సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈనెల 24వ తేదీనుంచి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఈనెల 20 నుంచే తరగతులు ప్రారంభించాలని ముందుగా అనుకున్నప్పటికీ చివరి దశ ప్రవేశాలు కౌన్సెలింగ్ ఈనెల 22 వరకు ఉండటంతో 24 నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు జేఎన్‌టీయూ తమ అనుబంధ కాలేజీలకు ఈ మేరకు సమాచారం అందించింది. తరగతుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది.