Engineering College
-
విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
మరో 20,000 సీట్లు కావాలి!
సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది దాదాపు 50 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని ఏఐసీటీఈకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాలేజీలు దరఖాస్తులు చేశాయి. తెలంగాణ నుంచి దాదాపు 20 వేల అదనపు సీట్ల కోసం దరఖాస్తులు అందాయి. అయితే సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని, అప్పుడే అనుబంధ గుర్తింపు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏఐసీటీఈకి లేఖ రాసింది. మరోవైపు కారణాలు లేకుండా సీట్ల పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాలేజీలు అంటున్నాయి. ఏఐసీటీఈ వర్గాలు మాత్రం సీట్ల పెంపుపై తమకు అభ్యంతరం లేదని తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచీలో ఉండే అవకాశం ఉంది. దక్షిణాదిలోనే బీటెక్ సీట్లు అధికం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లున్నాయి. దేశంలోని మొత్తం సీట్లలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం బీటెక్ సీట్లున్నాయి. దేశం మొత్తంలో 14.90 లక్షల బీటెక్ సీట్లుంటే.. తమిళనాడు 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానంలో ఉంది. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండోస్థానంలో, తెలంగాణ 1.45 లక్షల సీట్లతో మూడోస్థానంలో ఉంది. సీట్లు పెంచుకోవడంలోనూ ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేండ్లుగా దేశంలో బీటెక్ సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే 2014 –15తో పోల్చితే సీట్ల సంఖ్య తక్కువగానే ఉండటం గమనార్హం. 2014 –15లో దేశంలో 17.05 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా, 2021–22 వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది.50% మూడు రాష్ట్రాల్లోనే..2024–25 విద్యా సంవత్సరంలో పెరిగిన బీటెక్ సీట్లల్లో 50 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశం మొత్తంగా చూస్తే 50 శాతం సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే పెరిగాయి. తమిళనాడులో 32,856 సీట్లు పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి.జాతీయంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ (ఈవినింగ్ బీటెక్) కోర్సును నిర్వహించేందుకు 400 – 500 విద్యా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ కాలేజీల్లో దాదాపు 40 వేల నుంచి 50 వేల సీట్లు పెరిగాయి.ఈ విద్యా సంవత్సరంలో 2,906 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చింది. 1,256 కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి.జాతీయంగా కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల భర్తీ నిష్పత్తి) 2021–22లో 72 శాతం ఉండగా, 2022 –23కు వచ్చేసరికి 81 శాతానికి పెరిగింది. త్వరలో ఏఐసీటీఈ పరిశీలనతెలంగాణలో 23 ప్రైవేటు కాలేజీలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులను కోర్ గ్రూపుతో కాంబినేషన్‌గా అందించాలని ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైన మౌలిక వసతులు తమకు ఉన్నాయని దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. వీటిని స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ఏఐసీటీఈ బృందాలు తెలంగాణలో పర్యటించనున్నాయి. -
ఆరోగ్యం బాగాలేదని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
దుండిగల్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం.. దుండిగల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. శ్రావణి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, రెండు రోజుల క్రితం వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు.అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. -
యాజమాన్య కోటా.. ఇక ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీట్లను ఇప్పటివరకు ఏ కాలేజీకి ఆ కాలేజీ సొంతంగా భర్తీ చేసుకునేవి. ఈ సీట్లను కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా భర్తీలోనూ పారదర్శకతను తీసుకొచి్చ, మెరిట్ విద్యార్థులకు మేలు చేసేందుకు ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం కోరింది. దీనిపై మండలి చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలో మండలి కొన్ని కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. పారదర్శకత కోసమే.. రాష్ట్రంలో 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కోటాలో సీటు పొందిన వారిలో అర్హులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీ యింబర్స్‌మెంట్ వస్తుంది. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. మిగిలినవి ఎన్ఆర్ఐల పిల్లలకు కేటాయించారు. యాజమాన్య కోటాలో సీటు పొందిన విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. జేఈఈ, టీజీఈఏపీ ర్యాంకు ఆధారంగా, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికే ఈ సీట్లు ఇవ్వాలి. ఇక సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐల పిల్లలకు సీట్లు కేటాయించాలి. అయితే, మెరిట్ లేకున్నా ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకొంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి కనీ్వనర్ కోటాలో ఫీజు రూ.లక్ష ఉంటే.. మేనేజ్మెంట్ కోటాలోని బీ కేటగిరీ సీటుకు మూడింతలు.. అంటే రూ.3 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు ఐదింతలు.. అంటే రూ.5 లక్షల వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ.. మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీట్లను కాలేజీలు రూ.8 నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అంత ఫీజు చెల్లించలేని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సీట్లు ఎవరికి, ఎంతకు అమ్ముకొంటున్నారన్న వివరాలు కూడా బయటపెట్టకపోవటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఈ సీట్లను భర్తీ చేయటం వల్ల నిర్ణీత ఫీజు చెల్లిస్తే మెరిట్ విద్యార్థులకే సీట్లు లభిస్తాయని, సీట్ల భర్తీ అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ ప్రతిపాదనలు... » బీ, సీ కేటగిరీ సీట్లకు ప్రభుత్వమే ఫీజులు ప్రతిపాదిస్తుంది. కనీ్వనర్ కోటాకన్నా బీ కేటగిరీకి మూడు రెట్లు, సీ కేటగిరీ సీట్లకు ఐదురెట్లు అధికంగా ఫీజులు వసూలు చేయవచ్చు. దీంతో పాటు లే»ొరేటరీలు, లైబ్రరీ ఫీజులు అదనంగా వసూలు చేసుకునే అధికారం ఇవ్వాలనే సూచన చేయనున్నట్లు సమాచారం. » ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ అనుసరిస్తున్న విధానాన్నే ఇంజనీరింగ్‌లోనూ అనుసరించాలనే మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసే ఈ ప్రక్రియ మొత్తం కనీ్వనర్ కోటా మాదిరిగా సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఫీజులు మాత్రం కాలేజీలే నిర్ణయిస్తాయని అధికారులు అంటున్నారు. -
‘స్కిట్’ నిలిచేనా?!
అనంతపురం: వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి.. మంచిపేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కాలగర్భంలోకి కలిసి పోకుండా కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా 1997–98 విద్యా సంవత్సరంలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు.మొదట ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్సెస్ కోర్సులకు అనుమతించారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత కొంతకాలానికి సివిల్ ఇంజినీరింగ్ కోర్సుకు కూడా అనుమతిచ్చారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.రూ.750 కోట్ల ఆస్తులురాష్ట్రంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏకైక ఇంజినీరింగ్ కళాశాల కావడం..బోధన బాగా ఉండటం.. మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే స్కిట్‌కు మంచి ఖ్యాతి వచ్చింది. ప్రధాన బ్రాంచ్‌ల్లో అదనపు సీట్లు పెంపుదల చేశారు. దీనికి తోడు డిప్లొమో కోర్సులూ నిర్వహించారు. ఆదాయ పెంపుదల ప్రధానం కాకుండా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన ఆశయంతో ఈ కళాశాల అప్పట్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాల ఆస్తుల విలువ రూ.750 కోట్లు ఉంటాయని అంచనా. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతోనే కళాశాల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా నియమ నిబంధనలు రూపొందించారు. ముక్కంటి ఆలయం వారు తొలి కామన్ డిపాజిట్ కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కళాశాల నుంచి వచ్చే ఆదాయమే జీతాలకు, అభివృద్ధి పనులకు సరిపోయేది. 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కళాశాల నిర్వహించారు.ఇప్పటికే రెండు దఫాలు కమిటీ ఏర్పాటుస్కిట్ను జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దఫాలు కమిటీలను నియామకం చేసి, సిఫారసులను బుట్టదాఖలు చేశారు. మరో దఫా కమిటీని నియమించారు. ఈసారైనా ఆచరణ సాధ్యమయ్యేనా? లేక మొక్కుబడిగా కమిటీ వేసి కాలయాపన చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పూర్తిగా జేఎన్టీయూ అనంతపురం పరిధిలోకి తెచ్చి.. గతంలో మాదిరి విద్యార్థుల ఫీజులతోనే కళాశాలను నిర్వహించాలని, స్కిట్లో పనిచేసే ఫ్యాకల్టీని అక్కడికే పరిమితం చేసి జీతాలు చెల్లించాలని, ఉద్యోగులను వర్సిటీ పరిధిలోకి తెస్తే సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు అంటున్నారు. 2013 నుంచి తగ్గుముఖంవిద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం, కళాశాలలో వర్గ రాజకీయాలు అధికం కావడం, రాజకీయ జోక్యం మితిమీరడం వంటి కారణాలతో కళాశాల పతన దిశగా పయనించడం ప్రారంభం అయింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2016 నవంబర్ నాటికి అక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా రూ.25 లక్షల వంతున ముక్కంటి దేవాలయం వారు చెల్లిస్తున్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాలకు ఇప్పటి దాకా దేవాలయం వారు రూ.14 కోట్లు చెల్లించారు. ఈ భారం అధికం కావడంతో రాష్ట్ర దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థితిగతులను అధ్యయనం చేశారు. 2019–20 సంవత్సరంలో పూర్తిగా అడ్మిషన్లు లేవు. అంతకు ముందు సంవత్సరాల్లో చేరిన విద్యార్థులు బీటెక్‌లో 15 మంది, డిప్లొమోలో 12 మంది ఉన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు కోర్సులు ముగిసి బయటకు వెళ్లిపోతారని, కళాశాలను మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులు ఉన్నారు. -
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్‌కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గుడ్లవల్లేరు విద్యార్థులను బెదిరించిన ఎస్ఐ శిరీష బదిలీ
-
రాజ్యమా...సిగ్గుపడు పెను ప్రమాదంలో ఏపీ మహిళల మానప్రాణాలు
-
రహస్య కెమెరాలు.. ఆధారాలు మాయం!.. బయటపడుతున్న గుడ్లవల్లేరు గుట్టు
-
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్‌ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్‌ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్‌ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
వీడియోలు లీక్ ఘటన.. పక్కదారి పట్టించే కుట్ర
-
300 మంది అమ్మాయిల వీడియోలు లీకైతే పట్టించుకోము.. ముంబై నటికీ మాత్రం న్యాయం చేస్తాం
-
కళాశాలలో కీచకులు
-
ప్రైవేటు వారి... పాట! ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా
ర్యాంకులతో సంబంధం లేదు.. మెరిట్ మాటే లేదు.. రూల్స్ గీల్స్ జాన్తా నై..లక్షల్లో వసూళ్లు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..ముందే విక్రయాలు.. పేరుకు అడ్మిషన్లు అంటూ ప్రకటనలు..సీట్ల కోసం వెళ్లే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్..సీట్లు లేవని వాచ్మన్లతోనే చెప్పిస్తూ వెళ్లగొడుతున్న తీరు..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వానించాయి. కానీ, దీంతో ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘ఇంకెక్కడి సీట్లు... ఎప్పుడో అయిపోయాయి’ అంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటివేయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందని పేర్కొంటున్నాయి. ఏటా ఇదే దందా.. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వెలువడ్డాకే సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. తొలుత జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే.. ఇంటర్లో మెరిట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలి. యాజమాన్య కోటాలోని 30శాతం సీట్లలో 15శాతం సీట్లను ఇలా భర్తీ చేయాలి. ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’ నిర్ధారించిన మేరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. మరో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు సిఫార్సు చేసిన విద్యార్థులకు (ఎన్నారై కోటా) కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి 5 వేల డాలర్ల ఫీజు (సుమారు రూ.4.2 లక్షలు) వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. బ్రాంచీని బట్టి ఐదారు లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకుని సీట్లను వేలం పాటలో అమ్మేసుకుంటున్నాయి. ఆ విద్యార్థులు మాత్రమే తమ కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారని, వారి మెరిట్ మేరకే సీట్లు ఇచ్చామని చూపుతున్నాయి. మంచి ర్యాంకులు, మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాయి. ఏటా ఈ దందా ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నీట్ మాదిరిగా.. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో దీనిని అడ్డుకున్నాయి. రూ. 1,500 కోట్ల ‘వ్యాపారం’ రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 156 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 1,12,069 సీట్లు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 1.06 లక్షలు. ఈ సీట్లలో 30శాతం యాజమాన్య కోటా కింద కాలేజీలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో సుమారు 20వేల సీట్లు కంప్యూటర్స్, అనుబంధ బ్రాంచీలవే. వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సీట్లను కాలేజీని బట్టి కనిష్టంగా రూ. 8 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20లక్షల వరకూ అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 15వేల సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు రూ.1,500 కోట్ల మేరకు దందా జరిగినట్టు తెలిసింది. ఇంత భారీగా సాగుతున్న అక్రమ వ్యవహారంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ‘సహకారం’ అందిస్తున్న ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా.. ఈ సీట్ల అమ్మకం వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వెళ్లిన వాళ్లను వెళ్లినట్టే వెనక్కి పంపుతూ.. – హైదరాబాద్‌లోని ఓ రాజకీయ ప్రముఖుడి కాలేజీకి ఒక జేఈఈ ర్యాంకర్ దరఖాస్తుతో వెళ్లాడు. కానీ సీట్లు ఎప్పుడో భర్తీ అయిపోయాయని చెప్తూ.. గేట్ వద్ద నుంచే వాచ్మెన్ వెనక్కి పంపేశాడు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేసేందుకు ఆ విద్యార్థి ఉన్నత విద్యా మండలికి వచ్చాడు. – రంగారెడ్డి జిల్లాలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి వెళ్లాడు. అతడికి ఈఏపీసెట్‌లో 20వేల ర్యాంకు వచ్చింది. అయితే సీట్లు పెరిగితే అడ్మిషన్ ఇచ్చే విషయం చూద్దామని యాజమాన్యం చెప్పి పంపిందని.. సీఎస్ఈ కోసమైతే రూ.12 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించిందని ఆ విద్యార్థి వెల్లడించాడు. – కౌన్సెలింగ్ సందర్భంగా ఓ విద్యారి్థకి రాష్ట్రంలో టాప్ టెన్‌లో ఉండే ఓ కాలేజీలో మెకానిక్ బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే సీఎస్ఈ సీటు ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీని కోరగా.. కొత్త సీట్లు వచ్చాక ఇస్తామని, ఇప్పుడే రూ.18 లక్షలు కట్టేస్తే ఖరారు చేస్తామని తేల్చి చెప్పింది. నిబంధనలు విధిగా పాటించాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కాలేజీలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించాలి. ప్రతి కాలేజీ వెబ్సైట్ అందుబాటులో ఉంచాలి. దీనిపై ఇప్పటికే కాలేజీలకు సర్క్యులర్ కూడా ఇచ్చాం. ఎవరికైనా అన్యాయం జరిగితే మండలికి ఫిర్యాదు చేయవచ్చు. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి దోపిడీకి అడ్డుకట్ట వేసేదెప్పుడు? యాజమాన్య కోటా సీట్ల దందాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. యాజమాన్యాలకు కొమ్ముగాయడమే ఈ పరిస్థితికి కారణం. యాజమాన్య కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి. ఈ దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంత అన్యాయమా? ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల వ్యాపారాన్ని అడ్డుకోలేక పోవడానికి కారణాలేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నోటిఫికేషన్ ఇచ్చే నాటికే సీట్లు అమ్మేస్తుంటే అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలి. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశా.. చర్యలు తీసుకుంటారా? శ్రీదేవి విమెన్స్ కాలేజీలో బి కేటగిరీ సీటు కోసం వెళ్లిన యాస శ్రీకీర్తిరెడ్డి అనే విద్యారి్థని యాజమాన్యం లోపలికి కూడా రానివ్వలేదు. ప్రవేశ ప్రకటన ఇచ్చి ఇలా చేయడం దారుణం. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాం. ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. – డాక్టర్ కురువ విజయకుమార్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు -
సీట్లు పెరిగినా.. సీఎస్‌ఈకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి సీట్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకూ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. వీటిల్లో 59,917 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 57,152 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే ఈ సంవత్సరం 2,765 సీట్లు పెరిగాయి. ఐఐటీల్లో స్వల్పంగా సీట్లు పెరిగితే, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులను చేర్చారు. వీటిల్లోనూ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. మరికొన్ని కోర్సులకు అనుమతి రావాల్సి ఉంది. కొన్ని జాతీయ కాలేజీల్లో కొత్త కోర్సులతో ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేసే వీలుంది. దీంతో ఆఖరి దశ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు సీట్లు పెరిగినా... ప్రధాన కాలేజీల్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ విద్యార్థులు పోటీ పడుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సంపాదించిన వారి మధ్య కూడా ఈసారి పోటీ కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో డిమాండ్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కు భారీగా డిమాండ్ కని్పస్తోంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టంగా కన్పిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఎక్కువ మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. గత ఏడాది కన్నా కటాఫ్ పెరిగినప్పటికీ టాప్ కాలేజీల్లో పోటీ మాత్రం ఈసారి కాస్త ఎక్కువగానే కని్పస్తోంది. వాస్తవానికి దేశంలోని 23 ఐఐటీల్లో గత ఏడాది 17,385 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ సంవత్సరం 17,740 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.జాతీయ కాలేజీల్లోనూ ఈసారి కొన్ని కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లో కొన్నింటికి అనుమతులు రాగా.. మరికొన్నింటికి రావాల్సి ఉంది. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఎన్ఐటీల్లో సీట్లు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం 121 విద్యాసంస్థల్లో ఈ ఏడాది 59,917 సీట్లు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, మరో మూడు దశలు ఉంది. టాప్ కాలేజీల్లోనూ... దేశంలోని ప్రధాన ఐఐటీలు, ఎన్ఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌కు పోటీ ఎక్కువగా ఉంది. అయితే, దూర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా పోటీ కన్పించలేదు. ఈ ప్రాంతాల్లో లక్షల్లో ర్యాంకులు వచి్చన వాళ్లకూ సీట్లు దక్కుతున్నాయి. తిరుపతి ఐఐటీలో సీట్లు ఈసారి 244 నుంచి 254కు పెరిగాయి. అయితే, సీఎస్ఈ ఓపెన్ కేటగిరీలో బాలురకు 4,522, బాలికలకు 6,324 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ సీఎస్ఈ వైపే పోటీ కని్పంచింది. వరంగల్ ఎన్ఐటీలో కూడా సీట్లు 989 నుంచి 1049కు పెరిగాయి. ఇక్కడ 60 సీట్లతో ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశ పెట్టారు.అయితే, సీఎస్ఈకి ఇక్కడ బాలురకు ఓపెన్ కేటగిరీలో 201, బాలికలకు 3,527 ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఐఐటీ గాం«దీనగర్‌లో 288 నుంచి 370కు గత ఏడాదే పెంచారు. ఈసారి కొత్తగా 30 సీట్లు అదనంగా ఇచ్చారు. ఇక్కడ కూడా 90 శాతం మంది సీఎస్‌ఈకే దరఖాస్తు చేశారు. ఐఐటీ బాంబే 1,358 నుంచి 1,368కి, ధార్వాడ్‌లో 310 నుంచి 385కు, భిలాయ్‌లో 243 నుంచి 283కు, భువనేశ్వర్‌లో 476 నుంచి 496కు, ఖరగ్‌పూర్‌లో 1,869 నుంచి 1,889కి, జోథ్‌పూర్‌లో 550 నుంచి 600కు, పట్నాలో 733 నుంచి 817కు, గువాహటిలో 952 నుంచి 962కు సీట్లు పెరిగాయి. ఈ పెరిగిన సీట్లతో పోలిస్తే సీఎస్సీ కోసం పోటీ పడిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్పిస్తోంది. -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పార్టీకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ
-
పూర్వ విద్యార్థినిపైలైంగిక దాడికి యత్నం
విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినిపై అదే ప్రాంతంలోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీకి చెందిన ఉత్తరాది కార్మికుడు మంగళవారం లైంగిక దాడికి యతి్నంచాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పార్వతీపురానికి చెందిన ఆమె 2021లో ఇక్కడి కళాశాలలో సీఎస్సీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలను మరో యాజమాన్యం నిర్వహిస్తోంది. కాగా.. సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆమెపై మద్యం సేవించిన కార్మికుడు నిర్మానుష్య ప్రాంతంలో దాడికి యత్నించాడు. ఇది గమనించిన పశువుల కాపరులు(మహిళలు).. ఆమెను రక్షించి తీసుకువెళ్లారు. కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో భీమిలి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను భీమిలి స్టేషన్‌కు తరలించి.. ఆమెతో పాటు స్థానికులను విచారించారు. వారు చెప్పిన వివరాలతో దాకమర్రి, బోడమెట్టపాలెం పరిసర ప్రాంతాల్లోని ఫ్లైవుడ్ ఫ్యాక్టరీల్లో గాలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమిలి సీఐ డి.రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్‌లైన్‌లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
ఆంజనేయులు ఎక్కడ?.. బ్రిలియంట్ కాలేజీలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్‌కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. -
మరోసారి కరీంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి కరీంనగర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్ట్‌ల సంఖ్య 53 కు చేరింది. హైటెక్ మాస్ కాపీయింగ్‌లో వీరిద్దరూ పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. డీఈఈ పూల రమేష్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 10 లక్షలకు డీల్ ఖరారవ్వగా, ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం ఒప్పందం కుదిరింది. చెరో రూ.5 లక్షలకు కుదిరిన డీల్ చేసుకున్నట్లు సిట్ విచారణలో బట్టబయలైంది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉంది. చదవండి: TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్. -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్‌లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్‌లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యూనివర్శిటి నుంచి అనుమతులు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఉదయం నుంచి కాలేజ్ గేట్ ముందు విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కాలేజ్ యజమాన్యం వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు అక్కడ నుండి కదిలేదు లేదంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్పష్టం చేశారు. కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థి తల్లిదండ్రులు చర్చలు జరిపి అనురాగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చని నచ్చజెప్పారు. దీంతో ప్రత్యేక బస్సులో అనురాగ్ యూనివర్సిటీకి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి గురునానక్ కాలేజ్‌కు వచ్చి తమకు అక్కడ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ గేటు దుకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు, ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ జార్జ్ చేయడంతో పాటు ధర్నాకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలను అదుపులోకీ తీసుకున్నారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ -
కాలేజీ యజమాని కాంతారావు హత్యకు భాగస్వాముల కుట్ర
-
ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ
సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో వారు ఒప్పందం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. -
బల్లిపడిన ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరువొత్తియూరు: చైన్నె సమీపంలోని పూందమల్లి – ఆవడి రోడ్డులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. యథావిధిగా ఆదివారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించారు. అయితే ఆ ఆహారం తిన్న 30 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను వెంటనే కళాశాల నిర్వాహకులు రక్షించి పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తిరువేర్కాడు పోలీసుల చేపట్టిన దర్యాప్తులో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తేలింది. అలాగే పూందమల్లి రెవెన్యూ శాఖ, ఆహార భద్రత విభాగం అధికారులు కూడా కళాశాల క్యాంపస్‌కు వెళ్లి సమస్యకు గల కారణాన్ని అన్వేషించే పనిలో పడ్డారు. -
సీటు.. మహా రేటు!
జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేటు కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా (‘బి’ కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాను భర్తీ చేయాలి.. కానీ కన్వీనర్ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయి. మేనేజ్మెంట్ల సీట్ల భర్తీలో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఇవేవీ అమలు లేకుండా ఇష్టానుసారం ప్రవేశాలకు తెరలేచింది. సాక్షి, సిటీబ్యూరో: కౌన్సెలింగ్ కంటే ముందే ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల దందా జోరందుకుంది. ప్రైవేటు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల మధ్యవర్తిత్వంతో సీట్ల రిజర్వేషన్్ ప్రక్రియకు తెరలేచింది. కన్వీనర్ కోటా కటాఫ్ కంటే అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీట్ల టెన్షన్ పట్టుకుంది. ఇదే అంశం ఇంజినీరింగ్ కాలేజీలకు కాసులు కురిపిస్తోంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే పేరొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు నిబంధనలు గాలికొదిలి సీట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. దీంతో కన్వీనర్ కోటా వర్తించని విద్యార్థుల తల్లిదండ్రులకు కన్సల్టెన్సీల ఫోన్ల తాకిడి అధికమైంది. టాప్‌టెన్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని గాలం వేస్తున్నాయి. ఏకంగా కాలేజీలకు తీసుకెళ్లి సీట్లు రిజర్వ్ చేయించడం బహిరంగ రహస్యంగా తయారైంది. కోర్సుల ఆధారంగా సగటున ఒక్కో సీటుకు రూ.12 లక్షల రూ.25 లక్షల వరకు పలుకుతోంది. కొన్ని కాలేజీలు డొనేషన్ల పేరుతో భారీగా వసూలు సైతం దిగాయి. సీటు రిజర్వేషన్ చేసుకొని మరో 20 రోజుల్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తే సీటు ఇస్తామని స్పష్టం చేస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మొత్తం ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తేనే సీటు, విడతల వారీగా చెల్లిస్తే ఆ డొనేషనన్ పెరుగుతుందని తేల్చి చెబుతున్నాయి. అందులో సైతం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ చెల్లింపులను నిరాకరిస్తున్నాయి. సీటు అంశం మాట్లాడేటప్పుడు మాత్రం యాజమాన్యాలు జాగ్రత్తపడుతున్నాయి. సదరు పేరెంట్స్ మొబైల్ ఫోన్లను సెక్యూరిటీలో పెట్టి లోపలికి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నాయి. బేరసారాలు ముగియగానే తక్షణమే రూ.50 వేలు చెల్లించి రిజర్వేషన్ చేసుకునే విధంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మూడు విడతలుగా కౌన్సెలింగ్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జూనన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరగనున్నది. తొలి విడత కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి, రెండో విడత జూలై 21 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 8, 9 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదలవుతాయి. ఇంజినీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ‘ఎ’ ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సెలింగ్‌కు సమాంతరంగా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. గతంలోనూ.. ఇంజినీరింగ్ కాలేజీల్లో మెరిట్‌కు పాతర వేస్తుండగా.. సీట్లు అంగడి సరుకుగా మారాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో సైతం మెరిట్ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్ రాయనివారికి కూడా సీట్ల లభించాయి. ప్రస్తుతం సైతం అదే పునరావృతం కాబోతోంది. టాప్ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా ఉండగా మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన డిమాండ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌న్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని తల్లిదండ్రుల ఆశలు కాలేజీలకు కాసుల పంట పండిస్తోంది. -
కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత
సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు. మూడేళ్ల తరువాత.. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (బీఈ, బీటెక్) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్ బ్రాంచ్ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) స్కోర్‌తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో టాప్ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (న్యాక్)లో 3.1 స్కోర్‌తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్ లేదా ట్వినింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్ఎస్ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్‌లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్ లేదా కౌన్సెలర్‌ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో పీఎం కేర్ సూపర్ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు. (చదవండి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు ) -
అర్థాంతరంగా ముగిసిన భావి ఇంజినీర్ జీవితం
కాకినాడ రూరల్: నాలుగేళ్ల పాటు బీటెక్ కష్టపడి చదివినా నాలుగు సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా ఉండిపోవడం అతనిలో తీవ్ర మానసిక సంఘర్షణ దారి తీసింది. పెరిగిన మనోవేదన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పింది. ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, సర్పవరం పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ గుడారిగుంట శాంతనపూరి కాలనీకి చెందిన గెంగిరి దుర్గారామ్‌గోపాల్(23)ది చేపల వేట ద్వారా జీవనోపాధి సాగించే కుటుంబం. అతని తండ్రి గతంలో చనిపోగా తల్లీ, అక్క, తమ్ముడు ఉన్నారు. కోరంగి వద్ద గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో దుర్గారామ్‌గోపాల్ బీటెక్ సివిల్ బ్రాంచ్‌లో చదివాడు. గత ఏడాది ఇంజినీరింగ్ నాలుగేళ్ల కోర్సు పూర్తయింది. నాలుగు సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. వారం రోజుల క్రితమే హైదారాబాద్‌లో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. ఈ లోగా బ్యాక్లాగ్ పరీక్షలకు నోటిఫికేషన్ రావడంతో ఈ నెల 14వ తేదీ నుంచి జరగనున్న పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దుర్గారామ్‌గోపాల్ వలసపాకల గ్రామంలోని ఓయో అద్దె గదిని ఆదివారం ఉదయం తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో రాత్రి వరకు ఆరా తీసీ ఓయో గదుల బయట అతని మోటార్ సైకిల్‌ను గుర్తించి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. సోమవారం ఉదయం సర్పవరం పోలీసులు, కుటుంబ సభ్యులు వలసపాకలలోని కృష్ణుడి గుడి సమీపం వద్ద ఓయో రూమ్ తలుపులు తెరిచారు. ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండు రోజు లుగా ఇంటి వద్ద ఉన్న రామ్‌గోపాల్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్‌లు ఉండిపోవడంతో వాటి గురించే ఆలోచించేవాడని అతని అక్క మంజూష తెలిపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సాయంత్రం నాలుగు గంటల వరకు రింగ్ అయ్యి ఆగిపోయిందని, తరువాత శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై నాగేశ్వరావు, సిబ్బంది పరిశీలించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మంజూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సుల కోసం వినతి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నత విద్యామండలి తోడ్పాటు అందించాలని ఆ కాలేజీల కన్సార్టియం విన్నవించింది. యూజీసీ నుంచి వచ్చిన అటానసమ్ స్టాటస్ క్రియాశీలకంగా ఉన్నంత కాలం యూనివర్సిటీలు శాశ్వత గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరింది. విజయవాడలో సోమవారం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూల పరిధిలోని ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కాలేజీల కన్సార్టియం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, కార్యదర్శులు జీవీఎం మోహన్‌కుమార్, మిట్టపల్లి వి.కోటేశ్వరరావు, ఎన్.సతీష్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శాశ్వత గుర్తింపుతోపాటు యూజీసీ నిబంధనలను అనుసరించి యూనివర్సిటీలు అకడమిక్ స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 2035 నాటికి జీఈఆర్‌ను 50 శాతం మేర సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ప్రస్తుత అటానమస్ కాలేజీలను యూజీసీ, రాష్ట్ర యూనివర్సిటీ చట్టాల నిబంధనల మేరకు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అభివృద్ధి చెందుతున్న అంశాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైనింగ్, వర్చువల్ రియాలిటీలతో నాన్‌టెక్నికల్ యూజీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. (చదవండి: -
పాలిటెక్నిక్ చేసినా.. ఇంటర్లో చేరొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సు మొత్తం పూర్తి చేస్తే... ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంది. కానీ ఇక మీదట పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేసినా.. రెండో సంవత్సరం ఇంటర్లో చేరే అవకాశం రాబోతోంది. ఇందుకు సంబంధించిన మార్పులకు సాంకేతిక విద్యా మండలి శ్రీకారం చుట్టనుంది. ఇంజనీరింగ్‌లో ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ రెండేళ్ళు పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ ఇవ్వాలనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఎగ్జిట్ విధానాన్ని ఇక మీదట పాలిటెక్నిక్‌కు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ లోనూ మధ్యలో మానేసిన వారికి క్రెడిట్స్ విధానంతో కూడిన డిగ్రీని ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సాంకేతిక విద్యా మండలి ఈ దిశగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమయం వృథా కాకుండా... ‘క్రెడిట్ ’ టెన్త్ తర్వాత చాలామంది విద్యార్థులు పాలి టెక్నిక్‌ను ఎంచుకుంటారు. గత కొన్నేళ్ళుగా పాలి టెక్నిక్ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవ డం, ప్రైవేటు కాలేజీలు ఫ్యాకల్టీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సదరు కోర్సులో ఉత్తీర్ణత పెద్దగా ఉండటం లేదు. చాలా మంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని సార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేకపోతు న్నారు. ఈ కారణంగా మధ్యలోనే విద్యను మానే స్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు క్రెడిట్ విధానం తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చదివినంత వరకైనా కొన్ని క్రెడిట్స్‌ను నిర్ధారిస్తూ డిగ్రీ ఇస్తే ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చారు. ఇంటర్లో చేరే అవకాశం.. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ఆ తర్వాత ఆపివేస్తే ఇంటర్ ఫస్టియర్‌కు సమానమైన సర్టిఫికెట్ ఇవ్వాలని సాంకేతిక విద్యామండలి ప్రతిపాదించింది. అంటే ఫస్టియర్ పాలిటెక్నిక్, ఇంటర్ మొదటి సంవత్సరానికి సమానమైందని ధ్రువీకరించనున్నారు. దీంతో ఆ విద్యార్థి ఇంటర్ సెకెండియర్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడేళ్ల పాలిటెక్నిక్‌లో రెండేళ్ళు పూర్తి చేసి, ఆ తర్వాత మానేసినా, మూడేళ్ళు చదివి, మూడో ఏట ఫెయిల్ అయినా, ఆ విద్యార్థి క్రెడిట్స్‌ను 90 సాధిస్తే సర్టిఫికెట్ ఇన్ ఇంజనీరింగ్ ఇస్తారు. వీళ్లు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. పాలిటెక్నిక్ మూడేళ్ళ కోర్సుకు 150 క్రెడిట్స్‌ను నిర్థారిస్తున్నారు. ఇందులో 130 క్రెడిట్స్ వస్తే పాలిటెక్నిక్ పూర్తి చేసినట్టు లెక్క. వీరికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తారు. ఏదేమైనా మూడేళ్ళు చది వితే తప్ప పాలిటెక్నిక్ చదువు సార్థకత అవుతుందనే విధానం ఇక మీదట తెరమరుగు కానుంది. -
ఇష్టం వచ్చినట్లు కోర్సుల్లో సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కన్వీనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. -
ఇంజనీరింగ్‌లో పెరిగిన ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం విద్యార్థుల ప్రవేశం పెరిగింది. అన్ని దశల ప్రవేశాల ప్రక్రియ ముగియడంతో ఈ ఏడాది కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక రూపొందించింది. దాని ప్రకారం.. 177 కాలేజీల్లో 1.10 లక్షల సీట్లకు సాంకేతిక విద్యా విభాగం కౌన్సెలింగ్ నిర్వహించింది. 2021–22లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 70 వేల మంది ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచ్‌ల్లో చేరగా.. ఈ ఏడాది (2022–23) ప్రవేశాల సంఖ్య 80 వేలు దాటింది. అయినప్పటికీ 30 వేల సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది 61,972 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ అయ్యాయి. కంప్యూటర్ కోర్సుల్లోనే పెరుగుదల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సులు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో దాదాపు వంద కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 10 వేల సీట్లు తగ్గించుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి. ఇప్పుడివన్నీ భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన 61,972 సీట్లలో 45 వేలకుపైగా సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సులవే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ)లో 12,503 సీట్లుంటే, 10,789 సీట్లు భర్తీ అయ్యాయి. మెకానికల్‌లో 4,653 సీట్లకు గాను 1,249 మంది చేరగా, సివిల్‌లో 5,060 సీట్లు ఉంటే, ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 1,683 మంది మాత్రమే కావడం గమనార్హం. యాజమాన్య కోటాలోనూ కంప్యూటర్ కిక్ రాష్ట్రవ్యాప్తంగా యాజమాన్య కోటాలో 30 వేలకు పైగా సీట్లు ఉండగా.. ఇందులోనూ 18 వేల సీట్లు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లోనే భర్తీ అయ్యాయి. ఈ కోటా కింద ఒక్కో సీటు కనిష్టంగా రూ.8 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకూ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఎంసెట్ ఫలితాల వెల్లడి తర్వాత యాజమాన్య కోటా కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎగబడ్డారు. స్పాట్ అడ్మిషన్ల దశలో టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీటు ఒక్కటీ మిగల్లేదు. ఆఖరి దశలో సీటు పొందాలనుకునే వారు రెండవ ఆప్షన్‌గా ఎలక్ట్రానిక్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ముందు వరుసలో సీట్లు రిజర్వు చేసుకున్న వాళ్లల్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. ఇక సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలు తంటాలు పడాల్సి వచ్చింది. ఆఖరి దశలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కొన్ని కాలేజీలు సీట్లు ఇచ్చాయి. -
ఆధునిక కోర్సుల్లో చేరాలి
నర్సాపూర్ : ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను చదవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో 8వ స్నాతకోత్సవం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కోర్సులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌లతో పాటు పాటు ఫార్మా రంగాలకు మంచి భవిష్యత్ ఉందని, నూతన కంప్యూటర్ కోర్సులను చదవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో బీవీఆర్ఐటీ ఒకటని ఆయన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరిస్తూ విద్యార్థులు మంచి నడవడికతో దేశానికి, సమాజానికి సేవా భావం కల్గి ఉండాలని, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మిప్రసాద్, కాలేజీలోని పలు బ్రాంచ్‌ల హెచ్ఓడీలు, కాలేజీ డీజీఎం కాంతారావు, ఏఓలు బాపిరాజు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. -
ఇంజనీరింగ్‌లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి. కొన్ని కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లు సగానికన్నా తక్కువే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్‌లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉండబోతున్నాయి. మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 17 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి. అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలు? ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు. ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఫీజులపై పీటముడి ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్‌మెంట్‌కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఏ కోర్సులు? ఎన్ని సీట్లు? వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. -
సరికొత్తగా ఇంజనీరింగ్ బోధన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యాబోధనకు కొత్త పాఠ్య ప్రణాళికను పరిచయం చేయబోతున్నారు. ఈ దిశగా ఉన్నత విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఇటీవల కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పనపై వీసీలతో సమావేశం జరిగింది. మారుతున్న ప్రపంచంతో పోటీ పడేలా సాంకేతిక విద్యా బోధన ప్రణాళిక ఉండాలని నవీన్ మిత్తల్ సూచించారు. జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే..: ఇటీవల జేఎన్టీయూ పాలక మండలి సమావేశంలో కొత్త పాఠ్య ప్రణాళికపై చర్చించింది. కొత్త పాఠ్య ప్రణాళికకు ఆమోదం తెలుపుతున్నట్టు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు తాము సిద్ధమని తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలూ ఇదే దారిలో పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒకేసారి రెండు డిగ్రీలు: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యతో పాటు, ఇతర కోర్సులు చేస్తే తప్ప ఉపాధి లభించే అవకాశం కనిపించడం లేదు. చాలామంది ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ నియామకాలు లేకపోతే ఇతర కోర్సులు లేదా మేనేజ్మెంట్ (ఎంబీఏ) కోర్సులు చేస్తున్నారు. అయితే, ఇంజనీరింగ్ చేస్తూనే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసేందుకు వీలుగా వర్సిటీలు తమ బోధన విధానాన్ని మార్చుకోబోతున్నాయి. దీంతో పాటు తమకు నచ్చిన సబ్జెక్టును అదనంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, ఆన్లైన్ ద్వారా చేసేందుకు అనుమతించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ రెండో ఏడాది పూర్తిచేసి, ఆపేస్తే.. దాన్ని డిప్లొమా పూర్తి చేసినట్టు భావించాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలను గ్రేడ్లుగా పరిగణిస్తారు. టెన్త్ వరకూ ఒక గ్రేడ్, ఇంజనీరింగ్, డిప్లొమా వేర్వేరు గ్రేడులుగా ఉంటాయి. ఈ విధానానికి అనుగుణంగా ఇంజనీరింగ్ రెండేళ్లు చేస్తే డిప్లొమా కోర్సుగా భావించాలని జేఎన్టీయూహెచ్ పాలక మండలి నిర్ణయించింది. -
నో సి‘విల్’ .. మెకాని‘కిల్’!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా కంప్యూటర్ కోర్సుల్లో వచ్చిన ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్టీయూహెచ్ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 10 వేలకు పైగా సీట్లకు ఎసరు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్ 6,221, మెకానికల్ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ లేని మెకానికల్, సివిల్ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యార్థుల మాటేమిటి? సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్‌లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్‌లో కేవలం సివిల్, మెకానికల్ వంటి కోర్సులు మినహా కంప్యూటర్ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. – డాక్టర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్‌రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్ఐటీ కళాశాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హుస్నాబాద్‌కు చెందిన సాత్విక గౌడ్(19) సీఎంఆర్ఐటీలో బీటెక్ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటోంది. శనివారం రాత్రి డిన్నర్‌కు పిలిచేందుకు స్నేహితురాలు సాత్విక గదికి వెళ్లగా అప్పటికే ఆమె ఏడుస్తూ కూర్చుంది. దీనిపై స్నేహితురాలు ప్రశ్నించగా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా.. ఏమీ చదవలేదని చెప్పింది. అంతేగాక మమ్మీ కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తెలిపింది. తాను తర్వాత తింటానని చెప్పడంతో మీ రూమ్మెట్స్ లేరు కదా ఒంటరిగా పడుకోవద్దని తన గదికి రావాలని చెప్పి స్నేహితురాలు వెళ్లిపోయింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆమె కని పించకపోవడంతో స్నేహితులు ఆమె కోసం గాలించారు. బాత్రూమ్ డోర్ తలుపులు కొట్టగా ఎంతకీ తెరుచుకోవపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచా రం అందించారు. వార్డెన్ సిబ్బంది సాయంతో బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా సాత్విక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్లో తల్లిదండ్రులకు సారీ చెప్పి.. సాత్విక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు తెలిపారు. ‘నా జీవితాన్ని విడిచిపెడుతున్నాను.. సారీ మమ్మీడాడీ’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. గతంలోనూ తాను సరిగ్గా చదవలేకపోతున్నానని కిటికీలోంచి దూకి చావాలనిపిస్తుందని చెప్పేదని, చదువులో ఇబ్బంది కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిపారు. ఈ నెల 15న తన బంధువుల శుభకార్యం ఉండగా పరీక్షలు రాసి ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం కాలేజీ వద్దకు వచ్చిన సాత్విక తల్లిదండ్రులు తాము రాకముందే మృతదేహాన్ని ఎలా మార్చురీకి తరలిస్తారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్ దహనం) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సాంకేతిక విద్యకు చికిత్స అవసరం
సాక్షి, హైదరాబాద్: సాంకేతికవిద్యలో గుణాత్మక మార్పు అవసరమని అఖిల భారత ఉప కులప తుల సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. మార్కె ట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలను వెతుక్కునేవాళ్లు కాదని, వ్యవస్థను మార్చేవాళ్లు కావాలని ఆకాంక్షిం చారు. శుక్రవారం ఇక్కడ హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ‘ఆఫరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్’అనే అంశంపై అఖిల భారత విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సియంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ భారత పారిశ్రామిక అవసరాలకు తగ్గరీతిలో నిపుణులు కన్పించడం లేదని, ఏటా 21 లక్షలమంది ఇంజ నీర్లు పట్టాలతో వర్సిటీల నుంచి బయటకొస్తున్నా, వారిలో కేవలం 15.3 శాతం మందికే నేటి అవసరా లకు తగ్గ నైపుణ్యం ఉంటోందని అన్నారు. 2026 నాటికి దేశంలో సాంకేతిక ఉపాధి అవకాశాలు దాదాపు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ, ఈ స్థాయిలో నిపుణులు లభించడం కష్టమనే అభిప్రా యం వ్యక్తం చేశారు. స్వయంసమృద్ధిని కోరుకుం టున్న భారత్‌లో ఇంజనీరింగ్ విద్యస్థాయి నుంచే స్టార్టప్స్‌ను, ఇంక్యుబేటర్స్‌ను తయారు చేయాలని, ఈ గురుతర బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసు కోవాలని సూచించారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి కూడా చిన్నపాటి గ్రామస్థాయి ఉపాధి కోసం వెంపర్లాడటం దురదృష్టకరమన్నారు. గత కొన్నాళ్ళుగా ఉన్నతవిద్యలో, మహిళల భాగస్వా మ్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సిం హారెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా సాంకేతికవిద్యను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదు స్టార్టప్స్ ప్రతి యూనివర్సిటీ నుంచి కనీసం ఐదుగురు స్టార్టప్స్‌ను తయారు చేయగలిగితే దేశ జీడీపీలోనే ఉజ్వలమార్పు కన్పిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్లల్లో అనేక మంది గ్రాడ్యుయేట్ స్థాయి వాళ్లే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీంద్ర, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
ఇంజనీరింగ్, ఫార్మాలో ఫీజుల వాత.. 15శాతం వరకు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2022–23 విద్యా సంవత్సరం) 15 శాతం మేర వార్షిక ఫీజులు పెరగబోతున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఏఎఫ్ఆర్సీ) ఈ మేరకు అనుమతినివ్వనున్నట్టు సమాచారం. ఏఎఫ్ఆర్సీ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఫీజుల పెంపు కోరుకునే అన్ని కాలేజీలు వచ్చే నెల 28లోగా తమ ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రైవేటు కాలేజీల ఆదాయ వ్యయాలను ప్రతి మూడేళ్లకోసారి ఏఎఫ్ఆర్సీ సమీక్షిస్తుంది. దీని ఆధారంగా ఫీజుల పెంపుదలకు అనుమతిస్తుంది. రాష్ట్రంలో 2019లో ఈ విధంగా అనుమతినిచ్చారు. దీని కాలపరిమితి 2021–22తో ముగిసింది. దీంతో వచ్చే మూడేళ్ళకు ఫీజుల పెంపును ఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీస వార్షిక ఫీజు రూ.35 వేలు ఉంటే, గరిష్టంగా రూ.1.34 లక్షల వరకు ఉంది. ఎక్కువ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.75 వేలకు పైగానే ఉండటం గమనార్హం. కరోనా కాలం నో కౌంట్ ఏఎఫ్ఆర్సీ ఎప్పటిలాగే కాలేజీల నుంచి మూడేళ్ళ వివరాలు కోరింది. అయితే ఇందులో కేవలం 2019–20 కాలానికి సంబంధించిన వ్యయాన్నే పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 20–21, 21–22 సంవత్సరాల్లో ఎక్కువ కాలం కరోనాతో విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి లేబొరేటరీలు, లైబ్రరీలు ఇతర ఖర్చులన్నీ ఉండే అవకాశం లేదు. అయితే కరోనా కాలంలో సరిగా ఫీజులు వసూలు కాలేదనే కాలేజీల వాదనతోనూ కమిటీ ఏకీభవించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్ విద్యకు మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నామని, దీనికి పెద్ద మొత్తంలో ఖర్చయిందనే వాదనను తెరమీదకు తేవాలని కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నించాయి. కానీ తరహా దోపిడీపై ‘సాక్షి’ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కమిటీ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఫ్యాకల్టీ ముసుగులో అవకతవకలపై దృష్టి కాలేజీల వార్షిక వ్యయంలో సింహభాగం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. యాజమాన్యాలు దీన్నే ప్రధానంగా ఆడిట్ లెక్కల్లో చూపుతాయి. అయితే లెక్కల్లో చూపించే విధంగా ఫ్యాకల్టీ కాలేజీల్లో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. 2019లో ఒకే అధ్యాపకుడిని రెండు, మూడు కాలేజీలు తమ ఫ్యాకల్టీగా చూపడం గమనార్హం. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) స్క్రూటినీలోనే ఇది బయటపడింది. ఈసారి ఇలాంటి అవకతవకలకు తావు లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఏఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. కొన్ని కాలేజీలు బోధన సిబ్బందికి సరిగా జీతాలివ్వడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడిట్ రిపోర్టులో ఎవరికి? ఏ ఖాతా ద్వారా చెల్లించారు? అనేది పరిశీలిస్తే కాలేజీల గోల్మాల్ వెలుగు చూసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా 15 శాతం ఫీజుల పెంపు అంశంపై విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఫీజులు పెంచితే ఉద్యమించక తప్పదు రెండేళ్ళుగా కరోనాతో ప్రజలు అల్లల్లాడి పోతుంటే ఫీజుల పెంచాలనే ఆలోచన ఎంతమాత్రం సహేతుకం కాదు. ప్రైవేటు దోపిడీని అడ్డుకోవాల్సిన నియంత్రణ కమిటీ, పెంపునకు మార్గం సుగమం చేయడం దారుణం. రెండేళ్ళుగా కాలేజీలే లేనప్పుడు ఖర్చు ఎలా ఉంటుంది? ఫీజులు ఎందుకు పెంచాలి? పెంపు నిర్ణయం తీసుకుంటే ఉద్యమించక తప్పదు. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) సిబ్బంది జీతాల వివరాలు బయటపెట్టాలి కరోనా సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు అర్ధాకలితో అలమటిస్తున్నా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో జీతాలు ఇవ్వలేదు. నిజంగా ఇచ్చి ఉంటే అవి బ్యాంకు ద్వారానే ఇవ్వాలి. కాబట్టి ఆ వివరాలు బయటపెట్టాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కాలేజీల నిర్వహణ ఖర్చుపై ఏఎఫ్ఆర్సీ ఓ నిర్ణయానికి రావాలి. అంతే తప్ప ప్రైవేటు కాలేజీల తప్పుడు లెక్కలను పరిగణనలోనికి తీసుకోకూడదు. – అయినేని సంతోష్‌కుమార్ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్‌వేర్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్‌వేర్‌నే వాడుతోంది. ఆప్‌లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్‌వేర్‌లో లేదని, తప్పులు ఆటోమేటిక్‌గా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్‌కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్‌లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఇంజనీరింగ్‌లో ఇక నిఖార్సైన బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూహెచ్ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది. దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి మోసం... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్ విధిగా పీహెచ్డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్‌లాగ్స్‌తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్టీయూహెచ్ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. ఆధార్ లింక్ తప్పనిసరి ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్టీయూహెచ్కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది. అలాగే అధ్యాపకుల ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. బయోమెట్రిక్‌తో ఉద్యోగాలు నిలబడతాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. – అయినేని సంతోష్‌కుమార్ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు) విద్యార్థులకు మేలు బయోమెట్రిక్ హాజరుతో ఆధార్‌ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్‌ను లింక్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. – ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్, వీసీ -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
15 నుంచి ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ఉన్నత విద్యా మండలి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. మొద టి దశలో మిగిలిపోయిన సీట్లన్నీ ర్యాంకు ఆధారంగా అర్హులకు కేటాయిస్తారు. ఇందులోనూ సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మొదటి దశలో కన్వీనర్ కోటా ద్వారా సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు అక్టోబర్ 13లోగా అవసరమనుకుంటే సీటు రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. అప్పటికీ భర్తీ కానివి, రెండో దశలోనూ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఖాళీ అయ్యే సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తారు. 31 వేలకు పైగా సీట్లు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 78,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా, 14,847 సీట్లు మిగిలిపోయాయి. తొలి కౌన్సెలింగ్‌లో అఫ్లియేషన్ పూర్తి చేసుకోలేని కాలేజీలు కూడా ఈసారి అర్హత సాధించాయి. కాబట్టి మొత్తం 31,948 సీట్లను భర్తీ చేయనున్నారు. కం ప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు ఎక్కువగా భర్తీ అయినట్లు సమాచారం. రెండో ప్రధాన బ్రాంచి గా భావిస్తున్న ఈసీఈలో దాదాపు 3 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. సివిల్, మెకానికల్ సీట్లతోపాటు ఐటీ కోర్సుల్లో కూడా ఒక్కో బ్రాంచ్‌లో దాదాపు వెయ్యి సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. క్లైమాక్స్‌లో ‘బి’కేటగిరీ ఇంజనీరింగ్ ‘బి’కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 5కల్లా పూర్తి చేయాలని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి గడువు విధించింది. ఆ తర్వాత 15లోగా ఉన్నత విద్యామండలికి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ర్యాంకు ప్రకారమే భర్తీ చేయాలని, ఇలా కాని పక్షంలో ఫిర్యాదు చేయాలని మండలి స్పష్టం చేసింది. అయితే, ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం ఈ సీట్ల కేటాయింపు జరగడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉంటే, ప్రైవేటు కాలేజీలు మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా ముందే మాట్లాడుకున్న వారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో మిగులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 200 సీట్లు మిగిలిపోతున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. ఆ తర్వాతనే జాతీయ కాలేజీలైన ఐఐటీ, నిట్ వంటి వాటిల్లో సీట్లొచ్చి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కాలేజీలు ఇలా మిగిలిపోయిన సీట్లను కూడా సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ కాలేజీలకు భర్తీ చేసే వెసులుబాటు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
కంప్యూటర్ కోర్సులకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు హాట్ కేకుల్లా మారాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంచుకున్నారు. ఈ కోర్సుల్లో సీటు పొందిన వారిలో చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 78,270 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి తాజాగా తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించింది. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం 61,169 సీట్లను కేటాయించింది. అయితే సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఏఐ, డేటా సైన్స్‌కు పోటీ కొత్తగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేథ, కృత్రిమ మేథ మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడ్డారు. ఆప్షన్స్ ఇచ్చిన వారిలో 60 శాతం పైగా ఈ కోర్సులను ఎంచుకున్న వారే ఉన్నారు. ర్యాంకు ప్రకారం ఆయా కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న వారు తిరిగి చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అయితే నచ్చిన కాలేజీలో సీటు రాని కొద్దిమంది రిపోర్టింగ్ చేయలేదు. వారంతా మెరుగైన కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్సీ)లో 18,561 సీట్లు కేటాయిస్తే.. 13,942 మంది రిపోర్టింగ్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో 1,634 సీట్లు ఉంటే, 1,192 మంది ప్రధాన కాలేజీల్లో సీట్లు ఖరారు చేసుకున్నారు. సివిల్‌లో 3,177 సీట్లు కేటాయిస్తే, 2,312 మంది, మెకానికల్‌లో 2,550 సీట్లకు 1,826 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. -
పెంచిన ఫీజులను ప్రభుత్వమే భరించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: గుట్టుగా పెంచిన ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజుల వసూళ్లకు తెగబడటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
రూల్స్ అన్నారు.. అనుమతులు ఇచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, రూల్స్ పాటించకపోతే అనుబంధ గుర్తింపే ఇవ్వమని జేఎన్టీయూహెచ్ నిన్నటిదాకా ఊదరగొట్టింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో! బుధవారం ఒక్కరోజే ఏకంగా 108 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 11 కాలేజీలు కూడా కలిపితే, రాష్ట్రంలో 119 కాలేజీలకు అనుమతులు వచ్చేశాయ్. ఇది ఏటా జరిగే తంతు.. అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గతంలోకన్నా భిన్నంగా వ్యవహరిస్తామని తెలిపింది. గత నెల 25వ తేదీన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మీడియాకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌కు పీహెచ్డీ, అధ్యాపకులకు ఇతర అవసరమైన అర్హతలు ఉన్నాయా.. లేదా చూస్తామన్నారు. కాలేజీలు గుడ్డిగా అధ్యాపకుల జాబితా పంపితే.. వాళ్లు చదివిన యూనివర్సిటీలకు వెళ్లి మరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. సరైన అర్హతలు లేని అధ్యాపకులతో కాలేజీలు నడిపించే విధానాన్ని మారుస్తామని వీసీ తెలిపారు. అన్ని కాలేజీలను తమ కమిటీ పరిశీలించి, అర్హతలున్నాయని తెలుసుకున్నాకే అఫిలియేషన్ ఇస్తామని ఆయన పదేపదే చెప్పారు. కమిటీ అయితే అన్ని కాలేజీలకు వెళ్లింది. ఈ పరిశీలనలో 90 శాతం కాలేజీల్లో లోపాలున్నాయని, మౌలిక వసతుల్లేవని, అధ్యాకులు నిబంధనల ప్రకారంలేరని గుర్తించినట్టు తెలిసింది. అయితే, కమిటీ పరిశీలించి.. ఇచ్చిన నివేదికను మాత్రం జేఎన్టీయూహెచ్ గోప్యంగా ఉంచింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు కనీసం పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. అంతలోనే ఇన్ని కాలేజీలకు అర్హులైన అధ్యాపకులు ఎలా వచ్చారో? మౌలిక సదుపాయాలు ఎలా సమకూరాయో తెలియదు కానీ.. అఫిలియేషన్ అయితే ఇచ్చేసింది. అనుమతులు సరే.. అధ్యాపకుల సంగతేంటి? అధ్యాపకుల సమస్యలు పట్టించుకోకుండా, ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులివ్వడం దారుణమని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్‌కుమార్ అన్నారు. చాలా కాలేజీల్లో జీతాలే ఇవ్వడం లేదని, వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో అసలు అధ్యాపకులు ఉన్నారా అనే విషయాన్ని కమిటీ పరిశీలించిందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. -
ఇంజనీరింగ్ సీటు ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్ బుకింగ్ మొదలు కాలేజీలో చేరే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ముందు ఇలా చేయండి ►ఈ నెల 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్ అర్హత పొందిన అభ్యర్థులు ‘ ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn’ పేజీకి లాగిన్ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కాలమ్‌లోకి వెళ్లాలి. ఎంసెట్ హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష హాల్‌టికెట్ నంబర్‌ను నిర్ణీత కాలమ్స్‌లో నింపాలి. ఇందులోనే ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్ నంబర్ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు. ►ప్రాథమిక సమాచారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్ పరిశీలన తేదీని, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ చేసుకోవచ్చు. పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి? ►మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్, ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్ మెమో, ఆరు నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ►సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో పరిశీలన అనంతరం సంబంధిత అధికారి ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు. ఆప్షన్ వేళ కంగారొద్దు... ►వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్ఎంసెట్ పేజీకి మీ యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఎంసెట్ వెబ్ పోర్టల్‌లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీ కోడ్ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్‌లో క్లిక్ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సబ్మిట్ చేయాలి. ►ఆప్షన్స్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 13 రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12 తర్వాత సైట్ ఫ్రీజ్ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. 15న సీటు ఖరారు... ►సెప్టెంబర్ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్ అయి సీటు వచ్చిందా లేదా? చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును అదే నెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దశ వెబ్ ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే అభ్యర్థి కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ షెడ్యూల్.. స్లాట్ బుకింగ్: 30–8–21 నుంచి 9–9–21 ధ్రువపత్రాల పరిశీలన: 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్: 4 నుంచి 13 వరకు తొలి దశ సీట్ల కేటాయింపు: 15–9–21 సెల్ఫ్ రిపోర్టింగ్: 20–9–21 -
ఇంటర్ పాసైతే.. ఇంజనీరింగ్‌కు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ర్యాంకులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో జనరల్ కేటగిరీకి 45 శాతం, రిజర్వుడ్‌కు 40 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్‌కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది. కోవిడ్ పరిస్థితులు, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎంసెట్ పాసైనవారు సులువుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు బుధవారం ఎంసెట్ ఫలితాల వెల్లడి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. మొత్తం 1,64,964 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,47,986 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం లక్షకుపైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30వేల వరకు మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్‌కు హాజరైన నేపథ్యంలో.. సీట్ల కోసం డిమాండ్ ఉండొచ్చని అంచనా. -
Women Safety Tool: ‘టచ్’ చేస్తే షాకే!
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మహిళలపై నానాటికీ పెరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉమెన్ సేఫ్టీ పరికరాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు చెందిన మౌనిక, దివ్య, ఎస్.మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది. విజిటింగ్ కార్డు సైజ్ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్ షాక్ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్ కార్డు సైజ్ బోర్డు, రెండు స్టీల్ పేట్లు, 4 ఓల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్, స్పార్క్ గ్యాప్ కెపాసిటర్, పుష్ ఆన్ స్విచ్ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు. -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్‌లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
అడవి బిడ్డల చెంతకే చదువులమ్మ
సాక్షి, అమరావతి: ఇంతవరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన ఇంజనీరింగ్, మెడికల్ విద్య ఇక నుంచి గిరిజనులకు కూడా అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ కళాశాలల నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘విజయ’గిరుల్లో విశ్వవిద్యాలయం విద్యా ప్రమాణాల మెరుగు కోసం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటైంది. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, రామభద్రాపురం మండలం కోటక్కి మధ్య సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ నిర్మాణం జరగనుంది. సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలను కలుపుతూ ఈ వర్సిటీ ఉంటుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యూనివర్సిటీ రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్లో దీన్ని నిర్వహిస్తున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే కొత్త భవనాల్లోకి విద్యార్థులు ప్రవేశిస్తారు. ఇక్కడ మొత్తం ఏడు కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. మొత్తం 140 సీట్లు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వివరాలివీ... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (మెడిసినల్ కెమిస్ట్రీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (ఎంపీసీ) + ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ మెడిసినల్ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్ బీబీఏ+ ఎంబీఏ (ట్రావెల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), బీఎస్సీ + ఎమ్మెస్సీ జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ టూరిజం, అండ్ హాస్పటాలిటీ మేనేజ్మెంట్. యూనివర్సిటీలో చదువుకునేందుకు గిరిజనులు, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ మాదిరిగానే రిజర్వేషన్లు అమలు చేస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి వర్సిటీ ప్రవేశాలు కల్పించింది. కొత్త భవనాలు వచ్చి పూర్తి సౌకర్యాలు ఏర్పాటైన తరువాత ఇందులో రీసెర్చ్ కోర్స్‌లు కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ట్రైబల్ యూనివర్సిటీకి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెంటార్‌గా వ్యవహరిస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అకడమిక్ వ్యవహారాల్లో ఏయూ తన సహాయ సహకారాన్ని అందిస్తోంది. అలాగే, విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండి గ్రామంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి 105.32 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రూ.153 కోట్లతో నిర్మించనున్న ఈ ఇంజనీరింగ్ కాలేజీ 2021-22 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసీఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కళాశాల జేఎన్టీయూ- కాకినాడకు అనుబంధంగా ఉంటుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చి..శ్రీకాకుళం జిల్లా దాటి విశాఖ జిల్లాకు వెళుతున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తి అయితే ఇక నుంచి ఆ సమస్య కూడా తీరిపోతుంది. మన్యంలోనే మెడికల్ విద్య.. విశాఖ జిల్లాలోని మన్యం విద్యార్థులు మెడికల్ విద్యను తమ ముంగిట్లోనే చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 35.01 ఎకరాల్లో 17 భవనాలు నిర్మిస్తున్నారు. ఈ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి కానున్నాయి. భవన నిర్మాణాలను పరిశీలించి కేంద్రం అనుమతి ఇస్తుంది. అంటే మూడేళ్లలో ఈ కళాశాల అందుబాటులోకి రానుంది. 8 గిరిజన జూనియర్ బాలికల కాలేజీల ఏర్పాటు గిరిజన సంక్షేమ శాఖ ఎనిమిది జూనియర్ కాలేజీలను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కాలేజీలో మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 160 మందిని చేర్చుకుంటారు. ఇవన్నీ బాలికల కాలేజీలు కావడం విశేషం. కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే... 1. శ్రీకాకుళం జిల్లా భామిని, మెలియాపుట్టి 2. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ 3. తూర్పు గోదావరి జిల్లా చింతూరు 4. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కునూరు 5. గుంటూరు జిల్లా బొల్లాపల్లి 6. నెల్లూరు జిల్లా ఓజిలి గ్రామాల్లో కాలేజీలు నెలకొల్పనున్నారు. రూపుమారిన గిరిజన గురుకులాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గురుకుల విద్యాసంస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునికమైన వర్చువల్ తరగతి గదుల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా విద్యాసంస్థల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి గిరిజన విద్యలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చింది. అలాగే, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వంటలు చేసి వడ్డించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో వంటగదుల యాంత్రీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టింది. -
ఏపీలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
-
ఏఐసీటీఈకి ఇంజనీరింగ్ కాలేజీల నివేదికలు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్, 111జీవో పరిధిలో ఉన్న 238 ఇంజనీరింగ్ కాలేజీల్లో శుక్రవారం వరకు లోపాల సవరణకు చేపట్టిన చర్యలపై యాజమాన్యాలు ఇచ్చిన నివేదికలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో లోపాలున్న ఈ కాలేజీలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలనుంచి నివేదికలను తీసుకోవాలని జేఎన్టీయూ ను ఆదేశించింది. దీంతో జేఎన్టీయూ యాజమాన్యాల నుంచి నివేదికలు కోరగా, 86 కాలేజీలే లోపాల సవరణకు చేపట్టిన నివేదికలను అందజేశాయి. అందులో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలు 82 ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కాలేజీలు 4 ఉన్నాయి. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటిపై చర్చించారు. కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఇచ్చిన దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 5 వరకు ఉంది. దీంతో ఆలోగా లోపాల సవరణ నివేదికలను ఏఐసీటీఈకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. -
పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్‌టేక్) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది. ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్‌పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు రోజుల్లో గవర్నింగ్ బాడీల నామినీలు ప్రతి కాలేజీ గవర్నింగ్ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ స్పష్టం చేసింది. జేఎన్టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది. కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్ రూపొందించి జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు కష్టకాలం వచ్చింది. 2020–21 విద్యా సంవత్సరంలో వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న.. ఆందోళన మొదలైంది. రాష్ట్రం లోని ఆయా కాలేజీలకు భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా భవనాలను నిర్మించి కొనసాగిస్తున్నాయి. ఈ అంశం పై రెండేళ్ల కిందట అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ యాజమాన్యాలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలిస్తేనే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపు ఇస్తామని తెలిపింది. చివరకు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏఐసీటీఈ ఆ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రెండే ళ్లలో అనుమతులు తెచ్చుకోవాలని చెప్పింది. అయినా యాజమాన్యాలు ఇప్పటికీ అనుమతులు తీసుకోలేదు. ముగిసిన గడువు.. మళ్లీ నోటీసులు.. గతంలో యాజమాన్యాలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఏఐసీటీఈ నిరాకరించడం, దానివల్ల రాష్ట్రంలో 238 కాలేజీల్లో ప్రవేశాలు ఆగిపోతే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో రెండేళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు గత నెలతోనే ముగిసిపోవడంతో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండీఏలోనే అధికం.. అనుమతుల్లేకుండా కొనసాగుతున్న కాలేజీల్లో ఎక్కువ శాతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వాటిల్లోనూ 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 42 కాలేజీలు ఉన్నాయి. 238 కాలేజీల్లో కొన్ని కాలేజీలు గ్రామ పంచాయతీ అనుమతితో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి. ఆ 238 కాలేజీల స్థలాలు, భవనాలు, ఇతర అనుమతుల పత్రాలను తనిఖీ చేసి అక్టోబర్‌లోపు నివేదిక అందించాలని ఏఐసీటీఈ గత ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది. అది ఆ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ఇంతవరకు కనీసం వాటిని తనిఖీ చేయలేదు. చివరకు ఆ బాధ్యతను జేఎన్టీయూకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. దీంతో సంబంధిత అనుమతి పత్రాలను అందజేయాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ లేఖలు రాసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. -
ఎస్వీయూలో కలకలం
సాక్షి, చిత్తూరు: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య ఆత్మహత్య క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, వార్డు వార్డెన్ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన క్యాంపస్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఉద్యోగి తాను చనిపోయే ముందు తన చావుకు కారణాన్ని వీడియోలో రికార్డు చేసి పంపడం పలు ఆలోచనలకు రేకెత్తిస్తుంది. హాస్టల్ వార్డెన్, సూపరింటెండెంట్, మరో ఉద్యోగి తనను ఇబ్బందులకు గురిచేశారని వారిని నమ్మొద్దని, వసతి గృహం జాగ్రత్త అని విద్యార్థులకు తన వీడియో ద్వారా హెచ్చరించారు. అసలేం జరుగుతోంది ? ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల 2017లో వరుస వివాదాల్లో చిక్కుకుంది. గత ఏడాది జూన్‌లో రెగ్యులర్, డ్యూయల్ డిగ్రీ కోర్సు విద్యార్థుల మధ్య గొడవలు పెరగడంతో అప్పటి ప్రిన్సిపల్ పద్మనాభం తన పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ప్రిన్సిపల్‌గా ప్రదీప్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. వార్డెన్‌గా పనిచేస్తూ వచ్చిన చెంగయ్యను తొలగించాలని కోరుతూ ఈఏడాది జూన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను తొలగించి సత్యనారాయణ మూర్తిని వార్డెన్‌గా నియమించారు. అయితే ఈ దశలో వసతిగృహంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో స్టోర్ ఇన్చార్జ్గా ఉన్న రామచంద్రయ్యను వేరే చోటికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు వసతి గృహంలో తనపై నిందలు మోపారని వార్డెన్ సూపరింటెండెంట్ మరో ఉద్యోగిని నమ్మొద్దంటూ తాను విడుదల చేసిన వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేయడంతో వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళన ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ వసతి గృహంలో స్టోర్ ఇన్చార్జ్గా పనిచేస్తూ 10 రోజుల క్రితం అదే వసతి గృహంలో వేరే విధులకు బదిలీ అయిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య(52) మృతిపట్ల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో ఆత్మీయంగా ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య విద్యార్థులను ఎంతో కలతకు గురిచేసింది. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. వార్డెన్, ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్‌రెడ్డి , యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బి. ఓబుల్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రేమ్, సదాశివ, ముని, ప్రభు, మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్ ప్రదీప్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్రప్రసాద్, వార్డెన్ సత్యనారాయణమూర్తి, తమ పదవులకు రాజీనామా చేశారు. ఉద్యోగికి న్యాయం చేయాలి ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో పనిచేస్తూ మృతిచెందిన టైంస్కేల్ ఉద్యోగి రామచంద్రయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని టైంస్కేల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి రిజిస్ట్రార్‌ను కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు టైంస్కేల్ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనకు రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. -
కుక్కల దాడి: ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం
సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా : ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ సెంకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమ్య అనే విద్యార్థిని బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెంకండియర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న రమ్యపై శుక్రవారం కాలేజీలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు కాలేజీలో ఫ్రెషర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చడం విద్యార్థులను షాక్‌కు గురిచేస్తోంది. రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాలేజీ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. -
ఎందుకిలా చేశావమ్మా?
కురబలకోట (చిత్తూరు జిల్లా): కురబలకోట మండలం అంగళ్లులో ఇంజనీరింగ్ విద్యార్థిని పి.భవ్య (19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ముదివేడు ఎస్ఐ సుకుమార్ కథనం మేరకు.. కడపకు చెందిన పి.భవ్య మదనపల్లె దగ్గర అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. రెండు నెలల క్రితం కళాశాల దగ్గరున్న ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరింది. అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేది. సోమవారం కూడా హాస్టల్ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు. హాస్టల్ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారీ మమ్మీ.. సారీ డాడీ.. ‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ రీజన్ కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్మెంట్..’’ ‘‘నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్‌ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’’ (ఇంగ్లిష్‌లో భవ్య రాసిన సుసైడ్ నోట్ సారాంశం) -
‘సెట్’ ఏదైనా ప్రవేశాలు అంతంతే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వపు తప్పిదాలు ఉన్నత విద్యాకోర్సులకు శాపంగా పరిణమించాయి. కళాశాలలు ఎలాంటి ప్రమాణాలు పాటించకున్నా ప్రతిఏటా కోర్సులు, సీట్లు పెంచుకోవడానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దాంతో కాలేజీల్లో ఉన్నత విద్య నాసిరకంగా మారింది. ఉన్నత విద్యలో ప్రమాణాలు దిగజారడానికి టీడీపీ ప్రభుత్వ పెద్దల అవినీతే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాణాలు లేని కళాశాలల్లోవిద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు మినహా మిగిలిన కాలేజీల్లో చేరికలు పెద్దగా లేవు. తాజాగా ఎంసెట్, ఐసెట్ ప్రవేశాల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. కన్వీనర్ కోటాలోని సీట్లలో దాదాపు సగం వరకు ఖాళీగా ఉండిపోతుండగా, భర్తీ అవుతున్న సీట్లు కొన్ని కాలేజీలకే పరిమితం కావడం గమనార్హం. ఫిర్యాదులు అందినా చర్యలు శూన్యం గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ, ఫార్మా కాలేజీలపై లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. బోధకులు లేకుండానే కాలేజీలు నడిపిస్తున్నారని, కొన్ని కాలేజీల్లో కనీసం తరగతులు కూడా నిర్వహించడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై టీడీపీ ప్రభుత్వం దాదాపు 18 విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. కొన్ని కమిటీలు విచారణ చేసి, నివేదికలు ఇచ్చాయి. అయినా ఒక్క కాలేజీపై కూడా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపానపోలేదు. కేవలం భయపెట్టి డబ్బులు దండుకోవడానికే కమిటీలు ఏర్పాటు చేశారు తప్ప కళాశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు టీడీపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణాలు పెంచేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కసరత్తు ఉన్నత విద్యా రంగం పరిస్థితిని చక్కదిద్దేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏలోనూ అదే తీరు ఇటీవలే ఏపీ ఐసెట్ తుది విడత ప్రవేశాలు ముగిశాయి. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించే కాలేజీలు 457 ఉన్నాయి. వీటిలో 336 ఎంబీఏ కాలేజీల్లో 32,069 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా, 19,891 సీట్లు మాత్రమే నిండాయి. 12,178 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కాలేజీల్లో 11,742 సీట్లు మిగిలిపోగా, యూనివర్సిటీ కాలేజీల్లో 436 సీట్లు మిగిలాయి. 121 ఎంసీఏ కాలేజీల్లో 6,287 సీట్లకు గాను 2,124 సీట్లు భర్తీ కాగా, 4,163 సీట్లు భర్తీ కాలేదు. ఇవి కాకుండా ఈ కాలేజీల్లో ఎంసీఏలోకి లేటరల్ ఎంట్రీ కింద ప్రవేశానికి కేటాయించిన 4,647 సీట్లలో 1,116 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 8 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరకపోగా, 161 కాలేజీల్లో సీట్లు అధికంగా ఉన్నా ఒక్కో కాలేజీలో 50 మంది కూడా చేరలేదు. 100 మంది లోపు చేరిన కాలేజీల సంఖ్య 292. బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఇంజనీరింగ్, ఫార్మసీలో.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 445 కాలేజీలు ఉండగా, ఇందులో కన్వీనర్ కోటాలో 1,06,203 సీట్లు ఉన్నాయి. ఎంసెట్‌లో అర్హత సాధించినవారు 1,32,997 మంది ఉన్నా కేవలం 68,658 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు సుముఖత చూపి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలోనూ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారు 68,071 మంది మాత్రమే. ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసే నాటికి కన్వీనర్ కోటా సీట్లలో 60,315 భర్తీకాగా, ఇంకా 45,888 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ కాలేజీల్లో 6,022 సీట్లకు గాను 562 సీట్లు మిగిలాయి. ప్రైవేట్ కళాశాలల్లో ఏకంగా 41,023 సీట్లు మిగిలిపోయాయి. ఇక ఫార్మసీలో యూనివర్సిటీ కాలేజీల్లో 253 సీట్లకు గాను కేవలం 50 సీట్లు భర్తీ కాగా, 203 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేట్ ఫార్మా కాలేజీల్లో 142 సీట్లు భర్తీ కాగా, 3,530 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. ఫార్మా–డిలో మొత్తం 587 సీట్లుంటే, భర్తీ అయినవి 17 మాత్రమే. 100 లోపు కూడా సీట్లు భర్తీకాని కాలేజీలు 108 ఉన్నాయంటే విద్యారంగం దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. 10 కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. బైపీసీ స్ట్రీమ్‌లో బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా–డి విభాగాల్లో 8,601 సీట్లకు గాను 653 సీట్లు మిగిలాయి. -
కెనడాలో తెలుగు విద్యార్థి మృతి
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి దుర్మరణం పాలయ్యాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న తల్లికి తీరని శోకం మిగిల్చాడు. రంగారెడ్డి జిల్లా మంకల్ గ్రామానికి చెందిన బుస్సు నరేందర్‌రెడ్డి, శైలజ దంపతుల కుమారుడు జగమోహన్‌రెడ్డి (29). హైదారాబాద్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2012 డిసెంబర్ 30న కెనడా వెళ్లాడు. గత నెల 27 లేదా 28న జగన్ ప్రమాదవశాత్తు టొరంటోలోని ఓ నదిలో పడి ఉండటాన్ని స్థానిక పోలీసులు గమనిం చారు. శవాన్ని వెలికితీసి జేబులో బస్‌పాసు ఆధారంగా న్యూయార్క్‌లో ఉండే తమ బంధువుకు సమాచారం అందించారని జగన్ కుటుంబసభ్యులు తెలిపారు. జగన్ తండ్రి గతంలోనే గుండెపోటుతో మృతి చెందగా తల్లి కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. తన ముగ్గు రు పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం జిల్లె లగూడ వివేక్నగర్కు వచ్చింది. కష్టపడి పిల్లలను చదివించింది. కూతురు రాజేశ్వరికి వివాహం కాగా పెద్ద కుమారుడు జగదీశ్‌రెడ్డి ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా డు. చిన్న కుమారుడైన జగన్ ఉన్నత చదువుల కోసం 2012లో కెనడా వెళ్లాడు. అప్పుడు వెళ్లిన జగన్..కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడటం తప్ప ఎప్పుడూ ఇండియా రాలేదని తెలిపారు. కొడుకు మృతి వార్త తెలిసిన నాటి నుంచి శైలజ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. కాగా, గురువారం తెల్లవారుజామున 5.30కి జగన్ భౌతికకాయం నగరానికి వస్తుందని మృతుడి సోదరుడు తెలిపాడు. అదే రోజు జిల్లెలగూడలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నాడు. -
ఇంజనీరింగ్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం
చెన్నై: నగర శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తండలంలోని సవిత ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని బాయ్స్ హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ మొత్తం ఎనిమిది అంతస్తులు ఉండగా.. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హాస్టల్ గదులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల్లో తెలుగువారే అధికం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎట్టకేలకు మోక్షం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనం ఎట్టకేలకు పూర్తయింది. రూ 2.63 కోట్ల వ్యయంతో 2016లో అగ్రిమెంట్ అయిన ఈ భవనంలో ఆరు తరగతి గదులు, ఐదు ల్యాబ్‌లు, ప్రిన్సిపాల్ గది, ఆఫీస్ గది, స్టాప్రూంలు నిర్మించారు. సరిపడా ల్యాబ్‌లు లేకపోవడం, వివిధ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. వారం రోజుల్లో నూతన భవనం ప్రారంభం కానుండడంతో కొంత మేర ఊరట కలుగనుంది. క్లాస్ రూంలు దూర విద్యా కేంద్రం భవనంలోనే.. కాకతీయ యూనివర్సిటీలో దూర విద్యాకేంద్రంలోని అకాడమిక్ బ్లాక్‌లో మహిళా ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు. నాలుగు బ్రాంచీలు సీఎస్ఈ, ఐటీ, ఈఈఈ, ఈసీఈ ఉన్నాయి. ఆ నాలుగు బ్రాంచ్‌ల్లో సుమారు 1000 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరికి కనీసం 16 తరగతి గదులు అవసరం ఉంది. అయితే 15 గదుల్లో కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా మరికొన్ని ల్యాబ్‌ల కూడా అవసరం ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్లకోసం ఇప్పటికే క్యాంపస్‌లోని బయోకెమిస్ట్రీలోని ల్యాబ్‌లను వినియోగించుకుంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఆ భవనం వారికి పూర్తిస్థాయిలో సరి పోదు. అందువల్ల దూర విద్యా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అకాడమిక్ బ్లాక్‌లోనే విద్యార్థినులకు తరగతి గదులను అలాగే వినియోగించుకుంటూ నూతన భవనంలో అని గదులన్నింటిని ల్యాబ్‌లుగా వినియోగించుకోవాలనేది సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల యోచిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల పూర్తిస్థాయిలో ఒకే చోట నిర్వహించాలంటే ఈ భవనం పక్కనే మరో భవనం నిర్మిస్తే సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కళాశాల భవనం చుట్టూ ప్రహరీని కూడా నిర్మించలేదు. కొన్ని నిధులు వెచ్చించి ప్రహరీని నిర్మించాలనేది కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ భవనం ప్రారంభోత్సవంతో కొంతమేర మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు ల్యాబ్‌ల సౌకర్యం పెరిగి ఎంతో ఉపయోగపడబోతుంది. -
సమస్యలే స్ఫూర్తి..సేవే లక్ష్యం
పలమనేరు : చేయూత లేదని అనాథలు బాధపడకూడదు.. ఆదరణ లేదని వృద్ధులు శోకించకూడదు..విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదు. సమాజంలో ప్రతి మూల ఓ వివక్ష కాని ఓ సమస్య కాని విష వృక్షంలా మారి మనిషి జీవితాన్ని కుదిపేస్తోంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న మహోన్నత ఆశయం కోసం ఓ యువతి తపిస్తోంది. వారి సమస్యలే ఆమెకు స్ఫూర్తి..వారికి సేవ చేయడమే ఆమె లక్ష్యం..విద్యార్థి దశలోనే తనకు చేతనైన సాయం చేస్తూ సమా జ సేవలో ముందున్న ఆమె దృక్పథం నేటి యువతరానికి ఆదర్శం. పలమనేరు మదర్‌థెరీసా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించి, ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న రోహిత మనగతం ఆమె మాటల్లోనే.. కుటుంబం, చదువు నా పేరు రోహిత.. మాది గంగవరం సమీపంలోని మబ్బువాళ్లపేట. నాన్న వెంకటేశ్వర్లు ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అమ్మ హేమలత గృహిణి. అన్నయ్య రిత్విక్ రోబోటెక్ ఆటోమేషన్‌లో యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. నా ప్రాథమిక విద్య యూనివర్సల్‌లో, ఇంటర్ శ్రీవాణిలో సాగింది. ఇంటర్ ఎంపీసీలో 97.3 శాతం మార్కులు సాధించా. విట్, ఎస్ఆర్ఎం, సస్త్ర యూనివర్సిటీల్లో ఫ్రీ సీటు వచ్చింది. కానీ బీటెక్(సివిల్) ఇక్కడి మథర్ థెరీసాలో చదివా. బీటెక్ 86.01 మార్కులు సాధించి జేఎన్టీయూలో టాపర్‌గా గోల్డ్‌మెడల్‌ను పొందా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డులు పొందాను. ఏటా కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ వస్తోంది. పోటీల్లో గెలిచి..పేదలకు పంచి కాలేజీలో ఉన్న దాదాపు 20 ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర కాంపిటీషన్స్‌కు వెళ్లాను. దాదాపు అన్నింటిలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నా. అందులో ఇచ్చే క్యాష్ ప్రైజ్‌ను పలమనేరులోని వృద్ధాశ్రమానికి, గ్రామంలోని నిరుపేదలకు ఇచ్చేదానిని. మా తల్లిదండ్రులు కూడా నాకు అండదండగా ఉండేవారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం గంటలకొద్దీ చదవడం ముఖ్యం కాదు. సబ్జెక్ట్‌పై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాలి. ఇందు కోసం నెట్, యూట్యూబ్ లాంటివి ఎంతో ఉపయోగం. అందుకే నేను బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా. సింథెటిక్ పెయింటింగ్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ జేఎన్టీయూ, సౌత్ ఇండియా ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో టాపర్‌గా నిలిచా. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. 2015లో జిల్లాకు వరదలు వచ్చాయి. కాని కొద్ది రోజులకే మా నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ నీటి కోసం అవస్థలు పడ్డారు. నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్‌లు, చెరువులు లేకపోవడమే ఇందుకు కారణమనిపించింది. దీంతో ఐదు పంచాయతీల్లో దాదాపు 300 ఎకరాలకు నీరు అందించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాను. ఇందు కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నెలల పాటు శ్రమించి అన్ని వివరాలతో ప్రాజెక్టు సిద్ధం చేసి అధికారులకు 2017 జూన్‌లో అందజేశా. కానీ నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మంచి చేయాలని ఆశ ఉంటే చాలదు అధికారం కూడా కావాలని అప్పుడే అనిపించింది. కలెక్టర్ అయితే నేను అనుకున్నది చేయగలనని అనిపించింది. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. సంక్పలం నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగా. నాకు ప్రజలు కష్టాలు బాగా తెలుసు. మా నాన్నకు వ్యవసాయమంటే ఇష్టం కావడం వల్ల నాకు కూడా పొలం పనులంటే ఆసక్తి. కూలి పనులకొచ్చేవారి జీవితాల్లో కష్టాలను చూశా. విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదని అనిపించింది. వృద్ధులు, అనాథల అవస్థలను చూశా. వారికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనిపించేది. -
ఇద్దరు బిటెక్ విద్యార్థులు దుర్మరణం..
సాక్షి, రంగారెడ్డి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అబ్బులపూర్ మేట్ మండలం కవాడి పల్లిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులని తెలుస్తోంది. మృతులు వైష్ణవి(సీఎస్సీ థర్డ్ ఈయర్) లోకేష్( సెకండ్ ఈయర్)గా గుర్తించారు. ఎదురుగా వస్తున్న ఆటోను, టిప్పర్ తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. తీవ్రగాయాలైన విద్యార్థులు ఘటన స్థలంలోని మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
జై కిసాన్.. జై భారత్..
పశ్చిమగోదావరి: రైతే రాజు అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. రైతు లేనిదే దేశం లేదు. దేశానికి ఆహార అవసరాలు తీర్చే రైతును విస్మరించకూడదు. చదువు ఏదైనా వ్యవసాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ భీమవరం జీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తుందుర్రు గ్రామం వద్ద పొలంలోకి దిగారు. వరినాట్లు వేస్తున్న కూలీలకు కొద్దిసేపు సహాయపడ్డారు. రిపబ్లిక్ డేకి ఇదే మా స్వాగతం అంటూ ఆహ్వానం పలికారు. వారంతా జాతీయతా భావం ఉట్టిపడేలా మువ్వన్నెల రంగు వస్త్రాలు ధరించడం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్ / ఏలూరు -
రెండోసారి గిన్నిస్ రికార్డు
కీసర: అనర్గళంగా గంట 11 నిమిషాల పాటు బోధనలు చేయడం ద్వారా కీసర మండలం భోగారంలోని హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి అరిమండ విజయశారదారెడ్డి గిన్నిస్ రికార్డు సాధించారు. గతంలో 250 మంది విద్యార్థులకు బోధన చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. తాజాగా 400 మంది విద్యార్థులకు మైండ్‌ఫుల్‌నెస్ అనే అంశంపై పాఠాలను బోధించడం ద్వారా రెండోసారి రికార్డు సాధించారు. సోమవారం కళాశాలలో ‘లార్జెస్ట్ మైండ్‌ఫుల్‌నెస్ లెసెన్’పేరిట ఆమె ఈ కార్యక్రమం నిర్వహించారు. యువకుల మనసుల్లో సద్భావనలు నింపి వారిని సన్మార్గంలో నడిపేందుకే మైండ్‌ఫుల్‌నెస్ కార్యక్రమం ఏర్పాటుచేశానని విజయ తెలిపారు. మైండ్‌ఫుల్‌నెస్ ధ్రువీకరణకు అవార్డు నిర్వాహకులకు పంపిస్తున్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి జయసింహ ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి, వైస్ చైర్మన్ సిద్దార్ధారెడ్డి విజయశారదారెడ్డిని అభినందించారు. -
ఆన్లైన్లోనే ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2018– 19) ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్–2018ను ఆన్లైన్లోనే చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రోజుకు రెండు సెషన్లుగా ఒక్కో సెషన్లో 30 వేల మందికి పరీక్ష నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్ని రోజుల పాటు పరీక్ష నిర్వహించాలి, ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇక గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినా.. ఆన్లైన్ పరీక్షలకు కంప్యూటర్ ల్యాబ్‌లు అవసరమైన దృష్ట్యా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో నూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ సహా అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బాధ్యతలను టీఎస్ ఆన్లైన్ ద్వారా టీసీఎస్‌కు అప్పగించనున్నారని.. టీసీఎస్‌తో టీఎస్ ఆన్లైన్ ఒప్పందం కుదుర్చుకోనుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విధి విధానాలపై పాత కన్వీనర్లతో కమిటీ ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను వచ్చే నెల 10న ఖరారు చేయనుంది. ఇందుకోసం 2017–18 సెట్స్ నిర్వహించిన ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ కన్వీనర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. విధి విధానాల రూపకల్పన పూర్తయ్యాక వచ్చే నెల 20వ తేదీలోగా ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమావేశమై పరీక్షల నిర్వహణ తేదీల ఖరారు, కన్వీనర్ల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తోంది. ఇక కీలకమైన ఎంసెట్–2018 నిర్వహణ బాధ్యతను మాత్రం జేఎన్టీయూహెచ్కే అప్పగించాలని నిర్ణయించింది. లాసెట్తోపాటు మరికొన్ని సెట్స్‌ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు రిటైర్ కావడంతో ఈసారి కొత్త కన్వీనర్లను నియమించనుంది. లాసెట్ బాధ్యతలను 2017లో కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే లాసెట్ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎంవీ రంగారావు రిటైర్ కావడం, కాకతీయ వర్సిటీలో లా ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో.. ఆ బాధ్యతలను ఉస్మానియా వర్సిటీకి అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఈసారి సెట్స్ ఫీజులు పెరిగే అవకాశముంది. ఎంత ఫీజు అన్నది సెట్ కమిటీ సమావేశంలో ఖరారు చేస్తారు. జిల్లాల వారీగా అవగాహన మొదటిసారిగా ఆన్లైన్లో ప్రవేశపరీక్షలను నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు యాజమాన్యాలే అవగాహన కల్పించనుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విద్యా మండలి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ మాక్ (నమూనా) టెస్టులను నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారు. ఇక సెట్స్ వెబ్సైట్లలోనూ ఆన్లైన్ పరీక్షల ప్రాక్టీస్ లింకులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
పరీక్ష రాయనివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఘట్కేసర్/కీసర: కళాశాల యాజమాన్యం వేధింపులతో ఓ కాలేజీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్వీ నగర్లో నివాసం ఉండే రావి నాగేందర్‌రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి(20) ఘట్కేసర్ మండలంలోని అవుశాపూర్ విజ్ఞాన్‌భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 50 శాతం మాత్రమే హాజరు ఉండటంతో అతన్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ రోజూలాగానే బుధవారం కాలేజీకి బయలుదేరాడు. కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కాగా, గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైలు ట్రాక్‌పై గుర్తు తెలియని శవం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్ ఆత్యహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులది యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని గ్రామం. పిల్లల చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. -
తాకట్టులో ‘విద్యార్హత’!
ఉప్పల్‌కు చెందిన అభినవ్ గండిపేట్‌లోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. డిస్టింక్షన్లో పాసయ్యాడు. క్యాంపస్ సెలక్షన్లో విప్రో (చెన్నై)లో ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యంలో ఉద్యోగంలో చేరేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో కాలేజీకి వెళ్లిన అభినవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రూ.2.20 లక్షల ఫీజు బకాయి ఉందని, డబ్బులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అభినవ్.. చివరకు సమీప బంధువు వద్ద డబ్బు వడ్డీకి తెచ్చి కాలేజీలో చెల్లించాడు. కేవలం అభినవ్ ఉదంతమే కాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. కొందరు విద్యార్థులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తుండగా.. స్థోమత లేని విద్యార్థులు సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలు పొందలేక, పై చదువులకు వెళ్లలేక సతమతమవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యలో కీలకమైన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పథకం కింద చెల్లింపుల్లో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో విద్యార్థులు సంకట స్థితిని ఎదుర్కొం టున్నారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసినా సర్టిఫికెట్లు పొందలేదు. ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తీసుకోవాలని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. బకాయిలు రూ.1,683.59 కోట్లు.. గత విద్యా సంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.2,424.61 కోట్లు కేటాయించింది. ఇందులో గత రెండు త్రైమాసికాల్లో రూ.741.01 కోట్లు విడుదల చేయగా.. ఇంకా రూ.1,683.59 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఉపకార వేతనాలకు సంబంధించి రూ.506.79 కోట్లున్నాయి. వాస్తవానికి ఉపకార వేతన నిధులను నెలవారీగా విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం అందులోనూ జాప్యం చేస్తోంది. బకాయిల చెల్లింపులు మార్చిలోపు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులపై పలు కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్థులకు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు సర్టిఫికెట్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకోవడంతో తదుపరి చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు వచ్చినప్పటికీ సర్టిఫికెట్లు లేక వాటిని వదులుకుంటున్నారు. గుదిబండగా నిర్వహణ .. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రైవేటు యాజమాన్యాలే కీలకం. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే ఫీజులతోనే ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తున్నాం. కానీ మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రైవేటు కాలేజీల నిర్వహణ గుదిబండగా మారుతోంది. అటు విద్యార్థులను కోర్సు మధ్యలో పంపించలేక.. అప్పులు చేసి నిర్వహించలేక సతమతమవుతున్నాం. అరకొర ఫీజులిస్తూ నాణ్యత, ప్రమాణాలంటూ ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదు. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయలేని పరిస్థితితో ఆందోళన చెందుతున్నాం. – సతీశ్, ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం గౌరవాధ్యక్షుడు -
ఇందూరుకు ఐటీ హంగులు
నగరంలో ఐటీహబ్ ఏర్పాటుకు నిధులు ♦ తొలివిడతలో రూ. 25 కోట్లు కేటాయింపు ♦ పెట్టుబడులకు 60 కంపెనీల ఆసక్తి ♦ స్థానికంగా మెరుగుపడనున్న ఉద్యోగాలు ♦ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అవకాశాలు ♦ రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం ♦ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం ♦ ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ కవిత వ్యవసాయ ఆధారిత నిజామాబాద్ జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థాపన దిశగా తొలి అడుగు పడింది. కేవలం హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నిజామాబాద్‌లో కూడా ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న సర్కారు.. తాజాగా ఈ జాబితాలో నిజామాబాద్‌ను కూడా చేర్చింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దీంతో రానున్న రోజుల్లో నిజామాబాద్ నగరంలో కూడా ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినప్పటికీ దశాబ్దం క్రితమే జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పడ్డాయి. దీనికితోడు నిజామాబాద్ హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలుండటంతో ఇక్కడ ఈ ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి మహా నగరాలతో పాటు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఐటీ కంపెనీల స్థాపన జరిగితే రానున్న రోజుల్లో స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా ఐటీ అనుబంధ వ్యాపారాలు పెరిగి నగరాభివృద్ధికి బాటలు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీపంలో ట్రిపుల్ ఐటీ.. బాసర ట్రిపుల్ ఐటీ నిజామాబాద్‌కు సమీపంలో ఉండటం ఒక అడ్వాంటేజ్. నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఉన్నత విద్యా సంస్థలో వేలాది మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడి నుంచి వందలాది మంది ఐటీ కోర్సులు చేసిన అభ్యర్థులు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళుతుంటారు. నిజామాబాద్‌లో ఐటీ పరిశ్రమల స్థాపన జరిగితే ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. తొలి విడతలో రూ.25 కోట్లు నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటుకు తొలివిడతలో రూ.25 కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి విడతలో మంజూరయ్యే ఈ నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ దిశగా పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఫలించిన కవిత చొరువ నిజామాబాద్‌కు ఐటీ హబ్ మంజూరు కావడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరువ చూపారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించి మొదటి విడతలో రూ.25 కోట్లు మంజూరు చేయించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 60 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త సోదరుడు మహేష్‌గుప్త వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలతో చర్చించారు. ఇక్కడ కంపెనీల స్థాపనకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐల జాబితాను ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మహేష్‌గుప్తలు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. -
నేడు పీజీఈసెట్ తొలి జాబితా విడుదల
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను బుధవారం(16న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పీజీఈసెట్– 2017 కోకన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు తమ పేర్లను http:// www. osmania. ac. in/ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
24 నుంచి ఇంజనీరింగ్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనెల 24వ తేదీనుంచి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈనెల 20 నుంచే తరగతులు ప్రారంభించాలని ముందుగా అనుకున్నప్పటికీ చివరి దశ ప్రవేశాలు కౌన్సెలింగ్ ఈనెల 22 వరకు ఉండటంతో 24 నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు జేఎన్టీయూ తమ అనుబంధ కాలేజీలకు ఈ మేరకు సమాచారం అందించింది. తరగతుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
2019లో నెట్ నిర్వహిస్తాం: ఏఐసీటీఈ
కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్)ను 2019–20లో నిర్వహిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఈ ప్రవేశ పరీక్షకు కొన్ని రాష్ట్రాలు అంగీకరించనందున వచ్చే ఏడాది నెట్ ఉండకపోవచ్చని ఏఐసీటీఈ చైర్మన్ అనీల్.డి.సహస్రబుద్ధే వెల్లడించారు. నెట్ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతున్న రాష్ట్రాలకు.. ఈ పరీక్ష వల్ల స్థానిక విద్యార్థులకు కలిగే లాభాల్ని వివరిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, మాతృ భాషలో విద్య అభ్యసించిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసం స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్(ఎస్ఐపీ)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు.