రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన! | Key Announcement Of Telangana Supply Department On Ration Card Applications | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన!

Published Wed, Feb 12 2025 4:00 PM | Last Updated on Wed, Feb 12 2025 6:08 PM

Key Announcement Of Telangana Supply Department On Ration Card Applications

సాక్షి,హైదరాబాద్‌ : రేషన్‌ కార్డుల (Telangana Ration Card) దరఖాస్తులపై తెలంగాణ ఫౌరసరఫరాల శాఖ (telangana civil supplies) కీలక ప్రకటన చేసింది. రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల సమర్పణకు గడువు ఏమీ లేదని స్పష్టం చేసింది.

గత నెలలో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం అప్లయ్‌ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుంచి దరఖాస్తు దారులు కొత్త రేషన్‌ కార్డుల కోసం మీ సేవా సెంటర్లకు క్యూకడుతున్నారు. ఆఫ్‌లైన్‌లలో అప్లయి చేస్తున్నారు.

 అయితే, ఓ వైపు ఫిబ్రవరి 26న ఎవరైతే కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి రేషన్‌ కార్డులను మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో అధిక సంఖ్యలో దరఖాస్తు దారులు తాము ఇప్పటి వరకు రేషన్‌ కార్డుల కోసం అప్లయి చేసుకోలేదని, ప్రయత్నిస్తే సర్వర్లు మొరాయిస్తున్నారని వాపోతున్నారు. కొత్త రేషన్‌ కార్డులు తమకు వస్తాయో? లేదో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ తరుణంలో ఫౌర సరఫరాల శాఖ కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుపై స్పష్టత ఇచ్చింది. ‘రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి గడువు లేదు. దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సి అవసరం లేదు. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. మీ సేవలో అప్లయి చేస్తే రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరలేదని సూచించింది.

👉చదవండి : దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement