Ration card applications
-
రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన!
సాక్షి,హైదరాబాద్ : రేషన్ కార్డుల (Telangana Ration Card) దరఖాస్తులపై తెలంగాణ ఫౌరసరఫరాల శాఖ (telangana civil supplies) కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల సమర్పణకు గడువు ఏమీ లేదని స్పష్టం చేసింది.గత నెలలో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లయ్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుంచి దరఖాస్తు దారులు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా సెంటర్లకు క్యూకడుతున్నారు. ఆఫ్లైన్లలో అప్లయి చేస్తున్నారు. అయితే, ఓ వైపు ఫిబ్రవరి 26న ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో అధిక సంఖ్యలో దరఖాస్తు దారులు తాము ఇప్పటి వరకు రేషన్ కార్డుల కోసం అప్లయి చేసుకోలేదని, ప్రయత్నిస్తే సర్వర్లు మొరాయిస్తున్నారని వాపోతున్నారు. కొత్త రేషన్ కార్డులు తమకు వస్తాయో? లేదో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఫౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుపై స్పష్టత ఇచ్చింది. ‘రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి గడువు లేదు. దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సి అవసరం లేదు. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. మీ సేవలో అప్లయి చేస్తే రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరలేదని సూచించింది.👉చదవండి : దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్? -
Hyderabad: కొత్త రేషన్ కార్డులు కొందరికే!
హైదరాబాద్: పదేళ్ల నిరీక్షణ అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రేషనింగ్ అధికారులు తొలి జాబితాకు తుది కసరత్తు చేస్తున్నారు. వేల సంఖ్యలోని దరఖాస్తుల్లోంచి పలు వడపోతల అనంతరం వందల సంఖ్యలో లబ్దిదారులను అర్హులుగా ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో కేవలం 1497 మందికి మాత్రమే కార్డులు అందించేందుకు పౌరసరఫరాల విభాగం అధికారులు తుది జాబితాను సిద్ధం చేశారు. దీంతో వేలాది మంది దరఖాస్తు దారులకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.పెండింగ్‌లో 11 వేల దరఖాస్తులు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రేషన్ కార్డుల కోసం ఇప్పటిరకు 11 వేల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సికింద్రాబాద్ సహాయ పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేరుగా, మీ సేవా కేంద్రాల ద్వారా 4,100 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల నుంచి 6,900 వేల దరఖాస్తులు వచ్చాయి.పరిశీలనలో 3400ప్రజాపాలనలో అందిన 6,900 వేల దరఖాస్తులను జతపరిచిన ధృవీకరణ పత్రాల ఆధారంగా పరిశీలనలు చేసిన అనంతరం ప్రాధమికంగా సర్వే కోసం జాబితాను రూపొందించారు. ఇందులోంచి 3449 దరఖాస్తుదారుల వాస్తవ పరిస్థితులను సేకరించేందుకు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, రేషనింగ్ విభాగాల అధికారుల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కార్ల తరహా వాహనాలు, 100 గజాలకు పైబడిన స్థలంలో సొంత ఇల్లు, వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు పైబడి ఉన్నవారి దరఖాస్తులను తిరస్కరించారు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఇంటి కరెంటుబిల్లుల ప్రాతిపదికన వివరాలను నమోదు చేసుకున్న సర్వే సిబ్బంది అర్హులను ఎంపిక చేశారు.పారదర్శకంగా ఎంపిక ఐదు డివిజన్లలో కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హుల జాబితా ఎంపిక చేశామని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ, రేషనింగ్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈనెల 16న సర్వే ప్రారంభించి వారం రోజుల పాటు కొనసాగించిన అనంతరం 3449 దరఖాస్తుల్లోంచి 1497 మందికి కొత్త కార్డులు జారీ చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా స్వంత ఇల్లు లేనివారికి తొలిప్రాధాన్యత ఇచి్చనట్టు, ఆ మీదట పక్కాగా 100 గజాల లోపు స్థలంలో గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం మాత్రమే కలిగి ఉన్న గృహాలకు చెందిన కుటుంబాలను రేషన్ కార్డులు అందించడం కోసం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. -
ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్.. అతిపెద్ద సమస్య!
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని తెలంగాణ (Telangana) ప్రజలు గుర్తించారు. పథకాల అమలులో జరుగుతున్న అవకతవకలను, సాచివేత ధోరణిని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిలదీస్తు న్నారు. ప్రభుత్వ భూసేకరణపై లగచర్ల (Lagcherla) లాంటి గ్రామాలు కదం తొక్కాయి. ఏకంగా కలెక్టర్ సహా ఉన్నతాధికారులను అడ్డుకొని తమ నిరసన తెలియజేశారు. కేసులు, జైళ్లను లెక్కచేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ ఊరుకోలేదు. రేషన్ కార్డులు, (Ration Cards) ‘రైతు భరోసా’, ‘ఆత్మీయ భరోసా’, ‘ఇందిరమ్మ ఇండ్లు’... ఇలా అనేక పథకాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభల్లోనే (Grama Sabha) దరఖాస్తులు తీసుకోవటం వల్ల గందరగోళం ఏర్పడుతుందన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి లేదు.కేవలం వీటి గురించే కాకుండా ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీ’ల గురించీ నిలదీస్తున్నారు. ‘కల్యాణ లక్ష్మి’ స్థానంలో తీసుకవచ్చిన ‘తులం బంగారం’ పథకం ఎప్పుడు అమలు చేస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ‘రైతు భరోసా’, రుణమాఫీ, ‘మహాలక్ష్మి’ పథకం ఇంకా అమలు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని ప్రజలు అడిగితే ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. గ్రామ సభల్లోంచి ఎమ్మెల్యేలు మధ్యలోనే వెళ్లిపోవటం ప్రభుత్వం దుఃస్థితికి అద్దం పడుతోంది. పోలీసు పహారా మధ్య సభల్ని నిర్వహించినా ప్రజలు ఏమాత్రం భయపడటం లేదు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏడాది పాలనకే ఇంతలా భయపడితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ పార్టీ నాయకులు ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్ల గలరా అన్నది ప్రశ్న.లబ్ధిదారుల ఎంపిక చూస్తే... లోపభూయిష్ఠంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ కార్డును ఆధారంగా చేసుకోవటం అతిపెద్ద సమస్య. ఇంటి జాగా గ్రామంలో ఉండి... వాళ్లు పట్టణంలో నివసించి, ఆధార్ కార్డు పొందితే వాళ్లు అనర్హులవుతారు. ఈ కారణంగా గ్రామసభల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాపాలనలో, కులగణనలో తీసుకున్న వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకోవటం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం కల్గించటానికేనని ప్రజలు అనుమానిస్తున్నారు.ఇక ‘ఆత్మీయ భరోసా’ విధివిధానాలపై పల్లె జనం భగ్గుమంటున్నారు. గత సంవత్సరంలో 20 రోజులు ‘ఉపాధి హామీ’ పనికి వెళ్లిన వారికే భరోసా ఇస్తామంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కూలీలందరికీ ఇస్తామని చెప్పినకాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మోసం చేస్తున్నారన్న ఆవేదన రైతు కూలీల్లో ఉంది. మున్సి పాల్టీల్లో విలీనమైన గ్రామాలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోని వాళ్లు వ్యవసాయంపై ఆధారపడే జీవిస్తున్నారు. వీళ్లు ఏరకంగా ఆత్మీయ భరోసాకు అనర్హులవుతారో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆధార్, బ్యాంకు లింక్ లేని కారణంగా చాలా కార్డులు తొలగింపునకు గురయ్యాయి. లక్షలాదిమంది దగ్గరలోని పట్టణాలు, హైదరాబాద్‌లో మెరుగైన కూలీ కోసం తాత్కాలికంగా వెళ్లిన వలసకూలీలు ఉపాధి పనులకు వెళ్లలేదు. కొందరు వర్షాకాలం, యాసంగి పంటలకు మాత్రమే ఊళ్లోకి వస్తారు. జీవనపోరాటంలో తలమునకలవుతున్న వీళ్లంతా ఏవిధంగా అనర్హులవుతారు?చదవండి: ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకందేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇన్ని నిరసనలు ఏ ప్రభుత్వమూ ఎదుర్కొని ఉండదు. పాలనలో ఎలాంటి అనుభవం లేని రేవంత్ రెడ్డి ఈ నిరసనల్ని ఎదుర్కోవటానికి పోలీసుల్ని ఆశ్రయించటమే పెద్ద సమస్య. ఏ ప్రజాపోరాటాల్నీ, నిరసనల్నీ బల ప్రయోగం ద్వారా ఎదుర్కోలేమన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతివాడూ ఆకలినైనా సహిస్తాడు, కానీ మోసాన్ని ఎండగడతాడు!- డాక్టర్ బీఎన్ రావు బీఎన్ రావు ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ -
తెలంగాణలో రెండో రోజు గ్రామసభల్లోనూ గందరగోళం
-
Ration Card: తిరకాసు దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమరి్పంచవచ్చని మంత్రులు ప్రకటించారు. దీంతో మంగళవారం నుంచే వార్డు ఆఫీసులకు పేదలు క్యూ కట్టారు. పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో ఈపీడీఎస్ ఎఫ్ఎస్సీ లాగిన్‌లో దరఖాస్తు చేసుకునే వి«ధానం ఉండగా.. తాజాగా ఆఫ్‌లైన్‌లో జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇటీవల ఇంటింటికీ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి తాజాగా ఆ కుటుంబాలపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. విచారణలో సుమారు 70 శాతం వరకు కుటుంబాలు అర్హత సాధించాయి. వీరికి ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. సర్వేలో గుర్తింపు అంతంతే.. సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాల గుర్తింపు అంతంత మాత్రంగానే కొనసాగింది. సర్వే సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో, కొన్ని కుటుంబాలను వదిలివేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ప్రజాపాలనలో కొత్త రేషన్ల కార్డు కోసం సుమారు 5,73,069 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేవలం 83,285 కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు లేనట్లు గుర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాపాలనలో సైతం రేషన్ కార్డులు లేని ఎన్నో పేద కుటుంబాలు పాత అడ్రస్‌లతో కూడిన ఆధార్, ఇతరత్రా పత్రాలు లేని కారణంగా దరఖాస్తులు సమరి్పంచలేకపోయాయి. ఆఫ్‌లైన్ దరఖాస్తులపై అనుమానమే.. కొత్త రేషన్ కార్డుల కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేళ్లుగా పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారానే సేవలందిస్తోంది. గత నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల లాగిన్ నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండాపోయింది. ప్రజాపాలనాలో కేవలం ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించగా రేషన్ కార్డులు లేని వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో పేదలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా కూడా వార్డు ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మౌఖికంగా పేర్కొంటున్నప్పటికీ పౌరసరఫరాల శాఖా పరంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజాపాలన దరఖాస్తులు ప్రశ్నార్థకమే.. ప్రజాపాలనలో గంపెడు ఆశలతో కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. మరోవైపు ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణి కార్యక్రమాల్లో సైతం కొత్త రేషన్ కార్డుల కోసం అందిన ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిస్థితి కూడా అదే తరహాగా మారింది. ఇటీవల కుల గణనలో భాగంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం గుర్తించిన కుటుంబాలపైనే తాజాగా క్షేత్రస్థాయి విచారణ జరిగింది. దీంతో కొత్త రేషన్ కార్డుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేద దరఖాస్తు దారులకు నిరాశే కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అంటూ పాత పాడుతున్న కాంగ్రెస్ ప్రభ్వుత్వం ఆచరణలో మాత్రం కనీసం పెండింగ్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయపరుస్తోంది. -
గ్రీన్‌సిగ్నల్!
జిల్లాలో రేషన్‌దుకాణాలు 558 అంత్యోదయ కార్డులు 17,037 ఆహార భద్రత కార్డులు 2,11,566 అన్నపూర్ణ కార్డులు 42 ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం 4,600 మెట్రిక్‌టన్నులు నాగర్‌కర్నూల్ టౌన్ : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లాలో కార్డులు జారీ చేయాలని వారం రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయా జిల్లాల సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సమీప మీసేవ కేంద్రాలలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పాత కార్డులలో కూడా అవసరమైన మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కొత్త కార్డుల ప్రక్రియపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన కూడా చేశారు. దీంతో ఎట్టకేలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై స్పష్టత వచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కార్డులను మంజూరు చేయలేదు. దీంతో మూడున్నరేళ్లుగా లబ్ధిదారులు కొత్త రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక దశలో శాశ్వత రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రక్రియపై నేటికీ ఒక స్పష్టమైన ప్రకటన వెలువర్చలేదు. అదేవిధంగా సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించడంతో శాశ్వత రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక ఉండదనే అధికారులు భావిస్తున్నారు. కేవలం రేషన్‌కార్డు నంబర్‌తో రేషన్ పొందే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్‌కార్డు కేవలం రేషన్ తీసుకునేందుకు మాత్రమే కాకుండా ఒక గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. ఆధార్ కార్డు అందుబాటులోకి రాక ముందు రేషన్‌కార్డు ప్రాముఖ్యత చాలా ఉండేది. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో అప్పట్లో ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్‌కార్డు తీసుకునేందుకు పోటీ పడటంతో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు ఉన్న వారికే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డును ఇచ్చారు. క్రమేణా రేషన్ కార్డు ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుండడంతో కొంతమంది స్వచ్ఛందంగా వీటిని వదులుకున్నారు. మూడేళ్లుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా వరకు ప్రజలు కొత్త కార్డులను తీసుకోలేకపోయారు. ప్రస్తుతం కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామాల్లో వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆయా గ్రామ వీఆర్వోలు, రేషన్ డీలర్లు పరిశీలించిన అనంతరం వాటిని మండల తహసీల్దార్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన వారి జాబితాను చివరగా జిల్లా పౌర సరఫరాల శాఖాధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి డీఎస్ఓ ఆమోదిస్తే వారికి కొత్త కార్డు మంజూరవుతుంది. ఏ ఆధారం లేని ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులను మంజూరు చేయనుంది. అత్యంత దీన స్థితిలో ఉన్న వారికి అన్నపూర్ణ కార్డులను ఇవ్వనుంది. తహసీల్దార్లకు ఆదేశాలు జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల వివరాలను పరిశీలించి జాబితా తయారు చేసి పంపాలని ఆయా మండల తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రజావాణిలోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 558 రేషన్‌షాపులలో 17,037అంత్యోదయ కార్డులు, 2,11,566 ఆహార భద్రత, 42 అన్నపూర్ణ కార్డులు ఉండగా, ప్రతి నెలా 4600 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అర్హులకే కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అన్ని మీసేవ కేంద్రాలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తారు. గ్రామాల్లో కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. – మోహన్‌బాబు, డీఎస్ఓ -
‘మీ సేవ’లు అయోమయం
సాక్షి, కాకినాడ : ఫలానా సేవకు ఇన్ని రోజుల్లో అందనున్న ప్రతి ఫలం, ఫలానా సేవకు ఇంత ధర నిర్ణయించడం వెరసి మీ సేవలు బహు చక్కగా పని చేస్తున్నాయని భావిస్తున్న అధికారులకు లోపాలు బయటపడ్డాయి. దీంతో శని వారం ఆ విభాగంపై జరిగిన సమీక్షలో స్వయం కృతాపరాధాన్ని తప్పుపడుతూ ఇక ముందు ఇలా జరగకూడదని దిశా నిర్దేశం చేయాల్సి వచ్చింది. పట్టణాల్లో, గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడనవసరం లేకుండాఆ విభాగం నుంచి పొందే ఓటరు కార్డులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల దరఖాస్తులు తదితర వాటి కోసం మీ సేవకు వెళ్లి పొందే విధంగా ఆన్లైన్ చేశారు. ఇలా ఇవ్వగానే అలా అయిపోతున్నాయనుకుంటున్న ఆ సేవలు కాస్తా మీసేవా కేంద్రాల్లో కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే పడకేస్తున్నాయని తేలాయి. రెవెన్యూకి పట్టిన బూజుదులపాల్సిందేనన్న నిర్ణయానికి జాయింటు కలెక్టర్ వచ్చేశారు. హోలోగ్రామ్‌కు కొరత ముఖ్యంగా పొందిన కొన్ని సేవలకు గుర్తింపుగా అధీకృతం కావాలంటే హోలోగ్రామ్ స్టిక్కర్ అంటించి ఉంటేనే దానికి ప్రామాణికత వస్తుం ది. ఇవి కలెక్టరేట్లో హెచ్- సెక్షన్లో అవసరం మేరకు ముద్రించి రెవెన్యూ కార్యాలయాలకు పంపిణీ చేస్తారు. ఇందుకు మీ సేవ చూసే విభాగం ఇండెంటు ఇవ్వాలి. ఇవేమీ లేకుండానే పనులు నడిచిపోవడం మామూలై హోలో గ్రామ్ పంపిణీ అడుగంటింది. ఉదాహరణకు ఒక మీ సేవా కేంద్రానికి వెయ్యి స్టిక్కర్లు కావాలంటే తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. తీరా వెళితే రెండొందలు తీసుకో అంటూ కుదించి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీ సేవ వినియోగదారుల్లో నూటికి ఇరవై మందికే సేవలందుతున్నాయి. మిగిలిన వారు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీని వెనుక పెద్ద కథే న డుస్తున్నట్టు ఉన్నతాధికారుల్లో అనుమాన బీజం నాటుకుంది. మీ సేవలో ఎంతకీ రాని ధ్రువీకరణ పత్రం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే చిటికెలో అయిపోతుండటంతో ఆపరేటర్లు బిత్తరపోతున్నారు. ఒక్కొక్క సారి దళారీలు బయలుదేరి కట్టలుగా దరఖాస్తులు తీసుకెళ్లి పనులు పూర్తి చేసుకోవడం షరా మామూలవుతోంది. 19 వేల దరఖాస్తుల పెండింగ్ వినియోగదారుడికి ధ్రువీకరణ పత్రం జారీ అయిందో లేదో తెలిసే సాఫ్ట్వేర్ మీ సేవల్లో లేదు. అది ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లోనే తెలుసుకునే వెసులు బాటుంది. ఫలితంగా మీ సేవల్లో పనులు కావడం లేదని వినియోగదారులు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవి భరించలేక మీసేవ నిర్వాహకులు కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే అసలు ఎన్ని దరఖాస్తులొచ్చాయో రిజిస్టర్లో రాసి వెళ్లమని, చూస్తామని చె ప్పడం అధికారుల వంతవుతోంది.