సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్‌నగర్‌లో నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ నారాయణ స్కూల్‌లో హాస్టల్ ఘటన జరిగింది.
విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్‌తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.
కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment