సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం.. దుండిగల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. శ్రావణి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, రెండు రోజుల క్రితం వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు.
అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment