
రేషన్ కార్డుల్లో సభ్యుల తొలగింపునకు దరఖాస్తుల తాకిడి
పేర్లు తీసివేస్తేనే కొత్త అర్జీలకు అవకాశం
గ్రేటర్ పరిధిలో డిలిషన్ ప్రక్రియలో సైతం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు మంజూరు మాటేమో గానీ.. పాత కార్డులోని పేర్ల తొలగింపు ప్రక్రియకు సైతం తిప్పలు తప్పడం లేదు. వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబ కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కుటుంబం రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలిగించుకునేందుకు ఉరుకులు పరుగులు చేస్తున్నారు. మీ సేవ, పౌర సరఫరాల సర్కిల్, తహసీల్ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్ దరఖాస్తులు సమరి్పంచి మెంబర్ డిలిషన్ కోసం రెండు మూడుసార్లు చక్కర్లు చేయక తప్పడం లేదు. సంబంధిత సిబ్బంది సైతం సిఫార్సు దరఖాస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా వాటిని పెండింగ్‌లో పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లక్షన్నరకు పైగా దరఖాస్తులు
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో సుమారు రేషన్ కార్డుల్లోంచి పేర్ల తొలగింపునకు సుమారు లక్షన్నరకుపైగా ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో సగానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. గ్రేటర్ మొత్తమ్మీద సుమారు పన్నెండు అర్బన్ సర్కిల్ పరిధిలో 12,34,873 కార్డులు ఉండగా.. వీటిలో 42,72,820 మంది లబ్దిదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు ఉండగా.. అందులో 17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.
అందులో మొత్తమ్మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు పెళ్లిళ్లతో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త కుటుంబాలకు ఆసక్తి పెరిగింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబం కార్డులోని పేర్లు తొలగింపు పెద్ద సమస్యగా పరిణమించింది. కొత్త కుటుంబాల్లోని దంపతుల్దిరూ.. వారి తల్లిదండ్రుల కార్డుల్లో లబి్ధదారులుగా ఉండటంతో అందులోంచి వారి పేర్లను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రెండు కార్డుల్లోని ఇద్దరి పేర్లు డిలిషన్ కోసం తంటాలు పడుతున్నారు. రేషన్ కార్డుల్లో అర్బన్ పరిధికి సంబంధించి డిలిషన్ ప్రక్రియ సివిల్ సర్కిల్ కార్యాలయాల్లో జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రక్రియ తహసీల్ ఆఫీస్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment