అక్టోబరు 31 వరకు గడువు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇందులో తాము ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని ఏపీ ఉన్నత విద్యామండలి కోరింది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా అడ్మిషన్లు త్వరితగతిన పూర్తిచేయాల్సి ఉందని, ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తే సరిపోతుందని విన్నవించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వమూ సరేనంది. దాంతో సుప్రీంకోర్టు అడ్మిషన్ల ప్రక్రియ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. దీని ప్రకారం తొలి విడత కౌన్సెలింగ్ గత నెల 31లోపు పూర్తయింది. అయితే, ఆగస్టు 4 నాటి విచారణ సందర్భంగా రెండో విడత కౌన్సెలింగ్ విషయాన్ని ప్రస్తావించలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో కొందరు విద్యార్థులు వివిధ కారణాల వల్ల సీట్లు పొందలేకపోవచ్చు. సీట్లు పొందిన వారు కూడా బ్రాంచ్, కాలేజి నచ్చక వాటిలో చేరకపోవచ్చు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో 4 వేల మందికి సీటు రాలేదు. వీరికి రెండో విడత కౌన్సెలింగ్ కూడా లేకుండాపోయింది. అలాగే తొలి విడతలో సీటు పొందినా, ఆ బ్రాంచ్ నచ్చకో, మంచి కాలేజీకోసమో కళాశాలల్లో రిపోర్ట్ చేయని వారూ రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరికీ ఇప్పుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అంతేగాక విద్యార్థులు వదిలేసిన సీటును కళాశాలలు మరొకరికి ఇవ్వలేని పరిస్థితీ ఎదురవుతుంది. దానిని మేనేజ్మెంట్ కోటాగా మార్చుకున్నా.. దాని గడువూ గత నెల 31తో ముగిసింది. కీలకమైన ఇలాంటి సాంకేతిక అంశాలను ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో ప్రస్తావించనే లేదు. 65 వేల సీట్లు మిగిలిపోయాయన్న ధ్యాసే తప్ప, విద్యార్థులు నష్టపోతున్న విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదు. వాదనలూ వినిపించలేదు. ఆగస్టు 4 నాటి విచారణకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వారు ఆనాడే ఈ విషయం ప్రస్తావించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. మేనేజ్మెంట్ కోటా పరిస్థితేమిటి? బి- కేటగిరీ (మేనేజ్మెంట్ కోటా) సీట్ల భర్తీకి ఏపీ ఉన్నత విద్యామండలి గత నెల 22న నోటిఫికేషన్ జారీచేసింది. వ్యక్తిగతంగా లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 3లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చంది. ఈ నెల 5న మెరిట్ జాబితా, 7న ఎంపికైన వారి జాబితాలు ఇస్తామని, 9న వీటిని ఉన్నత విద్యామండలి ధృవీకరిస్తుందని పేర్కొంది. ఎంపికైన విద్యార్థులకు 12న ఇంటర్వ్యూ ఉంటుందని, 15న అడ్మిషన్లకు చివరి తేదీ అని ప్రకటించింది. కానీ, రెండో విడత కౌన్సెలింగ్, మేనేజ్మెంట్ కోటా భర్తీ ప్రక్రియల గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలన్న ఉన్నత విద్యామండలి అభ్యర్థనను సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల పరిస్థితేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సీట్లు చెల్లుబాటు కావా? అడ్మిషన్లు నిర్వహిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అడ్మిషన్లలో సీటు పొందలేని విద్యార్థులో, బ్రాంచ్ మార్చుకోవాలని భావిస్తున్న వారో సుప్రీం కోర్టును ఆశ్రయించడమొక్కటే ఇప్పుడున్న అవకాశమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాగా సుప్రీం కోర్టు తీర్పు కాపీని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రెండో విడత కౌన్సెలింగ్‌పై తదుపరి చర్యలు చేపడతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. -
బీడీఎస్ ‘మేనేజ్మెంట్ కోటా’ఫీజు పెంపు
* ఫలించిన ప్రైవేటు కళాశాలల ఒత్తిళ్లు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్, అన్ అయిడెడ్, నాన్ మైనారిటీ దంత వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజులను యథాతంగా కొనసాగించాలనే తన నిర్ణయాన్ని రెండు రోజులకే తెలంగాణ ప్రభుత్వం మార్చుకుంది. తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ మైనారిటీ వైద్య విద్య కళాశాలల మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దంత వైద్య కళాశాలల ఫీజులు యథాతథంగా కొనసాగుతాయని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తితో నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం ..డెంటల్ కళాశాలల మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజును రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు, ఎన్ఆర్ఐ కోటా ఫీజులను రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. -
డాక్టర్ కలకు విదేశీ చేయూత
ఎంబీబీఎస్.. బైపీసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదవాలనుకునే కోర్సు.. దేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండటంతో వాటిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు.. మెరిట్లో సీటు రాకున్నా మేనేజ్మెంట్ కోటాలో చేరాదామనుకుంటే ఫీజులు చెల్లించడం తలకు మించిన భారం.. ప్రత్యామ్నాయంగా డాక్టర్ కలను సాకారం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయి విదేశీ విశ్వవిద్యాలయాలు.. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్యనభ్యసించాలంటే పాటించాల్సిన విధివిధానాలపై విశ్లేషణ.. ఉన్నత విద్య మాదిరిగానే.. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. విదేశీ వైద్య విద్యవైపు మన విద్యార్థులు ఆకర్షితులు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. దేశంలో ఏదైనా మెడికల్ కాలేజీలో చేరాలంటే సంబంధిత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు ఇందుకు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రవేశం కచ్చితంగా లభిస్తుందనే గ్యారంటీ లేదు. అదే విదేశీ యూనివర్సిటీల విషయానికొస్తే ఎటువంటి ప్రవే శ పరీక్షలు లేకుండానే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన దేశంలో మెరిట్లో సీటు రాకున్నా.. మేనేజ్మెంట్ కోటాలో చేరాదామనుకుంటే ఫీజులు తలకు మించిన భారంగా ఉన్నాయి. అదే విదేశాల్లోనైతే ఇక్కడి మేనేజ్మెంట్ కోటా ఫీజుతో పోల్చితే దాదాపు సగం ఖర్చుతో కోర్సును పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. ఎటువంటి డొనేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. మనకు అనుకూలమైన దేశాన్నీ, అక్కడి విద్యా సంస్థను ఎంచుకుని చేరటమే.శ ఉంటుంది. దేశాలివే: భారతీయ విద్యార్థులు ఎక్కువగా చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్థాన్, సెంట్రల్ అమెరికా దేశాలకు చె ందిన యూనివర్సిటీల్లో చేరుతున్నారు. వీటిలో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని యూనివర్సిటీలకు తెలుగు విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. 60 నుంచి 70 శాతం మంది చైనా యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. అర్హతలు: అడ్మిషన్ తీసుకున్న సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. సబ్జెక్ట్లతో) ఇంటర్మీడియెట్ పూర్తి చేయాలి. విద్యార్థులదే బాధ్యత: గతంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి అర్హత సర్టిఫికెట్ పొందాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఎంసీఐ నిబంధనలను సవరించింది. ఇప్పుడు ఎంసీఐ నుంచి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేకుండానే విదేశాల్లో మెడిసిన్ చేయవచ్చు. అయితే గతంలో విద్యార్థి దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీకి గుర్తింపు లేకుంటే.. సదరు దరఖాస్తును ఎంసీఐ తిరస్కరించేది. దాంతో గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో మాత్రమే విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉండేది. మారిన నిబంధనల మేరకు యూనివర్సిటీల గుర్తింపును నిర్ధారించుకునే బాధ్యత విద్యార్థులదే. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మారిన నిబంధనల మేరకు యూనివర్సిటీ గుర్తింపును నిర్ధారించుకునే బాధ్యత విద్యార్థులదే. కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. విద్యా సంవత్సరం: రష్యా, ఉక్రెయిన్, చైనా ఏ దేశంలోనైనా సాధారణంగా సెప్టెంబర్/అక్టోబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. జూన్‌తో ముగుస్తుంది. ఏడాదికి రెండు విడతల సెలవులు ఉంటాయి. మొదటి విడతలో శీతాకాలంలో వారం నుంచి పది రోజులు.. తర్వాత జూలై, ఆగస్ట్ రెండు నెలలు సెలవులు ఇస్తారు. ఈ సమయంలో విద్యార్థులు స్వదేశానికి రావచ్చు. వసతి: వసతి విషయానికొస్తే.. అన్ని దేశాల్లో కూడా నివాస వసతి సౌకర్యం యూనివర్సిటీ/ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్లో ఉంటుంది. విద్యార్థి అవసరం మేరకు సింగిల్ రూమ్ లేదా షేరింగ్ రూమ్ కేటాయిస్తారు. కొన్ని దేశాల్లోనైతే భారతీయులు ఇష్టపడే సంప్రదాయ ఆహారం లభిస్తుంది. సొంతంగా కూడా వంట చేసుకోవచ్చు. అంతేకాకుండా అత్యాధునిక లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. బోధన ఆంగ్లంలోనే: అన్ని దేశాల్లో బోధన ఆంగ్లంలోనే ఉంటుంది. కోర్సులో భాగంగా రోజూ స్థానిక భాష నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఉండే క్లినికల్ ప్రాక్టీస్‌లో భాగంగా స్థానికులతో మాట్లాడి.. చికిత్స చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్థానిక భాష తప్పకుండా నేర్చుకోవాలి. గుర్తింపు నిర్ధారణ: ఆయా యూనివర్సిటీలకు.. ఆఫర్ చేస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత ఏజెన్సీల గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్థాన్ వంటి దేశాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ-వెబ్సైట్: జ్ట్టిఞ:// avicenna. ku.dk/ database/medicine) గుర్తింపు ఉన్న వర్సిటీలను మాత్రమే ఎంచుకోవాలి. చైనాలో మాత్రం.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ, వెబ్సైట్: www.mciindia.org) గుర్తింపు ఇచ్చిన ఇన్స్టిట్యూట్లలో మాత్రమే చేరాలి. ఎందుకంటే ఈ కళాశాలలో మాత్రమే బోధన ఆంగ్లంలో ఉంటుంది. దాదాపు ఒకటే: విదేశీ యూనివర్సిటీలు అందించే డిగ్రీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు ఒకే విధంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంసీఐ.. తన మార్గదర్శకాలకు దగ్గరగా ఉండే యూనివర్సిటీలకు మాత్రమే గుర్తింపునిస్తుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉండే ఇంటర్న్‌షిప్ విషయానికొస్తే.. ఒక్క చైనా మినహా మిగతా దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు విధిగా మన దేశంలోనే ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాలు ఎక్కువ చలి ప్రదేశాలు. వాటితో పోల్చితే మన దేశ వాతావరణం భిన్నంగా ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రజలకు, ఇక్కడ ప్రజలకు వచ్చే వ్యాధుల్లో తేడా ఉంటుంది. మన దేశ వాతావరణ పరిస్థితులు చైనాతో సరిపోతుండడంతో.. ఇంటర్న్‌షిప్ రెండు దేశాల్లో ఎక్కడైనా చేయవచ్చు. కోర్సు తర్వాత: కోర్సు పూర్తి చేసిన తర్వాత మన దేశంలో చదివిన మెడికల్ గ్రాడ్యుయేట్ల మాదిరిగానే ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. దీన్ని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)గా కూడా వ్యవహరిస్తారు. ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) నిర్వహిస్తుంది. ఏడాదికి రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం రూ. 4,000 ఫీజు చెల్లించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత గుర్తింపు ఉన్న ఆస్పత్రిలో ఏడాది హౌస్ సర్జన్సీ చేయాలి (చైనాలో చదివిన విద్యార్థులు మినహా). ఈ రెండు దశలను పూర్తి చేస్తే ఎంసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుతుంది. తద్వారా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఇక్కడ మెడిసిన్ చేసిన విద్యార్థులతో సమానంగా అవకాశాలను దక్కించుకోచ్చు. రెండు-మూడు నెలల ముందు: చాలా దేశాల్లో సెప్టెంబర్‌లో అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సన్నాహకాలు ప్రారంభించాలి. పాస్‌పోర్ట్ లభించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రెండు-మూడు నెలల ముందు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాత వెళ్లాల్సిన దేశ ఎంబసీని సంప్రదించి స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. విద్యార్హతలు, ఆర్థిక స్థోమత, సంబంధిత దేశానికి ఏ కోర్సు చదవడానికి వెళుతున్నారు? అనే విషయూలను క్షుణ్నంగా పరిశీలించి వీసా జారీ చేస్తారు. వీసా కోసం కొన్ని దేశాల ఎంబసీలకు విద్యార్థి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు (చైనా, కిర్గిజిస్తాన్ వంటివి). ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు మాత్రం నేరుగా వెళ్లడం తప్పనిసరి. దేశం కోర్సు వ్యవధి మొత్తం ఖర్చు చైనా ఐదేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 15-20 లక్షలు కిర్గిజిస్థాన్ ఐదేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 11-13 లక్షలు రష్యా ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 18-20 లక్షలు ఉక్రెయిన్ ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 18-20 లక్షలు ఫిలిప్పీన్స్ ఆరేళ్లు+ఏడాది (ఇంటర్న్‌షిప్) రూ. 20-22 లక్షలు సెంట్రల్ అమెరికా దేశాలు నాలుగు-ఆరేళ్లు రూ. 30-40 లక్షలు చైనా నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. మనదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ ఒకే తరగతి గది కేటాయిస్తారు. సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడితో పోల్చితే అక్కడి విద్యార్థులకు ఎక్కువగా క్లినికల్ ఎక్స్పోజర్ లభిస్తుంది. మన దేశ వాతావరణ పరిస్థితులు చైనాతో సరిపోతుండడంతో..కోర్సు పూర్తయ్యాక ఇంటర్న్‌షిప్‌ను రెండు దేశాల్లో ఎక్కడైనా పూర్తి చేయవచ్చు. బయటికి వెళ్లినప్పుడు అవసరాల నిమిత్తం, క్లినికల్ ప్రాక్టీస్‌లో భాగంగా స్థానికులతో మాట్లాడాల్సి ఉంటుంది. కోర్సు మొదటి సంవత్సరంలో స్థానిక భాషను నేర్పిస్తారు. అక్కడి యూనివర్సిటీలన్నీ ప్రభుత్వానినే కావడంతో ఎటువంటి డొనేషన్ అవసరం లేదు. కేవలం కోర్సు ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే హాస్టల్లో వసతి కల్పిస్తారు. ఆహారం పరంగా కూడా ఎటువంటి సమస్య ఉండదు. 90 శాతం ఇక్కడ లభించే కూరగాయాలు, పండ్లు అక్కడ కూడా లభిస్తాయి. సొంతంగా వంట చేసుకోవాలనుకునే వారికి కామన్ కిచెన్ సౌకర్యం కల్పిస్తారు. ఎంసీఐ పరీక్షలో అర్హత సాధిస్తే.. ఉన్నత విద్య, ఉద్యోగ పరంగా భారత్‌లో మెడిసిన్ పూర్తి చేసిన వారితో సమానంగా అవకాశాలు దక్కించుకోవచ్చు. వాతావరణ పరంగా ఏ రకంగా చూసిన చైనా పరిస్థితులు మన దేశంతో సరిపోతాయి. -డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి, గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్ గమనించాల్సినవి: లేదా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం మంచిది. సొంత ఖర్చుల కోసం ఇంటర్నేషనల్ క్రెడిట్/డెబిట్ కార్డు తీసుకెళ్లడం మంచిది. హెల్త్‌పాలసీ ఉండటం మంచిది.చేరే యూనివర్సిటీకి ఎంసీఐ గుర్తింపు ఉందో లేదా నిర్ధారించుకోవాలి.కన్సెల్టెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లాలంటే.. సంబంధిత కన్సెల్టెన్సీల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఆ కన్సెల్టెన్సీ ద్వారా అంతకుముందు వెళ్లిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించాలి. విదేశాల్లో కోర్సు పూర్తి చేసిన, ప్రస్తుతం కోర్సును చేస్తున్న విద్యార్థుల్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేయూలి. -
పీజీ వైద్య సీట్లపై అస్పష్టత..
గతంలో ఉన్న సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్లలో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. ఈ ఏడాది పెరుగుతున్న సీట్లు ఎన్ని, ఏ కళాశాలలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో గత ఏడాది కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల మేరకే అడ్మిషన్లు చేయాలని నిర్ణయించారు. పీజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడం, ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించడం తెలిసిందే. సోమవారం పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 2,431 పీజీ సీట్లు ఉన్నాయి. ప్రైవేటులో 50 శాతం యాజమాన్య కోటా అంటే 646 సీట్లు ఉంటాయి. ఇవి మినహాయించి మిగతా వాటికి ఈ నెలాఖరు నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే జూన్‌లో జరిగే రెండో కౌన్సిలింగ్లో, జూలై 10లోగా జరిగే మూడో కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ఆన్లైన్లో పెట్టనున్నారు. -
యాజమాన్య కోటాకు ‘ప్రవేశపరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రైవేటు వైద్య కళాశాలలన్నీ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2013-14 విద్యా సంవత్సరంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై తీవ్ర ఆరోపణలు రావడం, పలువురు కోర్టుకెళ్లడం, వీటిపై భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) తీవ్రంగా స్పందించడం తెలిసిందే. ఒక్కో సీటుకు రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఎంసీఐ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రతిభ ఆధారంగా సీట్ల భర్తీ జరిగేలా నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలని సూచించింది. ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన గానీ, ఎంసెట్ ర్యాంకు ఆధారంగా గానీ, ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా గానీ భర్తీ జరగాలని పేర్కొంది. ఇప్పటికే కర్ణాటక తదితర రాష్ట్రాలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రవేశపరీక్ష ద్వారా చేస్తున్నాయి. దీంతో రెండ్రోజుల కిందట సమావేశమైన ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించాయి. అయితే రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా అనే అంశం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,600కు పైగా సీట్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల చేతుల్లోనే ఉంటాయి. ఈ 40 శాతం సీట్లలో 25 శాతం యాజమాన్య కోటా, మిగతా 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ (ప్రవాస భారతీయులకు) కోటాలో ఉన్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్లకు రూ. 5.50 లక్షల ఫీజు ఉంది. ఈ ఫీజు వల్ల కాలేజీలు నిర్వహించలేమని, ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ కోటా, యాజ మాన్య కోటా మూడు కలిపి కామన్ ఫీజు రూపంలో రూ. 9 లక్షలు చేయాలని ఆయా కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. -
డీఎడ్ భర్తీ వివరాలన్నీ వెబ్సైట్లలో..
యాజమాన్య కోటా అడ్మిషన్లపై డీఎడ్ కాలేజీలకు విద్యాశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన అన్ని వివరాలనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా అడ్మిషన్లు చేపట్టాలని కాలేజీలకు విద్యాశాఖ స్పష్టం చేసింది. దరఖాస్తు ఫారాలను, ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు, అభ్యర్థుల వివరాలను, మెరిట్ వివరాలను తప్పనిసరిగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేటు డీఎడ్ కాలే జీల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది. యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు: అభ్యర్థులకు ఇంటర్లో 50 శాతం కంటే తక్కువ మార్కులు ఉండకూడదు. యాజమాన్యాలు రెండు పెద్ద పత్రికల్లో సీట్ల భర్తీకి ప్రకటన జారీ చేయాలి.. అందులో కాలేజీ పూర్తి చిరునామా, దరఖాస్తుల విక్రయం, స్వీకరణ గడువు, వెబ్సైట్ పూర్తి వివరాలు ఉండాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 10 రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలను అందజేసే, స్వీకరించే వారి వివరాలు ఇవ్వాలి. కాలేజీ వెబ్సైట్లో, డైట్‌సెట్ వెబ్సైట్లోనూ దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీలో రిజిస్టర్డ్ పోస్టు లేదా స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరించాక రసీదు ఇవ్వాలి. రోజువారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలను, మెరిట్ ప్రకారం విద్యార్థుల జాబితాలను ప్రవేశాలు పూర్తయ్యేవరకు కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఆ జాబితాను డైట్‌సెట్ కన్వీనర్‌కు అందజేయాలి. అనంతరం ప్రవేశాలు చేపట్టాలి. సీటు కేటాయించాక 7 రోజులలోగా విద్యార్థి చేరకపోతే ఆ తరువాత మెరిట్లో ఉన్న విద్యార్థికి ప్రవేశం కల్పించాలి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిశాక మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయడానికి వీలులేదు. ఆలోగానే, అర్హులైన వారినే చేర్చుకోవాలి. ఈ నిబంధనలు పాటించకపోతే యాజమాన్యంపై చర్యలు తప్పవు. అనర్హులను చేర్చుకుంటే వారిని పరీక్షలకు అనుమతించరు. 11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్.. డీఎడ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి 11వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 11నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. 23 నుంచి 26 వరకు ప్రవేశాలకు గడువు.. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మిగిలిపోయిన, విద్యార్థులు చేరని సీట్ల భర్తీకి డిసెంబరు 2 నుంచి 19వ తేదీ వరకు రెండో దశ కౌన్సెలింగ్‌ను, డిసెంబరు 27 నుంచి 30వ తేదీ వరకు చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. -
2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిపోగా, 32 కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ రాలేదు. తొలి విడత కౌన్సెలింగ్‌లో ఒక్క అడ్మిషన్ రానీ కళాశాలలు 13 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 32కు చేరింది. తుది విడత సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ ఆదివారం రాత్రి ఎస్.ఎం.ఎస్. ద్వారా అభ్యర్థులకు చేరవేశారు. కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు 1,02,105, ఫార్మసీ సీట్లు 8,345 మిగిలిపోయాయి. వీటికి అదనంగా యాజమాన్య కోటాలో దాదాపు లక్ష సీట్లు ఖాళీగా ఉన్నట్టు అంచనా. అంటే ఈ ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటాలో కలిపి మొత్తంగా 2 లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మిషన్ల విషయంలో నాణ్యతలేని కళాశాలలు ఈ ఏడాది ఘోరంగా దెబ్బతిన్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో దాదాపు 40 వేల మంది రాష్ట్ర విద్యార్థులు డీమ్డ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల్లో చేరిపోయారు. 2,19,729 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఉపాధి అవకాశాలు కరువవడంతో కేవలం 1,31,396 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది న అభ్యర్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని, ఫీజును చెల్లించాల్సిన వారు చలానా ద్వారా ఇండియన్ బ్యాంకు, లేదా ఆంధ్రా బ్యాంకులో చెల్లించి అక్టోబర్ 5లోగా కళాశాలలో రిపోర్ట చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ సూచించారు. అడ్మిషన్ రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు హెల్పలైన్ సెంటర్లో అక్టోబర్ 7లోపు సంప్రదించి రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవచ్చు. కళాశాలలో రిపోర్ట చేసినప్పటికీ అక్టోబర్ 7వ తేదీ అనంతరం రద్దు చేసుకోదలచిన అభ్యర్థులు కళాశాల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అక్టోబర్ 10వ తేదీ తరువాత మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్లు పొందవచ్చు. స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ మధ్య నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. భర్తీ తీరు: 55 కళాశాలల్లో 5 లోపు మాత్రమే అడ్మిషన్లు వచ్చాయి. 20 లోపు మాత్రమే అడ్మిషన్లు ఉన్న కాలేజీల సంఖ్య 102గా ఉంది. 100 సీట్ల లోపు నిండిన కళాశాలలు 260 ఉన్నాయి. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 609 ప్రైవేటు, 34 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 266 ప్రైవేటు ఫార్మసీ, 12 యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా.. 1,24,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఠ తుది విడతకు 2 కోర్సులకు కలిపి 1,23,085 సీట్లు అందుబాటులో ఉండగా 28,023 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తొలి విడతలో 1,26,390 మంది సీట్లు పొందినప్పటికీ కేవలం 1,11,505 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్ట చేశారు. ఫార్మసీలో మిగిలిన 8,345 సీట్లను బైపీసీ విభాగం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు బదిలీ చేయనున్నారు. -
నాణ్యతకే పెద్దపీట వేసిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు నాణ్యతకే పెద్దపీట వేశారు. కేవలం రూ. 30 వేల ఫీజు ఉన్న కళాశాలలకు ఒకటి రెండు అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఆయా కళాశాలల్లో నాణ్యత లేదని భావించిన విద్యార్థులు వాటి జోలికి వెళ్లలేదని సీట్ల కేటాయింపు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక లక్ష రూపాయల వరకు ఫీజు ఉన్న కళాశాలల్లోనూ పూర్తి సీట్లు నిండాయి. మరోవైపు సీమాంధ్ర ప్రాంత విద్యార్థులు ఈ ఏడాది హైదరాబాద్‌లోని కళాశాలలను ఎంచుకునేందుకు ఇష్టపడలేదని జాబితాలను బట్టి స్పష్టమవుతోంది. 20 శాతం ఓపెన్ కేటగిరీలో ఏయూ, ఎస్వీయూ రీజియన్ల విద్యార్థులు కొన్ని అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే సీట్లు ఎంచుకున్నారు. రాజధాని నగరంలో సైతం నాణ్యమైన కళాశాలలను మాత్రమే విద్యార్థులు ఆదరించారు. ఈ ఏడాది 60 ప్రైవేటు కళాశాలల్లో, 34 యూనివర్సిటీ కళాశాలల్లో మొత్తం సీట్లు నిండగా... 256 కళాశాలల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం గణాంకాలను విశ్లేషించగా.. 256 కళాశాలల్లో 0 నుంచి 100లోపు సీట్లు భర్తీ అయ్యాయి. అందులో ఒక్క సీటు కూడా భర్తీ కాని కళాశాలలు 13 కాగా... 5 సీట్ల లోపు భర్తీ అయిన కళాశాలలు 20. మొత్తంగా 103 కళాశాలల్లో 30 లోపు సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. రాష్ట్రంలో ఈ ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 609 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, 34 యూనివర్సిటీ కళాశాలలు పాల్గొనగా.. వాటిలో 100 సీట్లలోపు భర్తీ అయినవి 256 కళాశాలలు, 150లోపు సీట్లు భర్తీ అయినవి 335 కళాశాలలు ఉన్నాయి. అంటే సగానికి పైగా ప్రైవేటు కళాశాలల భవితవ్యం అంధకారంలో పడింది. తక్కువ అడ్మిషన్లు పొందిన కళాశాలల విద్యార్థులు తర్వాతి విడత కౌన్సెలింగ్‌లో మరింత మంచి కళాశాల కోసం ప్రయత్నిస్తే.. వాటి పరిస్థితి మరీ దారుణంగా మారనుంది. దాంతో ఒక్క సీటు కూడా భర్తీకాని కళాశాలల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అగ్రశ్రేణి కళాశాలల్లో ఇలా: కనీసం 50 శాతం సీట్లు భర్తీ అయితేనే ఆయా కళాశాలలు మనుగడ సాధించేందుకు అవకాశం ఉంటుందని పలు యాజమాన్య సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఆ లెక్కన కనీసం 150 పైగా సీట్లు భర్తీ కావాలి. దీన్ని బట్టి చూస్తే దాదాపు 300 క ళాశాలల పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉంది. 151 నుంచి 200 సీట్ల వరకు 70 కళాశాలలు, 201 నుంచి 250 మధ్య 49 కళాశాలలు, 251 నుంచి 300 సీట్ల వరకు 41 కళాశాలల్లో భర్తీ అయ్యాయి. ఇక 500పైన సీట్లు భర్తీ అయిన కళాశాలలు 56 ఉన్నాయి. ఈ ఏడాది కాస్త ప్రమాణాలున్న అగ్రశ్రేణి కళాశాలల్లో మాత్రమే 50 శాతానికంటే ఎక్కువ సీట్లు భ ర్తీ అయ్యాయి. దాదాపు 60 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. కళాశాలలు ఏమంటున్నాయంటే: ‘‘రూ. 35 వేల ఫీజు ఉన్న కళాశాలల్లో 75 శాతం సీట్లు నిండితే తప్ప వాటికి మనుగడ ఉండదు. జీతాలు చెల్లించడం, ప్రమాణాలతో బోధించడం సాధ్యపడదు’’ అని శ్రీదత్తా ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ జి.పాండురంగారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘‘కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే భర్తీ అయితే సరిపోదు. యాజమాన్య కోటా సీట్లు కూడా భర్తీ అయితేనే కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేసే పరిస్థితి ఉంటుంది..’’ అని సీఎంఆర్ గ్రూప్ కార్యదర్శి సి.హెచ్.గోపాల్‌రెడ్డి చెప్పా రు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న మా గ్రూప్ కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కళాశాలల్లో కన్సల్టెన్సీల ద్వారా సీట్లను భర్తీ చేశారు. రవాణా ఉచితం, హాస్టల్ వసతి ఉచితం అంటూ ఎరచూపారు. చివరకు ఇలాంటి పద్ధతులు ఆయా కళాశాలలకే కష్టాలను తెచ్చిపెడతాయి..’’ అని అనురాగ్ గ్రూప్ కళాశాలల చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కారణాలేమిటి? చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడవడం 195 కళాశాలలకు తాత్కాలిక ఫీజును రూ. 30 వేలుగా నిర్ణయించడం. ఆ కళాశాలల్లో నాణ్యత లేదని విద్యార్థులు భావించడం ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత నామమాత్రంగా ఉండడం ఉపాధి తగ్గిపోయి ఇంజనీరింగ్ కోర్సులపై విద్యార్థులకు తగ్గిపోయిన మోజు ఐటీ వంటి విభాగాలకు తగ్గిన ఆదరణ రాష్ట్రంలో ఏటా అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లడం కళాశాలల్లో అత్యుత్తమ బోధనా సిబ్బంది లేకపోవడం. -
ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల నమోదులోనూ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల తనిఖీకి సంబంధించి 2,17,000 మంది ర్యాంకర్లకుగాను 1,31,000 మంది హాజరుకాగా.. ఇప్పుడు వెబ్కౌన్సెలింగ్లోనూ కొందరు గైర్హాజరయ్యారు. మంగళవారం నాటికి 1,60,000 ర్యాంకర్ల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 94,468 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. 1,60,000 లోపు ర్యాంకర్లలో 99,388 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్‌కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారు 4,920 మంది ఉన్నారు. వీరంతా యాజమాన్య కోటాలో సీట్లు పొంది ఉండవచ్చని కౌన్సెలింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంసెట్ ఎంపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 12తో వెబ్ ఆప్షన్ల నమోదు ముగుస్తుంది. ఆప్షన్లు మార్చుకోవాలనుకునే 1 నుంచి లక్ష లోపు ర్యాంకర్లకు ఈ నెల 13న, లక్ష నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులకు ఈనెల 14న అవకాశం ఇస్తారు. 16 నుంచి బైపీసీ ఫార్మా సర్టిఫికెట్ల తనిఖీ: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ 2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 16 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం ప్రారంభమైన సర్టిఫికెట్ల ప్రక్రియకు 7,654 మంది హాజరయ్యారు. ఈనెల 15 వరకు సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగుతుంది. వెబ్ఆప్షన్ల నమోదు ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగుతుంది. -
ఇంజనీరింగ్‌లో 3.48 లక్షల సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరంలో కూడా ఇంజనీరింగ్‌లో భారీగా సీట్లు మిగలనున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటాలో కలిపి ఈ ఏడాది 3,48,686 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంజనీరింగ్ విభాగంలో 2,77,608 మంది ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాయగా... 2,17,672 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే కన్వీనర్ కోటాలోనే 2,46,044 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్య కోటాలో మరో 1,02,642 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో భాగంగా 662 ప్రైవేటు కళాశాలల్లో 2,39,498 సీట్లు, 31 యూనివర్సిటీ కళాశాలల్లో 6,546 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్య కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ అజయ్ జైన్ వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీల్లో సీట్లు పెరగగా ఐటీ బ్రాంచీలో సీట్లు భారీగా తగ్గాయి. గత ఏడాది మొత్తంగా లక్షన్నరకు పైగా సీట్లు మిగిలాయి. ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల సీట్లు మిగులుతాయని అంచనా. ఇక బీ-ఫార్మసీలో మొత్తం 277 ప్రైవేటు కళాశాలల్లో 30,840 సీట్లు, తొమ్మిది ప్రభుత్వ కళాశాలల్లో 500 సీట్లు కలిపి మొత్తంగా 31,340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన బ్రాంచీల్లో అందుబాటులో ఉన్న సీట్లు కోర్సు- సీట్లు: సివిల్ ఇంజనీరింగ్- 40,650, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-79,670, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-52,275, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-96,305, మెకానికల్ ఇంజనీరింగ్-55,495, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-16,795, మైనింగ్ ఇంజనీరింగ్-2,160, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్-1,110, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్-525, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్-180, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-60, పెట్రోలియం ఇంజనీరింగ్-480, ఏరోనాటికల్-1,920, ఏరోస్పేస్-60, అగ్రికల్చరల్-600, ఎయిర్లైన్స మేనేజ్మెంట్-60. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏం చేయాలో చెప్పండి
ప్రభుత్వ నిర్ణయం కోరిన ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడంపై నిర్ణయం కోసం ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. కన్వీనర్ కోటా భర్తీ, యాజమాన్య కోటా భర్తీ అంశాలు రెండూ హైకోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. యాజమాన్య కోటా భర్తీ అంశంపై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసిన వైనం కూడా తెలిపింది. కన్వీనర్ కోటా కోసం నోటిఫికేషన్ జారీచేస్తే యాజమాన్య కోటా భర్తీకి కూడా వెసులుబాటు కల్పించినట్లవుతుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటా భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి.. యాజమాన్య కోటా భర్తీని మాత్రం హైకోర్టు తీర్పునకు లోబడి చేయాలనే ఆదేశాలను ఆ నోటిఫికేషన్లో పొందుపరచడానికి గల సాధ్యాసాధ్యాలను న్యాయశాఖ పరిశీలి స్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గల అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు.