వచ్చే ఏడాది ఇంజనీరింగ్‌లో కొత్త రూల్!
కన్వివనర్ కోటాలాగే బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ
మెరిట్ విద్యార్థులు నష్టపోవద్దనే మార్పులు
కన్వినర్ కోటాకన్నా మూడురెట్లు ఫీజులు
ఉన్నత విద్యామండలి కసరత్తు.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్‌లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్‌మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది.
పారదర్శకత కోసమే..
రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్‌ఆర్‌ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్‌ఆర్‌ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్‌మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్‌మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి.
కానీ.. మేనేజ్‌మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ ప్రతిపాదనలు...
» బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం.
» ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment