commits suicide
-
జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి..
నగరంలో 18.. 28.. 29 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు, 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమైందని ఒకరు..ఈ జీవితం నచ్చలేదంటూ మానసిక వేదనతో మరొకరు.. పరీక్ష సరిగా రాయలేదనే భయంతో ఓ యువకుడు, అనారోగ్యం వేధిస్తోందని ఓ యువతి ఉసురు తీసుకున్నారు. క్షణికావేశం.. జీవితమంటే ఏర్పడిన భయం.. మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు ప్రాణాలు తీసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ప్రియురాలికి వీడియో కాల్)(Video call) చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా జిల్లుండ జరడ గ్రామానికి చెందిన ధర్మ ప్రధాన్ (29) ఇరవై రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని అపర్ణ సైట్లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. అక్కడే లేబర్ కాలనీలో నివాసం ఉంటూ మంగళవారం సాయంత్రం 4.55 గంటల సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు చేతిపై కత్తితో కోసుకొని..ఆ తర్వాత వీడియో కాల్ చేసినట్లుగా ఎస్ఐ రాములు పేర్కొన్నారు. ప్రేమ వైఫల్యమే కారణమై ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. వీడియో కాల్ అందుకున్న యువతి హైదరాబాద్‌లో మరో సైట్లో పనిచేస్తున్న తమ బంధువులకు ఫోన్‌చేసి ధర్మ ప్రదాన్ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేసింది. వెంటనే వారు సైట్‌లోని లేబర్ కాలనీకి వచ్చి చూడగా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం మృతుడి బంధువులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2 అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగిని .. అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగి (IT employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ చెందిన రిటోజ బసు(22) మాదాపూర్ సిద్దిఖ్‌నగర్ జోలో స్టెర్లింగ్ కో లివింగ్ హాస్టల్లో స్నేహితునితో కలసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితుడు కోల్‌కత్తాకు చెందిన హర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక నెలక్రితమే హాస్టల్‌కు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ లోపే అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడికి గురైన రిటోజ బసు హాస్టల్ భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్లోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన ప్రకారం..జగిత్యాల జిల్లా బూగారం మండలం భోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గంతుల కుమార్ (28) ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బీకే గూడ సంజయ్ గాం«దీనగర్ కాలనీలో గంగాధర్ అనే స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం గంగాధర్ బయటికు వెళ్లి తిరిగి 10 గంటల సమయంలో రూమ్‌కు వచ్చాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో తలుపులు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ‘నాకు జీవితం నచ్చలేదు. నన్ను క్షమించండి’ అని నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.4 పరీక్ష భయంతో సీఏ విద్యార్థిపరీక్ష సరిగా రాయలేదని ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి మండలం కరిటిగుడ్డ గ్రామానికి చెందిన రాజుశెట్టి కుమారుడు ఎస్.అమర్జీత్ (18) ఎస్ఆర్ నగర్ బాపూనగర్‌లోని జీవీ క్రేజీ పీజీ హాస్టల్లో ఉంటూ లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. 2024 డిసెంబరు 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష సరిగా రాయలేదని ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానేమో అని భయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గత జనవరి 27న మరో పరీక్ష రాయాల్సి ఉండటంతో తిరిగి నగరానికి వచ్చి హాస్టల్‌నే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఆరోగ్యం బాగాలేదని రూమ్మేట్ సుబ్రమణ్యంతో చెప్పి గదిలో ఉండిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రమణ్యం వచ్చి చూడగా లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్జీత్ ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం.. హయత్‌నగర్‌లో కుంట్లూరు మైనార్టీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని సౌమ్య హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.కాగా, నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన దర్శనం చంద్రయ్య, బాలవ్వ దంపతుల రెండో కూతురు భార్గవి హైదరాబాద్‌లో గల ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది. -
పెళ్లయిన రోజే ప్రాణాలు తీసుకుంది
సత్యవేడు: పెళ్లయిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆంబాకంలో కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ధనంజయ, రతి దంపతుల కుమార్తె ఆర్తీ(20) అక్కడే ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. సత్యవేడు మండలం ఆంబాకానికి చెందిన సమీప బంధువు సూర్య వారితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్యకు, ఆర్తీకి వివాహం జరిపించారు. ఆ తర్వాత తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సత్యవేడు మండలంలోని ఆంబాకానికి వచ్చారు. రాత్రి దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పి గదిలోకి వెళ్లిన ఆర్తీ ఎంతకీ రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే సత్యవేడు వైద్యశాలకు ఆమెను తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్‌పేట: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతడు భార్యతో గొడవపడేవాడు. ఉద్యోగానికి సెలవు పెట్టి నాలుగైదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇరుగు పొరుగు వారు, బంధువులు అతన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హైదరాబాద్: నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్‌నగర్‌లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ ఘటన జరిగింది.విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్‌తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు. -
క్షణికావేశంలో భార్యను బలిగొని.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే..
చిత్తూరు జిల్లా: క్షణికావేశంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి(49), సుజాత భార్యాభర్తలు. ఇద్దరు కుమారులతో కలిసి పదేళ్ల కిందట బెంగళూరు వెళ్లి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపి.. శనివారం బెయిల్‌పై విడుదలై స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వారితో కలిసి భోజనం చేశాడు. ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహ్య భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకొన్నానని.. తనకు బతకాలని లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి, భార్య సమాధుల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేన్నారు.చదవండి: ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు -
ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్
ములుగు: ఎస్సై హరీశ్, ఆ యువతి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఓ రిసార్టులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హరీశ్ ఆత్మహత్యకు సూర్యాపేట జిల్లాలోని దుగ్యాతండాకు చెందిన ఓ యువతిపై పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా..అబద్ధమా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ ఆడియోలో ఏంముందంటే...: ‘మనం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేయాలి. పలువురిని ఆకర్షించేలా చేస్తేనే మన ప్రేమ విషయం బయటకు వస్తుంది.. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. విషయం బయట కు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకోని పక్షంలో నా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుందాం.’ – ఎస్సై హరీశ్‘నేను కాళ్లు పట్టుకుంటాను కానీ.. మా అమ్మా నాన్న పట్టుకోరు.. నేను కొందరిపై కేసులు పెట్టినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన ఇద్దరిపై కేసులు పెట్టాను. ఈ విషయం హరీశ్‌కు ముందుగానే తెలిపాను. ఆయన మంచి మనసుతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి డబ్బు చర్చలు రాలేదు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా బ్యాంకు ఖాతాలను చూస్తే ఆ విష యం తెలుస్తుంది. నాపై కావాలనే చిలుకూరులోని కొందరు కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలు వచ్చేలా చేశారు’. – సదరు యువతిఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
ఆరోగ్యం బాగాలేదని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
దుండిగల్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం.. దుండిగల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. శ్రావణి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, రెండు రోజుల క్రితం వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘటనలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు.అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా.. తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. -
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
స్వాతిప్రియ.. శవమై..
భైంసా/బాసర: బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మరో విద్యా సుమం రాలిపోయింది. పీయూసీ2 చదువుతున్న పూరి స్వాతిప్రియ(18) ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని తిరుమలకాలనీకి చెందిన పూరి స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ2 చదువుతోంది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ అధికారులు ప్రధాన గేటు వద్దనే నిలిపివేశారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన తల్లిదండ్రులు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. బంధువుల ప్రశ్నలకు అధికారులెవరూ సమాధానం చెప్పలేదు.పిల్లలను చదివిస్తూ...నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌కుచెందిన పూరి రవీందర్ – ఉజ్వల దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సరస్వతి బీటెక్ చదువుతోంది. రెండో కూతురు స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో చదువుతోంది. కొడుకు ఓంసాయిరాం హైసూ్కల్ చదువుతున్నాడు. ఆర్మూర్ మోడల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివిన స్వాతిప్రియకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. పూరి రవీందర్ ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరాచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను బాగా చదివిస్తే జీవితంలో స్థిరపడతారని ఎంతో కష్టపడుతున్నారు. కూతురు మృతిచెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.తల్లి ఆరోపణలు...పూరి స్వాతిప్రియను క్యాంపస్ అధికారులే హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని మృతు రాలి తల్లి ఉజ్వల ఆరోపించారు. తాము రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ట్రిపుల్ఐటీకి చేరుకున్న తమను లోపలికి ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. కూతురు సెల్‌ఫోన్ ఇవ్వడంలేదని, సూసైడ్ నోట్ ఉందని చెప్పిన అధికారులు దానిని చూపించలేదని పేర్కొన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అవకాశమేలేదన్నారు. ఆదివారం ఫోన్లో మాట్లాడిందని ఉదయానికే ఎలా చనిపోయిందని ప్రశ్నించారు. క్యాంపస్ అధికారులు సాక్ష్యాలు మాయంచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చదువు కోసం పంపితే శవాన్ని ఇంటికి పంపుతున్నారని విలపించారు. తల్లిదండ్రులు రాకముందే తరలింపు..స్వాతిప్రియ దసరా, దీపావళి పర్వదినాల్లోనూ ఇంటికి వెళ్లివచ్చింది. రోజూ తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడేది. సోమవారం ఉదయం క్యాంపస్ అధికారులు ఫోన్ చేసి స్వాతిప్రియ ఆత్మహత్యచేసుకుందని తెలుపడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో గంటలోపే బాసరకు చేరుకున్నారు. అయితే తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని క్యాంపస్ నుంచి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
ప్రియుని హత్య... ప్రియురాలి ఆత్మహత్య
గోదావరిఖని: కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఓ మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది నచ్చని ఆమె అన్న, మాజీ భర్త కలిసి ప్రియుడిని హత్య చేశారు. దీంతో నిర్వేదానికి గురైన ఆమె ఉరివేసుకుని జీవితాన్ని చాలించింది. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన అంజలి (25) భర్త, ఇద్దరు పిల్లలను కాదని యైటింక్లయిన్ కాలనీకి చెందిన ప్రియునితో కాపురం సాగిస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రియుడితో ఉండేందుకే మొగ్గుచూపింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక ఇష్టపడిన ప్రియునితో పంపించేశారు. ఇలా 3 నెలలపాటు గడిచాయి. అయితే శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చూ డాలంటూ అంజలికి అన్న ఫోన్ చేశాడు. నిజమని నమ్మిన ఆమె ప్రియుడిని ఎదురుగా పంపించింది. చెల్లిని ఇంట్లో బంధించి బయట గడియవేసి ప్రియుడు వినయ్‌కుమార్ (26)ను అన్న, మాజీ భర్త కలిసి హతమార్చారు. ఈ సంఘటన తర్వాత అంజలిని పోలీసులు అదేరోజు పెద్దపల్లిలోని సఖీ కేంద్రానికి పంపించారు. అనంతరం గుంటూరుకు వెళ్లి న అంజలి చిన్నమ్మ ఇంట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉన్నత చదువు ఆశ తీరక..
ఫర్టిలైజర్ సిటీ(రామగుండం): ఉన్నత చదువులు చదువుదామని ఆశపడిన యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది ఉరేసుకుని తనువు చాలించింది. వివరాలిలా ఉన్నాయి. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్‌కు చెందిన ఆషాడపు కొమురయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె ఆషాడపు రమ్య(22) పీజీ వరకు విద్యనభ్యసించింది.ఇంకా ఉన్నత చదువులు చదువుకుందామని ఆశపడింది. తాను చదువుకుంటానని ఇంట్లో తెలిపింది. అయితే, ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ్య మృతితో ప్రగతినగర్ కాలనిలో విషాదం అలముకుంది. -
వదిలెళ్లిపోయావా బిడ్డా...
స్టేషన్‌ఘన్‌పూర్/చిల్పూరు: బాగా చదువుకుని మమ్మల్ని ఉద్దరిస్తావనుకుంటే వదిలెళ్లిపోయావా అంటూ శుక్రవారం వంగాలపల్లి రైల్వేగేట్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి రాజు, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కొడారి రాజ్‌కుమార్(15) స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి సెయింట్థామస్ హైస్కూల్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. అతడి తమ్ముడు కూడా అదేపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా శుక్రవారం ఉదయం హాస్టల్లో విద్యార్థి కనిపించలేదు. దాంతో పాఠశాల ప్రిన్సిపాల్.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో విద్యార్ధి రాజ్‌కుమార్ వంగాలపల్లి రైల్వేగేటు సమీపాన విగతజీవిగా పడి ఉన్నట్లు మధ్యాహ్నం సమయంలో తెలిసింది. అయితే సెయింట్థామస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాజ్‌కుమార్ మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే పాఠశాల హాస్టల్‌కు కనీసం వాచ్‌మన్ లేకపోవడం ఏంటని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం బయటి వ్యక్తులు రాజ్‌కుమార్‌పై పాఠశాలలో దాడి చేశారని, బయటి వ్యక్తులు పాఠశాలలో విద్యార్థిపై దాడి చేస్తే మాకు చెప్పరా.. అని ప్రశ్నించారు. విద్యార్థి నాలుగు రోజులుగా మూడీగా ఉంటున్నట్లు తెలిసిందని, సమాచారం ఇవ్వలేదన్నారు. రాజ్‌కుమార్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన గత్యంతరం లేదని వాపోయారు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే పాఠశాల వద్దకు మృతిచెందిన విద్యార్థి రాజ్‌కుమార్ బంధువులు, ఉప్పుగల్లు గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకుని పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో సెయింట్థామస్ స్కూల్ వద్ద శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ వేణు.. ఎస్సైలు, ఏఎస్సై, పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే విద్యార్థి రాజ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని వారి బంధువులు పాఠశాల యాజమాన్యంతో రాత్రి వరకు చర్చలు జరిపారు. కాగా, ఉప్పుగల్లు గ్రామానికి చెందిన కొడారి లోకేశ్ అనే డిగ్రీ విద్యార్థి సైతం వంగాపల్లి రైల్వేగేటు సమీపంలో 13 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న రాజ్‌కుమార్‌కు లోకేశ్ వరుసకు బాబాయి.ఉదయమే గుర్తించాం..విద్యార్థి పాఠశాల నుంచి పారిపోయినట్లు శుక్రవారం ఉదయం గుర్తించాం. రోజూ మాదిరిగానే ఉదయం టిఫిన్ సమయానికి ముందు హాజరు తీసుకుంటాం. ఉదయం రాజ్‌కుమార్ లేకపోవడంతో ఇతర విద్యార్థులను విచారించి పాఠశాల నుంచి పారిపోయినట్లు గుర్తించాం. పేరెంట్స్‌కు సమాచారం అందించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. విద్యార్థి మృతిచెందడం చాలా బాధాకరం.– పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్‌బన్నీ -
మహిళా బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లా ఎనీ్టపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మహిళా బీఎస్ఎఫ్ జవాన్ బల్లా గంగాభవాని (26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ దంతివాడలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. శనివారం రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. గంగాభవాని విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు ఆమె నివాసం ఉండే గదికి చేరుకుని చూశారు. గది తలుపులు వేసి ఉండటంతో వాటిని పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకుని కనిపించారు. రామగుండం ఎన్టీపీసీ సుభాష్ గర్‌లో నివాసం ఉంటున్న బల్ల సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల కుమార్తె గంగాభవానికి 2021లో బీఎస్ఎఫ్లో ఉద్యోగం లభించింది. తొలుత ఆమె పశి్చమబెంగాల్లో పనిచేశారు. ఇటీవల గుజరాత్‌లోని గాం«దీనగర్ దంతివాడకు బదిలీపై వెళ్లారు. గతనెల 5వ తేదీన నుంచి 24వ తేదీ వరకు సెలవుపై రామగుండం వచ్చిన గంగాభవాని.. ఈనెల రెండో తేదీన తిరిగి విధుల్లో చేరారు. అయితే, అక్కడ రోజూ 18 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఆరు గంటలే విశ్రాంతి ఉంటోందని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. ‘అమ్మా.. నాన్న.. ఈ ఉద్యోగం చేయలేను.. ఇక్కడ ఉండలేను’అని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు తెలిసింది. దీంతో ఇబ్బందిగా ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలని చెప్పామని, ఇంతలోనే తమ కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. గంగాభవాని మృతదేహాన్ని ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి కుటుంబసభ్యులు స్వస్థలానికి తీసుకొచ్చారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఘట్కేసర్/రాంగోపాల్‌పేట్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన నరసింహరాజు (39) సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన భారీగా నష్టపోయారు. నారపల్లిలోని తన ఇంటిని విక్రయించినా అప్పులు తీరలేదు.ఎప్పుడూ అప్పుల గురించి ఆయన తీవ్రంగా మథనపడేవారు. అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన నరసింహరాజు ఆదివారం వేకువ జామున తన బైక్‌పై ఘట్కేసర్కు వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి ఘట్కేసర్ హెచ్‌పీసీఎల్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి పడుకున్నారు. గుర్తు తెలియని రైలు పైనుంచి వెళ్లడంతో తల మొండెం వేరయ్యాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని..
మల్యాల(చొప్పదండి): కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తన చావుకు తానే కారణమని తనువు చాలించింది. ‘తాను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు.. నన్ను ఎవరూ ఏమీ అనలేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు. అందుకే వెళ్లిపోతున్నా..’ అంటూ చేతిపై రాసుకుని ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పానుటి భాగ్యలక్ష్మీకి ఇదే మండలం మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో గతనెల 18న వివాహమైంది. అప్పటి నుంచి ఇద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఈనెల 3న భాగ్యలక్ష్మీని తల్లిదండ్రులు పుట్టినింటికి తీసుకొచ్చారు. బుధవారం తల్లిదండ్రులు మల్యాల వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాగ్యలక్ష్మీ బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించారు. సంఘటనపై వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
హైదరాబాద్: ఇద్దరు పిల్లలను చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మృతులను భార్యాభర్తలు వెంకటేష్, వర్షిణి, వారి పిల్లలు విహంత్, రిషికాంత్లుగా గుర్తించారు. వీరి స్వస్థలం మంచిర్యాల. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. -
నేను చనిపోతున్నా..!
చిన్నకోడూరు(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంతం లలిత, భూమయ్య దంపతుల చిన్నకుమారుడు రజనీకాంత్(30) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో రజనీకాంత్‌కు వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో నిర్ణయమైంది. ఆ యువతి వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది నెలల క్రితం సదరు యువతి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె పుట్టిల్లు అయిన ఇబ్రహీంనగర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో యువతి, రజనీకాంత్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. రజనీకాంత్‌కు కుటుంబ సభ్యులు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నిరాకరిస్తున్నాడు. పైగా యువతితో పెళ్లికి అంగీకరించడం లేదు. దీంతో మనస్తాపం చెందిన రజనీకాంత్ శుక్రవారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. తాను చనిపోతున్నానని ఆ యువతికి రజనీకాంత్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అంతా వెతికారు. ఆచూకి లభ్యం కాలేదు. శనివారం రజనీకాంత్ సోదరుడు బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్‌కుమార్ -
ప్రేమ పేరుతో వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు. -
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య
గుంతకల్లు: భార్య వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... పాత గుంతకల్లుకు చెందిన వడ్డె రోహిత్‌కుమార్ (24) బజాజ్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి భర్తను సూటిపోటి మాటలతో లక్ష్మీదేవి మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో లక్ష్మీదేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే తాను పెట్టిన కండీషన్లు ఒప్పుకుంటే కాపురానికి వస్తానని ఆ సమయంలో ఆమె చెబుతూ వచ్చింది. విషయం తెలుసుకున్న రోహిత్‌కుమార్ తల్లిదండ్రులు కోడలి కండీషన్ల మేరకు ఆమె పేరుతో కొంత, బాబు పేరుతో మరికొంత స్థలం రాసిచ్చిన తర్వాత కాపురానికి వచ్చింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం బాబు చనిపోయాడు. ఆ తర్వాత భర్తను వదిలి లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య వేధిస్తున్న విషయంపై ఆరు రోజుల క్రితం గుంతకల్లు రెండో పట్టణ పోలీసులకు రోహిత్ ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ గణేష్ ఇరువురి వాదనలు విన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో తామే పంచాయితీ చేసుకుంటామని బాధితులు తెలపడంతో వారిని అక్కడి నుంచి పంపించేశారు. సమస్య మరింత జఠిలం కావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రోహిత్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనలక్ష్మీదేవిపై చర్య తీసుకోవడంతో పాటు సీఐ గణేష్ అక్కడకు వచ్చి సమాధానం చెప్పాలంటూ శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ప్రధాన రహదారిపై రోహిత్ బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లక్ష్మీదేవి పెట్టిన కండీషన్ల మేరకు 20 సెంట్ల స్థలాన్ని బాబుతో పాటు ఆమె పేరుతో రాసిచ్చినట్లు తెలిపారు. బాబు చనిపోయినప్పుడు లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిందన్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందని, బాబు చనిపోయిన రాత్రే ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు. అప్పటి నుంచి భర్తకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తూ వచ్చిందన్నారు. న్యాయం చేయాలని సీఐ గణేష్‌ను ఆశ్రయిస్తే ఆయన సైతం తమకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు రోహిత్‌ను దుర్భాషలాడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. టూటౌన్ సీఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీసీ రామసుబ్బయ్య అక్కడకు చేరుకుని బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు. దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు. ఇటీవలే బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్‌లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్‌కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Constable: తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖపట్నం: బంగారంలాంటి ఉద్యోగం.. సంతోషకరమైన కుటుంబం.. ఏం కష్టమొచ్చిందో.. తెల్లవారుజామున విధుల్లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ఎల్ రైఫిల్‌ను గుండెకు గురి పెట్టుకుని కాల్చుకున్నాడు. క్షణాల్లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మొత్తం బ్యాంక్‌లోని సీసీ కెమెరాల్లో రిక్డాయింది. కానిస్టేబుల్ ఆత్మహత్య దృశ్యాలు ప్రతీ ఒక్కరి మనసును కలచివేశాయి. విధులు ముగించుకుని ఇంటికొస్తాడనుకున్న భర్త మరణవార్త తెలియడంతో భార్య గుండె పగిలిపోయింది. బ్యాంకులో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తల్లి ఎందుకు రోదిస్తుందో తెలియని వయసులో చిన్నారులు పడిన వేదనను చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాలవలస శంకరరావు(37) విధి నిర్వహణలో ఎస్ఎల్ఆర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. వివరాలివీ.. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశ గ్రామానికి చెందిన పాలవలస శంకరరావు(37) భార్య శ్రావణి, కుమారుడు కిశోర్‌చంద్రదేవ్(6) కుమార్తె జ్ఞానవిత(3)తో కలసి మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన శంకరరావు(3908) స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ద్వారకానగర్‌లో జ్యోతి బుక్ డిపో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 5.55 గంటల సమయంలో తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్‌తో గుండైపె గురి పెట్టుకుని ముందుకు వంగి కాల్చుకున్నారు. ఈ శబ్దం విన్న తోటి ఉద్యోగులు వెంటనే వచ్చే చూసే సరికి శంకరరావు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. మృతి చెందినట్లు గుర్తించిన ఉద్యోగులు వెంటనే అధికారులు సమాచారం ఇచ్చారు. ద్వారకా ఏసీపీ రాంబాబు, సీఐ ఎస్.రమేష్, ఎస్ఐ ధర్మేంద్రతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె పిల్లలతో ఘటనా స్థలం వద్దకు చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భర్త మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరైంది. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. సీఐ ఎస్.రమేష్ సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలే ఆయన ఆత్మహత్య కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుట్టిసా గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమా? సీతమ్మధార: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పాలవలస శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2010లో పోలీస్ ఉద్యోగంలో చేరిన శంకరరావు హైదరాబాద్‌లో పనిచేశాడు. తర్వాత భద్రాచలంలో మూడేళ్లు పనిచేసి.. విశాఖపట్నానికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న శంకరరావు.. క్రికెట్ బెట్టింగ్తో పాటు ఇతర వ్యవహారాల కోసం అప్పులు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే తోటి స్నేహితుడు వద్ద రూ.3.5 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. విజయగనరం జిల్లా వంగర మండలం కుట్టిశలో శంకరరావు దహన సంస్కారాలు పూర్తయ్యాయి. అతని అంత్యక్రియల కోసం పోలీస్ అధికారులు రూ.20 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. -
HYD: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన వినయ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య -
మార్కులు తక్కువ వచ్చాయని...
గచ్చిబౌలి: పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యారి్థని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సురేంద్రరెడ్డి మణికొండ పంచవటి కాలనీలో నివాసముంటున్నారు. కుమార్తె మనస్విని నెక్నాంపూర్‌లోని బ్లూమ్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఇటీవలి పరీక్షల్లో మనస్వినికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తల్లి శ్రీలక్ష్మి మందలించింది. దీంతో మనోవేదనకు గురైన మనస్విని ఇంట్లోని వారంతా నిద్రపోయిన తర్వాత అర్దరాత్రి ఒంటి గంట సమయంలో బయటకు వచ్చి తాము నివాసముండే అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అలికిడితో మేల్కొన్న తల్లిదండ్రులు, తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పరిశీలించి స్పష్టం చేశారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఏమన్నారంటే.. 11గంటల 15 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది 2013బ్యాచ్ కి చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను కాల్చి, తనను తాను కాల్చుకొని మరణించాడు కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది ఆన్ డ్యూటీ లో ఉండగా ఈ ఘటన జరిగింది నరేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాం మృతుల వివరాలు ఆకుల నరేష్, కానిస్టేబుల్, వయస్సు 35 సంవత్సరాలు, ARPC 2735, ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆకుల చైతన్య, నరేష్ భార్య, వయస్సు 30 సంవత్సరాలు ఆకుల రేవంత్, వయస్సు 6 సంవత్సరాలు, 1st క్లాస్ విద్యార్థి ఆకుల రిషిత, వయస్సు 5 సంవత్సరాలు, UKG విద్యార్థిని ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో పడి నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. గాయత్రినగర్‌లో ఉండే కన్నయ్యకుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన ఎన్నికలు అఫిడవిట్ సైతం సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. చదవండి: వారసులకు ‘హోం’ సిక్ -
ఎలుకల మందు తాగి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
చిక్కడపల్లి: అనారోగ్య కారణాలతో ఎలుకల మందు తాగి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దోమలగూడ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం రాత్రి తెల్పిన వివరాల మేరకు..హిమాయత్‌నగర్‌లోని వెలమ హాస్టల్లో ఉంటున్న జగిత్యాల జిల్లా మహాలక్ష్మినగర్‌కు చెందిన లింగారావు కుమారుడు దొనకంటి సాయిరాం (32) శనివారం రాత్రి 11 గంటలకు ఎలుకల మందు తాగి పడిపోయాడు. హాస్టల్లో ఉంటున్న స్నేహితులు, సిబ్బంది వెంటనే హైదర్‌గూడలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సాయిరాం చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు చనిపోయాడు. ఆయన శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుప్రతికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం సాయిరాం శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సాయిరాం అనారోగ్యం, ఇతర మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. -
ఐదు కుటుంబాల్లో విషాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా వివిధ కారణాలతో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన మృతి చెందిన ఘటనలు బుధవారం కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ పరిధిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో.. హెచ్‌బీకాలనీ, వెంకటేశ్వరనగర్ కాలనీలో నివసించే శాంతం భాగ్యమ్మ(48) ఇళ్లలో పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. గత నెల 19న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చీరకు అంటుకున్నాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ కలహాలతో గృహిణి.. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ గోదావరికి చెందిన శ్రీకాంత్, హైమగంగా భవానీ దంపతులు 3 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి రెండు సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల నడుమ గొడవ జరిగింది. మనస్థాపం చెందిన భవాని భర్త నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందింది. ప్రేమ విఫలమై.. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్‌బీకాలనీలో చోటుచేసుకుంది. ఎల్‌ఐజీకి చెందిన విద్యార్థి హబ్సీగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమ విఫలమైందన్న కారణంతో ఇంటో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఆర్థిక ఇబ్బందులతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. జార్ఖాండ్‌కు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ దినేష్ దాస్ రెండు సంవత్సరాల క్రితం బదిలీపై నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎఫ్సీకి వచ్చాడు. భార్యతో కలిసి ఎన్ఎఫ్సీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. సంతానం లేరు. అప్పుల బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందినట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య ఉప్పల్: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ హనుమసాయినగర్‌లో నివాసముండే శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అన్విత్‌రెడ్డి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు. రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది. దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
35వ అంతస్తు నుంచి దూకి.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: చదువులో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నానంటూ 35వ అంతస్తు పై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజలో హెచ్ టవర్ 6వ అంతస్తులోని ఫ్లాట్‌నంబర్ 604లో ఎం.సురేష్ కుమార్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ముంబైలో ఓ కంపెనీలో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం మై హోం భూజకు మకాం మార్చారు. ఆయన భార్య స్వరూప ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుండగా సురేష్ కుమార్ ముంబైలో ఉంటున్నారు. వారాంతాల్లో ఆయన నగరానికి వచి్చపోతుంటారు. ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తర గతి చదివే పెద్ద కొడుకు ఎం.రియాన్‡్ష రెడ్డి(14) సోమవారం సాయంత్రం 7.45 గంటలకు వ్యక్తి గత కారణాలతో చనిపోతున్నానంటూ తల్లి స్వరూప ఫోన్‌కు మెసేజ్ చేసి ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లాడు. మెసేజ్ చూసుకున్న ఆమె అపార్ట్మెంట్లో గాలించినా, స్నేహితులను ఆరా తీసినా రియాన్‡్ష ఆచూకీ లభ్యం కాలేదు. కుమారుడు కనిపించడంలేదంటూ ఫిర్యాదు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు రియాన్‡్ష కనిపించడం లేదని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అపార్ట్మెంట్లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ల సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా రియాన్‡్ష ఆచూకీ తెలియరాలేదు. దీంతో అపార్ట్‌లోని అన్నిచోట్లా గాలించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో జె బ్లాక్‌లోని గేట్ వద్ద మెట్ల మధ్యలో ఉన్న డక్లో రియాన్‡్ష మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో రియాన్‡్ష మృతదేహం కనిపించింది. హెచ్ బ్లాక్ నుంచి జే బ్లాక్ వెళ్లిన రియాన్‡్ష 35వ అంతస్తు నుంచి డెక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. రియాన్‡్ష కనిపించడం లేదని భార్య సమాచారం ఇవ్వడంతో సురేష్ కుమార్ రెడ్డి హుటాహుటిన నగరానికి వచ్చారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత (చదువుల్లో) ఒత్తిడితోనే రియాన్‡్ష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
వైఎస్సార్: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ అర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఎన్.గంగరామ్ (21) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. లింగాల మండలం తేర్నాంపల్లి గ్రామానికి చెందిన ఎన్.గంగాధర్, నారాయణమ్మ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎన్.గంగరామ్ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడు గౌరిశంకర్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానంతరం తోటి విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా.. గంగరామ్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఉండి, ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 గంటల ప్రాంతంలో పక్కగదిలో ఉన్న విద్యార్థి తలుపు తట్టగా ఎంతసేపటికీ పలకకపోవడంతో వెనుక ఉన్న కిటికీ నుంచి తొంగిచూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు తెలియజేశారు. పోలీసులు, ట్రిపుల్ ఐటీ అధికారులు, డైరెక్టర్ సంధ్యారాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కి వేలాడుతున్న గంగారామ్‌ను కిందికి దించి ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్‌తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
అప్పుల భాదతో ఐటీ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, చైన్నె: కరోనా రూపంలో ఎదురైన కష్టాలతో అప్పుల పాలైన ఐటీ ఉద్యోగి తన తల్లిదండ్రులకు, భార్య, కుమారుడితో విషపు మాత్రలను మింగిచ్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన తల్లి ఇంటిలోని దృశ్యాలను చూసి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు తరలి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సేలం జిల్లా గోరిమేడు న్యాయ కళాశాల సమీపంలోని ఎంజీఆర్ నగర్లో శివరామన్(85), వసంత(56) దంపతుల కుటుంబం నివాసం ఉంటోంది. శివరామన్ బెంగళూరు విమానాశ్రయంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ దంపతులకు చంద్ర(40), తిలక్(38) కుమారులు. చంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తిలక్ చైన్నెలోని ఓ ఐటీ సంస్థలో పనిచేసేవాడు. తిలక్‌కు భార్య మహేశ్వరి(35), సాయి కిషోర్ ప్రశాంత్(6) కుమారుడు ఉన్నారు. కరోనా పరిస్థితుల అనంతరం తిలక్‌కు వర్క్ ఫ్రం హోం విధులను కేటాయించారు. జీతం తగ్గడంతో పాటు మాటలు రాని స్థితిలో ఉన్న తన కుమారుడికి వైద్య చికిత్స తిలక్‌కు భారంగా మారింది. దీంతో పలు చోట్ల అప్పులు చేశాడు. అందరికీ విషం ఇచ్చి.. మంగళవారం సాయంత్రం భార్య మహేశ్వరితో కలిసి తిలక్ మార్కెట్‌కు వెళ్లాడు. వారికి కావాల్సిన వస్తువులను కొని తెచ్చాడు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసి మరీ తెప్పించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఇంట్లో నుంచి వసంత పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పరుగులు తీశారు. ఓ గదిలో నురగలు కక్కిన స్థితిలో శివరామన్, మరో గదిలో మహేశ్వరి, సాయి కిషోర్ పడి ఉండటం, అదే గదిలో తిలక్ ఉరివేసుకుని వేలాడుతుండంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలన్నీ చూసిన వసంత స్పహ తప్పింది. ఆమెను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ ఇంట్లో ఆంగ్లంలో తిలక్ రాసి పెట్టిన లేఖబయట పడింది. వర్క్‌ఫ్రం హోం రూపంలో ఎదురైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి ఆరోగ్య పరిస్థితి, అప్పుల భారం పెరగడం వెరసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల తో నిద్ర మాత్రలుగా పేర్కొంటూ, విషపు మాత్రలను మింగిచ్చినట్లు అందులో వివరించాడు. భార్యకు ఆహారంతో పాటు, కుమారుడికి యథా ప్రకారం ఇచ్చే మాత్రలతో కలిపి విషపు మాత్రలను మింగిచ్చినట్లు పేర్కొన్నారు. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న పెద్దకుమారుడు చంద్రకు సమాచారం అందించారు. -
నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్‌గా పనిచేస్తోంది. అయితే కాలేజీ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్‌లో భవాని నెల క్రితమే హాస్టల్ వార్డెన్‌గా చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. ఒరియా భాషలో రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు విషయంలో ఒత్తిడికి గురి కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి... -
పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య
తమిళనాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కాని నూరేళ్ల బంధం పది రోజులకే ముగిసింది. నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పళ్లిపట్టు యూనియన్ రామసముద్రం పంచాయతీ వీజీఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన రవి కుమారుడు ముత్తు(25) జేసీబీ డ్రైవర్. ఇతనికి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేంద్రన్ కుమార్తె అను(22)తో జూన్ 29న గ్రామంలోని వరుడు ఇంట్లో వివాహం జరిగింది. పది రోజుల వ్యవధిలో ఏం జరిగిందో కానీ మంగళవారం రాత్రి భర్త నిద్రిస్తున్న గదిలో అను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేకువజామున లేచిన ముత్తు భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. పొదటూరుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహమైన పది రోజులకే నవవధువు ఆత్మహత్యకు సంబందించి తిరుత్తణి ఆర్డీఓ విచారణ చేపట్టారు. -
నవ వధువు ఆత్మహత్య.. పెళ్లయిన కొన్ని రోజులకే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పోటి మాటలు భరించలేక కవిత తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త.. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం: మండలంలోని హంసరాళి పంచాయతీ కొయిటాసాయి గ్రామానికి చెందిన సవర ఢిల్లేశ్వరి(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పెరట్లో గల మామిడిచెట్టుకు ఉరి వేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక గిరిజనులు హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఢిల్లేశ్వరి మరణించినట్టు వైద్యులు చెప్పారు. కుటుంబ వివాదాల కారణంగానే ఢిల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు. మృతురాలి తల్లి సవర వాణిశ్రీ ఫిర్యాదు మేరకు మందస ఎస్ఐ ఎనుకోటి రవికుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హరిపురం సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. పెద్ద కుమార్తెకు వివాహం చేసిన ఢిల్లేశ్వరి తల్లిదండ్రులు హరికృష్ణ, వాణిశ్రీలు చిన్న కుమార్తెను చదివించి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు. ఇంతలో ఆత్మహత్య చేసుకోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
వైఎస్సార్ : మండలంలోని పల్లవోలు గ్రామంలో బద్రిపల్లె సురేఖ(24) అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మైనుద్దీన్ తెలిపారు. పల్లవోలుకు చెందిన సుబ్బరాయుడు, సావిత్రి దంపతుల కుమార్తె సురేఖ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడుతుండేది. మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాలని తన తల్లి సావిత్రితో తెలిపింది. డ్వాక్రా పని మీద చాపాడుకు వెళ్లిన సావిత్రి ఇంటికి తిరిగి రాగా తలుపులు మూసి ఉన్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో పగులగొట్టి చూడగా సురేఖ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె, పల్లావరంలోని పమ్మల్ వఉసి నగర్‌కు చెందిన పసిలెత్తాతూన్ గ్రాడ్యుయేట్(30). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన జమీల్ అహ్మద్ (36)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. శుక్రవారం రాత్రి పసిలెత్తాతూన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కూతురు మృతిపై పసిలెత్తాతూన్ తల్లి హసీనా అనుమానం వ్యక్తం చేసింది. శంకర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో పసిలెత్తాతూన్కు ఐదు నెలల క్రితం 2వ కాన్పులో కూడా కుమార్తె పుట్టడంతో ఆమె భర్త జమీల్ అహ్మద్, అత్త షకీలా ఆమెను రోజూ తీవ్రంగా కొట్టి హింసించారని ఆరోపించారు. అలాగే జమీల్ అహ్మద్ తీసుకున్న రూ.20 లక్షల అప్పును తీర్చేందుకు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించారని వాపోయారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
కర్నూలు: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పురిమెట్ల సాయిప్రసాద్ (25) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశులు, సీతమ్మ కుమారుడైన సాయిప్రసాద్ బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా పనిఒత్తిడి భరించలేకపోతున్నానని, కంపెనీ మారాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి.. తిరిగి వెంటనే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
లండన్‌లో వరంగల్ విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్: లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న నగరానికి చెందిన బసవరాజ్ శ్రావణి(27) ఈ నెల 10న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆమె మృతదేహం గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని బంధువులు తెలిపారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ విజయ రమేష్ దంపతుల కూతురు శ్రావణి ఉన్నత విద్య నిమిత్తం లండన్ వెళ్లింది. తండ్రి వృత్తిరీత్యా లారీడ్రైవర్, తల్లి గృహిణి. తమ ఉన్నత చదువుల కోసం సొంత ఇంటిని అమ్మిన ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బంధువులు తెలిపారు. లండన్‌లోని వరంగల్ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల, ఉమెన్ వింగ్ సెక్రెటరీ మేరీఏలు ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి మృతదేహాన్ని భారతదేశానికి పంపించినట్లు పేర్కొన్నారు. శ్రావణి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసినట్లు తెలిసింది. -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం.. మృతదేహం దొరికితే కాల్చేయాలని
ప్రకాశం: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న గణిత ఉపాధ్యాయుడు రాజారపు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనం రేపింది. తనకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడం, మరో వైపు అప్పులిచ్చిన వ్యక్తులు వెంటాడటంతో మార్కాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతదేహం దొరికితే కాల్చివేయాలని లేఖ రాసి స్నేహితుల గ్రూపులో సోమవారం వేకువజామున పోస్టు చేశాడు. తన ఫొటో, మాస్టర్ కార్డు, ముఖ్యమైన వారి ఫోన్ నంబర్లు, సూసైడ్‌నోట్, చెప్పులు చెరువు గట్టుపై ఆకుపచ్చ సంచిలో ఉంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కాగా ఉదయం 7 గంటలకు లేఖను చూసిన పలువురు పోలీసులకు సమాచారం అందించి చెరువు కట్ట దగ్గరకు వెళ్లారు. అక్కడ చెప్పులు, సంచి లభ్యమయ్యాయి. ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. సమీపంలోని ప్రాంతాలను జల్లెడ పట్టగా డ్రైవర్స్ కాలనీ వద్ద లక్ష్మయ్య ఆచూకీ లభించిందని సీఐ భీమానాయక్ తెలిపారు. తన ఇంటికి చేర్చి సైలెన్ బాటిల్ ఎక్కించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
యువకుడితో ప్రేమ వ్యవహారమే కారణమా
నిజామాబాద్: ఇందల్వాయి గ్రామానికి చెందిన గుండాల అశ్మిత(18) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. అశ్మిత ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. ఇంట్లో వారు గమనించి చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించగా ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా అశ్మిత తండ్రి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
నెల్లూరు సిటీ: ‘అతను ఓ టీవీ షోలో డ్యాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. మంచి పేరు వచ్చింది. కానీ సంపాదనలో మాత్రం వెనుకబడ్డాడు. కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమి చేయలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను ఆత్మహత్యే శరణ్యం అనుకుని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.’ ఆదివారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళేనికి చెందిన సుబ్బారావు, లక్ష్మి రాజ్యం దంపతులకు సి.చైతన్య (31), వినీల అనే పిల్లలున్నారు. చైతన్య హైదరాబాద్‌లో ఉంటూ ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అనంతరం నగరంలోని దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్లో గది తీసుకున్నాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ‘అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్ యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివలేదు. చెల్లీ ఫీల్ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అని ఆ వీడియోలో ఉంది. కాగా చైతన్య స్నేహితులు వీడియో చూసి నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు చైతన్య ఉంటున్న గది వద్దకు చేరుకుని తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరేసుకుని ఉన్నాడు. దీంతో ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రికి పోలీసులు సమాచారం అందించారు. మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్ మాస్టర్‌కు మంచి పేరు ఉంది. పలు సినిమాల్లో ఆయన పనిచేశారు. కాగా రాజేష్ మాస్టర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ మాస్టర్ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. -
తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు..
వైఎస్సార్: కురబలకోట మండలం అంగళ్లులోని ఓ కళాశాలలో సీఎస్ఈ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మధు (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన కుడుం ఉత్తన్న కుమారుడు మధు చదువుల్లో మేటి. పదిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ఇంటర్లో కూడా రాణించాడు. అంగళ్లులోని ఓ కళాశాలలో ఇతనికి సీఎస్ఈలో ఫ్రీ సీటు వచ్చింది. తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సహ విద్యార్థులతో బాగా కలసిపోయే వాడు. అంగళ్లులో రూము అద్దెకు తీసుకుని కళాశాలకు రాకపోకలు సాగించేవాడు. ఈనేపథ్యంలో ఈనెల 12న సాయంత్రం నుంచి కన్పించకుండా పోయాడు. రూముకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా చుట్టుపక్కల విచారించారు. సెల్ ఫోన్ కూడా రూములో వదిలి వెళ్లాడు. ఇతని ఆచూకీ కోసం కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. ఎక్కడైనా ఉంటాడులే అని భావి స్తూ వచ్చారు. మంగళవారం ఉదయం అంగళ్లులోని తుమ్మచెట్లపల్లె వద్ద ఉన్న కోల్డ్‌స్టోరేజీ వెనుక వైపు ప్రాంతంలో దుర్వాసన రాసాగింది. స్థానికులు పరిశీలించి చూడగా కుళ్లిన స్థితిలో శవం కన్పించింది. మృతుడి దుస్తులు, చెప్పుల ఆధారంగా అదృశ్యమైన మధుగా గుర్తించారు. పక్కన టమాటా పంట వద్ద ఉన్న డ్రిప్ వైరుతో ఇతను చెట్టుకు ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి స్పష్టమవుతోంది. ముట్టుకుంటే ఊడిపోయే పరిస్థితి కావడంతో డాక్టర్లు మంగళవారం సంఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఎందుకురా ఇలా చేశావ్.. ఇదిలా ఉండగా మధుకు తెలివైన విద్యార్థిగా పేరుంది. ఎవ్వరితో ఎలాంటి విబేధాలు లేవు. ఆర్థిక సమస్యతో స్నేహితులను ఇటీవల డబ్బు ఆడిగినట్లు చెబుతున్నారు. దీనికి తోడు అంగళ్లుకు చెందిన మరొకరికి బాకీ ఉన్నట్లు సమాచారం. కొత్త అప్పు పుట్టక మరో వైపు చేసిన అప్పు తీరే మార్గం కన్పించక మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితులు మాత్రం ఎందుకురా ఇంత పని చేశావని సంఘటన స్థలంలో కంట తడిపెట్టడం చూపరులను కలిచివేసింది. తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు.. మన కుటుంబంలో ఒక్కరూ చదువుకున్న వారు లేరు.. నువ్వన్నా ప్రయోజకుడవు అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకున్నా లేకున్నా.. కష్టపడి చదివిస్తున్నాం కదరా.. ఎందుకిలా చేశావురా.. అంటూ మధు అన్నయ్య బోరున విలపించాడు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ శివాంజనేయులు తెలిపారు. ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్‌లు లేదా రుణ యాప్‌లు ఏమైనా ఈ సంఘటనకు దారి తీశాయా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
నటి ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తల్లి
ప్రముఖ ఒడిశా నటి, సింగర్ రుచిస్మిత గురు ఆత్మహత్య కేసు కలకం రేపుతోంది. పలు ఆల్భమ్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన రుచిస్మిత ఆత్మహత్య కేసులో ఆమె తల్లి ట్విస్ట్ ఇచ్చింది. 'సూసైడ్‌కు ముందు తన కూతురు పరోటా విషయంలో గొడవ పడిందని చెప్పింది. ఆదివారం రాత్రి 8గంటలకు పరోటా చేయమంది. కానీ నేను 10 గంటలకు చేస్తానని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో రుచిస్మిత తన రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో కూడా పలుమార్లు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది' అంటూ రుచిస్మిత తల్లి ఆరోపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది నిజంగా ఆత్మహత్యనా లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్: కల చెదిరె..కడుపుకోత మిగిలే!
స్టెత్ వేసుకోవాల్సిన వాడు... మెడకు తాడు బిగించుకున్నాడు ఆస్పత్రిలో ఉండాల్సిన వాడు మార్చురీలో పడుకున్నాడు తెల్లకోటులో ఉండాల్సిన వాడు.. తెల్లగుడ్డలో దూరిపోయాడు అల్లారుముద్దుగా పెంచితే అందనంత దూరం పోయాడు తండ్రి పోగుపోగునూ కలుపుతూ బంధం అల్లుతుంటే తనేమో బంధం తెంపుకుని వెళ్లిపోయాడు గాయానికి కట్టుకట్టాల్సిన వాడు... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు జీవితమనే పరీక్షలో ఫెయిలై ఉరితాడుకు వేలాడాడు ధర్మవరం అర్బన్: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధర్మవరం పట్టణం తారకరామాపురంలో బుధవారం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తారకరామాపురానికి చెందిన రామాంజనేయులు, రాజమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించే రామాంజనేయులు ఆడ పిల్లలిద్దరికీ వివాహాలు జరిపించాడు. చిన్న కుమారుడైన ముక్తాపురం నవీన్‌కుమార్ (23)ను వైద్యుడిగా చూడాలని కలలు కనేవాడు. ఈక్రమంలోనే ఖర్చుకు వెనకాడకుండా కుమారుడిని చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే ఇంటర్, నీట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీన్ని నవీన్‌కుమార్ అవమానంగా భావించాడు. తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పలేక మదనపడ్డాడు. ఉగాది పండుగ నేపథ్యంలో మంగళవారం ధర్మవరానికి వచ్చిన నవీన్‌కుమార్...రాత్రి తల్లిదండ్రులతో కులాసాగా కబుర్లు చెప్పాడు. అనంతరం తండ్రి రామాంజనేయులు వద్దే పడుకున్న నవీన్‌కుమార్... అందరూ నిద్రపోయాక ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులోని ఇనుపరాడ్డుకు ఉరివేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన తండ్రి పక్కలో ఉండాల్సిన కుమారుడు కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూశాడు. అప్పటికే కసువు ఊడ్చేందుకు షెడ్డులోకి వెళ్లిన రాజమ్మ ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో రామాంజనేయులు కూడా పరుగున వెళ్లి ఇరుగూ పొరుగు సాయంతో కుమారుడిని కిందకు దించి చూడగా, అప్పటికే నవీన్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. వైద్యుడిగా చూడాలన్న కలను... కల్లలు చేసి వెళ్లిపోయావా అంటూ రామాంజనేయులు ఏడుస్తుంటే అతన్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న టూటౌన్ ఏఎస్ఐ డోణాసింగ్, జమేదార్ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉగాది రోజున ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొంతకాలంగా దూరం.. వేరొకరి బైక్‌పై వెళ్లిన ప్రియురాలు.. తట్టుకోలేక
గుడివాడరూరల్: ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ పట్టణంలోని మార్వాడీ సెంటర్‌కు చెందిన శైలేష్‌సింగ్ (26) తన తండ్రి వావర్‌సింగ్ గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా నిర్వహిస్తున్న టీస్టాల్లో తండ్రికి సహాయంగా పని చేస్తున్నాడు. తమ ప్రాంతంలోని ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. కొంత కాలంగా ఆమె శైలేష్‌సింగ్‌ను దూరంపెడుతోంది. ఇటీవల ఆ యువతి వేరే యువకుడి బైక్‌పై వెళ్తూ కనిపించింది. దీంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్ ఆదివారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే యువకుడికి శరీరంపై 80 శాతం మేర తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్ సిబ్బంది గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శైలేష్‌సింగ్ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వావర్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా టూటౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, వరంగల్: హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. చదవండి: అందం ఆమె పాలిట శాపమైంది -
పిల్లలకోసం వేధింపులు
ఆదిలాబాద్: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్‌లో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన దర్వాజల లచ్చన్న, భాగ్య దంపతుల కుమార్తె శ్రీలత(25)కు తాండూర్‌కు చెందిన పెద్దబోయిన మహేందర్‌తో 2021లో వివాహమైంది. ఆదివారం ఉదయం అత్తగారింటి నుంచి వెళ్లిన శ్రీలత తాండూర్ పాత గోదాంల సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు. కాగా తన కూతుర్ని భర్త మహేందర్, అత్త గౌరక్క, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకురావాలని, పిల్లలు కావడంలేదని మానసికంగా వేధించేవారని ఆరోపించారు. అత్తింటి వారే చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం పోయిందని ఆత్మహత్య
నిజామాబాద్: ఉద్యోగం పోవడంతో చేసిన అప్పు లు తీర్చలేక మనోవేదనకు గురై ఒకరు ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గాంధారికి చెందిన వడ్ల శ్రీకాంత్ (35) ఓ కంపెనీలో మెడికల్ రిప్రెజెంటివ్‌గా పనిచేస్తూ దేవునిపల్లిల్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ ఇటీవల ఓ బ్యాంక్‌లో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. బయట కూడా కొన్ని అప్పులు చేసినట్లు తెలిసింది. 3 నెలల క్రితం ఉద్యోగం పోయింది. దీంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు తప్పలేదు. అప్పుల విషయంలో పలుసార్లు భార్యా, భర్తల మధ్య గొడవలు జరిగాయి. హోళీ పండగ రోజున అతని భార్య, పిలల్లతో కలిసి అత్తగారింటికి లింగంపేట మండలం దేమె గ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు ఒక్కడే దేవునిపల్లికి వచ్చాడు. శనివారం ఉదయం అతని భార్య మౌనిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీకాంత్ ఎత్తకపోవడంతో దేమె నుంచి దేవునిపల్లి ఇంటికి వచ్చి చూసింది. అప్పటికే శ్రీకాంత్ హాల్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మన్ననూరులో ఉద్రిక్తత
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. మానసిక వేదనే నిఖిత సూసైడ్‌కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు -
వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
సాక్షి, వరంగల్ జిల్లా: నగరంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనిక.. వరంగల్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త హత్య చేసి ఉరి వేసుకున్నట్లు సృష్టిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో మట్టవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. చదవండి: ఎస్ఐ నా భార్యా పిల్లలను దూరం చేశారు.. సెల్ఫీ సూసైడ్ కలకలం.. -
బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో సూసైడ్ నోట్, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’ -
ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ బలవన్మరణం
విశాఖపట్నం: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివీ.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసముండేవారు. ఏఆర్‌లో కానిస్టేబుల్ అయిన నరేష్ ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్ వచ్చేశారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్లో చేర్చించారు. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆమె ప్రస్తుతం ఆరిలోవలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంతసేపటికి తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కుమార్తె ఏడుస్తూ సెల్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే ఎంవీపీకాలనీలోని బంధువులు, గాజువాకలో ఉన్న అలేఖ్య తల్లి, బంధువులు ఆరిలోవ చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా.. భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అలేఖ్య తల్లి భవాని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకున్నారు. సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..
తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందాడనే ఆవేదనతో ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో నెలకొంది. వివరాలు.. కోవిల్‌పతాగై ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె వినోదిని(22). ఈమె అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ముత్తాపుదుపేట సమీపంలోని కరిమేడు ప్రాంతానికి చెందిన వసంత్(23)ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వసంత్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వినోదిని శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కైవసం చేసుకున్న ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కీళ్పాక్కం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
మేనమామ వేధింపులే కారణం..!
నిజామాబాద్ : మేనమామ వేధింపుల కారణంగానే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభిజ్ఞగౌడ్(23) ఆత్మహత్య చేసుకుంది. తనకు వరుసకు మేనమామ అయిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన సందీప్‌గౌడ్ మానసికంగా వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. తాటిపాముల కిరణ్ కుమార్‌గౌడ్, స్వప్నల కుమార్తె అభిజ్ఞగౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తు తం ఆమె కామారెడ్డిలో స్థిరపడిన తల్లిదండ్రుల వద్ద ఉంటూ వర్క్‌ఫ్రం హోమ్‌గా విధులు నిర్వహించేది. అభిజ్ఞ కామారెడ్డి లోని ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మేనమామ మానసిక వేధింపులు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయానని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి నుంచి భిక్కనూరుకు శుక్రవారం తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. -
మేడ్చల్: పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
విశాఖలో దారుణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సింహాచలం(విశాఖపట్నం): సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య(26)కి, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు. గిరిప్రసాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు. చదవండి: నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని ఉంది. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్ఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నారు. -
వర్క్ ఫ్రం హోం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌కు చెందిన కాడ్రా కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కాడ్రా అశోక్ (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. అయితే పని ఒత్తిడి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత! -
హృదయ విదారక ఘటన.. కన్న బిడ్డల్ని హత్య చేసి..
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా): కన్న బిడ్డల్ని గొడ్డలితో నరికి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నక్కలదిన్నె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (47) పురుగు మందుల కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య తులసమ్మ, కుమారుడు అభితేజారెడ్డి, కుమార్తె పావని ఉన్నారు. నరసింహారెడ్డి మానసిక ఆరోగ్య సమస్య వల్ల పనికి వెళ్లడం లేదు. ఐదు నెలల క్రితం అతనికి పిత్తాశయానికి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. శుక్రవారం అర్దరాత్రి పురుగుల మందు తాగిన నరసింహారెడ్డి భార్య పడుకున్న గది తలుపునకు చిలుకు పెట్టాడు. చదవండి: ఇంతకీ ఏమిటా కుక్కుట శాస్త్రం.. అది ఏం చెబుతోంది? కొంత సేపటి తర్వాత ఇంట్లో గొడ్డలి తీసుకుని ముందుగా నిద్రిస్తున్న కుమారుడు అభితేజరెడ్డి తలపై బలంగా కొట్టడంతో రక్తపు మడుగులో కుప్పకూలి పోయాడు. తర్వాత కుమార్తె పావనిపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పిల్లలను, పురుగుమందు తాగిన నరసింహారెడ్డిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు నరసింహారెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. అభితేజరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తన భర్త మానసిక స్థితి సరిగా లేక పిల్లలపై దాడి చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య తులశమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్ నిర్ణయం
దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె, ప్రవీణ్‌కుమార్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్(24) అప్పుడప్పుడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత.. -
డిగ్రీ విద్యార్థిని షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగింది?
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట) ఎన్టీఆర్ జిల్లా: గడ్డి మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సుబ్బాయిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సుబ్బాయిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి హరీష(20) నందిగామ లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేక కళాశాలకు సక్రమంగా వెళ్లటం లేదు. కళాశాలకు వెళ్లటం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన హరీష ఈ నెల ఒకటో తేదీన గడ్డి మందు తాగింది. ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు తొలుత నందిగామ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందున్న ఆమె పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా.. -
బతికుండగానే తండ్రికి నరకం చూపిన 'పల్లె' ముఖ్య అనుచరుడు
పున్నామనరకం నుంచి తప్పించువాడు పుత్రుడంటారు. కానీ ఊరందరికీ నీతులు చెప్పే ఓ పచ్చనేత తండ్రికి మాత్రం బతికుండగానే నరకం చూపించాడు. వేళకింత భోజనం కూడా పెట్టకుండా వేధించాడు. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ కూడా లాగేసుకునే కుమారుడు.. తనను తీవ్రంగా వేధించడాన్ని భరించలేని ఆ 67 ఏళ్ల వృద్ధుడు పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లికి చెందిన గుట్లపల్లి అంజినప్ప (67)కు ఒక్కగానొక్క సంతానం గుట్లపల్లి గంగాధర్. అంజినప్ప భార్య 15 ఏళ్ల క్రితమే మరణించగా...కుమారుడి వద్దే కాలం గడుపుతున్నాడు. పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అనుచరుడైన గంగాధర్ ఆస్తి అంతా రాయించుకుని తండ్రి బాగోగులు పూర్తిగా విస్మరించాడు. కనీసం వేళకింత భోజనం కూడా పెట్టేవాడు కాదు. చివరకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ డబ్బు కూడా లాగేసుకునేవాడు. దీంతో అంజినప్ప వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాడు. ఇటీవల కుమారుడు ఈసడింపులు ఎక్కువకావడంతో మనోవేదనకు గురైన అంజినప్ప బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైకెక్కి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీన్ని సాధారణ మరణంగా చిత్రీకరించిన గంగాధర్... గుట్టు చప్పుడు కాకుండా తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవరణలో ఉంచాడు. దీన్ని చుట్టుప్రక్కల వారు గమనించడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ విషయంపై అర్బన్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని వివరణ కోరగా... సంఘటన గురించి తమకూ తెలిసిందని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపుతామన్నారు. -
మరో మహిళతో టీచర్ అక్రమ సంబంధం.. చివరికి భార్య షాకింగ్ నిర్ణయం
తిరువొత్తియూరు(తమిళనాడు): భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో జరిగింది. మధురవాయల్ గంగై అమ్మన్ ఆలయ వీధికి చెందిన రాజా (33) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య కళై సెల్వి (28). వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు ధరనీశ్వరన్ (1) ఉన్నాడు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా వంట గదిలో కళై సెల్వి ఉరి వేసుకుని మృతిచెంది కనిపించింది. మధురవాయల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో రాజా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి.. -
పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, వరంగల్(శాయంపేట): తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పరువుతీశారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మాజీ సర్పంచ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అతని మృతికి పీఏసీఎస్ చైర్మన్ దంపతులే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన భూతాల సురేష్ (40) పత్తి, మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం శాయంపేట గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ వద్ద 5నెలల క్రితం రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో శాయంపేటలోని తన రెండు అంతస్తుల భవనాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడానికి డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు. 20 రోజులనుంచి తన అప్పు చెల్లించాలని శరత్.. తరచూ సురేష్ ఇంటికి వెళ్లి దూషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శరత్.. సురేష్‌ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పత్రాలు ఇవ్వాలని మూడు గంటలపాటు నిర్బంధించాడు. విషయాన్ని సురేష్ ఫోన్లో తన మిత్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ అప్పగించి అతన్ని తీసుకెళ్లారు. ఈ నెల 16న సురేష్ శాయంపేటలోని తన ఇంటికి అమ్మకానికి బోర్డు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరత్ అతని భార్య రమాదేవి ఈ నెల 19న సురేష్ ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి ముందు అప్పు విషయంలో దుర్భాషలాడుతూ సురేష్‌పై దాడి చేశారు. అవమానాన్ని భరించలేక సురేష్ అదేరోజు సాయంత్రం కొత్తగట్టుసింగారం శివారు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చైర్మన్ దంపతుల వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పుగా తీసుకున్న రూ. 20లక్షలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడం, ఇంటి ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వాలని నిర్బంధించడం, కాలనీవాసుల ముందే పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ దంపతులు దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెంది తన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కుసుమ శరత్, భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. రోడ్డుపై ధర్నా .. పీఏసీఎస్ చైర్మన్, అతని భార్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సాయంత్రం నాలుగు గంటల నుంచి పత్తిపాక–శాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, సురేష్ మృతిపై బంధువులు చేసిన ఆరోపణలపై పీఏసీఎస్ చైర్మన్ శరత్‌ను వివరణ కోరేందుకు ఎంతసేపు ప్రయత్నించినా స్పందించలేదు. -
‘మీ కుమారుడు మా స్కూల్లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’
అనంతపురం: తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలు భరించలేకే తన కుమారుడు ఉరి వేసుకుని చనిపోయాడని ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ రెండో కుమారుడు హరికృష్ణ(13) అనంతపురంలోని రామన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా ఈ పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. హరికృష్ణ బుధవారం రాత్రి స్కూల్ నుంచి ముద్దలాపురంలోని తమ ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూడేరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. చిత్రహింసలకు గురిచేశారు...అవమానించారు తన కుమారుడు హరికృష్ణపై రామన్ స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని, చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని విద్యార్థి తండ్రి గొల్ల రమేష్ కూడేరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తమ కుమారుడిని రామాంజనేయులు విపరీతంగా కొట్టారని తెలిపారు. అనంతరం 6301824064 సెల్ నంబర్ నుంచి తమకు ఫోన్ చేసి ‘మీ కుమారుడు మా స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు.. ఇంటికి పిలుచుకుని పోండి’ అని చెప్పాడన్నారు. తాము పాఠశాల వద్దకు వెళ్లకపోవడంతో తమ కుమారుడిని ఇంటికి పంపారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన తన కుమారుడు... తనను అవమానించారని, పదేపదే వేదన చెందాడన్నారు. ఇంట్లోనే ఉండి చదువుకోవాలని తాము సర్ది చెప్పామని తెలిపారు. గురువారం ఉదయం తాము పొలం పనులకు వెళ్లగా... కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలను తలచుకుని జీవితంపై విరక్తి చెందిన హరికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన స్కూల్ కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు హరికృష్ణ మృతికి కారణమైన రామన్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు. చదవండి: ప్రేమ ఎంత కఠినం -
పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో వివాహిత వెంటపడి ఆమె నిరాకరించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని కోటె ప్రాంతంలో నివాసం ఉంటున్న నవీన్ (27) వివాహితుడు. కార్పెంటర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. జీవితం సజావుగా సాగుతుండగా దుర్బద్ది పుట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వివాహితురాలిని ప్రేమించాలని వేధించేవాడు. ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి భర్త ఎదుటే తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ప్రేమను అంగీకరించపోతే చనిపోతా: ఇటీవల నవీన్ సదరు వివాహిత ఇంటికి వచ్చి తనను ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆమె ఎదుటే బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు, ఆమె పేరును కూడా చెక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నవీన్ తల్లి కాశీ యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నగర పోలీసులు అనుమానాస్పద మృతి కేసును నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఏఎస్ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా? -
ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ షాకింగ్ నిర్ణయం
ఆటోనగర్(విజయవాడ తూర్పు): అనారోగ్యం కారణంగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రసాదంపాడులో జరిగింది. పటమట పోలీసుల వివరాల మేరకు షేక్ రజియా(20) భర్త జిన్నా నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా తాడికొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి రజియా రామలింగేశ్వరనగర్ లోని మేనమామ ఇంటి వద్దనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ప్రసాదంపాడు లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మçహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తరచూ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. సంఘటన గురించి మృతురాలి కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. రజియా తండ్రి షేక్ సాదిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. -
వివాహేతర సంబంధం: ఉరేసుకుని టీడీపీ నేత ఆత్మహత్య
నల్గొండ: ఉరేసుకుని టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రాంచంద్రం(47)టీడీపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సెక్రటరీగా పనిచేస్తున్నాడడు. ఈయనకు భార్య రోహిణి, ఇద్దరు పిల్లలున్నారు. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన భార్య రోహిణి కొండమల్లేపల్లిలో ఉద్యోగం చేస్తూ నల్లగొండలో ఉంటోంది. భర్త రాంచంద్రం మాత్రం పోచంపల్లిలో ఉంటున్నాడు. భార్య అపుడప్పుడూ ఇక్కడికి వచ్చిపోతుంటుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన బంధువుల వివాహానికి భార్యాభర్తలిద్దరూ హాజరయ్యారు. అనంతరం రాంచంద్రం పోచంపల్లికి రాగా, భార్య మాత్రం నల్లగొండకు పోయింది. శుక్రవారం మధ్యాహ్నం రోహిణి, భర్త రాంచంద్రం మొబైల్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడంలేదు. దాంతో ఆందోళన చెందిన ఆమె ఇంటికి పక్కన ఉంటున్న జెట్ట పద్మకు ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఎత్తడంలేదు ఒకసారి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. దాంతో ఆమె అక్కడి వెళ్లి చూడగా రాంచంద్రం ఇంట్లో చీరతో ఉరివేసుకొని వేలాడుతూ కన్పించాడు. భయపడిన పద్మ వెంటనే ఇరుగుపొరుగువారికి విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు లోనికి వెళ్లి చూడగా రాంచంద్రం అప్పటికే మృతిచెందాడు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పట్టణ కేంద్రానికి చెందిన ఓ మహిళ తన భర్తతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని డబ్బుల కోసం వేధించేదని రోహిణి ఆరోపించింది. ఆమె వేధింపులు భరించలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బద్యానాయక్ తెలిపారు. -
ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం
గుడ్లూరు(కందుకూరు)నెల్లూరు జిల్లా: ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్థాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల శ్రీనివాసులు కుమార్తె నక్కల శ్రావణి (24) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సంజీవ్ అనే యువకుడితో వివాహమైంది. సంజీవ్ బీఫార్మసీ చేసి ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం శ్రావణి 7 నెలల గర్భిణి. దీంతో ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రావణి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఫోన్ చేసి చెన్నైలోని ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాల్సింగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం తాను గర్భిణిని, అని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రస్తుతం ఆఫీసుకు రాలేనని, మరికొంత కాలం వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని శ్రావణి విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించి కచ్చితంగా ఆఫీసుకు రావాలని సూచించారు. దీనికి శ్రావణి ఒప్పుకోకపోవడంతో 15 రోజుల క్రితం శ్రావణిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఉద్యోగం పోయిందని బాధపడుతూ ఉంది. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. గ్రామంతో పాటు బంధువులు, ఇతర ప్రదేశాల్లో వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే మంగళవారం గ్రామంలోని చెరువులో యువతి మృతదేహం ఉన్నట్లు గురించి శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణి మనస్థాపంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుడ్లూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి